Wednesday, 6 May 2026

Blog

ఆంధ్రప్రదేశ్

“రక్తపు చుక్క – ప్రాణపు దీపం” పొట్నూరు గిరీష్ పుట్టినరోజు సందర్భంగా మెగా రక్తదాన శిబిరం

సాధారణంగా పుట్టినరోజు అంటే కేక్ కట్‌చేసి, కొవ్వొత్తులు ఆర్పి, పూలతో శుభాకాంక్షలు అందుకోవడమే. కానీ తెలుగు కవిరత్న పొట్నూరు గిరీష్ గారి ఆలోచన మాత్రం భిన్నం. ఆయనకు పుట్టినరోజు అంటే సేవకు సంకేతం, మానవత్వానికి ముద్ర, రక్తపు చుక్కతో ప్రాణపు దీపం వెలిగించడం. సేవను వేడుకగా మార్చిన కవి 13 సెప్టెంబర్ 2025న గిరీష్ గారి పుట్టినరోజు. ఈ పుట్టినరోజును ఆయన వ్యక్తిగత ఆనందంగా కాకుండా, సమాజానికి ఉపయోగపడే మహోత్సవంగా మార్చుకున్నారు. “జన్మదినం అనేది ఒక్కరి పుట్టుకకే కాదు, మరొకరి ప్రాణానికి పునర్జన్మ ఇవ్వగల రోజు” అనే నమ్మకంతో ఆయన ముందుకొచ్చారు. మోక్ష బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలోఈ స్ఫూర్తిదాయక ఆలోచనతో 14 సెప్టెంబర్ 2025 (ఆదివారం) న నరసన్నపేటలోని శర్వాణి విద్యాలయం వేదికగా మెగా రక్తదాన శిబిరం జరుగనుంది. ఈ కార్యక్రమాన్ని మోక్ష బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. శతాధిక రక్తదాతలు పాల్గొనబోతున్నారు. రక్తదానం – రక్తస్నానం కాదు, రక్షణ. రక్తదానం చేయడం అంటే మనం ఏదైనా కోల్పోవడం కాదు; ఒకరి ప్రాణాన్ని కాపాడడం. మన శరీరంలో తిరిగి పునరుత్పత్తి అయ్యే చుక్కలతో, మరొకరి ప్రాణం నిలబెట్టడం కన్నా గొప్ప దానం మరొకటి లేదు. ఇదే “రక్తదానం మహాదానం” అన్న తాత్పర్యం. నిర్వాహకులు మాట్లాడుతూ –”మన రక్తం మరొకరి శిరాలో ప్రవహించి ప్రాణం కాపాడినప్పుడు, అదే నిజమైన పుట్టినరోజు ఉత్సవం అవుతుంది. గిరీష్ గారి ఆలోచన ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయంగా నిలుస్తుంది” అని పేర్కొన్నారు. రక్తదానం చేయదలచిన వారు గిరీష్ బ్లడ్ వింగ్ – 8333083883ను సంప్రదించాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. 🌹 ఒక చిన్న కవితా స్పర్శ 🌹 జన్మదినం జ్ఞాపకం కాదు, జన్మదానం కావాలి, రక్తపు చుక్క రేపటి ఆశను వెలిగించాలి.

తిరుపతి

మంత్రి కందుల దుర్గేష్ మర్యాదపూర్వం కలిసిన అంజూరు చక్రధర్

శుక్రవారం తిరుపతి లో రీజనల్ టూరిజం ఇన్వెస్టర్ ల సమావేశం నకు విచ్చేసిన సినిమాట్రోగ్రపీ మరియు సాంస్కృతిక టూరిజం శాఖ మంత్రి వర్యులు జనసేనపార్టీ నాయకులు శ్రీ కందుల దుర్గేశ్ ని గ్రాడ్ రిడ్జ్ హటల్ నందు జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యదర్శి అంజూరు చక్రధర్ గారు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

నాగర్‌కర్నూల్

సీతారాం ఏచూరి ఆశయాలను కొనసాగిస్తాం సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు గుంపల్లి అశోక్

