Tuesday, 5 May 2026

Blog

E-పేపర్

రేపు మంత్రులతో సీఎం రేవంత్‌ రెడ్డి కీలక సమావేశం… పంచాయతీ ఎన్నికల ఫలితాలపై నియోజకవర్గాల వారీగా సమీక్ష…

పున్నమి ప్రతినిధి : రేపు మంత్రులతో సీఎం రేవంత్‌ రెడ్డి కీలక సమావేశం… పంచాయతీ ఎన్నికల ఫలితాలపై నియోజకవర్గాల వారీగా సమీక్ష… అసెంబ్లీ శీతాకాల సమావేశాల నిర్వహణ తేదీలు, అంశాలపై నిర్ణయం… ఎంపీటిసీ, జెడ్పిటిసీ ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లపైనా చర్చించే చాన్స్… సొసైటీల పాలకమండళ్లకు ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకునే అవకాశం… కార్పొరేషన్ల చైర్మన్‌ పదవుల భర్తీపై మంత్రులతో చర్చించనున్న సీఎం రేవంత్‌…

E-పేపర్

మేడిపల్లి నక్కర్త బిఆర్ఎస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా జాల నాగరాజు(JNR)

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం యాచారం మండల్ లోని మేడిపల్లి నక్కర్త బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సూచన మేరకు గ్రామశాఖ అధ్యక్ష ఎన్నిక పార్టీ మండల ప్రధాన కార్యదర్శి పాశ్చ బాష ఆధ్వర్యంలో నూతన అధ్యక్షుడిగా జాల నాగరాజు(JNR) ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లు, మాజీ ఎంపీటీసీ లు, మాజీ డైరెక్టర్లు, మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు

E-పేపర్

ఫ్యూచర్ సిటీతో ఎవరికి అవసరం-కేసీఆర్‌* కాంగ్రెస్ సర్కార్‌వి దిక్కుమాలిన పాలసీలు

పున్నమి ప్రతినిధి *ఫ్యూచర్ సిటీతో ఎవరికి అవసరం-కేసీఆర్‌* కాంగ్రెస్ సర్కార్‌వి దిక్కుమాలిన పాలసీలు రియల్‌ ఎస్టేట్‌ దందా తప్ప ఏమీ పట్టదా-కేసీఆర్‌ గురుకుల పాఠశాలల్లో విద్యార్థులు చనిపోతున్నారు విద్యార్థులను సాకలేని వాళ్లు ఫ్యూచర్‌ సిటీ కడతారా వంతారా పేరుతో జూపార్క్‌ను అమ్మేస్తారా-కెసిఆర్

కామారెడ్డి

చిన్ననాటి మిత్రునికి ఘన సన్మానం.. మాస్ ఎలక్షన్ విజయం!

కామారెడ్డి,21 డిసెంబర్, ( పున్నమి ప్రతినిధి ) : కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండలం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మూడో వార్డు నుంచి ఘన విజయం సాధించిన పిప్పరి లింబాద్రి చిన్ననాటి మిత్రులు ఘనంగా సన్మానం నిర్వహించారు.ఈ మాస్ విజయాన్ని జరుపుకుని శ్రీ కాలభైరవ స్వామి దేవస్థానం సన్నిధిలో ఘన కార్యక్రమం నిర్వహించారు.ఈ ఉత్సవంలో చిన్ననాటి మిత్రు లైన సామాల గణపతి, నామాల గంగాధర్, గొల్లపల్లి లక్ష్మా గౌడ్, పొట్టిగారి దేవేందర్, కుకుట్ల శ్రీనివాస్, శివరాం బాలగౌడ్, సుప్పని గంగాధర్, సంగీ గంగాధర్, బుద్దల రాజయ్య, జిల్లా శశిభూ షణ్ పాల్గొని సన్మానించారు. ముందుగా మరెన్నో ఉన్నత పదవులు పొందాలని ఆశీర్వదించారు.ఈ ఘన కార్యక్రమం స్థానిక సంస్థల ఎన్నికల విజయాన్ని జరుపుకునే మరో మైలురాయిగా నిలిచింది.

