Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలి: దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలి: దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు

దగదర్తి మండలం పున్నమి ప్రతినిధి :ముత్యాల గిరి
కావలి , సెప్టెంబర్ 13:

వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని కావలి నియోజకవర్గ ప్రజలకు, అభిమానులకు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలకు కావలి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ దగ్గు మాటి వెంకటకృష్ణారెడ్డి గారు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే క
దగ్గు మాటి వెంకటకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ.. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుని కృపాకటాక్షాలతో కావలి నియోజకవర్గ ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, శాంతి, సౌభాగ్యం నిండాలని ఆకాంక్షించారు. ప్రతి కుటుంబంలో ఆనందం వెల్లివిరియాలని, ప్రతి ఇంటా సంతోషాల వెలుగులు నిండాలని గణనాథుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

“గణపతి దేవుని ఆశీస్సులతో మన కావలి నియోజకవర్గం మరింత అభివృద్ధి పథంలో ముందుకు సాగాలి. కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరాలి. ప్రజాసేవలో మరింత ఉత్సాహంతో ముందుకు సాగేందుకు గణనాథుడు మనందరికీ శక్తి, నూతన ఉత్తేజాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను” అని ఎమ్మెల్యే కావ్య పేర్కొన్నారు.

వినాయక చవితి ఉత్సవాలను ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో, ఐక్యతా భావంతో, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా ప్రతి ఒక్కరూ పోలీసు, అధికార యంత్రాంగానికి సహకరిస్తూ, పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని పర్యావరణహిత విగ్రహాలను వినియోగించి, పండుగను సురక్షితంగా మరియు ఆనందోత్సాహాలతో నిర్వహించాలని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు పిలుపునిచ్చారు.

విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ నియోజకవర్గ ప్రజలందరికీ మరోసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.

విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలి: దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *