Wednesday, 6 May 2026

Blog

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

శెట్టిబలిజ కులం సర్టిఫికెట్లు జీవో జారీ పట్ల హర్షం.- మంత్రి సుభాష్ కు శెట్టిబలిజలు కృతజ్ఞతలు

న్యూస్ సెప్టెంబర్ 13 కాట్రేనికోన శెట్టిబలిజ కులస్తులకు శెట్టిబలిజ బీసీ బి సీరియల్ నెంబర్ -4 గా కులం సర్టిఫికెట్లు యధావిధిగా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం జీవో ఎంఎస్ నెంబర్ 6 ను జారీ చేయడం పట్ల ఆ సామాజిక వర్గం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. బీసీ సీనియర్ నాయకులు,టిడిపి రాష్ట్ర కార్యదర్శి గుత్తుల వెంకట సాయి అధ్యక్షతన నాయకులు కాట్రేనికోనలో సమావేశమై జీవో జారీకి కృషి చేసిన రాష్ట్ర కార్మిక శాఖ మాత్యులు వాసంశెట్టి సుభాష్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా గుత్తుల సాయి మాట్లాడుతూ మంత్రి వాసంశెట్టి శుభాష్ సమస్యను సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి వెంటనే తీసుకువెళ్లి గౌడ్ తొలగించి శెట్టి బలిజ కులం సర్టిఫికెట్లు ఇప్పించేందుకు విశేష కృషి చేసి జాతికి ఎంతో ఉపకారం చేశారని కొనియాడారు. అన్నదమ్ములుగా ఉండే బీసీ కులాల మధ్య మనస్పర్ధలు వచ్చేలా వైసీపీ పాలనలోనే గౌడ్ ( శెట్టిబలిజ ) కులం సర్టిఫికెట్లుగా మారుస్తూ ఉత్తర్వులు ఇచ్చారని సాయి ఆవేదన వ్యక్తం చేశారు.. అప్పట్లో పదవులను ఏలుతున్న శెట్టిబలిజ నాయకులు ఎవరూ పట్టించుకోలేదని, మంత్రి సుభాష్ చిత్తశుద్ధితో కృషి చేసి సీఎం ద్వారా పాత జీవోలో మార్పులు చేసి బీసీలకు చెందిన గీత కులాలకు న్యాయం చేశారన్నారు. తాము గౌడ కులానికి వ్యతిరేకం కాదని, ఎప్పటిలాగే శెట్టిబలిజం కులంగా కులం సర్టిఫికెట్లు మాత్రమే కావాలని కోరుకుంటున్నామని సాయి అన్నారు. ఇప్పటివరకు శెట్టిబలిజ కుల బలాన్ని చూపించి నాయకులు పదవులు పొందారని, మంత్రి సుభాష్ కులం కోసం మాత్రమే నిస్వార్ధంగా పనిచేసి చిరస్థాయిగా పేరు తెచ్చుకున్నారని గుత్తుల అభినందించారు. మంత్రి సుభాష్ ను అభినందించి కృతజ్ఞతలు తెలుపుతూ సమావేశం తీర్మానించింది. శెట్టి బలిజ నాయకులు శీలం సూర్య నారాయణ, విత్తనాల వెంకటరమణ, కడలి వెంకట సత్యనారాయణ, వనచర్ల నాగేశ్వరరావు, విత్తనాల బుజ్జి, వాసంశెట్టి రాజేశ్వరరావు, కముజు సర్వేశ్వరరావు,గొవ్వాల సత్తిబాబు, శీలం ప్రసాద్,కొప్పిశెట్టి ఏడుకొండలు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఖమ్మం

ఖమ్మం లో భారీ వర్షం..

