Wednesday, 29 April 2026

Blog

అనంతపురం

కేశవరెడ్డి స్కూల్లో అట్టహాసంగా స్పోర్ట్స్ మీట్

అనంతపురం వడియం పేట గ్రామం నందు కేశవరెడ్డి స్కూల్లో, అధినేత మరియు చైర్మన్ అయిన కేశవరెడ్డి గారు వచ్చి ప్రారంభించి, పిల్లల భవిష్యత్తులో చదువుతోపాటు ఆటలు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని వివరించి మాట్లాడారు.తదుపరి ఈ స్పోర్ట్స్ మీట్ జరిగిన రెండు రోజులలో పిల్లలందరూ చక్కగా పాల్గొన్నారు. అనంతపురంలో మూడు బ్రాంచులుగా ఉన్న: సాయి నగర్, మారుతి నగర్ మరియు వడియం పేట లోని విద్యార్థులు పాల్గొన్నారు. వడియంపేట విద్యార్థులు మొదటి స్థానంలో దిగ్విజయంగా నిలిచి, వారు మొత్తం మ్యాచ్ కప్‌ను గెలిచారు.ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిధులందరూ పిల్లలను మెడలు, సర్టిఫికేట్ మరియు కప్ లతో అభినందించారు.

విశాఖపట్నం

మంత్రి నారా లోకేష్, ఐసీసీ ఛైర్మన్ జైషా లకు ఘనస్వాగతం వైజాగ్ ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)

మహిళా ప్రపంచకప్ మ్యాచ్‌లలో భాగంగా ఆదివారం వైజాగ్ ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో జరిగిన భారత–ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ మ్యాచ్ సందర్భంగా, గ్రౌండ్‌లో మిథాలీ రాజ్ పేరు, రావి కల్పనా పేరుతో ఏర్పాటు చేసిన గ్యాలరీలు, గేట్లను విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్, ఐసీసీ ఛైర్మన్ జైషా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) పుష్పగుచ్చం అందించి వారిని ఘనంగా ఆహ్వానించారు. ఆవిష్కరణ కార్యక్రమం అనంతరం, స్టేడియంలో చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలను మంత్రి నారా లోకేష్, ఐసీసీ ఛైర్మన్ జైషా లకు ఎంపీ కేశినేని శివనాథ్, ఏసీఏ సెక్రటరీ సానా సతీష్ బాబు వివరించారు. తర్వాత మంత్రి, ఐసీసీ ఛైర్మన్, ఏసీఏ అధ్యక్షుడు తదితరులు కలిసి భారత్–ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ మ్యాచ్‌ను వీక్షించారు. ఈ కార్యక్రమంలో దండమూడి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు బండారు నరసింహారావు, సంయుక్త కార్యదర్శి బి. విజయ్ కుమార్, కౌన్సిలర్ దంతు గౌర్ విష్ణు తేజ్, ఇండియన్ క్రికెటర్స్ అసోసియేషన్ ప్రతినిధి వి. చాముండేశ్వరనాథ్ పాల్గొన్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

బాబోయ్…ఎమ్మార్వో…. అంటున్న విఆర్వో లు….?

అమలాపురం, అక్టోబరు 11 (పున్నమి ప్రతినిధి) డా. బి.ఆర్ . అంబేద్కర్ కోనసీమ జిజిల్లా కాట్రేనికోన రెవెన్యూ యంత్రాంగం జిల్లాలో వెనకబడి ఉండడంతో స్థానికంగా పనిచేసే అధికారులకు రాత్రి 10:00 గంటల సమావేశం ఏర్పాటు చేసి చుక్కలు చూపిస్తున్నారని స్థానిక విఆర్వోలు వాపోతున్నట్లు తెలుస్తుంది స్థానిక రెవిన్యూ కార్యాలయంలో మీటింగ్ ఏర్పాటు చేసి వారికి చుక్కలు చూపించినట్లు తెలిసింది. అనుభవం లేకపోవడం వల్లే ఇంత సమయం వరకు పనిచేయిస్తున్నట్లు స్థానికంగా కొందరు బహిరంగ విమర్శిస్తున్నారు స్థానికంగా మండల రెవెన్యూ యంత్రాంగం అనుభవం లేని అధికారులు కంప్యూటర్ పై అవగాహన లేని అధికారులు ఉండడంవల్లే మండల రెవెన్యూ జిల్లాలోని వెనకంజు లో ఉందని తెలుస్తుంది స్థానికంగా వచ్చిన ఎమ్మార్వో అనుభవం ఉన్న అధికారులను కావాలనే బదిలీ చేయించినట్లు మండలంలో పలువురు బహిరంగంగా విమర్శిస్తున్నారు అధికారులను స్థానిక రెవిన్యూ అధికారి పని చేయించుకోకుండా వారిపై విరుచుకుపడుతుంది అని కొందరు వీఆర్వోలు ఆరోపిస్తున్నారు 10 గంటల వరకు సమావేశ ఏర్పాటు చాలా ఇబ్బంది కీ గురి చేస్తున్నట్లు వారు ఓ పోతున్నారు… విఆర్వోలు ఉన్నత అధికారి ప్రవర్తన మార్చుకోకుంటే వ్యతిరేకించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది త్వరలోనే ఈమెపై ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించినట్లు తెలిసింది ప్రస్తుతం పని చేసే విఆర్వోలు అనుభవం ఉన్న కంప్యూటర్ పై అవగాహన లేకపోవడమే వీరికి శాపంగా మారింది అని వారు వాపోయారు ఇప్పటికైనా ఉన్నత అధికారి ప్రవర్తన మార్చుకుని మండలంలో పెండింగ్లో ఉన్న దరఖాస్తులు పరిశించాలని కోరుకుంటున్నారు

