Tuesday, 22 September 2026

Tag: politics

అన్నమయ్య

భక్తితో పాటు సేవా కార్యక్రమాలు.. ఘనంగా వినాయక చవితి వేడుకలు

వినాయక చవితి సందర్భంగా రాజంపేటలోని రాజీవ్‌నగర్ GMC క్లబ్ బ్యాక్‌సైడ్ వద్ద వినాయక ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గడికోట సుబ్బారెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ వేడుకల్లో వినాయకుడి విగ్రహం వద్ద పటాకులను స్పాన్సర్ చేయడంతో పాటు మహిళలకు జాకెట్లు, పసుపు-కుంకుమ అందజేశారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి విచ్చేసిన గడికోట సుబ్బారెడ్డి నీ నిర్వాహకులు ఘనంగా సన్మానించి, సాదరంగా స్వాగతం పలికారు. భక్తి కార్యక్రమాలతో పాటు మహిళలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలను నిర్వహించడం పట్ల పలువురు అభినందనలు తెలిపారు. గణపయ్య ఆశీస్సులతో వినాయక చవితి వేడుకలు ఆనందోత్సాహాల మధ్య ఘనంగా విజయవంతమయ్యాయి. ప్రజలందరికీ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, శాంతి సమృద్ధులు కలగాలని నిర్వాహకులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సారా రాజేష్, కోటపాటి నాగరాజు, సారా వెంకట సుబ్బయ్య, వడ్ల వెంకటయ్య, కోటపాటి అనీల్, కోటపాటి వినయ్, కిరణ్, మధు, నాగూర్, కల్యాణ్ తదితరులు పాల్గొన్నారు. గడికోట సుబ్బారెడ్డి అన్నగారికి నిర్వాహకులు, భక్తులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కొండ బిట్రగుంట ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి

బోగోలు మండలం, కొండ బిట్రగుంటలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను కావలి నియోజకవర్గ శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆలయ అధికారులు, ధర్మకర్తల మండలి (కమిటీ) సభ్యులతో కలిసి ఎమ్మెల్యే ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న నిర్మాణ, 6పునర్నిర్మాణ పనులను ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. ​ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ…ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని తెలిపారు. నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు కచ్చితంగా పాటించాలని, నిర్దేశిత గడువులోగా పనులన్నింటినీ పూర్తి చేయాలని అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి పలు సూచనలు చేశారు.​అలాగే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, నీడ, క్యూలైన్లు మరియు దైవ దర్శన ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షించాలని ఆలయ అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవోఅరవరాధాకృష్ణ,ఆలయ చైర్మన్ శ్రీరాం మాల్యాద్రి,ఆలయ అధికారులు,కమిటీ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు నాయకులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలి: దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు

దగదర్తి మండలం పున్నమి ప్రతినిధి :ముత్యాల గిరి కావలి , సెప్టెంబర్ 13: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని కావలి నియోజకవర్గ ప్రజలకు, అభిమానులకు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలకు కావలి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ దగ్గు మాటి వెంకటకృష్ణారెడ్డి గారు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క దగ్గు మాటి వెంకటకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ.. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుని కృపాకటాక్షాలతో కావలి నియోజకవర్గ ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, శాంతి, సౌభాగ్యం నిండాలని ఆకాంక్షించారు. ప్రతి కుటుంబంలో ఆనందం వెల్లివిరియాలని, ప్రతి ఇంటా సంతోషాల వెలుగులు నిండాలని గణనాథుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. “గణపతి దేవుని ఆశీస్సులతో మన కావలి నియోజకవర్గం మరింత అభివృద్ధి పథంలో ముందుకు సాగాలి. కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరాలి. ప్రజాసేవలో మరింత ఉత్సాహంతో ముందుకు సాగేందుకు గణనాథుడు మనందరికీ శక్తి, నూతన ఉత్తేజాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను” అని ఎమ్మెల్యే కావ్య పేర్కొన్నారు. వినాయక చవితి ఉత్సవాలను ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో, ఐక్యతా భావంతో, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా ప్రతి ఒక్కరూ పోలీసు, అధికార యంత్రాంగానికి సహకరిస్తూ, పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని పర్యావరణహిత విగ్రహాలను వినియోగించి, పండుగను సురక్షితంగా మరియు ఆనందోత్సాహాలతో నిర్వహించాలని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు పిలుపునిచ్చారు. విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ నియోజకవర్గ ప్రజలందరికీ మరోసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.

