Wednesday, 6 May 2026

Blog

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఒక్కసారి వరి వేస్తే ఆరు సార్లు కోత

సెప్టెంబర్ 12 పున్నమి ప్రతినిధి @ 17 దేశాలతో పాటు తమిళనాడు, ఒడిశాలో ప్రయోగాత్మక సాగుకు శ్రీకారం. ఒక్కసారి నాట్లేసి మూడేళ్లలో వరుసగా ఆరు సార్లు పంట కోసుకునే రోజులు రానున్నాయి. ఇలాంటి వరిని ‘పెరెన్నియల్‌ రైస్‌'(పీఆర్‌) అంటున్నారు. ఈ విలక్షణ వరి వంగడాలను రూపొందించుకున్న చైనా ఏడేళ్లుగా సాగు చేస్తోంది. ఉత్పత్తి ఖర్చులు 40% మేరకు తగ్గుతాయి. నికరలాభం పెరుగుతుంది. పనిలో పనిగా భూసారం, జీవవైవిధ్యం కూడా పెరుగుతుంది. చైనా తదితర దేశాల్లో ఏటేటా పీఆర్‌ వరి సాగు విస్తరిస్తోంది. భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్‌) కూడా దీనిపై తాజాగా దృష్టి సారించింది. ‘ఫార్మింగ్‌ సిస్టం’ జర్నల్‌ తాజా సంచికలో భారతీయ వరి పరిశోధనా సంస్థ (ఐఐఆర్‌ఆర్‌) శాస్త్రవేత్త డాక్టర్‌ విజయకుమార్‌ షణ్ముగం రాసిన అధ్యయన పత్రం ఆధారంగా ప్రత్యేక కథనం ఖర్చులు పెరిగిపోవటం, ఆదాయం తగ్గిపోవటం, నీటి అవసరాలు పెరగటం, భూసారం క్షీణించటం, హరితగృహ వాయువులతో పర్యావరణానికి తీరని హాని జరగటం.. ఇవీ ప్రస్తుతం మన దేశంలో వరి వ్యవసాయాన్ని వేధిస్తున్న సవాళ్లు. దాదాపు ఈ సమస్యలన్నిటికీ ఏకకాలంలో చెక్‌ పెట్టే అద్భుతమైన ‘పెరెన్నియల్‌ రైస్‌’ వంగడాలను చైనా శాస్త్రవేత్తలు రూపొందించారు. ఈ వరి వంగడాలను చైనాలో రైతులు ఏడేళ్లుగా సాగు చేస్తున్నారు. సాధారణంగా వరి పంటను ఒక్కసారి నాటితే ఒక్కసారే పంట చేతికి వస్తుంది. తర్వాత సీజన్‌లో మళ్లీ దున్ని, దమ్ము చేసి, నాట్లు వేసుకుంటున్నాం. ఈ వంగడం ఒక్కసారి నాటితే చాలు. మొత్తంగా చూస్తే పీఆర్‌ వరుసగా 6 సీజన్లలో తిరిగి పెరిగే వరి పంటను కోసుకోవచ్చు. పటిష్టంగా ఉండే కుదుళ్లు పంట కోసిన తర్వాత మళ్లీ చిగురించి, పిలకలన్నీ మొదటి పంటలాగే ఏపుగా పెరగటం పీఆర్‌23 వంగడం ప్రత్యేకత.

