Tuesday, 5 May 2026

Blog

తెలంగాణ

రేపే సూర్యగ్రహణం.. మనకు కనిపిస్తుందా?

ఈ ఏడాదిలో చివరి గ్రహణం రేపు చోటుచేసుకోనుంది. అయితే ఇది పాక్షిక గ్రహణమే. సూర్యుడిని చందమామ కొంత భాగమే కవర్ చేయనుంది. భారత కాలమానం ప్రకారం రేపు రాత్రి 10.59 గంటలకు ఇది సంభవించనుంది. సూర్యాస్తమయం తర్వాత జరుగుతున్నందున ఇండియా నుంచి చూడలేం. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అంటార్కిటికా, పసిఫిక్ ఐలాండ్స్లో కనిపించనుంది. భారత్ నుంచి సోలార్ ఎక్లిప్స్ చూడాలంటే 2027 AUG 2 వరకు వేచి చూడాల్సిందే.

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ

మాజీ జెడ్పీటీసీ మోహన్ రెడ్డికి ఘన సన్మానం

మాజీ జెడ్పీటీసీ మోహన్ రెడ్డికి ఘన సన్మానం కామారెడ్డి, 29 సెప్టెంబర్ పున్నమి ప్రతినిధి. :  కామారెడ్డి అశోక్ నగర్: రామారెడ్డి మండల మాజీ జెడ్పీటీసీ శ్రీ నా రెడ్డి మోహన్ రెడ్డి గారు ఇటీవల అమెరికా పర్యటనను విజయవంతంగా ముగించు కుని స్వదేశానికి తిరిగి వచ్చిన సందర్భంగా కామా రెడ్డిలోని అశోక్ నగర్ కాలనీ వాసులు ఆయనకు ఘన సన్మానం నిర్వహించారు.ఈ సందర్భంగా కాలనీ సభ్యులు మోహన్ రెడ్డిని శాలువాతో సత్క రించి, ఆయన విదేశీ పర్యటన విశేషాలను అడిగి తెలుసుకున్నారు. మోహన్ రెడ్డి మాట్లాడు తూ, కాలనీ వాసులు చూపించిన అభిమానానికి కృతజ్ఞ తలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీకి చెంది న పలువురు ప్రముఖులు, యువకులు పాల్గొన్నా రు. మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలుపుతూ, ఆయన భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

తిరుపతి

ఎక్త్ యాంటీ కరప్షన్ ఆధ్వర్యంలో మహిళ కు ఆర్థిక సహాయం

శ్రీకాళహస్తి పట్టణంలోని పిట్టల వారి వీధికి చెందిన ఒక మహిళ గుండె మరియు కిడ్నీ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విషయాన్ని యాంటీ కరప్షన్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ లాలు ఎక్త్ యాంటీ కరప్షన్ ఆల్ ఇండియా చీఫ్ జనరల్ సెక్రటరీ కె.అబ్దుల్ రహమాన్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది.కె.అబ్దుల్ రెహమాన్ ఆదేశాల మేరకు అనారోగ్యంతో బాధపడుతున్న ఆ మహిళను యాంటీ కరప్షన్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ లాలు పరామర్శించి,ధైర్యం చెబుతూ అవసరమైన మందులు మరియు పండ్లు ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ మహబూబ్ బాషా,ఎక్త్ యాంటీ కరప్షన్ డిస్ట్రిక్ట్ మీడియా ప్రెసిడెంట్ పాపానాయుడుపేట యాసిన్,మీర్జా సాహెబ్,అన్వర్ పాల్గొన్నారు.

