Wednesday, 6 May 2026

Blog

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఈ నెలలోనే నరసాపురానికి తొలి వందే భారత్*: కేంద్రమంత్రి భూపతిరాజు వర్మ ప్రకటన

* *​దీర్ఘకాలిక పెండింగ్ జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులు పూర్తి చేయడమే నా ధ్యేయం* *NH 165 దిగమర్రు- ఆకివీడు వయా భీమవరం బైపాస్ 3200 కోట్లతో డిపిఆర్ సిద్ధం* ​ నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గానికి తొలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు సేవలు ఈ నెలలోనే అందుబాటులోకి రానున్నాయని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు వర్మ ప్రకటించారు. భీమవరంలోని జిల్లా బీజేపీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నరసాపురం పార్లమెంట్ పరిధిలో చాలా ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న జాతీయ రహదారుల నిర్మాణం, రైల్వే ప్రాజెక్టులు పూర్తి చేయడం, కొత్త రైళ్లను తీసుకురావడానికి తాను అధిక ప్రాధాన్యత ఇస్తున్నానని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల ప్రకారం ఈ ప్రాజెక్టుల కోసం నిధులు మంజూరు చేయించడంలో కీలక ప్రగతి సాధించానని ఆయన అన్నారు. ​ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే ఉన్న మూడు వందే భారత్ రైళ్లకు అదనంగా, నర్సాపురం-చెన్నై వందే భారత్ రైలు త్వరలో ప్రారంభం కానుందని శ్రీనివాస వర్మ తెలిపారు. గత పది నెలలుగా నిరంతర సమీక్షల తర్వాత రైల్వే శాఖ ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపిందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం చెన్నై-విజయవాడ మధ్య నడుస్తున్న వందే భారత్ రైలును నర్సాపురం వరకు పొడిగించనున్నట్లు ఆయన చెప్పారు. ఈ రైలు విజయవాడ, భీమవరం, గుడివాడ, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట స్టేషన్లలో మాత్రమే ఆగి, ప్రయాణ సమయాన్ని తగ్గిస్తుందన్నారు. రైల్వే మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపినందున, త్వరలో దక్షిణ మధ్య రైల్వే అధికారులు రైలు ప్రారంభ తేదీని ప్రకటిస్తారని తెలిపారు. ​ఈ రైలు సాధించటం పశ్చిమ గోదావరి ప్రజలకు గర్వకారణమని, దేశంలోనే అత్యంత వేగవంతమైన రైలులో ప్రయాణించే అవకాశం జిల్లా వాసులు లభించిందని అన్నారు. నర్సాపురం వందే భారత్ ఆక్వా వాణిజ్యానికి మరింత ఊతమిస్తుందని, ఆక్వా రైతులు, వ్యాపారులు తమ వ్యాపార కార్యకలాపాల కోసం నెల్లూరు, చెన్నైకి తక్కువ సమయంలో చేరుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. ​వందే భారత్ రైలు సాధించడం కోసం తాను పలుమార్లు రైల్వే శాఖ మంత్రిని, ఉన్నతాధికారులను కలిసి సాంకేతిక సమస్యల పరిష్కారానికి కృషి చేశానని వర్మ చెప్పారు. ఇప్పటికే అరుణాచలంకు కొత్త స్పెషల్ ట్రైన్, అత్తిలిలో రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లకు హాల్ట్‌లు సాధించామన్నారు. మూడు నెలల పాటు ప్రయోగాత్మకంగా నడిచిన అరుణాచలం రైలు సర్వీస్‌కు మంచి స్పందన లభించడంతో, ఈ రైలును రెగ్యులర్ చేయడానికి అధికారులు సానుకూలంగా స్పందించారని ఆయన తెలిపారు. విశాఖపట్నం- హైదరాబాద్ వందే భారత్ కు తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ లో హాల్ట్ కల్పించేందుకు తాను చేసిన విజ్ఞప్తికి అధికారులు అంగీకారం తెలిపారని అన్నారు. త్వరలోనే ఆ ప్రకటన కూడా వస్తుందన్నారు సికింద్రాబాద్-మైసూర్-సికింద్రాబాద్ మధ్య నడుస్తున్న ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైలు ఇకపై నర్సాపురం-మైసూర్-నర్సాపురం ప్రత్యేక రైలుగా నడుపుతారని, ఈ రైలు సికింద్రాబాద్ మీదుగా వెళ్తుందని తెలిపారు. ఇది హైదరాబాద్‌కు ప్రయాణించే పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. *​రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ* ​అమృత్ భారత్ పథకం కింద నరసాపురం పార్లమెంట్ పరిధిలోని నరసాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ పనులు వందల కోట్ల రూపాయలతో జరుగుతున్నాయని శ్రీనివాస వర్మ తెలిపారు. ఇటీవల తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ ఆధునికరణకు అదనంగా రూ. 18 కోట్లు, గూడ్స్ గోడౌన్ రోడ్డు మార్గానికి రూ. 8 కోట్లు మంజూరు చేయించడం జరిగిందని శ్రీనివాస వర్మ చెప్పారు. గత 15 సంవత్సరాలుగా కోర్టు కేసులు, రైతులు సహకరించకపోవడం వల్ల పెండింగ్లో ఉన్న దిగమర్రు- ఆకివీడు జాతీయ రహదారి 165 రెండో ప్యాకేజీ పనులు ప్రారంభించేలా కేంద్రమంత్రి అయిన వెంటనే చర్యలు తీసుకున్నానని, గతంలో 800 కోట్లతో రెండు లైన్లుగా ఉన్న ఈ ప్రాజెక్టు ఎలైన్మెంట్ మార్చి జాతీయ రహదారుల అధికారులతో సర్వే చేయించి కొత్త ఎలైన్మెంట్ తో 2400 కోట్ల రూపాయలు అంచనా తో నాలుగు లైన్ల నిర్మాణానికి కేంద్ర మంత్రి అనుమతి సాధించామని అయితే ఎస్ ఎస్ ఆర్ రేట్లు రాష్ట్ర ప్రభుత్వం పెంచడం వల్ల అంచనాలు 3200 కోట్ల రూపాయలు అయిందన్నారు. అయినప్పటికీ కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ 3200 కోట్ల రూపాయలతో ఎన్.హెచ్ 165 నిర్మాణానికి అంగీకారం తెలిపారని, నూతన డిపిఆర్ కు కేంద్ర క్యాబినెట్ అనుమతి సాధించి పనులు ప్రారంభించబోతున్నామన్నారు. భీమవరం అంబేద్కర్ సెంటర్ వద్ద నుండి 2.8 కిలోమీటర్లు విశాలమైన బైపాస్ ప్రధాన రోడ్డు నిర్మాణం కూడా ఇందులో భాగంగా నిర్మిస్తున్నామని అన్నారు. లోసరి- పిప్పర రహదారి నిర్మాణానికి సి ఆర్ ఐ ఎఫ్ నిధుల ద్వారా 100 కోట్ల రూపాయలు మంజూరు చేయించామని కోర్టు కేసుల వల్ల ఆలస్యమైందని రెండు నెలల్లోనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తారని తెలిపారు.

