Wednesday, 6 May 2026

Blog

తిరుపతి

శ్రీకాళహస్తిలో పెట్రోల్ దొంగలు

శ్రీకాళహస్తి మున్సిపల్ ఆఫీస్ గేటు వద్ద ఉన్నటువంటి పార్కింగ్ స్థలంలో నిత్యం శ్రీకాళహస్తి నుంచి శ్రీ సిటీ కి వెళ్తూ ఉద్యోగస్తులు అక్కడ వారి యొక్క ద్విచక్ర వాహనములు పార్కింగ్ చేసి ఆయా కంపెనీ బస్సుల్లో వెళ్తారు.ఈ క్రమంలో ఈరోజు యధావిధిగా వాహనాలను పార్కింగ్ స్థలంలో ఉంచగా ఒక 15 సంవత్సరాల కలిగిన ఇద్దరు బాలురు అక్కడ పార్క్ చేసి ఉన్న వాహనాల్లో నుంచి పెట్రోల్ దొంగతనం చేసి తీసుకొని పోతుంటే స్థానికులు చూసి వాళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నించారు.అయితే వాళ్ళ అక్కడి నుంచి పారిపోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది.

ఆంధ్రప్రదేశ్

*బయో పర్టిలైజర్ , యూరియా వినియోగం అవగాహన ర్యాలీ*

నాయుడుపేట, సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి దిలీప్ కుమార్)నాయుడుపేటలో బయో ఫెర్టిలైజర్ మరియు యూరియ వాడకం పై వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కల్పిస్తు ర్యాలీ నిర్వహించారు. నాయుడుపేట వ్యవసాయ శాఖ కార్యాలయం నుండి బజారు వీధి ద్వారా పాత బస్టాండ్ వరకు ఈ అవగాహన ర్యాలీ నిర్వహించారు అనంతరం పాత బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద మానవహారంగా ఏర్పడి రైతులకు అవగాహన కల్పిస్తూ నినాదాలు చేశారు ,ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది మరియు రైతులు పాల్గొన్నారు.

కర్నూలు

రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఉండవెల్లి సిరిదేవిని మర్యాదా పూర్వకంగా కలసిన దేవనకొండ నాయకులు

రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఉండవెల్లి సిరిదేవిని. మర్యాద పూర్వకంగా దేవనకొండ ఎమ్మార్పీఎస్ నాయకులు మార్చపురం వీరన్న గారు మాదిగ అంజయ్య గారు మాదిగ నాగరాజు గారు మాదిగ నాగేష్ గారు

తిరుపతి

పాపా నాయుడుపేట జూనియర్ కళాశాల నందు విద్యార్థులకు మిషన్ శక్తి సంకల్ప పై అవగాహన

శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలం పాపా నాయుడుపేట లోని జూనియర్ కళాశాల నందు విద్యార్థులకు మిషన్ శక్తి సంకల్ప పై అవగాహన కార్యక్రమం ఐసిడిఎస్ సూపర్వైజర్ అనిత వాణి ఆధ్వర్యంలో నిర్వహించారు. విద్యార్థులకు బాలల హక్కులు,గుడ్ టచ్ మరియు బ్యాడ్ టచ్ గురించి,జీవన నైపుణ్యాలలో భాగంగా స్వీయ సంరక్షణ మొదలగు అంశాల గురించి అవగాహన కల్పించడం జరిగింది. పిల్లలందరూ భవిష్యత్తు లక్ష్యం పైన ఈ రోజున సంకల్పం చేసుకొని దానికి సరిపోయేలాగా రోజువారి ప్రణాళికను తయారు చేసుకుని పాటించాలని తెలియజేశారు.కిశోర బాలికల పోషకాహారం,జీవన నైపుణ్యాలు మొదలగు అంశాల గురించి అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం మారయ్య కళాశాల ప్రిన్సిపల్ జి ప్రభాకర్ రెడ్డి నోడల్ ఆఫీసర్ ఉమా అంగన్వాడి టీచర్లు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

కొండాపురం మండల జనసేన పార్టీ అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆదర్వం లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం…

