Wednesday, 6 May 2026

Blog

తిరుపతి

ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు భరోసా : బొజ్జల బృందమ్మ గారు*

**ఈ రోజు శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండల పరిధిలోని బాధితులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను వారి ఇంటి వద్దకే వెళ్లి ఇచ్చిన బొజ్జల బృందమ్మ గారు* *రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో లేని విధంగా శ్రీ కాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి గారు అడిగిన వెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్య మంత్రి సహాయ నిధి మంజూరు చేస్తున్నందుకు ధన్యవాదములు తెలిపిన బొజ్జల బృందమ్మ గారు* *తొట్టంబేడు మండల పరిధిలో పదిమంది బాధితులకు 13,65,289/- రూపాయలను విలువ గల చెక్కుల మంజురు* *ఈ రోజు పంపిణి చేసిన చెక్కుల వివరాలు* 👉 చియ్యవరం గ్రామం నందు k. సుబ్బయ్య కు 40,786/- రూపాయలు, వి. ఏకంబరం భార్య కు 1,04,979/- రూపాయలు 👉 కాసారం పంచాయతీ గొట్టిపూడి గ్రామం నందు రాధికా గారికి 1,72,105/- రూపాయలు 👉 పెద్ద సింగమాల గ్రామం నందు వై. రవీంద్ర రెడ్డి గారికి 1,29,231/- రూపాయలు 👉 పూడి గ్రామం నందు రామ నాయుడు గారికి 46,084/- రూపాయలు 👉 బోనుపల్లి గ్రామం నందు B జనార్దన్ గారికి 81,739/- రూపాయలు 👉 కొత్తకండ్రిగ గ్రామం నందు వెంకటసుబ్బమ్మ గారికి 40,041/- రూపాయలు ఈ కార్యక్రమం లో రంగినేని చెంచయ్య నాయుడు,గాలి మురళి నాయుడు,కన్నలి ప్రతాప్ రెడ్డి, కొన్నలి రమేష్, మల్లీశ్వరి,బాలాజీ రెడ్డి మరియు గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ సాయుధ పోరాటమే తెలంగాణ విముక్తి

–  రైతు కమిషన్ చైర్మన్ ఎం కోదండారెడ్డి కామారెడ్డి, 17 సెప్టెంబర్, పున్నమి ప్రతినిధి  :  తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం  సందర్భంగా కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై కామారెడ్డి పట్టణంలో  తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించి అనంతరం కలెక్టరేట్ లో  పోలీసు వందనం స్వీకరించి జాతీయ పతాకావి ష్కరణ గావించి  ప్రజలను ఉద్దేశించి నిజాం  నిరంకుశ  రాజరిక పాలనలో తెలంగాణ ప్రాంత ప్రజలు అనుభవించిన బాధలనుండి  తెలంగాణ సాయుధ పోరాటం  ఇతర ప్రజా ఉద్యమాల ద్వారా విముక్తి పొంది 17 సెప్టెంబర్ 1948లో  పోలీస్ చర్య ద్వారా హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమై తెలంగాణ ప్రజలు పొందిన స్వేచ్ఛ స్వాతంత్రం తీరు మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా పాలన ద్వారా రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు జిల్లాలో అమలు గురించి జిల్లా ప్రజలనుద్దేశించి   ప్రసంగించిన  తెలంగాణ వ్యవసాయ మరియు రైతు కమిషన్ చైర్మన్ ఎం. కోదండరెడ్డి.ఈ సందర్భంగా వివిధ పాఠశాలల విద్యార్థులచే హాస్పిటల్ కార్యక్రమాలు నిర్వహిం చారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, జిల్లా అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ లోకల్ బాడీస్ చందర్ నాయక్, కామారెడ్డి ఆర్డిఓ వీణ, వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ మరియు వివిధ శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మెడికల్ కాలేజ్ సందర్శనకు వైఎస్ఆర్సిపి యువజన, విద్యార్థి విభాగం పిలుపు

