Wednesday, 6 May 2026

Blog

తెలంగాణ

ఇందిరమ్మ ఇల్లు.. తక్షణ సహాయం కోసం టోల్ ఫ్రీ నెంబర్ 18005995991

పున్నమి ప్రతినిధి &ఇందిరమ్మ ఇండ్ల టోల్ ఫ్రీ కాల్ సెంటర్, హెల్ప్ డెస్క్ ప్రారంభం +పారదర్శకంగా ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని పకడ్బందీగా అమలు చేయడం కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నాం. అందులో భాగంగా దరఖాస్తుదారులు, లబ్ధిదారుల అనుమానాలు, సందేహాలను నివృత్తి చేయడం కోసం, వారికి కావాల్సిన సమాచారాన్ని ఇవ్వడం కోసం ఈరోజు హైదరాబాద్ లోని హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో కార్పొరేష‌న్ ఎండీ వి.పి.గౌత‌మ్ గారితో కలిసి టోల్ ఫ్రీ కాల్ సెంటర్ ను, హెల్ప్ డెస్క్ ను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. కాల్ సెంటర్ ఫోన్ నెం. 1800 599 5991 ను ఆవిష్కరించిన తర్వాత న స్వయంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్కొ రెడ్డి కొన్ని కాల్స్ రిసీవ్ చేసుకొని వారితో మాట్లాడారు. వారికి కావాల్సిన సమాచారాన్ని ఇచ్చారు. వరంగల్ జిల్లా ఖిల్లా ఘన్ పూర్ నుంచి ఫోన్ చేసిన ఓ వ్యక్తి తన ఇల్లు బేస్ మెంట్ వరకు పూర్తయిందని, బిల్లు ఎప్పుడు వస్తుందని అడిగగా అతని ఆధార్ నెంబర్ అడిగి తెలుసుకొని విచారణ చేయగా.. అతని ఫైల్ E. E . దగ్గర ఉంది. సోమవారం బిల్లు వస్తుందని మంత్రి చెప్పారు. ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినందుకు అతను ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేసినట్లు గ మంత్రి తెలియజేశారు మరొకరు హైదరాబాద్ నుంచి ఫోన్ చేసి.. వెరిఫికేషన్ కూడా పూర్తయ్యిందని, ఇందిరమ్మ ఇండ్లు ఎప్పుడిస్తారని అడిగారు. హైదరాబాద్ లో నివాస స్థలాల కొరత కారణంగా కొంత ఆలస్యమవుతుంది.. త్వరలోనే మీ సమస్యకు పరిష్కారం కనుగొని అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం అని మంత్రి శ్రీనివాస్హా రెడ్డి హామీ ఇవ్వడం జరిగింది. ఈ కాల్ సెంటర్ ప్రతి రోజూ ఉదయం 7 గంట‌ల నుంచి రాత్రి 9 గంట‌ల వరకు పనిచేస్తుందని ప్రధానంగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించడంతో పాటు, వాటిని పరిష్కరించడంలో చొరవ చూపడానికి ఈ కాల్ సెంటర్ ను వినియోగించుకోవచ్చు. లబ్ధిదారుల ఫోన్ నెంబరు, ఆధార్ నెంబరు ఆధారంగా వివరాలను పరిశీలించి సమస్యను పరిష్కరించడానికి అధికారులు చర్యలు తీసుకుంటారు. నిర్ణీత గడువులోగా బిల్లులు జమ కాకపోవడం, ఎక్కడైనా ఎవరైనా సిబ్బంది ఫోటోలను అప్ లోడ్ చేయడంలో ఆలస్యం చేయడం, ఇతర సాంకేతిక సమస్యలు, అవినీతి ఆరోపణలు తదితర అంశాలపై ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులను స్వీకరించి, వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్యలు చేపట్టడమే గాకుండా లబ్ధిదారులకు కూడా ఆ వివరాలను తెలియచేస్తారు. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో పారదర్శకతకు పెద్ద పీట వేస్తూ, పూర్తి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటున్నాం. ఇప్పటికే ఇందిరమ్మ ఇండ్ల యాప్ ద్వారా మంచి ఫలితాలు సాధించాం. కృత్రిమ మేధ ( ఎఐ) ను కూడా విరివిగా వాడుతున్నాం. ఈ కాల్ సెంటర్ ద్వారా లబ్ధిదారులకు మరింత చేరువ కానున్నాము అని మంత్రి అన్నారు అవినీతికి ఎటువంటి ఆస్కారం లేకుండా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం. దేశంలో ఎక్కడా లేనివిధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ఇందిరమ్మ ప్రభుత్వం 5 లక్షల రూపాయల సబ్సిడీతో పేదల ఇండ్ల నిర్మాణానికి స‌హాయం అందిస్తోంది. గూడు లేని పేదలకు ఇండ్లు ఇవ్వడమే ఇందిరమ్మ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

