Wednesday, 6 May 2026

Blog

ఆంధ్రప్రదేశ్

సేవతో వేడుక – పొట్నూరు గిరీష్ పుట్టినరోజు ప్రత్యేకం పుట్టినరోజు = సేవా దినం

సాధారణంగా పుట్టినరోజు అంటే కేక్ కట్ చేసి, కొవ్వొత్తులు ఆర్పి, పూలతో శుభాకాంక్షలు అందుకోవడమే. కానీ తెలుగు కవిరత్న పొట్నూరు గిరీష్ గారి ఆలోచన మాత్రం భిన్నం. ఆయనకు పుట్టినరోజు అంటే సేవకు సంకేతం, మానవత్వానికి ముద్ర, రక్తపు చుక్కతో ప్రాణపు దీపం వెలిగించడం.రక్తదానం – ప్రాణదానం 13 సెప్టెంబర్ 2025న గిరీష్ గారి జన్మదినం. ఈ రోజును ఆయన వ్యక్తిగత ఆనందంగా కాకుండా, సమాజానికి ఉపయోగపడే మహోత్సవంగా మలిచారు.“జన్మదినం అనేది ఒక్కరి పుట్టుకకే కాదు, మరొకరి ప్రాణానికి పునర్జన్మ ఇవ్వగల రోజు” అనే నమ్మకంతో ముందుకొచ్చారు. గిరీష్ ఆధ్వర్యంలో మెగా బ్లడ్ క్యాంప్ మోక్ష బ్లడ్ బ్యాంక్ సహకారంతో, 14 సెప్టెంబర్ 2025 (ఆదివారం), నరసన్నపేట శర్వాణి విద్యాలయం వేదికగా మెగా రక్తదాన శిబిరాన్ని స్వయంగా పొట్నూరు గిరీష్ గారు నిర్వహించారు.ఈ స్ఫూర్తిదాయక కార్యక్రమంలో ఇరవైకి పైగా రక్తదాతలు పాల్గొని తమ సేవా భావాన్ని చాటుకున్నారు. గిరీష్ గారి మాటల్లో“రక్తదానం – రక్తస్నానం కాదు, రక్షణ. మన శరీరంలో తిరిగి పునరుత్పత్తి అయ్యే రక్తపు చుక్కలతో మరొకరి ప్రాణం నిలబెట్టడం కన్నా గొప్ప దానం లేదు. పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేయడం వల్ల నా ఆనందం మరింత రెట్టింపైంది” అని గిరీష్ గారు తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతమైన శుభ సందర్భంగా మోక్ష బ్లడ్ బ్యాంక్ వారు గిరీష్ గారిని దుశ్శాలువతో సన్మానించారు 🌹 కవితా స్పర్శ 🌹 జన్మదినం జ్ఞాపకం కాదు,జన్మదానం కావాలి,రక్తపు చుక్క రేపటి ఆశను వెలిగించాలి.

ఖమ్మం

భూ సేకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి. ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి

ఖమ్మం పున్నమి ప్రతినిధి ఖమ్మం జాతీయ రహదారుల నిర్మాణం పనులు త్వరగతిన పూర్తి చేయడానికి మిగులు భూ సేకరణ ప్రక్రియ త్వరగతిన పూర్తి చేయాలి అని ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దూరి శెట్టి అధికారులని ఆదేశించారు. ఆదివారం ఖమ్మం కలెక్టర్ క్యాంపు కార్యలయం లో జాతీయ రహదారులు నిర్మాణం పురోగతి పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఖమ్మం దేవరపల్లి, అమరావతి నాగ్ పూర్ జాతీయ రహదారి నిర్మాణం నిర్ణత సమయం లోపు పూర్తి అయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు.

తూర్పు గోదావరి

బాబు ష్యురిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలోపాల్గొన్న మాజీ ఎమ్మెల్యే తలారి

పున్నమి న్యూస్ ప్రతినిధి కొవ్వూరు (సెప్టెంబర్14) చాగల్లు మండలం చంద్రవరం గ్రామంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే తలారి వెంకటరావు,ఎంపీపీ మట్టా వీరాస్వామి, చాగల్లు మండల అధ్యక్షులు మట్టా వెంకట్రావు గారు చెల్లింకుల దుర్గ మల్లేశ్వర రావు ,బొర్రా కృష్ణ తదితర నాయకులు కార్యకర్తల బాబు ష్యురిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

