Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Tag: Political

నంద్యాల

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ను మర్యాద పూర్వకంగా కలిసి ఆహ్వానించిన ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి.

విజయవాడలో జరగనున్న దసరా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు, విజయవాడ ఉత్సవ్ 2.0కు ఆహ్వానించేందుకు ఎంపీ శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలు ,రాజ్యసభ ఎంపీ సనా సతీష్ బాబుతో కలిసి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ను గురువారం న్యూ ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిసి సాదరంగా ఆహ్వానించడం జరిగిందని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ బైరెడ్డి శబరి తెలిపారు.బెజవాడ శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి దివ్య ఆశీస్సులతో విజయవాడ దసరా ఉత్సవాలు వైభవంగా జరగాలని ఆకాంక్షిస్తున్నామని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు.

చిత్తూరు

కూటమి ఐక్యతే లక్ష్యం.. సమన్వయంతో సమస్యల పరిష్కారానికి కృషి

టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ మధుసూదన్ నాయుడుతో పుంగనూరు జనసేన నేతల భేటీ (నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కలిసి పనిచేస్తామని ప్రకటన) పుంగనూరు, అక్టోబర్ 08 (పున్నమి న్యూస్ ప్రతినిధి): కూటమి భాగస్వామ్య పార్టీల ఐక్యతే లక్ష్యంగా, పరస్పర సమన్వయంతో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పుంగనూరు నియోజకవర్గ కూటమి నేతలు తీర్మానించారు. పుంగనూరు జనసేన పార్టీ ముఖ్య నాయకులు టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ శ్రీ వై. మధుసూదన్ నాయుడును గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కూటమి ఐక్యత, పార్టీల మధ్య సమన్వయం మరియు నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధి అంశాలపై ఇరు పార్టీల నేతలు విస్తృతంగా, సానుకూలంగా చర్చించారు. కూటమి భాగస్వామ్య పార్టీల మధ్య క్షేత్రస్థాయి సమన్వయాన్ని మరింత బలోపేతం చేసుకుని, ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ఐక్యంగా ముందుకు సాగాలని నిర్ణయించారు. జనసేన–టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఒకరికొకరు సహకరించుకుంటూ నియోజకవర్గంలోని ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చొరవ చూపాలని నాయకులు అభిప్రాయపడ్డారు. కూటమి బలమే రాష్ట్ర ప్రగతికి చోదకశక్తి అని, నియోజకవర్గంలో పార్టీలను మరింత పటిష్టం చేస్తూ ప్రజలకు అండగా నిలుస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పుంగనూరు మండల జనసేన అధ్యక్షుడు విరూపాక్షి, పట్టణ అధ్యక్షుడు నరేష్ రాయల్, జిల్లా ప్రోగ్రామ్స్ కమిటీ కార్యదర్శి చైతన్య రాయల్, సీనియర్ నాయకులు శివ కుమార్ రెడ్డి, పాముల హరి, మండల కార్యదర్శి బాలాజీ నాయక్, కుమార్, పట్టణ ఉపాధ్యక్షుడు నందు, జి.ఎన్. బాబు, పండు రాయల్, శ్రీనివాసులు, వీర మహిళ అరుణ, సోమల మండల అధ్యక్షుడు భూషణ్ రాయల్, సోమల ఏఎంసీ డైరెక్టర్ మురళీ రాయల్, చౌడేపల్లి మండల నాయకులు మురళి తదితరులు పాల్గొన్నారు.

నంద్యాల

టిడ్కో గృహాల సమస్యల పరిష్కారానికి చర్యలు – చైర్మన్ అజయ్ కుమార్

నంద్యాల: ఎస్‌ఆర్‌బీసీ, అయ్యలూరు మెట్ట ప్రాంతాల్లోని టిడ్కో గృహాలను టిడ్కో చైర్మన్ అజయ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్నతో కలిసి ఆంధ్రప్రదేశ్ వాల్మీకి స్టేట్ బోర్డ్ డైరెక్టర్ తోల్లా మంజునాథ్, నంద్యాల జనసేన నాయకులు రాచమడుగు చందు, సుందర్ పరిశీలించారు.ఈ సందర్భంగా టిడ్కో గృహాల నిర్మాణ పరిస్థితితో పాటు తాగునీరు, విద్యుత్, రహదారులు, డ్రైనేజీ, పారిశుధ్యం వంటి మౌలిక వసతులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అక్కడి లబ్ధిదారులు, స్థానికులతో మాట్లాడి వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్‌లో ఉన్న పనుల వివరాలను అధికారుల నుంచి తెలుసుకున్నారు.లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని అజయ్ కుమార్ తెలిపారు. పెండింగ్ పనులను పూర్తి చేయడంతో పాటు గృహ సముదాయాల్లో అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు.ప్రజలకు టిడ్కో గృహాల పూర్తి ప్రయోజనం అందేలా సంబంధిత శాఖల సమన్వయంతో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో నంద్యాల జనసైనికులు జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు

నంద్యాల

నంద్యాలలో బీజేపీ సేవా జ్యోతి ర్యాలీ

నంద్యాల -: శ్రీ నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి, ప్రధానమంత్రిగా 25 సంవత్సరాల ప్రజాసేవను పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా నంద్యాల జిల్లా కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు అధ్యక్షతన జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించి మోదీ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలపై నాయకులు, కార్యకర్తలకు వివరించారు.అనంతరం మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నాయకులు, కార్యకర్తలతో కలిసి సేవా జ్యోతిని వెలిగించి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బీజేపీలోకి భారీగా చేరికలు ఉయ్యాలవాడ, దొర్నిపాడు మండలాలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు సమక్షంలో బీజేపీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.అభ్యర్థుల ఎంపికపై కీలక చర్చ రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మున్సిపాలిటీల వారీగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపై జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు నాయకులతో చర్చించారు. పార్టీ బలోపేతం, ఎన్నికల వ్యూహం, అభ్యర్థుల ఎంపిక తదితర అంశాలపై కార్యవర్గ సభ్యులతో సమీక్షించారు.

విజయనగరం 

అంగన్‌వాడీ కేంద్రాలే చిన్నారుల బంగారు భవిష్యత్తుకు పునాదులు: ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి

అంగన్‌వాడీ కేంద్రాలే చిన్నారుల బంగారు భవిష్యత్తుకు పునాదులు: ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి కొత్తవలస ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంలో ఘనంగా ‘సేవా సంకల్ప అభియాన్ – అంగన్‌వాడీ ఉత్సవం’ చిన్నారుల క్యాలెండర్ ఆవిష్కరణ.. అంగన్‌వాడీ కార్యకర్తలకు చీరల పంపిణీ, సన్మానాలు విజయనగరం జిల్లా బ్యూరో/ రమణ,అక్టోబర్07. పున్నమి ప్రతినిధి అంగన్‌వాడీ కేంద్రాలు దేవాలయాల వంటివని, అక్కడ చిన్నారులను తీర్చిదిద్దుతున్న అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు అమ్మలాంటి బాధ్యతను నిర్వర్తిస్తూ సమాజ నిర్మాణానికి పునాదులు వేస్తున్నారని శృంగవరపుకోట నియోజకవర్గ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి కొనియాడారు. కొత్తవలస మండల ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంలో ‘సేవా సంకల్ప అభియాన్ – అంగన్‌వాడీ ఉత్సవం’ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి చిన్నారుల క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. అనంతరం అంగన్‌వాడీ వర్కర్లకు చీరలు పంపిణీ చేసి, ఉత్తమ సేవలు అందించిన టీచర్లను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి మాట్లాడుతూ.. “ఒక కన్నతల్లి మాతృత్వంతో చిన్నారులను పెంచినట్లుగా, అంగన్‌వాడీ సెంటర్లలో టీచర్లు, ఆయాలు వారిని తమ సొంత బిడ్డల్లా సాకుతున్నారు. అంగన్‌వాడీ కార్యకర్తలుగా, ఆయాలుగా సేవలు అందించే అవకాశం దక్కడం భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం. మహిళలు, చిన్నారుల ఆరోగ్యం, వారి బంగారు భవిష్యత్తు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా పౌష్టికాహార కార్యక్రమాలను అమలు చేస్తున్నాయి” అని పేర్కొన్నారు. గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం, బాలామృతం, పాలు, గుడ్లు, చిక్కీలు వంటి పోషకాహారాలను పక్కాగా అందిస్తూ ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి కృషి చేస్తున్నారని ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే అన్నారు. 70 ఏళ్ల వయసులో కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర పునర్నిర్మాణం కోసం నిరంతరం శ్రమిస్తున్నారని, ఆయనతో సమానంగా పరిగెత్తడం తమకే కష్టంగా మారుతోందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో అప్పులపాలైన రాష్ట్రాన్ని గట్టెక్కించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కేంద్ర ప్రభుత్వ సహకారంతో వేల కోట్ల రూపాయల నిధులను సమీకరిస్తున్నారని చెప్పారు. పెంచిన పింఛన్లు, తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్లు, మినీ అంగన్‌వాడీలను మెయిన్ అంగన్‌వాడీలుగా మార్చడం వంటి అనేక పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని వివరించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని, ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు చేపట్టిన ‘జల్ జీవన్ మిషన్’ ద్వారా శృంగవరపుకోట నియోజకవర్గానికి రూ.96 కోట్లు మంజూరయ్యాయని ఎమ్మెల్యే వెల్లడించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నియోజకవర్గంలోని ప్రతి ఇంటికీ తాగునీటి కొళాయిలు ఏర్పాటు చేసి మహిళల కష్టాలను తీరుస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఉత్తరాంధ్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, రాజకీయాలకు తావులేకుండా నియోజకవర్గాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో విజయనగరం జిల్లా ఐసీడీఎస్ పీడీ కేవీ. బాలమణి, దాసరి కార్పొరేషన్ చైర్మన్ పొట్నూరు వెంకట రత్నాజీ, నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ వబ్బిన సత్యనారాయణ, మండల పార్టీ ఉపాధ్యక్షులు ఎల్లపు సూరిబాబు, ప్రధాన కార్యదర్శి కనకాల శివ, అయ్యారక కన్వీనర్ బంగారు రమేష్, కొత్తవలస గ్రామ పార్టీ అధ్యక్షుడు కోరుపోలు అప్పారావు, ఏఎంసి డైరెక్టర్ గేదెల శ్రీనమ్మ, గొరపల్లి రవి కుమార్, స్థానిక కూటమి ప్రజాప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

