Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Tag: politics

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఫలించిన కావలి జన సైన్యం ఎదురు చూపులు

కావలి, నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో జనసేనా పార్టీ పగ్గాలు మన్నెమాల సుకుమార్ రెడ్డి కి పార్టీ అధినేత ఎప్పుడు బాధ్యతలు అప్పగిస్తారా అని జన సైనికులు,వీర మహిళలు ఎదురు చూసిన చూపులలో ఎట్టకేలకు ఫలించాయి, మన్నెమాల సుకుమార్ రెడ్డి సౌమ్యుడు మృదు స్వభావిగా ఉంటూ కార్యకర్తలను సమర్థవంతంగా నడిపించగల నాయకుడు మాకు కావాలని జన సైనికులు,వీర మహిళలు ఎదురు చూపులే ఆయనకు దీవెనలు అయినాయి, కల్ల కపటం లేని నాయకుడు కావలిలో జనసేన బాధ్యత అప్పగిస్తే సంక్షోభాలను చాకచక్యంగా ఎదుర్కోవడం ఆయనకున్న విద్య అని కార్యకర్తలలో ఉన్న ఒక ఆశ ఫలించింది. కావలిలో జన సైనికులను,వీర మహిళలను ఏకతాటిపైకి తీసుకురావడం మన్నెమాల సుకుమార్ రెడ్డి కే సాటి అని పార్టీ అధినేత తీసుకున్న నిర్ణయం జనసైన్యం ఉత్సాహాన్ని నింపింది. మన్నెమాల సుకుమార్ రెడ్డి ఉన్నత ఆశయంతో ముందుకు సాగుతున్న మన్నెమాల నుదుట తిలకం దిద్ది విజయీభవ అని దీవించడాని కి జన సైనికులు,వీర మహిళలు ఉర్రూతలూగుతున్నారు.

తూర్పు గోదావరి

ఘనంగా మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు పుట్టినరోజు వేడుకలు

పున్నమి న్యూస్ ప్రతినిధి కొవ్వూరు: తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే,వై.సి.పి కొవ్వూరు ఇంచార్జ్ అంబరాన్ని అంటిన తలారి వెంకట్రావు పుట్టినరోజు వేడుకలు నియోజకవర్గ వైకాపా నాయకుల మధ్యలో అత్యంత ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గం నలుమూలల నుండి వైకాపా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ భగవంతుడు ఆయనకు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు ఇచ్చి, మరిన్ని ఉన్నత పదవులు అధిష్టించి, కొవ్వూరు ప్రజలకు మరింత సేవ చేసే శక్తిని ఇవ్వాలని పలువురు రాజకీయ సీనియర్ నేతలు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కొవ్వూరు నియోజకవర్గం వై సి.పి నాయకులతో పాటు ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

తల్లపనేని చిన్న వెంకటేశ్వర్లు మృతి బాధాకరం ఎమ్మెల్యే కాకర్ల సురేష్

Date :25-9-2026 నందిపాడు (పున్నమి ప్రతినిధి ) దుత్తలూరు మండలం నందిపాడు గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకులు తలపనేని చిన్న వెంకటేశ్వర్లు మృతి పట్ల ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. నందిపాడులోని ఆయన స్వగృహానికి చేరుకున్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ,మండల కన్వీనర్ ఉండేలా గురువారెడ్డి, మాజీ ఎంపీపీ రవీంద్ర బాబు. మన్నేటి వెంకటరెడ్డి, మరియు మండలం టీడీపీ నాయకులు పాల్గొని నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. టీడీపీ బలోపేతానికి చిన్న వెంకటేశ్వర్లు అందించిన సేవలు చిరస్మరణీయమని, ఆయన మృతి పార్టీకి, నందిపాడు గ్రామానికి తీరని లోటని ఎమ్మెల్యే పేర్కొన్నారు. వారి కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి చేతుల మీదుగా దర్గా ప్రారంభోత్సవం.. అగ్రహారం గ్రామంలో పండుగ వాతావరణం

