Tuesday, 5 May 2026

Blog

ఖమ్మం

నేటి నుండే బతుకమ్మ సంబురాలు

పున్నమి ప్రతినిధి తెలంగాణ లో నేటి నుండి బతుకమ్మ సంబురాలు ప్రారంభం కానున్నాయి. మహిళలు ఎంతో భక్తి శ్రద్దలతో నేటి నుండి తొమ్మిది రోజులు వివిద రూపల్లో అమ్మ వారిని పూజిస్తారు. నేటి మహాలయ అమావాస్య మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ తో తెలంగాణ లో బతుకమ్మ సంబురాలు మొదలు కానున్నాయి. బీజేపీ తెలంగాణ రాష్ట్ర నాయకులు భూపాలపల్లి ఇంచార్జి గల్లా సత్య నారాయణ బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేసారు.

ఆంధ్రప్రదేశ్

ఈ నెల 24న వైసీపీ కీలక సమావేశం

ఈ నెల 24న వైసీపీ కీలక సమావేశం వైఎస్ జగన్ అధ్యక్షతన సమీక్షా సమావేశం సమావేశానికి వైసీపీ రీజినల్ కో-ఆర్డినేటర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పీఏసీ మెంబర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలతో సమావేశం సమావేశానికి తప్పనిసరిగా హాజరు కావాలని వైసీపీ సెంట్రల్ ఆఫీసు ప్రకటన

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

వి ఎస్ యూ “ప్రకృతిని కాపాడుదాం – మైపాడు బీచ్‌లో శుభ్రతా కార్యక్రమం”

స్వచ్ఛ భారత్‌ పథకం మరియు కేంద్ర భూవిజ్ఞాన మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో కోస్టల్ క్లీన్-అప్ డే 2025 కార్యక్రమంలో భాగంగా మైపాడు బీచ్‌లో తీర పరిశుభ్రతా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ (NIOT), విక్రమ సింహపురి యూనివర్సిటీ (VSU) సంయుక్తంగా నిర్వహించాయి.ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డాక్టర్ కె. సునీత మాట్లాడుతూ, తీర ప్రాంతాల పరిశుభ్రత పర్యావరణ పరిరక్షణలో కీలకమని, విద్యార్థులు ఇలాంటి సేవా కార్యక్రమాలలో పాల్గొనడం సమాజానికి ఆదర్శమని అభినందించారు.NIOT సైంటిస్ట్ డాక్టర్ జి. దేవిరామ్ మాట్లాడుతూ, తీర ప్రాంతాల శుభ్రత సముద్ర జీవవ్యవస్థ రక్షణకు, ప్రజల ఆరోగ్యానికి అత్యంత అవసరమని, ఇలాంటి కార్యక్రమాలు తీరప్రాంత ప్రజల్లో పర్యావరణ చైతన్యాన్ని పెంపొందిస్తాయని అన్నారు.NIOT సైంటిస్ట్ డాక్టర్ సచ్చితనందన్ మాట్లాడుతూ, తీర ప్రాంతాలను శుభ్రంగా ఉంచడం ద్వారా పర్యాటక అభివృద్ధికి దోహదం చేస్తుందని, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించవచ్చని పేర్కొన్నారు.విశ్వవిద్యాలయ కళాశాల ప్రిన్సిపాల్ మరియు స్టేట్ లెవెల్ ఎక్స్పర్ట్ అప్రైసల్ కమిటీ సభ్యురాలు (MOFECC) ఆచార్య సి.హెచ్. విజయ మాట్లాడుతూ, తీరప్రాంత పరిశుభ్రత సమాజ అభివృద్ధికి పునాదిగా నిలుస్తుందని, విద్యార్థులు ఇలాంటి కార్యక్రమాలలో ముందుండి పాల్గొనడం విశేషమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సముద్ర జీవశాస్త్ర విభాగ అధిపతి డాక్టర్ ఎం.హనుమారెడ్డి, డాక్టర్ సిహెచ్. వెంకట్రాయిలు, డాక్టర్ జి సుజయ్ కుమార్,డాక్టర్ నాగరాజు,డాక్టర్ ఎస్ బి సాయినాథ్ యన్ ఎస్ ఎస్ యూనిట్ -2 ప్రోగ్రాం ఆఫీసర్, NIOT బృంద సభ్యులు డాక్టర్ చిరంజీవి, జోయెల్, డాక్టర్ నందిని విశ్వవిద్యాలయ విద్యార్థులు, అధ్యాపకులు, NSS వాలంటీర్లు పెద్ద ఎత్తున పాల్గొని బీచ్‌లోని చెత్తను తొలగించారు. తీర ప్రాంత పరిశుభ్రతతో పాటు శుభ్రమైన, ఆరోగ్యకరమైన తీరమును కాపాడుకోవడం ఎంత ముఖ్యమో ప్రజలకు అవగాహన కల్పించారు,స్వచ్ఛత ప్రతిజ్ఞ చేశారు. అంతర్జాతీయ కోస్టల్ క్లీనప్ డే 2025 సందర్భంలో ఈ కార్యక్రమం నిర్వహించబడగా, సముద్ర పర్యావరణ పరిరక్షణ, స్థిరమైన జీవన విధానాల ప్రాధాన్యతను ఈ సందర్భంగా ప్రదర్శించారు.

