Wednesday, 6 May 2026

Blog

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

*పెన్నా పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..*

*పెన్నా పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..* *- తహసిల్దార్ శివకృష్ణయ్య సూచన..* *పొదలకూరు:* సోమశిల జలాశయం నుంచి వరద జలాలను పెన్నా నదికి విడుదల చేసియున్న నేపథ్యంలో పొదలకూరు మండలంలోని పెన్నా నది పరివాహక ప్రాంత గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తాహసిల్దార్ బీ శివకృష్ణయ్య సూచించారు. తాహసిల్దార్ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ విరువూరు సమీపంలోని సంగం బ్యారేజీ నుంచి సుమారు 30 వేల క్యూసెక్కుల నీటిని క్రిందికి వదులుతుండటంతో పెన్నానది తీర ప్రాంతాలైన విరువూరు, మహమ్మదాపురం గ్రామాల పశువుల కాపరులు నది వైపు వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు. అలాగే పెన్నా నది వెంబడి నున్న సూరాయపాలెం గ్రామ రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు. పెన్నా నదిలో నీటి ప్రవాహం వస్తున్నందున నదిలోకి ఇసుక కోసం ఎవరూ వెళ్లే సాహసం చేయవద్దని సూచించారు. ఈ మేరకు పెన్నా తీర ప్రాంత గ్రామాలైన సూరాయపాలెం, విరువూరు, మహమ్మదాపురం గ్రామాల వీఆర్వోలు, వీఆర్ఏలు జాగ్రత్తలు తీసుకొని ఆయా గ్రామాల ప్రజలను పెన్నా నది వైపు వెళ్లకుండా అప్రమత్తం చేయాలని సూచించారు.

E-పేపర్

అందరివాడు ఎ ఎస్ ఐ సుబ్బరాయుడు

నందలూరు మండలం నందు పనిచేస్తున్న ఎ ఎస్ ఐ సుబ్బరాయుడు అందరివాడు అని రాజంపేట రూరల్ సి ఐ బి. వి. రమణ అన్నారు. నందలూరు పోలీస్ స్టేషన్ నందు ఎ ఎస్ ఐ పని చేస్తున్న ఆయన పదోన్నతి పొంది ఎస్ ఐ గా కడప ఎస్. పి. కార్యాలయం నందు రిపోర్టింగ్ చేయడం జరిందని అన్నారు. ఆయనకు వీడ్కోలు సమావేశం నందు మాట్లాడారు. సుబ్బరాయుడు సన్మాన సభలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న నాయకులు, ప్రజలు చూస్తే సుబ్బరాయుడు పనితీరు అర్థం అవుతోందని అన్నారు. అందరినీ ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ ఏటువంటి సమస్య అయినా , బాధ అయిన వెంటే మన మనిషి లాగా పలకరించి వారి సమస్య ను పరిశకరించగల వ్యక్తిగా పేరు తెచ్చుకొన్న వ్యతి సుబ్బరాయుడు అని అన్నారు. ఈ కార్య్రమంలో స్టేషన్ ఎస్ ఐ మల్లికార్జున రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ లు, కానిస్టేబుల్ లు, హోం గార్డ్ లు , మండల నాయకులు , ప్రజలు, పాల్గొన్నారు.

ఖమ్మం

_విద్యుత్ శాఖ ADE ఇంట్లో 2 కోట్ల నోట్ల కట్టలు.. హైదరాబాద్ మణికొండలో అవినీతి అనకొండ !_*

