Wednesday, 6 May 2026

Blog

ఆంధ్రప్రదేశ్

పీఎం ఆవాస్‌ యోజన అర్బన్‌ 2.0 కింద 40,410 గృహాలు మంజూరు

సెప్టెంబర్ 17 పున్నమి ప్రతినిధి @ రూ.2.50 లక్షల చొప్పున యూనిట్‌ వ్యయంతో ఇళ్ల నిర్మాణానికి అనుమతులు. పట్టణ ప్రాంతాల్లో పేదలకు గృహాలు నిర్మించాలని ఆదేశాలు. రూ.1,010 కోట్ల వ్యయంతో PMAY ఇళ్లు నిర్మించాలని ఆదేశం. తదుపరి చర్యలు తీసుకోవాలని హౌసింగ్ కార్పొరేషన్ ఎండీకి ఆదేశాలు.

ఆంధ్రప్రదేశ్

ఏపీలో “దీపం-2” పథకంతో పెరిగిన సిలిండర్ల వినియోగం

సెప్టెంబర్ 17 పున్నమి ప్రతినిధి@ ఏపీలో ‘దీపం-2′ పథకాన్ని అమలు చేయడం వల్ల రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్ల సగటు వినియోగం పెరిగిందని పౌరసరఫరాల శాఖ ఇన్ఛార్జ్ కార్యదర్శి సౌరభ్ గౌర్ తెలిపారు. రూ.1,554 కోట్ల వ్యయంతో 1.4 కోట్ల మందికి ఉచితంగా సిలిండర్లు ఇచ్చామన్నారు. మూడో విడత కింద 65 లక్షల మందికి ఇప్పటివరకు సిలిండర్లు అందజేశామన్నారు. మొదటి విడతలో 2 లక్షల మంది ఖాతాల్లో నగదు జమ కాని సమస్య ఉత్పన్నమైందని, ఆ సమస్యను మూడో విడతలో 35 వేలకే పరిమితం చేశామని సౌరబ్ గౌర్ తెలిపారు.

జాతీయ అంతర్జాతీయ

ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు ప్రధాని మోదీ: నివేదిక

సెప్టెంబర్ 17 పున్నమి ప్రతినిధి @ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు ప్రధాని మోదీ: నివేదిక భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 71% జనామోదంతో ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడిగా నిలిచినట్లు మార్నింగ్ కన్సల్ట్ సర్వే నివేదిక పేర్కొంది. ఆయన తర్వాత దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే-మ్యుంగ్ (59%), ఆస్ట్రేలియాకు చెందిన ఆంథోనీ అల్బనీస్ (55%) ఉన్నారు. టాప్-10లో కెనడా, అర్జెంటీనా, మెక్సికో, స్విట్జర్లాండ్, అమెరికా (డోనాల్డ్ ట్రంప్), పోలాండ్, బ్రెజిల్ దేశాల నాయకులు స్థానాన్ని దక్కించుకున్నారు.

జాతీయ అంతర్జాతీయ

ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు ప్రధాని మోదీ: నివేదిక

సెప్టెంబర్ 17 పున్నమి ప్రతినిధి @ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు ప్రధాని మోదీ: నివేదిక భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 71% జనామోదంతో ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడిగా నిలిచినట్లు మార్నింగ్ కన్సల్ట్ సర్వే నివేదిక పేర్కొంది. ఆయన తర్వాత దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే-మ్యుంగ్ (59%), ఆస్ట్రేలియాకు చెందిన ఆంథోనీ అల్బనీస్ (55%) ఉన్నారు. టాప్-10లో కెనడా, అర్జెంటీనా, మెక్సికో, స్విట్జర్లాండ్, అమెరికా (డోనాల్డ్ ట్రంప్), పోలాండ్, బ్రెజిల్ దేశాల నాయకులు స్థానాన్ని దక్కించుకున్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

Breaking News

*సంగం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం* *ఆరుగురు అక్కడికక్కడే మృతి* నెల్లూరు జిల్లా సంగం మండలం పెరుమన వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం రాంగ్ రూట్లో వచ్చి కారును వేగంగా ఢీకొట్టిన టిప్పర్ కారులో ఉన్న ఆరుగురు సంఘటన స్థలంలోనే మృతి కారును కొద్ది దూరం లాక్కెళ్లిన టిప్పర్

