Wednesday, 29 April 2026

Blog

విశాఖపట్నం

విశాఖ ఎకనామిక్ రీజియన్ ను బలపేతం చేయాల్సిన అవసరం ఉంది

విశాఖను ట్రిలియన్ డాలర్ ఎకానమీగా తీర్చిదిద్దాలనేదే లక్ష్యం 10 లక్షల కోట్ల పెట్టుబడుల్లో సగం విశాఖ రీజియన్ కే వస్తున్నాయి ఇందుకు కావాల్సిన మౌలిక సదుపాయల కల్పనపై దృష్టిపెడతాం టీసీఎస్, కాగ్నిజెంట్ లకు 99 పైసలకే భూమి కేటాయింపు తప్పా అని సూటిగా ప్రశ్నిస్తున్నా విశాఖ కలెక్టరేట్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి నారా లోకేష్ విశాఖకు పెద్దఎత్తున పెట్టుబడులు వస్తున్న నేపథ్యంలో విశాఖ ఎకనామిక్ రీజియన్ ను బలపేతం చేయాల్సిన అవసరం ఉందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. విశాఖ రీజియన్ లో కల్పించాల్సిన మౌలిక సదుపాయాలు, ఎకో సిస్టమ్ పై ఉత్తరాంధ్ర జిల్లాల కలెక్టర్లు, ప్రజాప్రతినిధులతో విశాఖ కలెక్టర్ కార్యాలయంలో మంత్రి సమీక్షించారు. అనంతరం నిర్వహించిన విలేకరుల మంత్రి మాట్లాడుతూ.. విశాఖలో సిఫీ ఆధ్వర్యంలో డేటా సెంటర్ కు శంకుస్థాపన చేశాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విశాఖలో పెట్టుబడులు, అభివృద్ధి విషయంలో వేగంగా పరిగెడుతున్నాం. టీసీఎస్, కాగ్నిజెంట్ విషయంలో ఇప్పటికే కమిట్ మెంట్ అయింది. ఏఎన్ఎస్ఆర్ సత్వా, యాక్సెంచర్, గూగుల్, సిఫీ, ఆర్సెల్లర్ మిట్టల్ తో పాటు ఫార్మాలో సుమారు 5 కంపెనీలు పెట్టుబడులు పెట్టనున్నాయి. సుమారు 10 లక్షల కోట్ల పెట్టుబడులకు మేం ఒప్పందాలు చేసుకున్నాం. ఇందులో 50 శాతం గ్రేటర్ విశాఖ ఎకనామిక్ రీజియన్ కు వస్తున్నాయి. అభివృద్ధి పట్ల ప్రజాప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనం. అన్ని ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. విశాఖ ఎకనామిక్ రీజియన్ ను బలపేతం చేయాల్సిన అవసరం ఉంది నవంబర్ 14, 15 సీఐఐ భాగస్వామ్య సదస్సును కూడా విశాఖలో నిర్వహిస్తున్నాం. ఇందుకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నాం. రాబోయే రోజుల్లో విశాఖకు, ఏపీకి పెద్ద ప్రకటనలు వస్తాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. విశాఖ ఎకనామిక్ రీజియన్ ను బలపేతం చేయాలి. ఏపీ 2.4 ట్రిలియన్ డాలర్ ఎకానమీ అవ్వాలంటే అందులో గ్రేటర్ విశాఖ రీజియన్ కనీసం 1 ట్రిలియన్ డాలర్ ఎకానమీ అవ్వాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. మేం ప్యాలెస్ లు కట్టేందుకు విశాఖకు రాలేదు. ప్రజలకు ఉద్యోగాలు, ఉపాధి కల్పించేలా పెట్టుబడులు తీసుకురావాలి, వాటిని గ్రౌండ్ చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. వైసీపీ ఐదేళ్లలో తీసుకురాలేని పరిశ్రమలను మేం 16 నెలల్లోనే తీసుకువచ్చాం నవంబర్ లో టీసీఎస్ సంస్థ ప్రారంభం కానుంది. కాగ్నిజెంట్ సీఈవో కూడా నవంబర్ లో వస్తున్నారు. వారి కొత్త ప్రాజెక్ట్ కు శంకుస్థాపన చేస్తున్నాం. డిసెంబర్ లో వారి డెవలప్ మెంట్ సెంటర్ కూడా ప్రారంభించబోతున్నారు. గూగుల్ విషయానికి వస్తే రేపు ఢిల్లీకి వెళ్లి పెద్దఎత్తున ప్రకటన చేయబోతున్నాం. 99పైసలకే ఎకరా భూమి కేటాయిస్తున్నారని నాపై ఆరోపణలు చేస్తున్నారు. టీసీఎస్, కాగ్నిజెంట్ కు 99 పైసలకే భూమి ఇవ్వడం తప్పా అని నేను వారిని సూటిగా ప్రశ్నిస్తున్నాను. వైసీపీ ఐదేళ్లలో తీసుకురాలేని పరిశ్రమలను మేం 16 నెలల్లోనే తీసుకువచ్చాం. అది మా చిత్తశుద్ధి. ప్రతి సంస్థను మేం గ్రౌండ్ చేస్తాం. నాలుగు జిల్లాల కలెక్టర్లతో సమీక్షించాం. గ్రేటర్ ఎకనామిక్ రీజియన్ కు కావాల్సిన ఎకో సిస్టమ్ పై చర్చించాం. రోడ్లు, ప్రభుత్వ భూముల వివరాలపై చర్చించాం. విశాఖలో రాబోయే ఐదేళ్లలో ఐటీ రంగంలో ఐదు లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. ఇది చేయాలంటే సమగ్ర ప్రణాళిక అవసరం. ఆ దిశగా మేం పనిచేస్తున్నాం. ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని.. అభివృద్ది వికేంద్రీకరణ నినాదంతో నాడు మీ ముందుకు వచ్చాం. 94 శాతం సీట్లతో మమ్మల్ని గెలిపించారు. దానిని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది. అభివృద్ధి, సంక్షేమాన్ని జోడెద్దుల బండిలా ముందుకు తీసుకెళ్తాం. అన్ని ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేసి యువతకు పెద్దఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. వైసీపీ అరాచకాలను ప్రజల ముందు ఎండగడతాం. నకిలీ మద్యం విషయంలో కూడా చాలా పెద్ద తతంగం ఉంది. హోం వర్క్ జరుగుతోంది. ప్రజాకోర్టులో వారిని దోషిగా నిలబెడతామన్నారు.

