Tuesday, 5 May 2026

Blog

క్రైమ్

హైకోర్టు కీలక నిర్ణయం.. సీఐడీకి విచారణ బాధ్యతలు

సెప్టెంబర్ 20 పున్నమి ప్రతినిధి @ ఏపీ : టీటీడీ పరకామణి సొమ్ము అవకతవకల కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. గత ప్రభుత్వ హయాంలో సొమ్ము దారి మళ్లిన కేసులో నిందితుడు రవికుమార్పై అభియోగాలు కొట్టివేస్తూ లోక్ అదాలత్ ఇచ్చిన తీర్పును హైకోర్టు నిలిపివేసింది. ఈ కేసును పూర్తి వివరాలతో విచారించి నివేదిక సమర్పించాలని సీఐడీని ఆదేశించింది.

తూర్పు గోదావరి

ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి పనులు చేపట్టండి

ది.20.09.2025 *ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి పనులు చేపట్టండి..* *జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి* *టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష* ప్రజల్లో సంతృప్తి ఉండేలా.. ప్రాధాన్యత క్రమంలో నగరంలో అభివృద్ధి పనులను చేపట్టాలని అధికారులకు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ విభాగాధిపతులతో శనివారం సమీక్ష నిర్వహించారు. తొలుత నగరంలో జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులపై ఆరా తీశారు. మొదటి దశలో చేపట్టిన 15 రహదారుల విస్తరణ పనులను నెల రోజుల్లోగా పూర్తి చేయవలసిందిగా ఆదేశించారు. అనంతరం పురోగతిలో ఉన్న అభివృద్ధి పనులపై డివిజన్ల వారీగా సమీక్షించారు. వర్షాల కారణంగా ముంపునకు గురవుతున్న ప్రాంతాల గూర్చి అడిగి తెలుసుకున్నారు. లోతట్టు వీధులలో నీరు నిలిచిపోకుండా సమగ్ర యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయవలసిందిగా ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. త్రాగునీటి సరఫరాలో ఎక్కడా ఫిర్యాదులు రాకూడదని.. కనుక నీటిని ప్రతీరోజు పరీక్షించాలన్నారు. మురుగు కాలువల్లో ఎక్కడైనా తాగునీటి పైపులైన్లు ఉన్నట్లయితే తక్షణమే మార్చాలన్నారు. అలాగే జంక్షన్ ల అభివృద్ధి పనులను టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ అధికారులు సమన్వయంతో ప్రజలకు ఎక్కడా అసౌకర్యం కలగకుండా ప్రాధాన్యత క్రమంలో చేపట్టాలన్నారు. సమావేశంలో అడిషనల్ కమిషనర్ పి.వి.రామలింగేశ్వర్, డిప్యూటీ కమిషనర్ ఎస్.వెంకటరమణ, సెక్రటరీ జి.శైలజ వల్లి, సిటీ ప్లానర్ జి.కోటయ్య, ఎస్ఈ(ఇంఛార్జి) రీటా, ఎంహెచ్ఓ వినూత్న, రెవెన్యూ అధికారులు సీహెచ్ శ్రీనివాసరావు, రవికుమార్, మేనేజర్ ఎండి అబ్దుల్ మాలిక్, ఈఈలు మాధవి, మదర్సా అలీ, అకౌంటెంట్ నాగమణి, సీఎంఎం రామలక్ష్మి, ఏసీపీలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

తిరుపతి రాజమండ్రి మధ్య కొత్త విమాన సర్వీస్

తిరుపతి–రాజమండ్రి మధ్య కొత్త విమాన సర్వీసు రాజమహేంద్రవరం, తేదీ: 20.09.2025 ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక రాజధాని రాజమండ్రి మరియు భారత ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి మధ్య ప్రయాణ దూరం మరింత సంక్షిప్తమయ్యిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. అల్లయన్స్ ఎయిర్ సంస్థ ఈ అక్టోబర్ 1న తొలి విమానంతో ఈ మార్గంలో సేవలను ప్రారంభించనుందని, షెడ్యూల్ ఇప్పటికే విడుదలయిందని వెల్లడించారు. ఏటీఆర్ 72 విమానం ఉదయం 09:25 గంటలకు తిరుపతి నుండి రాజమండ్రి చేరుకుని, తిరుగు ప్రయాణం ఉదయం 10:15 గంటలకు ప్రారంభమవుతుంది. అక్టోబర్ 2 నుండి ప్రతి వారం మంగళవారం, గురువారం, శనివారం ఈ సేవలు కొనసాగుతాయి. కొత్త సమయాల ప్రకారం ఉదయం 09:25కి తిరుపతి నుండి బయల్దేరి, ఉదయం 09:50కి తిరుగు ప్రయాణం మొదలవుతుంది. ఈ కొత్త ఎయిర్ కనెక్టివిటీ ప్రాంతీయ అనుసంధానాన్ని పెంపొందించడంతో పాటు, శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థం తిరుమలకు వెళ్లే భక్తులకు సహాయపడనుంది. మంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నట్లు, ఈ సర్వీసు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు “కనెక్టెడ్ ఆంధ్రప్రదేశ్” ఆలోచనకు అనుగుణంగా ఏర్పాటు చేయబడింది. సేవ ప్రారంభం పట్ల అల్లయన్స్ ఎయిర్ కు రామ్మోహన్ నాయుడు ధన్యవాదాలు తెలిపారు. తాజా సర్వీసు ప్రారంభం పట్ల రాజమండ్రి, తిరుపతి వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

