Tuesday, 5 May 2026

Blog

జాతీయ అంతర్జాతీయ

తెలుగు రాష్ట్రాల నుంచే 35 వేల మంది స్టూడెంట్‌ వీసాదారులపైనా తీవ్ర ప్రభావం

సెప్టెంబర్ 21పున్నమి ప్రతినిధి @ హెచ్‌1-బీ వీసాల ఫీజును లక్ష డాలర్లకు పెంచుతూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తీసుకున్న నిర్ణయంతో భారతీయుల డాలర్‌ డ్రీమ్స్‌ చెదిరిపోనున్నాయి. తెలుగు రాష్ట్రాల యువతపైనే అధిక ప్రభావం ఉండనుంది. అగ్రరాజ్యం ఏటా మొత్తం 85 వేల హెచ్‌1-బీ వీసాలు జారీ చేస్తుండగా.. ఇందులో దాదాపు 73శాతం(62 వేలు) భారతీయులే దక్కించుకుంటున్నారు. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లేవారి సంఖ్య దాదాపు 35వేలు. మిగతా 27 శాతంలో 12 శాతం చైనా, ఇతర దేశాల పౌరులు ఉంటున్నారు. ట్రంప్‌ నిర్ణయంతో ఈ వీసాలపై అమెరికాకు వెళ్లే ఆశలు వదులుకోవాల్సిందేనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటివరకు అమెరికాలోని కంపెనీలు విదేశీ నిపుణులకు హెచ్‌1-బీ వీసాలతో కొలువులు ఇస్తున్నాయి. ముందుగా మూడేళ్ల కాలానికి జారీ చేసి.. ఆ తర్వాత కొనసాగిస్తున్నాయి. స్థానికులతో పోలిస్తే తక్కువ జీతాలే వస్తున్నా.. కొలువుల కోసం విదేశీయులు భారీగా వెళ్లేవారు. అమెరికాలోని ఐటీ, వైద్య రంగాల్లో విదేశీ నిపుణుల్లో 73 శాతం భారతీయులే. గత ఐదేళ్లలో దాదాపు 4 లక్షల మంది భారతీయులు హెచ్‌1-బీపై అమెరికాలో ఉద్యోగాలు పొందారు. ఇప్పటివరకు కొత్తగా వచ్చిన హెచ్‌1-బీ వీసాదారులకు అమెరికాలోని కంపెనీలు ఏడాదికి సరాసరి లక్ష డాలర్ల జీతం ఇస్తున్నాయి. తాజా నిబంధనలతో ఏడాదికి కనీసం 1.50 లక్షల డాలర్ల వేతనం చెల్లించాలని ట్రంప్‌ ఆదేశాలిచ్చారు. లక్ష డాలర్లు వీసా ఫీజు పోతే, మిగతా 50వేల డాలర్ల కోసం వెళ్లేందుకు విదేశీ నిపుణులు ఆసక్తి చూపించరు. దీంతో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని