Wednesday, 6 May 2026

Blog

భక్తి

తీర్థయాత్రలు చేయాలనుకునే భక్తులకు ప్రత్యేక రైళ్లు

సెప్టెంబర్ 15 పున్నమి ప్రతినిధి @ తీర్థయాత్రలకు భక్తుల కోసం భారతీయ రైల్వే అనుబంధ సంస్థ IRCTC ప్రత్యేక రైలు, విమాన ప్యాకేజీలను ప్రకటించింది. సెప్టెంబర్ 23 నుంచి 30 వరకు జరిగే ‘దివ్య దక్షిణ యాత్ర’లో తిరువణ్ణామలై, రామేశ్వరం, మధురై, కన్యాకుమారి, త్రివేండ్రం, తిరుచ్చి, తంజావూర్ వంటి ప్రసిద్ధ క్షేత్రాలను దర్శించవచ్చు. ధరలు స్లీపర్ ₹14,100, 3AC ₹22,500, 2AC ₹29,500. పూర్తి వివరాలకు 9701360701, 9281030726, 9281030750 నెంబర్లకు కాల్ చేయవచ్చు. లేదా www.irctctourism.com వెబ్‌సైట్‌లో చూడవచ్చు

పశ్చిమ గోదావరి

ప్రపంచ దేశాల్లో హిందీ భాష అగ్రస్థానం

భీమవరం : హిందీ భాష నేర్చుకుంటే దేశ నలుమూలల తిరగవచ్చునని, ప్రపంచ దేశాల్లో కూడా హిందీ భాషనే ప్రముఖంగా ఉందని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అన్నారు. భీమవరం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో హిందీ భాష దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీవిజ్ఞానవేదిక అధ్వర్యంలో ప్రభుత్వ, ప్రైవేట్ హైస్కూల్ లోని 24 మంది హిందీ ఉపాధ్యాయులను సత్కరించారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ దేవనాగరి లిపిలో వ్రాయబడిన హిందీ భాషను రిపబ్లిక్ ఆఫ్ ఇండియా రెండు అధికారిక భాషలలో హిందీ ఒకటి అని, రెండు అధికారికంగా యూనియన్ స్థాయిలో ఉపయోగించబడతాయని, హిందీని నేడు 250 మిలియన్లకు పైగా ప్రజలు మొదటి భాషగా మాట్లాడుతున్నారన్నారు. గత 26 ఏళ్లుగా హిందీ భాషా దినోత్సవాన్ని నిర్వహించడం అభినందనీయమని నిర్వాహకులు రంగ సాయిని అభినందించారు. కార్యక్రమ నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ పట్టణంలోని వివిధ పాఠశాలలోని 24 మంది హిందీ ఉపాధ్యాయులను సత్కరించామని తెలిపారు. కార్యక్రమంలో పొత్తూరి బాపిరాజు, నందమూరి రాజేష్, భట్టిప్రోలు శ్రీనివాసరావు, టివివి ప్రసాద్, వలవల సాయిబాబా, కే మోహిని, ఎస్ సబనా, కామాక్షి, ఎన్ రాధా తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

రైల్వే రిజర్వేషన్‌ విధానంలో మరో కీలక మార్పు.. అక్టోబర్‌ 1 నుంచి అమల్లోకి

సెప్టెంబర్ 15 పున్నమి ప్రతినిధి @ రైల్వే రిజర్వేషన్‌ విధానంలో మరో కీలక మార్పు.. అక్టోబర్‌ 1 నుంచి అమల్లోకి రిజర్వేషన్‌ విధానానికి సంబంధించి రైల్వే బోర్డు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై సాధారణ రిజర్వేషన్ టికెట్లకూ ఆధార్‌ అథెంటికేషన్‌ను తప్పనిసరి చేసింది.