జలదంకి మండలం బ్రాహ్మణక్రాక అగ్రహారం గ్రామంలో ముస్లిం సోదరులు నూతనంగా నిర్మించుకున్న దర్గా ప్రారంభోత్సవం అత్యంత వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి రిబ్బన్ కట్ చేసి దర్గాను ప్రారంభించారు.​కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారికి గ్రామానికి చెందిన ముస్లిం సోదర, సోదరీమణులు, గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే దర్గాలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు (దువా) నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడకు విచ్చేసిన ప్రతి ఒక్కరి వద్దకు స్వయంగా వెళ్లి పలకరిస్తూ ఆప్యాయతను పంచుకున్నారు.​ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ:​”నేను పుట్టిన గడ్డపై నన్ను ఎంతగానో అభిమానించే నా ముస్లిం సోదరులు నిర్మించుకున్న దర్గాను నా చేతుల మీదుగా ప్రారంభించడం ఎంతో సంతోషాన్ని, తృప్తిని ఇస్తోంది.”​”నా రాజకీయ ప్రయాణంలో నిరంతరం అండగా నిలిచిన ముస్లిం సోదరులను నేను ఎల్లప్పుడూ నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను.”​”ముస్లిం సమాజం పట్ల నాకు ఎనలేని గౌరవం ఉంది. వారి సంక్షేమానికి, అభివృద్ధికి నా వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా అందిస్తాను.”​ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ముస్లిం మత పెద్దలు, పార్టీ నాయకులు మరియు సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పల్లె పండుగను విజయవంతం చేయాలి: ఎమ్మెల్యే కాకర్ల సురేష్

ఈ నెల 29న వరికుంటపాడు (M) రామాపురంలో నిర్వహించనున్న పల్లె పండుగ-3.0 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కాకర్ల సురేశ్ నాయకులు, కార్యకర్తలకు సూచించారు. వింజమూరు క్యాంపు కార్యాలయంలో సమన్వయ సమావేశం నిర్వహించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ హాజరుకానున్న నేపథ్యంలో ముందస్తు సమన్వయం చేసుకోవాలని సూచించారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కావలి నియోజకవర్గ ప్రజలకు మరియు కూటమి శ్రేణులకు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు

కావలి నియోజకవర్గ ప్రజలకు మరియు కూటమి శ్రేణులకు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు ఈ నెల 29న ఉదయగిరి నియోజకవర్గం (వరికుంటపాడు మండలం, రామాపురం)లో జరగనున్న ‘పల్లె పండుగ’ కార్యక్రమానికి సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతితులుగా విచ్చేస్తున్నారు. కావలి నియోజకవర్గం నుండి టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివెళ్లి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.పల్లెలలో మౌలిక వసతులు, రవాణా, తాగునీరు వంటి సమస్యల పరిష్కారం కోసం కూటమి ప్రభుత్వం చేపట్టిన ఈ మహా కార్యక్రమాన్ని జయప్రదం చేద్దాం. ప్రతి గ్రామం నుండి వాహనాలు, ప్రజల ప్రయాణ ఏర్పాట్లపై కావలి టీడీపీ కార్యాలయంలో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. క్రమశిక్షణతో తరలివెళ్లి, ఈ చారిత్రక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఉదయగిరిలో జరిగే ‘పల్లె పండుగ’ను విజయవంతం చేయాలి: కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పిలుపు

