Wednesday, 6 May 2026

Blog

ఖమ్మం

_ఇన్సూరెన్స్ పాలసీలపై జీఎస్టీ ఎత్తేశారు.. ఈసారి మీరు కట్టే ప్రీమియం ఎంత తగ్గుతుందో తెలుసుకోండి..!!_

పున్నమి Daily న్యూస్ ప్రతినిధి : T.Ravinder ఖమ్మం *_ఇన్సూరెన్స్ పాలసీలపై జీఎస్టీ ఎత్తేశారు.. ఈసారి మీరు కట్టే ప్రీమియం ఎంత తగ్గుతుందో తెలుసుకోండి..!!_* ST on Insurance: సెప్టెంబర్ 3న స్టార్ట్ అయిన 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తీసుకున్న సంస్కరణల గురించి ప్రకటించారు. ఈ క్రమంలో ఇన్సూరెన్స్ పాలసీలపై ఉన్న జీఎస్టీని సున్నాకు తగ్గిస్తున్నట్లు చెప్పారు. గతంలో లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలపై 18 శాతం జీఎస్టీ అమలులో ఉన్న సంగతి తెలిసిందే. చాలా కాలంగా ఈ రంగం జీఎస్టీ రేటును 12 శాతానికి తగ్గించాలని కోరిగా తాజా సంస్కరణల్లో దీనిని ఏకంగా జీరో జీఎస్టీ కేటగిరీలోకి తీసుకొచ్చింది కేంద్రం. మారిన కొత్త జీఎస్టీ రేట్లు సెప్టెంబర్ 22 నుంచి అమలులోకి వస్తున్నాయి. ఉదాహణకు గతంలో ఒక హెల్త్ ఇన్సూరెన్స్ లేదా లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీకోసం ప్రీమియం రూ.10వేలు ఉంటే దానిపై 18 శాతం జీఎస్టీ కలిపితే పాలసీదారులు మెుత్తంగా రూ.11వేల 800 కట్టాల్సి వచ్చేది. అంటే ఇక్కడ రూ.18వందలు జీఎస్టీ అదనంగా పాలసీ ప్రీమియంపై పడేది. కానీ ప్రస్తుతం ఈ జీఎస్టీ రేటును సున్నా శాతానికి తగ్గించటంతో పాలసీదారులు కేవలం రూ.10వేలు పాలసీ మెుత్తం చెల్లిస్తే సరిపోతుంది. అంటే దాదాపు పదివేలకు 18వందల చొప్పున తగ్గింపు అందుకుంటారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మార్పులతో యులిప్ ప్లాన్స్, ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్స్, టర్మ్ ప్లాన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ జీఎస్టీ, జనరల్ ఇన్సూరెన్స్ పాలసీదారులకు ప్రయోజనం కలగనుంది. అసలు సమస్య ఇదే.. ప్రస్తుతానికి పాలసీదారులకు జీఎస్టీ మినహాయింపు ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ.. భవిష్యత్తులో పాలసీ ప్రీమియం రేట్లు పెరగొచ్చనే వాదనలు ఉన్నాయి. ప్రస్తుతం కంపెనీలు పాలసీదారుల నుంచి కలెక్ట్ చేసే ప్రీమియంపై 18శాతం జీఎస్టీ వసూలు చేస్తున్నాయి. ఇదే క్రమంలో వారు చెల్లించే ఏజెంట్ కమిషన్, మార్కెటింగ్ ఖర్చులు, ఆఫీసు అద్దెలపై ప్రభుత్వానికి జీఎస్టీ కడుతున్నాయి. దీంతో జీఎస్టీ చట్టాల కింద వారు పన్నులను వసూలు చేస్తున్న వాటికి చెల్లిస్తున్నవాటిని సర్థుబాటు చేసుకుంటున్నారు. మిగిలిన మెుత్తాన్ని ప్రభుత్వానికి చెల్లిస్తున్నాయి. కానీ ఇకపై ప్రీమియంపై జీఎస్టీ లేకపోవటంతో ప్రభుత్వానికి కట్టే జీఎస్టీ తిరిగి క్లెయిమ్ చేసుకోవటానికి కుదరదు. అందువల్ల కంపెనీలు ఇకపై ఆ భారాన్ని కవర్ చేసుకునేందుకు పాలసీల రేట్లు పెంచుతాయని నిపుణులు అంటున్నారు.