నాగర్‌కర్నూల్

తెలంగాణ సాయుధ పోరాటాన్ని కమ్యూనిస్టుల నుండి దొంగలించే ప్రయత్నం చేస్తున్న బిజెపి :సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్ఎండి ఫయాజ్

*పున్నమి ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా సెప్టెంబర్ 13 ప్రపంచ పోరాట చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడ్డ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట త్యాగాలను వీర చరిత్రను కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నుండి ఏ చరిత్ర లేని బిజెపి మా చరిత్రను దొంగలించే ప్రయత్నం చేస్తుందని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ఎండి ఫయాజ్ తీవ్ర విమర్శ చేశారు నేడిక్కడ బిజినపల్లి మండల కేంద్రంలో సిపిఐ జిల్లా సమితి పిలుపులో భాగంగా తెలంగాణ సాయుధ పోరాటం వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు ముందు పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం అంబేద్కర్ చౌరస్తాలో తెలంగాణ సాయిధ పోరాట వీరులు రావి నారాయణరెడ్డి మగ్గం మోయుద్దిన్ బద్దం ఎల్లారెడ్డి నివాళులర్పించిన అనంతరం నిర్వహించిన బహిరంగ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశానికి 1947 ఆగస్టు 15వ స్వాతంత్రం వస్తే తెలంగాణ ప్రాంతం మాత్రం నిజాం నిరంకుశ దేశ్ముఖులు జాకీర్దారుల రజాకారుల కబంధ హస్తాలలో నలుగుతుండదని ఆ ఎట్టి చాకిరికి వ్యతిరేకంగా ఎర్రజెండా గడ్డి పూసల లాంటి మట్టి మనుషులను ఏకం చేసి మహావీరులుగా తీర్చిదిద్దిన గొప్ప ఉద్యమం నిర్మించింది సిపిఐ అన్నారు 1947 సెప్టెంబర్ 11వ తేదీన రావి నారాయణరెడ్డి బద్దం ఎల్లారెడ్డి మద్దుమ్ దీన్లో తెలంగాణ సాయుధ పోరాటానికి పిలుపునిస్తే 1948 సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రాంతాన్ని స్వతంత్ర భారతదేశంలో విలీనం చేయడం జరిగింది దాదాపుగా మూడు వేలకు పైగా గ్రామాలు భూస్వాములు రజాకారుల నుంచి విముక్తి చేసిన ఎర్రజెండా దున్నేవాడికే భూమి అన్న మహత్తర నినాదం ఇచ్చి పది లక్షల ఎకరాల భూమి భూమిలేని నిరుపేదలకు పంచింది ఈ పోరాట క్రమంలో దొడ్డి కొమరయ్య నుండి మొదలుకొని నాలుగు వేల ఐదువందల మంది కమ్యూనిస్టు యోధులు తమ ప్రాణాలను బలిచ్చి మరి తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించారని వారు గుర్తు చేశారు ఒక చాకలి ఐలమ్మ ఆరుట్ల కమలాదేవి ఆరుట్ల రామచంద్రారెడ్డి నల్లమల్ల గిరి ప్రసాద్ ధర్మ బిక్షం గారు సురవరం వెంకట్రాంరెడ్డి లక్ష్మణాచారి కటికనేని గోపాలరావు సిఆర్ శర్మ ఇలా అనేకమంది ఈ ప్రాంతానికి చెందిన రాష్ట్రానికి చెందిన వీరులు తమ విలువైన జీవితాన్ని చెరసాలలో కలపడం ప్రాణాలను ప్రజల కోసం అర్పించడం జరిగింది ఈ పోరాట చరిత్రతో ఏ సంబంధం లేని సాయితో పోరాటంలో ఒక నెత్తుటి చుక్క కాదు కదా ఒక చెమట చుక్క కూడా రాల్చని నేడు అధికారంలో ఉన్న బిజెపి దాని అనుబంధ సంఘాలు కమ్యూనిస్టులు చేసిన త్యాగాలను దొంగలించి ఈ వీర యోధుల త్యాగాలను హైజాక్ చేసే కుట్రలకు పాల్పడుతుందని ఆయన దోయబట్టారు తెలంగాణలోని ఏ పల్లెలో వెళ్లిన అలనాటి అమరవీరుల స్తూపాలో జ్ఞాపకాలు కనబడతాయని ఎక్కడైనా ఒక్కడైనా కాషాయం జండా పట్టుకొని తెలంగాణ విముక్తి కోసం పోరాడిన వ్యక్తి చూపించిన వాళ్ళ మాటను నమ్మే వారమన్నారు ఏ చరిత్ర లేని బిజెపి ఇతరుల చరిత్రను దొంగలించడం పనిగా పెట్టుకుందని ఆయన విమర్శించారు తెలంగాణ సాయుధ పోరాటానికి అసలు సిసలు వారసులం కమ్యూనిస్టులే ఎర్రజెండా బిడ్డలేనని సిపిఐ తెలంగాణ ప్రజలను భారతీయులుగా తీర్చిదిద్దిన మహోద్యమం నిర్మించిన గొప్ప చరిత్ర కలిగిన రాజకీయ పార్టీ అని ఫయాజ్ గుర్తు చేశారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సెప్టెంబర్ 17న అధికారికంగా నిర్వహించాలని ఆనాటి ప్రభుత్వం పై ఒత్తిడి చేసింది కానీ నేడు వారే అధికారంలో ఉన్న ఎందుకో సెప్టెంబర్ 17న అధికారికంగా నిర్వహించడానికి ప్రభుత్వం ముందుకు రావట్లేదు ఇప్పటికైనా రేవంత్ రెడ్డి సర్కారు సెప్టెంబర్ 17న అధికారికంగా తెలంగాణ విలీన దినోత్సవం గా నిర్వహించాలని సిపిఐ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది. ఈనెల 17న హైదరాబాదులో వారోత్సవాల ముగింపు సభ నిర్వహిస్తున్నట్టు ఆయన వివరించారు ఈ కార్యక్రమానికి సిపిఐ మండల సహాయ కార్యదర్శి ఈర్ల భూపేష్ అధ్యక్షత వహించగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఈర్ల చంద్రమౌళి గారు మండల కార్యదర్శి పి కృష్ణ జి గారు మండల సహాయ కార్యదర్శి ఎ మధు గౌడ్ విద్యార్థి సంఘ నాయకులు మంగంపేట శ్రీనివాస్ జిల్లా సమితి సభ్యులు టి కిరణ్ కుమార్ గారు చందు గారు మధుగారు గారు కృష్ణ గారు పి రవి గారు నారాయణ గారు మమ్మాయిపల్లి నారాయణ గారు సాయిలు గారు పోచమ్మ గారు తదితరులు పాల్గొన్నారు

