Wednesday, 6 May 2026

Blog

నాగర్‌కర్నూల్

డిండికి నీటి తరలింపును అడ్డుకుంటా : మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 13 నగర్ కర్నూలు జిల్లా * పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల రిజర్వాయర్ నుంచి 50 టీఎంసీల నీటిని తరలించే ప్రభుత్వ నిర్ణయంపై ఆగ్రహం * ఉమ్మడి పాలమూరులో 36 లక్షల ఎకరాలు సాగుభూమి – నీరు అందేది కేవలం 7 లక్షల ఎకరాలకు మాత్రమే * కల్వకుర్తి ఎత్తిపోతలలో మూడు మోటర్లు మాత్రమే పనిచేస్తున్నాయి – రెండు మోటార్లు కాలిపోయి రెండేళ్లు – కొత్తవి ఎందుకు బిగించలేదని ప్రశ్న నల్లమల్ల బిడ్డగా రేవంత్ రెడ్డి చెప్పుకుంటూ పనులు పూర్తి చేయడంలో విఫలమయ్యారని విమర్శ * రాజకీయాలను వ్యాపారమయం చేస్తున్నారంటూ ఆవేదన * శ్రీశైలం ద్వారా డిండికి నీరు తరలిస్తే అభ్యంతరం లేదని – కానీ ఎత్తిపోతల ద్వారా తరలిస్తే సహించేది కాదని స్పష్టం * నల్లగొండ జిల్లాకు ఇప్పటికే సాగునీరు అందుతోందని – పాలమూరుకు అన్యాయం చేయొద్దని డిమాండ్ * రాజకీయాలకు అతీతంగా అక్రమ నీటి తరలింపును అడ్డుకోవాలని పిలుప

నాగర్‌కర్నూల్

_హెల్త్ అసిస్టెంట్ యాదగిరి (గిరి) గారిని పరామర్శించిన మాజీ మంత్రివర్యులు

*_హెల్త్ అసిస్టెంట్ యాదగిరి (గిరి) గారిని పరామర్శించిన మాజీ మంత్రివర్యులు డాక్టర్ నాగం జనార్దన్ రెడ్డి_* *_గత కొన్ని రోజుల నుండి యాదగిరి (గిరి) అనారోగ్యానికి గురి అయ్యారు ప్రస్తుతం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో హేమంత్ న్యూరో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు ఆ విషయం తెలుసుకుని ఈరోజు హాస్పిటల్ కి వెళ్లి వారిని పరామర్శించిన మాజీ మంత్రివర్యులు డాక్టర్ నాగం జనార్దన్ రెడ్డి_*

తెలంగాణ

పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో నిర్మించిన ఏ ఆర్ డి ఎస్ పి రెసిడెన్సీ క్వార్టర్స్ ను ప్రారంభించిన : మంత్రి

నకిరేకల్ :సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి ) నల్గొండ జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో నిర్మించిన ఏ ఆర్ డి ఎస్ పి రెసిడెన్సి క్వార్టర్స్, సీఐ, ఎస్ ఐ, క్వార్టర్స్, శిశువివాహార్లను, రాష్ట్ర రోడ్డు, భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మంత్రి మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శిథిలావస్థలో ఉన్న పోలీస్ అధికారులు,సిబ్బంది క్వార్టర్స్ ను తొలగించి వాటి స్థానంలో కొత్త క్వార్టర్లను నిర్మిస్తున్నామని, ఇందులో భాగంగానే అవసరమైన చోట 232 కోట్ల రూపాయలతో పోలీస్ కోటర్స్ నిర్మాణం చేపట్టినట్టు వెల్లడించారు. ఇంకా ఎక్కడైనా ఇలాంటి స్థితిలో క్వార్టర్స్ ఉన్నట్లయితే గుర్తించి వాటి స్థానంలో కొత్త వాటిని నిర్మించే విధంగా చర్యలు తీసుకోవాలని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండి రమేష్ రెడ్డిని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా 232కోట్ల రూపాయలతో పోలీసు అధికారులు, సిబ్బంది క్వార్టర్స్ నిర్మాణం చేపట్టడం జరిగిందని మంత్రి తెలిపారు.