కామారెడ్డి

హ్రియానంద ఆశ్రమంలో 45 చండీ శరన్నవరాత్రులు

*పున్నమి ప్రతినిధి కామారెడ్డి- సెప్టెంబర్ 16* *45వ మహా చండీ శరన్నవరాత్రులు విజయ వంతం చేయాలి* =================================== కామారెడ్డి పట్టణంలో గల చండీ పీఠం శ్రీ హ్రియానంద విద్యా భారతి స్వామి ఆశ్రమంలో 45 వ చండీ శరన్నవరాత్రులు ఈనెల 22 పాడ్యమి ఉదయం 8-30 కి ఆశ్రమ పీఠాధిపతులు శ్రీ నిత్య ముక్త హ్రియానంద స్వామి వారి చేతుల మీదుగా చండీ దీక్షలు, పూజలు ప్రారంభం అవుతాయి. ప్రతి నిత్యం పూజాధికాల, అర్చనలు, అభిషేకాలు, చండీ నవావరణార్చనలు, పారాయణాలు, మంత్ర పుష్పం, తీర్థ ప్రసాదాలు, మహాజన భోజన కార్యక్రమాలు ఉ,, 8-30 నుండి 2-00 వరకు మహా ప్రసాదంతో ముగిసి, సాయంత్రం కూడా యధావిధిగా కార్యక్రమాలు, భజనలు, సత్సంగం, తీర్థ ప్రసాద కార్యక్రమాలు జరుగుతాయి. చివరి మూడు రోజులు గణపతి హవనం, గురు పాదుకాహవనం, చండీ హవనంతో యజ్ఞ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ విధం మహా చండీ శరన్నవరాత్రులు పది రోజులుగా సాగి మహా మంగళహారతి తో అక్టోబర్ 1 తేదినాడు ముగుస్తాయి. ఇట్టి కార్యక్రమాలను స్వామీజీ శిష్య బృందం అనగా చండీ పరవారంమంతా కలిసి హ్రియాంబిక మాత సూచనలతో కార్యక్రమాలన్ని దిగ్విజయముగా నిర్వహించడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని కామారెడ్డి భక్తజనులంతా వినియోగించుకోవాలని అమ్మ వారి అనుగ్రహ ఆశీస్సులు పొందాలని తెలిపారు. ఈ చండీ శరన్నవరాత్రులకు వచ్చి భక్తులంతా నలుపు రంగు దుస్తులు లేకుండా రాగలరని స్వామి జీ, కార్య నిర్వాహక పరివారం ఈ సూచన తప్పకుండా పాటించాలని తెలిపారు.

నాగర్‌కర్నూల్

నాగర్ కర్నూల్ ప్రభుత్వ కళాశాలలో వేడుకలు

పున్నమి ప్రతినిధి నాగర్ కర్నూల్ సెప్టెంబర్ 16 గర్ కర్నూల్ జిల్లా కేంద్రం సమీపంలోని నెల్లికొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ఫ్రెషర్స్ డే వేడుకల్లో పాల్గొన్న మన ప్రియతమ నేత, ఎమ్మెల్యే డా. కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి గారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, నూతన విద్యార్థులను స్వాగతించి, ఉన్నత విద్యలో ముందుకు సాగాలని ప్రోత్సహించారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం తీసుకుంటున్న పథకాల గురించి వివరించారు. అలాగే కళాశాల అభివృద్ధి, కొత్త భవన నిర్మాణాలు, ఆధునిక సదుపాయాల ఏర్పాటు కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. విద్యార్థులు ప్రతిభను కనబరిచి రాష్ట్రానికి, దేశానికి గౌరవం తీసుకురావాలని ఆశాభావం వ్యక్తం చేశారు.” ఈ కార్యక్రమం లో మార్కెట్ కమిటీ చైర్మన్ రమణ రావు గారు, మాజీ కౌన్సిలర్స్, ఉపాధ్యాలు ,విద్యార్థులు పాల్గొన్నారు

ఆంధ్రప్రదేశ్

జిల్లా వ్యాప్తంగా విస్తృతమైన ఎన్ఫోర్స్మెంట్ కార్యక్రమాలు – అక్రమ నాటు సారా నిర్మూలన, ఈవ్‌ టీజింగ్ అరికట్టడం, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ

అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ ఆదేశాల మేరకు, నర్సీపట్నం సబ్‌ డివిజన్ డీఎస్పీ పి.శ్రీనివాసరావు పర్యవేక్షణలో, నర్సీపట్నం రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రేవతమ్మ ఆధ్వర్యంలో ఎస్సై రాజారావు తోపాటు పోలీసులు విస్తృతమైన ఎన్ఫోర్స్మెంట్ కార్యక్రమాలు చేపట్టారు. ఈ క్రమంలో, బంగారయ్యపాలెం మరియు బాపిరెడ్డి కొత్తపాలెం గ్రామాల్లో అక్రమ నాటు సారా తయారీ బట్టిలపై దాడులు నిర్వహించి, సుమారు 3,500 లీటర్ల ఎఫ్.జె. వాష్‌ (బెల్లం పులుపు)ను ధ్వంసం చేసి, తయారీకి ఉపయోగించిన వంట పాత్రలను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా, నర్సీపట్నం టౌన్ పోలీసులు ఈవ్‌ టీజింగ్ నివారణ, రోడ్డు ప్రమాదాల అరికట్టడం, ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో భాగంగా ప్రత్యేక చర్యలు చేపట్టారు. ముఖ్యంగా, ఆర్టీసీ కాంప్లెక్స్ మరియు ఇతర రద్దీ ప్రాంతాల్లో డ్రోన్ సర్విల్లెన్స్ నిర్వహించి, ఆకతాయిలను అదుపులోకి తీసుకొని, రవాణా వ్యవస్థ సజావుగా కొనసాగేందుకు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా సబ్‌ డివిజన్ డీఎస్పీ .శ్రీనివాసరావు మాట్లాడుతూ:“జిల్లా పోలీసులు మహిళలు, బాలబాలికలకు సంపూర్ణ భద్రత కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. అలాగే ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో భాగంగా నిరంతర తనిఖీలు నిర్వహిస్తూ, అవసరమైన చోట కేసులు నమోదు చేస్తున్నాం” అని తెలిపారు

ఆంధ్రప్రదేశ్

అభివృద్ధి మొత్తం అమరావతిలో కేంద్రీకృతం చేయద్దు : ప్రియాంక దండి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వే 2 న్యూస్ వారు నిర్వహించిన కాంక్లేవ్ లో మాట్లాడుతూ అమరావతిని భవిష్యత్తులో విస్తరిస్తాము అని వ్యాఖ్యనించారని అభివృద్ధి మొత్తం అమరావతికి కేంద్రీకృతం చేస్తే మళ్లీ ప్రాంతాల మధ్య అసమానతలకు దారి తీస్తుందని కాంగ్రెస్ పార్టీ విశాఖ తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ ప్రియాంక దండి అన్నారు. ఇప్పటికే రాజధాని నిర్మాణం కోసం 33 వేల ఎకరాలు సేకరించరాని అది అభివృద్ధి చేయడానికి 25 సంవత్సరాలు పట్టవచ్చని, ఇంక రాజధాని విస్తరణ అవసరం లేదని, రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లాను ఒకో హబ్ గా అభివృద్ధి చేసే ప్రణాళిక చెయ్యాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిలోనే మొత్తం అభివృద్ధి కేంద్రీకృతం చేయకుండా రాష్ట్రంలో ప్రతి జిల్లా అభివృద్ధి చేసేలా ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఒప్పించాలని జనసేనను ఉత్తరాంధ్ర మరియు రాయలసీమ ప్రజలు గత ఎన్నికల్లో ఆదరించారని వారి పక్షాన నిలబడాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ మీద ఉందని ప్రియాంక అన్నారు.