వీఓఏల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా.. ఎమ్మెల్యే ముప్పిడి

తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు :వెలుగు వీఓఏలు కొవ్వూరు లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వర రావు ని కలిసి వినతిపత్రం అందజేశారు. కనీస వేతనాలు పెంచాలని, హెచ్ఐఆర్ పాలసీ అమలు చేసి ప్రమోషన్లు కల్పించాలని, సిమ్, రీచార్జ్ సౌకర్యం కల్పించాలని కోరారు. పెండింగ్ వేతనాలు, ఇన్సెంటివ్స్ చెల్లించాలని, 60 ఏళ్లు నిండిన వీఓఏలకు నిలిపివేసిన వేతనాలు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. వెలుగు వీఓఏలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు తెలిపారు వీఓఏలకు రూ.10 లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, అక్రమ తొలగింపులు, రాజకీయ వేధింపులను అరికట్టాలని కోరారు. వీఓఏలు, పొదుపు మహిళల సమస్యలను సానుకూలంగా పరిశీలించి, ప్రభుత్వం ద్వారా పరిష్కారం లభించేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ ఏ బేబీ , సెక్రటరీ కె.వి లత , జే శ్రీ దేవి , పి సుజాత తదితరులు పాల్గొన్నారు.

మహబూబాబాద్

కరువు పరిస్థితుల్లో కోట్ల భారం

బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ట్రూ-అప్‌ చార్జీలు వేయాలని ఇఆర్స్సీ చెప్పినా కేసీఆర్ గారు అనుమతించలేదు. విద్యుత్ సంస్థల భారాన్ని ప్రజలపై వేయొద్దు అని ఖరాఖండిగా తేల్చి చెప్పారు. కానీ ఈ రోజు రేవంత్ రెడ్డి కరువు పరిస్థితుల్లో ప్రజలపై రూ. 5420 కోట్ల భారం వేస్తున్నడు. ఇది ప్రజాపాలన కాదు, ప్రజా పీడన పాలన !! విద్యుత్ సంక్షోభం పై హరీష్ రావు ధ్వజమెత్తారు Uploaded Video:

చిత్తూరు

ఉమ్మడి చిత్తూరు జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల బాధ్యత అమరనాథరెడ్డికి అప్పగింత (పలమనేరు ఎమ్మెల్యేకు కీలక బాధ్యతలు అప్పగించిన సీఎం చంద్రబాబు)

పలమనేరు, అక్టోబర్ 07 (భాను ప్రసాద్ నాయుడు పున్నమి న్యూస్ ప్రతినిధి): ఉమ్మడి చిత్తూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయ బాధ్యతలను పలమనేరు ఎమ్మెల్యే అమరనాథరెడ్డికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అప్పగించారు. సీఎం స్వగృహంలో జరిగిన ప్రత్యేక భేటీలో ఎన్నికల వ్యూహాలపై ఇరువురు చర్చించారు. పార్టీ అప్పగించిన ఈ కీలక బాధ్యతలను విజయవంతంగా ముందుకు తీసుకెళ్తానని ఎమ్మెల్యే అమరనాథరెడ్డి తెలిపారు.

నంద్యాల

*బొగ్గు లైన్లో నివసించే ప్రతి ఒక్కరికి రెండు సెంట్ల ఇండ్ల స్థలం ఇచ్చి, ఇల్లు నిర్మించి ఇవ్వాలని మంత్రి కి సిపిఎం వినతి.