కొండాపురం :సెప్టెంబర్ 12 : (పున్నమి న్యూస్ ప్రతినిధి ):// వేములపాటి అజయ్ కుమార్ సూచనల మేరకు కొట్టే వెంకటేశ్వర్లు గారి సారథ్యంలో కొండాపురం మండలం జనసేన పార్టీ అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆధ్వర్యంలో నూతన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమం ఈరోజు అంగరంగ వైభవం గా ప్రారంభించారు.వెంకట్ మాట్లాడుతూ రాబోయే రోజులో పార్టీ ని బలోపేతం చేసి ప్రజల సమస్యలు ఎల్లవేళలా పరిష్కారం చేసే వీధంగా ముందుకు వెళ్తామని చెప్పుకొచ్చారు. అదేవిధంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో ఎన్డీఏ కూటమి సభ్యులు విజయానికి తమ వంతు కృషి చేస్తామని చెప్పారు.ఈ కార్యక్రమంలో ఉదయగిరి నియోజకవర్గం 8 మండలాల అధ్యక్షులు , ముఖ్య నాయకులు, జనసేన నాయకులు , కార్యకర్తలకు , వీర మహిళలకు , జనసైనికులకు, మెగా అభిమానులు పాల్గొని విజయవంతం చేసారు.పై కార్యక్రమం లో కొండాపురం మండల ఉపాధ్యక్షులు అక్బర్ బాషా,రామనజపురం నీటి సంఘము అధ్యక్షులు ఆకుల వెంకటేశ్వర్లు, మండల కార్యవర్గ సభ్యులు బోట్లపాటి తిరుమల వాసు, పుప్పాల శ్రీనివాసులు, గిరి, వీర మహిళ ధనలక్ష్మి, వేముల మనిష్,కంచుపాటి మహేంద్ర, మధు, చిరంజీవి, మూలగిరి శ్రీనివాసులు, నారాయణ మరియు నియోజకవర్గం జనసేన నాయకులు నిమ్మలపల్లి రామ చైతన్య పాల్గొన్నారు.

భక్తి

ఆఫ్ఘనిస్తాన్ లో దొరికిన నరసింహుడు

సెప్టెంబర్ 12 పున్నమి ప్రతినిధి@గెడ్డం ప్రతాప్ నరసింహుడు ఆయుధంపై విశ్రాంతి తీసుకుంటున్న ఈ విగ్రహము ఆఫ్ఘనిస్తాన్ ను పాలించిన హిందూ షాహీల కాలం (850-1026) నాటిది. వీళ్ళు భారత ఉపఖండంలోని కాబూల్ లోయ, గాంధార, పశ్చిమ పంజాబ్‌ ( ప్రస్తుత పాకిస్థాన్) ప్రాంతాలను పాలించారు. ఇక ఈ విగ్రహం ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికాకు ఏలా చేరిందో తెలియదు. న్యూయార్క్ లోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ (MET) లో ఉంచారు.

ఖమ్మం

RTC లో యాత్ర దానం

పున్నమి ప్రతినిధి సత్తుపల్లి సత్తుపల్లి RTC డిపో పరిధిలో యాత్ర దానం అనే సరి కొత్త పథకం ని ప్రారంభం చేయనునట్లుగా డిపో మేనేజర్ రాజ్యలక్ష్మి తెలియజేసారు. వృద్దులు, దివ్యంగులు, నిరుపేద విద్యార్థుల కీ పుణ్యక్షేత్రాలు, పర్యాటక కేంద్రాలని ఉచితంగా చూపించడమే ఈ పధకం యొక్క ప్రధాన ఉద్దేశం అని దీనికి కార్పొరేట్ సంస్థ లు, ప్రజాప్రతినిధుల సహకారం తో ఈ పధకం నడుస్తుంది అని తెలిపారు. బుకింగ్ కోసం 9959225962 9866619189 నెంబర్ లలో సంప్రదించాలని కోరారు

