Wednesday, 29 April 2026

Blog

తూర్పు గోదావరి

సింహద్రి అప్పన్న స్వామి వారి సన్నిధిలో చిరంజీవి ” అభి ” నృత్యం పలువురుని ఆకట్టుకుంది.

సింహాచలం అప్పన్న స్వామి వారి సన్నిధిలో శ్రీ వరాహ లక్ష్మి నరసింహ స్వామి వారి దేవస్థానం కళా వేదిక లో ఈ రోజు శ్రీ శివ సాయి కూచిపూడి కళా క్షేత్రం నిర్వాహికురాలు , కళా తపస్వీ శ్రీమతి తణుకు సాయి మాదవి వారిని ఆలయ కమిటి పెద్దల ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు . దుస్సాలువాతో వారి అభిమానాన్ని చాటుకుని మెమోంటోను బహుకరించారు . అనంతరం కళా వేదికపై సాయి మాదవి విద్యార్థిణి చిన్నారి సి హెచ్ ” అభి ” అద్భుతమైన నృత్య ప్రదర్శన చేసి పలువురుని ఆకర్శించి పెద్దల మన్నలను పొందింది . అభి తో పాటుగా దివ్యాంషి, రత్నశ్రీ , సౌమ్య , హృతిక్, సాయి శ్రీ రామ్ , దినశ్రీ , వేదశ్రీ లక్మి, హారిక , మనస్వి , లాస్య చక్కని నృత్య ప్రదర్శన చేసారు . సాయి మాదవి విద్యార్థిణిలు వారి వారి నృత్య కళా నైపుణ్యాన్ని చాటుకున్నారు . ఇప్పటికే శ్రీ శివ సాయి కూచిపూడి కళాక్షేత్ర విద్యార్థులు భారతదేశంలో గల అనేక పవిత్ర పుణ్య క్షేత్రాల్లో కూచిపూడి నృత్య ప్రదర్శనలు చేసి రాజమంద్రి ఖ్యాతిని ఖండాంతరాలు వ్యాపింప చేసారు . చిన్నారుల ప్రదర్శనల అనంతరం సింహాచల పుణ్య క్షేత్ర పెద్దలు చిరంజీవి ” అభి ” కి మొమోంటో జ్ఞాపికతో పాటుగా సర్టిఫికెట్ ను అందచేశారు . అభి తో పాటుగా ప్రతిభను చాటుకున్న మరి కొంతమంది మెమెంటో లు అందుకుని పెద్దల అభినందనలు పొందారు . ఈ సందర్బంగా కళా తపస్వీ శివ సాయి కళా క్షేత్ర నిర్వహికురాలు తణుకు సాయి మాదవి మాట్లాడుతూ ప్రభుత్వం దృఢ సంకల్పంతో కళలకు వన్నె తెచ్చిన సాహితీ నగరం రాజమంద్రి లో కూచిపూడి కళలను, హిందూ ధర్మ ఔన్నత్యాన్ని ప్రోత్సహించే దిశగా పెద్ద స్థాయిలో ఒక కళా క్షేత్రం ప్రభుత్వం నిర్వహించి కూచిపూడి కళను ప్రోత్సాహించాలని, కూచిపూడి వృద్ధ కాళాకారులకు పెన్షన్ ఇచ్చి గౌరవించాలని , విద్యా సంస్థల్లో కూడా కూచిపూడి విద్య విలువలను , ఔన్నత్యాన్ని తెలియచేసే విధంగా ప్రత్యేక తరగతులు నిర్వహించి కూచిపూడి కళను , ఆ చరిత్రను తెలియచేయాల్సిన అవసరం ప్రభుత్వం పై వుందని సాయి మాదవి అభిప్రాన్ని వ్యక్త పరిచారు.