పున్నమి Daily న్యూస్ ప్రతినిథి : T.Ravinder ఖమ్మం. *_విద్యుత్ శాఖ ADE ఇంట్లో 2 కోట్ల నోట్ల కట్టలు.. హైదరాబాద్ మణికొండలో అవినీతి అనకొండ !_* హైదరాబాద్:తెలంగాణ విద్యుత్ శాఖలో అవినీతి తిమింగలం కాదు ఏకంగా అనకొండనే దొరికింది. మణికొండలో విద్యుత్ శాఖలో ADEగా (అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్) పనిచేస్తున్న అంబేద్కర్ అక్రమంగా సంపాదించిన 2 కోట్ల నోట్ల కట్టలు ఏసీబీ సోదాల్లో దొరికాయి. ఏసీబీ ఆ 2 కోట్ల నగదును సీజ్ చేసింది. విద్యుత్ శాఖ ఏడీఈగా పనిచేస్తున్న అంబేద్కర్ ఇంట్లో, అతని బంధువుల ఇళ్లలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. మంగళవారం ఉదయం నుంచి అంబేద్కర్కు సంబంధించిన అక్రమాస్తులే లక్ష్యంగా ఏసీబీ సోదాలు చేసింది. ఏసీబీ అధికారులు ఉదయం నుంచి 15 బృందాలుగా విడిపోయి తనిఖీలు చేస్తున్నారు. హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తుంది. ADE అంబేద్కర్పై భారీగా అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల కాలంలో ఏసీబీకి విద్యుత్ శాఖ అధికారులు తరుచూ పట్టుబడుతున్నారు. కొండాపూర్లోని మ్యాగ్నా లేక్ వ్యూ అపార్ట్మెంట్లో అంబేద్కర్ నివాసం ఉంది. నానక్ రాంగూడలోని అంబేద్కర్ పర్సనల్ ఆఫీసులలోనూ ఏసీబీ సోదాలు జరిగాయి. మంగళవారం (సెప్టెంబర్ 16, 2025) తెల్లవారుజామున 5 గంటల నుంచి ఏసీబీ రైడ్స్ కొనసాగుతున్నాయి. అక్రమంగా కూడబెట్టిన ఆస్తులకు బంధువులను బినామీలుగా చేసి అంబేద్కర్ కోట్లు కూడబెట్టాడు. డబ్బు మాత్రమే కాదు అవినీతి సొమ్ముతో హైదరాబాద్ సిటీలో పలు చోట్ల స్థలాలను కొనుగోలు చేసినట్లు కూడా ఏసీబీ తనిఖీల్లో వెల్లడైంది. ఇప్పటికే అంబేద్కర్ అక్రమాస్తులకు సంబంధించి పలు కీలక డాక్యుమెంట్లను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ తనిఖీలు పూర్తయితే గానీ మణికొండ విద్యుత్ శాఖ ఏడీఈ అంబేద్కర్ ఎంత పెద్ద అవినీతి అనకొండనో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

జనగాం

కోడకండ్ల మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు – కొండ్ర కమల్ కుమార్

పున్నమి ప్రతినిధి, జనగాం: Sep 16: కోడకండ్ల మండల పరిధిలోని జడ్‌పి హైస్కూల్ ఏడునూతులలో భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడు కొండ్ర కమల్ కుమార్ గారికి “మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు” లభించింది. ఈ అవార్డును మండల విద్యా కార్యాలయం ఆధ్వర్యంలో, స్పెషల్ ఆఫీసర్, ఎం.పి.డీ.ఓ., మండల విద్యాధికారి గ్రేస్ కేజియా రాణి గారు, డీ.టీ, పీజీహెచ్‌ఎం ల గార్ల సమక్షంలో ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి గ్రేస్ కేజియా రాణి గారు మాట్లాడుతూ: “విద్యార్థుల ప్రగతి కోసం కృషి చేస్తున్న ఉపాధ్యాయులు నిజమైన ప్రేరణాదాయకులు” అని అన్నారు. జడ్‌పిహెచ్‌ఎస్ ఏడునూతుల ప్రధానోపాధ్యాయులు నారబోయిన యాకయ్య గారు మాట్లాడుతూ: “మా పాఠశాల ఉపాధ్యాయుడు ఈ అవార్డు పొందటం మా పాఠశాలకు గౌరవం” అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు రాంబాబు, ఈర్య, మమత, సోమేశ్వర్, జి.రజిత, ఎం.రజిత, యాదగిరి, విజయ, కవిత, భాస్కర్, విజయశ్రీ పాల్గొని అభినందించారు.

సత్యసాయి

అంబేద్కర్ సర్కిల్లోబిజెపి మండల అధ్యక్షుడు వీరాంజనేయులు ఆధ్వర్యంలో వైద్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ఘనంగాజన్మదిన వేడుకలు నిర్వచించారు

అంబేద్కర్ సర్కిల్లోబిజెపి మండల అధ్యక్షుడు వీరాంజనేయులు ఆధ్వర్యంలో వైద్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ఘనంగాజన్మదిన వేడుకలు నిర్వచించారు ఓడి చెరువు సెప్టెంబర్ 16 పున్నమి న్యూస్ :అంబేద్కర్ సర్కిల్ హాస్పిటల్ లో మండలఅధ్యక్షుడువీరాంజనేయులు ఆధ్వర్యంలో మంత్రివర్యులు సత్య కుమార్ యాదవ్ జన్మదిన సందర్భంగా మండలంలోని ప్రభుత్వ వైద్యశాల నందు రోగులకి పాలు బ్రెడ్లు పండ్లు అందజేయడంమరియు అంబేద్కర్ సర్కిల్ బిజెపి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని కేక్ కటింగ్ చేయడం జరిగిందిఈ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ మండల నాయకులు మండల అధ్యక్షుడు ఇ డుగుటి వీరాంజనేయులు చలపతి సురేష్ హరికృష్ణ సున్నంపల్లి రంగారెడ్డి ఆకుతోటపల్లి కిష్టప్ప గాజుగుంటపల్లి చలపతి అల్లావుద్దీన్ మురళి అంజనప్ప బీజేవైఎం నరేష్ నాగప్ప మేకల వెంకటరమణ ఆశీర్తప్ప తదితరులు పాల్గొనడం జరిగింది.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో ఘనంగా అంతర్జాతీయ సదస్సు…