పేర్కొంటున్నారు. సుంకాలపై భారత్‌-అమెరికా మధ్య విభేదాలు తీవ్రస్థాయిలో ఉన్న నేపథ్యంలో భారతీయ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకునే ట్రంప్‌ పొమ్మనలేక పొగబెట్టారని అక్కడి తెలుగు సంఘాలు పేర్కొంటున్నాయి. ఉన్నత చదువులపైనా ప్రభావం ట్రంప్‌ తాజా నిర్ణయంతో హెచ్‌1-బీ వీసాదారులపైనే కాదు.. ఉన్నత విద్య కోసం వెళ్లే వారిపైనా తీవ్ర ప్రభావం పడనుంది. ప్రతి ఏటా దాదాపు లక్ష మంది విద్యార్థులు ఎంఎస్‌, ఎంబీఏ, మెడిసిన్‌ కోసం స్టూడెంట్‌ వీసా (ఎఫ్‌-1)పై అమెరికా వెళుతున్నారు. గతంలో చదువుతూ ఉద్యోగం చేసుకునే వెసులుబాటు ఉండగా.. ట్రంప్‌ సర్కారు ఇప్పటికే అలా ఉద్యోగం చేయడంపై నిషేధం విధించింది. దీంతో ఎలాగోలా వెళ్తే చాలు.. ఏదో ఒక పనిచేసుకుంటూ చదువుకోవచ్చన్న మధ్యతరగతి విద్యార్థుల ధీమా ఇప్పటికే సడలిపోయింది. తాజా ఆదేశాలతో స్టూడెంట్‌ వీసాపై వెళ్లే వారికి అక్కడ భవిష్యత్తు ఉంటుందన్న ఆశ లేకుండా పోయిందని నిపుణులు పేర్కొంటున్నారు. ఎఫ్‌-1 వీసా తర్వాత కోర్సులను బట్టి విద్యార్థులకు 12-36 నెలల వరకు ఓపీటీ (ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌) గడువు ఉంటుంది. అప్పటిలోగా హెచ్‌1-బీ వీసా సాధిస్తే అక్కడ ఉద్యోగం చేసుకోవచ్చు. తాజా నిబంధనలతో ఓపీటీ గడువులో ఉన్నవారు పూర్తయిన వెంటనే స్వదేశానికి రావాల్సిందే. హెచ్‌1-బీ వీసా లక్ష్యంతోనే అనేక మంది ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లేవారు. ఇప్పుడా ఆశలు ఆవిరయ్యాయని అమెరికా తెలుగు అసోసియేషన్‌ మాజీ అధ్యక్షుడు భువనేష్‌ ‘ఆంధ్రజ్యోతి’తో పేర్కొన్నారు. ట్రంప్‌ ఆదేశాలపై స్థానికంగా యువతలో హర్షం వ్యక్తమవుతోందని, హెచ్‌1-బీ లక్ష్యంగా పెట్టుకున్న భారతీయులు ఇక అమెరికా వచ్చే అవకాశాలు లేవని ఆయన అభిప్రాయపడ్డారు.