చిత్తూరు

*భవిష్యత్ తరాలకు న్యాయం చేసేలా పని చేస్తున్న ప్రభుత్వం*

*భవిష్యత్ తరాలకు న్యాయం చేసేలా పని చేస్తున్న ప్రభుత్వం* *విద్యా వ్యవస్థలో సమూల మార్పులతో నాణ్యమైన విద్యా ప్రమాణాలు* *టీడీపీ హయాంలోనే అధిక శాతం ఉపాధ్యాయుల నియామకం* *ఉపాధ్యాయుల సమస్యలన్నీంటి పరిష్కారానికి ప్రభుత్వం కృషి* *గురుపూజోత్సవ కార్యక్రమంలో పలమనేరు ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి* కూటమి ప్రభుత్వం భవిష్యత్ తరాలకు న్యాయం చేయాలని తలంపుతో పనిచేస్తుందని పలమనేరు శాసనసభ్యులు అమర్నాథరెడ్డి పేర్కొన్నారు. గంగవరం మండలంలోని ఓ ప్రైవేటు కల్యాణ మండపంలో జరిగిన పలమనేరు మరియు గంగవరం మండల ఉపాధ్యాయుల గురుపూజోత్సవ కార్యక్రమానికి సోమవారం ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన వారిని ఉద్దేశించి మాట్లాడుతూ…. ఉపాధ్యాయులే సమాజ నిర్దేశ్యకులని భావితరాలను తీర్చిదిద్దాల్సిన బాధ్యత మీదేనన్నారు. అందుకే తెలుగుదేశం ప్రభుత్వం ఉపాధ్యాయులకు సముచిత స్థానం కల్పిస్తూ వస్తోందని టిడిపి హయాంలోనే అధిక శాతం ఉపాధ్యాయ పోస్టులు భర్తీ అయిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇక ప్రస్తుత ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. విద్యావ్యవస్థలో సమూల మార్పులను తీసుకొస్తూ విద్య ప్రమాణాలను పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తోందని తెలిపారు. భవిష్యత్ తరాలకు మంచి విద్యను అందించే రాష్ట్ర అభివృద్ధిలో ఉపాధ్యాయులు కీలక భూమిక పోషించాలని ఆయన కోరారు. అదేవిధంగా స్థానికంగా ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి తన వంతు సహాయ సహకారాలు ఉంటాయని ఆయన వారికి భరోసా కల్పించారు. తదనంతరం ఉత్తమ ఉపాధ్యాయులుగా రాణించిన వారిని సన్మానించి జ్ఞాపికతో పాటు దృవపత్రాలను ఆయన అందజేశారు. చివరిగా త్వరలో పదవీ విరమణ చెందనున్న పలువురు ఉపాధ్యాయులను సైతం ఆయన సన్మానించారు. ఈ కార్యక్రమాలలో గంగవరం, పలమనేరు ఎంఈఓలు లీలారాణి, వేణుగోపాల్ రెడ్డి, బాలసుందరం, శ్రీనివాసులతో పాటు సీనియర్ ఉపాధ్యాయులు తులసీనాదం నాయుడు,లక్ష్మీనారాయణ, సుదర్శన ఆచారి, బాలకృష్ణ, కుబేర్ నాయుడు, సాలెహ, భాస్కర్ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు రాజన్న, సోమశేఖర్ గౌడ్, నాగరాజు రెడ్డి, గణేష్, గిరిధర్ గోపాల్ తదితరులున్నారు..