నాగర్‌కర్నూల్

మహిళలను కోటీశ్వరులను చేస్తాం –ఎమ్మేల్యే డా. కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి

పున్నమి ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా సెప్టెంబర్ 16 తెలంగాణ ఇందిరా మహిళా శక్తి, మత్స్యశాఖ, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో నీలి విప్లవ పథకం కింద సంచార చేపల విక్రయ వాహనాల పంపిణీ కార్యక్రమం నేడు ఎమ్మేల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా లబ్ధిదారులైన మహిళలకు చేపల విక్రయ వాహనాలను క్యాంపు కార్యాలయంలో ఎమ్మేల్యే డా. కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి గారు అందజేశారు. ఎమ్మేల్యే డా. కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి గారు మాట్లాడుతూ “మహిళలను కోటీశ్వరులను చేయడం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం. ప్రజల మధ్యే ఉండి వారి అభివృద్ధి కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తున్న అని పేర్కొన్నారు. “తెలంగాణలో చేపల ఉత్పత్తిని విస్తృతంగా పెంచి, ఇతర రాష్ట్రాలకు మాత్రమే కాకుండా విదేశాలకు కూడా ఎగుమతి చేసే స్థాయికి మత్స్యశాఖను తీసుకువెళ్లడం మా లక్ష్యం. ఈ దిశగా మహిళల సాధికారతకు, మత్స్యకారుల అభివృద్ధికి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తుంది” అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమణ రావు గారు,మాజీ కౌన్సిలర్స్ ,లబ్ధిదారులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

కృష్ణా జిల్లా యస్. పి గా ఛార్జ్ తీసుకున్న ఐపియస్ ఆఫీసర్ విద్యాసాగర్ నాయుడు

*శాంతిభద్రతలను పరిరక్షించడంలో, ప్రజా సమస్యల పరిష్కారంలో, మహిళల భద్రతను పెంచడంతో పాటు సైబర్ నేరాలను నియంత్రించడమే ప్రధాన లక్ష్యం: జిల్లా నూతన ఎస్పి విద్యాసాగర్ నాయుడు* ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన అనంతరం మీడియాతో మాట్లాడిన విద్యాసాగర్ నాయుడు. *మీడియా సమావేశంలో ఎస్పీ విద్యాసాగర్ కామెంట్స్* గంజాయి మరియు ఇతర మాదక ద్రవ్యాలను జిల్లాలోకి ప్రవేశించకుండా ఉక్కు పాదం మోపుతాం. మాదకద్రవ్యాల రహిత జిల్లాగా మార్చడంలో ప్రత్యేక పాత్రను పోషిస్తా. సిబ్బంది సంక్షేమం లో రాజీ పడేది లేదు. వారి సమస్యల పరిష్కారానికి నిరంతర కృషి. ఎంతో ప్రఖ్యాత చరిత్ర కలిగిన కృష్ణాజిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించడం చాలా సంతోషంగా ఉంది. ప్రజా సంక్షేమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతలను అనుసరించి విధి నిర్వహణ కనపరుస్తా. ప్రత్యేకంగా మహిళల భద్రతకు పెద్దపీట వేస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా. జిల్లాను నేర రహితంగా తీర్చిదిద్దేందుకు సిబ్బందిని ఎల్లవేళలా అప్రమత్తం చేస్తాను. సిబ్బంది సమస్యల పరిష్కారం లో ఎల్లవేళలా ముందు ఉంటా… 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటూ పోలీస్ సేవలు అందిస్తా. ▪చిన్నారులు, వృద్ధులకు, మహిళలకు రక్షణ కల్పనలో ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. శాంతి భద్రతల పరిరక్షణలో స్థాయి భేదం చూపించకుండా అందరితో కలిసి పనిచేస్తాను., సమస్యలపై జిల్లా ప్రజలు నేరుగా వచ్చి ఫిర్యాదు చేయవచ్చు. చట్టాన్ని ఉల్లంఘించి అసాంఘిక చర్యలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం దిశగా కార్యాచరణ ఉంటుంది