నాగర్‌కర్నూల్

లట్టుపల్లి గ్రామంలో ఎస్బిఐ బ్యాంక్ అధికారుల ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు

పున్నమి ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా సెప్టెంబర్ 13 బిజినేపల్లి మండలం లట్టుపల్లి గ్రామంలో బిజినపల్లి ఎస్బిఐ శాఖ వారు ఈరోజు ఉదయం గ్రామపంచాయతీ దగ్గర కేవైసీ డ్యూ ఉన్న ప్రతి ఖాతాదారుడు రీ కేవైసీ చేసుకోవలసిందిగా బ్యాంకు మేనేజర్ ఎం నవీన్ కుమార్ సూచించారు. అలాగే ఫీల్డ్ ఆఫీసర్ ఫరూక్ భాష మాట్లాడుతూ క్రాప్ లోను తీసుకున్న రైతులు సకాలంలో రెన్యువల్ చేసుకున్నట్లు అయితే గవర్నమెంట్ తరఫున మూడు శాతం సబ్ స్టేషన్ వస్తుంది. అలాగే మహిళా సంఘాలు గ్రూపు లోన్స్ సభ్యులతో వారికి అవగాహన కల్పించడం జరిగింది. అదేవిధంగా అసిస్టెంట్ మేనేజర్ రవికుమార్ రాజు సులోమన్ గార్ల అకౌంట్ ఓపెనింగ్ ఆన్లైన్ బుకింగ్ వంటి అంశాలపై ప్రజలకు వివరించారు. అలాగే ఇన్సూరెన్స్ మేనేజర్ సతీష్ కుమార్ మాట్లాడుతూ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ వివిధ రకాల గవర్నమెంట్ స్కీముల గురించి వివరించారు. ఇట్టి కార్యక్రమంలో మినీ బ్యాంక్ సుభాష్ బ్యాంకు సిబ్బంది విష్ణువర్ధన్ ఆంజనేయులు రాము ప్రసాద్ జమీల్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

తెలంగాణ

మహిళా శక్తి పెట్రోల్ పంపు పనులకు శంకుస్థాపన చేసిన :జిల్లా మంత్రి

నకిరేకల్ :సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి ) నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎస్ ఎల్ బి సి కాలనీ సమీపంలో ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా జిల్లా మహిళా సమాఖ్య, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ సంయుక్త ఆధ్వర్యంలో సుమారు 5 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేయనున్న మహిళా శక్తి పెట్రోల్ పంపు పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. పురుషులతో పాటు మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర రోడ్డు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.