విశాఖపట్నం

ఆత్మస్థైర్యం తో ఉండండి – క్రీడా స్ఫూర్తితో లక్ష్యం అందుకోండి – గెలుపు ఓటములు ఒకేలా చూడండి – కుటుంబీకుల గురువుల లక్ష్యం నిలబెట్టాలి – పోలీస్ కమిషనర్ శంఖ బ్రత బాగ్చి

విశాఖపట్నం: చిత్త శుద్ధితో క్రీడాకారులుగా ఎదిగి తల్లి దండ్రులు విద్యనేర్చిన గురువుల నమ్మకాల్ని నిలబెట్టాలని పోలీస్ కమిషనర్ డా శంఖ బ్రత బాగ్చి పేర్కొన్నారు. శ్రీ మన్మధురావు మెమోరియల్ క్లబ్ ఈ నెల 10న ప్రారంభించిన బాస్కెట్ బాల్ టోర్నమెంట్ ముగింపు లో డా. శంఖ బ్రత బాగ్చి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఓర్క్రిడ్జ్ ఇంటర్నేషనల్ గర్ల్స్ టీమ్ విన్నర్ గాను,సెయింట్ అల్లోయిసిస్ స్కూల్ విద్యార్థులు రన్నర్ గాను ట్రోఫీ లు అందుకున్నారు.స్టీల్ప్లాంట్ స్కూల్ విద్యార్థుల టీమ్, తిమ్మాపురం విజ్ఞాన్ విద్యార్థులు, ప్రత్యేక ట్రోఫీని అందుకున్నారు.ఈ సందర్భంగా ముఖ్య అతిథి డా. శంఖ బ్రత బాగ్చి మాట్లాడుతూ బాస్కెట్ బాల్ క్రీడ గొప్పదన్నారు. మనదేశంలోనూ బాస్కెట్ బాల్ క్రీడను టాప్ లోకి తీసుకు వెళ్లి అనుకున్న లక్ష్యం సాధించాలని సూచించారు. ఏఐ టెక్నాలజీ తో దేశంలోనే మొదటిసారిగా పాట ను సృష్టించి సంచలనం పేరు తెచ్చుకున్న అడ్డూరి సునీల్ చరణ్, ప్రభుత్వ పి.ఇ. టి లలిత్ కుమార్, డా.రవి, డా. కళ్యాణ్ చక్రవర్తి, అధ్యక్షులు రామ్మోహన్ రావులు అతిథులుగా పాల్గొన్నారు. గత 19 ఏళ్లుగా ఉచితంగా బాస్కెట్ బాల్ శిక్షణ ఇస్తున్న అన్నెపు రామచందర్ మాట్లాడుతూ తన ఉచిత శిక్షణ లక్ష్యంకు ఎయు క్రీడా విభాగం ఇస్తున్న ప్రోత్సాహం గుర్తు చేశారు. పి.ఇ.టి డైరెక్టర్ ఆచార్య ఎన్.విజయ మోహన్, ఫిజికల్ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్, సైన్స్ విభాగాధిపతి డా. ఎ. పల్లవి లు సహకరిస్తున్న తీరును ప్రస్తావించారు. బి.ఎస్ చంద్ర శేఖర్ మాస్టర్ ఆఫ్ శర్మనీగ వ్యవహరించిన కార్యక్రమంలో చెలమరెడ్డి మహేష్, చంద్రశేఖర్, సూరిబాబు పొట్నూరూ, శివకుమార్, బోర వెంకటేశ్వర రెడ్డి తదితరులు టోర్నమెంట్ నిర్వహణలో భాగస్తులయ్యారు.

