Thursday, 30 April 2026

Blog

కామారెడ్డి

మిషన్ భగీరథ లీకేజీతో తాసిల్దార్ కార్యాలయం ముందే దుస్థితి!

– మిషన్ భగీరథ నీరు లీకేజీపై అధికారుల నిర్లక్ష్యం.. – పట్టించుకోని అధికార యంత్రాంగం.. కామారెడ్డి, 11 అక్టోబర్, పున్నమి ప్రతినిధి : తాగునీటి సరఫరా కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకం గా చేపట్టిన మిషన్ భగీరథ పథకం నీరు లీకై, సంవ త్సరాలు గడుస్తున్నప్పటికీ ప్రజలకు కష్టాలు తెచ్చి పెడుతోంది. ముఖ్యంగా, రామారెడ్డి మండల కేంద్రం లోని తాసిల్దార్ కార్యాలయం ముందే ఈ లీకేజీ సమస్య తీవ్రంగా ఉండడం, తీవ్ర విమర్శలు వినిపి స్తున్నాయి. దానిపై అధికారులు కనీసం దృష్టి సారించకపోవడం స్థానికుల ఆగ్రహానికి కారణమ వుతోంది. రోడ్డుపై వరదలా నీరు….. తాసిల్దార్ కార్యాలయం ముందు రోడ్డుపై మిషన్ భగీరథ నీరు లీకై పెద్ద మడుగులా ఏర్పడింది. ఈ నీరు రోడ్డును ఆక్రమించడంతో వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ద్విచక్ర వాహన దారులు, పాదచారులు ఈ బురద నీటిని దాటుకు ని వెళ్లడానికి తిప్పలు తప్పడం లేదు.కార్యాల యం ముందే ఈ పరిస్థితి ఉండటంతో, ప్రభుత్వ పనుల కోసం వచ్చే ప్రజలు సైతం ఇబ్బందులు పడుతున్నారు. కలుషితమవుతున్న తాగునీరు….. లీకేజీ అయిన నీరు రోడ్డుపైన నిలిచి ఉండటంతో, అది మురికి, బురదతో కలిసి కలుషితమవుతోంది. ఇదే నీరు తిరిగి భూమిలోకి లేదా ఇతర పైప్‌లైన్ల లోకి చేరే ప్రమాదం ఉంది. దీనివల్ల మండల ప్రజ లు కలుషితమైన నీటిని తాగాల్సి వస్తుందని స్థాని కులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం శూన్యంగా ఉందని, వారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు మండిప డుతున్నారు. అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు….. ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన తాసిల్దార్ కార్యాలయం ముందే ఇలాంటి దుస్థితి నెలకొనడం అధికార యంత్రాంగం నిష్క్రియాపరత్వాన్ని స్పష్టం చేస్తోందని స్థానిక నాయకులు, ప్రజలు విమర్శిస్తు న్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంట నే స్పందించి, మిషన్ భగీరథ పైప్‌లైన్ లీకే జీని యుద్ధ ప్రాతిపదికన అరికట్టి, రోడ్డును పునరుద్ధరిం చాలని మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో ఆందోళనకు దిగుతామని హెచ్చరిస్తు న్నారు.

ఖమ్మం

సైడ్ బిజినెస్ కోసం పోతే మెయిన్ ఉద్యోగం పోయింది

సైడ్ బిజినెస్ కోసం పోతే మెయిన్ ఉద్యోగం పోయింది ఉపాధ్యాయుడు లక్ష్మణ్ రావు సస్పెండ్ ఖమ్మంలో తనకు పోటీగా క్రాకర్స్ షాపు పెట్టినందుకు యజమానిపై బూతులతో విరుచుకుపడి, చంపేస్తామంటూ దాడి చేసిన లక్ష్మణ్ రావు నేలకొండపల్లి మండలం సుర్దేపల్లి పాఠశాల స్కూల్ అసిస్టెంట్‌గా పని చేసి, ప్రస్తుతం డీఈవో ఆఫీసులో డిప్యుటేషన్‌పై విధులు నిర్వహిస్తున్న లక్ష్మణ్ రావు విధులు వదిలేసి గొడవలో పాల్గొన్నందుకు లక్ష్మణ్‌ రావును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేసిన జిల్లా విద్యాధికారిణి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ

విశాఖపట్నం

రామచంద్ర యాదవ్ పర్యటనపై పోలీసులు కఠిన చర్యలు

నేడు బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్ పాయకరావుపేట నియోజకవర్గంలోని నక్కపల్లిను సందర్శించడానికి ప్రణాళిక ఏర్పాటు చేశారు. ఆయన రాజయ్యపేట బల్క్ డ్రగ్ పార్క్లో బాధిత మత్స్యకారులకు మద్దతు తెలపాలని నిర్ణయించారు. కానీ, అనకాపల్లి జిల్లా పోలీసులు ముందుగా చర్యలు తీసుకుని, రామచంద్ర యాదవ్ నక్కపల్లిలో పర్యటించరాదు అని నోటీసులు జారీ చేశారు. అధికారులు అతని హోటల్ వద్దకు చేరి, నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్ ప్రాంతంలోకి వెళ్లకుండా నిరోధించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటివరకు, పోలీసులు మరియు రామచంద్ర యాదవ్ పర్యటనకు సంబంధించిన వర్గాల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. విశాఖలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారే అవకాశం ఉంది.

