Wednesday, 6 May 2026

Blog

ఖమ్మం

రక్త దాన శిబిరం ని విజయవంతం చేయండి :బీజేపీ జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు పిలుపు

పున్నమి ప్రతి నిధి ఖమ్మం సెప్టెంబర్ 17 ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా గిన్నిస్ బుక్ అఫ్ రికార్డ్ లక్ష్యం గా జరుగుతున్న రక్త దాన కార్యక్రమం లో భాగంగా ఈ నెల 17 బుధవారం నాడు ఖమ్మం నగరము లోని TNGO s ఫంక్షన్ హాల్ నందు బీజేపీ ఖమ్మం జిల్లా ఆధ్వర్యంలో రక్త దాన శిబిరం ఏర్పాటు చేస్తున్నాం అని ఈ శిబిరం లో ప్రతి ఒక్కరు పాల్గొని జయప్రదం చెయ్యాలని బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో ఖమ్మం జిల్లా బీజేపీ సేవా హి పక్వాడ్ కన్వీనర్ అల్లిక అంజయ్య, కొ కన్వీనర్ లు శ్రీమతి మంద సరస్వతి, దుద్దుకూరి కార్తిక్, నల్లమాస శ్రీనివాస్, యార్లగడ్డ రాఘవ తదితరులు పాల్గొన్నారు.

ఖమ్మం

స్థంబాద్రి లక్ష్మి నరసింహ స్వామి వారి కొలను ని శుభ్రం చేయడానికి నిధులు లేవా..?

పున్నమి ప్రతినిధి ముగ్గురు మంత్రుల ముద్దుల జిల్లాలొ ఏమిటీ ధరిద్రం… స్థంబాద్రి లక్ష్మీ నరసింహస్వామి దివ్య క్షేత్రం లొ కొనేరు శుభ్రం చేయటానికి నిధులు లేవా? ఖమ్మం పేరే స్తంభాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి పేరు.. “ఖభం” అంటే స్తంభం అని అర్థం.. స్తంభం నుండి ఉద్భవించిన శ్రీ నారసింహుని స్వయంభు క్షేత్రం స్తంభాద్రిపురం మన ఖమ్మం… మరి అంతటి ప్రాచీనమైన క్షేత్రం, అంతే ప్రాచీనమైన పవిత్రమైనది ఇక్కడి కొనేరు… ఇక్కడి కోనేరు కూడా సాక్షాత్తు స్వామివారి నిత్యాభిషేక కర్మలకు కావాల్సిన జలం కోసం నరసింహుడే ఏర్పాటు చేశాడని చెప్తారు, స్వామి వారి పాదంతో మొదటం ద్వారా కోనేరు ఏర్పడిందని ప్రతీతి… మరి ఆ పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత మన ప్రభుత్వాలపైన ఉన్నదా? లేదా? జిల్లా కేంద్రం నడిబొడ్డులో ఉన్న దేవాలయాల పరిస్థితి ఇలా ఉంటే మిగతా చోట ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.. కొట్ల రూపాయల ఆదాయం వస్తున్నప్పటికీ కనీసం కోనేరు ను శుభ్రం చేయలేని దుస్థితి లొ ఎండొన్మెంట్ వుండటం దురదృష్టకరం.. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే కోనేరుని శుభ్రం చేయవలసిందిగా భక్తులు కోరుతున్నరూ

E-పేపర్

పీర్ కుమార్ కు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అవార్డు

సెప్టెంబర్ 14 పున్నమి ప్రతినిధి@విశాఖపట్నం విశాఖపట్నం డాబా గార్డెన్స్ లోని అల్లూరి సీతారామరాజు విజ్ఞాణ కేంద్రం నందు ఆదివారం సాయంత్రం శ్రీ దాసరి నారాయణరావు కల్చరల్ అకాడమీ37వ మరియు విశాఖరత్న కళాపరిషత్27వ వార్షికోత్సవాల సందర్భంగా వివిధ రంగాలలో నిష్ణాతులైన ప్రముఖులకు 2025 సంవత్సరానికి గాను ప్రముఖుల పేరుమీద అవార్డులు అందజేశారు. ఇందులో భాగంగా డాక్టర్ బద్రి పీర్ కుమార్ ను డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఎక్సలెన్స్ అవార్డుతో సత్కరించారు. అధ్యాపకుడిగా, రచయితగా, నటుడిగా, దర్శకుడిగా, చూపిస్తున్న ప్రతిభను గుర్తించిన మా కమిటీ ఈ అవార్డుకి పీర్ కుమార్ ని ఎంపిక చేసిందని కళా పరిషత్ నిర్వహకులు కళా భూషణ్ డాక్టర్ పి.ఎ. భాస్కర రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో పైడా విద్యాసంస్థల అధినేత పైడా కృష్ణప్రసాద్, విశాఖపట్నం సినీ దర్శకులు, ఎన్.టి.ఆర్. అవార్డు గ్రహీత దుగ్గివలస దివాకర్, ఆంధ్రా యూనివర్సిటి రిటైర్డ్ ప్రొఫెసర్ డా|| కెంబూరి చంద్రమౌళి, హైదరాబాద్ న్యాయవాధి డా॥ కట్టా లక్ష్మి, నాటక రచయిత, సినీ నటుడు, న్యాయనిర్ణేత పి.టి. మాదవ్, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పూర్వ వైస్ చాన్స్ లర్, ఆచార్య వి. బాలమోహన్ దాస్, SFX సినీస్టూడియో అధినేత, ఎన్.టి.ఆర్. అవార్డు గ్రహీత, పి. శ్యామ్ కుమార్, కళాసేవకులు, ఆంధ్ర తెలంగాణ ఎస్.ఆర్. ఛానల్ అధినేత సింగంశెట్టి సత్యనారాయణ తదితరులు పాల్గొని డాక్టర్ బద్రి పీర్ కుమార్ ని అభినందించారు.