E-పేపర్

చేజర్లలో సొసైటీ అధ్యక్షులు, డైరెక్టర్ల ప్రమాణ స్వీకారం

చేజర్ల సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి) చేజర్ల మండల సొసైటీ అధ్యక్షులు బూదళ్ల వీర రాఘవరెడ్డి,డైరెక్టర్లు మదమంచి సుధీర్‌కుమార్, ఆరెద్దుల రామకృష్ణ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది.ఈ సందర్భంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు.తమకు ఈ అవకాశం కల్పించిన దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి, సీనియర్ టిడిపి నాయకులు తాళ్లూరు గిరినాయుడుకి వారు కృతజ్ఞతలు తెలియజేశారు. సొసైటీ అభివృద్ధికి,రైతుల కృషి కోసం కట్టుబడి పనిచేస్తామని నూతన అధ్యక్షులు,డైరెక్టర్లు భరోసా ఇచ్చారు. మండల కన్వీనర్ షేక్ సిరాజుద్దీన్ మాట్లాడుతూ, గతంలో ఉన్న అనుభవం కారణంగా ఈ పదవికి వారు అర్హులని అన్నారు.సీనియర్ నాయకులు కొమ్మి సిద్ధులునాయుడు మాట్లాడుతూ,రైతులకు అన్ని విధాలుగా తోడ్పాటును అందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సోమశిల ప్రాజెక్టు చైర్మన్ వేలూరు కేశవ చౌదరి, నెల్లూరు జిల్లా పార్లమెంటరీ సెక్రటరీ రావి పెంచలరెడ్డి,మాజీ ఎంపీపీ అన్నలూరు శ్రీనివాసులు నాయుడు,సీనియర్ నాయకులు కొమ్మి సిద్ధులునాయుడు,మండల ప్రధాన కార్యదర్శి తలపనేని జయంతులునాయుడు, వావిలేరు సర్పంచ్ గోనుగుంట రాంబాబు, సోమశిల 24 ఎల్ చైర్మన్ ఉడత హజరతయ్య,తెలుగు యువత అధ్యక్షులు ఆదినారాయణ రెడ్డి సీనియర్ నాయకులు మోదేపల్లి పెంచల నాయుడు,భారతీయ మహాసేన అధ్యక్షులు జువ్విగుంట బాబు,ఎంపీటీసీ షేక్.మస్తాన్,బీజేపీ నాయకులు బత్తల కిష్టయ్య, గుండాల విజయభాస్కర్ రెడ్డి, జనసేన నాయకులు షేక్ నజీర్‌తో పాటు పలువురు మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఖమ్మం

తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న కొండపల్లి,గల్లా

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భముగా ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం లో గల తిరుమలాయ పాలేం మండలం సుబ్లేడు గ్రామం లో జరిగిన తెలంగాణ విమోచన దినోత్సవం వేడుకల్లో బీజేపీ కిసాన్ మోర్చా తెలంగాణ రాష్ట్ర మాజీ అధ్యక్షులు కొండ పల్లి శ్రీధర్ రెడ్డి, బీజేపీ ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షులు, భూపాలపల్లి ఇంచార్జి గల్లా సత్యనారాయణ లు పాల్గొని జాతీయ జెండా ని ఆవిష్కరించారు. కొండ పల్లి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ నాడు నిజాం నిరంకుశ పాలన కీ వ్యతిరేకం గా తన కలమే ఆయుధం గా పోరాడిన ప్రముఖ పాత్రికేయుడు సోయబుల్లా ఖాన్ యొక్క స్వగ్రామం లో నేడు తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు జరుపుకోవడం సంతోషకర విషయం అని అన్నారు. చావ కిరణ్, ఎల్లా రావు గౌడ్ భూక్యా శ్యాం సుందర్ నాయక్, తక్కేళ్లపల్లి నరేంద్ర, అనంతు ఉపేందర్, సంతోష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

తిరుపతి

ఘనంగా ప్రధాని జన్మదిన వేడుకలు

బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్,జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ 75వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సేవా పక్షోత్సవాలు కార్యక్రమంలో భాగంగా బిజెపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ పిలుపు మేరకు మొదటి రోజున నేడు మోదీ పుట్టినరోజు సందర్భంగా శ్రీకాళహస్తి పట్టణంలోని సరస్వతీ ఆడిటోరియం నందు రక్తదాన శిబిరంలో ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో భారతీయజనతాపార్టీ,నాయకులకు,కార్యకర్తలకు,విద్యార్థిని విద్యార్థులకు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కోలా ఆనంద్ ధన్యవాదాలు తెలియజేసారు.

ఖమ్మం

ఘనంగా ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు

పున్నమి ప్రతినిధి పాలేరు భారత ప్రధాని నరేంద్ర మోదీ 75 వ జన్మదినము సం దర్భముగా ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం లో తిరుమలాయ పాలెం మండలం లో గల సుబ్లేడు గ్రామం లో తలసేమియా వ్యాది తో బాధపడుతున్న చిన్నారుల కోసం రక్త దాన శిబిరం ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమం కీ తెలంగాణ బీజేపీ కిసాన్ మోర్చా మాజీ అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి బీజేపీ ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షులు భూపాలపల్లి ఇంచార్జి గల్లా సత్య నారాయణ, కిసాన్ మోర్చా ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షులు చావ కిరణ్ , మాజీ ప్రధాన కార్యదర్శి భూక్యా శ్యాం సుందర్ నాయక్ర్ యువ మోర్చా ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షులు అనంతు ఉపేందర్గౌడ్, బీజేపీ రాష్ట్ర కార్యావర్గం సభ్యులు తక్కెల్లా పల్లి నరేంద్ర, సంతోష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

విశాఖపట్నం

నాగరంలో పడి ఉన్న యువతీ మృతదేహం.

రాష్ట్రంలో అడుపు తప్పుతున లా&ఆర్డర్. నగరంలో పడి ఉన్న యువతీ మృతదేహం. మూడు రోజుల ముండే హత్య చేసి పడేసినట్టు అనుమానిస్తున పోలిసులు. హైదరాబాద్ – రాజేంద్రనగర్ పిఎస్ పరిధిలోని కిస్మత్పురా బ్రిడ్జి దగ్గర లభ్యమైనా యువతి మృతదేహమ్. యువతిపై అత్యాచారం జరిగినట్టు పోలీసులు అనుమానం. 25 నుండి 30 సంవత్సరాలు వయస్సు యువతిగా గూర్తింపు. క్లూ టీం సహాయంతో సీసీ టీవీ ఫుటేజీ ఆధారం గా దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.