E-పేపర్

షఫీ ఉల్లా ఆధ్వర్యంలో ఘనంగా హిందీ భాష దినోత్సవం వేడుకలు

అన్నమయ్య జిల్లా నందలూరు మండలంలో గల జిల్లా పరిషత్ఉ న్నత పాఠశాల పాటూరులో హిందీ ఉపాధ్యాయులు షఫీ ఉల్లా ఆధ్వర్యంలో జరిగిన హిందీ భాష దినోత్సవం వేడుకల్లో నందలూరు మండల విద్యాశాఖ అధికారి అనంత కృష్ణ గారు ప్రసంగిస్తూ రాజ్యాంగం ఆమోదించిన భాషలో లో కెల్లా హిందీ అత్యుత్తమైన భాష కాబట్టి దీనిని రాజభాష జాతీయ భాషగా ఎన్నుకోవడం జరిగిందని కాబట్టి మనమంతా జాతీయ భాషను నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాధవి లత మాట్లాడుతూ హిందీ భాష నేర్చుకోవడం వల్ల భారతదేశంలోనే కాక ఇతర దేశాలలో కూడా ఉపాధి అవకాశాలు పొందవచ్చని తెలియజేశారు హిందీ ఉపాధ్యాయులు షఫీ వు ల్ల మాట్లాడుతూ ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే ఆ దేశ ప్రజలు ఆ దేశ భాషను తప్పకుండా నేర్చుకోవాలని చెప్పారు ఈ సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన వ్యాసరచన వకృత్వ పోటీలు స్పీడ్ రీడింగ్ చిత్రలేఖన పోటీలలో మొదటి ద్వితీయ తృతీయ చతుర్ధ పంచమ స్థానాలలో విజేతలకు బహుమతులు అందజేయడం జరిగినది.అలాగే విద్యార్థులకు మాంసంతో కూడినటువంటి పౌష్టిక ఆహారాన్ని షఫీ ఉల్లా అంద చేయటం జరిగింది.

E-పేపర్

షఫీ ఉల్లా ఆధ్వర్యంలో ఘనంగా హిందీ భాష దినోత్సవం వేడుకలు

అన్నమయ్య జిల్లా నందలూరు మండలంలో గల జిల్లా పరిషత్ఉ న్నత పాఠశాల పాటూరులో హిందీ ఉపాధ్యాయులు షఫీ ఉల్లా ఆధ్వర్యంలో జరిగిన హిందీ భాష దినోత్సవం వేడుకల్లో నందలూరు మండల విద్యాశాఖ అధికారి అనంత కృష్ణ గారు ప్రసంగిస్తూ రాజ్యాంగం ఆమోదించిన భాషలో లో కెల్లా హిందీ అత్యుత్తమైన భాష కాబట్టి దీనిని రాజభాష జాతీయ భాషగా ఎన్నుకోవడం జరిగిందని కాబట్టి మనమంతా జాతీయ భాషను నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాధవి లత మాట్లాడుతూ హిందీ భాష నేర్చుకోవడం వల్ల భారతదేశంలోనే కాక ఇతర దేశాలలో కూడా ఉపాధి అవకాశాలు పొందవచ్చని తెలియజేశారు హిందీ ఉపాధ్యాయులు షఫీ వు ల్ల మాట్లాడుతూ ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే ఆ దేశ ప్రజలు ఆ దేశ భాషను తప్పకుండా నేర్చుకోవాలని చెప్పారు ఈ సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన వ్యాసరచన వకృత్వ పోటీలు స్పీడ్ రీడింగ్ చిత్రలేఖన పోటీలలో మొదటి ద్వితీయ తృతీయ చతుర్ధ పంచమ స్థానాలలో విజేతలకు బహుమతులు అందజేయడం జరిగినది.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

నడ్డా ఆధ్వర్యంలో విశాఖలో ఫార్మా రంగ స్టేక్‌హోల్డర్స్ సమావేశం.

