Wednesday, 6 May 2026

Blog

సినిమా

కలెక్షన్ లలో దూసుకుపోతున్న మీరాయ్.

పున్నమి ప్రతి నిధి హైదరాబాద్ తేజా సజ్జా హీరో గా, రితికా నాయక్ హీరో ఇన్ గా మంచు మనోజ్ ప్రధాన పాత్రలో కార్తిక్ గట్టమనేని తెరకేక్కించిన మీరాయ్ సినిమా పాజిటివ్ టాక్ తో కలెక్షన్ లలో దూసుకుపోతున్నట్లు మీరయ్ మూవీ మేకర్స్ తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా 55.60 కోట్లు గ్రాస్ రాబట్టి నట్లు వారు తెలిపారు. వీకెండ్ రావడం వల్ల ఇంకా కలెక్షన్ లు పెరుగుతాయి అని వారు తెలిపారు

తెలంగాణ

ముఖ్య మంత్రి సహాయ నిధి కీ 50 లక్ష లు విరాళం ఇచ్చిన బాలకృష్ణ

పున్నమి ప్రతినిధి తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి సహాయ నిదికి ఆంధ్రప్రదేశ్ హిందూ పురం శాసన సభ్యులు సిని నటుడు నందమూరి బాలకృష్ణ 50 లక్షలు ప్రకటించారు. ఈ నేపథ్యంలో అయన తరుపున అయన చిన్న కూతురు శ్రీమతి తేజస్విని ఆ చెక్ ని తెలంగాణ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ని కలిసి అందజేశారు.

ఆంధ్రప్రదేశ్

వాటర్ క్యాన్ ఎంతకాలం వాడుతున్నారు

సెప్టెంబర్ 14 పున్నమి ప్రతినిధి @ వాటర్ క్యాన్‌లను కొందరు నెలలకొద్దీ, మరికొందరు ఏళ్ల పాటు వాడుతుంటారు. ఇది ప్రమాదకరమని, 3 నెలలే వినియోగించాలని వైద్యులు చెబుతున్నారు. అంతకంటే ఎక్కువ రోజులు వాడితే క్యాన్లలో ఆల్కలైన్ ఏర్పడి ఆరోగ్య సమస్యలు వస్తాయంటున్నారు. అలాగే, TDS 50-150ppm మధ్య ఉండే నీటినే తీసుకోవాలని, ఎక్కువున్న నీటిని తాగితే కీళ్ల నొప్పులు, ఎసిడిటీ, కడుపునొప్పి వంటి సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు.

ఖమ్మం

ఖమ్మం జిల్లా లో దడ పుట్టిస్తున్న డెంగీ.. ఇదే ఆడునుగా ప్రజలని దోచుకుంటున్న ప్రవేటు ఆసుపత్రి నిర్వాహకులు

పువ్వాడ నాగేంద్ర కుమార్ (పున్నమి ఖమ్మం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ) ఖమ్మం జిల్లా లో డెంగీ జ్వరాలు దడ పుట్టిస్తున్నాయి. ఇప్పటికే ఖమ్మం జిల్లాలో 171 డెంగీ కేసులు నమోదవ్వగా 111 డెంగీ ప్రభావిత గ్రామాలను గుర్తించారు. గ్రామాల్లో పారిశుధ్య పనులను చేపట్టండి అని చాలా సమావేశాల్లో జిల్లా కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి ఆదేశాలు ఇస్తునప్పటికి అవి క్షేత్ర స్థాయి లో ఏ మాత్రం ఆచరణ కావడం లేదు. ఇదే అదునుగా బావించిన ఖమ్మం లోని ప్రైవేటు ఆసుపత్రి నిర్వహుకులు ప్రజలని దోచుకుంటున్నారు. ఇప్పటి కీ అయినా ఆరోగ్య అధికారులు స్పందించాలని ప్రజలు కోరుతున్నారు

ఖమ్మం

డిగ్రీ మొదటి ఏడాది ప్రవేశలకి స్పాట్ అడ్మిషన్ లు

ఖమ్మం పున్నమి ప్రతి నిధి ఖమ్మం ఖమ్మం నగరము లో SRBGNR కళాశాల నందు డిగ్రీ మొదటి సంవత్సరము లో ప్రవేశాలకి సోమవారం,మంగళవారం స్పాట్ అడ్మిషన్స్ ఇవ్వనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ మహమ్మద్ జాకీరుల్లా తెలియజేసారు. విద్యార్థుల తమ ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాల తో నేరుగా కళాశాల నందు సంప్రదించాలని సూచించారు. అడ్మిషన్ ల వివరాలు 17వ తేదీ దోస్త్ పోర్టల్ నందు నమోదు చేస్తామని పేర్కొన్నారు. ఈ చివరి అవకాశం ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి ప్రిన్సిపాల్ మహమ్మద్ జాకీరూల్లా కోరారు

నిర్మల్

గోపాలరావు పటేల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆర్గానిక్ పంటల అభివృద్ధి