నారాయణపేట

నేడు కున్సి గ్రామంలో బి ఆర్ ఎస్ పార్టీ నూతన సర్పంచ్ ఉప సర్పంచుల ప్రమాణ స్వీకారం

కున్సి గ్రామంలో ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బి ఆర్ ఎస్ పార్టీ తరపున ఘన విజయం సాధించిన నూతన సర్పంచ్ ఎం.సురేష్ మరియు ఉపసర్పంచ్ గా ఎన్నికైన ఉప్పరి రమేష్ ల ప్రమాణ స్వీకారం నేడు జరగనుంది. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు , ప్రజా ప్రతినిధులు,గ్రామ పెద్దలు,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరు కానున్నారు . నూతన పాలకవర్గం,గ్రామ అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యం ఈ సందర్భంగా వెల్లడించారు.

E-పేపర్

విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను కలిసిన కస్తూరి

విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను కలిసిన కస్తూరి రైల్వేకోడూరు డిసెంబర్ పున్నమి ప్రతినిధి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువ నాయకులు, ఐ.టి మరియు విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ బాబు ని మర్యాదపూర్వకంగా కలిసిన కస్తూరి మాట్లాడుతూ ఆదివారం నాడు ఉండవల్లి లోని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రివర్యులు మాన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు నివాసం నందు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువ నాయకులు ఐటి మరియు విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారిని మర్యాదపూర్వకంగా కలిసి రైల్వేకోడూరు నియోజకవర్గంలో మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను మరియు రైల్వే కోడూరు నియోజకవర్గం అభివృద్ధి పై పలు విషయాలను చర్చించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీ కస్తూరి విశ్వనాథ నాయుడు .

E-పేపర్

ఆటో నగర్ డెవలప్మెంట్ అసోసియేషన్ కార్యదర్శి సోడిశెట్టి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఆటోనగర్ సభ్యులు మరియు వెల్డింగ్ వర్కర్స్ మెకానిక్స్ రిలే నిరాహార దీక్షలో

రాయచోటి వద్దు రాజంపేట ముద్దు దీక్షలో పాల్గొన్న ఆటోనగర్ డెవలప్మెంట్ అసోసియేషన్ రైల్వేకోడూరు మేజర్ న్యూస్ రైల్వేకోడూరు స్థానిక టోల్గేట్ వద్ద రిలే నిరాహార దీక్షలో భాగంగా ‘రాయచోటి వద్దు రాజంపేట ముద్దు’ అనే నినాదంతో జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో గత ఎనిమిది రోజులుగా రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఆదివారం నాడు రైల్వేకోడూరు ఆటో నగర్ డెవలప్మెంట్ అసోసియేషన్ కార్యదర్శి సోడిశెట్టి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఆటోనగర్ సభ్యులు మరియు వెల్డింగ్ వర్కర్స్ మెకానిక్స్ మొదలగువారు ఈ రిలే నిరాహార దీక్షలో పాల్గొనడం జరిగినదని మీడియా వారికి తెలియజేశారు. ఏది ఏమైనాపటికి రాజంపేటను జిల్లా చేసేంతవరకు ఉద్యమాలు ఆగవని సోడిశెట్టి సుబ్రహ్మణ్యం మీడియా వారికి తెలిపారు.

E-పేపర్

రైతులకు శుభవార్త *మీ ఇంటి దగ్గర నుండే యూరియాను బుకింగ్ చేసుకోవచ్చు* 22.12.2025 రైతులు