పున్నమి ప్రతినిధి నాగర్ కర్నూలు జిల్లా సెప్టెంబర్ 12 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలంలో సీతారాం ఏచూరి ఆశయాలను కొనసాగిస్సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు గుంపల్లి అశో సిపిఎం అఖిల భారత మాజీ కార్యదర్శి సీతారాం ఏచూరి ఆశయాలను కొనసాగిస్తామని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు గుంపల్లి అశోక్ అన్నారు శుక్రవారం ఏచూరి మొదటి వర్ధంతి సందర్భంగా బిజినపల్లి మండల కేంద్రంలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయంగా జాతీయంగా కమ్యూనిస్టు విలువలను కమ్యూనిస్టుల గొప్పతనాన్ని తెలియజేసేందుకు తన వంతు కృషి చేశారని అన్నారు విద్యార్థి నాయకుడిగా ఇందిరా గాంధీ యొక్క ఎమర్జెన్సీలో ఆమెపై చేసిన పోరాటం జేఎన్యు అధ్యక్షురాలుగా రాజీనామా చేసేంతవరకు విడిచిపెట్టలేదని అన్నారు యూపీఏ, ఇండియా కూటమి ఏర్పాటలో కీలక పాత్ర పోషించాడని అన్నారు ప్రస్తుతం ఉన్న రాజకీయ అనిస్థితిలో ఏచూరి గారు లేకపోవడం తీరని లోటని అన్నారు ప్రజా సమస్యలపై పాసిస్తూ విధానాలపై అలుపెరుగని పోరాటాలు నిర్వహించినప్పుడే ఏచూరి గారికి ఘనమైన నివాళి అని అన్నారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు కేశ చంద్రశేఖర్ మల్లేష్ సంతోష్ మల్లేష్ రమేష్ మహమూద్ శ్రీను రాములు తదితరులు పాల్గొన్నారు

తిరుపతి

శ్రీకాళహశాస్తిలో స్కిట్ ఇంజనీరింగ్ కళాశాల ను సందర్శించిన జేఎన్టీయూ వీసీ, ఎమ్మెల్యే బొజ్జల

ఈ రోజు శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం అనుబంధ కళాశాల గా ఉన్న SKIT కళాశాలను జేఎన్టీయూలో విలీనం చేసుకున్న సందర్భంగా జేఎన్టీయూ వీసీ కళాశాలను పరిశీలించి తరగతులు ప్రారంభించుటకు సన్నాహాకాలు పరిశీలనకు విచ్చేశారు.వారు శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డితో కలిసి స్కిట్ కాలేజీ ని సందర్శించారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అసంపూర్తిగా మిగిలిన భవనాలను పనుల్లో నాణ్యత లోను రాజీ లేకుండా సకాలంలో పూర్తిచేసి నిర్ణీత సమయానికే క్లాసులను కూడా ప్రారంభించాలని అదేవిధంగా ప్రభుత్వం నుండి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందజేస్తామని తెలిపారు.

తిరుపతి

రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కు ఘన సన్మానం తలపా దామోదరం రెడ్డి

తొట్టంబేడు మండలం దిగువ సాంబయ్యపాలెం నందు గల ఫౌండేషన్ స్కూల్లో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయునిగా పనిచేయు కయ్యూరు బాలసుబ్రమణ్యం కి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ఇచ్చిన నేపథ్యంలో శ్రీకాళహస్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తలపా దామోదరం రెడ్డి ఆధ్వర్యంలో వారిని ఘనంగా సన్మానించడం జరిగినది.ఈ సందర్భంగా తలపా దామోదరం రెడ్డి మాట్లాడుతూ బాల సుబ్రహ్మణ్యం ఉపాధ్యాయులు గానే,కాక,కవిగా,రచయితగా,మిమిక్రీ కళాకారులుగా,విద్యార్థులకు చేరువై సరళీకృతమైనటువంటి పద్ధతిలో విద్యను అందించడంలో వారు ఎనలేని కృషి చేస్తున్నారని వారిని కొనియాడారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

తిరుపతి

టిడిపి నాయకులు మృతికి సంతాపం

ఈరోజు తొట్టంబేడు మండలం చోడవరం గ్రామం తెలుగుదేశం నాయకుడు అయినటువంటి ఎర్రయ్య గారు సోదరుడు చోడవరం దామోదరం గారు స్వర్గస్తులైనారు. వారి భౌతికయానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను మన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి గారి తల్లి బొజ్జల బృందం గారు పరామర్శించారు.

