Thursday, 30 April 2026

Blog

జనగాం

జనగామ జిల్లా పాఠశాలల క్రీడా కార్యదర్శిగా (ఎస్ జి ఎఫ్) జాటోత్ గోర్

పాఠశాలల క్రీడా కార్యదర్శిగా జాటోత్ గోర్ సింగ్ ఎన్నిక ———————————————- జనగామ, అక్టోబర్11,పున్నమి న్యూస్: జనగామ జిల్లా పాఠశాలల (SGF) క్రీడ కార్యదర్శిగా 2025-2027 కు నూతనంగా ఎన్నికైన జాటోత్ గోర్ సింగ్ స్కూల్ అసిస్టెంట్ (ఫిజికల్ ఎడ్యుకేషన్ )ZPHS నెల్లుట్ల ను అభినందిస్తున్న గౌరవ శ్రీ పింకేష్ కుమార్ AC, local bodies మరియు జిల్లా విద్యాశాఖ అధికారి. శ్రీ సత్యమూర్తి AD శ్రీనివాస్ AMO, వరుణ్ తెలంగాణ వ్యాయామ విద్య ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కోశాధికారి శ్రీ గంగిశెట్టి మనోజ్ కుమార్, తెలంగాణ వ్యాయామ విద్య ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర నాయకులు కొండా రవి, హనుమంతరావు, చంద్రశేఖర్ రెడ్డి, శ్రీనివాస్, మాధవి, వ్యాయామ దర్శకులు కిషన్, అశోక్, కిరణ్, లచ్చిరాం, సంగీత మాధురి, వ్యాయామ విద్య ఉపాధ్యాయులు ముజీబ్ దిలీప్ తదితరులు అభినందనలు తెలియజేశారు.

నాగర్‌కర్నూల్

ఉపాధి కూలీలకు ఈ-కేవైసీ తప్పనిసరి: ఎంపీడీఓ

వెల్దండ,అక్టోబర్ 11, : వెల్దండ మండలం లోని ఉపాధి హామీ కూలీలందరూ ఆధార్ ఈ -కేవైసీ ని తప్పనిసరిగా సాఫ్ట్ వేర్ లో అప్లోడ్ చేసుకోవాలని ఎంపీడీవో లక్ష్మణ్ నాయక్, ఏపీవో ఈశ్వర్ జీ శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పేర్కొన్నారు. వివిధ గ్రామాలలోని ఫీల్డ్ అసిస్టెంట్లు ఉదయం ,సాయంత్రం వేళల్లో ఉపాధి హామీ కూలీల దగ్గరికి వెళ్లి ఈకేవైసీ ని పూర్తి చేయాలని ఆదేశించారు. లేనిపక్షంలో ఫీల్డ్ అసిస్టెంట్ల పై తగిన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు. Video: https://punnami.in/Telangana

తెలంగాణ

రోడ్డుపై గుంతలను పూడ్చరూ…

వెల్దండ ,అక్టోబర్ 11 , పున్నమి న్యూస్:వెల్దండ లో ఇటీవల కురుస్తున్న వర్షాలకు రహదారులు గుంతల మయంగా మారాయి. వెల్దండ మండల కేంద్రం నుండి గుండాలకు వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా ధ్వంసం అవడంతో ఆయా గ్రామాలకు వెళ్లే వాహనదారులు మోడల్ స్కూల్ విద్యార్థులు, జిల్లా పరిషత్ హై స్కూల్ కి వెళ్లే విద్యార్థులు, ఉపాధ్యాయులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. రోడ్డు వెంట విద్యార్థులు నడవలేని దయనీయమైన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఈ రోడ్డుపై ఏర్పడిన గుంతలను తక్షణమే పూడ్చివేయాలని స్థానికులు కోరుతున్నారు. Video: https://youtube.com/shorts/T5YVbYKo_L0?si=GW3h6aGr3MBHHWV5