తూర్పు గోదావరి

సువర్ణ వర్తక సంఘం మాదే అసలైన రిజిస్టర్

మాదే అసలైన రిజిస్టర్ సువర్ణ వర్తక సంఘం – శ్రీసువర్ణ వర్తక సంఘం అధ్యక్షుడు కడియాల శ్రీనివాస్ విమర్శ రాజమహేద్రవరం, హరి అధ్యక్షుడుగా ఉన్న సువర్ణ వర్థక సంఘం ఫేక్ అధ్యక్షుడు అని శ్రీ సువర్ణ వర్థక సంఘం అధ్యక్షుడు కడియాల శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు.శనివారం నల్లమందు సందులోని రాజేశ్వరి జ్యువెల్లరీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిన్నగాక మొన్న వచ్చిన హరి తనను సువర్ణ వర్థక సంఘం నుంచి బహిష్కరణ చేయడానికి అతని జీవితకాలం సరిపోదని మండిపడ్డారు. తాను ఎన్నికల్లో గెలిచిన అధ్యక్షుడినని, ఆతనీకి మాదిరి అధ్యక్షుడుగా ప్రకటించుకున్నవాడిని కానని ఆయన విమర్శించారు.వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో అప్పటి ఎంపీ మార్గాని భరత్ పక్కన చేరి ఎన్నో అవకతవకలకు పాల్పడిన అడపా హరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం రాగానే ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పక్కన చేరి పబ్బం గడుపు కుంటున్నాడని మండి పడ్డారు.సువర్ణవర్తక సంఘంలోకి కులాన్ని, పార్టీలను ఎందుకుతీసుకు రావాలని ఆయన నిలదీశారు.సువర్ణ వర్తక సంఘం సభ్యులకు బంగారం క్రయ విక్రయాల్లో ఏదైనా ఇబందులు వస్తే హరి పరిష్కరించలేడని, పోలీసులు వస్తే ఎలా మాట్లాడాలో తెలియదని తీసీపాడేశారు. పోరాటం చేసి తాను సంఘాన్ని ముందుకు నడిపిస్తానని కడియాల శ్రీనివాస్ అన్నారు.ఈ పార్టీలో ఉండి హయాంలో రాజమండ్రిని భ్రష్టు పట్టించిన హరి ఇప్పుడు సువర్ణ వర్తక సంఘాన్ని భ్రష్టు పట్టిస్తున్నాడని ఆయన ఆరోపించారు.సమావేశంలో కడియాల వరబాబు తదితరులు పాల్గొన్నారు.

