Tuesday, 22 September 2026

Tag: politics

విజయనగరం 

ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు

ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు హెలీప్యాడ్, రహదారి, ఎమ్మెల్యే నివాసాన్ని పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ విజయనగరం జిల్లా బ్యూరో, రమణ | ఆగస్టు 21 పున్నమి ప్రతినిధి ఎస్.కోట శాసనసభ్యులు కోళ్ల లలిత కుమారి రాంప్రసాద్ దంపతుల కుమార్తె వివాహం త్వరలో జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం (ఆగస్టు 22) ఎల్.కోట మండలానికి రానున్నారు. ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా సాయంత్రం 4 గంటలకు ఎల్.కోట గ్రామానికి చేరుకోనున్నారు. ముఖ్యమంత్రి హెలిపాడ్ నుండి నేరుగా శాసనసభ్యుల నివాసానికి చేరుకుని కాబోయే వధూవరులను ఆశీర్వదిస్తారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి, జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ శుక్రవారం మధ్యాహ్నం ఎల్.కోట మండలం ఎల్.కోట గ్రామంలో పరిశీలించారు. ముఖ్యమంత్రి హెలికాప్టర్ దిగేందుకు ఏర్పాటు చేయనున్న హెలీప్యాడ్ ప్రాంతాన్ని, హెలీప్యాడ్ నుంచి శాసనసభ్యుల నివాసం వరకు ఉన్న రహదారిని, అలాగే శాసనసభ్యుల నివాసాన్ని వారు పరిశీలించారు. హెలీప్యాడ్ వద్ద భద్రతా ఏర్పాట్లు, రహదారి మార్గంలో ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, బారికేడింగ్ తదితర అంశాలపై అధికారులకు కలెక్టర్, ఎస్పీ పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి పర్యటన సజావుగా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరిగేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను పటిష్టంగా చేపట్టాలని, అవసరమైన చోట్ల పోలీసు బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని ఎస్పీ అధికారులకు సూచించారు. హెలీప్యాడ్ నుంచి ఎమ్మెల్యే నివాసం వరకు మార్గంలో ఎటువంటి అవాంతరాలు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లను సంబంధిత అధికారులు సమన్వయంతో పూర్తి చేస్తున్నారు.

మేడ్చల్ – మల్కాజిగిరి

*ప్రజా అభివృద్ధే లక్ష్యం: ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారు…*

*కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మున్సిపాలిటీ శంభీపూర్ లోని కార్యాలయంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన తాజా మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, వివిధ కాలనీల సభ్యులు, మరియు తదితరులు మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారిని కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసారు.. ఈ సందర్భంగా పలు సమస్యలు పరిష్కరించాలని విన్నవించారు. వారు సానుకూలంగా స్పందించి ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని తెలియజేశారు…* *పలు ప్రాంతాలలో జరగబోయే శుభ కార్యక్రమాల్లో పాల్గొనాలని పలువురు ఆహ్వానించారు..*

కర్నూలు

ప్రతి ఇంటికి తెలుగుదేశం

గోనెగండ్ల: రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు, ఎమ్మిగనూరు నియోజకవర్గ శాసనసభ్యులు డా. బి.వి. జయ నాగేశ్వర రెడ్డి గారి సూచనలు, ఆదేశాలతో గోనెగండ్ల మండలం బోదేపాడు గ్రామంలో “ప్రతి ఇంటికి తెలుగుదేశం” కార్యక్రమాన్ని టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికీ వెళ్లి కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. అలాగే ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేస్తూ ముందుకు సాగుతోందని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని నాయకులు తెలిపారు. ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తూ, పార్టీ కార్యక్రమాలను ప్రతి గడపకు తీసుకెళ్లడమే “ప్రతి ఇంటికి తెలుగుదేశం” కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో గోనెగండ్ల మండల టీడీపీ నాయకులు, క్లస్టర్, యూనిట్, బూత్ నాయకులు, కార్యకర్తలు, యువత తదితరులు పాల్గొన్నారు. “ప్రతి ఇంటికి తెలుగుదేశం – ప్రతి కుటుంబానికి సంక్షేమం, ప్రతి గ్రామానికి అభివృద్ధి” అనే నినాదంతో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.