ఫార్మా, మెడికల్ డివైసెస్ అభివృద్ధిపై డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి విన్నపం. విశాఖపట్నం, సెప్టెంబర్ 15: ఫార్మా రంగ అభివృద్ధి, భవిష్యత్ అవకాశాలపై ఆదివారం సాయంత్రం హోటల్ దేవి గ్రాండ్ ఇన్ లో జరిగిన స్టేక్‌హోల్డర్స్ సమావేశానికి కేంద్ర మంత్రి జేపీ నడ్డా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో ఫార్మా పరిశ్రమల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు పాల్గొని విస్తృత చర్చలు జరిపారు. ఈ కార్యక్రమానికి ఎస్ ఆర్ సి లాబొరేటరీస్ మేనేజింగ్ డైరెక్టర్, బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి కూడా పాల్గొని మంత్రికి పలు అంశాలపై విన్నవించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ను ఫార్మా రంగంలో జాతీయ హబ్‌గా తీర్చిదిద్దేందుకు కేంద్రం నుంచి మరింత సహకారం అవసరమని కోరారు. పరిశ్రమల విస్తరణతోపాటు మెడికల్ డివైసెస్ తయారీని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. ప్రస్తుతం దేశంలో మెడికల్ డివైసెస్ మార్కెట్ సుమారు 12 బిలియన్ డాలర్ల విలువ కలిగి ఉండగా, 2030 నాటికి అది 50 బిలియన్ డాలర్లకు పైగా పెరుగుతుందని అంచనా వేయబడిందని వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో విశాఖ, అనకాపల్లి, కాకినాడ ప్రాంతాలు మెడికల్ డివైసెస్ తయారీకి అనువైన క్లస్టర్లుగా అభివృద్ధి చేయవచ్చని ఆయన పేర్కొన్నారు. దీని వలన వేలాది కొత్త ఉద్యోగాలు రావడంతో పాటు దేశీయ ఉత్పత్తి పెరుగుదల మరోవైపు ఎగుమతుల వృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. ఫార్మా వ్యర్థాలను శుద్ధి చేసే కామన్ ఎఫ్లుయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ (CETPs) బలోపేతం చేసి, పర్యావరణ అనుకూల ఉత్పత్తికి ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. అలాగే ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఆరోగ్యరంగం ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలను చేరుకుంటోందని అన్నారు. ఔషధాల తయారీలో భారత్ ప్రపంచానికి ‘ఫార్మసీ ఆఫ్ ది వరల్డ్’గా నిలిచిందని, ఇప్పుడు అదే స్థాయి విజయాన్ని మెడికల్ డివైసెస్ రంగంలో సాధించాల్సిన సమయం వచ్చిందని బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. ఈ సమావేశంలో కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ , రాష్ట్ర భారీ పరిశ్రమల మంత్రి టీజీ భరత్ , అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడు సిఎం. రమేష్, పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్ తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

శ్రీకాళహస్తి సబ్ జైల్లో ఎయిడ్స్ పై అవగాహన

సోమవారం ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆదేశాలు మేరకు స్టెప్స్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి సబ్ జైలు నందు ఖైదీలకు హెచ్ఐవి మరియు హెపటైసిస్ -సి పై అవగాహన కార్యక్రమం నిర్వహించి పరీక్షలు చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో స్టెప్స్ ప్రాజెక్ట్ మేనేజర్ భాస్కర్ మాట్లాడుతూ హెచ్ఐవి/ ఎయిడ్స్ వ్యాప్తి కారణాలు, హెచ్ఐవి రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మరియు సుఖ వ్యాధుల గురించి డ్రగ్స్ వాడకం వలన కలిగే ఇబ్బందులు గురించి వివరించి,భారత ప్రభుత్వం చట్టం 2017 ద్వారా హెచ్ఐవి సోకిన వారికి కూడా సమాన హక్కులు గురించి అవగాహన కల్పించడం జరిగింది.ఈ కార్యక్రమంలో సిబ్బంది పవన్ మరియు జైలు సిబ్బంది పాల్గొనడం జరిగింది.

తిరుపతి

వైసిపి నాయకులు పాచి పెంచులయ్య మృతికి సంతాపం తెలిపిన మాజీ ఎమ్మెల్యే

శ్రీకాళహస్తి నియోజకవర్గం,తొట్టంబేడు మండలం,ఇలగనూరు గ్రామ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాచి పెంచులయ్య ఆకస్మిక మృతి చెందారు.కావున నేడు వారి పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించిన మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి,ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి పున్నం వాసుదేవ నాయుడు తదితరులు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని విధాల తమ కుటుంబానికి తోడుగా ఉంటుందని ధైర్యం చెప్పడం జరిగింది.

తిరుపతి

శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్న హరివంశ్ నారాయణ్ సింగ్

ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తికి సోమవారం రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ ,ఎంపీ సుధామూర్తి కుటుంబ సమేతంగా విచ్చేసారు.వారికి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.శ్రీకాళహస్తీశ్వరుని దర్శనానంతరం వేదం పండితుల ఆశీర్వచనం,తీర్ధ ప్రసాదాలు,చిత్ర పటం అందించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.