యాదాద్రి భువనగిరి

ప్రజల సంరక్షణ కొరకు వీధి కుక్కలను పట్టిస్తున్న మాజీ కౌన్సిలర్

యాదాద్రి భువనగిరి జిల్లా (పున్నమి ప్రతినిధి ) భువనగిరి పట్టణ 23వ వార్డులో గత కొన్ని రోజుల నుండి విపరీతమైన వీధి కుక్కలు స్వైర విహారం చేయడం వల్ల వార్డులోని పాఠశాల విద్యార్థులను మరియు వయోవృద్ధులను చిన్నారులను మహిళలను వీధి కుక్కలు కరవడం వల్ల చాలామందికి తీవ్రమైన గాయాలయి అనారోగ్యాలకు గురి కావడం జరిగింది ఈరోజు భువనగిరి పురపాలక సంఘం సహకారంతో ప్రజల సంరక్షణ కొరకు మాజీ 23వ వార్డు కౌన్సిలర్ పడిగెల రేణుక ప్రదీప్ ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బందితో వీధి కుక్కలను పట్టించడం జరిగింది. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ పడిగెల రేణుక ప్రదీప్ మాట్లాడుతూ పట్టణంలోని వీధి కుక్కలు విపరీతంగా విచ్చలవిడిగా అమాయకులైన విద్యార్థులపై వయోవృద్ధులపై చిన్నారులపై ఎగబడి కరవడంతో ఎంతోమంది గాయాలపాలు గురికావడం జరుగుతుంది మున్సిపల్ కమిషనర్ శ్రీ రామలింగం గారికి ఇట్టి సమస్యలపై తెలియజేసిన వెంటనే మున్సిపల్ వారు ప్రత్యేక చొరవతో ఈరోజు మా వార్డులోని విచ్చలవిడిగా తిరుగుతున్న వీధి కుక్కలను పట్టుకోవడం జరిగింది వీధి కుక్కలను శాశ్వతంగా ప్రజల నివసిస్తున్న ప్రాంతాలలో సంచరించకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వార్డు ప్రజల పక్షాన ప్రభుత్వ అధికారులను కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకులు బర్రె నరేందర్ గేద వినయ్ భూషపాక ప్రవీణ్ జంగిటి లక్ష్మయ్య ఉడుత ప్రసాద్ బర్రె ప్రభాకర్ సంపత్ గోపి బాబు నవీన్ రాజు తదితరులు పాల్గొనడం జరిగింది*

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

పారిశుధ్య కార్మికులను సత్కరించిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి

“*”స్వచ్ఛతా హి సేవా” కార్యక్రమంలో భాగంగా పారిశుధ్య కార్మికులకు ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని సందర్శించి, పారిశుధ్య కార్మికులతో ఆత్మీయoగా సంభాషిoచిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి.* *రంగంపేట మండలం రంగంపేట PHC లో “స్వచ్ఛతా హి సేవా” కార్యక్రమంలో భాగంగా పారిశుధ్య కార్మికులకు ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని సందర్శించి, పారిశుధ్య కార్మికులతో ఆత్మీయoగా సంభాషిoచి,రంగంపేట మండలంలోని పారిశుధ్య కార్మికులను సత్కరించిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, అధికారులు, వైద్యులు, రంగంపేట మండల NDA నాయకులు.* ఈ కార్యక్రమంలో రంగంపేట PHC వైద్యులు, సిబ్బంది, రంగంపేట మండల NDA నాయకులు, రంగంపేట గ్రామ NDA నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు. భాగంగా పారిశుధ్య కార్మికులకు ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని సందర్శించి, పారిశుధ్య కార్మికులతో ఆత్మీయoగా సంభాషిoచిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి.* *రంగంపేట మండలం రంగంపేట PHC లో “స్వచ్ఛతా హి సేవా” కార్యక్రమంలో భాగంగా పారిశుధ్య కార్మికులకు ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని సందర్శించి, పారిశుధ్య కార్మికులతో ఆత్మీయoగా సంభాషిoచి,రంగంపేట మండలంలోని పారిశుధ్య కార్మికులను సత్కరించిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, అధికారులు, వైద్యులు, రంగంపేట మండల NDA నాయకులు.* ఈ కార్యక్రమంలో రంగంపేట PHC వైద్యులు, సిబ్బంది, రంగంపేట మండల NDA నాయకులు, రంగంపేట గ్రామ NDA నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

