Wednesday, 29 April 2026

Blog

తిరుపతి

మెగా జాబ్ మేళాకు విశేషా స్పందన

శ్రీకాళహస్తి పట్టణం లోని టీడీపీ కార్యాలయం నందు శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసన సభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు ఆద్విక ఎంటర్ప్రైజెస్ వారి ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా బొజ్జల బృందమ్మ మాట్లాడుతూ బొజ్జల సుధీర్ రెడ్డి నిరుద్యోగ యువత కు ఉద్యోగ కల్పనే ధ్యేయంగా పనిచేస్తున్నారని తెలిపారు.అనంతరం బొజ్జల బృందమ్మ చే ఉద్యోగాలకు ఎంపికైన వారికి నియామక పత్రాలు పంపిణి చేయడం జరిగింది.ఈ కార్యక్రమం లో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు,యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

తెలంగాణ

*బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకు సర్కార్…స్పెషల్​ లీవ్​ పిటిషన్ వేయాలని సీఎం ఆదేశం*

*బీసీ రిజర్వేషన్లపై అధికారులకు సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశం* *న్యాయ సలహాలు స్వీకరిస్తున్న ఎన్నికల సంఘం* *హైకోర్టు తీర్పుపై అధికారులతో చర్చించిన ముఖ్యమంత్రి* అక్టోబర్ 12 పున్నమి న్యూస్ ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేదని తెలంగాణ హైకోర్టు చెప్పినప్పటికీ 42 శాతం రిజర్వేషన్‌ల అమలుపై స్టే ఇచ్చిన నేపథ్యంలో సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేయడానికే ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం రేవంత్‌రెడ్డి శనివారం అధికారులతో సమావేశం నిర్వహించి హైకోర్టు తీర్పుపై చర్చలు జరిపారు. బీసీ రిజర్వేషన్‌లు అమలు చేయాలంటే సుప్రీంకోర్టును ఆశ్రయించడం తప్ప మరో దారి లేదన్న అభిప్రాయం వ్యక్తం కావడంతో స్పెషల్​ లీవ్​ పిటిషన్ (ఎస్‌ఎల్పీ) దాఖలు చేయడానికి చర్యలు తీసుకోవాలంటూ అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌లతో ఎన్నికలకు వెళ్లాలన్న స్థిర నిశ్చయంతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టులో పటిష్ఠ వాదనలు వినిపించడానికి రంగం సిద్ధం చేస్తోంది. స్పెషల్​ లీవ్​ పిటిషన్ రూపకల్పనను సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాదుల ద్వారానే చేపట్టాలని నిర్ణయించింది. *పత్రాలను దిల్లీకి పంపిన ప్రభుత్వం :* బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌లు కల్పించే ముందు ట్రిపుల్‌ టెస్ట్‌ నిర్వహించాలన్న సుప్రీంకోర్టు తీర్పు ప్రకారమే ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేసి, జనాభా లెక్కలను సేకరించి రిజర్వేషన్‌లు కల్పించామన్న వాదనను బలంగా ముందుకు తీసుకెళ్లనుంది. రిజర్వేషన్లు 50 శాతం మించరాదన్న అంశం మినహాయింపులపై దృష్టి సారించనుంది. ఈ మేరకు అడ్వొకేట్‌ జనరల్‌ ఎ.సుదర్శన్‌రెడ్డితో పాటు సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాదుల ద్వారా స్పెషల్​ లీవ్​ పిటిషన్​ దాఖలు చేయడానికి సన్నాహాలు పూర్తి చేసింది. ఇప్పటికే తీర్పు ప్రతితో పాటు అవసరమైన పత్రాలను దిల్లీకి పంపినట్లు విశ్వసనీయ సమాచారం. సుప్రీంకోర్టు నిర్ణయంపైనే తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ఆధారపడి ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. *న్యాయ సలహాలు స్వీకరిస్తున్న రాష్ట్ర ఎన్నికల సంఘం :* స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌లపై హైకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో ఏం చేయాలన్న విషయంపై తెలంగాణ ఎన్నికల సంఘం న్యాయ నిపుణులను సంప్రదిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌లు కల్పిస్తూ జీవో 9, తదనంతర ఎన్నికల ప్రక్రియ నిమిత్తం జారీ చేసిన 41, 42 జీవోల అమలును మాత్రమే నిలిపివేస్తున్నట్లు హైకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వుల్లో స్పష్టంగా ఉంది. అంతేకాకుండా ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవడం లేదని న్యాయస్థానం తేల్చి చెప్పింది. 50 శాతం రిజర్వేషన్‌లు మించకుండా మిగిలిన సీట్లను దామాషా పద్ధతిలో ఓపెన్‌ కేటగిరీ కింద పరిగణనలోకి తీసుకుని ఎన్నికలు నిర్వహించుకోవచ్చని తెలిపింది. అయినా కూడా రిజర్వేషన్‌ల అమలుపై మళ్లీ సందిగ్ధత మొదలవుతోంది. ఇప్పటికే 42 శాతం రిజర్వేషన్‌ల ప్రాతిపదికన స్థానిక సంస్థల్లో పంచాయతీలు, వార్డుల కేటాయింపు ప్రక్రియ జరిగింది. ఇలా విభజించాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే. *న్యాయ నిపుణులతో సంప్రదింపులు :* వార్డుల విభజన జరిగాక ఎన్నికల సంఘానికి ప్రభుత్వం పంపిన వివరాల ఆధారంగా స్థానిక ఎన్నికలు నిర్వహిస్తుంది. అయితే ఇక్కడ ఎన్నికల నోటిఫికేషన్‌లో జోక్యం చేసుకోలేదని హైకోర్టు స్పష్టత ఇచ్చినప్పటికీ, ఎన్నికల సంఘానికి ముందుకెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. అందువల్ల ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఏం చర్యలు చేపట్టాలన్న దానిపై, అనుసరించాల్సిన విధానంపై రాష్ట్ర ఎన్నికల సంఘం పలువురు న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతోంది. న్యాయ నిపుణుల నుంచి అభిప్రాయాలు సేకరించిన అనంతరం స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. Video: https://punnami.in/%20బిసి%20రిజర్వేషన్లపై

కుమురం భీమ్ ఆసిఫాబాద్

*గాలింపు చర్యలను పర్యవేక్షించిన సిర్పూర్ శాసన సభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు*

కొమురం భీమ్ పున్నమి ప్రతినిధి *దహెగాం:* మండలం బోర్లకుంట గ్రామానికి చెందిన జుమ్మిడి మధుకర్ రెండు రోజుల క్రితం బోర్లకుంట గ్రామం వద్ద పెద్దవాగులో గల్లంతయ్యారు. *ఈ రోజు సిర్పూర్ శాసన సభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు గాలింపు చర్యలు జరుగుతున్న ప్రాంతానికి వెళ్లి మధుకర్ గల్లంతైన విషయాన్ని ఆరా తీశారు.* అనంతరం బీబ్రా వద్ద మధుకర్ మృతదేహం దొరికిందనే సమాచారం తెలిసింది. ఈ కార్యక్రమంలో డీఎస్పీ వహీదుద్దిన్, ఎస్ఐ విక్రమ్, గ్రామస్తులు పాల్గొన్నారు.

కుమురం భీమ్ ఆసిఫాబాద్

*జిల్లా కార్యవర్గం గట్టిగా ఉంటేనే స్థానిక సంస్థలు కైవసం చేసుకోగలం*

*నాకు ఎదురైనా ఓటమి ఏ ఒక్క కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి రానివ్వను* *(కాంగ్రెస్ పార్టీ ఆసిఫాబాద్ నియోజకవర్గ ఇంచార్జి అజ్మీరా శ్యామ్ నాయక్ గారు)* కొమురం భీమ్ ఆసిఫాబాద్ 12 అక్టోబర్ (పున్నమి ప్రతినిధి) *ఈరోజు కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రo లోని రోజ్‌గార్డెన్ లో జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేషo లో AICC పరిశీలుకులు డాక్టర్ అనిల్ కుమార్ గారు PCC పరిశిలకులు పులి అనిల్ కుమార్ గారు ముఖ్య అతిథిగా హజరై సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి అజ్మీరా శ్యామ్ నాయక్ గారు మాట్లాడుతూ ఆసిఫాబాద్ గడ్డ కాంగ్రెస్ పార్టీ అడ్డా అని తన ప్రసంగాన్ని మొదలు పెట్టారు జిల్లా కార్యవర్గం సరిగ్గా లేక గత MLA ఎన్నికల్లో సరైన సమన్వయం ఓటమిపాలైందని ఆవేదన వ్యక్తం చేశారు కానీ స్థానిక ఎంపీటీసీ జెడ్‌పీటీసీ ఎన్నికల్లో ఆ పొరపాటు మళ్ళీ పునరావతం కాకుండా తక్షణ చర్యలు తీసుకుంటూ జిల్లా కమిటీ ఎన్నిక జరిపి స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అన్ని సీట్లను కైవసం చేసుకునేలా మనం ముందుకు వెళ్లాలని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రజల్లో తీసుకెళ్లి ప్రజలకు వివరించే బాధ్యత కార్యకర్తలధి అని అన్నారు ఈ కార్యక్రమం లో ఉమ్మడి జిల్లా MLC గౌ. శ్రీ. దండే విఠల్ గారు Dcc విశ్వప్రసాద్ గారు అన్ని విభాగాల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆసిఫాబాద్ జిల్లా పార్టీ సీనియర్ నాయకులు తధితరులు పాల్గొన్నారు*