ఎలూరు

నూగుండపల్లి వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న కుంపిణీ వాగు

దంచి కొట్టిన వాన ఆగిరిపల్లి: పున్నమి ప్రతినిధి మండలంలో శనివారం వర్షం దంచి కొట్టింది. ఉదయం నుండి 3 గంటల పాటు ఏకధాటిగా వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఆగిరిపల్లి లో 40.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. ఎగువున కురిసిన వర్షాలతో కుంపిని వాగు ఉదృతంగా ప్రవహిస్తూ ఉండడంతో ఆగిరిపల్లి, నూగుండపల్లి, తోటపల్లి, చిన్నగిరిపల్లి గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వాగు ఉధృతి,ని ఎస్ ఐ శుభ శేఖర్ పరిశీలించి వంతెనపై పోలీస్ గస్తీని ఏర్పాటు చేశారు.

తిరుపతి

ఎమ్మెల్యే ను శ్రీకాళహస్తి ఆర్టీసీ డిపో మేనేజర్ రేవతి

శ్రీకాళహస్తి ఆర్టీసీ డిపో మేనేజర్ రేవతి శనివారం ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిశారు. మదనపల్లి డిపోలో మేనేజర్ గా ఉన్న రేవతి శ్రీకాళహస్తి డిపో కి బదిలీపై వచ్చారు.

తిరుపతి

తొండమాన్ పురం లో శ్రీనివాసుని కళ్యాణం

తొండమాన్ పురం శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం స్వామివారి కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు.ఈ ఉత్సవంలో డిప్యూటీ ఈఓ నాగరత్న ఆల ఇన్స్పెక్టర్ సుధీర్ ప్రధాన అర్చకులు రమణా స్వామి గ్రామ ప్రజలు పాల్గొన్నారు.అనంతరం SVA ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకురాలు రాధ భక్తులకు అన్నదానం చేశారు.

ఖమ్మం

సోయబుల్లా ఖాన్ కీ ఘణ నివాళులు ఆర్పించిన బీజేపీ నేతలు

పున్నమి ప్రతి నిధి తెలంగాణ విమోచన దినోత్సవ ము ని పురస్కరించుకొని నిజాం నిరంకుశ పరిపాలనకు వ్యతిరేకంగా తన కలంతో గలమై గర్జించిన ప్రముఖ రచయిత #షోయబుల్లాఖాన్ విగ్రహానికి పూలమాలతో నివాళులర్పించడం జరిగింది. ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు అధ్యక్షత న జరిగిన కార్యక్రమం కీ ముఖ్య అతిథిగా బిజెపి జాతీయ నాయకులు తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల కో ఇంచార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి, బిజెపి జాతీయ కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యులు గోలి మధు సుధన్రా రెడ్డి రాష్ట్ర కోశాధికారి దేవకీ వాసుదేవరావు లు పాల్గొని పూలమాలవేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ విమోచన జిల్లా కన్వీనర్ నున్న రవి కుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ దొంగల సత్యనారాయణ రాష్ట్ర నాయకులు. G. వెంకటేశ్వర్లు మందడపు సుబ్బారావు దుద్దుకూరి వెంకటేశ్వర్లు మందడపు ప్రభాకర్ మండల కన్వీనర్ ఇందూరి మహేష్. మరియు జిల్లా మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

విశాఖపట్నం

నీళ్లు కలిపిన పెట్రోల్ కొట్టిన బంక్ సిబ్బంది.