సృష్టి” విశ్వకర్మ జయంతి యజ్ఞోత్సవం

” డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం బిజెపి కార్యాలయంలో ఈరోజు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ నేతృత్వంలో ఒబిసి మోర్చా ఆధ్వర్యంలో ప్రియతమ భారత ప్రధాని నరేంద్రమోడీ గారు అమరావతి రాజధాని కోసం భూమిపూజ చేసిన ఉద్దండరాయుని పాలెం లో ది.17.09.2025 విశ్వకర్మ జయంతి యజ్ఞోత్సవం కార్యక్రమం జరుగుతుంది అందులో బాగంగా కోనసీమ జిల్లా వ్యాప్తంగా ఉన్న పంచ కర్మలను ఆహ్వానించాలని పని విభజన చేసి కార్యాచరణ నిర్దేశించారు జిల్లా ఇంచార్జి పసుపులేటి మహాలక్ష్మిరావు ఈ కార్యక్రమం లో జిల్లా కన్వీనర్ ఇళ్ళ సత్యనారాయణ జిల్లా ప్రధాన కార్యదర్శి కొప్పనాతి దత్తాత్రేయ కోటిపల్లి దుర్గారావు వీర్నాల రమణబాబు మట్టా సూరిబాబు యనమదల వెంకట రమణ కుడిపూడి శేఖర్ కుడిపూడి సూర్యనారాయణ శ్రీమతి గొల్లకోటి దుర్గ కముజు శ్రీనివాస్ ఈశ్వర్ గౌడ్ బొంతు శివాజీ సానబోయిన సత్యనారాయణ కుడిపూడి దావీదు కోటిపల్లి సాయిబాబు కట్టా నారాయణ మూర్తి మొదలగు బీజేపీ నాయకులు పాల్గొన్నారు ఈ కార్యక్రమం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం బీజేపీ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు

క్రైమ్

లోక్ అదాలత్ ద్వారా 4625 కేసులు పరిష్కారం. సీపీ సునీల్ దత్ వెల్లడి

పువ్వాడ నాగేంద్ర కుమార్ (పున్నమి ఖమ్మం జిల్లా స్టాఫ్ రిపోర్టర్) ఖమ్మం జాతీయ లోక్ ఆడాలాత్ ద్వారా జిల్లా వ్యాప్తంగా 4625 కేసులు పరిష్కారం అయ్యాయి అని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలియజేసారు. రాజీ కీ అవకాశం ఉండి పరిష్కారం అయ్యే కేసులని జాతీయ లోక్ అదాలత్ ద్వారా 4625 కేసులు పరిష్కారం చేశామని వీటిలో FIR కేసులు 712,ఈ పెట్టి కేసులు 775, డ్రంక్ & డ్రైవ్ కేసులు 2972, మైనర్ డ్రైవింగ్ లు 8, సైబర్ కేసులు 158 కేసులని జాతీయ లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించబడినట్లు అలాగే మొత్తం 52,11,246 రూపాయలు బాధితులకి అంద జేసినట్లు కమిషనర్ సునీల్ దత్ తెలియజేసారు.

తూర్పు గోదావరి

తోట చిన్న రామారావు కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ మంత్రి జవహర్.

పున్నమి న్యూస్ ప్రతినిధి కొవ్వూరు (సెప్టెంబర్14) కొవ్వూరు మండలం పెనకనమెట్ట గ్రామ వాస్తవ్యులు తోట చిన్న రామారావు (బుల్లబ్బి) సతీమణి తోట వెంకట లక్ష్మి ఇటీవల మరణించటం జరిగింది. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్, మాజీ మంత్రి వర్యులు కె.ఎస్ జవహర్