భద్రాద్రి కొత్తగూడెం

ఏ పార్టీ అయిన పదవులు మాకే

ప్రజల మౌనం – పాలకుల సౌకర్యం – పార్టీలు కాదు పదవులే లక్ష్యం గా మారిన నేతల సంస్కృతి – కాంట్రాక్టులు, కమిషన్లకే పరిమితమైన అభివృద్ధి పేరుతో దోపిడీ పాలన – ప్రజల మౌనం నాయకుల అహంకారానికి బలంగా మారిన అశ్వారావుపేట భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట రాజకీయాల వైఖరి ప్రజాస్వామ్యానికి అద్దం పట్టినట్లుంది. ప్రభుత్వాలు మారినా, నేతల ధోరణి మాత్రం మారడం లేదు. ఎవరు అధికారంలోకి వస్తే, వెంటనే అదే పార్టీలో చేరిపోవడం ఇక్కడి రాజకీయాల కొత్త సంస్కృతిగా మారింది. నిన్నటి వరకు నోటికి వచ్చినట్లు విమర్శలు చేసినా, ఈ రోజు అదే పార్టీ జెండా కప్పుకొని తిరగడం వీరికి బిడియం అనిపించడం లేదు. పార్టీ కోసం మొదటినుంచి కష్టపడ్డ నాయకులను పక్కన పెట్టి, కేవలం అధికార స్వార్థం కోసం పార్టీలోకి దూకినవారే ఇప్పుడు కీలక స్థానాల్లో కూర్చున్నారు. ఇక్కడ పాలన ఒక కొత్త రూపం తీసుకుంది – అధికారమే రాజ్యం, అభివృద్ధి పేరుతో మంజూరైన పనులు, కాంట్రాక్టులు, సదుపాయాలు కొందరి చేతుల్లోకి వెళ్లిపోయాయి. ఎవరికి పనులు ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు అన్నది కిందస్థాయి నేతలే నిర్ణయిస్తున్నారు. వాటాల్లో వాటాలు ముందే ఖరారు చేసే ఈ దోపిడీ వ్యవస్థ వల్ల ప్రజా నిధులు కాజేయబడుతున్నాయి. ఇటీవల ఒక ఇంజనీర్ తన మనసులోని బాధను మీడియా ప్రతినిధులతో పంచుకుంటూ.. నాసిరకం పనులు చేసిన కాంట్రాక్టర్లను ఎవరూ ప్రశ్నించరు. చివరికి బాధ మాదే అవుతుంది. అని వాపోయారు. ఆ వాక్యం ఒక్కటే చాలనిపిస్తుంది, అశ్వారావుపేటలో పాలన ఎంత దిగజారిందో అర్థమవ్వడానికి. రోడ్లు నాశనమయ్యాయి, పనులు ఆగిపోయాయి, ప్రజలు మౌనంగా చూస్తున్నారు. ఈ పరిస్థితికి కారణం పాలకుల నిర్లక్ష్యం, రాజకీయ దోపిడీ మాత్రమే. అధికార దాహం అనే విషం ప్రజా అభివృద్ధి శరీరాన్ని నశింపజేస్తోంది. ప్రజల ఓటు అనేది కేవలం గుర్తు వేయడం కాదు, అది ఒక బాధ్యత. ఇకనైనా ప్రజలు ఈ నీచ రాజకీయాలను తిరస్కరించకపోతే, అభివృద్ధి కల ఎప్పటికీ కలగానే మిగిలిపోతుంది. అశ్వారావుపేటకు మార్పు అవసరం ఉంది – అధికార దాహం కాదు, ప్రజా సేవే రాజకీయ ధర్మం కావాలి.