పున్నమి ప్రతినిధి. హైదరాబాద్ వాతావరణ శాఖ తెలంగాణ కీ భారీ వర్ష సూచన అని తెలియజేసిన క్రమం లో మధ్యాహ్నం 3 గంటలకి ప్రారంభం అయినా చిన్న పాటి వర్షం 4 గంటలకు భారీ వర్షం గా మారింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

తిరుపతి

సీఐటీయూ ప్రాంతీయ కమిటీ ఎన్నిక

శ్రీకాళహస్తి పట్టణంలోని స్థానిక సీఐటీయూ కార్యాలయంలో శనివారం తొట్టంబేడు, శ్రీకాళహస్తి మండలాల సీఐటీయూ సంయుక్త మహా సభలు నిర్వహించారు.ఈ సభల సందర్భంగా ప్రాంతీయ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా కొప్పల గురునాధం,ప్రధాన కార్యదర్శిగా పెనగడం గురవయ్య,కోశాధికారిగా రేవతితో పాటు మరో 15 మందిని సభ్యులుగా ఎన్నికయ్యారు.శ్రీకాళహస్తి ప్రాంతంలోని కార్మిక,కర్షకుల సమసస్యలపై నూతన కమిటీ అలుపెరగని పోరాటం చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు జీ.బాలసుబ్రమణ్యం, ఉపాధ్యక్షులు అంగేరి పుల్లయ్య పిలుపునిచ్చారు. కుమార్ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ

దీపావళి కీ బాణా సంచా పేల్చడం నిషేదం : సుప్రీం కోర్టు

పున్నమి ప్రతి నిధి దీపావళి కీ ఢిల్లీ తో పాటు గా దేశ వ్యాప్తంగా బాణ సంచా పేల్చడం నిషేధం అని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయ మూర్తి BR గావాయి స్పష్టం చేశారు. ఢిల్లీ ప్రజలు మాత్రమే కాదు దేశ వ్యాప్తంగా ప్రజలు కాలుష్యం తో ఇబ్బందులు పడుతున్నారు అని అయన అభిప్రాయ పడ్డారు.

ఆంధ్రప్రదేశ్

క్యాన్సర్ కి వాక్సిన్ ను కని పెట్టిన రష్యా సైన్టిస్ట్ లు

సెప్టెంబర్ 13 పున్నమి ప్రతినిధి @ రష్యా శాస్త్రవేత్తలు తయారు చేసిన (ఎంటెరోమిక్స్) క్యాన్సర్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌లో అద్భుత ఫలితాలు ఇచ్చింది. 18–75 ఏళ్ల వయస్సు గల 48 మంది అడ్వాన్స్ స్టేజ్ క్యాన్సర్ పేషెంట్స్‌పై చేసిన ఫేజ్-1 ట్రయల్స్‌లో 100% సక్సెస్ రేట్ సాధించడం నిజంగా చరిత్రాత్మక ఘట్టం. ఈ వ్యాక్సిన్ ప్రత్యేకత ఏమిటంటే క్యాన్సర్ కణాలను నాశనం చేస్తుంది,శరీర రోగనిరోధక శక్తిని యాక్టివేట్ చేసి మరింత బలంగా పోరాడేలా చేస్తుంది,కీమోథెరపీ, రేడియేషన్ లాగా ఆరోగ్యకరమైన కణజాలాలను దెబ్బతీయదు దుష్ప్రభావాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇక మిగిలిన ఫేజ్-2, ఫేజ్-3 ట్రయల్స్ పూర్తయ్యాక త్వరలోనే ప్రజల వినియోగానికి రాబోతోంది. రష్యా ప్రభుత్వం క్యాన్సర్ బాధితులకు ఉచితంగా అందించాలనే నిర్ణయం కూడా తీసుకోవడం గొప్ప విషయం. ఇది కేవలం రష్యాకు మాత్రమే కాదు, మొత్తం మానవాళికి ఒక గొప్ప ఆశ, ఊరట కూడా…!!! రష్యా దేశానికి ప్రపంచ మానావళి రుణపడి ఉంటుంది రష్యా సైన్టిస్ట్ లకు ధన్యవాదములు

క్రైమ్

చిత్రంలో ఉన్నది ఒక హెచ్చరిక, సైబర్ సెక్యూరిటీ (సైబర్ భద్రత) గురించి.