తెలంగాణ

15 నుండి కాలేజిల బంద్ :ఉన్నత విద్యా సంస్థ ల సమాఖ్య నిర్ణయం

పున్నమి ప్రతినిధి తెలంగాణ ప్రభుత్వం చెల్లించాల్సిన 8 వేల కోట్ల రూపాయల ఫీజ్ రియంబర్స్ మెంట్ బకాయిలని చెల్లించాలి అని డిమాండ్ చేస్తూ ఈ నెల 15 నుండి ఇంజనీరింగ్, ఫార్మాసి, BED, MBA, MCA, లా, నర్సింగ్ తదితర వృత్తి విద్యా కళాశాల లు బంద్ చేస్తునట్లు తెలంగాణ ఉన్నత విద్యాసంస్థల యాజమాన్య సమాఖ్య అధ్యక్షు, ప్రధాన కార్యదర్సుల సంఘం తెలియ జేసింది. హైదరాబాద్ లో అత్యవసర సమావేశం అనంతరం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

ఖమ్మం

సేవ కార్యక్రమలల్లో ప్రతి ఒక్కరు పాల్గొనాలి. నెల్లూరు కోటేశ్వరరావు పిలుపు

భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినము ని పురస్కరించుకొని బీజేపీ జాతీయ కమిటీ సేవ పక్వాడ్ కార్యక్రమం కీ పిలుపు ఇచ్చిందని ఈ కార్యక్రమం లో ప్రతి ఒక్కరు పాల్గొనాలని బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు కోరారు. శుక్రవారం ఖమ్మం రెండవ పట్టణ కమిటీ సమావేశం అధ్యక్షులు ధనియాకుల వెంకట్ నారాయణ ఆద్యక్షత న జరిగింది. ఈ కార్యక్రమం లో రెండవ పట్టణ కమిటీ బాద్యులు పాల్గొన్నారు

తెలంగాణ

తెలంగాణ లో ఇక సులభం గా కుల ధ్రువీకరణ పత్రాలు

పున్నమి ప్రతినిధి హైదరాబాద్‌: కుల ధ్రువీకరణ పత్రాలను సులభంగా పొందేలా ‘మీ సేవ’ నూతన ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. బీసీ, ఎస్టీ, ఎస్సీ వర్గాలకు చెందిన పౌరులు(ప్రత్యేక కేసులు మినహా) ఇప్పుడు మీ సేవ కేంద్రాల్లో నేరుగా కుల ధ్రువీకరణ పత్రాలను పొందవచ్చు. గతంలో ప్రతి దరఖాస్తుకు కొత్తగా తహసీల్దార్‌ ఆమోదం పొందాల్సిన అవసరం ఉండేది. దీనివల్ల ధ్రువీకరణ పత్రాలు పొందడంలో జాప్యం ఏర్పడుతుండడంతో.. ఈ సమస్యను నివారించడానికి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆదేశాలతో.. మీ సేవ విభాగం దీనిపై దృష్టిపెట్టింది. సీసీఎల్‌ఏ, బీసీ సంక్షేమ, ఎస్సీ సంక్షేమ, జిల్లా అడ్మినిస్ట్రేటివ్‌ అధికారులు, తహసీల్దార్‌లతో పలు దఫాలుగా సమావేశాలు నిర్వహించిన అనంతరం తాజా మార్పులు చేపట్టారు. ప్రయోగాత్మకంగా ఈ మార్పును 15 రోజుల క్రితం అమల్లోకి తెచ్చారు. ఇప్పటికే 17,571 మంది ఈ సేవను విజయవంతంగా పొందారు. ప్రతి సంవత్సరం దాదాపు 20 లక్షల మంది కుల ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేస్తుంటారు. కొత్తగా జారీ చేసే సర్టిఫికెట్‌లో.. గతంలో ఆమోదించిన అధికారి వివరాలు, తిరిగి జారీ తేదీ ఉంటాయి. ప్రత్యేక కేసుల్లో(ఉదాహరణకు హిందూ ఎస్సీ నుంచి క్రైస్తవ మతంలోకి మారిన వ్యక్తి బీసీ-సీ కిందకు వస్తే.. జీవో ఎంఎస్‌ నం.3, తేదీ 9.9.2020 ప్రకారం) దరఖాస్తును గత ప్రక్రియ ప్రకారం ఆమోదం కోసం పంపిస్తారు. *సేవను ఎలా పొందాలంటే…* పాత సర్టిఫికెట్‌ నంబర్‌ తెలిస్తే: మీ సేవ కౌంటర్‌లో ఆ నంబర్‌ను అందించడం ద్వారా కొత్త ప్రింటవుట్‌ పొందవచ్చు. నంబర్‌ తెలియకపోతే: మీ సేవ సిబ్బంది మీ జిల్లా, మండలం, గ్రామం, ఉప-కులం, పేరు ఆధారంగా శోధిస్తారు. మరిన్ని వివరాల కోసం మీ సేవ వెబ్‌సైట్‌ను లేదా సమీపంలోని మీ సేవ కేంద్రాన్ని సంప్రదించవచ్చని మీ సేవ కమిషనర్‌ రవికిరణ్‌ తెలిపారు.