యాదాద్రి భువనగిరి

యాదాద్రి భువనగిరి జిల్లాను కొండ లక్ష్మణ్ బాపూజీ జిల్లాగా ప్రకటించాలి

యాదాద్రి భువనగిరి జిల్లాను కొండ లక్ష్మణ్ బాపూజీ జిల్లాగా ప్రకటించాలి యాదాద్రి భువనగిరి జిల్లా పున్నమి ప్రతినిధి గొట్టిపాముల బాబురావు బీసీ సంక్షేమ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు మహమ్మద్ ఇమ్రాన్ ఎఐటియుసి రాష్ట్ర కార్యదర్శి గార్లు మాట్లాడుతూ….కొండా లక్ష్మణ్ బాపూజీ గారి చరిత్ర కొండా లక్ష్మణ్ బాపూజీ (27 సెప్టెంబర్ 1915 – 21 సెప్టెంబర్ 2012) తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఓ మహనీయ నాయకుడు. ఆయనను ప్రజలు “తెలంగాణ జాతిపిత” అని గౌరవంగా పిలుస్తారు అని ప్రసంగిస్తూ జననం: 27 సెప్టెంబర్ 1915, వారంగల్ జిల్లా, వంగపల్లి గ్రామం.చిన్ననాటి నుంచే సామాజిక న్యాయం,సమానత్వం, రైతుల సమస్యలపై ఆసక్తి కనబరిచారు.స్వాతంత్ర్యోద్యమంలో సైతం పాల్గొని జైలు శిక్షను అనుభవించారు.రాజకీయ జీవితంస్వాతంత్ర్యం తరువాత కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లో ప్రవేశించారు.తెలంగాణ ప్రాంత ప్రజల హక్కుల కోసం గళమెత్తి, అసమానతలకు వ్యతిరేకంగా పోరాడారు.1952లో జరిగిన ముల్కీ అగిటేషన్ (ఉద్యోగాలపై స్థానికుల హక్కుల కోసం పోరాటం)లో ప్రముఖ పాత్ర పోషించారు.1969లో జరిగిన మొదటి తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ మంత్రిత్వాన్ని వదిలి తెలంగాణ కోసం ఉద్యమంలో పాల్గొన్న మొదటి మంత్రి అయ్యారు.అనంతరం వివిధ రాజకీయ పార్టీలలో ఉన్నా, ఆయన ఏకైక లక్ష్యం తెలంగాణ రాష్ట్రం సాధించడమే.తెలంగాణ రైతాంగ సమస్యలపై ఎన్నోసార్లు ఉద్యమాలు చేశారు. పేదల విద్య కోసం పనిచేశారు. మహిళల అభ్యున్నతికి కృషి చేశారు.తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం జీవితాంతం పోరాడారు. 21 సెప్టెంబర్ 2012న హైదరాబాదులో కన్నుమూశారు. ఆయన మరణానికి కొన్ని నెలల తర్వాతే తెలంగాణ రాష్ట్రం దిశగా రాజకీయ పరిణామాలు వేగంగా జరిగాయి.ఆయనను తెలంగాణ ప్రజలు “తెలంగాణ తాత”గా స్మరిస్తారు.నిజమైన తెలంగాణ ఉద్యమ ప్రేరణదాతల్లో ఒకరుగా చరిత్రలో నిలిచారు. ఈ స్థానిక మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో మాటూరి అశోక్ చాలా కిష్టయ్య మిర్యాల శ్రీనివాస్ కొత్త బాలరాజు మెరుగు మదన్మోహన్ గడిల ప్రభాకర్ పద్మశాలి సంఘం పట్టణ కార్యదర్శి మొదలగు వారు పాల్గొన్నారు.. ఇట్లు గొట్టిపాముల బాబురావు బీసీ సంక్షేమ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు

జాతీయ అంతర్జాతీయ

అక్టోబర్ 16న శబరిమలకు ద్రౌపది ముర్ము

సెప్టెంబర్ 21 పున్నమి ప్రతినిధి @ అక్టోబరులో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శబరిమల అయ్యప్ప ఆలయాన్ని సందర్శించనున్నారని కేరళ దేవస్వామ్ మంత్రి వీఎన్ వాసవన్ ప్రకటించారు. అక్టోబరు 16వ తేదీన ప్రారంభమయ్యే ‘తులం’ పూజల చివరి రోజున ఆమె పర్యటించనున్నారు. మే నెలలో భారత్-పాకిస్థాన్ సరిహద్దు వివాదం కారణంగా రద్దైన పర్యటన ఇప్పుడు జరగనుంది. గ్లోబల్ అయ్యప్ప సంగమం సిఫార్సుల అమలుకు 18 మంది సభ్యుల కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.