విశాఖపట్నం

లోకేష్ కు టీమిండియా గిఫ్ట్

టీమిండియా ప్లేయర్స్ సంతకాలు చేసిన స్పెషల్ టీ షర్ట్ ను ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అందుకున్నారు. మహిళ క్రికెట్ పోటీలు తిలకించడానికి ఆదివారం విశాఖ వచ్చిన లోకేష్ ను ఆసియా కప్ టీమిండియా మేనేజర్ గా వ్యవహరించిన పి.వి ఆర్. ప్రశాంత్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఆసియా కప్ గెలుచుకున్నందుకు లోకేష్ అభినందనలు తెలియజేయగా.. కప్ గెలుచుకున్న ఆటగాళ్లు సంతకాలతో ఉన్న టీ షర్ట్ ను ప్రశాంత్ – లోకేష్ కు అందించారు. స్పెషల్ టీ షర్ట్ ను అందుకున్న తండ్రి లోకేష్ తో పాటు కుమారుడు దేవాన్ష్ ఎంతో మురిసిపోయారు. ప్రశాంత్ భీమవరం ఎమ్మెల్యే రామాంజనేయులు కుమారుడు కాగా, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అల్లుడన్న విషయం తెలిసిందే.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

బండారులంకలో చెత్త పై పోరుబాట కార్యక్రమానికి కార్యాచరణ.. * ఈనెల 15వ తేదీ నుంచి రిలే నిరాహార దీక్షలు. * గ్రామంలో చెత్తను డంపింగ్ యార్డ్ కు తరలించేవరకు ఉదృతం చేయనున్న ఉద్యమం

అమలాపురం, అక్టోబరు 11 (పున్నమి ప్రతినిధి) ; అమలాపురం రూరల్ మండలం బండారులంక గ్రామంలో 12 నెలలుగా రోడ్ల పైన, వీధుల్లోనూ పేరుకుపోయిన చెత్త ను డంపింగ్ యార్డుకు తరలించాలని డిమాండ్ చేస్తూ రిలే నిరాహార దీక్షలు చేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నేతలు కార్యకర్తలు సిద్ధమయ్యారు… ఈనెల 15వ తేదీ బుధవారం పంచాయతీ కార్యాలయం ఎదురుగా చెత్తపై పోరు పేరుతో రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు నేతలు తెలిపారు. ఈ కార్యక్రమం లో నేతలు జాన గణేష్, దంగేటి రుద్ర, వాసా దొర బాబు, అంకం పెదరాజు,గుత్తుల మురుగులరాజు,గుత్తుల సత్తిబాబు , గోసంగి శ్రీను,దంగేటి సింహాచలం, గుత్తుల సురేష్, కట్టా చండి ప్రియా,పెదపూడి నాబురావు, చింతా ఉమా మహేశ్వర రావు, గుత్తుల ఏసుబాబు, ఇనుమర్తి లింగమూర్తి, కారుపర్తి మల్లేశ్వర రావు దంగేటి వెంకట శెట్టి, ఇళ్ల త్రిమూర్తులు, గుబ్బల సాయిరాం,కాసిన చిట్టీ రాజు, కుర్మా క్రీస్తు బాబు,చింతపట్ల నమశ్శివాయ,సరెళ్ల మల్లేశ్వర రావు, దంగేటి ప్రసాద్, జాన కామేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