భక్తి

ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు.. ఉచితంగా లడ్డూ ప్రసాదం

సెప్టెంబర్ 20 పున్నమి ప్రతినిధి @ ఏపీ : విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవ ఏర్పాట్లను మంత్రుల బృందం సమీక్షించి పలు నిర్ణయాలు తీసుకుంది. మూలా నక్షత్రం, దశమి రోజుల్లో టికెట్లు లేకుండా దర్శనం కల్పించడంతో పాటు దర్శన సమయం 22 గంటలకు పెంచింది. ఉచితంగా లడ్డూ ప్రసాదం, పంచ హారతిలో ప్రముఖుల ప్రత్యేక దర్శనాల రద్దు, అంతరాలయ దర్శనాల నిలిపివేత, రూ.500 టికెట్లు రద్దు వంటి నిర్ణయాలు తీసుకుంది. కాగా ఈ నెల 22 నుంచి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి.

సంగారెడ్డి

బోధి పాఠశాల లో బతుకమ్మ ఉత్సవాలు

నారాయణఖేడ్ లోని బోధి పాఠశాలలో ఘనంగా ముందస్తు బతుకమ్మ పండుగ సంబురాలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు తీరొక్క పూలతో బతుకమ్మను అలంకరించి, మహిళా ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులు ఆనందోత్సవాల మధ్య బతుకమ్మ ఆటను ఆడటం జరిగింది.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

శ్రీ ఆది గణపతి స్వామి వారి అన్న సమారాధన.

మావులమ్మ తల్లి దేవస్థానం నందు శ్రీ ఆది గణపతి స్వామి నవరాత్రులు ముగింపు సందర్భంగా శ్రీ ఆణి విళ్ళ వెంకటరమణ శాస్త్రి సేవా ట్రస్ట్ తరుపున మరియు గ్రామ ప్రజలు, వర్తక సంఘాలు, జాతరలు చేయించే భక్త బృందాలు వారి సౌజన్యంతో ఘనంగా అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని శ్రీ స్వామివారి అన్న ప్రసాదములు స్వీకరించారు. స్వామివారి సేవా కార్యక్రమంలో భాగంగా ఆలయ అధ్యక్షులు ఆణి విళ్ళ సాయిబాబా, రామకృష్ణ పరమహంస, బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు ఆకొండిఉమామహేష్, రాష్ట్ర బిజెపి కోశాధికారి గ్రంధి నానాజీ, ఆణి విళ్ళ ఫణి కాంత్ శాస్త్రి,చెరుకు బాపిరాజు, తాతపూడి గోపి, యల్లమిల్లి రమేష్ ,చెరుకుకృష్ణ, గ్రంధి రాంప్రసాద్, సంసాని పాండురంగారావు,సంసాని సత్య నారాయణ,గ్రంధి సత్తిబాబు, శ్రీరామ్,పండు,పవన్,,గ్రంధి,రాముడు వేదు ల శ్రీను, ఆకొండి రాధ, మంత్రి ప్రగడ శ్రీనివాస్, ఆణి విళ్ళ వాసు, తాతపూడి బుల్లి, మరియు పలువురు పాల్గొన్నారు. అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామిని దర్శించి తీర్థ ప్రసాదములు స్వీకరించారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

శ్రీ ఆది గణపతి స్వామి వారి అన్న సమారాధన.

మావులమ్మ తల్లి దేవస్థానం నందు శ్రీ ఆది గణపతి స్వామి నవరాత్రులు ముగింపు సందర్భంగా శ్రీ ఆణి విళ్ళ వెంకటరమణ శాస్త్రి సేవా ట్రస్ట్ తరుపున మరియు గ్రామ ప్రజలు, వర్తక సంఘాలు, జాతరలు చేయించే భక్త బృందాలు వారి సౌజన్యంతో ఘనంగా అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని శ్రీ స్వామివారి అన్న ప్రసాదములు స్వీకరించారు. స్వామివారి సేవా కార్యక్రమంలో భాగంగా ఆలయ అధ్యక్షులు ఆణి విళ్ళ సాయిబాబా, రామకృష్ణ పరమహంస, బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు ఆకొండిఉమామహేష్, రాష్ట్ర బిజెపి కోశాధికారి గ్రంధి నానాజీ, ఆణి విళ్ళ ఫణి కాంత్ శాస్త్రి,చెరుకు బాపిరాజు, తాతపూడి గోపి, యల్లమిల్లి రమేష్ ,చెరుకుకృష్ణ, గ్రంధి రాంప్రసాద్, సంసాని పాండురంగారావు,సంసాని సత్య నారాయణ,గ్రంధి సత్తిబాబు, శ్రీరామ్,పండు,పవన్,,గ్రంధి,రాముడు వేదు ల శ్రీను, ఆకొండి రాధ, మంత్రి ప్రగడ శ్రీనివాస్, ఆణి విళ్ళ వాసు, తాతపూడి బుల్లి, మరియు పలువురు పాల్గొన్నారు. అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామిని దర్శించి తీర్థ ప్రసాదములు స్వీకరించారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ప్రాచీనకళల కోసం అంజి కృషిని అభినందించిన పురాణపండ