కామారెడ్డి

శిశుమందిర్ కామారెడ్డి లో ఘనంగా రాష్ట్ర స్థాయి సైన్స్ ఫెయిర్

*పున్నమి ప్రతినిధి కామారెడ్డి సెప్టెంబర్ 14* *ఘనంగా ప్రాంత స్థాయి గణిత, సంస్కృతి విజ్ఞానమేళ సమారోప్,* స్థానిక శ్రీ సరస్వతీ విద్యా మందిర్ హై స్కూల్ కామారెడ్డి లో గణితం & సైన్స్ విభాగాలలో 450 ప్రదర్శనలు ప్రదర్శించడం జరిగింది. కామారెడ్డి పట్టణంలోని 8 ప్రైవేటు పాఠశాల విద్యార్థులంతా వచ్చి తిలకించారు. మూడు రోజుల పాటు భోజన స్నాక్స్ అల్పాహారం అందరికీ ఏర్పాటు చేశారు. ఈ విధంగా సైన్స్ ఫెయిర్ మూడు రోజులు రోజుల్లో(12,13,14 తేదీలలో) భాగంగా ఈరోజు అనగా 14 /09 /2025 ఆదివారం రోజున సమారోప్ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి అతిథిగా కాటిపల్లి వెంకట రమణారెడ్డి గారు ( కామారెడ్డి శాసనసభ సభ్యులు) విచ్చేసి మాట్లాడుతూ చదువు ఒకటే ముఖ్యం కాదని చదువుతోపాటు మన సంస్కృతి సాంప్రదాయాలు ఉండాలని తెలిపారు. మన సంస్కృతికి సాంప్రదాయాలకు మంచి క్రమశిక్షణకు శిశు మందిరాలు పెట్టిన పెరు అని తెలిపారు ఆ దేశానికి స్వాతంత్రం కోసం ఎంతోమంది తమ జీవితాన్ని త్యాగం చేశారని తెలిపారు నలుగురికి సహాయం చేసే గుణం అలవర్చుకోవాలని తెలిపారు స్వార్థం విడవాలని తెలిపారు పెద్దలను గౌరవించాలి తల్లిదండ్రులను గౌరవించాలని తెలిపారు .అతిథిగా శ్రీ మదన్ మోహన్ గారు (ఎల్లారెడ్డి శాసనసభ సభ్యులు) విచ్చేసి మాట్లాడుతూ చదువు అన్నింటికంటే ముఖ్యమని తెలిపారు చదువు తోనే ఏదైనా సాధించగలమని నేను కూడా అలాగే చదివానని తెలిపారు మారుతున్న కాలానుగుణంగా మనం కూడా టెక్నాలజీని మంచి కోసం ఉపయోగించుకోవాలని, దుర్వినియోగం చేరాదని తెలిపారు వక్త శ్రీ అర్ధచంద్ర ప్రకాష్ రెడ్డి (సంచలన సమితి సహకార దర్శి) గారు, మాట్లాడుతూ లిపిలేని సమయంలో మన దేశం ఋగ్వేదము వ్రాయబడిందని అని తెలిపారు. సున్నా ను కనుగొన్నది భారతీయులను తెలిపారు. విద్యార్థులు తయారుచేసిన వివిధ రకాల ప్రదర్శనలు మరియు నృత్యాలు సాంస్కృతిక ప్రదర్శనలు చూపర్లను ఎంతో ఆకట్టుకున్నాయి ప్రాంత స్థాయిలో ఎంపికైన ప్రదర్శనలకు, క్షేత్రస్థాయిలో పోటీ ఉంటుందని తెలిపారు ఉత్తమ ప్రదర్శన కనబడచిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యక్షులు శ్రీ శ్యామ్ సుందర్ గారు, శ్రీ గంగారెడ్డి గారు (పాఠశాల ఉపాధ్యక్షులు) శ్రీ నల్లన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులు గారు (ప్రాంత శైక్షనిక్ ప్రముఖ్) రెడ్డి గారి హరిస్మరన్ రెడ్డి గారు (తెలంగాణ పూర్వ విద్యార్థి పరిషత్ అధ్యక్షులు) శ్రీ బోర్డు శంకర్ గారు గారు, శ్రీ గిరెడ్డి రాజిరెడ్డి గారు,( జిల్లా కార్యదర్శి) , శ్రీ రణజిత్ మోహన్ గారు, శ్రీ భాస్కర రావు గారు, శ్రీ మల్లేష్ యాదవ్ గారు, శ్రీ అనిల్ రెడ్డి గారు, శ్రీ రాజేందర్ గౌడ్ గారు, శ్రీ రఘు కుమార్ గారు, శ్రీ ప్రతాప్ గౌడ్ గారు, శ్రీ పక్కి శ్రీనివాస్ గారు,. (విభాగ్ శైక్షనిక్ ప్రముఖ్) పాఠశాల ప్రధానాచార్యులు శ్రీ నల్ల నాగభూషణం గారు అకాడమిక్ ప్రిన్సిపల్ శ్రీ నాగేష్ గారు, వివిద విభాగాల శైక్షనిక్ ప్రముఖ్ లు,ఆచార్యులు మాతాజీలు పాల్గొన్నారు