విశాఖ ఎకనామిక్ రీజియన్ ను బలపేతం చేయాల్సిన అవసరం ఉంది

విశాఖను ట్రిలియన్ డాలర్ ఎకానమీగా తీర్చిదిద్దాలనేదే లక్ష్యం 10 లక్షల కోట్ల పెట్టుబడుల్లో సగం విశాఖ రీజియన్ కే వస్తున్నాయి ఇందుకు కావాల్సిన మౌలిక సదుపాయల కల్పనపై దృష్టిపెడతాం టీసీఎస్, కాగ్నిజెంట్ లకు 99 పైసలకే భూమి కేటాయింపు తప్పా అని సూటిగా ప్రశ్నిస్తున్నా విశాఖ కలెక్టరేట్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి నారా లోకేష్ విశాఖకు పెద్దఎత్తున పెట్టుబడులు వస్తున్న నేపథ్యంలో విశాఖ ఎకనామిక్ రీజియన్ ను బలపేతం చేయాల్సిన అవసరం ఉందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. విశాఖ రీజియన్ లో కల్పించాల్సిన మౌలిక సదుపాయాలు, ఎకో సిస్టమ్ పై ఉత్తరాంధ్ర జిల్లాల కలెక్టర్లు, ప్రజాప్రతినిధులతో విశాఖ కలెక్టర్ కార్యాలయంలో మంత్రి సమీక్షించారు. అనంతరం నిర్వహించిన విలేకరుల మంత్రి మాట్లాడుతూ.. విశాఖలో సిఫీ ఆధ్వర్యంలో డేటా సెంటర్ కు శంకుస్థాపన చేశాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విశాఖలో పెట్టుబడులు, అభివృద్ధి విషయంలో వేగంగా పరిగెడుతున్నాం. టీసీఎస్, కాగ్నిజెంట్ విషయంలో ఇప్పటికే కమిట్ మెంట్ అయింది. ఏఎన్ఎస్ఆర్ సత్వా, యాక్సెంచర్, గూగుల్, సిఫీ, ఆర్సెల్లర్ మిట్టల్ తో పాటు ఫార్మాలో సుమారు 5 కంపెనీలు పెట్టుబడులు పెట్టనున్నాయి. సుమారు 10 లక్షల కోట్ల పెట్టుబడులకు మేం ఒప్పందాలు చేసుకున్నాం. ఇందులో 50 శాతం గ్రేటర్ విశాఖ ఎకనామిక్ రీజియన్ కు వస్తున్నాయి. అభివృద్ధి పట్ల ప్రజాప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనం. అన్ని ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. విశాఖ ఎకనామిక్ రీజియన్ ను బలపేతం చేయాల్సిన అవసరం ఉంది నవంబర్ 14, 15 సీఐఐ భాగస్వామ్య సదస్సును కూడా విశాఖలో నిర్వహిస్తున్నాం. ఇందుకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నాం. రాబోయే రోజుల్లో విశాఖకు, ఏపీకి పెద్ద ప్రకటనలు వస్తాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. విశాఖ ఎకనామిక్ రీజియన్ ను బలపేతం చేయాలి. ఏపీ 2.4 ట్రిలియన్ డాలర్ ఎకానమీ అవ్వాలంటే అందులో గ్రేటర్ విశాఖ రీజియన్ కనీసం 1 ట్రిలియన్ డాలర్ ఎకానమీ అవ్వాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. మేం ప్యాలెస్ లు కట్టేందుకు విశాఖకు రాలేదు. ప్రజలకు ఉద్యోగాలు, ఉపాధి కల్పించేలా పెట్టుబడులు తీసుకురావాలి, వాటిని గ్రౌండ్ చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. వైసీపీ ఐదేళ్లలో తీసుకురాలేని పరిశ్రమలను మేం 16 నెలల్లోనే తీసుకువచ్చాం నవంబర్ లో టీసీఎస్ సంస్థ ప్రారంభం కానుంది. కాగ్నిజెంట్ సీఈవో కూడా నవంబర్ లో వస్తున్నారు. వారి కొత్త ప్రాజెక్ట్ కు శంకుస్థాపన చేస్తున్నాం. డిసెంబర్ లో వారి డెవలప్ మెంట్ సెంటర్ కూడా ప్రారంభించబోతున్నారు. గూగుల్ విషయానికి వస్తే రేపు ఢిల్లీకి వెళ్లి పెద్దఎత్తున ప్రకటన చేయబోతున్నాం. 99పైసలకే ఎకరా భూమి కేటాయిస్తున్నారని నాపై ఆరోపణలు చేస్తున్నారు. టీసీఎస్, కాగ్నిజెంట్ కు 99 పైసలకే భూమి ఇవ్వడం తప్పా అని నేను వారిని సూటిగా ప్రశ్నిస్తున్నాను. వైసీపీ ఐదేళ్లలో తీసుకురాలేని పరిశ్రమలను మేం 16 నెలల్లోనే తీసుకువచ్చాం. అది మా చిత్తశుద్ధి. ప్రతి సంస్థను మేం గ్రౌండ్ చేస్తాం. నాలుగు జిల్లాల కలెక్టర్లతో సమీక్షించాం. గ్రేటర్ ఎకనామిక్ రీజియన్ కు కావాల్సిన ఎకో సిస్టమ్ పై చర్చించాం. రోడ్లు, ప్రభుత్వ భూముల వివరాలపై చర్చించాం. విశాఖలో రాబోయే ఐదేళ్లలో ఐటీ రంగంలో ఐదు లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. ఇది చేయాలంటే సమగ్ర ప్రణాళిక అవసరం. ఆ దిశగా మేం పనిచేస్తున్నాం. ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని.. అభివృద్ది వికేంద్రీకరణ నినాదంతో నాడు మీ ముందుకు వచ్చాం. 94 శాతం సీట్లతో మమ్మల్ని గెలిపించారు. దానిని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది. అభివృద్ధి, సంక్షేమాన్ని జోడెద్దుల బండిలా ముందుకు తీసుకెళ్తాం. అన్ని ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేసి యువతకు పెద్దఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. వైసీపీ అరాచకాలను ప్రజల ముందు ఎండగడతాం. నకిలీ మద్యం విషయంలో కూడా చాలా పెద్ద తతంగం ఉంది. హోం వర్క్ జరుగుతోంది. ప్రజాకోర్టులో వారిని దోషిగా నిలబెడతామన్నారు.