ఖమ్మం

ప్రమాదకరంగా ఏన్కూరు బ్రిడ్జి ప్రజల ప్రాణాలతో చలగాటం

ప్రమాదకరంగా ఏన్కూరు బ్రిడ్జి – ప్రజల ప్రాణాలతో చలగాటం పట్టించుకోని అధికారులు, పెరుగుతున్న ప్రమాదాలు పున్నమి ప్రతినిధి ఖమ్మం జిల్లా అక్టోబర్ 12 ఏన్కూరు మండల పరిధిలో ఖమ్మం–భద్రాచలం ప్రధాన రహదారి మీద ఉన్న ఏన్కూరు బ్రిడ్జి ప్రస్తుతం ప్రమాదకరంగా మారింది. వర్షాల కారణంగా బ్రిడ్జిపై నీరు నిల్వ ఉన్నా కూడా అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. దాంతో వాహనదారులు ప్రతిరోజూ ప్రాణాలను పణంగా పెట్టి ఈ బ్రిడ్జి మీదుగా ప్రయాణం చేస్తున్నారు. ప్రతిరోజూ వందలాది వాహనాలు ఈ బ్రిడ్జి మీదుగా వెళ్తుంటాయి. రహదారి ఇరుకుగా ఉండటమే కాకుండా, బ్రిడ్జి మూలన మూడు అడుగుల వెడల్పుతో, అడుగు లోతులో పెద్ద గోవి ఏర్పడింది. ఆ గోవి కారణంగా వాహనాలు ఒక్కసారిగా తూలిపడే ప్రమాదం నెలకొంది. ముఖ్యంగా రాత్రి వేళల్లో దీపాల వెలుతురు తక్కువగా ఉండటంతో ప్రమాదాలు జరిగే అవకాశాలు మరింత ఎక్కువయ్యాయి. ఇప్పటికే పలుమార్లు ద్విచక్ర వాహనదారులు ఆ గుంటలో పడిపోయి గాయపడ్డ ఘటనలు చోటుచేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. వర్షాలు పడినప్పుడు బ్రిడ్జిపై నీరు నిల్వ కావడంతో మరింత ప్రమాదం పెరుగుతోంది. నీటి కింద ఉన్న గోతులు స్పష్టంగా కనిపించకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్థానికులు పలుమార్లు గ్రామ పంచాయతీ మరియు రోడ్డు విభాగం అధికారులకు విజ్ఞప్తి చేసినా, ఎటువంటి స్పందన లేకుండా అధికారులు మౌనంగా ఉన్నారు. ప్రజల ప్రాణాలతో అధికారులు ఆటలాడుతున్నారని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “ప్రతిరోజూ ఇక్కడ ప్రమాదం తప్పదని తెలిసినా కూడా ఎవరూ చూడటంలేదు. కనీసం తాత్కాలిక మరమ్మతులు అయినా చేయాలి” అని ఆవేదన వ్యక్తం చేశారు. సమీప కాలంలో ఈ బ్రిడ్జిపై జరిగిన ప్రమాదాల కారణంగా ప్రజల్లో భయం నెలకొంది. వర్షాకాలం పూర్తిగా ముగియకముందే అధికారులు జాగ్రత్తలు తీసుకోకపోతే పెద్ద ప్రమాదం సంభవించే అవకాశం ఉందని పౌరులు హెచ్చరిస్తున్నారు. ప్రజల డిమాండ్ ఒకటే — “ఏన్కూరు బ్రిడ్జి మరమ్మతులు తక్షణమే చేయాలి, లేకపోతే పెద్ద ప్రాణ నష్టం తప్పదు.”

విశాఖపట్నం

కోటి సంతకాల సేకరణ పోస్టర్ ఆవిష్కరణ

ఆంధ్రయూనివర్సిటీ ఆవరణలో ఇనటెక్టుయల్ విభాగం ఆధ్వర్యంలో ఆదివారం వై ఎస్ ఆర్ సిపి కోటి సంతకాల సేకరణ, ప్రజా ఉద్యమం లో భాగంగా పోస్టర్ విడుదల చెయడం జరిగింది.ఈ సందర్బంగా ఇనటెక్టు్యల్ విభాగం జిల్లా అధ్యక్షులు దేవరకొండ మార్కండేయులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ప్రధానంగా తెలుగు దేశం ప్రభుత్వం తప్పుడు ప్రచారాలు చేస్తోందని ఆరోపించారు.మేధావులు గ్రహించవల్సింది ప్రదానంగా మాజీ ముఖ్యమంత్రి, వై ఎస్ ఆర్ సి పి అధ్యక్షులు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కరోనా సందర్బంగా ఏర్పడిన స్థితులను వాటిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రం లో అట్టడుగు వర్గాల వారికి వైద్య సదుపాయం అందుబాటులో వుండాలని,సరాసారి 16మెడికల్ కాలేజిల నిర్మాణానికి చెపట్టడం జరిగిందన్నారు.సాక్షత్తు అసెంబ్లీ స్పీకర్ ఐన అయ్యన పాత్రుడు జీ.వో,లు లేవని నిర్మాణంలో లేవని అసెంబ్లీలో తప్పుగా మాట్లాడడం దేవాలయం లాంటి అసెంబ్లీ ని అవమాన పర్చినట్టేనన్నారు.మద్యం పాలసి, మద్యం షాపులు అతిసుందరంగా ప్రవేశపెట్టి సామాన్యల ప్రాణాలతో ఆడుకుంటున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఇంటేలెక్టుయల్ విభాగం అధ్యక్షులు పిల్లా అప్పారావు,ప్రధాన కార్యదర్శి జీవెజి సురేష్,ఉత్తర కార్యదర్శి జి రాధాకృష్ణ,ఆంధ్రయునివర్శిటి విద్యార్థి నాయకుడు మోహన్,దక్షిణ నాయకులు ఎం డి జాఫర్ అలీ,దక్షిణ కార్యదర్శి విజయ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ది కమర్షియల్ టాక్సెస్ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షునిగా ఎన్నికైన రోళ్ళ స్వామి నాయుడు కు ఘన సన్మానం