గోపాలరావు పటేల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల bhainsa లో ఆర్గానిక్ పంటలు రెండు ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్నారు పండించిన పంటలను మధ్యాహ్నం భోజనంలో ఉపయోగించడం జరుగుతుంది ఎలాంటి మందులు వాడకుండా విద్యార్థులు మరియు అధ్యాపకులు కలిసి పంటలు పండించడం జరుగుతుంది పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది . కూరగాయలను మధ్యాహ్న భోజనంలో ఉపయోగించడం జరుగుతుంది దీని ద్వారా విద్యార్థులకు మధ్యాహ్న భోజన సదుపాయంతోపాటు వ్యవసాయం పట్ల చైతన్యం తేవడం మరియు వ్యవసాయం వల్ల ఉపయోగాలు మెలుకులను స్వయంగా విద్యార్థులకు ఉపాధ్యాయులు దగ్గర ఉండి నేర్పడం రెండు ఎకరాల్లోకూరగాయలు వంకాయలు దోసకాయాలు బీరకాయలు కొత్తిమీరు. ఆకుకూరలు. ముల్లంగి..పాలకూర. ఉన్నాయాని కళాశాల ప్రిన్సిపల్ కర్రోళ్ల బుచ్చయ్య. మధ్యాహ్న భోజన కో ఆర్డినేటర్ డాక్టర్ కోసారి సంతోష్ కుమార్.. తెలియజేసినారు…..

నిర్మల్

గోపాలరావు పటేల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆర్గానిక్ పంటల అభివృద్ధి

గోపాలరావు పటేల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల bhainsa లో ఆర్గానిక్ పంటలు రెండు ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్నారు పండించిన పంటలను మధ్యాహ్నం భోజనంలో ఉపయోగించడం జరుగుతుంది ఎలాంటి మందులు వాడకుండా విద్యార్థులు మరియు అధ్యాపకులు కలిసి పంటలు పండించడం జరుగుతుంది పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది . కూరగాయలను మధ్యాహ్న భోజనంలో ఉపయోగించడం జరుగుతుంది దీని ద్వారా విద్యార్థులకు మధ్యాహ్న భోజన సదుపాయంతోపాటు వ్యవసాయం పట్ల చైతన్యం తేవడం మరియు వ్యవసాయం వల్ల ఉపయోగాలు మెలుకులను స్వయంగా విద్యార్థులకు ఉపాధ్యాయులు దగ్గర ఉండి నేర్పడం రెండు ఎకరాల్లోకూరగాయలు వంకాయలు దోసకాయాలు బీరకాయలు కొత్తిమీరు. ఆకుకూరలు. ముల్లంగి..పాలకూర. ఉన్నాయాని కళాశాల ప్రిన్సిపల్ కర్రోళ్ల బుచ్చయ్య. మధ్యాహ్న భోజన కో ఆర్డినేటర్ డాక్టర్ కోసారి సంతోష్ కుమార్.. తెలియజేసినారు…..

ఆంధ్రప్రదేశ్

ఏపీలో ఆన్లైన్ ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్లు

సెప్టెంబర్ 14 పున్నమి ప్రతినిధి@అమరావతి ఏపీ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఆన్లైన్లో నామినేషన్లు దాఖలు చేసేందుకు అవకాశం కల్పిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ సిద్ధమైందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని తెలిపారు. ఆన్లైన్లో నామినేషన్ దాఖలు చేసిన తర్వాత, దానికి సంబంధించిన ప్రింట్ అవుట్లను తీసి, సంతకాలు చేసి, నిర్దేశించిన గడువులోగా ఎన్నికల అధికారులకు సమర్పించాలని ఆమె చెప్పారు. అయితే ఈ ఆన్లైన్ విధానం అధికార పార్టీకి ఎక్కువగా బెనిఫిట్ ఉంటుందని చర్చ జరుగుతోంది

తిరుపతి

జగత్ ప్రకాష్ నడ్డా కి స్వాగతం పలికిన కోలా ఆనంద్

విశాఖపట్నంలో 14 న జరగనున్న సారథ్యం’ బహిరంగ సభ కోసం రాష్ట్రానికి విచ్చేసిన బిజెపి జాతీయ అధ్యక్షులు,కేంద్ర ఆరోగ్య,కుటుంబ సంక్షేమ, ఎరువులు,రసాయనాల శాఖల మంత్రివర్యులు జగత్ ప్రకాష్ నడ్డా కి విశాఖపట్నంలోని నోవోటల్ హోటల్ నందు రాష్ట్ర మంత్రివర్యులు సత్య కుమార్, రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పి.వి.ఎన్ మాధవ్,తిరుపతి జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్ పార్టీ నాయకులు,కార్యకర్తలతో కలసి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ స్వాగతం పలకడం జరిగినది.

హైదరాబాద్

1GB ప్లాన్ ఎత్తివేత మీద వివరణ కోరిన TRAI

పున్నమి ప్రతినిధి సరస మైన 1 జీబీ ఎంట్రీ లేవల్ ప్రీపెయిడ్ ప్లాన్ ని ఉప సంహారణ కీ గల కారణాలు తెలపాలి అని TRAI jio మరియు airtel ని కోరింది. 249 ప్లాన్ ఎత్తివేయడం వల్ల వినియోగదారూడి మీద మరింత భారం పడనుందని TRAI ఆందోళన వ్యక్తం చేసింది. 249 ప్లాన్ ఆఫ్ లైన్ లో ఉంది అని jio తెలపగ వినియోగ దారుల ప్రార్దన్యత ఆధారంగా 249 ప్లాన్ తీసి వేసినట్లు airtel పేర్కొన్నది. Airtel నెట్వర్క్ ప్రస్తుతం ఎంట్రీ లెవల్ ప్లాన్ 299 నుండి ప్రారంభం కానుంది.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.