నెల్లూరు: విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ ప్రాంగణంలో మెరైన్ బయాలజీ విభాగము, యోగివేమన యూనివర్సిటీ మైక్రో బయాలజీ విభాగము మరియు aieonki publishco హైదరాబాద్ సంయుక్తంగా “పర్యావరణ కాలుష్యం, పోషణ మరియు ప్రజారోగ్యంపై అంతర్జాతీయ సదస్సు (ICENPH-2025)” ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశ్వవిద్యాలయం వైస్‌ చాన్సలర్ ఆచార్య అల్లం శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై దీపప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించారు. విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ కే. సునీత విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. గౌరవ అతిథులుగా ప్రొ శంకర్ జి. అగర్వాల్, డాక్టర్ చల్ల సురేష్, ప్రొ పి. చంద్రమౌళి విచేసి జోతిప్రజులన చేసి కార్యక్రమాని ప్రారంభించారు ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య అల్లం శ్రీనివాసరావు మాట్లాడుతూ “ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న పర్యావరణ కాలుష్యం మానవ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నదని, అలాంటి సమస్యలను ఎదుర్కోవడానికి శాస్త్రీయ పరిశోధనలు మరియు అంతర్జాతీయ సహకారం అత్యంత అవసరం” అని అన్నారు. ఈ సదస్సు ద్వారా విద్యార్థులు, పరిశోధకులు, శాస్త్రవేత్తలు కలిసి అనుభవాలను పంచుకోవడం ద్వారా కొత్త ఆవిష్కరణలకు మార్గం సుగమమవుతుందని ఆయన పేర్కొన్నారు. తరువాత రిజిస్ట్రార్ డాక్టర్ కే. సునీత మాట్లాడుతూ, పోషకాహారం లోపం మరియు పర్యావరణ కాలుష్యం రెండూ కలిసి ప్రజారోగ్య సమస్యలను పెంచుతున్నాయని, వాటిని ఎదుర్కోవడానికి ప్రభుత్వ-విశ్వవిద్యాలయాలు-ప్రైవేట్ సంస్థలు కలసి ముందుకు రావాలని సూచించారు. National Physical Laboratory, New Delhi, India ప్రొఫెసర్ శంకర్ జి. అగర్వాల్, Scientist-G, HoD – Cell Biology, NIN, Hyderabad, India డాక్టర్ చల్ల సురేష్, Charman, Aieonki Publishco, Hyderabad ప్రొఫెసర్ పి. చంద్రమౌళి వంటి గౌరవ అతిథులు కూడా ఈ సందర్భంలో ప్రసంగించారు. వారు పర్యావరణ పరిరక్షణలో యువత పాత్రను, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్ల ప్రాధాన్యతను వివరించారు. సదస్సులో జాతీయ, అంతర్జాతీయ స్థాయి శాస్త్రవేత్తలు, పరిశోధకులు పాల్గొని పత్రాలు సమర్పించారు. పర్యావరణ శాస్త్రం, మెరైన్ బయాలజీ, పోషణ శాస్త్రం, ప్రజారోగ్య రంగాలలో జరుగుతున్న తాజా పరిశోధనలపై చర్చలు జరిగాయి. ప్రిన్సిపాల్ ఆచార్య సిహెచ్ విజయ మాట్లాడుతూ “విద్యార్థులు ఇలాంటి అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొనడం ద్వారా ప్రపంచ స్థాయి పరిశోధనల గురించి అవగాహన పెంపొందించుకోవచ్చు. పర్యావరణ పరిరక్షణ, సమతుల ఆహారం, ప్రజారోగ్యం వంటి అంశాలు కేవలం పాఠ్యాంశాల్లోనే కాకుండా జీవితంలోనూ పాటించాల్సిన ముఖ్యమైన విలువలు. విశ్వవిద్యాలయం తరఫున విద్యార్థులకు ఇలాంటి అవకాశాలు కల్పించడం ఎంతో గర్వకారణం” అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సదస్సులో పాల్గొన్న ప్రతినిధులు “పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడం, పోషకాహారాన్ని పెంపొందించడం, ప్రజారోగ్యాన్ని కాపాడుకోవడం” అనే అంశాలపై ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. సదస్సు విజయవంతం కావడానికి కృషి చేసిన మెరైన్ బయాలజీ విభాగాధిపతి డాక్టర్ ఎం హనుమారెడ్డి, డాక్టర్ సిహెచ్. వెంకట్రాయిలు, ప్రొ ఎల్. వీరాంజనేయరెడ్డి మరియు ప్రొ కె.మల్లికార్జున ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా నిర్వాహక కమిటీ సభ్యులు, అధ్యాపకులు, పరిశోధక విద్యార్థులు విజయవంతం చేశారు.

