వార్త ముఖ్యాంశాలు
- తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు :వెలుగు వీఓఏలు కొవ్వూరు లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వర రావు ని కలిసి వినతిపత్రం అందజేశారు.
- కనీస వేతనాలు పెంచాలని, హెచ్ఐఆర్ పాలసీ అమలు చేసి ప్రమోషన్లు కల్పించాలని, సిమ్, రీచార్జ్ సౌకర్యం కల్పించాలని కోరారు.
- పెండింగ్ వేతనాలు, ఇన్సెంటివ్స్ చెల్లించాలని, 60 ఏళ్లు నిండిన వీఓఏలకు నిలిపివేసిన వేతనాలు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు.
తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు :వెలుగు వీఓఏలు కొవ్వూరు లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వర రావు ని కలిసి వినతిపత్రం అందజేశారు. కనీస వేతనాలు పెంచాలని, హెచ్ఐఆర్ పాలసీ అమలు చేసి ప్రమోషన్లు కల్పించాలని, సిమ్, రీచార్జ్ సౌకర్యం కల్పించాలని కోరారు. పెండింగ్ వేతనాలు, ఇన్సెంటివ్స్ చెల్లించాలని, 60 ఏళ్లు నిండిన వీఓఏలకు నిలిపివేసిన వేతనాలు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. వెలుగు వీఓఏలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు తెలిపారు
వీఓఏలకు రూ.10 లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, అక్రమ తొలగింపులు, రాజకీయ వేధింపులను అరికట్టాలని కోరారు.
వీఓఏలు, పొదుపు మహిళల సమస్యలను సానుకూలంగా పరిశీలించి, ప్రభుత్వం ద్వారా పరిష్కారం లభించేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ ఏ బేబీ , సెక్రటరీ కె.వి లత , జే శ్రీ దేవి , పి సుజాత తదితరులు పాల్గొన్నారు.