విశాఖపట్నం

ఐటీ విశ్వనగరంగా విశాఖ మంత్రి లోకేష్ కు గంటా రవితేజ కృతజ్ఞతలు

విశాఖ ఐటీని ప్రపంచవ్యాపితం చేస్తున్న ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కు యువ నాయకుడు, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తనయుడు గంటా రవితేజ కృతజ్ఞతలు తెలిపారు. విశాఖ పర్యటనకు వచ్చిన ఆయనకు రవితేజ ఆదివారం ఎయిర్ పోర్టులో మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విశాఖ అభివృద్ధికి ప్రభుత్వం కనబరుస్తున్న ప్రత్యేక శ్రద్ధను ప్రస్తావించారు. రూ.56 వేల కోట్లతో గూగుల్ డేటా సెంటర్.. రూ. 85 వేల కోట్లతో రైడెన్ డేటా సెంటర్.. రూ. 16 వేల కోట్లతో సిఫీ డేటా సెంటర్ ఏర్పాటయ్యేలా చేసినందుకు లోకేష్ కు అభినందనలు తెలియజేశారు. త్వరలో ఏర్పాటు కానున్న టీసీఎస్.. కాగ్నిజెంట్.. యాక్సెంచర్.. వంటి కంపెనీలు వేలాది మంది యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తాయని పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్

ప్రభుత్వ తీరును ఖండిస్తు ఈ నెల 15 న జిల్లా వ్యాప్తగా అన్ని మండల కేంధ్రాల్లోను ఆందోళనులు సిపిఎం