కావలి: సెప్టెంబర్ 24 పున్నమి ప్రతినిధి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం, రామాపురం గ్రామంలో ఈ నెల 29వ తేదీన అత్యంత వైభవంగా జరగనున్న ‘పల్లె పండుగ’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి టీడీపి నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గురువారం కావలి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలతో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అధ్యక్షతన గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు.​ఈ సమావేశంలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారలు ఉమ్మడిగా పాల్గొంటున్న ఈ కార్యక్రమం నెల్లూరు జిల్లా అభివృద్ధి చరిత్రలో ఒక కీలక ఘట్టంగా నిలవబోతోందని అన్నారు. మన ఉమ్మడి జిల్లాకు విచ్చేస్తున్న అధినేతలకు స్వాగతం పలికేందుకు మరియు పల్లె పండుగను జయప్రదం చేసేందుకు కావలి నియోజకవర్గం నుంచి వేలాదిగా కూటమి శ్రేణులు, ప్రజలు తరలివెళ్లాలని కోరారు.గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ‘పల్లె పండుగ’ ద్వారా వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిందని ఎమ్మెల్యే తెలిపారు. పల్లెల్లో రవాణా సౌకర్యాలు, తాగునీరు, డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమానికి సంబంధించి నియోజకవర్గంలోని ప్రతి మండలం, పంచాయతీ నుంచి తరలివచ్చే వాహనాలు, కార్యకర్తల సమన్వయం మరియు ఇతర ఏర్పాట్లపై సమావేశంలో క్షుణ్ణంగా చర్చించారు. ప్రతి గ్రామం నుంచి అభిమానులు, ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనేలా నాయకులు చొరవ తీసుకోవాలని సూచించారు.​ఈ పర్యటన ద్వారా ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ఐక్యత, గ్రామసీమల అభివృద్ధే ధ్యేయంగా సాగుతున్న పాలనకు ప్రజల మద్దతు స్పష్టమవుతుందని అభిప్రాయపడ్డారు.​ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శ్రేణులంతా క్రమశిక్షణతో ప్రయాణించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.​ఈ సమీక్షా సమావేశంలో టీడీపీ నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకులు, మండల అధ్యక్షులు, క్లస్టర్ ఇన్‌ఛార్జులు, స్థానిక ప్రతినిధులు, వివిధ విభాగాల నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

చిరు వ్యాపారులతో మమేకమైన కావలి ఎమ్మెల్యే ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి

కావలి పట్టణం జనతా పేట ఉదయగిరి రోడ్డులో వేరుశనగ కాయలు అమ్ముకుంటున్న చిరు వ్యాపారులను కలిసి వారి వ్యాపార పరిస్థితులను, కష్టసుఖాలు ఆరా తీసిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు.”వేరుశనగ కాయలు చాల బాగున్నాయి, ఇంటికి తీసుకెళ్లి తింటాను” అంటూ వ్యాపారులతో సరదాగా ముచ్చటించారు. తమ వద్దకు వచ్చి ఆప్యాయంగా మాట్లాడిన ఎమ్మెల్యేకి ధన్యవాదాలు తెలిపిన చిరు వ్యాపారులు.. ​

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

CMRF చెక్కు పంపిణీ

దగదర్తి, సెప్టెంబర్ 23:దగదర్తి పున్నమి ప్రతినిధి (ముత్యాల గిరి ) దగదర్తి మండల తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్, మాజీ ఇరిగేషన్ బోర్డు డైరెక్టర్ మాలేపాటి రవీంద్ర నాయుడు మరియు దగదర్తి మండల టిడిపి యువ నాయకులు మాలేపాటి లోకేష్ అభ్యర్థన మేరకు దగదర్తి మండలం, తురిమెర్ల గ్రామ వాస్తవ్యులైన గెండి శివకృష్ణ కుమారుడు గెండి శ్రీనివాస్ వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి కొరకు ప్రతిపాదనలు పంపగా వారికి ఈరోజు కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి చేతులమీదుగా దగదర్తి మండల తెలుగుదేశం పార్టీ యువ నాయకులు మాలేపాటి లోకేష్ ఆధ్వర్యంలో రూ.91,228/- సీఎంఆర్ఎఫ్ చెక్కును అందించడం జరిగింది. ఈ సందర్భంగా తురిమెర్ల గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు అల్లం రమేష్, హరి, బ్రహ్మం తదితరులు ఉన్నారు. చెక్కులను అందుకున్న లబ్ధిదారులు మాలేపాటి కుటుంబ సభ్యులకు, వి.పి.ఆర్ దంపతులకు ధన్యవాదాలు తెలియజేశారు.

అన్నమయ్య

రాష్ట్ర పార్టీ అధ్యక్షుడితో గడికోట వెంకట సుబ్బారెడ్డి భేటీ

టీడీపీలో చేరిన అనంతరం తొలిసారి గడికోట వెంకట సుబ్బారెడ్డి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును కలిశారు. రాజంపేట నియోజకవర్గ ప్రజా సమస్యలు, అభివృద్ధి అవసరాలపై వినతిపత్రం అందజేశారు. ప్రజల ఆకాంక్షల మేరకు అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు డాక్టర్ కోడూరు బాలసుబ్రమణ్యం పాల్గొన్నారు