క్రైమ్

కాకినాడ ఎంపీకి సైబర్ షాక్.. వాట్సాప్ డీపీతో రూ.92 లక్షలు కొట్టేసిన కేటుగాళ్లు

కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ‘టీ-టైమ్’ సంస్థలో భారీ మోసం ఎంపీ ఫొటోతో వాట్సాప్‌లో నమ్మించిన సైబర్ నేరగాళ్లు రూ.92 లక్షలు బదిలీ చేసిన ఫైనాన్స్ మేనేజర్ ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సైబర్ ఫ్రాడ్ కేవలం రూ.7 లక్షలు మాత్రమే ఫ్రీజ్ చేసిన పోలీసులు సెప్టెంబర్ 12 పున్నమి ప్రతినిధి జనసేన పార్టీ కాకినాడ ఎంపీ, ‘టీ-టైమ్’ సంస్థ అధినేత ఉదయ్ శ్రీనివాస్ పేరును అడ్డం పెట్టుకుని సైబర్ నేరగాళ్లు భారీ మోసానికి తెరలేపారు. ఎంపీ ఫొటోను వాట్సాప్ ప్రొఫైల్ చిత్రంగా పెట్టి, ఆయన సంస్థకే చెందిన ఫైనాన్స్ మేనేజర్‌ను నమ్మించి ఏకంగా రూ.92 లక్షలు కాజేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అస‌లేం జ‌రిగిందంటే..! టీ-టైమ్ సంస్థలో చీఫ్ ఫైనాన్స్ మేనేజర్‌గా పనిచేస్తున్న గంగిశెట్టి శ్రీనివాసరావుకు గత నెల 22న ఓ అపరిచిత నంబర్ నుంచి వాట్సాప్ సందేశం వ‌చ్చింది. ఆ నంబర్ ప్రొఫైల్ ఫొటోగా ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ చిత్రం ఉండటంతో అది ఆయనేనని శ్రీనివాసరావు భావించారు. తాను కొత్త నంబర్ వాడుతున్నానని, అత్యవసరంగా కొంత డబ్బు పంపాలని సైబర్ నేరగాళ్లు సందేశాలు పంపారు. తన యజమానే అడుగుతున్నారని పూర్తిగా విశ్వసించిన మేనేజర్, ఎటువంటి క్రాస్ చెక్ చేసుకోకుండా నేరగాళ్లు సూచించిన వేర్వేరు బ్యాంకు ఖాతాలకు మొత్తం 11 విడతల్లో రూ.92 లక్షలు బదిలీ చేశారు. ఈ నెల 8న ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ తన కంపెనీ బ్యాంకు ఖాతాలను తనిఖీ చేస్తుండగా కొన్ని అనుమానాస్పద లావాదేవీలను గుర్తించారు. వెంటనే ఫైనాన్స్ మేనేజర్‌ను ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. తాను డబ్బుల కోసం ఎలాంటి సందేశాలు పంపలేదని, తన ఫోన్ నంబర్ కూడా మారలేదని ఎంపీ స్పష్టం చేయడంతో మేనేజర్ నివ్వెరపోయారు. తాము మోసపోయామని గ్రహించిన వెంటనే వారు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, నగదు బదిలీ జరిగిన రెండు వారాల తర్వాత ఫిర్యాదు అందడంతో అప్పటికే నేరగాళ్లు ఎక్కువ మొత్తాన్ని డ్రా చేసుకున్నారు. పోలీసులు తక్షణమే స్పందించి కేవలం రూ.7 లక్షల మొత్తాన్ని మాత్రమే ఫ్రీజ్ చేయగలిగారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

అన్నమయ్య

విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలి – ప్రధానోపాధ్యాయులు

స్టేట్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మండల స్థాయి క్రీడా పోటీలకు చిట్వేల్ పరిషత్ ఉన్నత పాఠశాల వేదిక కానుంది. ఈనెల 18, 19 తేదీల్లో జరిగే ఈ పోటీలను మండల విద్యాశాఖ అధికారులు కోదండనాయుడు, ఈశ్వరయ్య మరియు ప్రధానోపాధ్యాయులు దుర్గరాజు ప్రకటించారు. అండర్-14, అండర్-17 విభాగాల్లో బాలురు, బాలికలకు కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, బ్యాడ్మింటన్, యోగ, అథ్లెటిక్స్, చెస్ తదితర ఏడు క్రీడల్లో పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. 18న గేమ్స్, 19న అథ్లెటిక్స్ పోటీలు జరుగనున్నాయి. కేజీబీవీలు, మోడల్ స్కూల్స్, హైస్కూల్ ప్లస్‌లోని ఇంటర్ విద్యార్థులు నేరుగా జిల్లా స్థాయి ఎస్‌జి‌ఎఫ్ గేమ్స్‌లో పాల్గొనవచ్చని పేర్కొన్నారు. అర్హత గల క్రీడాకారుల జాబితా, మధ్యాహ్న భోజన అటెండెన్స్ ఫార్మ్‌లు వెంట తీసుకురావాలని పీడీలు, పిఇటీలకు సూచించారు. మరిన్ని వివరాలకు ప్రధానోపాధ్యాయులు 9966173441లో సంప్రదించవచ్చని తెలిపారు.