ప్రభుత్వ,పోలీసులు తీరును ఖండిస్తు ఈనెల 15 న జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లోను ఆందోళనులు చేపడ తామని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న స్పష్టం చేసారు నక్కపల్లి మండలం లోని సిపిఎం జిల్లాకార్యదర్శివర్గ సభ్యులు యం అప్పలరాజు గ్రుహా నిర్బాందాన్ని ఖండిస్తు ఆదివారం దేవరాపల్లిలో సిపిఎం శ్రేణులతో నిర్సన తెలిపారు అనంతరం అయిన మాట్లాడారు నక్కపల్లి మండలంలో రాజయ్య పేటలో బల్క్ డ్రగ్స్ పార్క్ కు వ్యతిరేకంగా వేలాది మంది మత్స్యకారులు సాంతియుతంగా అందోన చేస్తున్నారని దీన్ని పరిశీలించ డానికి రాష్ట్ర హోంమంత్రి అనితగారు గతనెల 29 న వెళ్ళారని తెలిపారు ఈ సందర్భంగా మత్స్యకారులు కారును అడ్డుకుని ఆందోళన చేపట్టారని దీనికి సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు యం అప్పలరాజె కారణ మంటూ నాటి నుండి నేటివరకు అప్పలరాజును గ్రుహా నిర్బంధంలో ఉంచి కనీష అవసరాలకు కూడా వెళ్ళనియ్య కుండా చేయడం జరుగుతుందని ఇది పూర్తిగా అప్రజాస్వామిక మన్నారు ప్రభుత్వం ఈవిధంగా చేయడాన్ని వెంకన్న తీవ్రంగా తప్పు బట్టారు ప్రజా ఉద్యమ కారుల పై పోలీసులు రోడ్డుకాసి దోంగలకు ఇంటి దగ్గర కాపలా పెట్టినట్లు పెట్టడం అత్యంత హెయమైన చర్యని అన్నారు ఇటువంటి చర్యలు వల్లనే పోలీసులు పై ప్రజలకు పూర్తిగా విశ్వాసం గౌరవం పోతుందని తెలిపారు ప్రభుత్వం పోలీసులు అప్పరాజు గ్రుహా నిర్బంధం ఆపాక పోతే జిల్లా లోని మొత్తం సిపిఎం పార్టీ క్యాడర్ ను సభ్యులను ఛలో,నక్కపల్లి కార్యక్రమం చేపడతామని స్పష్టం చేశారు ఇప్పటికే నక్కపల్లి మండలం రాజయ్య పేటలో బల్క్ డ్రంగ్ పార్క్ వద్దంటు మత్స్యకారులు శాంతి యుతంగా నిరసన తెలియ జేస్తున్నారని ప్రజలపై ప్రభుత్వానికి ఏమాత్రం గౌరవం ఉన్న వెంటనే నిలుపుదల చేయాలి తప్ప మత్స్యకారుల అభిప్రాయాలను గౌరవించి కుండా బల్క్‌డ్రగ్‌ పార్క్ ఎర్పాటు చేస్తామంటె జిల్లాలోని మత్స్యకారులు అందరు చూస్తు ఊరుకోరని ప్రభుత్వానికి తగిన గుణపాఠం చేబుతారని తెలిపారు ప్రజా స్వామ్యంలో నిరసనను స్వేచ్చగా తెలియ జేసే హక్కు ప్రజలకు ఉంటుందన్నారు గంగమ్మను నమ్ముకోని బ్రతుకు తున్న మత్స్యకారులపైన పదేపదే నిర్భందాలు ప్రయోగించడం అప్రజాస్వామికంగా వ్వవ హారించడం తీవ్ర అభ్యంతర కరమన్నారు ప్రతి పక్షంలో ఉన్నప్పుడు బల్క్‌డ్రగ్‌ పార్కు ప్రమాద కరమని నిన దించిన హోమంత్రి అనిత గారికీ నేడు అధి కారంలోకి రాగానే బల్క్ డ్రంగ్ పార్క్ ప్రమాదకరం కాకుండా పోతుందా అని ప్రశ్నించారు అనిత గారు ఇటు వంటి చర్యలకు పూనుకుంటే ప్రజలకు భవిష్యత్తు లో తగిన బుద్ధి చెబుతారని తెలిపారు బల్క్‌ డ్రగ్‌ పార్క్‌తో మత్స్యకారుల జీవ నోపాధి, స్థానిక ప్రజల ఆరోగ్యం, పర్యా వరణానికి తీవ్ర ప్రమాదం ఏర్పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ పార్క్‌ నిర్మాణంతో సముద్ర కాలుష్యం పెరిగి మత్స్య సంపద నాశనం అవుతుందని. దీని ఫలితంగా వేలాది కుటుంబాలు తమ జీవనా ధారాన్ని కోల్పోతారని అన్నారు ప్రభుత్వం అభివృద్ధి పేరిట ప్రజల పునరా వాసం,జీవన భద్ర తలను పక్కన పెట్టి, కార్పొరేట్‌ లాభాల కోసం మాత్రమే కృషి చేస్తోందని. ప్రజల మనో భావాలను గౌరవించ కుండా, స్థానిక ప్రజల అభి ప్రాయాన్ని పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈవిధంగా వ్యవహరించడం సరైనది కాదని వెంటనే పోలీసులు నిర్బంధాన్ని ఆపాలని సిపిఎం పార్టీ అప్పలరాజు గ్రుహా నిర్బందాన్ని ఆపాలని లెదంటే ఈనెల 15 జిల్లా లోని అన్నిమండలాల్లోను అందోనులు చేస్తామని తెలిపారు దీనికి ప్రజాస్వామ్య వాదులు వామపక్ష ప్రజాసంఘాలు స్వచ్ఛందంగాగా పల్గోని జయప్రదం చేయాలని వెంకన్న కోరారు