అమలాపురం, అక్టోబరు 11 (పున్నమి ప్రతినిధి) : ది కమర్షియల్ టాక్సెస్ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షునిగా ఎన్నికైన రోళ్ళ స్వామి నాయుడు ను ది అమలాపురం చాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు గోల్డ్ మార్కెట్ భవనం వద్ద ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి చాంబర్ అధ్యక్షులు బోనం సత్య వరప్రసాద్ ముఖ్య సలహాదారులు నల్లా పవన్ గౌరవ కార్యదర్శి కొవ్వూరి వెంకటరెడ్డి సెక్రెటరీ కొమ్మురి వెంకటాచల ప్రసాద్ వలవల శివరావు అనుపోజు శీను గోల్డ్ మార్కెట్ అధ్యక్షులు మేడిచర్ల త్రిమూర్తుల గోకర కొండ గంగన్న స్వామిరకొండ గంగన్న స్వామి వర్రే బాబి అరిగెల నాని నంద్యాల సత్యనారాయణ ఒంటెద్దు బాబు చవ్వాకుల కృష్ణ కె.సుబ్బారావు గోకరకొండ బాబులు తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

మంత్రి నారా లోకేష్ తో క‌లిసి ఇండియా వ‌ర్సెస్ ఆస్ట్రేలియా మ‌హిళ క్రికెట్ మ్యాచ్ వీక్షించిన ఏసీఏ అధ్య‌క్షుడు కేశినేని శివ‌నాథ్

స్టేడియంలో మ్యాచ్ ను ఆస‌క్తిగా తిల‌కించిన ఐసిసి ఛైర్మన్ జైషా, బిసిసిఐ ప్రతినిధులు స్మృతి మంధ‌న‌కు అభినంద‌న‌లు తెలిపిన ఏసీఏ ప్రెసిడెంట్ కేశినేని శివ‌నాథ్ మ‌హిళా వ‌ర‌ల్డ్ క‌ప్ క్రికెట్ మ్యాచుల్లో భాగంగా ఆదివారం వైజాగ్ ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో జరిగిన ఇండియా వ‌ర్సెస్ ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్ ను ఐటీ, విద్యా శాఖ‌ల మంత్రి నారా లోకేష్, ఐసీసీ ఛైర్మన్ జైషా, బిసిసిఐ ప్ర‌తినిధుల‌ తో క‌లిసి ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివ‌నాథ్, సెక్ర‌ట‌రీ సానా స‌తీష్ బాబు తిల‌కించారు. మ‌హిళ క్రికెట్ మ్యాచ్ కు అభిమానుల నుంచి వచ్చిన స్పంద‌న‌పై నారా లోకేష్ ఆనందం వ్య‌క్తం చేశారు. ఈ త‌ర‌హా మ్యాచులు త‌రుచుగా జరిగిన‌ట్లు అయితే మ‌హిళ క్రికెట్ కు మ‌రింత ఆద‌ర‌ణ పెరిగే అవ‌కాశం వుంద‌ని ఏసీఏ అధ్య‌క్షుడు కేశినేని శివ‌నాథ్ తో అన్నారు. ఇందుకు త‌న స‌హ‌కారం అందిస్తాన‌ని చెప్పారు. ఇండియా బ్యాటింగ్ స‌మ‌యంలో స్టార్ మ‌హిళ బ్యాట‌ర్ స్మృతి మంధాన‌, ప్ర‌తికా కొట్టిన ఫోర్లు, సిక్స‌ర్ల‌కు ఏసీఏ అధ్య‌క్షుడు కేశినేని శివ‌నాథ్, సెక్ర‌ట‌రీ సానా సతీష్ బాబు తో పాటు మంత్రి నారా లోకేష్ సైతం చ‌ప్ప‌ట్లు కొట్టి ప్రోత్స‌హించారు. మ‌హిళ‌ల వ‌న్డే క్రికెట్ చ‌రిత్ర‌లో ఒక క్యాలెండ‌ర్ ఇయ‌ర్ లో 1000 ప‌రుగులు పూర్తి చేసిన తొలి ప్లేయ‌ర్ గా ప్ర‌పంచ రికార్డ్ నెల‌కొల్పిన భార‌త మ‌హిళ‌ల క్రికెట్ జ‌ట్టు స్టార్ బ్యాట‌ర్ స్మృతి మంధ‌న కి ఏసీఏ త‌రుఫున ఏసీఏ అధ్య‌క్షుడు కేశినేని శివ‌నాథ్ అభినంద‌న‌లు తెలిపారు.