అన్నమయ్య

ప్రమాద బాధితుడు కుశల్ రాజుకు రూ.1 లక్ష ఆర్థిక సహాయం – ముక్కా వరలక్ష్మి

రైల్వే కోడూరు మండలం మాధవరం పొడు గ్రామానికి చెందిన శంకర్‌వల్లి కుశల్ రాజు గారు ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తన కాలు కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితిని గమనించిన రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇంచార్జ్ & కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి గారి సతీమణి ముక్కా వరలక్ష్మి గారు బాధిత కుటుంబానికి అండగా నిలిచారు. స్వీయ నిధుల ద్వారా రూ.1 లక్ష ఆర్థిక సహాయం అందించి, కుశల్ రాజు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రజల కష్టసుఖాల్లో ఎల్లప్పుడూ తోడుగా ఉండటం తమ కుటుంబ బాధ్యత అని ఆమె స్పష్టం చేశారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, స్థానిక టిడిపి నాయకులు పాల్గొని, ముక్కా వరలక్ష్మి గారి సహృదయతను కొనియాడారు.

అన్నమయ్య

పార్ట్‌టైం ఉద్యోగాల మోసాలపై జాగ్రత్త : చిట్వేల్ ఎస్‌ఐ హెచ్చరిక

పార్ట్‌టైం ఉద్యోగాల పేరుతో మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో చిట్వేల్ పట్టణ ఎస్‌ఐ నవీన్‌బాబు ప్రజలకు అప్రమత్తం అయ్యేలా సూచించారు. ఇంట్లో కూర్చునే సులభంగా లక్షల్లో సంపాదించవచ్చని చెప్పే ఆన్‌లైన్ ప్రకటనలు, వాట్సప్, ఫేస్‌బుక్, టెలిగ్రామ్ ద్వారా వచ్చే సందేశాలను నమ్మరాదని ఆయన హెచ్చరించారు. ఇప్పటికే పలువురు ఇటువంటి ఆఫర్ల వలలో పడి డబ్బులు కోల్పోయారని గుర్తుచేశారు. ముఖ్యంగా బ్యాంక్ ఖాతా నంబర్లు, ఆధార్, పాన్ కార్డు వంటి వివరాలు పంచుకుంటే పెద్ద మోసాలకు గురయ్యే అవకాశం ఉందని తెలిపారు. అనుమానాస్పద మెసేజ్‌లు వచ్చిన వెంటనే డిలీట్ చేసి, అవసరమైతే సమీప పోలీస్‌స్టేషన్ లేదా సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కి కాల్ చేయాలని సూచించారు. ప్రజల జాగ్రత్తతోనే ఈ మోసగాళ్లకు అడ్డుకట్ట వేయవచ్చని ఎస్‌ఐ నవీన్‌బాబు స్పష్టం చేశారు.

హైదరాబాద్

నేడు CP రాథ కృష్ణ ప్రమాణ స్వీకారం

పున్నమి ప్రతినిధి భారత 15 వ ఉప రాష్ట్ర పతి గా CP రాధ కృష్ణ నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఉదయం 10 గంటల 5 నిముషాలకీ రాష్ట్ర పతి భవన్ లో జరిగే కార్యక్రమం లో రాష్ట్ర పతి ద్రౌపది మూర్మ్ ప్రమాణస్వీకారం చేయించానున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇతర నాయకులు పాల్గొననున్నారు.