ఖమ్మం

సేవ పక్వాడ్ కార్యక్రమం ని విజయవంతం చెయ్యండి : మంద సరస్వతి

పున్నమి ప్రతినిధి భారతప్రధాని పుట్టినరోజు ని పురస్కరించుకొని సేవకార్యక్రమం లో భాగం గా చేపట్టిన సేవ పక్వాడ్ కార్యక్రమం ని జయప్రదం చెయ్యాలి అని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలు శ్రీమతి మంద సరస్వతి పిలు పునిచ్చారూ. ఖమ్మం మూడవ పట్టణ కమిటీ సమావేశం అధ్యక్షురాలు శ్రీమతి దార్ల మల్లేశ్వరి అధ్యకతన జరగాగా ముఖ్య అతిధి గా శ్రీ మతి మంద సరస్వతి పాల్గొన్నారు. సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు సేవ పక్వాడ అను నినాదంతో సేవే లక్ష్యంగా వివిధ సేవ కార్యక్రమాలను నిర్దేశించడం జరిగింది. కార్యక్రమాల గురించి శ్రీమతి మంద సరస్వతి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డోనవన్. దాసు , కన్వీనర్ వేముల వెంకటేష్ ఉపాధ్యక్షులు శీలం శ్రీకాంత్ మరియు తురక శ్రీకాంత్, కాలేరు సతీష్ మండల కోశాధికారి వెంకట రమణ కో కన్వీనరులు, డివిజన్ అధ్యక్షులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నిరుపేదకు ఆర్థిక సహాయం చేసిన భోగినేని

సీతారామపురం సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి) కంటి సంబంధిత అనారోగ్య సమస్యల కారణంగా చూపుకోల్పోయి వైద్య చికిత్సలు చేయించుకుంటున్న సీతారామపురం లోని సినిమా హాల్ వీధి కి చెందిన ఎడమకంటి సుబ్రహ్మణ్యం అనే నిరుపేదకు వైద్య ఖర్చుల నిమిత్తం పదివేల రూపాయలను నా సేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీ మెంబర్, ఉదయగిరి నియోజకవర్గ జనసేన నాయకుడు భోగినేని కాశీరావు అందించారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఎడమ కట్టి సుబ్రమణ్యం పరామర్శించి, ఆరోగ్య సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం భోగినేని కాశీ రావు మాట్లాడుతూ ఎడమకంటి సుబ్రహ్మణ్యం అనే నిరుపేద సీతారామపురం లో అందరికీ సుపరిచితుడని, చిన్న వయసులోనే కంటిచూపు కి సంబంధించిన ఇబ్బందులు రావడం తీవ్ర బాధని కలిగించిందన్నారు.బాధిత కుటుంబాన్ని జనసేన పార్టీ తరఫున అన్ని విధాల ఆదుకునేందుకు ప్రయత్నిస్తామన్నారు. అదేవిధంగా ఉదయగిరి శాసనసభ్యుడు కాకర్ల సురేష్ సహకారంతో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా బాధిత కుటుంబాన్ని ఆదుకునేందుకు చర్యలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల మాజీ కన్వీనర్ ముత్తంశెట్టి చెన్నకేశవులు, మండల జనసేన నాయకుడు భోగినేని కాశీరత్తయ్య (గాంధీ), ఊర చెరువు నీటి సంఘం అధ్యక్షుడు నీలి రత్తయ్య, జడ్పీ హైస్కూల్ కమిటీ చైర్మన్ తోట ఏడుకొండలు, సొసైటీ డైరెక్టర్ గొల్లపల్లి భాస్కర్, జన సైనికులు చెన్నకేశవులు, వెంకట్, మురళి తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

