Tuesday, 5 May 2026

Blog

తెలంగాణ

దసర కీ బస్ టికెట్ ధరల పెంపు లేదు. TGSRTC అధికారులు వెల్లడి

పున్నమి ప్రతినిధి హైదరాబాద్ దసర కీ బస్ ఛార్జి లు పెంపు లేదని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రకటించినది. రద్దీ దృష్ట్యా ఏర్పాటు చేసే స్పెషల్ సర్వీస్ లలో మాత్రమే 50% ధరలు పెంచడం జరిగింది అని 2003 నుండి ఈ అనవయితి ఉందని ఇప్పుడు కొత్త ఏమి కాదని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మీద కొందరు చేస్తున్న దుస్ప్రచారం ని మానుకోవాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అధికారులు హితవు పలికారు

E-పేపర్

జండా మహోత్సవానికి ఎంపీపీకి ఆహ్వానం

నందలూరు : మండలంలోని నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీ జెండామాన్ వీధిలో హజరత్ మహబూబ్ సుభాని జండా మహోత్సవ కార్యక్రమం రేపు నెల 9,10 తారీకుల లో ముఖ్యఅతిథిగా హాజరు కావలసినదిగా మండల పరిషత్ అధ్యక్షులు మేడా విజయభాస్కర్ రెడ్డి ని జెండా కమిటీ సభ్యులు శుక్రవారం ఆహ్వానించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ కొన్ని అనివార్య కారణాల వల్ల గత 15 సంవత్సరాలుగా మహోత్సవ కార్యక్రమం జరగలేదని, ఈసారి అంగా రంగ వైభవంగా జరుపుతామని తెలిపారు. అందుకు మండల పరిషత్ అధ్యక్షులు మేడా విజయభాస్కర్ రెడ్డి స్పందిస్తూ ఆధ్యాత్మిక, మతపరమైన, సాంప్రదాయ కార్యక్రమాలకు తమ వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కోఆప్షన్ సభ్యులు కలీముల్లా ఖాన్, కాంట్రాక్టర్ మోహన్ రెడ్డి , రాజు , ఈడిగ సంఘం నాయకులు తుమ్మల శ్రీధర్ గౌడ్,గోల్డ్ షాప్పమౌల , సమీర్, షఫీ, అన్వర్, అల్తాఫ్, మహమ్మద్, షమీ, తదిరులు పాల్గొన్నారు.

తిరుపతి

ఉప ముఖ్యమంత్రి ని కలిసిన కొట్టె సాయి

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ ని శ్రీకాళహస్తి దేవస్థానం ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ గా ఎంపికైన కొట్టే సాయి ప్రసాద్ కలిశారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో కలిసి ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ బాధ్యతలు అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

నిర్మల్

ఏకంగా పోలీస్ స్టేషన్‌లోనే హెడ్ కానిస్టేబుల్ పై కత్తితో దాడి చేసి పారిపోయిన దుండగుడు

పున్నమి ప్రతినిధి నిర్మల్ సెప్టెంబర్: నిర్మల్ జిల్లా కుభీర్ పోలీసుస్టేషన్‌లో ఓ హెడ్ కానిస్టేబుల్ పై కత్తితో దాడి చేసిన దుండగుడు నిన్న రాత్రి 10 గంటల ప్రాంతంలో కత్తితో పోలీస్ స్టేషన్‌లోకి వచ్చిన వ్యక్తి.. నేరుగా ఎస్ఐ గదిలోకి వెళ్తుండగా అడ్డుకున్న హెడ్ కానిస్టేబుల్ టి.నారాయణ, అయితే వెంటనే తన వద్ద ఉన్న కత్తితో ఆయన కడుపులో పైభాగంలో పొడిచిన నిందితుడు అక్కడే ఉన్న హోంగార్డు గిరిధారి అడ్డుకోవడానికి రాగా, బలంగా తోసేయడంతో అతని చేతులకు గాయాలు వీరి అరుపులకు మిగతా సిబ్బంది, స్టేషన్ వెనుక క్వార్టర్లలోని పోలీసులు రావడంతో పరారైన నిందితుడు గాయపడిన నారాయణ, గిరిధారిలకు కుభీర్‌లో ప్రాథమిక చికిత్స అందించి, భైంసా ఏరియా ఆసుపత్రికి తరలింపు దాడికి పాల్పడిన వ్యక్తి మహారాష్ట్ర ప్రాంతం నుంచి వలస వచ్చినట్లు భావిస్తున్న పోలీసులు

ఆంధ్రప్రదేశ్

1 నుంచి ఆన్లైన్ గేమింగ్ చట్టం అమలు: కేంద్రం

సెప్టెంబర్ 20 పున్నమి ప్రతినిధి @ నూతనంగా రూపొందించిన ఆన్లైన్ గేమింగ్ ప్రోత్సాహ, నియంత్రణ చట్టం అక్టోబరు 1నుంచి అమల్లోకి వస్తుందని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. గత నెలలో పార్లమెంటులో ఆమోదం పొందిన ఈ చట్టం ప్రకారం అన్ని రకాల ఆన్లైన్ మనీ గేమ్స్ ను నిషేధిస్తున్నట్టు తెలిపారు. ఈ-స్పోర్ట్స్, ఇతర ఆన్లైన్ గేమ్స్ కు ప్రోత్సాహం ఉంటుందని చెప్పారు.