తిరుపతి

శ్రీకాళహస్తిలో భక్తులను దోచుకుంటున్న ప్రయివేట్ సెక్యూరిటీ సిబ్బంది

శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని దర్శించుకోవడం కోసం వివిధ ప్రాంతాల నుండి వేల మంది భక్తులు దేవస్థానానికి వస్తుంటారు. భక్తులు దైవ సన్నిధిలో నిద్రించడానికి ఇష్టపడతారు.అయితే దేవస్థానంలో రూముల కొరత కారణంగా కొంత మంది భక్తులు దేవస్థాన బిక్షాల గోపురం దగ్గర గల కళారాధన మండపంలో నిద్రిస్తుంటారు.అయితే వారి నుండి ప్రయివేట్ సెక్యూరిటీ సిబ్బంది డబ్బులు వసూలు చేస్తున్నట్లు భక్తులు తెలియజేసారు.దీనిపై ఆలయ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.

భక్తి

రాష్ట్రంలో 7 దేవస్థానాలకు ట్రస్ట్ బోర్డు సభ్యులను నియమించిన ప్రభుత్వం

సెప్టెంబర్ 12 పున్నమి ప్రతినిధి @ శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లి దేవస్థానం, తిరుపతి. శ్రీ కుమార రామ భీమేశ్వర స్వామి వారి దేవస్థానం, సామర్లకోట, కాకినాడ జిల్లా. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం, అమలాపురం, అంబేద్కర్ కోనసీమ జిల్లా. శ్రీ వీరేశ్వరస్వామి వారి దేవస్థానం, మురమళ్ళ గ్రామం, అంబేద్కర్ కోనసీమ జిల్లా. శ్రీ అస్వర్త నారాయణ & భీమలింగేశ్వర స్వామి వారి దేవస్థానం, ఏ.పప్పూరు గ్రామం, అనంతపురం జిల్లా. శ్రీ చౌడేశ్వరి అమ్మవారి దేవస్థానం, నందవరం గ్రామం, నంద్యాల జిల్లా. శ్రీ సహస్ర లింగేశ్వర స్వామి & శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానం, పొన్నూరు, గుంటూరు జిల్లా

ఆంధ్రప్రదేశ్

ఉపాధి హామీ పథకం కూలీల వేతన బకాయిల విడుదల

సెప్టెంబర్ 12 పున్నమి ప్రతినిధి @ఆంధ్రప్రదేశ్ : ఉపాధి హామీ పథకం కింద కూలీలకు నెలల తరబడి పేరుకుపోయిన వేతన బకాయిలను విడుదల చేస్తూ కేంద్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులిచ్చింది. ప్రస్తుతం ఖరీఫ్ తో పాటు త్వరలోనే రబీ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఉపాధిహామీ పథకం కూలీలు వ్యవసాయ పనులపై ఆధారపడుతున్నారు. దీంతో ప్రస్తుతం రోజుకు సరాసరిన 2 వేల మందికి మించి కూలీలు పనులకు రావడం లేదని అధికారులు అంటున్నారు.

ఆంధ్రప్రదేశ్

అక్టోబర్ 31 వరకు కార్డులో మార్పులు, చేర్పులు ఉంటే చేయించుకోవచ్చు

సెప్టెంబర్ 12 పున్నమి ప్రతినిధి @ గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది మాత్రమే ఇంటింటికీ వచ్చి రేషన్ కార్డులు ఇస్తారు.. అక్టోబర్ 31 వరకు కార్డులో మార్పులు, చేర్పులు ఉంటే చేయించుకోవచ్చు వచ్చే వారం నుంచి మనమిత్ర వాట్సాప్ యాప్ లో కూడా కార్డులు అందుబాటులో ఉంటాయి ఆన్లైన్ లో కూడా కరెక్షన్స్ చేసుకోవచ్చు – మంత్రి నాదెండ్ల మనోహర్.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.