ఎన్ టి ఆర్ జిల్లా

*జీఎస్టీ సంస్కరణల వల్ల ప్రతి కుటుంబానికి మేలు* *జీఎస్టీలో సంస్కరణలు తెచ్చిన ప్రధాన మంత్రి నరేంద్రమోడి….చక్కగా అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు* *13వ డివిజన్‌లో జీఎస్టీ సంస్కరణలపై ప్రజలకు అవగాహన కల్పించిన ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌

*జీఎస్టీ సంస్కరణల వల్ల ప్రతి కుటుంబానికి మేలు* *జీఎస్టీలో సంస్కరణలు తెచ్చిన ప్రధాన మంత్రి నరేంద్రమోడి….చక్కగా అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు* *13వ డివిజన్‌లో జీఎస్టీ సంస్కరణలపై ప్రజలకు అవగాహన కల్పించిన ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌* కేంద్రంలోని ప్రధాన మంత్రి నరేంద్ర మోడి జీఎస్టీ అమలులో తీసుకువచ్చి సంస్కరణల వల్ల రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఎంతో మేలు జరుగుతుందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ అన్నారు. నరేంద్రమోడీ తీసుకువచ్చిన సంస్కరణలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రాష్ట్రంలో చక్కగా అమలు చేస్తున్నారని చెప్పారు. ఆదివారం ఉదయం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 13వ డివిజన్‌ డొంకరోడ్డు చివర తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ పర్యటించారు. స్థానికంగా ఉన్న సమస్యలను అక్కడి స్థానికులను అడిగి తెల్సుకుని వాటిని పరిష్కరించాల్సిందిగా ఆయా విభాగాల అధికారులను ఆయన ఆదేశించారు. అనంతరం జీఎస్టీ–2.0 సంస్కరణలపై ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ మాట్లాడుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడి తీసుకువచ్చిన జీఎస్టీ సంస్కరణల వల్ల ప్రతి కుటుంబానికి ఎంతో మేలు జరుగుతుందన్నారు. నూనెల తప్ప అన్ని వస్తువులపై ధరలు తగ్గాయని ప్రజలు చెబుతున్నారని, నూనెలపై కూడా పన్నులు తగ్గించాలని ప్రజలు కోరుతున్నారని చెప్పారు. జీఎస్టీలో తెచ్చిన సంస్కరణలు ప్రజల్లోకి వెళ్ళాయనడానికి ఇదే నిదర్శనమని అన్నారు. ఏసీలు, టీవీలు, కార్ల ధరల చాలా తగ్గాయని వాటిని కొనుగోలు చేసే స్థాయి ఉన్నవాళ్లు చాలా ఆనందంగా ఉన్నారన్నారు. ఇన్సూరెన్స్‌ ప్రీమియంలపై జీఎస్టీ లేకపోవడం వల్ల చాలా మంది ఇన్సూరెన్స్‌ ప్రీమియంలను తీసుకుంటున్నారని, దీనివల్ల వారి జీవితానికి భరోసా ఉంటుందన్నారు. బీమా తీసుకున్న వారికి జీవితంలో ఏవిధమైన ఇబ్బంది వచ్చినా వారికి ధైర్యంగా ఉంటుందని చెప్పారు. దేశంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చిన ప్రధాన మంత్రి నరేంద్రమోడిని అందరూ అభినందించాలన్నారు. జీఎస్టీపై కేంద్ర ప్రభుత్వం గత 8 నెలలుగా ఆలోచనలు చేసి ఈ సంస్కరణలను అమలు చేస్తోందన్నారు. జీఎస్టీపై సంస్కరణలకు మొదటి సారిగా మద్దతు తెలియజేసిన ప్రభుత్వం తమదేనని చెప్పుకొచ్చారు. ఈ సంస్కరణల వల్ల ఏడాదికి రూ.8 కోట్లు లోటు అని, అయినా ప్రజా సంక్షేమం కోసం ఈ సంస్కరణలకు తమ ప్రభుత్వం మద్దతు తెలియజేశామని వివరించారు. జీఎస్టీలో సంస్కరణలు తీసుకువచ్చిన ప్రధాన మంత్రి నరేంద్రమోడికి, రాష్ట్రంలో చక్కగా అమలు చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి కార్పోరేటర్‌ ముమ్మనేని ప్రసాద్, గద్దె ప్రసాద్, నూతి శ్రీను, వీరంకి డాంగే కుమారి, గాదిరెడ్డి అమ్ములు, లోకేష్‌ రావు, మాదిరెడ్డి రవి, శ్రీమన్నారాయణ, బూస్, ముమ్మనేని మానస, కంఠంనేనని మానస, కల్పన, జె.హారికతో పాటుగా కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఖమ్మం