యాదాద్రి భువనగిరి

కొండ లక్ష్మణ్ బాబు గారి 13వ వర్ధంతి

ఈరోజు కొండ లక్ష్మణ్ బాబు గారి 13వ వర్ధంతి యాదాద్రి భువనగిరి జిల్లా పున్నమి ప్రతినిధి భువనగిరి పట్టణం రాజీవ్ గాంధీ చౌరస్తా నందు యాదాద్రి జిల్లా సేవాదళ్ ఆధ్వర్యంలో నివాళి అర్పించిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న మాజీ పీసీసీ ప్రధాన కార్యదర్శి, కొత్తగూడెం భద్రాచలం జిల్లా కాంగ్రెస్ పార్టీ అజ్వర్వర్ పోత్నక్ ప్రమోద్ కుమార్ గారు* ఈ కార్యక్రమంలో ప్రమోద్ కుమార్ గారు మాట్లాడుతూ కొండ లక్ష్మణ్ బాపూజీ గారు స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న మహా నాయకులు భువనగిరి నియోజకవర్గానికి మొదటి ఎమ్మెల్యేగా హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాల వారికోసం కృషి చేసిన గొప్ప వ్యక్తి భువనగిరి ఐటిఐ తీసుకోవచ్చిన మహానుభావుడు అమాలీల కోసం కార్మికుల కోసం కష్టజీవుల కోసం ఎంతగానో తపించి వారి యొక్క అభివృద్ధికి కృషి చేశారు తెలంగాణ రాష్ట్రం కోసం1969 తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమాన్ని ప్రారంభించిన మొదటి వ్యక్తి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మంత్రి పదవిని రాజీనామా చేసి ఉద్యమానికి స్ఫూర్తినిచ్చినాడు తెలంగాణ వచ్చేవరకు ఎలాంటి పదవిని తీసుకోకుండా పోరాటం చేసిన నిస్వార్థ అభ్యుదవాది అందరు కూడా కొండ లక్ష్మణ్ బాపూజీ ఆశయాల కొరకు అందరం కలిసి పని చేయాలని నిస్వార్ధంగా ఎలాంటి లాభాబీక్షలు లేకుండా ప్రజల కోసం పనిచేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జాంగిర్ పాల్గొని కొండ లక్ష్మణ్ బాపూజీ గారి ఆశయాల కోసం పనిచేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ధర్మశాల కమిటీ చైర్మన్ మంచు కంటి కృష్ణమూర్తి, రాష్ట్ర సేవాదళ్ ఆర్గనైజర్ పిట్టల బాలరాజ్, యాదాద్రి జిల్లా కాంగ్రెస్ సేవాదళ్అధ్యక్షులు సామల రవీందర్, టౌన్ సేవా అధ్యక్షులు ఠాకూర్ ప్రకాష్ జితేందర్ గౌడ్, మాజీ కౌన్సిలర్ రాచమల్ల రమేష్, తదితరులు పాల్గున్నారు…

జాతీయ అంతర్జాతీయ

రేపట్నుంచి కొత్త చరిత్ర మొదలవుతోంది! మోదీ

సెప్టెంబర్ 21 పున్నమి ప్రతినిధి @ దిల్లీ: రేపట్నుంచి జీఎస్టీ ఉత్సవ్‌ ప్రారంభం కాబోతోందని, కొత్త చరిత్ర మొదలవుతోందని ప్రధాని మోదీ అన్నారు. జీఎస్టీ మార్పులతో పేదలు, మధ్యతరగతి ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు. సోమవారం నుంచి నూతన జీఎస్టీ శ్లాబ్‌ రేట్లు అమల్లోకి రానున్న నేపథ్యంలో జాతిని ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. జీఎస్టీ సంస్కరణలు ఆత్మనిర్భర్‌ భారత్‌క్‌కు మరింత ఊతమిస్తాయన్నారు. ‘‘ దేశమంతా సంతోషపడే జీఎస్టీ సంస్కరణలు అమల్లోకి వస్తున్నాయి. వీటితో పెట్టుబడుల ప్రవాహం పెరుగుతుంది. జీఎస్టీ 2.0 సంస్కరణలు భారత వృద్ధిరేటుకు మరింత ఊతమిస్తాయి’’ అని మోదీ అన్నారు.