మేడ్చల్ – మల్కాజిగిరి

శ్రీ రాజీవ్ గాంధీ గారి జయంతి సందర్బంగా నేతలు కేక్ కట్ చేసి, అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హనుమంత్ రెడ్డి గారితో కలిసి పాల్గొన్న *మాజీ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతిరెడ్డి గారు.*

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గిరి నగర్ డివిజన్ లోని ఐడిపిల్ చౌరస్తా వద్ద జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు బుయ్యని శివకుమార్ గారి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన భారత రత్న, మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి విగ్రహ ఆవిష్కరణ మరియు జయంతి కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హనుమంత్ రెడ్డి గారితో కలిసి పాల్గొన్న *మాజీ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతిరెడ్డి గారు.* శ్రీ రాజీవ్ గాంధీ గారి జయంతి సందర్బంగా నేతలు కేక్ కట్ చేసి, అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆర్ లక్ష్మి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ముద్దాపురం శ్రీకాంత్ గౌడ్,మాజీ కార్పొరేటర్ గౌరీష్ గారు, పాలకృష్ణ గారు,జిల్లా ఫిషరీస్ చైర్మన్ మన్నే రాజు, జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ కావలి చంద్రయ్య, , కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఎస్సీ సెల్ చైర్మన్ బొట్ల విజయ్ కుమార్, గిరి నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కనకరావు,రంగారెడ్డి నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జలీల్ ఖాన్, పేట్ బషీరాబాద్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బండి శ్రీనివాస్ గౌడ్, గణేష్ నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇరుగు రాధాకృష్ణ, దుండిగల్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జక్కుల మల్లేష్, బహదూర్ పల్లి డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్, జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శులు గణేష్, జాకీర్, సీనియర్ నాయకులు జేమ్స్, మేకల ఎల్లయ్య, పాషా మరియు అనుబంధ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది.

మేడ్చల్ – మల్కాజిగిరి

కుత్బుల్లాపూర్‌లో ఘనంగా కె.ఎం.పాండు 81వ జయంతి వేడుకలు*

*కుత్బుల్లాపూర్, ఆగస్టు 17:* కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే శ్రీ *కె.పి.వివేకానంద* గారి తండ్రి, మాజీ మున్సిపల్ చైర్మన్ *శ్రీ కె.ఎం.పాండు* గారి 81వ జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. చింతల్‌లోని *శ్రీ కె.ఎం.పాండు విగ్రహ ప్రాంగణం* వద్ద ఉదయం 10 గంటలకు జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే *కె.పి.వివేకానంద* గారు హాజరై నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా *బిఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ జగన్* తో పాటు *కె.పి.పాండు అభిమానులు, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు* పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కె.ఎం.పాండు గారి సేవలను గుర్తు చేసుకుంటూ, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని నాయకులు పేర్కొన్నారు.

మేడ్చల్ – మల్కాజిగిరి

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం: కైసర్‌నగర్‌లో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

కైసర్‌నగర్‌లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి, జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా 277వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ అధ్యక్షులు సయ్యద్ షఫీ మాట్లాడుతూ.. స్వాతంత్ర్య సమరయోధులు చేసిన పోరాటాలు, త్యాగాల ఫలితంగానే నేడు మనం స్వతంత్ర భారతదేశంలో స్వేచ్ఛగా జీవిస్తున్నామని అన్నారు. మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ తదితర అనేక మంది మహనీయుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాలను నేటి తరం ముందుకు తీసుకెళ్లాలని, దేశ భవిష్యత్తు కోసం యువత బాధ్యతగా వ్యవహరించాలని ఆయన అన్నారు. దేశ సమైక్యత, అభివృద్ధి, సౌభ్రాతృత్వం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సయ్యద్ గౌస్ పాషా, ముఫ్తీ ఇజార్ ఖాస్మీ, జీహెచ్ఎంసీ కోఆర్డినేటర్ ఫరీన్ ఖాన్, ఎండీ అజీమ్ సుల్తాన్ షేక్, ఎండీ ఆసిఫ్, ఎండీ మున్నవర్, గంగాధర్, జాఫర్, శ్రీనివాస్ గౌడ్, మహీందర్, ఎండీ ఇమ్రాన్, ఎండీ సమీర్ తదితరులు పాల్గొన్నారు Uploaded Video:

మేడ్చల్ – మల్కాజిగిరి

మహాదేవపురం డివిజన్‌లో CMC నిధులతో CC రోడ్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన కోలన్ హన్మంత్ రెడ్డి

ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని మహాదేవపురం డివిజన్‌లోని RK టౌన్‌షిప్ మరియు శిల్పా ఫైన్ వ్యాలీ కాలనీలలో ప్రజలు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న రోడ్ల సమస్యల పరిష్కారానికి *కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలను హన్మంత్ రెడ్డి గారి* ప్రత్యేక చొరవతో CMC నిధుల నుంచి రూ.1.40 కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులతో చేపట్టనున్న CC రోడ్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో *ముఖ్యఅతిథిగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి గారు* పాల్గొని అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా హన్మంతన్న మాట్లాడుతూ, ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని, మహదేవ్‌పూర్ డివిజన్‌లోని ప్రతి కాలనీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా మరిన్ని అభివృద్ధి పనులను కూడా తీసుకువస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు సిద్ధనోళ్ళ సంజీవ్ రెడ్డి, మైసిగారి శ్రీనివాస్, టీపీసీసీ మైనారిటీ విభాగం రాష్ట్ర సంయుక్త కన్వీనర్ సమీర్ ఖాన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలేటి శ్రీనివాస్, కాలనీ ప్రతినిధులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

విజయనగరం 

ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ప్రజల్లోకి….,. శృంగవరపుకోట నియోజకవర్గం ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి

విజయనగరం జిల్లా బ్యూరో/ రమణ,ఆగస్టు 13. పున్నమి ప్రతినిధి జామి మండలం జాగరం గ్రామంలో కూటమి ప్రభుత్వం చేపట్టిన ‘రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం’ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి పాల్గొని గ్రామంలో ఇంటింటికీ తిరిగి ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలకు కరపత్రాలు అందజేసి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమం దిశగా ముందుకు సాగుతోందన్నారు. తల్లికి వందనం, మహిళా శక్తి, అన్నదాత సుఖీభవ, దీపం-2, ఎన్‌టీఆర్ భరోసా, సూపర్ సిక్స్ వంటి పథకాలను ప్రజలకు వివరించారు. అలాగే ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు.

విజయనగరం 

కళ్లేపల్లి లో వికసించిన సంక్షేమ కాంతి కూటమి నాయకత్వంలో వేగంగా రాష్ట్ర అభివృద్ధి ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి

కళ్లేపల్లిలో వికసించిన సంక్షేమ కాంతి కూటమి నాయకత్వంలో వేగంగా రాష్ట్ర అభివృద్ధి: ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి విజయనగరం జిల్లా పున్నమి ప్రతినిధి రమణ, ఆగస్టు 12. ఎల్.కోట, మండల పరిధిలోని కళ్లేపల్లి గ్రామంలో కూటమి ప్రభుత్వం చేపట్టిన ‘రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం’ ఇంటింటి ప్రచార కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో శృంగవరపుకోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి గ్రామంలో విస్తృతంగా పర్యటించారు. ఇంటింటికీ వెళ్తూ గత రెండేళ్ల కాలంలో కూటమి ప్రభుత్వం సాధించిన కీలక విజయాలను, ప్రజలకు అందించిన సంక్షేమ ఫలాలను గ్రామస్థులకు సమగ్రంగా వివరించారు. ఈ సందర్భంగా గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే లలిత కుమారికి మహిళలు, స్థానికులు హారతులు పడుతూ ఘనంగా స్వాగతం పలికారు. పర్యటనలో భాగంగా ఆమె ప్రజలతో నేరుగా ముచ్చటించి, వారి సమస్యలను అడిగి తెలుసుకోవడమే కాకుండా, గ్రామాల్లో మౌలిక వసతులు, అభివృద్ధి పనులకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కూటమి కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

వస్త్ర నజరానా పంపిణీ : మేకపాటి శాంత కుమారి.*

మండల కేంద్రమైన మర్రిపాడు లో జిల్లా గ్రంధాలయ చైర్మన్ మేకపాటి శాంత కుమారి 49వ జన్మదిన వేడుకలు సందర్భంగా తన స్వగృహానికి మీడియా ప్రతినిధులను ప్రత్యేకంగా ఆహ్వానించి ఘనంగా సత్కరించారు. అనంతరం మేకపాటి శాంతికుమారి ఆమె చేతుల మీద గా మీడియా ప్రతినిధులకు వస్త్రాల తో పాటు చిరు నజరానా అందజేసి ఆమె గొప్పతనాన్ని చాటుకున్నారు. ఆమె మీడియా మిత్రులందరిని సోదరి భావంతో పలకరించి తన జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. మీడియా మిత్రులు అందరూ పాల్గొనడం చాలా సంతోషకరమని కొనియాడారు. జిల్లాలో గ్రంథాలయాల అభివృద్ధికి, పాఠకులు మెరుగైన వసతుల కల్పనకు మీడియా పూర్తి సహకారం అందించాలని, ఎక్కడైనా అభివృద్ధి నోచుకోకపోయినా, వ్యవస్థ కుంటుపడిన అభివృద్ధి చెందాలంటే మీ మీడియా ముందుండాలని, అది మీడియా వల్లె జరుగుతుందని ఈ సందర్భంగా ఆమె కొనియాడారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.