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

మిరాయ్ హిట్ తో మావూళ్లమ్మతల్లి ఆలయంలో పూజలు*

* కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలోని మిరాయ్ సినిమా సూపర్ హిట్ తో కాట్రేనికోన మావుళ్లమ్మతల్లి దేవాలయంలో సినీనటుడు పుష్ప సురేష్ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు . తేజ సజ్జ హీరోగా నటించిన ఈ చిత్రంలో తనకు అవకాశం కల్పించిన పీపుల్స్ మీడియా నిర్మాతలకు , దర్శకులకు సురేష్ శర్మ కృతజ్ఞతలు తెలిపారు . మావుళ్లమ్మ తల్లి ఆలయం వద్ద నాటకాలు, భజనలు చేసిన తనకు అమ్మ వారి ఆశీస్సులతో నటుడిగా పుష్ప సినీరంగంలో గుర్తింపునిస్తే మిరాయ్ సినిమా మరింత పేరును తీసుకొచ్చిందని పుష్ప సురేష్ శర్మ అన్నారు . ఇప్పటి వరకు సుమారు 200కు పైగా టీవీ సీరియళ్లు , 150చిత్రాల్లో తనకు నటుడుగా అవకాశం దొరకడం మావుళ్లమ్మ తల్లి ఆశీస్సులే అన్నారు . ఆలయ ప్రధాన అర్చకుడు ఆణివిళ్ల ఫణికాంత్ మిరాయ్ నటులతో పూజలు నిర్వహించి వేద ఆశీర్వచనం అందజేసారు . ఈసందర్భంగా నటుడు సురేష్ శర్మను బ్రాహ్మణసంఘ నాయకులు డీసీసీ అధికార ప్రతినిధి కంచుస్తంభం సోనీ, మంత్రి ప్రగడ శ్రీనివాస్, తాతపూడి గోపి, ఆణి విళ్ళ ఫణికాంత్ , శంకర్ దేవాసి ,ఈశ్వర్, రవివర్మ , రామకృష్ణ పరమహంస,పవన్, తంబి, తదితరులు సత్కరించారు .

తిరుపతి

ఆటో కార్మికులను ఆదుకోండి: సీఐటీయూ

శ్రీకాళహస్తిలో ని సీఐటీయూ కార్యాలయంలో ఈ నెల 15 న ఆటో కార్మికుల కలెక్టరేట్ ముట్టడి గోడ పత్రికలను విడుదల చేసారు.ఈ సందర్భంగా సీఐటీయూ జిలా ఉపాధ్యక్షులు అంగేరి పుల్లయ్య మాట్లాడుతూ కుటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్త్రీ శక్తి పథకం వలన ఆటో కార్మికులు ఆర్థికంగా నష్టపోతున్నారని ,వారికి ప్రభుత్వం వాహన మిత్ర పథకం క్రింద తక్షణమే 25 వేలు ఆర్థిక సాయం అందివ్వాలని డిమాండ్ చేశారు.యువగళం పాదయాత్రలో నారా లోకేష్ రవాణా రంగ కార్మికులకు వెల్ఫేర్ బోర్డ్ ఏర్పాటు చేస్తామన్న హామీ ఏమైంది ప్రశ్నించారు.ఆటో కార్మికుల సమస్యలపై కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఆంధ్రప్రదేశ్