ఖమ్మం

పోలీస్ వలయం లో ఖమ్మం నగరము లోని VDO’S కాలని…

ఖమ్మం ( పున్నమి ప్రత్యేక ప్రతినిధి ) ఖమ్మం నగరం లో గల VDO’S కాలనీ పోలీస్ లు పూర్తి గా తమ అధీనం లోకి తెచ్చుకున్నారు.శనివారం నాడు జరిగిన ఇరు వర్గాల ఘర్షణ ఆదివారం నాడు కూడా కొనసాగడం తో పోలీస్ అధికారులు అల్లరి ముక లని అదుపులో కి తీసుకోని కాలని మొత్తం ని పూర్తిగా  తమ అధీనం లోకి తెచ్చుకున్నారు. కొంతమంది అల్లరి ముఖలని పోలీస్క్ష లు తమ అధీనం లోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది.

విశాఖపట్నం

అన్నదానానికి వాసుపల్లి రూ. 10,000లు వితరణ 39వ వార్డు అధ్యక్షుడు ముజీబ్ ఖాన్ చేతుల మీదుగా అందజేత

దక్షిణ నియోజకవర్గం 39వ వార్డులో దేవి శరన్నవరాత్రులు పురస్కరించుకొని నిర్వహించనున్న మహా అన్నదానానికి మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ రూ.10,000 విరాళం అందజేశారు. ఆసీలమెట్ట కార్యాలయంలో ఉత్సవ కమిటీ సభ్యులకు వైయస్సార్సీపి 39 వ వార్డు అధ్యక్షుడు ముజీబ్ ఖాన్ ఆధ్వర్యంలో పదివేల నగదును అందజేశారు. ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ కుల మతాలు అతీతంగా దక్షిణ నియోజకవర్గంలో భిన్నత్వంలో ఏకత్వంగా అన్ని పండుగలు ఘనంగా జరుగుతాయన్నారు. ఏడాది దసరా ఉత్సవాలు కూడా దక్షిణ నియోజకవర్గంలో అంబరాన్నంటాయన్నారు. వైయస్ఆర్సీపీ 39 వ వార్డు అధ్యక్షుడు, ముస్లిం విభాగం నాయకులు ముజీబ్ ఖాన్ దసరా అన్నదాన కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతూ ముందుకు రావడం అభినందనీయమన్నారు. పేదవాడి ఆకలి నింపే ఏ కార్యక్రమానికైనా తాను ముందు ఉంటానని, అలాగే తనతో నడిచే వైఎస్ఆర్సిపి దక్షిణ శ్రేణులు కూడా కలిసి నడవడం ఆనందదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ సెల్ చైర్మన్ జాన్ వెస్లీ, జిల్లా బీసీ విభాగం అధ్యక్షుడు సనపల రవీంద్ర భరత్, వార్డు అధ్యక్షుడు పీతల వాసు వైఎస్ఆర్సిపి నాయకులు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