జాతీయ అంతర్జాతీయ

కేరళను వణికిస్తున్న “మెదడును తినే అమీబా”.. ఈ ఏడాది 18 మంది మృతి!

సెప్టెంబర్ 16 పున్నమి ప్రతినిధి@ కలవరపెడుతున్న అరుదైన బ్రెయిన్ ఇన్ఫెక్షన్. ఈ ఏడాది 67 కేసుల నమోదు, 18 మంది మృతి. తాజాగా తిరువనంతపురంలో 17 ఏళ్ల కుర్రాడికి వ్యాధి నిర్ధారణ. అనుమానంతో స్విమ్మింగ్ పూల్ మూసివేసిన అధికారులు. అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్’ అనే అరుదైన బ్రెయిన్ ఇన్ఫెక్షన్ కేరళలో కలకలం రేపుతోంది. మెదడును తినే అమీబా’గా పిలిచే ఈ వ్యాధి కారణంగా మరణాల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా తిరువనంతపురానికి చెందిన 17 ఏళ్ల టీనేజర్‌కు ఈ ఇన్ఫెక్షన్ సోకినట్లు అధికారులు ధ్రువీకరించారు. దీంతో ఈ ఏడాది ఈ వ్యాధి బారిన పడి మరణించిన వారి సంఖ్య 18కి చేరింది. తాజా కేసు విషయానికి వస్తే, బాధిత కుర్రాడు తన స్నేహితులతో కలిసి అక్కూలం టూరిస్ట్ విలేజ్‌లోని స్విమ్మింగ్ పూల్‌లో స్నానం చేశాడు. ఆ మరుసటి రోజే అతడికి వ్యాధి లక్షణాలు కనిపించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే ఆ స్విమ్మింగ్ పూల్‌ను మూసివేసి, నీటి నమూనాలను పరీక్షల నిమిత్తం సేకరించారు. ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్ సెప్టెంబర్ 14న విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఈ ఏడాది కేరళలో మొత్తం 67 కేసులు నమోదు కాగా, వారిలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇటీవలే మలప్పురం జిల్లాకు చెందిన శోభన (56), సుల్తాన్ బతేరికి చెందిన రతీష్ (45) అనే ఇద్దరు వ్యక్తులు కూడా ఇదే వ్యాధితో చికిత్స పొందుతూ కోజికోడ్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో మరణించారు. వరుస మరణాల నేపథ్యంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ప్రజలకు ఆరోగ్య శాఖ మంత్రి హెచ్చరిక ఈ అంశంపై కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ మాట్లాడుతూ ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. “నిల్వ ఉన్న నీటిలో, మురికి నీటిలో, పశువులు స్నానం చేసే జలాశయాల్లో ముఖం కడుక్కోవడం గానీ, స్నానం చేయడం గానీ చేయవద్దు. బావుల్లో శాస్త్రీయంగా క్లోరినేషన్ చేయాలి. వాటర్ థీమ్ పార్కులలోని స్విమ్మింగ్ పూల్స్‌లో సరైన మోతాదులో క్లోరిన్ కలపాలి” అని సూచించారు. ఈ అమీబా ముక్కు ద్వారానే మెదడులోకి ప్రవేశిస్తుందని, కాబట్టి స్నానం చేసేటప్పుడు ముక్కులోకి నీరు వెళ్లకుండా జాగ్రత్త పడాలని మంత్రి హెచ్చరించారు

ఆంధ్రప్రదేశ్

రిజిస్టర్ పోస్ట్ ద్వారా మీ ఇంటికే ‘స్మార్ట్ రేషన్ కార్డు’ – జస్ట్ రూ. 35 చెలిస్తే చాలు..!