సీతారామపురం సెప్టెంబర్ ( పున్నమి ప్రతినిధి) వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో నిర్మించిన మెడికల్ కాలేజీల వ్యవహారంపై కూటమి నాయకులు చేస్తున్న ఆరోపణలకు నిరసనగా వైఎస్ఆర్సిపి రాష్ట్ర యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో ఈనెల 19వ తేదీన మార్కాపురం ప్రభుత్వ మెడికల్ కాలేజీ ని సందర్శిస్తున్నట్లు ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సిపి యువజన, విద్యార్థి విభాగం నుండి యువత అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సిపి యూత్ వింగ్ జాయింట్ సెక్రటరీ పాలగిరి ముద్దుకృష్ణమరాజు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ఆర్సిపి హయాంలోనే రాష్ట్రంలో 17 మెడికల్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు శంకుస్థాపన చేయగా అందులో ఐదు మెడికల్ కాలేజీ లను వైసిపి ప్రభుత్వం లోనే ప్రజలకు విద్యార్థులకు అందుబాటులోకి తీసుకువచ్చి క్లాసులను కూడా ప్రారంభించడం జరిగిందని మరో 12 మెడికల్ కాలేజీలు నిర్మాణాలు చివరి దశలో ఉన్నాయని ఇవన్నీ కూటమి ప్రభుత్వానికి నాయకులకు కనిపించలేదా అని ఆయన కూటమి నాయకులపై విరుచకపడ్డారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో మెడికల్ కాలేజీ ల నిర్మాణాలు జరగలేదని కూటమి నాయకుల ఆరోపణలను దమ్ముంటే ఆధారాలతో నిరూపించాలని కూటమి నాయకులకు సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాలుగుసార్లు ముఖ్యమంత్రి అయినప్పుడు రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజీ కూడా తీసుకు రాకపోగా ఇలాంటి విలువ లేని ఆరోపణలను వైసీపీపై చేయడం ప్రజలంతా గమనిస్తున్నారని, చంద్రబాబు మోసాలను అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. వైఎస్ జగన్ హయాంలో చేసిన అభివృద్ధి పనులను చంద్రబాబు నాయుడు తాను చేసినట్లుగా చెప్పుకుంటూ పబ్బంగడుపుకునే పరిస్థితికి వచ్చారన్నారు. కూటమి ప్రభుత్వానికి వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించడం తప్ప రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం పట్టదన్నారు. వైసిపి హయాం నుండే రాష్ట్రంలో ఐదు ప్రభుత్వం మెడికల్ కాలేజీ లలో ప్రజలకు విద్యార్థులకు అందుతున్న వైద్యం విద్య కూటమి నాయకులకు కనిపించడం లేదా అని ఆయన విరుచుకుపడ్డారు.రాష్ట్ర అభివృద్ధిని మాటలలోనే గాని చేతలలో చూపించలేని అసమర్ధ పాలనను కూటమి ప్రభుత్వం అవలంబిస్తుందని కూటమి ప్రభుత్వంపై దుయ్యబట్టారు.

అనంతపురం

అనంతపురంలో రేపు నీటి సరఫరా బంద్

పీఏబీఆర్ డ్యాం నుంచి అనంతపురం నగరానికి నీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని కమిషనర్ బాలస్వామి తెలిపారు. పైపులైను లీకేజీ కారణంగా ఈనెల 18వ తేదీ సాయంత్రం నుంచి నీటి సరఫరా ఆగుతుందని పేర్కొన్నారు. వీలైనంత త్వరగా మరమ్మతులు చేస్తామన్నారు. నగర ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు.

తెలంగాణ

తీరనున్న శాలిగౌరారం, మోత్కూరు మండల ప్రజల ఇబ్బందులు !!