బాపూజీ నగర్ మినీ ఫంక్షన్ హాల్ నిర్మాణ పనులను పరిశీలించిన గంకల

జీవీఎంసీ 48వ వార్డులో జరుగుతున్న అభివృద్ధి పనులను 48వ వార్డు కార్పొరేటర్,బిజెపి ఫోర్ లీడర్,స్టాండింగ్ కమిటీ మెంబర్ గంకల కవిత అప్పారావు యాదవ్ ఆదివారం స్థానికులతో కలిసి పరిశీలించారు. వార్డులో మినీ ఫంక్షన్ హాల్ లేక పేద ప్రజలు శుభకార్యాలకు ఇబ్బందులు పడుతున్నారని గంకల కవిత అప్పారావు యాదవ్ చేపట్టిన గుడ్ మార్నింగ్ గంకల కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులు మేరకు జీవీఎంసీ కౌన్సిల్లో చర్చించి నిర్మాణాలు చేపతున్నామని గంకల పేర్కొన్నారు.ఈ సందర్బంగా బాపూజీ నగర్ లో నిర్మాణం చేపడుతున్న మినీ ఫంక్షన్ హాల్ పనులను స్థానికులతో కలిసి పరిశీలించారు.ఈ సందర్బంగా గంకల కవిత అప్పారావు యాదవ్ మాట్లాడుతూ కొండవాలు ప్రాంతంలో గల ప్రజలు శుభకార్యాలు చేసుకునేందుకు ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు గుడ్ మార్నింగ్ గంకల కార్యక్రమంలో వినతి పత్రాలు అందజేశారని,వినతి పై స్పందించి జీవీఎంసీ కౌన్సిల్ లో చర్చించి వార్డులో పేద ప్రజలకు అందుబాటులో ఉండేలా శాశ్వతంగా మినీ ఫంక్షన్ హాల్ నిర్మాణం చేపడుతున్నట్లు పేర్కొన్నారు. అతి త్వరలో వార్డులో మినీ ఫంక్షన్ హాల్ అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.ఆదివారం అయ్యినప్పటికి ఉదయం నుంచి సాయంత్రం వరకు నేరుగా వార్డులో పర్యటన చేసి ప్రజలు నుంచి వినతులు స్వీకరించారు.వార్డు అభివృద్ధికి నిరంతరం కట్టుబడి ఉన్నామని గంకల తెలిపారు.వార్డు ప్రజలకు ఏ సమస్య ఏర్పడిన తక్షణమే తనను సంప్రదించాలని గంకల పేర్కొన్నారు. వార్డు ప్రజల కోరిక మేరకు జీవీఎంసీ కౌన్సిల్లో చర్చించి అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్న గంకల కవిత అప్పారావు యాదవ్ కు బాపూజీ నగర్ ప్రజలు అభినందనలు తెలిపారు.

విశాఖపట్నం

దిగ్గజ భారత మహిళా క్రికెటర్లు కు అరుదైన గౌరవం

విశాఖ ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఎ గ్యాలరీ స్టాండ్‌కు మహిళా క్రికెట్ దిగ్గజం మిథాలీ రాజ్ పేరు, మూడో గేట్‌కు రావి కల్పనా పేరు ఆవిష్కరించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్, ఐసీసీ చైర్మన్ జైషా, బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మన్హాస్, బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), ఏసీఏ కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు పాల్గొన్నారు. స్టేడియంలో ఏర్పాటు చేసిన మిథాలీ రాజ్ గ్యాలరీ, రావి కల్పనా గేట్లను ఐసీసీ చైర్మన్ జైషా ఆవిష్కరించారు. మహిళా క్రికెట్‌లో విశిష్ట కీర్తి సంపాదించిన మిథాలీ రాజ్, రావి కల్పనాలకు ఈ గుర్తింపు ఒక అరుదైన గౌరవంగా నిలిచింది.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.