యాదాద్రి భువనగిరి

స్వశక్తి నారి కార్యక్రమాన్ని ప్రారంభించిన వైద్య అధికారి

యాదాద్రి భువనగిరి జిల్లా పున్నమి ప్రతినిధి హున్మాన్ వాడ లోని బస్తీ దావకాన లొ ఈ రోజు “స్వస్తి నారి, స్వ శక్తి పరివార్ అభియాన్ కార్య క్రమాన్ని ప్రారంభించిన భువనగిరి, ఈ సందర్భంగా వైద్య అధికారి డాక్టర్ శిల్పిని మాట్లాడుతూ ప్రతి మహిళలు, ఈ ఆరోగ్య సేవలను వినియోగించుకొని సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందాలని ఆమె పిలుపునిచ్చారు. అధిక రక్తపోటు (హై బీపీ), మధు మేహం (షుగర్), ఓరల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ వంటి పరీక్షలు.క్షయ వ్యాధి (టిబి) పరీక్షలు చేయడం, సికెల్ సెల్ ఎనీమియా పరీక్షలు నిర్వహించడం సికెల్ సెల్ డిసీజ్ కార్డుల, జారీ, కౌన్సెలింగ్ అందించడం. జరుగుతుందని అన్నారు. అదేవిధంగా గైనకాలజీ, నేత్ర, ఈ ఎన్టీ, డెర్మటాలజీ, సైకియాట్రీ, డెంటల్,సర్జన్ మొదలైన వైద్యులు, శిబిరాల్లో పరీక్షలు నిర్వహించడం యువత, మహిళలకు అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించబడతాయి. రక్తహీనత నివారణకు అవసరమైన జాగ్రత్తలపై యుక్తవయస్కులైన అమ్మాయిలకు అవగాహన కల్పించడం, పలు ఆరోగ్య పరమైన అంశాలపై యువతకు చైతన్యం కూడా కల్పించడం జరుగుతుందని తెలిపారు అలాగే కేవలం ప్రభుత్వ ఆసుపత్రులు మాత్రమే కాకుండా ప్రైవేటు ఆసుపత్రులు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతాయని అన్నారు మహిళల ఆరోగ్యమే లక్ష్యంగా ఈ కార్యక్రమం విస్తృతంగా కొనసాగనుందని తెలిపారు. కార్యక్రమం లో మెడికల్ ఆఫీసర్ డా,ఆర్చిత. Dr మణికంఠ dr స్వప్న dr వినిత్ రెడ్డి నర్సింగ్ ఆఫీసర్ G రాజేశ్వరి ANM మంజూల దుర్గ లావణ్య ఆశ వర్కర్స్ తదితరులు పాల్గున్నారు

యాదాద్రి భువనగిరి

రంగోత్సవం సెలబ్రేషన్స్ నేషనల్ లెవెల్ ఆర్ట్ కాంపిటీషన్ 2025 -26

యాదాద్రి భువనగిరి జిల్లా పున్నమి ప్రతినిధి ఈ విద్యా సంవత్సరం జాతీయ స్థాయిలో రంగోత్సవం సెలబ్రేషన్స్ అండ్ నేషనల్ లెవెల్ ఆర్ట్ కాంపిటీషన్ ముంబై వారు నిర్వహించడం జరిగింది. ఈ కాంపిటీషన్లో స్థానిక తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల బాలురు బోనగిరి నుండి విద్యార్థులు పాల్గొనడం జరిగింది. ఊహించిన విధంగానే ఈ గురుకుల పాఠశాల నుండి 17 మంది విద్యార్థులు నేషనల్ లెవెల్ లో విజయాన్ని సాధించి సత్తా చాటారు. వివిధ పథకాలను సాధించిన విద్యార్థుల వివరాలు 1. ఏం హర్షవర్ధన్ 8A, ఆర్ట్ మెరిట్ అవార్డ్ ట్రోఫీ మరియు సర్టిఫికెట్. గోల్డ్ మెడల్ సాధించిన విద్యార్థుల వివరాలు 1. బి విగ్నేష్ 8A 2. కే సందీప్ 7B 3. బి భాను ప్రసాద్ 8A 4. వి యశ్వంత్ 6B 5. ఏ చైతన్య చంద్ర 7B 6. హెచ్ శివ సాయి కృష్ణ 7B 7. జి బన్నీ 6A సిల్వర్ మెడల్ సాధించిన విద్యార్థుల వివరాలు 1. జై తరుణ్ 9B 2. కే వర్షిత్ 5A 3. పి రాహుల్ 6B 4. జె జశ్వంత్ 8A 5. టీ అవినాష్ 8A కాంస్య పథకం సాధించిన విద్యార్థుల వివరాలు 1. బి శ్రీనివాస్ 8A 2. ఎస్ రాజన్న 6B 3. డి శివతేజ 7A 4. టీ అవినాష్ 8A 5. ఆర్ నితిన్ 8A ఈ విజయాలు సాధించడానికి కారకులైన ఆర్ట్ మాస్టారు లింగాల రమేష్ గారికి ఉత్తమ ఆర్ట్ మాస్టర్ గా ట్రోఫీ అందుకున్నారు ఇన్ని పథకాలు సాధించినందుకు గాను తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు ఒక మెమొంటో బహుమతిగా రావడం జరిగింది. ఈ బహుమతులు ప్రధానోత్సవ కార్యక్రమంలో పాఠశాల ప్రధానాచార్యులు శ్రీ ఆర్ వెంకన్న గారు, ఉప ప్రధాన చార్యులు శ్రీ కె శ్యాం బాబు గారు, పాఠశాల ఉపాధ్యాయ బృందం గణేష్, శ్రీలత, మిగిలిన అధ్యాపక బృందం ఈ విజయాన్ని సాధించిన లింగాల రమేష్ ఆర్ట్ టీచర్ గారిని మరియు విద్యార్థులను ఘనంగా సన్మానించి సత్కరించడం జరిగింది.