సెప్టెంబర్ 13 పున్నమి ప్రతినిధి@ మనం ఇంటర్నెట్‌లో షేర్ చేసే సమాచారం మరియు వ్యక్తిగత డేటా ఎలా మనకు తెలియకుండానే ఉపయోగించబడుతుంది అనే దాని గురించి ఇది వివరిస్తుంది. AI సహాయంతో మీ ఫోటోలు మరియు వీడియోల నుండి మీ డిజిటల్ రూపాన్ని (digital avatar) సృష్టించవచ్చు.: ఈ డిజిటల్ అవతార్‌ను మీ స్నేహితులు లేదా కుటుంబ సభ్యులను మోసం చేయడానికి లేదా ఆర్థిక లావాదేవీలు చేయడానికి కూడా ఉపయోగించవచ్చు. దీనినే గుర్తింపు దొంగతనం (identity theft) అంటారు మోసగాళ్లు ఆ డిజిటల్ రూపాన్ని వాణిజ్య ప్రకటనలకు, అసాంఘిక కార్యకలాపాలకు లేదా ఇతర నేరాలకు ఉపయోగించుకునే అవకాశం ఉంది. ముఖ్య విషయాలు మీ ముఖం మాత్రమే కాదు, మీ శరీరం అద్దె: మీ ముఖం మరియు శరీరం యొక్క డిజిటల్ రూపాలు (డిజిటల్ అవతార్స్) తయారు చేసి, వాటిని వాణిజ్య అవసరాలకు ఉపయోగిస్తారు. వ్యక్తిగత డేటా భద్రత మీ పేరు, ఫోటోలు, చిరునామా, ఆస్తులు, మరియు ఇతర వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం కావచ్చు. AI (కృత్రిమ మేధస్సు) ఉపయోగం కృత్రిమ మేధస్సుని ఉపయోగించి మీ డిజిటల్ రూపాలను తయారు చేస్తారు. వీటితో మీకు తెలియకుండానే డ్రగ్స్ అమ్మే వాళ్లు, లేదా అసాంఘిక కార్యకలాపాలు చేసే వాళ్లు కూడా మీ రూపాన్ని వాడుకోవచ్చు. హెచ్చరిక ఈ ప్రపంచం మొత్తం మాయలాంటిది. ఇక్కడ డేటాను నమ్మడం చాలా ప్రమాదకరం. మీ వ్యక్తిగత సమాచారం పంచుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవడం మంచిది. ఈ పోస్ట్ సారాంశం ఏమిటంటే, ఇంటర్నెట్‌లో మనం చాలా అప్రమత్తంగా ఉండాలి మరియు మన వ్యక్తిగత డేటాను జాగ్రత్తగా చూసుకోవాలి.

ఆంధ్రప్రదేశ్

ఘనంగా ముగిసిన జిల్లా స్థాయి కళా ఉత్సవ్ 2025

పున్నమి ప్రతినిధి ( శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా): ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణ సంస్థ పల్లిపాడులో కళా ఉత్సవ్ 2025 జిల్లా స్థాయి పోటీలు ఘనంగా ముగిసాయి. మొదటి రోజు అనగా 11వ తేదీన గురువారం రోజున గాత్ర సంగీతం, వాయిద్య సంగీతం, నృత్యం మొదలైన కళలలో వ్యక్తిగత మరియు బృంద విభాగాలలో జిల్లాలోని విద్యాసంస్థలలో చదువుతున్న 9, 10, 11, 12 తరగతులు చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులు చురుకుగా పాల్గొని అనేక బహుమతులను గెలుచుకున్నారు. రెండవ రోజున అనగా 12వ తేదీన నాటక కళ, చిత్రకళ, శిల్పకళ, సాంప్రదాయ కథావిన్యాసం మొదలైన కళలలో వ్యక్తిగత మరియు బృంద విభాగాలలో పాల్గొని అనేక బహుమతులను గెలుచుకున్నారు.ప్రథమ బహుమతి సాధించిన వారు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక అయ్యారు. విజేతలకు ప్రమాణ పత్రాలు మరియు జ్ఞాపికలను సంస్థ ప్రిన్సిపాల్ డాక్టర్ కె. వెంకటేశ్వరరావు గారు బహుకరించారు. ఈ కార్యక్రమాన్ని నోడల్ ఆఫీసర్ మరియు ఆర్గనైజర్స్ శ్రీమతి రజిని గారు, శ్రీమతి హైమావతి గారు, శ్రీ అక్కిరెడ్డి గారు, శ్రీ రఘు కుమార్ గారు, శ్రీ నటరాజమూర్తి గారు, శ్రీ డాక్టర్ బంకా శ్రీనివాసులు గారు, శ్రీ శామీర్ గారు, శ్రీమతి నీరజ గారు, శ్రీమతి పద్మజ గారు, శ్రీమతి ముక్తహర్ సుల్తానా గారు, శ్రీ కోట శీనయ్య గారు, శ్రీ సుబ్బారావు గారు మరియు చాత్రోపాధ్యాయులు తదితరులు ఘనంగా నిర్వహించారు.