సినిమా

“ఆస్కార్‌ 2026” ఎంట్రీ పొందిన జాన్వీ కపూర్‌ సినిమా

సెప్టెంబర్ 19 పున్నమి ప్రతినిధి @సినిమా: ఇషాన్‌ కట్టర్‌, విశాల్‌ జెత్వా, జాన్వీ కపూర్‌ కలిసి నటించిన ‘హోమ్‌బౌండ్‌’ చిత్రం భారత్‌ తరఫున ‘ఆస్కార్‌ 2026’కు అధికారికంగా ఎంట్రీ సాధించింది.

ఆంధ్రప్రదేశ్

తిరుమలలో ప్లాస్టిక్ రీ సైక్లింగ్ యూనిట్ ప్రారంభం

సెప్టెంబర్ 19 పున్నమి ప్రతినిధి @ తిరుమలలో ప్లాస్టిక్ రీ సైక్లింగ్ యూనిట్ను ప్రారంభించారు. ఈ మేరకు Reklaim Ace యంత్రం పనితీరును అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి పరిశీలించారు. భక్తులు టెట్రా ప్యాక్స్, స్నాక్స్ ప్యాకెట్లు ఇందులో వేయొచ్చు. ఇందుకోసంం UPI ద్వారా లాగిన్ అయ్యి QR కోడ్ స్కాన్ చేయాలి. ప్లాస్టిక్ ఇచ్చినవారికి రూ.5 లభిస్తాయి.

ఆంధ్రప్రదేశ్

బీమా సఖి‌ యోజన — ఏపీలో మహిళలకు అదిరే అవకాశం!

సెప్టెంబర్ 19 పున్నమి ప్రతినిధి @ ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని డ్వాక్రా గ్రూప్ మహిళలకు అవగాహన ప్రక్రియలో పాల్గొనే అవకాశమున్నది. ఎంపికైన మహిళలకు బీమా సఖి గా శిక్షణ ఇస్తారు, ధ్రువపత్రాలు ఇచ్చే ప్రణాళిక ఉంటుంది. ప్రోత్సాహక వేతనాలు / నెలకు నెలవారీ ప్రోత్సాహక 1. మొదటి సంవత్సరం ₹ 7,000 2. రెండవ సంవత్సరం ₹ 6,000 3. మూడో సంవత్సరం మొదలు ₹ 5,000 4. అదనంగా, బోనస్, కమిషన్లు కూడా ఉంటాయి. అర్హతలు 1. వయసు: 18–70 సంవత్సరాల మధ్య ఉండాలి. 2. విద్య: పదో తరగతి ఉత్తీర్ణత కావాలి. 3. డ్వాక్రా గ్రూప్ మహిళలు మాత్రమే. 4. ఎల్ఐసి ఏజెంట్‌గా ఉన్నవారు, ఎల్ఐసి ఉద్యోగుల కుటుంబ సభ్యులు, సంపన్న ఉపాధి-వ్యవహారాలు ఉన్నవారు అర్హులే కాకపోతారు. 5. ఇప్పటి వరకు ఏ ఉద్యోగం పొందలేదని ఉండాలి. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత అధికారిక దరఖాస్తు ప్రక్రియను పూర్తిచేయాలి.