విశాఖపట్నం

విశాఖ హ్యూమర్ క్లబ్ నవ్వుల పంట

విశాఖ హ్యూమర్ క్లబ్ తమ రజతోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఆదివారం సాయంత్రం పౌర గ్రంథాలయంలో నిర్వహించిన కామెడీ కుంభమేళ నవ్వుల పంట పండించింది. నిర్వాహకులు రావి గోపి కృష్ణ, ఎస్ ఎస్ రామానుజo, భాను ప్రకాష్, శ్రీపాద చిదంబరం శివజ్యోతి, సూర్యం, ఆర్ ఎస్ ఎన్ మూర్తి, శ్రీనివాస్, గణేష్, జీవిలక్ష్మి తదితరులు ప్రదర్శించిన హాస్య లఘు నాటికలు కడుపుబ్బా నవ్వించాయి. కార్యక్రమంలో నటుడు రాపేటి అప్పారావు, కళా రంగ ప్రముఖులు సన్ మూర్తి, దాడి సత్యనారాయణ, కొరిటాల ప్రభాకర్ తదితరులు హాస్య కళాకారులను అభినందించారు. ‘నవ్వడం ఒక యోగం- నవ్వించడం ఒక భోగం- నవ్వకపోవడం ఒక రోగం’ అనే చలోక్తిని వినిపించి ప్రేక్షకుల మన్ననలు పొందారు. ఈ వార్షికోత్సవ వేడుకలలో ప్రముఖ వైద్యులు శ్రీరామ్ మూర్తి పలు సినీ గీతాలను ఆలపించి అలరించారు. కామిడీ స్కిట్స టెలిగ్రామ్, నా హృదయం కొట్టేశారు, బంపర్ ప్రైజ్, కిడ్నీలో రాళ్లు, నవ్వులు పువ్వులు, టైమ్ ఎంత, ప్రియురాలికి ప్రేమలేఖ వంటి హాస్య సన్నివేశాలను ప్రదర్శించి ప్రేక్షకుల మన్ననలు పొందారు. కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ఆహుతులు హాజరై కరతాల ధ్వనులతో కళాకారులను అనుక్షణం అభినందించారు . తిలక్, మూర్తి, విజయనగరం ఫోటో శ్రీనివాస్, మస్తాన్ రెడ్డి, ఈ మండీ ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

వైసీపీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు పితాని కి అభినందనల వెల్లువ