నంద్యాల పట్టణంలోని బొగ్గు లైన్లో నివసించే పేద ప్రజలందరికీ కూటమి ప్రభుత్వం హామీ ప్రకారం ప్రతి ఒక్కరికి రెండు సెంట్లు స్థలం ఇచ్చి ఇల్లు నిర్మించి ఇవ్వాలని సిపిఎం నంద్యాల పట్టణ కమిటీ ఆధ్వర్యంలో న్యాయశాఖ & మైనార్టీ శాఖ మాత్యులు ఎన్.ఎం.డి. ఫరూక్ గారికి సమస్యలతో కూడిన వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మణ్, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు పుల్లా నరసింహ, కే మహమ్మద్ గౌస్, పి వెంకట లింగం, వీరితో పాటు బొగ్గులైన్ ప్రాంతవాసులు వీరన్న, సాయి తో పాటు మహిళలు పాల్గొనడం జరిగింది.అనంతరం వారు మాట్లాడుతూ నంద్యాల పట్టణాన్ని అభివృద్ధి చేయాలని ఇక్కడున్నటువంటి బొగ్గు లైన్ ప్రాంత ప్రజలంతా సహకరించాలి అని చెప్పి అర్బటంగా పనులు మొదలుపెట్టడం జరిగింది.అయితే అక్కడున్న ప్రజలంతా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజలంతా ఆందోళన చేపట్టగా రెండు సెంట్లు స్థలము ఇస్తామని, ఇల్లు నిర్మించేందుకు హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా నిధులను ఇస్తామని అదేవిధంగా విద్యుత్తు, నీరు అన్ని రకాల మౌలిక వసతులు కల్పించినప్పుడు మీ ఇంటిని ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తామని,అప్పటిదాకా మీ ఇళ్లను పడగొట్టబోమని మంత్రి N. M. D.ఫరూక్ గారు, జిల్లా కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. వీరితో పాటుగా మున్సిపల్ కమిషనర్, తహాసిల్దార్, హౌసింగ్ డి.ఈ, ఎలక్ట్రికల్ అధికారులంతా ఒక కమిటీగా పి జి ఆర్ ఎస్ సెంటనరీ హాల్ లో కూర్చుని బొగ్గులైన్ లో నివసించే ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి రెండు సెంట్ల స్థలం ఇచ్చి, ఇల్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం నుంచి నిధులు కేటాయించేలా చర్యలు తీసుకుంటామని అదేవిధంగా రోడ్డు కాలువలు వీధిలైట్లు నీరు కరెంటు లాంటి సమస్యలను పరిష్కారం చేస్తామని హామీని ఇవ్వడం జరిగింది అదేవిధంగా మాకు తిట్టుకో గృహాలు వద్దు అని ఆరోజు ప్రజలంతా చెప్పగా మీకందరికీ టిడ్కో గృహాలను ఇవ్వబోము ఇంటి స్థలాలే ఇస్తాము. గతంలో ఒక సెంటు ఇచ్చినవారికి వాటిని కొట్టి వేసి రెండు సెంట్లు స్థలం ఇచ్చేందుకు కృషి చేస్తామని తెలియజేయడంతో ప్రజలంతా ఆందోళనను విరమించుకోవడం జరిగింది. కావున ఇప్పుడు గతంలో ఇచ్చిన హామీ ప్రకారము బొగ్గు లైన్లో నివసించే ప్రజలందరికీ నెరవేర్చాలని సిపిఎం పార్టీగా కోరారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కొండాపురంలో తాగునీరు, విద్యుత్ సమస్యలపై బీజేపీ వినతి

కొండాపురం మండలం తూర్పు ఎర్రబల్లిలో తీవ్ర తాగునీటి ఎద్దడి, విద్యుత్ స్తంభాల కొరతను పరిష్కరించాలని ‘జనతా వారధి’ ద్వారా బీజేపీ నేతలు ఎంపీడీఓకు వినతిపత్రం అందజేశారు.మండల పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశంతో నిర్వహిస్తున్న జనతా వారధి కార్యక్రమంలో భాగంగా బీజేపీ కొండాపురం మండల అధ్యక్షుడు జడపల్లి మహేష్ ఆధ్వర్యంలో సోమవారం ఎంపీడీఓకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ తూర్పు ఎర్రబల్లి పంచాయతీ పరిధిలోని ప్రజలు తీవ్ర తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నారని తెలిపారు. వేసవి కాలంతో సంబంధం లేకుండా తాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని,అధికారులు తక్షణమే స్పందించి తగిన నీటి వసతి కల్పించాలని కోరారు.