కాంగ్రెస్ జిల్లా నాయకులు మిక్కిలి నేని నరేంద్ర మీద దాడి.దాడికి కారకులైన వారిని వెంటనే శిక్షించాలి. కార్పొరేటర్ మంజుల డిమాండ్

ఖమ్మం (పున్నమి ప్రత్యేక ప్రతి నిధి ) ఒక కుటుంబము లో మొదలైన అన్నదమ్ముల ఆస్థి పంపకాలు విషయం పెద్ద దుమరంగా మారింది. శనివారం సాయంత్రం నుండి ప్రారంభం అయినా గొడవ అర్ధ రాత్రి వరకు సాగింది.  డివిజన్ కార్పొరేటర్ మిక్కిలి నేని మంజుల భర్త నరేంద్ర మీద దాడి వరకు వెళ్ళింది. వివారాల్లోకి వెళ్తే ఖమ్మం నగరం  లోని VDO’S కాలనీ కి చెందిన చెరుకూరి శ్రీధర్, శేఖర్ అన్నదమ్ములు. వీరి మధ్య గత నలబై రోజులు గా ఆస్తి వివాదాలు నడుస్తున్నాయి. అయితే తమ్ముడు శేఖర్ అన్న శ్రీధర్ లేని సమయం లో ఇంటిని ఆక్రమించుకొని రౌడీ లు, పోలీస్ ల సపోర్ట్ తో ఆ ఇంట్లో ఉంటున్నారు. ఇదే క్రమం లో వీరి తల్లి అయినా చెరుకూరి సుజాత మిక్కిలి నేని నరేంద్ర కి ఫోన్ చేయాగ అయన కుటుంబ విషయం కూర్చొని మాట్లాడుకోండి అని సమాధానం ఇవ్వడం జరిగింది. శేఖర్ బామర్ది గంగాధర్ మిక్కిలి నేని నరేంద్ర దగ్గర వెళ్లి మంత్రులు, పోలీసుల సపోర్ట్ మాకు ఉంది నీకు ఎంత కావాలో చెప్పు అని అడగగా అయన తిరష్కరించారు. శనివారం సాయంత్రం మిక్కిలి నేని నరేంద్ర ఆయన స్నేహితులు కారు లో డివిజన్ లో పర్యటిస్తున్న నేపథ్యంలో ఆక్రమించు కున్న ఇంట్లో నుండి రౌడీ లు పెద్ద ఎత్తున వచ్చి నరేంద్ర మీద దాడి చెయ్యడం జరిగింది. అయన మీద దాడి విషయం తెలుసుకున్న నరేంద్ర అభిమానులు. కార్యకర్తలు పెద్ద ఎత్తున శ్రీధర్, శేఖర్ ఇంటిని ముట్టడి చేసి అద్దాలు పగలకొట్టారు.  ఈ సందర్భము గా కార్పొరేటర్ అయినా నరేంద్ర శ్రీమతి అయినా  శ్రీమతి మిక్కిలి నేని  మంజుల మీడియా ప్రతి నిధులు తో మాట్లాడు తు జరిగింది అంత వివరించడం జరిగింది. 40రోజులు గా స్థానిక రెండవ పట్టణ పోలీస్ లకి పిర్యాదు చేసిన పట్టించు కోలేదని ఆమె ఆరోపించారు.  రౌడీ లు ఇంటి ముందే తాగి అల్లరి చేస్తుంటే పోలీస్ లకి అనేక సార్లు చెప్పడం జరిగింది అని పోలీస్ లు రౌడీ లకి,కబ్జా కోరులకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు ఆమె భర్త మీద దాడి చేసిన వారిని చట్టపరం గా శిక్షించాలాని VDO s కాలనీ లో వివాద స్పదం అయినా ఆ ఇంటిని సీజ్ చేయాలి అని కార్పొరేటర్ శ్రీమతి మిక్కిలి నేని నరేంద్ర మంజుల డిమాండ్ చేశారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ నీ విమర్శించే స్థాయి మీది కాదు.