ఆంధ్రప్రదేశ్

పున్నమి ప్రతినిధి నిర్మల్ సెప్టెంబర్: కీర్గుల్ కె శ్రీ రామాలయం నిర్మాణం అప్రూవల్ చేయండి అధికారులతో మాట్లాడిన శ్రీ నారాయణ్ రావు పాటిల్ గారు ఈరోజు బైంసా టౌన్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో *ముధోల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మాజీ శాసనసభ్యులు శ్రీ బోస్లే నారాయణరావు పాటిల్* గారిని మర్యాదపూర్వకంగా కలిసిన బాసర మండలం లోని కీర్గుల్ కె గ్రామస్తులు తమ గ్రామంలో గతంలో శ్రీ రామాలయం దేవాలయ టెండర్ అప్రూవల్ చేయించాలని గ్రామస్తులు శ్రీ నారాయణ్ రావు పాటిల్ గారిని కోరడం జరిగింది వారికి సానుకూలంగా స్పందించి వెంటనే అధికారులతో ఫోన్లో మాట్లాడి అతి త్వరలోనే శ్రీ రామాలయం టెండర్ అయినటువంటి ప్రొసీడింగ్ ని వెంటనే అప్రూవల్ చేయాలని అధికారులతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముత్యం రెడ్డి గారు మరియు మాజీ సర్పంచ్ దేవేందర్ గారు మరియు ముధోల్ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గంగారెడ్డి గారు మరియు తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

ఏపీలో ఆటో డ్రైవర్లకు వాహన మిత్ర షెడ్యూల్ విడుదల..

సెప్టెంబర్ 12 పున్నమి ప్రతినిధి@గెడ్డం ప్రతాప్ ఏపీలో ఆటో డ్రైవర్లకు వాహన మిత్ర షెడ్యూల్ విడుదల.. సెప్టెంబర్ 12 ఇప్పటికే ఉన్న 2.75 లక్షల మంది డేటా ను సచివాలయాలకు పంపించడం సెప్టెంబర్ 17 కొత్త దరఖాస్తులు ఆహ్వానం సెప్టెంబర్ 24తుది జాబితా

విశాఖపట్నం

*కొత్త కారు కొన్న ఆనందం కొద్దిసేపు కూడా నిలబడలేదు..!

నిమ్మకాయలు తోకించబోయి 27 లక్షలు కారు షోరూమ్ మొదటి అంతస్తు నుంచి కిందకు పడేసిన మహిళ. న్యూఢిల్లీ: ప్రారంభమే అంతిమపాదం అన్న చందంగా.ఓ మహిళ కొత్త కారు కొన్నా ఆనందంలో మొదటి నిమ్మకాయ తోకించాలనీ కారు ఎక్కింది. పొరపాటున యాక్సిలరేటర్‌పై కాలు వేసింది. ఇంకేముంది ఆ కారు కాస్త మోదటి అంతస్తు నుంచి కిందకి పడిపోయింది. ఇపుడు ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది స్థానిక మీడియా కథనాల ప్రాకారం ఢిల్లీ ఘజియాబాద్లోని మాని పవార్ అనే ఒక మహిళా ఇటివల్లే 27 లక్షలు రూపాయలు విలువైన థార్ కారును తీసుకోవడానికి మహీంద్రా షోరూమ్‌కి వెళ్లింది. కొత్త కారు బయటకి తిసుకెల్లె ముందు పూజ చేయలని మాని పవార్ భావించారు. ఇ సందర్బంగా ఆమె షోరూమ్ మొదటి అంతస్తులోనే ఆమె థర్ ఎస్ యు వి తో నిమ్మకాయలు తోకించారు ఐతే అనుకోకుండా ఆమె యాక్సిలరేటోరును తోకడంతో వాహనం కంట్రోల్ చేయలేకపోయారు. ఇంకేముంది ఆ కారు కాస్తా మొద‌టి అంత‌స్తునుండి కిందకు దూసుకెళ్లింది. వాహనం షోరూమ్ లోని అడ్డాలను బద్దలుకొట్టుకుంటూ, కింద ఉన్న రోడ్డుపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదం సంభవించిన సమయంలో మణి, ఆమె భర్త ప్రదీప్ నిర్మాణ్, షోరూమ్ సిబ్బంది కార్లో ఉన్నారు. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం… ఎయిర్‌బ్యాగ్‌లు పనిచేసి కాబటి వారికి ఏలాంటి గాయాలు కాలేదు. ప్రమాదం జరిగిన వెంటనే బాదితులను దగ్గరలోని ఆసుపత్రికి తారలించి చికిత్స అందజేసారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.