తెలంగాణ

పింఛన్ల హామీలు ఏమయ్యాయి? నిలదీస్తున్న వయోవృద్ధులు

పింఛన్ల హామీలు ఏమయ్యాయి? ప్రభుత్వాన్ని నిలదీస్తున్న వృద్ధులు ​కామారెడ్డి: సెప్టెంబర్ 20 (పున్నమి ప్రతినిధి) ​ఎన్నికల సమయంలో వివిధ రాజకీయ పార్టీలు పింఛన్ల విషయంలో ఎన్నో హామీలు ఇచ్చాయి. కానీ, అధికారం చేపట్టిన తర్వాత ఏ ఒక్క పార్టీ  పింఛన్ల గురించి అసెంబ్లీలో మాట్లాడటం లేదు. ఈ సమస్యను గమనించిన పద్మశ్రీ మందకృష్ణ మాది గ  గత ఐదు నెలలుగా పింఛను దారులను ఏకం చేసి పోరాటాలు చేస్తున్నారు.ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు కలెక్టరేట్, తహసీల్దార్ కార్యాలయా లు, మున్సిపల్ కార్యాలయాలు, గ్రామ పంచాయ తీ కార్యాలయాల ముట్టడి వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలలో నిరసనలు తెలియజేస్తూ, పంచా యతీ కార్యదర్శులకు వినతిపత్రాలు అందజేస్తు న్నామని అన్నారు.ఈ నిరసన కార్యక్రమాల్లో ఎ మ్మార్పీస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కామారెడ్డి జిల్లా మాజీ కార్యదర్శి కొత్తోల్ల యాదగిరి మాదిగ, వి హెచ్ పి ఎస్ నాయకులు ఆకుల రాజ య్య, రాజా గౌడ్, ఆకుల చిన్న రాజయ్య,వంగ దేవయ్య, పురం నరసయ్య, నాదరి బాలయ్యతో పాటు పందుల మల్లయ్య, కాల బాలయ్య, సూరం పల్లి మొగులయ్య, ఆల నారాయణరెడ్డి, బత్తుల సాయిలు, ఆకుల లక్ష్మి, తాటికొండ లక్ష్మి, కాల మణెమ్మ వంటి వయోవృద్ధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

గాజువాక టీడీపీ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాసరావుకు అభినందనలు వెల్లువ

ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (APIIC) డైరెక్టర్‌గా నియమితులైన టీడీపీ గాజువాక సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాసరావు కి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా వివిధ కూటమి నాయకులు, కార్యకర్తలు ఆయన్ని కలసి అభినందనలు తెలియజేస్తున్నారు. గాజువాక హోల్‌సేల్ ఫ్రూట్స్ & వెజిటబుల్స్ మార్చంట్స్ అసోసియేషన్ ప్రతినిధులు ప్రత్యేకంగా టిడిపి కార్యాలయానికి వచ్చి ఆయనను సత్కరించారు. ఈ సందర్భంగా సాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలు అందజేసి సన్మానించారు. ప్రసాదుల శ్రీనివాసరావు ఒక సాధారణ టీడీపీ కార్యకర్తగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి, క్రమంగా కృషి చేస్తూ కార్పొరేషన్ డైరెక్టర్ స్థాయికి ఎదగడం శుభపరిణామం అని అసోసియేషన్ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. ఆయన మరిన్ని పదవులను అధిరోహించాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు కర్రి నాగేశ్వరరావు, విల్లూరి శ్రీనివాసరావు, మద్దాల రామారావు, ఎ. శ్రీనివాసరావు, సోమేశ్వరరావు, డి. శ్రీనివాసరావు, తాతబాబు తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ

జ్యుడీషియల్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ లో పాల్గొనేందుకు నల్లగొండ జిల్లాకు వచ్చిన : హైకోర్టు జడ్జి

నకిరేకల్ :సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి ) జ్యూడిషల్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ లో పాల్గొనే నిమిత్తం నల్గొండ జిల్లాకు వచ్చిన హైకోర్టు జడ్జి జస్టిస్ బి. విజయసేనారెడ్డిని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి శనివారం కోర్టు ఆవరణలో ఉన్న అతిథి గృహం వద్ద మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు.

జాతీయ అంతర్జాతీయ

రేపు సూర్యగ్రహణం.. మీకు ఈ విషయాలు తెలుసా

సెప్టెంబర్ 20 పున్నమి ప్రతినిధి @ రేపు సూర్యగ్రహణం.. మీకు ఈ విషయాలు తెలుసా ఈ సంవత్సరంలో చివరి సూర్యగ్రహణం రేపు (సెప్టెంబర్ 21న) ఏర్పడనుంది. ఈ పాక్షిక సూర్య గ్రహణం రాత్రిపూట సంభవించడం వల్ల మన దేశంలో కనిపించదు. కాబట్టి మనకు సూతక కాలం కూడా వర్తించదు. ఈ గ్రహణం సమయంలో ఆలయాలు మూసివేస్తారు. ఈ సమయంలో సూర్యుడి వాతావరణం స్పష్టంగా కనిపిస్తుంది. శాస్త్రపరమైన అధ్యయనాలకు ఇది అత్యంత అనుకూలం. ఈ సూర్య గ్రహణం గరిష్ఠంగా 7 నిమిషాల 30 సెకెన్ల పాటు ఉంటుంది. మిగతా సూర్యగ్రహణాలన్నీ ఇంతకంటే తక్కువ సమయమే ఉంటాయి.

ఆంధ్రప్రదేశ్

విద్యాలయం – వాణిజ్య కార్యకలాపాలకు స్థలం కాదు: ఆరేటి మహేష్ బాబు

జైల్ రోడ్‌లో ఉన్న ఫుడ్ కోర్ట్‌ను జీవీఎంసీ కౌన్సిల్ తీర్మానంతో తొలగించిన విషయంపై రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆరేటి మహేష్ బాబు స్పందిస్తూ, “ఆంధ్ర యూనివర్సిటీ సత్రం కాదు. ఇది చదువుల తల్లి ఉండే పవిత్ర దేవాలయం. వాణిజ్య కార్యకలాపాలకు అనుమతి ఇవ్వడం అనేది విద్యా వాతావరణాన్ని కలుషితం చేయడమే” అని అన్నారు. ఫుడ్ కోర్ట్ తొలగింపు నిర్ణయం అనూహ్యంగా తీసుకోలేదని, స్థానిక ప్రజల అభ్యర్థన మేరకే చర్యలు చేపట్టినట్లు జీవీఎంసీ కమిషనర్ తెలిపారు అని స్ట్రీట్ వెండర్లకు చట్టపరమైన రక్షణలు ఉన్నాయని, వాటి ప్రకారం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు అని అన్నారు ఈ పరిణామంలో కొంతమంది రాజకీయ నాయకులు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు పూర్తయ్యే వరకు ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంగణంలో స్థలం కేటాయించాలని చేసిన డిమాండ్లను ఆరేటి మహేష్ బాబు తీవ్రంగా విమర్శించారు.“శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న ఈ విశ్వవిద్యాలయం ఎంతోమంది పేద విద్యార్థులకు భవిష్యత్తునిచ్చిన విద్యాలయం. ఇక్కడ వ్యాపారానికి అనుమతిస్తే, పవిత్ర వాతావరణం కలుషితం అవుతుంది. అలాంటి ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించం” అని ఆయన స్పష్టం చేశారు. “ఆంధ్ర విశ్వవిద్యాలయం మన వారసత్వ సంపద. అక్కడ చదువుకొని ఉన్నత స్థానాలకు ఎదిగిన వారికే ఆ నేల విలువ బాగా అర్థమవుతుంది. కాబట్టి రాజకీయ పార్టీలు ఇలాంటి డిమాండ్లు చేయకుండా, యూనివర్సిటీ పరిరక్షణలో భాగస్వాములుగా ఉండాలి. అధికారులు కూడా రాజకీయ ఒత్తిడికి లోనుకాకుండా విద్యా వాతావరణాన్ని కాపాడే నిర్ణయాలు తీసుకోవాలి” అని ఆరేటి మహేష్ బాబు పిలుపునిచ్చారు.

పశ్చిమ గోదావరి

మహాదేవపట్నం మేజర్ పంచాయతీలో రూ. 1,50,00,000/- వ్యయంతో

ఉండి మండలం, మహాదేవపట్నం మేజర్ పంచాయతీలో రూ. 1,50,00,000/- వ్యయంతో నిర్మించనున్న మేజర్ లింక్ రోడ్డు నిర్మాణ పనులకు ఈరోజు ఉదయం శంఖుస్థాపన చేసిన శాసనసభ డిప్యూటీ స్పీకర్ మరియు ఉండి ఎమ్మెల్యే శ్రీ రఘురామకృష్ణ రాజు గారు. మూడు గ్రామాలను కలిపే ఈ రోడ్డు నిర్మాణ పనులు మరో 40 రోజులలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకు రావడం జరుగుతుందని శ్రీ రఘురామకృష్ణ రాజు గారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.