క్రైమ్

మృతదేహానికి ట్రీట్మెంట్.. రూ.2 లక్షల బిల్

సెప్టెంబర్ 21 పున్నమి ప్రతినిధి @ అనంతపురంలోని కిమ్స్ సవేరా ఆసుపత్రిలో మృతదేహానికి వైద్యం చేసి, రూ.2 లక్షల బిల్లు తీసుకున్నారని బాధితులు వాపోయారు. ధర్మవరానికి చెందిన గాయత్రి మాట్లాడుతూ.. తన అత్త పార్వతిని బుధవారం రాత్రి ఆస్పత్రిలో జాయిన్ చేశామన్నారు. శుక్రవారం రాత్రే చనిపోయిందనిపించి ఫొటోలు, వీడియోలు తీసుకుంటుంటే సిబ్బంది సెల్ తీసుకొని ఢిలీట్ _మృతదేహానికి ట్రీట్మెంట్.. రూ.2 ఆసుపత్రి ఎదుట బైఠా లక్షల బిలోళన చేపట్టారు

తిరుపతి

ఉత్తమ సేవ అవార్డు అందుకున్న స్వేచ్ఛ ఫౌండేషన్ ఫౌండర్ వంశీ యాదవ్

శ్రీకాళహస్తి:ఏర్పేడు మండలం వికృత మాల గ్రామం లో ఉన్న శ్రీలక్ష్మి నరసింహ చరటబుల్ ట్రస్ట్ 3 వ వార్షికోత్సవం సందర్బంగా తిరుపతి యూత్ హాస్టల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా స్వేచ్ఛ ఫౌండేషన్ ఫౌండర్ వంశీ యాదవ్ చేస్తున్న సేవలను గుర్తించి వంశీ ని ఘనంగా శాలువాతో సత్కరించి,వెంకట లక్ష్మి,శ్రీధర్ చేతుల మీదగా అవార్డు అందజేశారు.ట్రస్ట్ ఫౌండర్ శైలజ మాట్లాడుతూ స్వేచ్ఛ ఫౌండేషన్ వాళ్ళు చేస్తున్న సేవలు అభినందనీయం అన్నారు.ఈ సందర్బంగా వంశీ మాట్లాడుతూ అంగవైకల్యం తనకే గాని తన సేవ కి కాదని, 50 మంది వృద్ధులను,వికలాంగుల ను కన్న తల్లిగా,ఒక అక్కలా చూసుకుటున్న శ్రీ లక్ష్మి నరసింహ చారటబుల్ ట్రస్ట్ ఫౌండర్ శైలజ కి మరియు ట్రస్ట్ సభ్యులకు 3 వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

తిరుపతి

అవార్డు గ్రహీత బాలుకు తొట్టంబేడు సి.ఆర్.సి. సన్మానం

శ్రీకాళహస్తి: తొట్టంబేడు మండలం దిగువ సాంబయ్య పాళెం ఫౌండేషన్ స్కూల్ లో పని చేస్తున్న ఉపాధ్యాయులు, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కయ్యూరు బాలసుబ్రహ్మణ్యం ను తొట్టంబేడు జెడ్.పి.ఉన్నత పాఠశాల సి.ఆర్.సి.పరిధిలోని పాఠశాలల ఉపాధ్యాయులు ఘనంగాసన్మానించారు.ఈసందర్భంగా బాలు మాట్లాడుతూ ఈ మండలంలో గత పదమూడు సంవత్సరాలుగా పనిచేస్తూ జిల్లా,రాష్ట్ర ఉత్తమ అవార్డులు అందుకోవడం జరిగిందన్నారు.విద్యార్థుల సమగ్రాభివృద్ధికీ మరింత కృషి చేస్తున్నానని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో సహచర ఉపాధ్యాయులందిరికి కృతజ్ఞతలు తెలియ చేసారు.ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి భాస్కర్,తొట్టంబేడు హెచ్.యమ్.మోహన్ బాబు,బోనుపల్లి హెచ్.యమ్. భారతి,ఎగువ సాంబయ్య పాలెం హెచ్.యమ్.అరుణ కుమారి.ఉపాధ్యాయులు గోమతి,చిట్టి బాబు,శిరీష , రామదాసు తదితరులు పాల్గొన్నారు.