సెప్టెంబర్ 16 పున్నమి ప్రతినిధి @ ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కొనసాగుతోంది. అయితే లబ్ధిదారులకు మరో ముఖ్యమైన అప్డేట్ వచ్చేసింది. స్మార్ట్ రేషన్ కార్డులు రానివారికి రిజిస్టిర్ పోస్టు ద్వారా అందజేయాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కొనసాగుతోంది. ఇప్పటికే చాలా జిల్లాల్లో లబ్ధిదారులు కార్డులను అందుకుంటున్నారు. ప్రతి నెలా 29,796 రేషన్ షాపుల ద్వారా తెల్లరేషన్ కార్డులదారులకు బియ్యం, తదితర సరుకుల పంపిణీ చేయడం జరుగుతుందని ఇటీవలనే పౌరసరఫరాల శాఖ తెలిపింది. అయితే లబ్ధిదారులకు మరో ముఖ్యమైన అప్డేట్ వచ్చేసింది. స్మార్ట్ రేషన్ కార్డులు రానివారికి రిజిస్టిర్ పోస్టు ద్వారా అందజేయాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. నవంబర్ 1వ తేదీ నుంచి రిజిస్టర్ పోస్ట్ ద్వారా స్మార్ట్ కార్డులను పంపిణీ చేస్తారు. నామినల్ ఫీజు కింద రూ. 35 చెల్లిస్తే పోస్టల్ శాఖ ద్వారా రిజిస్టర్ పోస్టులో ఇంటికి పంపించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎవరికైతే ప్రస్తుతం కార్డులు రాలేదో వారికి మాత్రమే రిజిస్టర్ పోస్ట్ ద్వారా కార్డులను అందజేస్తారు. మరోవైపు రేషన్ కార్డులో మార్పులు చేయాల్సి వస్తే.. సచివాలయాల్లో దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. మార్పులు చేర్పులు దరఖాస్తుల స్వీకరణకు అక్టోబర్ 31 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది. ఈలోపే దరఖాస్తు పెట్టుకోవాలి. మీరు సమర్పించే వివరాల ఆధారంగా అప్డేట్ చేస్తారు. అప్డేట్ చేసే కార్డులను కూడా ఉచితంగానే అందించాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. కాబట్టి తప్పులు ఉన్న వాళ్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వచ్చే వారం నుంచి మన మిత్ర యాప్ లో కూడా కార్డులో మార్పులకు దరఖాస్తు చేసుకునే వీలు రానుంది. 9552300009 కు హాయ్ అని మెసేజ్ చేసి మనమిత్ర సేవలను పొందవచ్చు మరోవైపు మూడు నెలలు వరుసగా రేషన్ తీసుకోకుంటే రేషన్ కార్డు రద్దు అవుతుంది. కాని ఆ తర్వాత సచివాలయాలకు వెళ్లి సరైన సమాచారం ఇస్తే… మళ్లీ రేషన్ కార్డు యాక్టివేట్ అవుతుందని అధికారులు చెబుతున్నారు.

తెలంగాణ

భారీ వర్ష సూచన.. IMD హెచ్చరిక

పున్నమి ప్రతినిధి తెలంగాణ రాష్ట్రము లో ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, రంగా రెడ్డి, వరంగల్, పెద్దపల్లి, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని IMD తెలియజేసింది. రాష్ట్ర ప్రజలు జాగ్రత్త గా ఉండాలి అని కోరింది.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.