అమలాపురం, అక్టోబరు 11 (పున్నమి ప్రతినిధి) : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పితాని బాలకృష్ణ ను సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (సీఈసీ) సభ్యులుగా నియమించిన సందర్భంలో ఆయన స్వగృహంలో ఆదివారం ఆయనను పలువురు మర్యాదపూర్వకంగా కలిసి దుస్సాలువ కప్పి పుష్పమాల తో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పి మల్లవరం వైయస్సార్ పార్టీ నాయకులు సర్పంచ్ పంపన రామకృష్ణ, పి మల్లవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు మట్టపర్తి లోవరాజు, వైదాడి శ్రీను, వార్డు సభ్యులు కావూరి వెంకటేశ్వరరావు, సబ్బతి రామకృష్ణ బల్ల సంధ్యారాణి ఏసు , శీలం గోపాలకృష్ణ , మల్లాడి వీరబాబు, ఉండ్రు హరిబాబు , దంగేటి బాబులు పాల్గొన్నారు

విశాఖపట్నం

దొంగ ఓట్లతో బీజేపీ అధికారంలోకి వస్తోంది కాంగ్రెస్ పార్టీ విశాఖ తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ ప్రియాంక దండి

లకాంగ్రెస్ పార్టీ తూర్పు నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ నాయకులు ఈగల మోహన్ సాయి, వంటాకు వినోద్ ఆధ్వర్యంలో మద్దిలపాలెం, కృష్ణ కాలేజీ రోడ్డులో ఏఐసీసీ పిలుపు మేరకు రాహుల్ గాంధీకి మద్దతుగా ఓట్ చోర్, గద్దె చోడ్ అని నినాదాలు ఇస్తూ బీజేపీ, కేంద్ర ఎన్నికల సంఘం కలిసి చేస్తున్న కుట్రని ప్రజలకు వివరిస్తూ సంతకాల సేకరణ కార్యక్రమం చేసారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా కాంగ్రెస్ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ ప్రియాంక దండి పాల్గొని దేశంలో ఈసీ సహాయంతో బీజేపీ ఓట్ చోర్ చేసి అధికారంలోకి వస్తోందని దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఇది అమలు చేస్తోందని ఆమె అన్నారు, బీజేపీకి బలం లేని రాష్ట్రాల్లో మిత్రపక్షలకు పూర్తిగా సహకరిస్తూ ఓట్ చోరీ చేసి అధికారం కైవసం చేసుకుంటున్నారని, మన రాష్ట్రంలో బీజేపీకి 0.5% ఓట్ బ్యాంకు మాత్రమే ఉందని కాని గత ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 8 అసెంబ్లీ, 3 పార్లమెంట్ స్థానాలు గెలుచుకుందని, రాయలసీమలో ధర్మవరం, ఉత్తరాంధ్రలో ఇచ్చాపురంలో బీజేపీ గెలవడం ఆశ్చర్యం కలిగిస్తోందని, ఓట్లు చోరీ చేసి, ఎన్నికలను చోరీ చేసి బీజేపీ గెలుస్తోందని, ప్రజా స్వామ్యాన్ని, ప్రజల హక్కులను బీజేపీ కాల రాస్తోందని. ఇప్పటికే దేశ వ్యాప్తంగా యువత మోదీ అంటే ఓట్ చోర్ అని అంటున్నారని. మీ ఓటు జాగ్రత్తగా కాపాడుకోవాలి, బీజేపీ ఎన్నికల సంఘం మీ ఓటు కూడ దొంగలిస్తుందని ప్రజలకు ఆమె హేచ్చరించారు.పారదర్శకంగా ఉండాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం మోదీ జేబు సంస్థగా వ్యవహారిస్తోందని, బెంగళూరులో ఒక అసెంబ్లీ నియోజకవర్గం మహాదేవపురా లోనే లక్ష ఓట్లు దొంగ ఓట్లు ఉన్నట్టు తెలిందని, ఇది ఎన్నికల సంఘానికి తెలియకుండా జరిగిందా? బీజేపీ చెప్పినట్టు ఎన్నికల సంఘం ఆడుతోందని ప్రియాంక విమర్శించారు. కార్యక్రమంలో జిల్లా మహిళా నాయకురాలు కాండవ గాయత్రి, జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు మొహమ్మద్ ఆలీ, 15 వ వార్డు అధ్యక్షులు వేమూరి సురేష్, 27 వ వార్డు అధ్యక్షులు గుర్రం కనకరాజు, 28 వ వార్డు అధ్యక్షురాలు మామిడి వరాలమ్మ, 18 వ వార్డు అధ్యక్షులు భోగవరపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.