వింజమూరు పట్టణంలోని స్థానిక విఆర్ ఫంక్షన్ ప్లాజాలో టిడిపి ముఖ్య నేతలు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మండల కన్వీనర్ గూడా నర్సారెడ్డి మాట్లాడుతూ నిన్న వరికుంటపాడు వైఎస్ఆర్సిపి ఆత్మీయ అభినందన సభలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, ఉదయగిరి ఇంచార్జ్ రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన మాటలు వారి స్థాయికి తగదని,గూడా మండిపడ్డారు. ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ ను విమర్శించే స్థాయి మీది కాదని ఆయన ఏద్దేవా చేశారు. గత ప్రభుత్వంలో మీరు చేసిన అరాచకాలకు ప్రజలు బుద్ధి చెప్పిన ఇంకా మీలో మార్పు రాలేదని, ఒకరిని విమర్శించే ముందు ఆత్మ పరిశీలన చేసుకోవాలని అన్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేసిన సూపర్ సిక్స్ పథకాలు సూపర్ గా హిట్ అయ్యాయని ప్రజలను ఎవరిని అడిగినా వారే చెబుతారుఅన్నారు. ఉదయగిరి ప్రాంతానికి శాసనసభ్యులుగా కాకర్ల సురేష్ ఉండడం ఈ ప్రాంత ప్రజలకు ఒక వరంగా భావిస్తున్నారు. ప్రతి గడపలోని సమస్యలను తెలుసుకున్న నాయకుడు, ఆపదలో ఆదుకున్న ఆపద్బాంధవుడు మా కాకర్ల సురేష్ అని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మోహన్ రెడ్డి,ఉపాధ్యక్షులు రమణయ్య,సొసైటీ డైరెక్టర్లు, టిడిపి ముఖ్య నేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

*అమరావతి పార్కులో స్వచ్ఛత కార్యక్రమం నిర్వహించిన జేసీఐ విశాఖ మెట్రో–ఓఎల్ ఓఎస్పీ*

*గాజువాక, అక్టోబర్ (పున్నమి ప్రతినిధి)* జేసీఐ విశాఖ మెట్రో, ఓఎల్ ఓఎస్పీ సంయుక్త ఆధ్వర్యంలో గాజువాక 76వ వార్డు అమరావతి పార్కులో స్వచ్ఛత కార్యక్రమం నిర్వహించారు. పార్కులో పేరుకుపోయిన చెత్త చెదారాలను తొలగించి పరిశుభ్రంగా తీర్చిదిద్దారు. సామాజిక సేవలో భాగంగా శ్రమదానం చేసిన నిర్వాహకులను మాజీ ఎంపీ (రాజ్యసభ) జీవీఎల్ నరసింహారావు, భాజపా గాజువాక కన్వీనర్ కరణం రెడ్డి నరసింగరావు, జేసీఐ జోన్-4 కమ్యూనిటీ డెవలప్మెంట్ జోనల్ డైరెక్టర్ బొత్స దిలీప్ కుమార్ అభినందించారు. ప్రధాని మోదీ ఆశయాల స్ఫూర్తితో సామాజిక అభివృద్ధికి బాటవేసే కార్యక్రమాలు మరింత విస్తృతంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. స్వచ్ఛత, పచ్చదనం, ఆరోగ్య సమాజం కోసం భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో జేసీఐ విశాఖ మెట్రో, ఓఎల్ ఓఎస్పీ అధ్యక్షుడు అర్జున్, సభ్యులు విఠల్ కుమార్, అవినాష్, హేమలత, వాసవి తదితరులు పాల్గొన్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఈ నెల 14న బుద్ద విహార్ లో అంబేడ్కర్ బౌద్ధ స్వీకరణ ఉత్సవాలు