ఖమ్మం

🚩సెప్టెంబర్ 17న కేంద్ర ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవం

పున్నమి Daily న్యూస్ ప్రతినిధి: T.Ravinder ఖమ్మం 🚩సెప్టెంబర్ 17న కేంద్ర ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుతున్న సందర్భంగా ది:13-09-2025వ తారీకున రాష్ట్రవ్యాప్తంగా నిజాం కు వ్యతిరేకంగా పోరాటాలు చేసి, నిజాం నిరంకుశ రజాకార్ల చేతుల్లో ప్రాణాలు అర్పించిన అనేకమంది యోధుల స్మారక స్తూపాలను సందర్శించే కార్యక్రమంలో భాగంగా….. 1)ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో సుబ్లేడ్ గ్రామంలో నిజాం పాలన కు వ్యతిరేకంగా పోరాటం చేసిన ఇమ్రోజ్ పత్రిక ద్వారా నిజాం పాలనను వ్యతిరేకంగా వార్తలు రాస్తూ తెలంగాణ ప్రజలను చైతన్య పరిచిన షోయబుల్లా ఖాన్ గారి జన్మస్థలమైనటువంటి సుబ్లేడ్ గ్రామంలో వారి విగ్రహానికి నివాళులు అర్పించే కార్యక్రమం. ఉదయం 10:00 గంటలకు. 2) విలేకరుల సమావేశం ఖమ్మం కోణార్క్ హోటల్ నందు మధ్యాహ్నం 12:00 గంటలకు. 3) ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు జమలాపురం కేశవరావు గారి విగ్రహానికి నివాళులు అర్పించే కార్యక్రమం సాయంత్రం 3:00 గంటలకు కలదు. ఈ కార్యక్రమాలకు రాష్ట్రం నుంచి ముఖ్య అతిథిగా తెలంగాణ విమోచన దినోత్సవ రాష్ట్ర కన్వీనర్ MLC అంజి రెడ్డి గారు , జాతీయ నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర కోశాధికారి దేవకీ వాసుదేవరావు గారు, జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు గారు, మరియు స్వాతంత్ర సమరయోధులు, గ్రామ ప్రజలు, పాల్గొంటారు కావున.భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు,మండల నాయకులు అందరూ తప్పకుండా పాల్గొనవలసినదిగా విజ్ఞప్తి.🙏 ఇట్లు. ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు గారు సేవా పక్షం ఖమ్మం జిల్లా కన్వీనర్ అల్లిక అంజయ్య గారు కో కన్వీనర్స్ జిల్లా ఉపాధ్యక్షరాలు మంద సరస్వతి గారు,నల్లమాస్ శ్రీనివాస్ గారు, దూద్దుకూరి కార్తీక్ గారు, రాఘవ గారు సూచన: రాష్ట్ర, జిల్లా నాయకులు,మండల అధ్యక్షులు,మండల నాయకులు ఉదయం 9 గంటలకి పాలేరు చేరుకోవలెను,అక్కడ వారికి స్వాగతం పలికి పాలేరు నుంచి నరసింహుల గూడెం రోడ్డు మీదుగా సుబ్లేడు చేరుకుంటాము..

శ్రీకాళహస్తిలో పెట్రోల్ దొంగలు

శ్రీకాళహస్తి మున్సిపల్ ఆఫీస్ గేటు వద్ద ఉన్నటువంటి పార్కింగ్ స్థలంలో నిత్యం శ్రీకాళహస్తి నుంచి శ్రీ సిటీ కి వెళ్తూ ఉద్యోగస్తులు అక్కడ వారి యొక్క ద్విచక్ర వాహనములు పార్కింగ్ చేసి ఆయా కంపెనీ బస్సుల్లో వెళ్తారు.ఈ క్రమంలో ఈరోజు యధావిధిగా వాహనాలను పార్కింగ్ స్థలంలో ఉంచగా ఒక 15 సంవత్సరాల కలిగిన ఇద్దరు బాలురు అక్కడ పార్క్ చేసి ఉన్న వాహనాల్లో నుంచి పెట్రోల్ దొంగతనం చేసి తీసుకొని పోతుంటే స్థానికులు చూసి వాళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నించారు.అయితే వాళ్ళ అక్కడి నుంచి పారిపోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది.

ఆంధ్రప్రదేశ్

*బయో పర్టిలైజర్ , యూరియా వినియోగం అవగాహన ర్యాలీ*

నాయుడుపేట, సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి దిలీప్ కుమార్)నాయుడుపేటలో బయో ఫెర్టిలైజర్ మరియు యూరియ వాడకం పై వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కల్పిస్తు ర్యాలీ నిర్వహించారు. నాయుడుపేట వ్యవసాయ శాఖ కార్యాలయం నుండి బజారు వీధి ద్వారా పాత బస్టాండ్ వరకు ఈ అవగాహన ర్యాలీ నిర్వహించారు అనంతరం పాత బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద మానవహారంగా ఏర్పడి రైతులకు అవగాహన కల్పిస్తూ నినాదాలు చేశారు ,ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది మరియు రైతులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.