తిరుపతి

శ్రీకాళహస్తి ఎమ్మెల్యే కి కృతజ్ఞతలు:ది కోపరేటివ్ టౌన్ బ్యాంక్ నూతన కమిటి

శనివారం శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డికి నూతనంగా ఎన్నికైన ది కోపరేటివ్ టౌన్ బ్యాంక్ చైర్మన్ షేక్.ఖాదర్ బాషా మరియు CO M.ధనుంజనేయులు మరియు కమిటీ మెంబర్స్ A.మురళి,A.బాబు రెడ్డి,P.ఆర్ముగమ్,M.దొరబాబు,K. అనిల్ కుమార్,P. రాంబాబు,N.గోవర్ధన్,Pకవిత ఎమ్మెల్యే నివాసం నందు కలిసి ఘనంగా సన్మానించి ఎమ్మెల్యే కి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అందరూ కలిసికట్టుగా పనిచేసి శ్రీకాళహస్తి పట్టణానికి మంచి పేరు తీసుకు రావాల్సిందిగా తెలియజేసి నూతనంగా ఎన్నికైన చైర్మన్ మరియు కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

కర్నూలు

గోనెగండ్ల మండలంలో చింతల ముని నల్ల రెడ్డి స్వామి వారి దశమి సందర్భంగా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే Dr జయనాగేశ్వర రెడ్డి గారు దర్శించడం జరిగింది

గోనెగండ్ల మండలం చింతల ముని నల్లారెడ్డి స్వామి వారి దశమి సందర్భంగా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ రెడ్డి గారు బండలాగు పోటీలను ప్రారంభించడం జరిగింది అలాగే చింతల ముని నల్లారెడ్డి స్వామినీ దర్శించారు అలాగే ఆర్టీసీ బస్టాండ్ దగ్గర కొండ వ్యాపారం చేసే సుభద్రమ్మ గారికి స్వర్గీయమైన బివి మోహన్ రెడ్డి గారి జ్ఞాపకార్థం జ్ఞాపకార్ధకంగా పండ్ల బండి బహుకరించడం జరిగింది అలాగే వర్షాల కారణంగా గాజులదిన్నె ప్రాజెక్టుకు వరద నీరు నాలుగువేల క్యూసెక్కులు చేరడం వలన రెండు గేట్లు ఎత్తడం జరిగింది

నాగర్‌కర్నూల్

టి పి సి సి ఉపాధ్యక్షులు ఎమ్మెల్యే డాక్టర్. చిక్కుడు వంశీకృష్ణ ను శాలువాతో సన్మానం:

అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ శాలువాతో సన్మానించిన కొడిదేల రాము.ఈ సందర్భంగా నాగర్ కర్నూలు జిల్లా యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు కొడదెల రాము మాట్లాడుతూ ఈరోజు నల్లమల్ల ముద్దుబిడ్డ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జననేత ప్రజా నాయకుడు ప్రజల మధ్యలో నిత్యం ఉండే నాయకుడు తెలంగాణ టిపిసిసి ఉపాధ్యక్షులు అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ జన్మదిన సందర్భంగా ఆయనను శాలువతో ఘనంగా సన్మానించిన నాగర్ కర్నూల్ జిల్లాయూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు కొడదెల రాము కార్యక్రమంలో కాంగ్రెస్ యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

మండల పోలింగ్ బూత్ లలో ప్రతి కార్యకర్త సేవా కార్యక్రమాలు నిర్వహించాలి. గనిశెట్టి

13/ 9/ 2025 శనివారం అమలాపురం రూరల్ మండలం భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు బొంతు శివాజీ అధ్యక్షతన, పేరూరు గ్రామం, ఎస్ కే బి ఆర్ కాలేజీ పక్కన భాజాపా సీనియర్ కార్యకర్త ఈరి కోటేశ్వరరావు స్వగృహం నందు సమావేశం నిర్వహించడం జరిగింది.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భాజపా జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి వెంకటేశ్వరరావు, జిల్లా కార్యదర్శి, అమలాపురం రూరల్ మండలం ఇంచార్జ్ రేఖాడి సత్యనారాయణ వర్మ హాజరై ఈ ఇరువురు మాట్లాడుతూ సెప్టెంబర్ 17 వ తారీకు గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదినం పురస్కరించుకొని సేవాపక్షోత్సవాలు పేరుతో మండలంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని మండల పదాధికారులకు, పార్టీ కార్యకర్తలకు సూచన చేశారు.. ఈ కార్యక్రమానికి పార్టీ సీనియర్ నాయకులు జంపన బుచ్చిరాజు, మట్టపర్తి సత్యనారాయణ, దేవదాసు నాగార్జున ప్రసాద్, భాజపా జిల్లా కార్యవర్గ సభ్యులు గుమ్మళ రెడ్డి నాయుడు, భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాశిన ఫణీంద్ర, మండల కార్యదర్శి కలిగినేడి శ్రీనివాస్, పేరూరీ వెంకటేశ్వరరావు, మండల యువమోర్చా నాయకులు బైరిశెట్టి సాయిబాబు మరియు తదితరులు పాల్గొన్నారు..