ఖమ్మం

యూరియా కోసం రైతు లు పడుతున్న కష్టాలని చూపిస్తే మీడియా మీద కేసులు పెడతార.: మాజీ శాసన సభ్యులు సండ్ర వెంకట వీరయ్య

పున్నమి ప్రతి నిధి ఖమ్మం *రైతుల యూరియా కష్టాలను చూపిస్తే మీడియా పై కేసులు పెడతారా అని BRS రాష్ట్ర నాయకులు మాజీ శాసన సభ్యులు సండ్ర వెంకట్ వీరయ్య ప్రభుత్వం ని ప్రశ్నించారు. *అణిచివేతలు, ఆంక్షలతో జర్నలిస్టులను భయపెడుతారా?*- *ఎమ్మెల్సీ & ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాతా మధుసూదన్ మరియు సత్తుపల్లి మాజీ శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య* రైతులు పడుతున్న యూరియా కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు ప్రయత్నించిన మీడియా మీద పోలీసులు అక్రమ కేసులు బనాయించడం దుర్మార్గం. రైతుల సమస్యలను తెలుసుకునేందుకు వెళ్లిన జర్నలిస్టుపై పోలీసులు ఉల్టా కేసులు పెట్టడం రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ పాలనకు నిదర్శనం. గడిచిన 2 నెలలుగా రైతులు యూరియా కోసం అష్టకష్టాలు పడుతుంటే పట్టించుకోని ప్రభుత్వం. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపుతున్న మీడియా ప్రతినిధులపై కేసులు పెట్టడం శోచనీయం. శాంతిభద్రతల నిర్వహణను పక్కన పెట్టి ప్రజల గొంతునొక్కేందుకు పోలీసులను వాడడం అప్రజాస్వామీకం. జర్నలిస్ట్ ల పై పెట్టిన కేసులను తక్షణం ఉపసంహరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, డీజీపీని వారు డిమాండ్ చేస్తూ.. MLC & ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు * తాతా మధుసూదన్ మరియు సత్తుపల్లి మాజీ శాసనసభ్యులు *సండ్ర వెంకటవీరయ్య ప్రకటన విడుదల చేశారు.

