Monday, 4 May 2026

Blog

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

అటల్ దివస్ – సుపరిపాలన దిన వారోత్సవాలకు ఘన ఏర్పాట్లు

భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా అటల్ దివస్–సుపరిపాలన దిన వారోత్సవాలను విజయవంతం చేయాలని బీజేపీ పిలుపునిచ్చింది. రాష్ట్ర అధ్యక్షుల ఆదేశాలతో జిల్లాలో ఫైవ్‌మెన్ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో ముక్కు రాధాకృష్ణ గౌడ్, యశ్వంత్ సింగ్, సన్నీ గంటి శీనయ్య, కంది మల్లికార్జున రెడ్డి, ఉల్లం శరత్ పాల్గొన్నారు. డిసెంబర్ 25–31 వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

వనపర్తి

*ఘనంగా గణిత దినోత్సవం*

*మామిడి మాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు ఘనంగా గణిత దినోత్సవం* *పున్నమి ప్రతినిధి వనపర్తి 22 /12/ 2025* *నేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మావిడి మాడయందు గణిత దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి చెన్నప్ప గారు మరియు గణిత ఉపాధ్యాయులు ఆనంద్, మెలోడీ మరియు ఉపాధ్యాయ బృందం రవిశంకర్, శ్రీనివాసులు, ఎం ఎన్ విజయ కుమార్, చంద్రశేఖర్, లలిత, షైనీ,పద్మకుమారి, మంజుల,సుమేరా , పావని, మమత, రజనీకాంత్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు* *గణితం పట్ల విద్యార్థులు ఆసక్తిని, జిజ్ఞాసను పెంపొందించుకోవాలని వారి సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు*

వనపర్తి

*ఘనంగా గణిత దినోత్సవం*

*మామిడి మాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు ఘనంగా గణిత దినోత్సవం* *పున్నమి ప్రతినిధి వనపర్తి 22 /12/ 2025* *నేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మావిడి మాడయందు గణిత దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి చెన్నప్ప గారు మరియు గణిత ఉపాధ్యాయులు ఆనంద్, మెలోడీ మరియు ఉపాధ్యాయ బృందం రవిశంకర్, శ్రీనివాసులు, ఎం ఎన్ విజయ కుమార్, చంద్రశేఖర్, లలిత, షైనీ,పద్మకుమారి, మంజుల,సుమేరా , పావని, మమత, రజనీకాంత్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు* *గణితం పట్ల విద్యార్థులు ఆసక్తిని, జిజ్ఞాసను పెంపొందించుకోవాలని వారి సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు*

రంగారెడ్డి

*సంస్థాన్ సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి ని సన్మానించిన సంగిశెట్టి భవాని ధనుంజయ్

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి( సంగిశెట్టి ధనుంజయ్ ) డిసెంబర్ 22 : ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలోనే 3,029 అత్యధిక మెజారిటీలో ఒకటిగా నిలిచి ఘన విజయం సాధించి సంస్థాన్ నారాయణపూర్ సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి నీ ఆదివారం వారి నివాసంలో సంగిశెట్టి భవాని ధనుంజయ్ కలిసి శాలువాతో ఘనంగా సన్మానించిన అభినందనలు తెలిపారు

అన్నమయ్య

చిట్వేల్ టౌన్‌లో రేకుల షెడ్ కూలి ప్రమాదం తప్పింది

చిట్వేల్ టౌన్ పాత పోస్టాఫీస్ ఎదుట సోమవారం ఉదయం సుమారు 6:30 గంటల సమయంలో టిఫిన్ సెంటర్ ప్రారంభానికి ఏర్పాట్లు జరుగుతుండగా రేకుల షెడ్ ఒక్కసారిగా కూలిపోయింది. పాత భవనం కావడంతో సన్‌సైడ్ గోడ కూలినట్లు సమాచారం. ఘటన సమయంలో అక్కడ పనులు చేస్తున్నప్పటికీ అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. భారీ ప్రమాదం తప్పడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