పున్నమి : రైతులకు శుభవార్త *మీ ఇంటి దగ్గర నుండే యూరియాను బుకింగ్ చేసుకోవచ్చు* 22.12.2025 రైతులు తెలంగాణ వ్యవసాయ శాఖ ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ ద్వారా యూరియాను రైతులు కొనుగోలు చేయాల్సిందిగా విజ్ఞప్తి. ఇందులో భాగంగా గూగుల్ ప్లే స్టోర్ నందు ఈ యాప్ అందుబాటులో ఉంది fertilizer booking app అని సెర్చ్ చేసినట్లయితే ఈ యాప్ కనబడుతుంది దీన్ని డౌన్లోడ్ చేసుకొని రైతులే స్వయంగా అతి సులువుగా తమ ఫోన్ నెంబరు , ఓటీపీని ఎంటర్ చేసి పట్టా పాస్ పుస్తక సంఖ్యను ఎంటర్ చేసి వచ్చిన ఓటీపీ ఆధారంగా బుకింగ్ ఐడి బుక్ ద్వారా యూరియాను పొందవచ్చు ఈ విధానాన్ని ఈ వీడియోలో వివరించడం జరిగింది మీ వ్యవసాయ శాఖ యాచారం మండలం.

విశాఖపట్నం

వాకర్స్ ఉద్యమస్ఫూర్తి ప్రదాత డా. కమల్ బయిద్ కు “విశ్వ విఖ్యాత వాకర్ మిత్ర” విశిష్ట సేవాపురాస్కారం

వాకర్స్ ఇంటర్నేషనల్’ లో గత 40 సం.లుగా ఎనలేని సేవలనందిస్తూ, వాకర్స్ ఉద్యమ స్ఫూర్తి ప్రధాతగా నిలుస్తూ ‘ వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రతిష్టాత్మక అవార్డు’ ను “విశ్వ విఖ్యాత వాకర్ మిత్ర” విశిష్ట సేవా పురస్కారాన్ని ప్రముఖ సంఘ సేవకులు, వాకర్స్ ఇంటర్నేషనల్ కాన్ఫరన్స్ చైర్మన్ డా. కమల్ బయిద్ అందుకున్నారు. సిరిపురం ఉడా చిల్డ్రన్స్ ఎరీనా పార్కులో అంగరంగ వైభవంగా ముగిసిన ‘అంతర్జాతీయ వాకర్స్ సదస్సు’లో “వాకర్స్ ఇంటర్నేషనల్” చీఫ్ ట్రస్టీ కె. రామానందం, అధ్యక్షులు కె.పద్మావతి, పూర్వ అధ్యక్షులు డా. ఎస్ పి.రవీంద్ర, మీడియా కన్వీనర్స్ నండూరి రామకృష్ణ , సి హెచ్ శ్రీనివాసరాజు, ప్రతినిధులు డాక్టర్ డి డి నాయుడు, కె ద్వారకానాధ్, యూత్ ఛైర్ పర్సన్ వంశీ చింతలపాటి తదితరులు పాల్గొని డా.కమల్ బయిద్ సేవలను కొనియాడుతూ ఆయనని ఘనంగా సత్కరించారు . “నడవండి- నడిపించండి” నినాదంతో 1986 సం. లో స్వర్గీయ సుంకర ఆళ్వార్ దాస్ స్థాపించిన వాకర్స్ ఇంటర్నేషనల్ నేడు దేశవిదేశాలలో 1650 శాఖలుగా విస్తరించి, మూడు లక్షలకు పైగా వాకర్స్ సభ్యులతో విరాజిల్లి తున్నదనని డా. ఎస్. పి రవీంద్ర తెలిపారు.

జోగులాంబ గద్వాల

సోమవారం నుండి ప్రజావాణి కార్యక్రమం.*

*సోమవారం నుండి ప్రజావాణి కార్యక్రమం.* జోగులాంబ గద్వాల డిసెంబర్21 (పున్నమి ప్రతినిధి) సోమవారం నుండి ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం యధావిధిగా నిర్వహించడం జరుగుతుందని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బి. యం. సంతోష్ నేడు ఒక ప్రకటనలో తెలిపారు.ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున తాత్కాలికంగా ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపియడం జరిగిందని, ప్రస్తుతం ఎన్నికల కోడ్ ముగిసినందున ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమము యధావిధిగా నిర్వహిం చడం జరుగుతుందని తెలియజేశారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరములో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి హాజరై తమ సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.