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

జాతీయ లోక్ అదాలత్ లో 90 కేసులు పరిష్కారం ముమ్మిడివరం కోర్టు

జాతీయ లోక్ అదాలత్ లో 90 కేసులు పరిష్కారం ముమ్మిడివరం కోర్టు ప్రాంగణంలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ లో 90 కేసులు పరిష్కరించినట్లు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్, జూనియర్ సివిల్ జడ్జి మహమ్మద్ రహమతుల్లా పేర్కొన్నారు. వీటిలో ఓఎస్ టైటిల్ 2 కేసులు ఓఎస్ మనీ 2 కేసులు ఇందులో అమౌంట్ Rs. 3, 36,000/- ఐపిసి సీసీలు 26 కేసులు ఇందులో అమౌంట్ Rs.2,70,000/- ఎక్సైజ్ కేసులు 39 అమౌంట్ Rs. 2,13,620/- అడ్మిషన్ కేసులు 4 అమౌంట్ Rs. 44,000/- బ్యాంకు పి ఎల్ సి 10 అమౌంట్ Rs. 4,33,000/- బిఎస్ఎన్ఎల్ పి ఎల్ సి 7 సెటిల్ అమౌంట్ Rs. 5,236/- సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు సీసీలు 70 కేసులు సెటిల్ అమౌంట్ Rs.7,00,000/- ఎస్టీసీలు 46 కేసులు సెటిల్ అమౌంట్ Rs.22,000/- మొత్తం కేసులు సెటిల్ అమౌంట్ Rs. 20,23,856/- అపరాధ రుసుము వసూలు చేసినట్లు తెలిపారు. ఈ లోక్ అదాలత్ లో ఏ జి పి కాశి సిద్ధార్థ కుమార్ అడ్వకేట్స టి నాగ రాజా రావు బీర ప్రసాద్ బాబు జి శ్రీనివాసరావు కే ఎల్ వి ప్రసాద్ రావు , ఎం అలీ ,కె అఖిలేష్ కోర్టు సిబ్బంది, పోలీస్ , కక్షిదారులు పాల్గొన్నారు.

నాగర్‌కర్నూల్

సాయుధ పోరాటాన్ని బిజెపి వక్రీకరిస్తుంది : సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు గుంపల్లి అశోక్

పున్నమి ప్రతినిధి నాగర్కర్నూల్ జిల్లా సెప్టెంబర్ 13 వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని బిజెపి వక్రీకరిస్తున్నదని ఈ పోరాటానికి బిజెపికి ఎటువంటి సంబంధం లేకున్నా ప్రజలను తప్పుదో పట్టించి పబ్బం గడుపుకోవాలని ఆలోచిస్తున్నదని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు గుంపల్లి అశోక్ విమర్శించారు శనివారం సిపిఎం రాష్ట్ర కమిటీ ముద్రించిన బుక్లెట్స్ ను మండల కేంద్రంలో విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూమి కోసం భుక్తి కోసం వెట్టిచాకిరి విముక్తి కోసం జరిగిన సాహిద రైతాంగ పోరాటాన్ని హిందూ ముస్లింల గొడవగా చిత్రీకరించే ప్రయత్నం బిజెపి చేస్తున్నదని అన్నారు విమోచన దినం అంటూ సభలు పెట్టుకొని ఆనందం పొందడం తెలంగాణ ప్రజలను కుల మతాలకు అతీతంగా జరిగిన ఈ పోరాటాన్ని వక్రీకరించడం దుర్మార్గమని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు చంద్రశేఖర్ మల్లేష్ సంతోష్ మల్లేష్ మహమూద్ తదితరులు పాల్గొన్నారు

నాగర్‌కర్నూల్

సాయుధ పోరాటాన్ని బిజెపి వక్రీకరిస్తుంది : సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు గుంపల్లి అశోక్

పున్నమి ప్రతినిధి నాగర్కర్నూల్ జిల్లా సెప్టెంబర్ 13 వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని బిజెపి వక్రీకరిస్తున్నదని ఈ పోరాటానికి బిజెపికి ఎటువంటి సంబంధం లేకున్నా ప్రజలను తప్పుదో పట్టించి పబ్బం గడుపుకోవాలని ఆలోచిస్తున్నదని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు గుంపల్లి అశోక్ విమర్శించారు శనివారం సిపిఎం రాష్ట్ర కమిటీ ముద్రించిన బుక్లెట్స్ ను మండల కేంద్రంలో విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూమి కోసం భుక్తి కోసం వెట్టిచాకిరి విముక్తి కోసం జరిగిన సాహిద రైతాంగ పోరాటాన్ని హిందూ ముస్లింల గొడవగా చిత్రీకరించే ప్రయత్నం బిజెపి చేస్తున్నదని అన్నారు విమోచన దినం అంటూ సభలు పెట్టుకొని ఆనందం పొందడం తెలంగాణ ప్రజలను కుల మతాలకు అతీతంగా జరిగిన ఈ పోరాటాన్ని వక్రీకరించడం దుర్మార్గమని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు చంద్రశేఖర్ మల్లేష్ సంతోష్ మల్లేష్ మహమూద్ తదితరులు పాల్గొన్నారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.