వనపర్తి

1977- 78 ,10వ తరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళనం చదువులమ్మ ఒడి బడిలో అపూర్వ కలయిక

*ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాం చదువులమ్మ చెట్టు నీడలో* *1977 -78 10,వ తరగతి పూర్వ విద్యార్థుల… అపూర్వ సమ్మేళనం..* *పున్నమి ప్రతినిధి పెబ్బేర్ వనపర్తి జిల్లా తేదీ 22/ 12/ 20205* *దాదాపు 70 వసంతాల వయసులో కూడా 1977 -78 సంవత్సరానికి సంబంధించిన పదవ తరగతి విద్యార్థులు పూర్వ విద్యార్థుల సమ్మేళనం కార్యక్రమాన్ని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పెబ్బేరు, వనపర్తి జిల్లా యందు జరుపుకోవడం ఆనందదాయకమని నిర్వాహకులు తెలిపారు ఎన్నో సంవత్సరాల తర్వాత మళ్లీ చదువు చెప్పిన చదువులమ్మ ఒడి గుడి బడి అయినటువంటి ఇక్కడ కలవడం చాలా ఆనందదాయకమని పూర్వ విద్యార్థులు సరళ, హైమావతి, కల్పలత, జి చెన్నమ్మ తెలియజేశారు, కొద్ది బుద్ధిని కృష్ణయ్య, హేమ సుందర్ రెడ్డి, అప్సర్, సుధాకర్ రెడ్డి, శ్రీనివాసులు శెట్టి, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు*

E-పేపర్

ఉసురు తీసిన ‘మధ్యవర్తిత్వ’ అప్పులు

పున్నమి ప్రతినిధి : ఉసురు తీసిన ‘మధ్యవర్తిత్వ’ అప్పులు* *తెలిసిన వారే కదా అని మధ్యవర్తిత్వం వహించి అప్పులిప్పించిన వ్యాపారి చివరకు రుణదాతల వేధింపులు తాళలేక భార్యతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డారు*. *ఈ విషాదం సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలో ఆదివారం చోటుచేసుకుంది*. *రుక్మిణి, శ్రీహర్ష దంపతులు ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. తమ చావుకు కారణం అయిన వారిని వదిలి పెట్టవద్దని శ్రీ హర్ష తన సుసైడ్ లెటర్ లో పేర్కొన్నారు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పాల్గొన్న ఎమ్మెల్యే

ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ దుత్తలూరు మండల కేంద్రంలోనీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన పోలియో నిరుమూలన కార్యక్రమంలో ఐదు సంవత్సరాల చిన్నారులకు పోలియో చుక్కలు వేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలియో వంటి ప్రమాద కరమైన వ్యాధిని పూర్తిగా నిర్ములిం చాలంటే ప్రతి ఒక్కరి తల్లిదండ్రులు బాధ్యతగ ముందుకు రావాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు పోలియో చుక్కలు పిల్లలకు శాశ్వత రక్షణ కల్పించి వారి భవిష్యత్ ను సురక్షితంగా మారుస్తామని ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరమని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో దుత్తలూరు తహశీల్దార్ యనమల నాగరాజు ఎ స్ ఐ ఆదిలక్ష్మి పాల్గొన్నారు.

విశాఖపట్నం

పోలియో రహిత సమాజమే లక్ష్యంగా పల్స్ పోలియో కార్యక్రమం — డాక్టర్ కందుల నాగరాజు

పోలియో రహిత సమాజమే లక్ష్యంగా పల్స్ పోలియో కార్యక్రమం — డాక్టర్ కందుల నాగరాజు *విశాఖపట్నండిసెంబర్ 21పున్నమి ప్రతినిధి* పోలియో రహిత సమాజమే లక్ష్యంగా పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభమైనట్లు విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు, 32వ వార్డ్ కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు తెలిపారు. ఆదివారం అల్లిపురంలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 5 సంవత్సరాల లోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి బంగారు జీవితాన్ని ఇవ్వాలని పేర్కొన్నారు.పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తిని పెంచి పోలియో రహిత సమాజం నిర్మించడం మనందరి బాధత్య అని పేర్కొన్నారు. తల్లి ఆరోగ్యంగా ఉంటేనే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుందన్నారు. ఇందు కోసం గర్భిణులకు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పాలు, గుడ్డు, పౌష్టికాహారం అందచేస్తున్నారు. ప్రభుత్వాలు అందజేసే వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. భార‌త‌దేశం పోలియో ర‌హిత దేశం అయిన‌ప్ప‌టికీ, మ‌ళ్లీ పోలియో రాకుండా ఉండేందుకు త‌గు ముంద‌స్తు జాగ్ర‌త్త‌ల్ని తీసుకోవాల‌ని రాష్ట్రాల‌కు కేంద్రం సూచించింద‌ని తెలిపారు. పోలియో మహమ్మారిని తరిమికొట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చొరవతో పనిచేస్తున్నాయన్నారు. ఈ నెల 21, 22, 23 తేదీల్లో ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసేందుకు వైద్యారోగ్యశాఖ ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు. పిల్లల భవిష్యత్తు ఆరోగ్యంగా ఉండాలంటే పోలియో నుండి సంపూర్ణ రక్షణ అవసరమని 0-5 సంవత్సరాల లోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలన్నారు. ప్రతిసారి రెండు చుక్కలు-పిల్లల ఆరోగ్యానికి సంపూర్ణ రక్షణ అని అన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కొబ్బరి తోట పిహెచ్సి డాక్టర్ అక్ష పర్వీన్, ఎ. ఎన్. ఎం. కే. విజయలక్ష్మి,ఎ. ఎస్.హెచ్ సి ఎల్.నాగలక్ష్మి, అంగన్వాడి టీచర్ టి. పార్వతి,వాలంటరీ ఎల్. ప్రసన్న అక్షయ,కే. అప్పారావు, వై ఆది బాబు, సిపిఐ బుజ్జి, కే లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

గౌరవనీయులైన శ్రీ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గోపీనాథ్ జెట్టి గారి ఆదేశాలు

*విశాఖపట్నండిసెంబర్ 21పున్నమి ప్రతినిధి* గౌరవనీయులైన శ్రీ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గోపీనాథ్ జెట్టి గారి ఆదేశాల మేరకు, శ్రీ అడిషనల్ ఎస్పీ G.B.V.R మధుసూదన్ రావు గారి పర్యవేక్షణలో, పోర్టు పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ S. రమేష్, రుషికొండ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు మరియు విశాఖపట్నం పోర్ట్ అథారిటీ గారి ఆధ్వర్యంలో, తేదీ 17.12. 25 నుండి కైలాసగిరి ఆర్మడు రిజర్వ్ హెడ్ క్వార్టర్ గ్రౌండ్ నందు మత్స్యకారుల యూత్ క్రికెట్ మ్యాచ్ జరుగుతువుంధి. రేపు అనగా తేదీ 22.12.25 న క్రికెట్ మ్యాచ్ తుది ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ నందు ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులు మరియు మ్యాచ్లో పాల్గొన్న ప్రతి క్రికెట్ జట్టుకు క్రికెట్ కిట్లు అందరికీ శ్రీ గౌరవ గోపీనాథ్ జెట్టి గారి చేతుల మీదుగా క్రికెట్ ట్రోపీలు మరియు క్రికెట్ కిట్లు అందజేయడం జరుగుతుంది. కావున ఈ కార్యక్రమంనకు ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరూ మధ్యాహ్నం 2:30 గంటలకు హాజరుఅయి కార్యక్రమం ను కవర్ చేయవలసినదిగా కోరుచున్నాము. మీడియా మిత్రులకు భోజనం ఏర్పటు చేయడం జరిగింది

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.