Blog

శివకాశి బాణాసంచా కేంద్రం లో పేలుడు

శివకాశీలోని బాణసంచా కేంద్రంలో పేలుడు బాణసంచా తయారీ కేంద్రంలో ఎగిసిపడుతున్న మంటలు మంటల్లో చిక్కుకున్న 10 మంది కార్మికులు మంటలార్పుతున్న ఫైర్‌ సిబ్బంది కొనసాగుతున్న సహాయక చర్యలు…..

తెలంగాణ

పిల్లలకు పోలియో చుక్కలు వేయించారా?

పున్నమి సెప్టెంబర్ 13 హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో పల్స్ పోలియో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు. HYDలో 0-5 ఏళ్ల పిల్లలకు 7AM-6PM వరకు ప్రత్యేక బూత్లలో, 13వ తేదీ నుంచి 15 వరకు ఇంటింటికి తిరిగి డ్రాప్స్ వేస్తామని కలెక్టర్ హరిచందన తెలిపారు. బంగ్లాదేశ్, పాకిస్థాన్ దేశాల్లో పోలియో కేసులు పెరుగుతుండటంతో దేశవ్యాప్తంగా 290 జిల్లాల్లో ఈ డ్రైవ్ చేపట్టామని కేంద్రం వెల్లడించింది. ఒక్క రోజు పిల్లల కోసం కేటాయించండి పోలీయో .. బాడీలో ఏంజరుగుతుందో తెలిసేలోపే అంతా అయిపోతుంది. అంగవైఖల్యం పిల్లల జీవితాన్ని చిదిమేస్తుంది. 2 చుక్కలతో నిండు జీవితాన్ని మహమ్మారి నుంచి రక్షించండి. పనులు పక్కనబెట్టి నేడు ఉ.7గం. నుంచి పోలీయోడ్రాప్స్ వేయించండి. జిల్లాలోని అంగన్వాడీలు, ప్రభుత్వ, ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులతో సహా 1,151 చోట్ల బూతులు ఏర్పాటుచేశారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 4,20,911 మంది బాలలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

ఖమ్మం

ఉపాద్యాయుడు లక్ష్మణ్ ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన అదనపు కలెక్టర్ శ్రీజ

ఖమ్మం  అక్టోబర్   పున్నమి ప్రతినిధి ఖమ్మంలో తనకు పోటీగా దీపావళి టపాసుల దుకాణాము పెట్టినందుకు సదురు షాపు యజమానిపై బూతులతో విరుచుకుపడి, చంపేస్తామంటూ దాడి చేసిన ప్రభుత్వ ఉపాద్యాయుడు లక్ష్మణ్ ని సస్పెండ్ చేస్తూ ఖమ్మం జిల్లా అదనపు కలెక్టర్ విద్యాశాఖ అధికారిని ఉత్తర్వులు జారీ చేశారు. నేలకొండపల్లి మండలం సుర్దేపల్లి పాఠశాల లో స్కూల్ అసిస్టెంట్‌గా పని చేసి, ప్రస్తుతం ఖమ్మం జిల్లా విద్యాశాఖ కార్యాలయం లో విధులు నిర్వహిస్తున్నారు విధులు వదిలేసి గొడవలో పాల్గొన్నందుకు లక్ష్మణ్‌ను సస్పెండ్ చేస్తూన్నట్లు గా శ్రీజ తెలియజేసారు.

తెలంగాణ

14 న జరుగు తెలంగాణ బంద్ కి ఉస్మానియా ఐక్య వేదిక మద్దతు

పున్నమి ప్రతి నిధి ఈనెల14న రాష్ట్రవ్యాప్తంగా జరిగే బిసి బందుకు పిలుపు నిచ్చిన రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్యకు మద్దతుగా ఓయూ ఐక్య విద్యార్థి సంఘాల సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ఉస్మానియా విద్యార్థి ఐక్య వేదిక నేతలు తెలియజేసారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఓయూ ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతు ఈనెల14న తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా జరిగే బిసి బందుకు పిలుపు నిచ్చిన రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్యకు మద్దతుగా ఓయూ ఐక్య విద్యార్థి సంఘాల సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు ఓయూ ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతు కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చిన హామీ 42 శాతం బిసి రిజర్వేషన్లను అమలు పరచకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఓయూ ఐక్య విద్యార్థి సంఘాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగిందని 42 శాతం బిసి రిజర్వేషన్ల అంశాన్ని రాజకీయ జాప్యం చేయకుండ త్వరగా అన్ని రాజకీయ పార్టీలు కలిసి రాజకీయ పరిష్కరాన్ని చూపాలని డిమాండ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో డాక్టర్ లక్ష్మీ గారి ఆంజనేయులు ముదిరాజ్ అడ్వకేట్,బొల్లేపల్లి స్వామి గౌడ్, ఎస్ నాగేశ్వర్ రావు, ఓయూ శంకర్,నిఖిల్, నరేష్, జూలూరి మహేష్, శ్రీకాంత్, సాయిలు,రజనీకాంత్, రాకేష్, శివ, శ్రవణ్,శ్రీధర్, నగేష్, రాజేష్, సైదులు మరియు తదితరులు పాల్గొన్నారు.