తెలంగాణ

కేంద్ర పౌర విమానయణ శాఖ మంత్రి ని కలిసి న మంత్రి తుమ్మల

పున్నమి ప్రతి నిధి .. కొత్తగూడెం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ నిర్మాణం చేపట్టండి ….కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రాంమోహన్ నాయుడు కు మంత్రి తుమ్మల విజ్ఞప్తి …..డిల్లీలో కలిసి గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ స్థాపనపై చొరవ తీసుకోవాలని రాంమోహన్ కు రాష్ట్ర ప్రభుత్వం తరపున విజ్ఞప్తి చేసిన మంత్రి తుమ్మల …. భద్రాద్రి రామాలయం దర్శనానికి వచ్చే భక్తులకు సౌకర్యంగా ఎయిర్ పోర్ట్ …… భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం వద్ద గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ నిర్మాణం చేయాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రాoమోహన్ నాయుడు కు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు.మంగళవారం నాడు డిల్లీలో రాoమోహన్ నాయుడు ను కలిసి గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ నిర్మాణం పై చర్చించారు.కొత్తగూడెం వద్ద గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రతిపాదన చేయగానే స్పందించి ఎయిర్ పోర్ట్ నిర్మాణం కోసం సివిల్ ఏవియేషన్ తరపున ఫీజు బులిటీ సర్వే చేసినందుకు రాoమోహన్ నాయుడు కు మంత్రి తుమ్మల కృతజ్ఞతలు తెలిపారు.ఫీజుబులిటీ సర్వే లో ప్రతిపాదిత స్థలం ఎయిర్ పోర్ట్ నిర్మాణం కోసం అనువుగా లేనందున మరో స్థలం రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రతిపాదన చేశామని అక్కడ త్వరగా ఫీజుబులిటీ సర్వే చేసి, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ నిర్మాణంలో చొరవ తీసుకోవాలని కేంద్ర మంత్రి రాoమోహన్ నాయుడు కు మంత్రి తుమ్మల విజ్ఞప్తి చేశారు. ….. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దక్షిణ అయోధ్య గా ప్రసిద్ధి చెందిన భద్రాచలం రామాలయం దేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందిందని తెలిపారు. జాతికి వెలుగులు అందించే సింగరేణి గనులు.. హెవీ వాటర్ ప్లాంట్..ఐటీసీ బీ. పీ.ఎల్ సంస్థలతో పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అరుదైన ఖనిజ నిక్షేపాలతో అటవీ ప్రాంతంతో ఎకో టూరిజం కు కేరాఫ్ గా నిలిచింది.దేశంలోనే తొలి ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ కొత్తగూడెం లో ఏర్పాటు చేశాం.గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ నిర్మాణం వల్ల పారిశ్రామికంగా విద్యా పరంగా టూరిజం పరంగా జిల్లా ఎంతో పురోగతి చెందే అవకాశం ఉందని, దేశ విదేశాల నుంచి భద్రాద్రి రామాలయం దర్శనానికి వచ్చే భక్తులకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ నిర్మాణం లో చొరవ తీసుకోవాలని రాంమోహన్ నాయుడు కు మంత్రి తుమ్మల సవివరంగా తెలిపారు. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ నిర్మాణంలో చేపట్టాల్సిన పనులపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని మంత్రి తుమ్మల తెలిపారు. తెలుగు బిడ్డైన రాంమోహన్ నాయుడు చొరవతో కొత్తగూడెం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ కల సాకారం కానుందని మంత్రి తుమ్మల నాగేశ్వరావు ఆశాభావం వ్యక్తం చేశారు.