యోగిమల్లవరంలోని శ్రీ సాలగ్రామ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే బొజ్జల

శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి శుక్రవారం తిరుచానూరు యోగిమల్లవరంలోని శ్రీ సాలగ్రామ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించి స్వామి వారి దర్శనం చేసుకున్నారు.అనంతరం దేవస్థానం వారు నిర్వహించిన అన్నదాన కార్యక్రమాలలో పాల్గొని భక్తులకు స్వయంగా వడ్డించిన శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి.

తిరుపతి

నూతన దంపతులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే

శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలం,మేర్లపాక గ్రామ పంచాయతీలో సర్పంచ్ గంగాధరం మేనకోడలకి ఇటీవల వివాహం జరిగిన సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించిన శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఈ కార్యక్రమంలో సర్పంచుల సంఘం అధ్యక్షులు నల్లపాలెం శివ సర్పంచ్ గంగాధరం ఎంపీటీసీ భరత్ ఎక్స్ ట్రస్ట్ బోర్డ్ మెంబర్స్ ‌ జై శ్యామ్, మున్నా.వైసిపి ‌ఉపాధ్యక్షులు ముని కృష్ణారెడ్డి చిందేపల్లి. సుమన్,మస్తాన్,శంకర్ రవీందర్ నాయుడు ‌ వెంకటయ్య,ఈశ్వరయ్య రమణయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

తెలంగాణ

శివన్న గూడెం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ముంపు గ్రామంలో పునరావాస పనులు నాణ్యతతో చేయాలన్న: ఎమ్మెల్యే

నకిరేకల్ :సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి ) శివన్న గూడెం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ముంపు గ్రామమైన నర్సిరెడ్డి గూడెం పునరావాస కాలనీలో పనులు నాణ్యతతో చేపట్టాలని దేవరకొండ శాసనసభ్యులు నేనావత్ బాలునాయక్ చెప్పారు. అంతేకాక నిర్దేశించిన సమయంలో గా పనులు పూర్తి చేయాలన్నారు. శుక్రవారం దేవరకొండ శాసనసభ్యులు, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తో కలిసి చింతపల్లిలో ఏర్పాటు చేస్తున్న నర్సిరెడ్డి గూడెం ఆర్ అండ్ ఆర్ కాలనిలో 11 కోట్ల 35 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న సైడ్ డ్రైన్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సిసి రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు.

నాగర్‌కర్నూల్

ఈనెల 13న ఉచిత ఇయరింగ్ క్యాంప్

పున్నమి ప్రతినిధి నాగర్ కర్నూలు జిల్లా సెప్టెంబర్ 12 నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రశాంతి స్పీచ్ హియరింగ్ క్లినిక్ (హెచ్.పీ గ్యాస్ ఆఫీస్ నల్లవెల్లి రోడ్ లో) ఈనెల 13న శనివారం ఉచిత స్పీచ్ మరియు ఇయరింగ్ క్యాంప్ ను నిర్వహిస్తున్నట్లు క్యాంపు నిర్వాహకులు ప్రశాంతి కందుకూరి, సీనియర్ ఆడియాలజిస్ట్ స్పీచ్ లాంగ్వేజ్ పాథాలజిస్ట్ ఒక ప్రకటనలో తెలిపారు. వినికిడి సమస్యలు మాటలు సరిగా రాకపోవడం వంటి సమస్యలతో బాధపడుతున్న వారికి ఉదయం 10 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఉచిత క్యాంపు నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ ఉచిత క్యాంపుకు సమస్యలను పరిష్కారం చేసుకోవాలని కోరారు. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు 9059603754 -855 5 919530 నెంబర్లకు ఫోన్ చేసి పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.