వరంగల్

మట్టి గణనాధులను పూజిద్దాం పర్యావరణం కాపాడుదాం-మున్సిపల్ చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీరామానంద్

మట్టి గణపతిని పూజిద్దాం పర్యావరణాన్ని పరిరక్షిద్దాం అనే కార్యక్రమాన్ని తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి చేపట్టగా నర్సంపేట మున్సిపల్ కార్యాలయంలో నేడు శుక్రవారం నాడు మున్సిపల్ అధికారులచే ఏర్పాటు కార్యక్రమంలో పాల్గొని అధికారులతో కలిసి మట్టి విగ్రహాలను పంపిణీ చేసిన నర్సంపేట మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి శ్రీలక్ష్మీరామానంద్ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నర్సంపేట టౌన్ సీఐ ముస్క శ్రీనివాస్ ఈ సందర్బంగా చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీరామానంద్, నర్సంపేట టౌన్ సీఐ ముస్క శ్రీనివాస్ మున్సిపల్ కమిషనర్ కాటం భాస్కర్ మాట్లాడుతూ నర్సంపేట మున్సిపల్ పరిధిలో వీలైనంత వరకు మట్టి విగ్రహాలను ఏర్పాటు చేసుకునేందుకు వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు కృషి చేయాలని అన్నారు, రాష్ట్రంలో మరియు నియోజకవర్గాల వ్యాప్తంగా ఏర్పడిన వర్షాల కొరత వలన నర్సంపేట పరిసరా ప్రాంతాలలో ఉన్న చెరువులు నీటిమట్టం తగ్గి గణనాధుల నిమర్జనాలకు ఇబ్బంది కలిగే విధంగా ఉన్నందున గణపయ్య నవరాత్రులు నిర్వహించుకునేందుకు ఇంకా మూడు రోజుల వ్యవధి ఉన్నందున వీలైనంత వరకు మట్టి గణనాథులను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు, అందులో భాగంగానే నర్సంపేట పట్టణ మొదటి పౌరురాలిగా తన బాధ్యతగా తమ సొంతవాడైన 25వ వార్డులో గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో దాదాపు 15 అడుగుల మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందని తెలిపారు, మట్టి విగ్రహాలను ఏర్పాటు చేసుకునే కొరకు సమయ భావం తక్కువగా ఉండడం వలన విగ్రహాలను ఏర్పాటు చేసుకుని సమయంలో చిన్న విగ్రహాలు ఏర్పాటు చేసుకొని సులభంగా నీటిలో మునిగేందుకు వీలుగా ఉండే విధంగా విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు, అలాగే వినాయక మండపాల పర్మిషన్, కరెంట్ డిపార్ట్మెంట్ పర్మిషన్లు తప్పనిసరిగా తీసుకొని పోలీస్ శాఖ వారికి మరియు కరెంట్ డిపార్ట్మెంట్ వారికి మున్సిపల్ శాఖ అధికారులకు సహకరించి అత్యంత భక్తిశ్రద్ధల మధ్య జరిగే గణపతి నవరాత్రి ఉత్సవాలను ఎలాంటి గొడవలకు తావు లేకుండా నిర్వహించుకోవాలని అన్నారు, ఈ సంవత్సరం నర్సంపేట మున్సిపల్ పరిధిలో 25వ వార్డులో ఏర్పాటు చేసిన మట్టి విగ్రహాన్ని ఆదర్శంగా తీసుకొని వచ్చే సంవత్సరం నుండి నర్సంపేట మున్సిపల్ పరిధిలో పూర్తిగా మట్టి విగ్రహాలను ఏర్పాటు చేసుకొని పర్యావరణ పరిరక్షణలో మనందరి బాధ్యతను నిర్వర్తించుకోవాలని పిలుపునివ్వడం జరిగింది.. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గంధం నరేందర్ గుప్తా, డిప్యూటీ తాసిల్దార్ ఆంగోత్ తారాచంద్, కౌన్సిలర్లు బత్తిని రాజేందర్, ముత్తినేని వెంకన్న, మాదాసి రవి, ములుకల వినోద సాంబయ్య, పున్నం నరసింహారెడ్డి, బాణాల ప్రసన్న శ్రీనివాస్, చీకటి స్వరూప ఓదయ్య గౌడ్, దొంగల రజిత, హన్మకొండ శ్రీధర్, మండల శ్రీదేవి శ్రీనివాస్, మున్సిపల్ అధికారులు, మున్సిపల్ సిబ్బంది, నర్సంపేట పుర ప్రముఖులు, తదితరులు పాల్గొన్నారు..