తిరుపతి

అఖిలభారత చేనేత జౌళి శాఖ సెక్రెటరీ శ్రీకాళహస్తి ఆలయ సందర్శన

శనివారం శ్రీకాళహస్తీశ్వ రాలయానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేనేత విభాగం సెక్రటరీ ఎం.బీనా న్యూఢిల్లీ వారు విచ్చేయడం జరిగింది.వారికి కళా సృష్టి స్వచ్ఛందసేవా సంస్థ కార్యదర్శి డాక్టర్ గుమ్మడిపూడి దశరధాచారి శ్రీకాళహస్తి కలంకారి కండువాను కప్పి స్వామి వారి మెమెంటోను అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా సెక్రటరీ కి దశరదాచారి కలంకారి క్రాఫ్ట్ ను హ్యాండ్లూమ్ లో చేర్చవలసిందిగా కోరడమైనది.వారు సానుకూలంగా స్పందించారు.

నాగర్‌కర్నూల్

వెల్దండ దర్గాలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే.. కసిరెడ్డి

వెల్దండ ,అక్టోబర్ 11 పున్నమి దినపత్రిక: వెల్దండ మండల కేంద్రంలో హైదరాబాద్ , కల్వకుర్తి ప్రధాన రహదారి సమీపంలో ఉన్న దర్గాలో ఆమనగల్లు మండలానికి చెందిన ఓ మహిళ భక్తురాలు నిర్వహించిన దర్గా పూజలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు .దర్గా నిర్వాహకులు ఎమ్మెల్యేకు దర్గా సాంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికారు. పూజా సామాగ్రి గంధం కలశంతో ఎమ్మెల్యే చాదర్ లను , పూలమాలలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ భూపతిరెడ్డి, బచ్చు రామకృష్ణ, కల్వకుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ మనీలా సంజీవ్ యాదవ్, సింగిల్ విండో డైరెక్టర్ మట్ట వెంకటయ్య గౌడ్, ఎండి రషీద్, ఎండి అలీ, జక్కుల చిన్న జంగయ్య యాదవ్, ఎలా పుల్లయ్య,మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు ముదిగొండ రమేష్, యువ నాయకుడు గుద్దేటి కిష్టాల్, దాసరి మహేష్, భరత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

నాగర్‌కర్నూల్

సమాచార హక్కు చట్టాన్ని సద్వినియోగం చేసుకోవాలి..

_ వెల్దండ తహసిల్దార్ కార్తీక్ కుమార్. అక్టోబర్11,పున్నమి న్యూస్: ప్రజలందరూ తమకు కావాల్సిన సమాచారాన్ని పొందేందుకు సమాచార హక్కు చట్టాన్ని సద్వినియోగం చేసుకోవాలని వెల్దండ తహసిల్దార్ కార్తీక్ కుమార్ అన్నారు. శుక్రవారం వెల్దండ మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో సమాచార హక్కు చట్టం వారోత్సవాలలో భాగంగా సమావేశం నిర్వహించారు. సందర్భంగా తహసిల్దార్ కార్తీక్ మాట్లాడుతూ.. ప్రభుత్వం అక్టోబర్ 5 నుండి 1 2 వరకు ఆర్ టి ఐ వారోత్సవాలు నిర్వహిస్తుందని తాసిల్దార్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం సమాచార హక్కు చట్టం 2005 సంవత్సరం లో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రతి పౌరుడు నేరుగా ప్రతి కార్యాలయంలో సమాచారం ద్వారా ప్రతి సమాచారాన్ని కోరెందుకు అవకాశం ఉందన్నారు. దారిద్ర రేఖకు దిగువన ఉన్న ప్రతి ఒక్కరు ఎలాంటి రుసుము లేకుండా తీసుకునేలా ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిందన్నారు. సుప్రీం కోర్టు తీర్పు కాపీలను సైతం ప్రజలు పొందేందుకు ఈ చట్టం ద్వారా అమలవుతుందన్నారు. చట్టాన్ని దుర్వినియోగం చేయకుండా సద్వివినియోగం చేసుకోవాలి సూచించారు. ప్రజలకు కావలసిన సమాచారం తీసుకేనేవిదంగా దరఖాస్తులు చేసుకోవాలే తప్ప ప్రశ్నలు స్పందించే విధంగా ఉండొద్దన్నారు. సమాచారకు చట్టం ద్వారా ఇచ్చిన సమాచారం కు ఫిర్యాదుదారుడు తృప్తి చెందనిచో ప్రథమ అప్పీలేటు అధికారి ఆర్ డి ఓ , ఆర్ టి ఐ కమిషన్ కు దరఖాస్తు చేసి పూర్తి సమాచారం పొందవచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్ కిరణ్ కుమార్, కార్యాలయ సిబ్బంది సిద్దయ్య, గణేష్, శోభ, గ్రామస్తులు ఉన్నారు.

నాగర్‌కర్నూల్

*సామజిక న్యాయం కోసం కాదు.. ఎన్నికల ప్రయోజనం కోసం బీసీ డిక్లరేషన్ డ్రామా చేసింది కాంగ్రెస్ పార్టీ*.

నాగర్ కర్నూల్అక్టోబర్11,పున్నమి న్యూస్: చట్టం తెలియని నాయకులు తెలంగాణ ను రాజ్యం ఏలుతున్నారు.. బీసీ రిజర్వేషన్లు అమలు చేయడానికి కోర్టులో వాదించడానికి ప్రభుత్వమే సిద్ధంగా లేదు అనేది జగమెరిగిన సత్యం! బీసీలను కాంగ్రెస్ పదేపదే మోసం చేస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు అని చెప్పినప్పుడే జీవో ఇచ్చి చేతులు దులుపుకోవద్దని చెప్పాం. అయినా కాంగ్రెస్ అదే పని చేసింది. ఇప్పుడు హైకోర్టు అనుమానాలు నివృత్తి చేయడంలో విఫలమైంది. ఇప్పటికైనా బీసీలకు న్యాయం చేయాలని డిమాండ్ చేయడం జరుగుతుంది అమ్రాబాద్ బిజెపి సోషల్ మీడియా రంగినేని సురేష్

ఆంధ్రప్రదేశ్

చదరంగంతో “ఐక్యూ లెవెల్” వేరే లెవెల్

చెస్ క్రీడతో “ఐక్యూ లెవెల్” వేరే లెవెల్ అని, లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ అధ్యక్షురాలు లయన్ డా.పైడి. సింధూర అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో అంతర్జాతీయ పద్దతిలో చదరంగం క్రీడలో శిక్షణ అందిస్తున్న బేరి. చిన్నా రావు స్కూల్ ఆఫ్ చెస్ అకాడమీ, స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయం ధరిలో ఎంతోమంది విద్యార్థులకు మెళుకువలను అందిస్తున్నారు. ఈ రోజు అంతర్జాతీయ చదరంగం దినోత్సవంతో పాటు, అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా, లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించారు. ముఖ్య అతిధిగా పాల్గొన్న లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ అధ్యక్షురాలు లయన్ డా.పైడి. సింధూర క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రపంచంలో ప్రజాదరణ పొందిన క్రీడా చదరంగమని,అల్జీమర్స్ రాకుండా సహాయపడుతుందని,మెదడుకు రెండు వైపులా వ్యాయామం చేస్తుందన్నారు. సృజనాత్మకతను, జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుందని, సమస్య పరిష్కార నైపుణ్యాలను పెంచుతుందన్నారు. ఏకాగ్రతను మెరుగుపరుస్తూ, ఒత్తిడిలోనూ మెరుగ్గా, చురుగ్గా ఆలోచింపజేస్తుందని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తు, జీవితంలో ఓటమి, గెలుపులు సహజమని నేర్పుతుందన్నారు. కార్యదర్శి టెక్కం. రామ్ గోపాల్ మాట్లాడుతూ ప్రజలు అత్యంత ఇష్టపడే బోర్డ్ గేమ్‌లలో చదరంగం కూడా ఒకటని, ప్రపంచంలోని ప్రతిమూలలో చెస్ ఆడే వారు ఉంటారని, జీవితమే ఒక చదరంగం అంటూ ప్రస్తావించడం తెలిసిందేనన్నారు. దీనిని ఆడటానికి మంచి ఏకాగ్రత, చురుకైన మెదడు, అద్భుతమైన వ్యూహాలు, అంకితభావం అవసరమని, ఆటలో గెలవాలంటే ఎత్తుకు పైఎత్తులు వేయడం తెలిసుండాలన్నారు. అనంతరం బాల, బాలికలకు, చదరంగం క్రీడాకారులకు మిఠాయిలను పంచిపెట్టారు. ఈ ఉభయ వేడుకలలో లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ మార్కెటింగ్ ఛైర్పర్సన్ పొడుగు. చరణ్, చదరంగం క్రీడాకారులు, అకాడమీ కోచ్ బేరి. చిన్న రావు, బాలబాలికలు పాల్గొన్నారు.