తిరుపతి

మహిళ సాధికారత జాతీయ సదస్సులో బొజ్జల దంపతులు

తిరుపతి జిల్లా చంద్రగిరి రాయలవారికోటలో ఏర్పాటు చేసిన మహిళ సాధికారత జాతీయ సదస్సు కార్యక్రమంలో శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి దంపతులు పాల్గొనడం జరిగింది.మహిళ సాధికారత జాతీయ సదస్సుకు విచ్చేసిన ప్రముఖులను,ఆంధ్రప్రదేశ్ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ని ఆత్మీయం గా పలకరించడం జరిగింది.వారు బొజ్జల సుధీర్ రెడ్డి తండ్రి బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి తో కలిసి పని చేసిన అనుభవాలను ఈ సందర్భముగా గుర్తుచేసుకున్నారు.అనంతరం సదస్సు లో ఏర్పాటు చేసిన విందు మరియు లైటింగ్ షోలో సహచర ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే బొజ్జల దంపతులు పాల్గొన్నారు.

తిరుపతి

రాష్ట్ర పదాధికారుల సమావేశంలో పాల్గొన్న కోలా ఆనంద్

విశాఖపట్నంలో జరిగిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పదాధికారుల సమావేశంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పీవీన్ మాధవ్ మరియు బిజెపి రాష్ట్ర పదాధికారులతో కలిసి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ పాల్గొనడం జరిగినది.ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా బిజెపి జాతీయ అధ్యక్షులు మరియు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రివర్యులు శ్రీ జగత్ ప్రకాష్ నడ్డా పాల్గొన్నారు.పార్టీ బలోపేతానికి రాష్ట్ర నూతన అధ్యక్షులు పీవిన్ మాధవ్ చేపట్టిన సారథ్యం కార్యక్రమం విజయవంతగా ముగిసిన తర్వాత రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయటానికి చేపట్టవలసిన కార్యక్రమాలపై, కార్యచరణ దిశా నిర్దేశం చేయడం జరిగనది

తిరుపతి

ప్రయాణికురాలి బ్యాగ్ నుండి నగదు అపహరణ

ఆదివారం ఉదయం 9 గంటలకు శ్రీకాళహస్తి ఆర్టీసీ బస్టాండ్ నందు ఒక మహిళ బ్యాగు నుండి 3,85,000 రూపాయల నగదు గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనం చేయడం జరిగింది.సదరు మహిళ ఫిర్యాదు పై శ్రీకాళహస్తి టూ టౌన్స్ ఎస్సై పార్థసారథి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడం జరిగింది.అనంతరం ఆర్టీసీ బస్టాండ్ నందు గల సీసీ కెమెరాలు పరిశీలించగా ఒక మహిళ ఒక బాలుడి సహాయంతో దొంగతనం చేసినట్లు గుర్తించడం జరిగింది. సదరు మహిళ మరియు బాలుని గుర్తించిన ఎడల శ్రీకాళహస్తి టూ టౌన్ సిఐ నాగార్జున రెడ్డి కి (944090008) తెలియజేయవలసిందిగా కోరడమైనది.కాబట్టి బస్సుల్లో ప్రయాణించేటటువంటి ప్రయాణికులు తమ బ్యాగుల్లో నగలు మరియు నగదు జాగ్రత్తగా ఉంచుకోవాల్సిందిగా పోలీసు వారు విజ్ఞప్తి చేశారు.