తిరుపతి

వాహన మిత్ర పథకానికి దరఖాస్తు చేసుకోండి:ఏర్పేడు మండల అధ్యక్షులు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు 2025-2026 వ ఆర్థిక సంవత్సరమునకు గాను సొంత వాహనం కలిగిన వాహనదారులకు సంవత్సరమునకు15000 రూపాయలు ఆర్థిక సహాయం చేయుటకు అర్హత కలిగిన వారి నుండి దరఖాస్తులు కోరడమైనది.కావున ఏర్పేడు మండలం నందు గతంలో లబ్ధి పొందని వాహనదారులకు సంబంధిత ధ్రువపత్రములు మరియు ఇతర అర్హతలతో కూడిన ధ్రువపత్రములు తీసుకుని మీ గ్రామ సచివాలయం నందు19-09-2025 లోపు దరఖాస్తు చేసుకోవాలని,గతంలో లబ్ధి పొందిన వారు 17-09-2025 లోపు దరఖాస్తులను మీ గ్రామ సచివాలయంలో ఇవ్వవలసినదిగా శ్రీకాళహస్తి నియోకవర్గం ఏర్పేడు మండల అధ్యక్షులు పేరం నాగరాజు నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ పశ్చిమ గోదావరి

నూతన చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీమతి కలిదిండి సుజాత రామచంద్రరాజు

భీమవరం వ్యవసాయ మార్కెట్ కమిటీ (AMC) నూతన చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీమతి కలిదిండి సుజాత రామచంద్రరాజు. వైస్ చైర్మన్‌గా బండి రమేష్ కుమార్, డైరెక్టర్ గా శ్రీమతి కె. రమాదేవి (బీజేపీ నాయకురాలు), ఇతర డైరెక్టర్లకు హృదయపూర్వక అభినందనలు తెలిపిన ఎంపి.రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, భీమవరం ఎమ్మెల్యే, రాష్ట్ర పీఏసీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు, రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ, టిడిపి పొలిట్ బ్యూరో సభ్యురాలు, మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి, APIIC చైర్మన్ మంతెన రామరాజు , రాష్ట్ర మహిళా సహకార ఆర్థిక సంస్థ చైర్‌పర్సన్ శ్రీమతి పీతల సుజాత, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కోటికలపూడి గోవిందబాబు, బిజెపి జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి తదితర ప్రముఖులతో కలసి కమిటీ ప్రమాణ స్వీకారంలో పాల్గొన్నారు. ​రైతుల సంక్షేమం, వ్యవసాయ మార్కెట్ అభివృద్ధి లక్ష్యంగా ఈ కొత్త కమిటీ అంకితభావంతో పనిచేస్తుందని, రైతన్నల జీవితాల్లో గణనీయమైన మార్పు తీసుకురావడానికి, వారి పంటలకు గిట్టుబాటు ధర కల్పించడానికి, మార్కెట్ సదుపాయాలను మరింత మెరుగుపరచడానికి ఈ బృందం నిస్వార్థంగా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ పశ్చిమ గోదావరి

భీమవరంలో మిస్టర్ ఆంధ్ర బాడీ బిల్డింగ్, మిస్టర్ ఆంధ్ర ఫిజిక్ మోడలింగ్ పోటీలు

భీమవరం : భీమవరంలో ఈనెల 21న న్యూ ఆంధ్ర బాడీ బిల్డర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మిస్టర్ ఆంధ్ర బాడీ బిల్డింగ్, మిస్టర్ ఆంధ్ర ఫిజిక్ మోడలింగ్ పోటీలలో గెలుపొందిన విజేతలకు అందించే ట్రోఫీను ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ఆవిష్కరించారు. ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ బాడీ బిల్డింగ్ పోటీలోని విజేతలకు ట్రోఫీలతోపాటు మూడు మోటార్ బైక్స్ , టీవీలు అందించడం గొప్ప విశేషమన్నారు. అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ కాసిం, విజ్ఞాన వేదిక సేవా సంస్థ అధ్యక్షులు అల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ ఈనెల 21న భీమవరంలో జరిగే ఈ పోటీలకు రాష్ట్రం నలుమూలల నుండి బాడీ బిల్డర్లు హాజరుకానున్నారు, ఈ పోటీలను ఎమ్మెల్యే రామాంజనేయులు ప్రారంభిస్తారని తెలిపారు. కార్యక్రమంలో దాసి ప్రసాద్, వబిలిశెట్టి రామకృష్ణ, కారుమూరి సత్యనారాయణ మూర్తి, బ్యాంక్ బాబీ, ఆకుల కృష్ణ, మున్న, హర్ష, జగదీష్, రిచి, ఆర్కే తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.