జోగులాంబ గద్వాల

*అయిజ పట్టణంలో పట్టపగలే దొంగల హల్ చల్..*

వాహనాలను ఎత్తుకుపోతున్న దొంగల ముఠా…* *అయిజ పట్టణ ప్రజలారా జరభద్రం…* జోగులాంబ గద్వాల జిల్లా అయిజ పట్టణం లో పంచముఖి ఆటోమొబైల్ షాప్ ముందు ఉంచిన AP 22 AG 1504,గల PASSION PRO బ్లాక్ రెడ్ కలర్ బండిని ఎవరో గుర్తుతెలియని వ్యక్తి గుర్తు పట్టకుండా మొహానికి టవల్ కట్టుకొని ఈరోజు మధ్యాహ్నం 2:30గంటలకు వాహనాన్ని దొంగతనం చేయడం జరిగింది.తెలంగాణ చౌరస్తా గాజుల పేట లో ఇంకొక వాహనం ఎత్తుకెళ్లడం కోసం ప్లాన్ వేశాడు,అక్కడ ఉన్న కొందరు వ్యక్తులు చూసి దొంగను పట్టుకోవడం కోసం వెళ్లగా,ఇప్పుడు ఎత్తుకెళ్లిన వాహనాన్ని కూడ అక్కడే వదిలేసి పారిపోవడం జరిగింది…

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

పురుగు మందు డబ్బాలపై ఉన్న రంగు గుర్తుల అర్థం ఏమిటి? రైతులు తప్పక తెలుసుకోవాలి!

పంటలను రక్షించడానికి రైతులు ఉపయోగించే పురుగు మందులు ఎంతగా అవసరమో, వాటిని సురక్షితంగా వాడటం కూడా అంతే ముఖ్యం. చాలాసార్లు పురుగు మందు డబ్బాలపై ఉన్న రంగు గుర్తులను రైతులు పట్టించుకోకపోవడం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు, ప్రాణనష్టం కూడా సంభవిస్తుంది. అందుకే ప్రతి రైతు ఈ గుర్తుల అర్థం తప్పనిసరిగా తెలుసుకోవాలి. 🔴 ఎరుపు రంగు త్రిభుజం — ఇది అత్యధిక విషపూరితం (Extremely Toxic) అని సూచిస్తుంది. ఇలాంటి మందులను వాడేటప్పుడు పూర్తి రక్షణ పరికరాలు (మాస్క్, గ్లౌజులు, గాగుల్స్) తప్పనిసరిగా ధరించాలి. 🟡 పసుపు రంగు త్రిభుజం — ఇది అధిక విషపూరితం (Highly Toxic) అని అర్థం. జాగ్రత్తలు తీసుకోకపోతే శరీరానికి హానికరం అవుతుంది. 🔵 నీలం రంగు త్రిభుజం — ఇది మోస్తరు విష ప్రభావం (Moderately Toxic) కలిగి ఉంటుంది. వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. 🟢 ఆకుపచ్చ రంగు త్రిభుజం — ఇది తక్కువ విషపూరితం (Slightly Toxic) అనే అర్థం. అయినా కూడా రక్షణ చర్యలు అవసరమే. రైతులు మందులు పిచికారీ చేసే సమయంలో గాలి దిశలో కాకుండా, గాలి దిశకు వ్యతిరేకంగా నిలబడాలి. మందు వాడిన తర్వాత చేతులు, ముఖం బాగా కడుక్కోవాలి. పంటలు మాత్రమే కాదు, మన ఆరోగ్యం కూడా మన బాధ్యత!

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

మూడో తరగతి నుంచే AI పాఠాలు!

వచ్చే విద్యా సంవత్సరం నుంచి దేశవ్యాప్తంగా స్కూళ్లలో మూడో తరగతి నుంచే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పాఠ్యాంశాలను ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. భవిష్యత్ ఉద్యోగావకాశాలను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులను AI-రెడీ వర్క్ ఫోర్స్గా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. స్కూల్ ఎడ్యుకేషన్ సెక్రటరీ సంజయ్ కుమార్ తెలిపారు ఇప్పటికే టీచర్లు AI టూల్స్ ఉపయోగించి పాఠ్య ప్రణాళికలు రూపొందించే పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభించామని అన్నారు. కొన్ని CBSE పాఠశాలల్లో ఇప్పటికే AI పాఠాలు బోధనలో భాగమయ్యాయని కూడా తెలిపారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.