యాదాద్రి భువనగిరి

ఘనంగా బతుకమ్మ సంబరాలు

భువనగిరి, సెప్టెంబర్ 20 : భువనగిరి పట్టణంలోని శ్రీ సాయి ప్రశాంతి విద్యానికేతన్ పాఠశాల ఆవరణలో శనివారం బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మహిళా విద్యార్థులు తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా సాంప్రదాయ దుస్తులు ధరించి పాఠశాలకు హాజరయ్యారు. బతుకమ్మను ఏడు రకాల పువ్వులతో ఆలయ గోపురం ఆకారం లో ఏడు పొరలుగా సాక్షాత్ ఆ మాతృదేవత మహాగౌరీని ప్రతిబింబించేలా అలంకరించారు. అనంతరం రంగురంగుల బతుకమ్మలను పేర్చి అందరు కలిసి ఎంతో ఉత్సాహంగా గౌరమ్మను కొలుస్తూ దాండియా పాటలు పాడుతూ బతుకమ్మ గీతాలు ఆలపించారు. పాఠశాల ప్రిన్సిపాల్ తోటకూరి యాదయ్య మాట్లాడుతూ బతుకమ్మ పండుగ విశిష్టతను గూర్చి విద్యార్థులకు సమగ్రంగా వివరించారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయా లకు ప్రతీకగా నిలిచేది కేవలం బతుకమ్మ పండుగ మాత్రమే అని అన్నారు.బంధాలు, అనుబంధా లను గుర్తు చేస్తూ ప్రకృతిని ఆరాధిస్తూ తెలంగా ణ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికిచాటి చెప్పే పండుగే బతుకమ్మ పండుగ అని అన్నారు. ఇది పూల పండుగ, ప్రకృతిని పూజించే పండుగ, తొమ్మిది రోజులు పాటు ఆడిపాడి గౌరీ దేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించే తెలంగాణకే ప్రత్యేకమైన పూల సంబరం బతుకమ్మ పండుగ మాత్రమేననే విషయాన్ని విద్యార్థులు గుర్తించాల న్నారు.మన సంస్కృతి, సంప్రదాయాలను ఇదే విధంగా రక్షించుకుంటు భవిష్యత్ తరాలకు అందించాలని ప్రిన్సిపాల్ విద్యార్థులను కోరారు..ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు..

E-పేపర్

గోతులమయం ఆదూరుపల్లి – పెంచలకోన రోడ్డు

అవస్థల్లో ప్రయాణికులు పట్టించుకోని అధికారులు సెప్టెంబరు చేజర్ల (పున్నమి ప్రతినిధి) నెల్లూరు జిల్లాలోని, చేజర్ల, కలువాయి, రాపూరు మండలాలను కలిపే పెంచలకోన రోడ్డు గోతులమయంగా మారింది. దీంతో ఆ మార్గంలో ఉండే గ్రామాలకు వెళ్లాలంటే ప్రజలు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్నీ కావు. మండలంలోని నెర్నూరు, కొల్లపనాయుడు పల్లి, కలువాయి మండలంలోని దాచూరు, దాసరపల్లి, పెరమకొండ, ముక్కుతిప్ప, గ్రామాలకు వెళ్ళాలంటే రోడ్డు గోతుల మయంగా తయారయ్యి నరకానికి నకలుగా మారింది. సోమశిల – నెల్లూరు రహదారి ఆదూరుపల్లి నుండి గోనుపల్లి వరకు సుమారు 15 కిలోమీటర్లు ఈ రోడ్డలో ప్రయాణం అంటే ఎప్పుడు ఎలాంటి ప్రమాదం చోటుచేసుకుంటుందో అన్న భయం ప్రజల్లో మరియు వాహన యజమానులలో తలెత్తుతుంది. రోడ్డు గోతులతో ఉండడంతో నిన్న కురిసిన చిన్నపాటి వర్షానికి గోతుల్లో నీళ్లు చేరి గోతులు కనిపించని పరిస్థితి నెలకొంది. దీంతో వాహనదారులు బెంబేలెత్తుతున్నారు.దీంతో ఆయా గ్రామాల ప్రజల అవస్థలు వర్ణణాతీతం. ఏళ్ల తరబడి ప్రజలు అవస్థలు పడుతున్నా అటు నాయకులు గానీ, ఇటు అధికారులు గానీ పట్టించుకున్న పాపాన పోలేదు. అదేవిధంగా ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి రోడ్లపై ఉన్న గోతులను పూడ్చి అవస్థలు తప్పించాలని ప్రజలు కోరుతున్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.