నకిరేకల్ :సెప్టెంబర్ ( పున్నమి ప్రతినిధి ) నకిరేకల్ మున్సిపాలిటీలో ఉన్న పన్నాల గూడెం నుండి కడపర్తికి వెళ్లేదారిలో రోడ్డు చాలా సంవత్సరాల నుండి గుంతల మయంగా ఉంది. ఈ దారిలో ఎక్కువగా శాలిగౌరారం, మోత్కూర్ మండల ప్రజలు ప్రతిరోజు నకిరేకల్ కి ఈ దారి గుండా వస్తున్నప్పుడు అనేక ప్రమాదాలకు గురైనారు. ప్రతినిత్యం దుమ్ము, ధూళితో అనేక ఇబ్బందులు పడ్డారు.అలాంటి రోడ్డుకు ప్రభుత్వం పది కోట్లతో రోడ్డును వెడల్పు చేయనున్నది. ఈ రోడ్డుకి ఇరువైపులా ఉన్న చెట్లను నరికి వేస్తున్నారు. నరికిన చెట్లకు బదులుగా వేరేచోట కొత్త మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని, రోడ్డును త్వరగా పూర్తిచేసి తమ ఇబ్బందులను తొలగించాలని అధికారులను ప్రజలు కోరుతున్నారు.

తిరుపతి

టాటాఏస్ ఢీకొని వ్యక్తి మృతి

శ్రీకాళహస్తి పట్టణం లోని మిట్ట కండ్రిక వద్ద బుధవారం టాటా ఏస్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడం జరిగింది.ఈ యాక్సిడెంట్ లో మోటార్ సైకిల్ నడుపుతున్నటువంటి రాజ్ కిరణ్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది.డిఎస్పీ నరసింహమూర్తి తెలియజేసిన వివరాల మేరకు రేణిగుంట ఎయిర్ పోర్ట్ నందు పని చేస్తున్న రాజ్ కిరణ్ , మహేష్ అనే వ్యకి కలిసి ద్విచక్రవాహనంపై శ్రీకాళహస్తి నుండి తిరుపతి వైపు వెళ్తుండగా టాటా ఏస్ వారిని ఢీకొట్టినదని,రాజ్ కిరణ్ అక్కడే మృతి చెందగా మహేష్ కి స్వల్ప గాయాలు అయినట్లు తెలియజేసారు.వీరిని శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలియజేసారు.

కాకినాడ

ప్రయివేటు కళాశాల యాజమాన్యాల పట్ల కఠిన చర్యలుతీసుకోవాలి.

కాకినాడ : విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్న ప్రైవేటు కళాశాలల యాజమాన్యాల వైఖరిపై ప్రభుత్వం కఠినచర్యలు తీసుకోవాలని ఆమ్ఆద్మీపార్టీ, ఆర్టిఐ జేఏసీ,ఎస్సెఫ్ఐ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు గురువారం కలెక్టరు కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి డిఆర్వో జె.వెంకటరావు కు వినతిపత్రం అందజేశారు. ఫీజు రియంబర్స్మెంట్ తో సంబంధం లేకుండా ప్రతి విద్యార్థితో పరీక్షా రుసుము కాలేజీ యాజమాన్యాలు కట్టించుకునేలా ఆదేశాలు ఇవ్వాలని రాష్ట్ర ఉపాధ్యక్షులు తోకల వరదరాజు కోరారు.ఈ కార్యక్రమంలో ఆమ్ఆద్మీపార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తోకల వరదరాజ సాంచి,ఎస్సెఫ్ఐ సూరిబాబు,ఆర్టిఐ- జేఏసి కన్వీనర్ పప్పు దుర్గా రమేష్,ఆమ్ఆద్మీపార్టీ కాకినాడ జిల్లా కన్వీనర్ నరాల శివ, ఆమ్ఆద్మీపార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కాళ్ళూరి కృష్ణమోహన్, మహమ్మద్ రియాజ్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మేంబర్, పేపకాయల కనకదుర్గ తదితరులు పాల్గొన్నారు.

అన్నమయ్య

ప్రధాని జన్మదినోత్సవానికి నూతన అర్థం: గ్రామీణులకు వైద్య శిబిరాల వరం మహిళా ఆరోగ్యం – కుటుంబ శక్తి: చిట్వేల్, వడ్డిపల్లిలో స్వస్థ నారీ ససక్త పరివార్ వైద్య శిబిరాలు