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

*నిజం గెలిచింది.. న్యాయం నిలిచింది*

53 రోజుల నిర్బంధాన్ని గుర్తు చేసుకుంటూ దీపాలు వెలిగించిన కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారు తెదేపా జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అరెస్టుకు మూడేళ్లు పూర్తైన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న “నిజం గెలిచింది” కార్యక్రమంలో భాగంగా కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారు 53 దీపాలను వెలిగించి, చంద్రబాబు నాయుడు గారు జైల్లో గడిపిన 53 రోజుల నిర్బంధ కాలాన్ని గుర్తు చేసుకుంటూ ‘నిజం గెలిచింది’ కార్యక్రమాన్ని నిర్వహించారు.

నారాయణపేట

మాగనూర్, కృష్ణ మండలాల్లో రేపు ఎంపీ డీకే అరుణమ్మ పర్యటన అభివృద్ధి పనులకు భూమి పూజ

మాగనూర్, కృష్ణ మండలాల్లో ఎంపీ డీకే అరుణమ్మ రేపు పర్యటించనున్నట్లు మండల బీజేపీ అధ్యక్షులు జయానంద్ రెడ్డి, నల్లె నర్సప్ప తెలిపారు. మాగనూర్ మండలం నేరడ్గం గ్రామంలో మధ్యాహ్నం 2 గంటలకు ఎంపీ నిధులతో నిర్మించనున్న కామన్ వర్క్ షెడ్‌కు భూమి పూజ నిర్వహించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 3:30 గంటలకు కృష్ణ మండల కేంద్రంలోని కృష్ణ నది ఒడ్డున దత్తాత్రేయ స్వామి దేవాలయం సమీపంలో భవిష్యత్ కృష్ణ పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని కర్మకాండలు నిర్వహించేందుకు ఎంపీ నిధులతో నిర్మించనున్న కామన్ వర్క్ షెడ్‌కు భూమి పూజ చేయనున్నారు. ఈ కార్యక్రమాలకు ఉమ్మడి మండలంలోని బీజేపీ రాష్ట్ర, జిల్లా నాయకులు, సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, మాజీ ప్రజాప్రతినిధులు, అఖిలపక్ష నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

టీడీపీ లీడర్షిప్ కాంక్లేవ్‌లో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు

తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహిస్తున్న టీడీపీ లీడర్షిప్ కాంక్లేవ్‌ రెండో రోజు కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర గారితో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు సమావేశమై పలు అంశాలపై చర్చించారు.

మేడ్చల్ – మల్కాజిగిరి

_కాంగ్రెస్ అవినీతి పాలనపై కదంతొక్కిన “కుత్బుల్లాపూర్ గులాబీ సైన్యం”…_*

కాంగ్రెస్ అవినీతి పాలనపై కదంతొక్కిన కుత్బుల్లాపూర్ గులాబీ సైన్యం కాంగ్రెస్ వెయ్యి రోజుల దగా పాలనపై వారం రోజులపాటు నిర్వహించే నిరసన కార్యక్రమాల్లో భాగంగా రెండవ రోజు చేపట్టిన ధర్నా కార్యక్రమంలో భాగంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని కుత్బుల్లాపూర్, దుండిగల్, బాచుపల్లి మండల రెవెన్యూ కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహించిన బిఆర్ఎస్ శ్రేణులు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలులో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై విచారణ, జీవో 59 ఇళ్ల క్రమబద్ధీకరణ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ రెవెన్యూ ఉన్నతాధికారులకు వినతిపత్రం…. కాంగ్రెస్ వెయ్యి రోజుల దగా పాలనపై సమర శంఖం పూరించిన బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపుమేరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ గారు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గార్ల ఆధ్వర్యంలో ఈనెల 7 రోజుల పాటు నిర్వహించనున్న నిర్వహించనున్న నిరసన కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని కుత్బుల్లాపూర్, దుండిగల్, బాచుపల్లి రెవెన్యూ కార్యాలయాల వద్ద చేపట్టిన ధర్నా కార్యక్రమంలో బిఆర్ఎస్ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొని కాంగ్రెస్ పార్టీ అవినీతిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. రాజకీయాలకతీతంగా, పార్టీలకతీతంగా నిష్పక్షపాతంగా అర్హులైన వారికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కేటాయించిన ఘనత కేసీఆర్ గారి ఆధ్వర్యంలోని బిఆర్ఎస్ పార్టీకే దక్కుతుందన్నారు. 🏣 కానీ నేటి కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులకు దక్కాల్సిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను తమ అనుయాయులకు, దళారీ వ్యవస్థను ప్రోత్సహిస్తూ అనర్హులకు కేటాయిస్తుందన్నారు. కాబట్టి రెవెన్యూ ఉన్నతాధికారులు ఈ అవినీతి పాలనపై నిష్పక్ష విచారణ చేపట్టి దళారులుగా వ్యవహరిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. *పెండింగ్ లో ఉన్న జీవో 59* దరఖాస్తులను వెంటనే పూర్తిచేసి పేద ప్రజల ఇళ్లను క్రమబద్ధీకరించాలి. *ఇందిరమ్మ పథకం* క్రింద అర్హులకు ఇళ్లను నిర్మించి ఇస్తామని చెప్పి దరఖాస్తుదారుడు నుంచి పదివేల రూపాయలు కట్టించుకున్న ప్రభుత్వం, ఇందిరమ్మ ఇండ్ల పథకం కోసం కుత్బుల్లాపూర్ లో ఎక్కడ ప్రభుత్వ భూమి కేటాయించారు, ఏ విధమైన నిర్మాణాలు చేపడుతున్నారు, ఎప్పటి లోగా ఇండ్ల నిర్మాణం చేపట్టి పూర్తిచేసి లబ్ధిదారులకు అందిస్తారనే దానిపై దరఖాస్తుదారులకు, నిరుపేదలకు స్పష్టత ఇవ్వాలన్నారు. *ఇందిరమ్మ ఇండ్ల పేరుతో* ప్రభుత్వం మరో మారు నిరుపేదలను మోసం చేస్తుండగా కొందరు దళారులు మాత్రం ఇదే అదునుగా భావిస్తూ అందిన కాడికి దోచుకుంటున్నారని, ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపుల్లో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై విచారణ చేపట్టి అందుకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. అనంతరం అర్హులకు అందాల్సిన *డబుల్ బెడ్ రూమ్, ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపు* లో జరుగుతున్న అవినీతి, *జీవో 59 క్రమబద్ధీకరణ* వంటి అంశాలపై పూర్తిస్థాయి విచారణ జరిపి దళారులపై పడిన చర్యలు తీసుకోవాలని కోరుతూ రెవెన్యూ ఉన్నతాధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజా ప్రతినిధులు, పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు, అభిమానులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

మేడ్చల్ – మల్కాజిగిరి

1000 రోజుల కాంగ్రెస్ పాలనకు ప్రజల హర్షం – ఘనంగా బైక్ ర్యాలీ

ప్రజా పాలనకు 1000 రోజులు పూర్తయిన సందర్భంగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఘనంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. 283వ డివిజన్ D-Mart నుంచి ప్రారంభమైన ఈ భారీ బైక్ ర్యాలీలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా హన్మంతన్న మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ సంక్షేమం, అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి సాధిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్–మల్కాజిగిరి వైస్ ప్రెసిడెంట్ బి. శివకుమార్, 283వ డివిజన్ ప్రెసిడెంట్ కనకరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ జైరామ్, 281వ డివిజన్ అధ్యక్షుడు జలీల్ ఖాన్, జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ గౌడ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు అనిమి రెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ తైలం శ్రీనివాస్, డివిజన్ వైస్ ప్రెసిడెంట్ కార్యం ప్రకాష్, మైనారిటీ అధ్యక్షుడు అజర్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మురళీ, భాస్కర్, వెంకటేష్, మహిళా అధ్యక్షురాలు మాధవి రాణి, చిన్నమ్మ, నీల గుప్త, లక్ష్మీ రెడ్డి, లక్ష్మీ, భాగ్య తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని బైక్ ర్యాలీని విజయవంతం చేశారు.

మేడ్చల్ – మల్కాజిగిరి

జగద్గిరిగుట్టలో బీఆర్ఎస్ వంట వార్పు – కాంగ్రెస్ 420 హామీలపై నిరసన

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జగద్గిరిగుట్ట 126 డివిజన్ పరిధిలో 04-09-2026 న బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వంట వార్పు కార్యక్రమం నిర్వహించనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన 420 హామీలను నెరవేర్చడంలో విఫలమైందని, వృద్ధులు, వికలాంగులకు పెన్షన్, మహిళలకు నెలకు రూ.2500, కేసీఆర్ కిట్, కళ్యాణ లక్ష్మి, విద్యార్థినులకు స్కూటీలు వంటి పథకాలను అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ ఈ పోరుబాట చేపట్టినట్లు మాజీ కార్పొరేటర్ కె. జగన్ తెలిపారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.