తెలంగాణ

ఇందిరమ్మ ఇల్లు.. తక్షణ సహాయం కోసం టోల్ ఫ్రీ నెంబర్ 18005995991

పున్నమి ప్రతినిధి &ఇందిరమ్మ ఇండ్ల టోల్ ఫ్రీ కాల్ సెంటర్, హెల్ప్ డెస్క్ ప్రారంభం +పారదర్శకంగా ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని పకడ్బందీగా అమలు చేయడం కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నాం. అందులో భాగంగా దరఖాస్తుదారులు, లబ్ధిదారుల అనుమానాలు, సందేహాలను నివృత్తి చేయడం కోసం, వారికి కావాల్సిన సమాచారాన్ని ఇవ్వడం కోసం ఈరోజు హైదరాబాద్ లోని హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో కార్పొరేష‌న్ ఎండీ వి.పి.గౌత‌మ్ గారితో కలిసి టోల్ ఫ్రీ కాల్ సెంటర్ ను, హెల్ప్ డెస్క్ ను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. కాల్ సెంటర్ ఫోన్ నెం. 1800 599 5991 ను ఆవిష్కరించిన తర్వాత న స్వయంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్కొ రెడ్డి కొన్ని కాల్స్ రిసీవ్ చేసుకొని వారితో మాట్లాడారు. వారికి కావాల్సిన సమాచారాన్ని ఇచ్చారు. వరంగల్ జిల్లా ఖిల్లా ఘన్ పూర్ నుంచి ఫోన్ చేసిన ఓ వ్యక్తి తన ఇల్లు బేస్ మెంట్ వరకు పూర్తయిందని, బిల్లు ఎప్పుడు వస్తుందని అడిగగా అతని ఆధార్ నెంబర్ అడిగి తెలుసుకొని విచారణ చేయగా.. అతని ఫైల్ E. E . దగ్గర ఉంది. సోమవారం బిల్లు వస్తుందని మంత్రి చెప్పారు. ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినందుకు అతను ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేసినట్లు గ మంత్రి తెలియజేశారు మరొకరు హైదరాబాద్ నుంచి ఫోన్ చేసి.. వెరిఫికేషన్ కూడా పూర్తయ్యిందని, ఇందిరమ్మ ఇండ్లు ఎప్పుడిస్తారని అడిగారు. హైదరాబాద్ లో నివాస స్థలాల కొరత కారణంగా కొంత ఆలస్యమవుతుంది.. త్వరలోనే మీ సమస్యకు పరిష్కారం కనుగొని అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం అని మంత్రి శ్రీనివాస్హా రెడ్డి హామీ ఇవ్వడం జరిగింది. ఈ కాల్ సెంటర్ ప్రతి రోజూ ఉదయం 7 గంట‌ల నుంచి రాత్రి 9 గంట‌ల వరకు పనిచేస్తుందని ప్రధానంగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించడంతో పాటు, వాటిని పరిష్కరించడంలో చొరవ చూపడానికి ఈ కాల్ సెంటర్ ను వినియోగించుకోవచ్చు. లబ్ధిదారుల ఫోన్ నెంబరు, ఆధార్ నెంబరు ఆధారంగా వివరాలను పరిశీలించి సమస్యను పరిష్కరించడానికి అధికారులు చర్యలు తీసుకుంటారు. నిర్ణీత గడువులోగా బిల్లులు జమ కాకపోవడం, ఎక్కడైనా ఎవరైనా సిబ్బంది ఫోటోలను అప్ లోడ్ చేయడంలో ఆలస్యం చేయడం, ఇతర సాంకేతిక సమస్యలు, అవినీతి ఆరోపణలు తదితర అంశాలపై ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులను స్వీకరించి, వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్యలు చేపట్టడమే గాకుండా లబ్ధిదారులకు కూడా ఆ వివరాలను తెలియచేస్తారు. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో పారదర్శకతకు పెద్ద పీట వేస్తూ, పూర్తి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటున్నాం. ఇప్పటికే ఇందిరమ్మ ఇండ్ల యాప్ ద్వారా మంచి ఫలితాలు సాధించాం. కృత్రిమ మేధ ( ఎఐ) ను కూడా విరివిగా వాడుతున్నాం. ఈ కాల్ సెంటర్ ద్వారా లబ్ధిదారులకు మరింత చేరువ కానున్నాము అని మంత్రి అన్నారు అవినీతికి ఎటువంటి ఆస్కారం లేకుండా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం. దేశంలో ఎక్కడా లేనివిధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ఇందిరమ్మ ప్రభుత్వం 5 లక్షల రూపాయల సబ్సిడీతో పేదల ఇండ్ల నిర్మాణానికి స‌హాయం అందిస్తోంది. గూడు లేని పేదలకు ఇండ్లు ఇవ్వడమే ఇందిరమ్మ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

తెలంగాణ

15 నుండి కాలేజిల బంద్ :ఉన్నత విద్యా సంస్థ ల సమాఖ్య నిర్ణయం

పున్నమి ప్రతినిధి తెలంగాణ ప్రభుత్వం చెల్లించాల్సిన 8 వేల కోట్ల రూపాయల ఫీజ్ రియంబర్స్ మెంట్ బకాయిలని చెల్లించాలి అని డిమాండ్ చేస్తూ ఈ నెల 15 నుండి ఇంజనీరింగ్, ఫార్మాసి, BED, MBA, MCA, లా, నర్సింగ్ తదితర వృత్తి విద్యా కళాశాల లు బంద్ చేస్తునట్లు తెలంగాణ ఉన్నత విద్యాసంస్థల యాజమాన్య సమాఖ్య అధ్యక్షు, ప్రధాన కార్యదర్సుల సంఘం తెలియ జేసింది. హైదరాబాద్ లో అత్యవసర సమావేశం అనంతరం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.