E-పేపర్

అంబేద్కర్ రాజ్యాంగాన్ని అనుసరించాలి : యార్లగడ్డ

గన్నవరం : పున్నమి ప్రతినిధి సురేష్ ఈ దేశంలో ఉంటున్న ప్రతి ఒక్కరూ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్నే అనుసరించాలని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కి ఇందులో మినహాయింపు ఉండదని ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పేర్కొన్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా భీమవరం సమీపంలోని వేంపాడు గ్రామంలో వేగ్నేశ రామకృష్ణ రాజు విరాళంతో నిర్మించిన మైక్రో ఫిల్టర్ బెడ్ ను డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తో కలిసి శనివారం సాయంత్రం యార్లగడ్డ ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో యార్లగడ్డ మాట్లాడుతూ విజయవాడలో అంబేద్కర్ భారీ విగ్రహం ఏర్పాటు చేయడం హర్షనీయమని అంబేద్కర్ ఆశయాలను ఆయన రాసిన రాజ్యాంగాన్ని జగన్మోహన్ రెడ్డి అనుసరించకపోవడం శోచనీయమన్నారు. అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టి నీతిమాలిన రాజకీయాలు చేయటం వైసీపీ నాయకులకు తగదని హితవు పలికారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా రాదని ఆ విషయం తెలిసి కూడా అసెంబ్లీకి రాకుండా పారిపోవటం తగదన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి శాసనసభ ఉపసభాపతి రఘురామ కృష్ణంరాజు చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. రహదారుల అభివృద్ధిలో రఘురామకృష్ణంరాజు అందరికీ మార్గదర్శకులుగా నిలిచారని కొనియాడారు. తన చిరకాల మిత్రుడు వేగ్నేశ రామకృష్ణరాజు సొంత నిధులతో గ్రామస్తులకు సురక్షిత త్రాగునీటిని అందించేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. గత వైసిపి పాలనలో రాష్ట్రం అభివృద్ధి పరంగా అట్టడుగుకు చేరిందని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి పరుగులు పెడుతుందని యార్లగడ్డ తెలిపారు.

E-పేపర్

కోల్గేట్పేరుతో నకిలీ టూత్ పేస్టులు

ఇప్పటిదాకా కల్తీ పాలు, అల్లం పేస్టులు, ఆయిల్ ప్యాకెట్లు బయటపడగా తాజాగా నకిలీ టూత్ పేస్టులు కలకలం రేపుతున్నాయి. గుజరాత్లోని కచ్ జిల్లాలో Colgate పేరుతో రెడీ చేసిన ఫేక్ టూత్ పేస్ట్ బాక్స్లలు భారీగా బయటపడ్డాయి. చిత్రోడ్ ప్రాంతంలో పోలీసులు దాడులు చేసి వీటిని పట్టుకున్నారు. సుమారు రూ.9.43 లక్షల విలువైన సరకును స్వాధీనం చేసుకున్నారు. దీని సప్లై చైన్ తెలుసుకునేందుకు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.