. యుగాలుగా భారతీయుల్ని నైతికంగా, మానసికంగా పరవశింపచేసిన ప్రాచీన కళలైన తోలుబొమ్మలాట, హరికథ, బుర్రకథ లాంటి అద్భుతాలను ఈ తరానికి తెలియచెప్పెందుకై చిత్రకళతో త్వరలో ప్రదర్శన నిర్వహించడానికి ప్రముఖ చిత్ర కారులు ఆకొండి అంజి పూనుకోవడం అభినందనీయమని ప్రముఖ రచయిత, శ్రీ శైలదేవస్థానం ప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రీనివాస్ పేర్కొన్నారు. వచ్చే ఫిబ్రవరి లో హైదరాబాద్ నెహ్రు ఆర్ట్ గాలరీ లో క్రియేటివ్ హార్ట్స్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించబోయే ప్రాచీనకళల పునర్ వైభవ చిత్రకళా బ్రోచర్ ను శనివారం సాయంకాలం హైదరాబాద్ మధురానగర్ జ్ఞానమహాయజ్ఞకేంద్రం పవిత్ర ప్రాంగణంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పురాణపండ మాట్లాడుతూ గ్రాఫిక్స్, డిజిటల్ యుగంలో అంజి నిస్వార్ధంగా చిత్రకళతో చేస్తున్న సేవ ఆశ్చర్యపరుస్తోందని ప్రశంసించారు. ఆర్ట్ గాలరీ లో క్రియేటివ్ హార్ట్స్ చైర్మన్, చిత్రకారుడు ఆకొండి అంజి మాట్లాడుతూ త్వరలో ప్రాచీన కళల పునర్ వైభవం పై జాతీయ స్థాయిలో చిత్రకళల పోటీని హైదరాబాద్ లో నిర్వహిస్తున్నట్లు వివరించారు.

సినిమా

అక్కినేని నాగేశ్వరరావు 101వ జయంతి సందర్భంగా ఆయన నటించిన సినిమా పేర్లుతో చిత్రం

సెప్టెంబర్ 20 పున్నమి ప్రతినిధి @సినిమా అక్కినేని నాగేశ్వరరావు 101వ జయంతి సందర్భంగా ఆయన నటించిన సినిమా పేర్లు, ముఖ్య పాత్రల పేర్లతో డ్రాయింగ్ చార్ట్ మీద నాగేశ్వరరావు చిత్రాన్ని గీసిన నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు కళారత్న చింతలపల్లె కోటేష్

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

శ్రీ ఆది గణపతి స్వామి వారి అన్న సమారాధన.

కాట్రేనికోన గ్రామ దేవత శక్తి స్వరూపిణి శ్రీ మావులమ్మ తల్లి దేవస్థానం నందు శ్రీ ఆది గణపతి స్వామి నవరాత్రులు ముగింపు సందర్భంగా శ్రీ ఆణి విళ్ళ వెంకటరమణ శాస్త్రి సేవా ట్రస్ట్ తరుపున మరియు గ్రామ ప్రజలు, వర్తక సంఘాలు, జాతరలు చేయించే భక్త బృందాలు వారి సౌజన్యంతో ఘనంగా అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని శ్రీ స్వామివారి అన్న ప్రసాదములు స్వీకరించారు. స్వామివారి సేవా కార్యక్రమంలో భాగంగా ఆలయ అధ్యక్షులు ఆణి విళ్ళ సాయిబాబా, రామకృష్ణ పరమహంస, బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు ఆకొండిఉమామహేష్, రాష్ట్ర బిజెపి కోశాధికారి గ్రంధి నానాజీ, ఆణి విళ్ళ ఫణి కాంత్ శాస్త్రి,చెరుకు బాపిరాజు, తాతపూడి గోపి, యల్లమిల్లి రమేష్ ,చెరుకుకృష్ణ, గ్రంధి రాంప్రసాద్, సంసాని పాండురంగారావు,సంసాని సత్య నారాయణ,గ్రంధి సత్తిబాబు, శ్రీరామ్,పండు,పవన్,,గ్రంధి,రాముడు వేదు ల శ్రీను, ఆకొండి రాధ, మంత్రి ప్రగడ శ్రీనివాస్, ఆణి విళ్ళ వాసు, తాతపూడి బుల్లి, మరియు పలువురు పాల్గొన్నారు. అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామిని దర్శించి తీర్థ ప్రసాదములు స్వీకరించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.