అనకాపల్లి

నర్సీపట్నం పట్టణ పోలీస్ స్టేషన్‌లో రౌడీషీటర్లకు కౌన్సెలింగ్

అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఐపీఎస్, నర్సీపట్నం సబ్‌ డివిజన్ డీఎస్పీ పి. శ్రీనివాసరావు ఆదేశాల మేరకు, నర్సీపట్నం పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీషీటర్లకు ఆదివారం కౌన్సెలింగ్ నిర్వహించబడింది ఈ సందర్భంగా సర్కిల్ ఇన్‌స్పెక్టర్ గోవింద్ రావు మాట్లాడుతూ రౌడీషీటర్లు తమ జీవన విధానంలో మార్పు తీసుకురావాలని, ఎటువంటి చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడకుండా సమాజంలో మంచి పౌరులుగా మారాలని సూచించారు. తప్పుడు మార్గాల్లో నడిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన ఇన్‌స్పెక్టర్, పోలీసు శాఖ తరఫున రౌడీషీటర్లను సత్సంప్రదాయాల వైపు నడిపించే కృషి కొనసాగుతుందని తెలిపారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎపి ఎన్జీజివో అడహక్ కమిటీ నూతన చైర్మన్ గా మాధవరపు

అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎపి ఎన్జీజివో అడహక్ కమిటీ నూతన చైర్మన్ గా మాధవరపు అమలాపురం, అక్టోబరు 11 (తూర్పు ఉదయం విలేఖరి) : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణం శ్రీ సత్యసాయి కళ్యాణ మండపంలో జరిగిన సమావేశంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా ఏపీ ఎన్జీజీవో అసోసియేషన్ అడహాక్ కమిటీ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. ఏపీ ఎన్జీజి జి వో రాష్ట్ర అధ్యక్షులు ఆలపర్తి విద్యాసాగర్, రాష్ట్ర కార్యదర్శి డివి రమణ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వరరావు, కార్యదర్శి పేపకాయల వెంకటకృష్ణ, ఎన్జీజివో కార్యవర్గ సభ్యులు మరియు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక, పెన్షనర్ల సంఘాల సమక్షంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఏపీ ఎన్జీజివో అసోసియేషన్ అడహాక్ కమిటీ నూతన చైర్మన్ గా అమలాపురం డిఎం అండ్ హెచ్ ఓ కార్యాలయం నందు డిప్యూటీ పారామెడికల్ ఆఫీసర్ గా పని చేస్తున్న మాధవరపు వెంకటేశ్వర్లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. కాగా మాధవరపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారామెడికల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జాయింట్ యాక్షన్ కమిటీ ఉపాధ్యక్షులుగా పనిచేస్తున్నారు. అంతేకాకుండా ఆయనకు గత 20సంవత్సరాలు గా రామచంద్రపురం తాలూకా యూనిట్ అధ్యక్షుడిగా పనిచేసిన అపార అనుభవం ఉంది. అలాగే కన్వీనర్ గా.. వాటర్స్ రిసోర్స్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న గుత్తుల వెంకటేశ్వరావును ఎన్నుకోవడం జరిగింది. పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్, జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న సురేష్ సింగ్ ఫైనాన్స్ అసిస్టెంట్ గా ఎన్నికయ్యారు. వీరితోపాటు ఇ. యేసు బాబుని కో చైర్మన్ గాను, బి.రవి, సిహెచ్ చిట్టిబాబు, రూతమ్మ లను సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ త్వరలో జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆరు యూనిట్లకు ఎలక్షన్ జరిపించే పటిష్టమైన జిల్లా కార్యవర్గాన్ని సైతం ఏర్పాటు చేసుకుని ఉద్యోగుల సమస్యల పట్ల రాజీలేని పోరాటం చేస్తామని తెలిపారు. పెండింగ్ లో ఉన్న పిఆర్సి కమిషన్ ఏర్పాటు, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, సచివాలయ ఉద్యోగుల నేషనల్ ఇంక్రిమెంట్స్ కోసం, ప్రభుత్వం నుంచి రావలసిన 5 డిఏ బకాయిలు, ప్రభుత్వం ఉద్యోగులకు చెల్లించవలసిన సుమారు 30 వేల కోట్ల రూపాయలను వెంటనే చెల్లించాలని, తదితర సమస్యలపై రాష్ట్ర సంఘంతో కలిసి భవిష్యత్తు పోరాట కార్యక్రమాలను రూపొందించి ప్రభుత్వంపై రాజీలేని పోరాటం చేస్తామని ఆయన తెలియజేశారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి

అమలాపురం , అక్టోబరు 12 ( పున్నమి ప్రతినిధి) : అమలాపురం రూరల్ మండలం భట్నవిల్లి గ్రామంలో గ్రామ కమిటి అధ్యక్షుడు మండలిక సుబ్రహ్మణ్యం శర్మ ప్రధాన కార్యదర్శి నామాడి తారక్ ఆధ్వర్యంలో గ్రామ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయటం జరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత నియోజక వర్గానికి ఎమ్మెల్యే అయితా బత్తుల ఆనందరావు చేసిన అభివృద్ధి గురించి ప్రజలకు వివరించడం అలాగే కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించడం జరిగింది. అలాగే ఇందిరమ్మ కాలానికి సంబంధించిన పట్టాలు కూడా త్వరలోనే ఇప్పిస్తామని, గత ప్రభుత్వంలో చాలా మందికి ఇళ్ల స్థలములు ప్రక్క ఊరులో ఇచ్చిన కారణంగా వారు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారని అని ఆ సమస్యను గ్రామ కమిటీ ద్వారా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి సమస్యలు అన్ని ఎమ్మెల్యే దృష్టిలో పెట్టి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని ఎవరికైతే ఇళ్ల స్థలములులేవో అర్హులైన వారికి ఇళ్ల స్థలములు ఇప్పిస్తామని,అర్హులైన వారు ఎవరు ఉన్నారో వారందరికీ త్వరలోనే పెన్షన్లు ఇప్పిస్తామని వారికి వివరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐ టీడీపీ కార్యదర్శి కాట్రు శ్రీనుబాబు, ర్యాలీలోవరాజు, సరిపల్లి సుబ్బరాజు, బులుసు వి ఎస్ శర్మ, కాట్రు శ్రీనివాస్, మెట్టి ప్రసాద్, పండు సత్యనారాయణ, నేదునూరి బాలయ్య,దునబోయినా ప్రసాద్, పుణ్యమంతుల రమేష్, బొక్క శివన్నారాయ, దాకారపు బాలాజీ,కటికిదల వెంకట్రావు, దాకారపు సుందరావు, గిడ్ల చంటి, పెంట సుబ్రహ్మణ్యం, తోత్తరముడి సత్యనారాయణ, నామాడి శివ ప్రసాద్, కాట్రు వెంకటేశ్వరావు, మల్లవరపు రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

బాలుకు లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డు:

బాలుకు లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డు: ————————– తొట్టంబేడు: మండలం లో దిగువ సాంబయ్య పాళెం ఫౌండేషన్ స్కూల్ లో పని చేస్తున్న ఉపాధ్యాయులు, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కయ్యూరు బాలసుబ్రహ్మణ్యం జీవిత సాఫల్య పురస్కారం తిరుపతి మహతి కళాక్షేత్రం లో వే ఫౌండేషన్ 12 వ వార్షికోత్సవం సందర్భంగా అందుకున్నారు.విద్య,కళలు, సాహిత్యం మొదలగు రంగాల్లో అందిస్తున్న విశిష్ట సేవలకు గాను ఈ అవార్డు బాలుకి ఇచ్చినట్టు వే ఫౌండేషన్ అధ్యక్షుడు పైడి అంకయ్య అన్నారు. ఈ సందర్భంగా బాలు మాట్లాడుతూ ఈ సంవత్సరం రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రావడం,మహా రాష్ట్ర తెలుగు వాచకం లో పాఠ్యాంశంగా నా గేయం రావడం, ఇప్పుడు జీవిత సాఫల్య పురస్కారం లభించండం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీరాములు, మునిరత్నం,రెడ్డి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

జనసేన నాయకులు పేట బ్రదర్స్ మిత్రబృందం ఆధ్వర్యంలో 53 మంది చిన్నపిల్లలకు దుస్తులు పంపిణీ*