నాగర్‌కర్నూల్

దేశంలో లౌక్యవాద, రాజ్యాంగ, సామాజిక న్యాయ పరిరక్షణ కోసం ఉద్యమం నిర్మించాలి

పున్నమి ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా సెప్టెంబర్ 21 మనువాడ సిద్ధాంతం వలన ఫాస్టెస్ట్ విధానాల వలన దేశంలో బిజెపి పాలన లో ప్రజాస్వామ్యం, లౌకికవాదం, రాజ్యాంగం, సామాజిక న్యాయం ప్రమాదంలో ఉన్నాయని వాటిని సమాధి చేయడానికి బిజెపి కుయుక్తులు పన్నుతుందని సిపిఐ భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర నాయకులు హెచ్ ఆనంద్ జి, జిల్లా కార్యవర్గ సభ్యులు కొమ్ము భరత్ పేర్కొన్నారు. ఆదివారం నాడు సిపిఐ 25వ జాతీయ మహాసభల జయ పదాన్ని కాంక్షిస్తూ నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో సిపిఐ కార్యాలయం వద్ద జెండా ఆవిష్కరణను హెచ్ ఆనంద్ జి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొమ్ము భరత్, సిపిఐ రాష్ట్ర నాయకులు హెచ్ ఆనంద్ జి మాట్లాడుతూ దేశంలో సాహూసవపేత నిర్ణయాన్ని పంజాబ్ రాష్ట్ర ప్రజలు పార్టీ శ్రేణులు తీసుకోవడం గొప్ప స్వగదించిందన్నారు. ఇటీవల వరదలు అకాల వర్షాలు పంటలు నష్ట పోవడం పంజాబ్లో జరిగిందన్నారు పంజాబ్ హర్యానా ఉమ్మడి రాష్ట్రం రాజధాని చండీగఢ్లో ఈ వాతావరణ పరిస్థితుల్లో మహా జాతీయ మహాసభలు నిర్వహించ తలపెట్టడం అక్కడి పార్టీ శ్రేణులు ప్రజలు ముందుకు రావడం గొప్ప స్వాగతం పలకడమన్నారు. పంజాబ్ కు గొప్ప చరిత్ర ఉన్నది. ఒకనాటి ఉద్యమంలో గదర్ ఉద్యమం నాయకులు సోహన్ సింగ్ నాయకత్వం మించిన చరిత్ర పంజాబ్లో ఉన్నది. అలాగే మిలియన్ బాగ్ చరిత్ర లో ఎంతోమందిని హతమార్చిన బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా సాహసోపేత ప్రతికరణ ఉద్యమానికి నాయకత్వం వహించిన ఉద్ధం సింగ్ చరిత్ర నాడు జరిగిందా చరిత్ర పంజాబ్లో ఉన్నది. అలాగే ఇంక్విలాబ్ జిందాబాద్ చిన్న వయసులో దేశ స్వతంత్రం కోసం ఉరికంబాలెక్కిన నునుగు మీసాల వ్యక్తి భగత్ సింగ్ చరిత్ర కలిగిన రాష్ట్రం పంజాబ్ అన్నారు. అలాగే ఇటీవల జరిగిన రైతు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా సంవత్సరం పైగా సాగిన ఉద్యమంలో 756 మంది మరణించిన చరిత్ర నాయకత్వం వహించినటువంటి గొప్ప రైతు నాయకులు పంజాబ్ రైతులు అన్నారు. నేడు ఉన్నటువంటి బిజెపి ప్రభుత్వం అత్యధికంగా ప్రజల పైన భారాలు మోపుతూ కనీస ధరలు వస్తువులు పెంచుతూ జీఎస్టీ పేరు మీద ధరలు వేయించుతూ ప్రజల నడ్డి విరుస్తుందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రవేటికరిస్తూ పోరాడి సాధించుకున్న ఎనిమిది గంటల పని దినాన్ని కార్మికులకు దక్కకుండా 12 గంటలకు పెంచడం దారుణం అన్నారు. రైతు గిట్టుబాటు ధరకు ఎలాంటి రక్షణ లేకుండా పోయిందన్నారు. సామ్రాజ్యవాదులు విదేశీ పెట్టుబడిదారులు సొదసి పెట్టుబడులతో గార్లతో చేతులు