ప్రధాన మంత్రి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా స్వస్థ నారీ ససక్త పరివార్ అభియాన్ కార్యక్రమం సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు నిర్వహించబడుతోంది. ఈ క్రమంలో చిట్వేల్ ప్రభుత్వ ఆసుపత్రి మరియు కె.కె. వడ్డిపల్లి కాలనీలో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించారు. చిట్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ అన్సారీ ఆధ్వర్యంలో మహిళలు, చిన్నారులు, గర్భిణీలు, బిడ్డ తల్లులకు ఎన్‌సీడీ స్క్రీనింగ్, టిబి అవగాహన, రక్తపరీక్షలు, ఇమ్మ్యూనైజేషన్, స్కాన్ పరీక్షలు చేశారు. అనంతరం రోగుల ఆరోగ్య పరిస్థితిని బట్టి ఉచిత మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సల్మా, పీహెచ్‌ఈఓ విజయ్‌కుమార్, పీహెచ్‌ఎన్ ధనలక్ష్మి, విజయకుమారి, సూపర్వైజర్ ఇస్మాయిల్ బాషా, ఎంఎల్హెచ్‌పీలు, ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్లు చురుకుగా పాల్గొన్నారు. అదేవిధంగా కె.కె. వడ్డిపల్లి కాలనీలో కూడా ఎంఓ విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో, సూపర్వైజర్ ఇస్మాయిల్ బాషా పర్యవేక్షణలో శిబిరం నిర్వహించారు. మహిళలు, పిల్లలు, గర్భిణీలకు బీపీ, షుగర్, రక్తపరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎన్‌ఎమ్ పరిదా, ఎంఎల్హెచ్‌పీ రుఖియా భాను, కృష్ణవేణి, శాంతికుమారి, ఆశావర్కర్లు సేవలందించారు. ఈ శిబిరాల ద్వారా స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో లబ్ధి పొందగా, వైద్యులు మహిళల ఆరోగ్యం, పిల్లల శ్రేయస్సు కోసం ఇలాంటి కార్యక్రమాలు ఇంటింటికి చేరుస్తామని తెలిపారు.

ఎలూరు

నరేంద్ర మోడీ గారి 75వ జన్మదిన వేడుకలు

నూజివీడు నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ జి.ఆర్.కె. రంగారావు గారి ఆధ్వర్యంలో, ఆగిరిపల్లి మండలం, ఆగిరిపల్లి గ్రామంలో బస్టాండ్ ఎదురుగా భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి 75వ,జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గృహనిర్మాణ మరియు సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి శ్రీ కొలుసు పార్థసారథి గారు ముఖ్య అతిథిగా హాజరై మోడీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కార్యకర్తలతో కలిసి స్వీట్లు పంచి ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ఎలూరు

వైద్య ఖర్చులకోసం సీఎం సహాయనిధి చెక్కులను అందజేసిన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ గొలుసు పార్థసారథి గారు

*వైద్య ఖర్చుల కోసం సీఎం సహాయనిధి చెక్కులను అందజేసిన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కొలుసు పార్థసారధి గారు…* *నూజివీడు పట్టణం, 16వ వార్డుకు చెందిన పులిచెర్ల శారద గారికి వైద్య చికిత్స నిమిత్తం ₹50,000/- ఎల్ఓసి చెక్కు, అలాగే ముసునూరు మండలం, చెక్కపల్లి గ్రామానికి చెందిన షేక్ అక్తరునిస్సా గారికి వైద్య ఖర్చుల భారం తగ్గించే ఉద్దేశ్యంతో ₹2,00,000/- ఎల్ఓసి చెక్కును రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రివర్యులు శ్రీ కొలుసు పార్థసారధి గారు స్వయంగా అందజేశారు.* *ఈ సందర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ –* *“ప్రజలకు ఎక్కడ సమస్య ఉంటే అక్కడ నేనున్నాను. ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా వైద్య సహాయం అందించటం కూటమి ప్రభుత్వానికి ప్రాధాన్యత. ప్రతి ఒక్కరి ప్రాణం మాకు విలువైనదే. పేదలకు, బలహీన వర్గాలకు వైద్యరంగంలో ఎప్పటికప్పుడు అండగా నిలుస్తాం” అని హామీ ఇచ్చారు.* *లబ్ధిదారుల కుటుంబ సభ్యులు మంత్రి గారికి కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ ఆర్థిక సహాయం తమకు ఎంతో ఉపయుక్తమవుతుందని భావోద్వేగంతో తెలిపారు.*

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.