జిల్లా పేరు తప్పుగా ముద్రా కొత్త స్మార్ట్ రేషన్ కార్డులలో

సెప్టెంబర్ 14 పున్నమి ప్రతినిధి@అమలాపురం రాష్ట్ర ప్రభుత్వం రేషన్ అక్ర మాలకు అడ్డుకట్ట వేస్తూ ఆధు నిక సాంకేతికతతో క్యూఆర్ కోడ్ ఆధారిత స్మార్ట్ రేషన్ కార్డులలో జిల్లా పేరు తప్పుగానమోదైనప్ప టికీ ప్రభుత్వ రాయితీలు సంక్షే మ పథకాలు లబ్ధి యధావిధిగా అందు తుందని స్థానిక రెవెన్యూ డివిజినల్ అధికారి కె మాధవి ఆదివారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు.స్మార్ట్ రేషన్ కార్డుల్లో జిల్లాల పేర్లు, గ్రామాలు, మండ లాలు, ఇతర వివరాల్లో చాల ప్రాంతాల్లో తప్పులు బయటప డుతున్నాయన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరు గతంలో జారీ చేసిన ఆధార్ డేటా ప్రకారం ఉమ్మడి తూర్పుగోదావరి పేరు ప్రస్తుతo కొన్ని ప్రాంతాల స్మార్ట్ కార్డులలో ప్రచురితమైనదని అంత మా త్రాన కార్డుదారులు ఎటువంటి అపోహలకు గురి కావలసిన పని లేదని గతంలో మాదిరిగా కార్డుల ద్వారా అన్ని రకాల సంక్షేమ పథకాల లబ్ధిని, రాయితీని యధావిధిగా పొంద వచ్చునని తెలిపారు. త్వరలో జిల్లా పేరు మార్పుకు సంబం ధించి త్వరలో ఎడిట్ ఆప్షన్ వస్తుందని అప్పుడు ఆన్లైన్ ద్వారా మార్పు చేసు కొనవ చ్చునని మరల కొత్త కార్డు జనరేట్ అవుతుంద న్నారు. స్మార్ట్ రేషన్ కార్డులలో జిల్లాల పేర్లలో తప్పులు ఇటీవల చాలా చోట్ల నమోదయ్యాయనీ ఈ సమస్య పలు జిల్లాల్లో కనిపిం చిందన్నారు. ముఖ్యంగా కొత్త జిల్లాల ఏర్పాటుతో పాత జిల్లా పేర్లు స్మార్ట్ కార్డులలో ముద్రితం అయ్యాయని ఉదాహరణకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అనే బదులు తూర్పు గోదావరి జిల్లా అని రావడం వంటి సమస్యలు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చాయన్నారు. జిల్లాల పునర్విభజన అనం తరం నవీకరణ డేటా సరైన సమయంలో అప్డేట్ కాకపోవడo ప్రింటింగ్ సమయంలో గతంలో జారీ చేసిన ఆధార్ డేటా ఆధారంగా వివరాలు కార్డులపై రావడం, సొంతంగా డిజిటల్ ఎంట్రీ, e-KYC వివరాలు తప్పుగా నమోదవ్వడం జరిగిందన్నారు. స్మార్ట్ రేషన్ కార్డులో ఏమైనా జిల్లా పేరు లేదా ఇతర వివరాల్లో తప్పులు ఉంటే, ప్రజలు తమ గ్రామ,వార్డు సచివాలయాన్ని సంప్రదించి దరఖాస్తు చేసు కోవాలన్నారు. మన మిత్ర యాప్ ద్వారా కూడా ఇంటి వద్దనే స్మార్ట్ ఫోన్ వాట్సాప్ ద్వారా పేర్లు చిరు నామాల పొరపాట్లు సరిది ద్దుకొని వెసులుబాటు ఉంద న్నారు సచివాలయంలో చేంజ్ ఆఫ్ డీటెయిల్స్ రైస్ కార్డ్స్ సేవ ద్వారా అభ్య ర్థించాలన్నారు అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించాలన్నారు. అధి కారులు వివరాలను పరిశీలించి, సరిదిద్దిన తర్వాత కొత్త,కరెక్ట్ కార్డును మళ్ళీ పంపిణీ చేస్తా రన్నారు లేదా డౌన్లోడ్ చేసుకునే సౌకర్యం కల్పిస్తారన్నారు. అక్టోబర్ 30 లేదా 31వ తేదీ వరకు కార్డ్ సవరణలకు అవ కాశం ఉందన్నారు. తప్పుల న్నిటిని త్వరగా గుర్తించి దరఖాస్తు చేసుకోవాలన్నారు. జిల్లాల పేర్లు తప్పులు ఉన్న ప్పటికీ సంక్షేమ పథకాలు ప్రభుత్వ రాయితీలు యధా విధిగా ఎటువంటి అభ్యంత రాలు లేకుండా అధికారులు అందిస్తారని ఆమె స్పష్టం చేశారు. గ్రామ,వార్డు సచివాలయ కార్యాలయాన్ని గానీ, లేదా మీ సేవా కేంద్రాన్ని సంప్రదించాలని మరింత సమాచారం కోసం పౌర సరఫరాల అధికారులతో సంప్ర దించవచ్చునన్నారు స్మార్ట్ రేషన్ కార్డులపై జిల్లాల పేర్లు తప్పుగా వచ్చినట్లయితే సచివాలయం లో దరఖాస్తు చేసుకొని సరిదిద్దుకోవచ్చునన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.