Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నిర్మల్

వెంకటేశ్వర ఆలయ షెడ్డు నిర్మాణానికి రూ.5 లక్షల నిధులు

భైంసా పట్టణంలోని పద్మావతి కాలనీలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద షెడ్డు నిర్మాణానికి రూ.5 లక్షల నిధులు మంజూరయ్యాయి. ఇందుకు సంబంధించిన మంజూరు పత్రాన్ని శనివారం ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ఆలయ నిర్వాహకులు, వెండి బంగారు వర్తక సంఘం నాయకులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ మాట్లాడుతూ నియోజకవర్గంలో ఆలయాల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ ప్రాంగణాల్లో అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రజల ఆధ్యాత్మిక అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలకు సహకారం అందిస్తామని తెలిపారు.
షెడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యేకు వెండి బంగారు వర్తక సంఘం నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిధులతో భక్తులకు ఉపయోగకరంగా షెడ్డు నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు, వెండి బంగారు వర్తక సంఘం నాయకులు, స్థానిక నాయకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *