Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Tag: politics

నిర్మల్

Heartily congratulations to Md. Rahaman khan ( Mohsin) for appointed as General Secretary congress party Bhainsa.

Bhainsa: Today Sri. Bhosle Narayan Rao patel Garu felicitated the newly appointed General Secretary Bhainsa town Mr. Md. Rahaman khan( Mohsin) at his office. Md. Rahaman khan is a young and dynamic personality with good educational background and having good rapport in the society. He is well known for his social activities in the society. He selflessly worked for the betterment of society. On behalf of the congress party We would like to congratulate him on getting a new challenging position. We wish him for his new journey. On this occasion, Bhainsa town president Mr. Aravind Garu, Mr. Shankar Chandre Garu, Mr. Basheer Garu, Mr. Almas khan, Mr. Mateen khan & others were Present.

అన్నమయ్య

యువతకు బాణసంచా పంపిణీ.. లడ్డూ వేలంపాట నిర్వహించిన గడికోట వెంకటసుబ్బారెడ్డి

రాజంపేట: వినాయక చవితి సందర్భంగా రాజంపేట పట్టణంలోని విద్యుత్‌నగర్‌లో విఘ్నేశ్వరుని మండపం వద్ద వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గడికోట వెంకటసుబ్బారెడ్డి గారికి యువత, స్థానికులు అంగరంగ వైభవంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన విఘ్నేశ్వరుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్దలు, యువత సమక్షంలో సుబ్బారెడ్డిని ఘనంగా సన్మానించారు. వినాయక చవితి వేడుకల్లో భాగంగా యువతకు గడికోట వెంకటసుబ్బారెడ్డి బాణసంచా అందజేశారు. అనంతరం లడ్డూ వేలంపాటను దగ్గరుండి నిర్వహించారు. వేలంపాటలో లడ్డూను దక్కించుకున్న వారికి ఆయన స్వయంగా లడ్డూను అందజేశారు. అలాగే అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు స్వయంగా అన్నప్రసాదం వడ్డించారు. విద్యుత్‌నగర్ 23వ వార్డులో జరిగిన ఈ కార్యక్రమానికి వందలాది మంది యువత, మహిళలు, స్థానికులు హాజరయ్యారు. దీంతో ప్రాంతమంతా పండుగ వాతావరణం నెలకొంది. గణనాథుని దర్శనం, పూజలు, అన్నదానం, లడ్డూ వేలంపాట కార్యక్రమాలతో సందడి నెలకొంది. కార్యక్రమంలో రంగరాజు, పోతుల శ్రీనివాసులు, హరి, రమణయ్య, ప్రసాద్, నరేష్, హర్ష, నాగ, యశ్వంత్, నాని, సురేష్ తదితర యువతతో పాటు మహిళలు, స్థానికులు పాల్గొన్నారు. Uploaded Video:

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఉదయగిరి బ్రిడ్జి సెంటర్‌లో గణనాథుడికి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ప్రత్యేక పూజలు

*ఉదయగిరి బ్రిడ్జి సెంటర్‌లో గణనాథుడికి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ప్రత్యేక పూజలు* కావలి: ఆదివారం,20 వినాయక స్వామి ఉత్సవాల్లో భాగంగా కావలి పట్టణంలోని ఉదయగిరి బ్రిడ్జి సెంటర్‌లో భగత్ సింగ్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాన్ని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి దర్శించుకున్నారు.ఈ సందర్భంగా స్వామివారికి నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పాల్గొని, గణనాథుడికి పూజలు నిర్వహించారు. అనంతరం గణపతి స్వామి ఆశీస్సులు పొందారు.వినాయక ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాల మధ్య కొనసాగాలని, కావలి నియోజకవర్గ ప్రజలందరికీ సుఖసంతోషాలు,ఆయురారోగ్యాలు ప్రసాదించాలని గణనాథుడిని ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు.

అన్నమయ్య

భక్తితో పాటు సేవా కార్యక్రమాలు.. ఘనంగా వినాయక చవితి వేడుకలు

వినాయక చవితి సందర్భంగా రాజంపేటలోని రాజీవ్‌నగర్ GMC క్లబ్ బ్యాక్‌సైడ్ వద్ద వినాయక ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గడికోట సుబ్బారెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ వేడుకల్లో వినాయకుడి విగ్రహం వద్ద పటాకులను స్పాన్సర్ చేయడంతో పాటు మహిళలకు జాకెట్లు, పసుపు-కుంకుమ అందజేశారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి విచ్చేసిన గడికోట సుబ్బారెడ్డి నీ నిర్వాహకులు ఘనంగా సన్మానించి, సాదరంగా స్వాగతం పలికారు. భక్తి కార్యక్రమాలతో పాటు మహిళలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలను నిర్వహించడం పట్ల పలువురు అభినందనలు తెలిపారు. గణపయ్య ఆశీస్సులతో వినాయక చవితి వేడుకలు ఆనందోత్సాహాల మధ్య ఘనంగా విజయవంతమయ్యాయి. ప్రజలందరికీ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, శాంతి సమృద్ధులు కలగాలని నిర్వాహకులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సారా రాజేష్, కోటపాటి నాగరాజు, సారా వెంకట సుబ్బయ్య, వడ్ల వెంకటయ్య, కోటపాటి అనీల్, కోటపాటి వినయ్, కిరణ్, మధు, నాగూర్, కల్యాణ్ తదితరులు పాల్గొన్నారు. గడికోట సుబ్బారెడ్డి అన్నగారికి నిర్వాహకులు, భక్తులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కొండ బిట్రగుంట ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి

బోగోలు మండలం, కొండ బిట్రగుంటలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను కావలి నియోజకవర్గ శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆలయ అధికారులు, ధర్మకర్తల మండలి (కమిటీ) సభ్యులతో కలిసి ఎమ్మెల్యే ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న నిర్మాణ, 6పునర్నిర్మాణ పనులను ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. ​ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ…ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని తెలిపారు. నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు కచ్చితంగా పాటించాలని, నిర్దేశిత గడువులోగా పనులన్నింటినీ పూర్తి చేయాలని అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి పలు సూచనలు చేశారు.​అలాగే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, నీడ, క్యూలైన్లు మరియు దైవ దర్శన ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షించాలని ఆలయ అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవోఅరవరాధాకృష్ణ,ఆలయ చైర్మన్ శ్రీరాం మాల్యాద్రి,ఆలయ అధికారులు,కమిటీ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు నాయకులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలి: దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు

దగదర్తి మండలం పున్నమి ప్రతినిధి :ముత్యాల గిరి కావలి , సెప్టెంబర్ 13: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని కావలి నియోజకవర్గ ప్రజలకు, అభిమానులకు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలకు కావలి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ దగ్గు మాటి వెంకటకృష్ణారెడ్డి గారు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క దగ్గు మాటి వెంకటకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ.. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుని కృపాకటాక్షాలతో కావలి నియోజకవర్గ ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, శాంతి, సౌభాగ్యం నిండాలని ఆకాంక్షించారు. ప్రతి కుటుంబంలో ఆనందం వెల్లివిరియాలని, ప్రతి ఇంటా సంతోషాల వెలుగులు నిండాలని గణనాథుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. “గణపతి దేవుని ఆశీస్సులతో మన కావలి నియోజకవర్గం మరింత అభివృద్ధి పథంలో ముందుకు సాగాలి. కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరాలి. ప్రజాసేవలో మరింత ఉత్సాహంతో ముందుకు సాగేందుకు గణనాథుడు మనందరికీ శక్తి, నూతన ఉత్తేజాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను” అని ఎమ్మెల్యే కావ్య పేర్కొన్నారు. వినాయక చవితి ఉత్సవాలను ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో, ఐక్యతా భావంతో, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా ప్రతి ఒక్కరూ పోలీసు, అధికార యంత్రాంగానికి సహకరిస్తూ, పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని పర్యావరణహిత విగ్రహాలను వినియోగించి, పండుగను సురక్షితంగా మరియు ఆనందోత్సాహాలతో నిర్వహించాలని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు పిలుపునిచ్చారు. విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ నియోజకవర్గ ప్రజలందరికీ మరోసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.

వరంగల్

మట్టి గణనాధులను పూజిద్దాం పర్యావరణం కాపాడుదాం-మున్సిపల్ చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీరామానంద్

మట్టి గణపతిని పూజిద్దాం పర్యావరణాన్ని పరిరక్షిద్దాం అనే కార్యక్రమాన్ని తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి చేపట్టగా నర్సంపేట మున్సిపల్ కార్యాలయంలో నేడు శుక్రవారం నాడు మున్సిపల్ అధికారులచే ఏర్పాటు కార్యక్రమంలో పాల్గొని అధికారులతో కలిసి మట్టి విగ్రహాలను పంపిణీ చేసిన నర్సంపేట మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి శ్రీలక్ష్మీరామానంద్ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నర్సంపేట టౌన్ సీఐ ముస్క శ్రీనివాస్ ఈ సందర్బంగా చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీరామానంద్, నర్సంపేట టౌన్ సీఐ ముస్క శ్రీనివాస్ మున్సిపల్ కమిషనర్ కాటం భాస్కర్ మాట్లాడుతూ నర్సంపేట మున్సిపల్ పరిధిలో వీలైనంత వరకు మట్టి విగ్రహాలను ఏర్పాటు చేసుకునేందుకు వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు కృషి చేయాలని అన్నారు, రాష్ట్రంలో మరియు నియోజకవర్గాల వ్యాప్తంగా ఏర్పడిన వర్షాల కొరత వలన నర్సంపేట పరిసరా ప్రాంతాలలో ఉన్న చెరువులు నీటిమట్టం తగ్గి గణనాధుల నిమర్జనాలకు ఇబ్బంది కలిగే విధంగా ఉన్నందున గణపయ్య నవరాత్రులు నిర్వహించుకునేందుకు ఇంకా మూడు రోజుల వ్యవధి ఉన్నందున వీలైనంత వరకు మట్టి గణనాథులను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు, అందులో భాగంగానే నర్సంపేట పట్టణ మొదటి పౌరురాలిగా తన బాధ్యతగా తమ సొంతవాడైన 25వ వార్డులో గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో దాదాపు 15 అడుగుల మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందని తెలిపారు, మట్టి విగ్రహాలను ఏర్పాటు చేసుకునే కొరకు సమయ భావం తక్కువగా ఉండడం వలన విగ్రహాలను ఏర్పాటు చేసుకుని సమయంలో చిన్న విగ్రహాలు ఏర్పాటు చేసుకొని సులభంగా నీటిలో మునిగేందుకు వీలుగా ఉండే విధంగా విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు, అలాగే వినాయక మండపాల పర్మిషన్, కరెంట్ డిపార్ట్మెంట్ పర్మిషన్లు తప్పనిసరిగా తీసుకొని పోలీస్ శాఖ వారికి మరియు కరెంట్ డిపార్ట్మెంట్ వారికి మున్సిపల్ శాఖ అధికారులకు సహకరించి అత్యంత భక్తిశ్రద్ధల మధ్య జరిగే గణపతి నవరాత్రి ఉత్సవాలను ఎలాంటి గొడవలకు తావు లేకుండా నిర్వహించుకోవాలని అన్నారు, ఈ సంవత్సరం నర్సంపేట మున్సిపల్ పరిధిలో 25వ వార్డులో ఏర్పాటు చేసిన మట్టి విగ్రహాన్ని ఆదర్శంగా తీసుకొని వచ్చే సంవత్సరం నుండి నర్సంపేట మున్సిపల్ పరిధిలో పూర్తిగా మట్టి విగ్రహాలను ఏర్పాటు చేసుకొని పర్యావరణ పరిరక్షణలో మనందరి బాధ్యతను నిర్వర్తించుకోవాలని పిలుపునివ్వడం జరిగింది.. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గంధం నరేందర్ గుప్తా, డిప్యూటీ తాసిల్దార్ ఆంగోత్ తారాచంద్, కౌన్సిలర్లు బత్తిని రాజేందర్, ముత్తినేని వెంకన్న, మాదాసి రవి, ములుకల వినోద సాంబయ్య, పున్నం నరసింహారెడ్డి, బాణాల ప్రసన్న శ్రీనివాస్, చీకటి స్వరూప ఓదయ్య గౌడ్, దొంగల రజిత, హన్మకొండ శ్రీధర్, మండల శ్రీదేవి శ్రీనివాస్, మున్సిపల్ అధికారులు, మున్సిపల్ సిబ్బంది, నర్సంపేట పుర ప్రముఖులు, తదితరులు పాల్గొన్నారు..

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

*నిజం గెలిచింది.. న్యాయం నిలిచింది*

53 రోజుల నిర్బంధాన్ని గుర్తు చేసుకుంటూ దీపాలు వెలిగించిన కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారు తెదేపా జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అరెస్టుకు మూడేళ్లు పూర్తైన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న “నిజం గెలిచింది” కార్యక్రమంలో భాగంగా కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారు 53 దీపాలను వెలిగించి, చంద్రబాబు నాయుడు గారు జైల్లో గడిపిన 53 రోజుల నిర్బంధ కాలాన్ని గుర్తు చేసుకుంటూ ‘నిజం గెలిచింది’ కార్యక్రమాన్ని నిర్వహించారు.

నారాయణపేట

మాగనూర్, కృష్ణ మండలాల్లో రేపు ఎంపీ డీకే అరుణమ్మ పర్యటన అభివృద్ధి పనులకు భూమి పూజ

మాగనూర్, కృష్ణ మండలాల్లో ఎంపీ డీకే అరుణమ్మ రేపు పర్యటించనున్నట్లు మండల బీజేపీ అధ్యక్షులు జయానంద్ రెడ్డి, నల్లె నర్సప్ప తెలిపారు. మాగనూర్ మండలం నేరడ్గం గ్రామంలో మధ్యాహ్నం 2 గంటలకు ఎంపీ నిధులతో నిర్మించనున్న కామన్ వర్క్ షెడ్‌కు భూమి పూజ నిర్వహించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 3:30 గంటలకు కృష్ణ మండల కేంద్రంలోని కృష్ణ నది ఒడ్డున దత్తాత్రేయ స్వామి దేవాలయం సమీపంలో భవిష్యత్ కృష్ణ పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని కర్మకాండలు నిర్వహించేందుకు ఎంపీ నిధులతో నిర్మించనున్న కామన్ వర్క్ షెడ్‌కు భూమి పూజ చేయనున్నారు. ఈ కార్యక్రమాలకు ఉమ్మడి మండలంలోని బీజేపీ రాష్ట్ర, జిల్లా నాయకులు, సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, మాజీ ప్రజాప్రతినిధులు, అఖిలపక్ష నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

టీడీపీ లీడర్షిప్ కాంక్లేవ్‌లో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు

తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహిస్తున్న టీడీపీ లీడర్షిప్ కాంక్లేవ్‌ రెండో రోజు కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర గారితో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు సమావేశమై పలు అంశాలపై చర్చించారు.