కలిపి దేశ రైతాంగాన్ని ప్రజలను నయవంచన గురిచేస్తుంది బిజెపి ప్రభుత్వం అన్నారు. బిజెపి పాలిత రాష్ట్రాలు అలాగే ఈశాన్య రాష్ట్రాల్లో దళితులు ఆదివాసీలు మైనార్టీలకు ఎలాంటి రక్షణ లేకుండా పోయిందన్నారు. ఈ నేపథ్యంలో తిరుగుతున్న ధరలకు వ్యతిరేకంగా రైతాంగ సమస్యల పరిష్కారానికి అలాగే ప్రజాస్వామ్య పరిరక్షణకు, పరిరక్షణకు, రాజ్యాంగ పరిరక్షణకు, అమాజిక న్యాయం కోసం ఈ మహాసభల్లో పూర్తిస్థాయిలో సమీక్షలు జరిపి గొప్ప పోరాట కార్యాచరణ నిర్వహించబోతుందన్నారు. మూడేళ్ల కోసం జరిగే మహాసభల్లో గత మూడు సంవత్సరాలుగా అయినటువంటి పోరాటంలో సాధించిన విజయాలు వైఫల్యాలపై సమీక్షించుకొని భవిష్యత్తు పోరాట కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం అలాగే నూతన నాయకత్వాన్ని ఎన్నుకోవడం జరుగుతుందన్నారు. నేడు మహాసభల ప్రారంభ దినోత్సవం సందర్భంగా ఐదు రోజులపాటు జరిగే ఈ మహాసభల జయ ప్రధాని కాంక్షిస్తూ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో అన్ని గ్రామాలలోని మండలాలలో జెండా ఆవిష్కరణలు బైక్ ర్యాలీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ సభ్యులు హెచ్ ఆనంద్ జి, సభాధ్యక్షులు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొమ్ము భరత్, సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు సూర్య శంకర్ గౌడ్, మర్యాద వెంకటయ్య, బండి లక్ష్మీపతి, మారేడు శివ శంకర్, వ్యాకాస జిల్లా అధ్యక్షులు రవీందర్, డి హెచ్ పి ఎస్ జిల్లా నాయకులు చిన్నపాక శ్రీనివాసులు, వెంకటస్వామి, ఏ ఐ వై ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు శివకృష్ణ, న్యాయవాది బిక్షపతి, dsps నాయకులు అభి, రాహుల్, రాజు, బహుగుణ, అనిల్, స్వామి తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

అవార్డు గ్రహీతలకు పూర్వ విద్యార్ధుల సన్మానం

శ్రీకాళహస్తి:తొట్టంబేడు మండలం దిగువ సాంబయ్య పాళెం ఫౌండేషన్ స్కూల్ లో పని చేస్తున్న ఉపాధ్యాయులు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కయ్యూరు బాలసుబ్రహ్మణ్యంను,వరదయ్య పాలెం మండలం ఉన్నత పాఠశాల లో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు,జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలతకు 1987-88 పదవ తరగతి పూర్వ విద్యార్ధులు జడ్.పి.బాలురు ఉన్నత పాఠశాల లో శనివారం ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా అవార్డు గ్రహీతలు మాట్లాడుతూ తాము చదువుకున్న పాఠశాలలోతమ పదవ తరగతి పూర్వ విద్యార్ధి మిత్రులు సన్మానించడం చాలా ఆనందంగా ఉందన్నారు.ఈ అవార్డు రావడం తో మరింత బాధ్యతతో విద్యార్థుల సమగ్రాభివృద్ధి కి కృషి చేస్తామని తెలియచేసారు.ఈ తదితరులు.పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.