ఆంధ్రప్రదేశ్

అమరావతి భవిష్యత్తుకు అద్దం పట్టిన నారెడ్కో ప్రాపర్టీ ఫెస్టివల్

పురపాలక శాఖ మంత్రి నారాయణ నగర వాసుల నుండి విశేష ఆదరణ చూరగొన్న స్థిరాస్తి ప్రదర్శన అమరావతి లో పెట్టుబడి కోసం ఇతర ప్రాంతాల నుంచి పలువురి ఆసక్తి సెప్టెంబర్ 19 పున్నమి ప్రతినిధి @ అమరావతి ప్రాపర్టీ ఫెస్టివల్ కేవలం ప్రదర్శన మాత్రమే కాదని, ఇది రేపటి రాజధాని నగర భవిష్యత్తు ఎలా ఉండబోతోందో చూపిస్తుందని మున్సిపల్‌ పరిపాలన మంత్రి డా. పి. నారాయణ అన్నారు. విజయవాడలోని ఎ కన్వెన్షన్ లో జరుగుతున్న అమరావతి ప్రాపర్టీ ఫెస్టివల్–2025 ను శుక్రవారం సందర్శించిన ఆయన అమరావతి మోడల్స్, ప్రాజెక్టులపై ఆకర్షణ వ్యక్తం చేశారు. నారాయణ మాట్లాడుతూ అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. అనుమతుల ప్రక్రియ సులభతరం చేశామని, పెట్టుబడిదారులకు అనుకూలమైన విధానాలు తీసుకొచ్చామని తెలిపారు. రియల్ ఎస్టేట్ అంటే కేవలం భవనాలు కాదని, ఇది ఉపాధి కల్పిస్తుంది, ఆర్థిక వృద్ధికి ఊతమిస్తుంది. అభివృద్ధి దిశగా ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుంది అని స్పష్టం చేశారు. మంత్రి నారాయణ ప్రత్యేకంగా ఫెస్టివల్ లో ఏర్పాటు చేసిన మాలక్ష్మీ గ్రూప్ స్టాల్ ను ప్రారంభించారు. ఆయనతో పాటు సంస్థ సీఈఓ సందీప్ మండవ ఉన్నారు. ఉదయం ఈ ప్రాపర్టీ ఫెస్టివల్‌ను విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ దీపప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఎంపీ శివనాథ్ మాట్లాడుతూ, “సొంతింటి కల సాకారం చేసుకోవాలనుకునే వారికి ఈ ప్రాపర్టీ షో గొప్ప వేదిక కానుందన్నారు. ఒకే చోట ఇందరు బిల్డర్స్, డెవలపర్స్, బ్యాంకులు రావడం అరుదైన విషయ మన్నారు. అమరావతి రూపుదిద్దుకుంటున్న దిశలో ఈ ప్రదర్శన ఒక పెద్ద మైలురాయి అవుతుందని తెలిపారు. అమరావతి త్వరలోనే దేశంలోనే అందమైన నగరంగా నిలుస్తుందని ఇక్కడ పెట్టుబడి పెట్టే వారికి మంచి భవిష్యత్ ఉంటుందని వివరించారు. “ఇప్పటికే నాలా చట్టం రద్దు చేసి బిల్డర్స్‌కు ఊరట కల్పించాం. రియల్ ఎస్టేట్ రంగానికి ఎదురయ్యే సమస్యలను నేను వ్యక్తిగతంగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరింపజేస్తాను. ఈ రంగం జీడీపీ పెంపు, ఉపాధి అవకాశాల సృష్టి వంటి విషయాల్లో కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే ఈ ఫెస్టివల్‌ను ప్రతి ఒక్కరూ తప్పకుండా సందర్శించాలి, ఈ ఫెస్టివల్ కేవలం స్థలాలు, ఇళ్లు కొనుగోలు కోసం కాదు. ఇది అమరావతి భవిష్యత్తుపై నమ్మకం ఉంచే వేదిక. అందరూ తప్పక విచ్చేసి ఉపయోగం పొందండి” అని ఎంపీ కేశినేని శివనాథ్ పిలుపునిచ్చారు. నారెడ్కో రాష్ట్ర అధ్యక్షుడు గద్దె చక్రధర్ మాట్లాడుతూ, అమరావతి దిశగా ఇది మైలురాయి అని అన్నారు. సెంట్రల్ జోన్ అధ్యక్షుడు సందీప్ మండవ మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ అభివృద్ధి అనేక రంగాలకు ఊతమిస్తుందని చెప్పారు. ఫెస్టివల్ చైర్మన్ కిరణ్ పరుచూరి మాట్లాడుతూ, 100కి పైగా బిల్డర్స్, డెవలపర్స్, ఫైనాన్స్ సంస్థలు పాల్గొనడం ప్రత్యేకత అని చెప్పారు. ఈ ఫెస్టివల్‌లో ప్రభుత్వ కాంప్లెక్సులు, రోడ్లు, బ్రిడ్జిలు, భవిష్యత్ ప్రాజెక్టుల మినియేచర్ మోడల్స్ ఆకర్షణగా నిలిచాయి. ప్రజలు అమరావతి మాస్టర్ ప్లాన్‌ను దగ్గరగా చూసే అవకాశం పొందుతున్నారు. సెల్ఫీ లు దిగుతూ తమ అభిమానాన్ని చాటుకున్నారు

తెలంగాణ

పోషణ మాసం ఉత్సవాలను వినుత్నంగా నిర్వహించాలన్న : జిల్లా కలెక్టర్

నకిరేకల్ :సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి ) పోషణ మాసం పై శుక్రవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో మహిళా శిశు సంక్షేమ, సంబంధిత శాఖ అధికారులతో సమావేశం నిర్వహించి, పోషణ మాసం ఉత్సవాలను వినూత్నంగా నిర్వహించాలని ఆదేశించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.