అమలాపురం, అక్టోబరు 12 (పున్నమి ప్రతినిధి) : అక్టోబర్ 14న 1956 డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బౌద్ధ ధర్మాన్ని స్వీరించి సుమారు 6 లక్షల మందితో మహారాష్ట్రలోని నాగపూర్ దీక్ష మైదానంలో పూజ్య బంథే చంద్రబోధ్ సమక్షంలో 6 లక్షల మందితో బౌద్ధ ధర్మాన్ని స్వీకరించడం జరిగింది. ఒకే వ్యక్తి ఒకే దిక్కున ఒకే సమయంలో 6 లక్షల మందితో బౌద్ధ ధర్మాన్ని స్వీకరించడం చారిత్రక సంఘటన ప్రపంచ బౌద్ధ దేశాల్లో ఈ ఘట్టం సార్వత్రికంగా నిలిచి పోయింది. భారతదేశంలో ఈ సంఘటన భారతదేశంలో బౌద్ధం పునరుద్ధరించబడింది. అప్పటినుండి భారతదేశంలో బౌద్ధం రోజురోజుకు అభివృద్ధి చెందుతుంది ప్రపంచ దేశాల్లో ఎక్కువ మంది బౌద్ధాన్ని ఆచరిస్తున్నారు. ఆదివారం ఉదయం 10 గంటలకు త్రిరత్న బుద్ధ విహార్ అమలాపురంలో బౌద్ధ ఉపాసకుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో త్రిరత్న బుద్ధ విహార్ లో డి బి లోక్ మాట్లాడుతూ ఈ నెల 14వ తారీఖున బుద్ద విహార్ లో అంబేడ్కర్ బౌద్ధాన్ని స్వీకరించిన సందర్భంగా ఉత్సవాలు జరుగుతాయని ఉదయం 9 గంటల నుండి పంచ శీల, త్రిసర్ణ పారాయణం జరుగుతుందని 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రముఖ బౌద్ధ ఉపాసకుల చే ప్రసంగాలు జరుగుతాయని,1 గంటల నుండి 2 గంటల వరకు బోజనాలు జరుగుతాయని, 3 గంటల నుండి సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. ఈ సమావేశంలో ఉపాసకులు కె రామమూర్తి, కాశీ వెంకట్రావు, రాంబోధి కాశీ జిల్లా బి ఎస్ ఐ అధ్యక్షులు,ములపర్తి సత్యనారాయణ, బి ఎస్ ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి మాజీ సర్పంచ్,ఉండ్రు శ్యామలరావు, చిలకపాటి సాంబశివరావు, బాలయోగిశ్వరావు, గోసంగి సంపదరావు, ఉండ్రు రామకృష్ణ, ఈ కార్యక్రమానికి బౌద్ధ అభిమానులు, అంబేడ్కర్ వాదులు, హేతువాదులు, ప్రజాస్వామ్య వాదులు, పట్టణ ప్రముఖులు అందరూ పాల్గొనాలని కోరుతున్నారు. ‌ ‌ ‌

ఖమ్మం

బెల్లం కొండ శ్రీనివాస్ కి సతీ వియోగం,నివాళులు అర్పించిన ఖమ్మం జిల్లా బీజేపీ శ్రేణులు.

ఖమ్మం అక్టోబర్ ( పున్నమి ప్రతినిధి) మధిర (ముదిగొండ మండలం) ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం పరిధిలో గల ముదిగొండ మండల బీజేపీ ప్రధాన కార్యదర్శి బెల్లం కొండ శ్రీనివాస్ యొక్క సతీమణి శ్రీమతి నాగమణి మృతి చెందారు.ఆదివారం నాడు ఆమె అంత్యక్రియలు జరిగాయి బీజేపీ శ్రేణుల నివాళులు: బెల్లం కొండ నాగమణి పార్ధివ దేహం మీద బీజేపీ జెండా కప్పి బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు నివాళులు అర్పించారు. ఎల్లా రావు గౌడ్, ప్రవీణ్, నాగేశ్వరావ్, ఇతర బీజేపీ నాయకులు నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.