తిరుపతి

దేవి శరన్నవరాత్రి మహోత్సములు-2025 పోస్టర్ ఆవిష్కరణ

శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానమునకు అనుబంధ ఆలయమైన శ్రీ కనకాచలము పై వెలసియున్న శ్రీ కనకదుర్గా అమ్మవారి దేవికి 22-09-2025 సోమవారం నుండి 01-10-2025 బుధవారం వరకు తొమ్మిది రోజులపాటు దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నారు.అందుకు సంబంధించిన,దేవి శరన్నవరాత్రి మహోత్సములు-2025 పోస్టర్ ను శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ఈఓ తో కలిసి ఆవిష్కరించిన శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి

తిరుపతి

రేపు గ్రీవెన్స్‌డే రద్దు: శ్రీకాళహస్తి తాసిల్దార్ జనార్ధన్ రాజు

శ్రీకాళహస్తి: తిరుపతిలో జాతీయ మహిళా సాధికారత సదస్సు జరుగుతన్న నేపథ్యంలో అధికారులు అందరూ సదస్సు నిర్వహణలో ఉన్నందున సోమవారం తహసీల్దారు కార్యాలయంలో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికను రద్దు చేస్తున్నట్లు తహసీల్దారు జనార్తన్‌రాజు తెలిపారు.ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు.ప్రజలు ఎవరూ మండల కేంద్రానికి రావద్దని తెలిపారు.

క్రైమ్

నగరంలో జింక మాంసం కలకలం

నగరంలో జింక మాంసం కలకలం ముఠా గుట్టురట్టు చేసిన పోలీసులు. సెప్టెంబర్ 14 పున్నమి ప్రతినిధి@హైదరాబాద్: నగరంలో జింక మాంసం కలకలం రేపింది. టోలిచౌకిలో జింక మాంసం అక్రమ రవాణాను అధికారులు బట్టబయలు చేశారు. పక్కా సమాచారం మేరకు మావిన్ క్లాసిక్ అపార్ట్‌మెంట్ వద్ద అధికారులు అర్ధరాత్రి సోదాలు నిర్వహించారు. సోదాల్లో 10 కిలోల జింక మాంసం, 3 జింక కొమ్ములు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వాటితో పాటు బొలెరో వాహనం(AP09BT4716) సీజ్‌ చేసినట్లు పేర్కొన్నారు. జింక మాంసం రవాణా చేస్తున్న మహమ్మద్ సలీం, మహమ్మద్ ఇక్బాల్ అనే ఇద్దరి నిందితులను అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న మాంసం, బొలెరో వాహనాన్ని అటవీ శాఖ అధికారులకి అప్పగించినట్లు పేర్కొన్నారు. నిందితులపై వన్యప్రాణి రక్షణ చట్టం 1972 ప్రకారం కేసు నమోదు చేసినట్లు వివరించారు. నిందితులకు జరిమానాతోపాటు జైలు శిక్ష కూడా తప్పదని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ వన్యప్రాణి రక్షణకు సహకరించాలని సౌత్‌వెస్ట్ జోన్ డీసీపీ చంద్రమోహన్ విజ్ఞప్తి చేశారు.

రంగారెడ్డి

అబ్దుల్లాపూర్ మెంట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆర్థిక సమస్యలతో ఉరి వేసుకొని వ్యక్తి మృతి

పున్నమి: అబ్దుల్లాపూర్ మెంట్ మండలం రంగారెడ్డి జిల్లా: ఓ వ్యక్తి ఆర్థిక సమస్యలతో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఒరిస్సా రాష్ట్రం, బాలేశ్వర్ జిల్లా, భీంపూర్ గ్రామానికి చెందిన సుబ్రత్ జైన్ (46) రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్ మెట్ మండలం, కవాడిపల్లి గ్రామంలో ఆయన భార్య ఇద్దరు కుమారులతో కలిసి ఒక గదిలో నివాసం ఉంటున్నారు. కాగా వారు అదే గ్రామంలోని జిఎస్పి ఇండస్ట్రీస్ లో పని చేస్తున్నారు. అతని పెద్ద కుమారుడు సుకమోల్ జైన్ (20) ఆదివారం ఉదయం బయటకు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్ళాడు. ఉదయం 9.30 గంటల సమయంలో అదే కంపెనీలో పనిచేస్తున్న బిస్తు, సుకమోల్ సహోద్యోగి సుబ్రత్ జైన్ ఇంటికి వచ్చి సుకమోల్ లుంగీతో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడాడని చెప్పాడు. దీంతో అతని తండ్రి వెంటనే హుటాహుటిన అక్కడికి చేరుకొని చూడగా, తన కుమారుడు ఆర్థిక సమస్యల కారణంగా ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించాడు. సుకమోల్ మరణం పై తమకు ఎలాంటి అనుమానం లేదని పేర్కొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.