హైదరాబాద్, యర్రగడ్డ పరిదిలోని హెచ్.పి.సి.ఎల్ బంకులో నిన్న రాత్రి తన కరుల్లో పెట్రోల్ కొట్టించుకున్న మహేష్ అనే వ్యక్తి. ఈరోజు తానా కారు ఆగిపోవటంతో మెకానిక్ దగ్గరికి వెలగా నీళ్లు కలిపిన పెట్రోలు కొటారాణి తెలిపిన మెకానిక్. మహేష్ బంకుకు వచ్చి వాటర్ బాటిల్ లో పెట్రోల్ కొట్టించగా నీళ్ళు కలిసి ఉండదాం చూసి సిబ్బందితో వాగ్వాదానికి దిగిన మహేష్.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

శెట్టిబలిజ కులం సర్టిఫికెట్లు జీవో జారీ పట్ల హర్షం.- మంత్రి సుభాష్ కు శెట్టిబలిజలు కృతజ్ఞతలు

న్యూస్ సెప్టెంబర్ 13 కాట్రేనికోన శెట్టిబలిజ కులస్తులకు శెట్టిబలిజ బీసీ బి సీరియల్ నెంబర్ -4 గా కులం సర్టిఫికెట్లు యధావిధిగా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం జీవో ఎంఎస్ నెంబర్ 6 ను జారీ చేయడం పట్ల ఆ సామాజిక వర్గం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. బీసీ సీనియర్ నాయకులు,టిడిపి రాష్ట్ర కార్యదర్శి గుత్తుల వెంకట సాయి అధ్యక్షతన నాయకులు కాట్రేనికోనలో సమావేశమై జీవో జారీకి కృషి చేసిన రాష్ట్ర కార్మిక శాఖ మాత్యులు వాసంశెట్టి సుభాష్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా గుత్తుల సాయి మాట్లాడుతూ మంత్రి వాసంశెట్టి శుభాష్ సమస్యను సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి వెంటనే తీసుకువెళ్లి గౌడ్ తొలగించి శెట్టి బలిజ కులం సర్టిఫికెట్లు ఇప్పించేందుకు విశేష కృషి చేసి జాతికి ఎంతో ఉపకారం చేశారని కొనియాడారు. అన్నదమ్ములుగా ఉండే బీసీ కులాల మధ్య మనస్పర్ధలు వచ్చేలా వైసీపీ పాలనలోనే గౌడ్ ( శెట్టిబలిజ ) కులం సర్టిఫికెట్లుగా మారుస్తూ ఉత్తర్వులు ఇచ్చారని సాయి ఆవేదన వ్యక్తం చేశారు.. అప్పట్లో పదవులను ఏలుతున్న శెట్టిబలిజ నాయకులు ఎవరూ పట్టించుకోలేదని, మంత్రి సుభాష్ చిత్తశుద్ధితో కృషి చేసి సీఎం ద్వారా పాత జీవోలో మార్పులు చేసి బీసీలకు చెందిన గీత కులాలకు న్యాయం చేశారన్నారు. తాము గౌడ కులానికి వ్యతిరేకం కాదని, ఎప్పటిలాగే శెట్టిబలిజం కులంగా కులం సర్టిఫికెట్లు మాత్రమే కావాలని కోరుకుంటున్నామని సాయి అన్నారు. ఇప్పటివరకు శెట్టిబలిజ కుల బలాన్ని చూపించి నాయకులు పదవులు పొందారని, మంత్రి సుభాష్ కులం కోసం మాత్రమే నిస్వార్ధంగా పనిచేసి చిరస్థాయిగా పేరు తెచ్చుకున్నారని గుత్తుల అభినందించారు. మంత్రి సుభాష్ ను అభినందించి కృతజ్ఞతలు తెలుపుతూ సమావేశం తీర్మానించింది. శెట్టి బలిజ నాయకులు శీలం సూర్య నారాయణ, విత్తనాల వెంకటరమణ, కడలి వెంకట సత్యనారాయణ, వనచర్ల నాగేశ్వరరావు, విత్తనాల బుజ్జి, వాసంశెట్టి రాజేశ్వరరావు, కముజు సర్వేశ్వరరావు,గొవ్వాల సత్తిబాబు, శీలం ప్రసాద్,కొప్పిశెట్టి ఏడుకొండలు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.