*జనసేన నాయకులు పేట బ్రదర్స్ మిత్రబృందం ఆధ్వర్యంలో 53 మంది చిన్నపిల్లలకు దుస్తులు పంపిణీ* జనసేన పర్యటనలో భాగంగా తొట్టంబేడు మండలం పొయ్య పంచాయతీలోని ఎస్టీ కాలనీలో అక్కడున్న గిరిజనులు 50 మందికి పైగా చిన్నపిల్లలు ఉన్నారని వాళ్లకి దుస్తులు ఏర్పాటు చేస్తే బాగుంటుందని అక్కడ ప్రజలు కోరుకోవడం జరిగింది , ఈరోజు వాళ్ల కోసం స్వయంగా కాలనీకి వెళ్లి అక్కడున్న పిల్లలకు దుస్తులు ఏర్పాటు చేయడం జరిగింది, పిల్లలు మరియు తల్లిదండ్రులు చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పేట చంద్రశేఖర్, పేట చిరంజీవి, గంధం శ్రీను, మనీ, డాక్టర్ నక్క ప్రసాద్, ఆరిఫ్, మహేష్, ప్రదీప్ కుమార్, నవీన్, మహేష్, దినేష్, కళ్లిపూడి వెంకటేష్, రమేష్ బాబు, ముని చంద్ర, రాజా, గణేష్, ముని కుమార్ తదితరులు పాల్గొన్నారు

Blog

AI సాధనాలకు డిమాండ్ పెరుగుతున్నందున, 2026 లో ANTHROPIC భారతదేశంలో తన మొదటి కార్యాలయాన్ని ప్రారంభించనుంది

ANTHROPIC, Alphabet’s Google (GOOGL.O) మద్దతు ఉన్న కృత్రిమ మేధస్సుతన స్టార్ట్ అప్ ను భారత్ లో ప్రారంభించనుంది ., కొత్త ట్యాబ్‌ను తెరుస్తుందిమరియు Amazon.com (AMZN.O), కొత్త ట్యాబ్‌ను తెరుస్తుందిదేశంలో AI సాధనాల పట్ల పెరుగుతున్న ఆసక్తిని ఉపయోగించుకునే లక్ష్యంతో, వచ్చే ఏడాది భారతదేశంలో తన మొదటి కార్యాలయాన్ని ప్రారంభిస్తామని మంగళవారం తెలిపింది. భారతదేశంలో AI స్వీకరణ వేగవంతం కావడంతో, పెరుగుతున్న ఎంటర్‌ప్రైజ్ టెక్ వ్యయం, పెరుగుతున్న నైపుణ్యం కలిగిన ప్రతిభ మరియు పెరుగుతున్న పెట్టుబడిదారుల ఆసక్తి కారణంగా ఈ చర్య వచ్చింది దాదాపు ఒక బిలియన్ ఇంటర్నెట్ వినియోగదారులకు నిలయమైన భారతదేశం, ప్రపంచ AI ఆటగాళ్లకు ప్రధాన యుద్ధభూమిగా మారుతోంది. ఆ ఆసియా దేశం దాని చాట్‌బాట్ క్లాడ్ కోసం ఆంత్రోపిక్ యొక్క రెండవ అతిపెద్ద వినియోగదారు మార్కెట్‌గా అవతరించింది, ఇది OpenAI యొక్క ChatGPTతో పోటీపడుతుంది మరియు దాని బలమైన కోడింగ్ సామర్థ్యాలకు ప్రసిద్ధి చెందింది. ఆంత్రోపిక్ ప్రస్తుతం భారతదేశంలో క్లాడ్ యొక్క ఉచిత మరియు చెల్లింపు శ్రేణులను అందిస్తోంది కానీ ఇంకా స్థానిక కరెన్సీ ధరలను ప్రవేశపెట్టలేదు. 183 బిలియన్ డాలర్ల విలువైన ఈ కంపెనీ సహ వ్యవస్థాపకుడు మరియు CEO డారియో అమోడీ ఈ వారం భారతదేశాన్ని సందర్శించి ప్రభుత్వ అధికారులు మరియు కార్పొరేట్ భాగస్వాములను కలవనున్నట్లు తెలిపింది. భారతదేశ సాంకేతిక కేంద్రంగా విస్తృతంగా గుర్తింపు పొందిన బెంగళూరులో ఈ కొత్త కార్యాలయం ఏర్పాటు చేయబడుతుందని, 2026 ప్రారంభంలో కార్యకలాపాలు ప్రారంభమవుతాయని ఆంత్రోపిక్ తెలిపింది. టోక్యో తర్వాత ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఈ స్థానం తన రెండవ కార్యాలయంగా పనిచేస్తుందని అది జోడించింది. మైక్రోసాఫ్ట్ (MSFT.O) మద్దతుతో OpenAI, కొత్త ట్యాబ్‌ను తెరుస్తుంది, 2025 లో భారతదేశంలో చట్టపరమైన సంస్థగా అధికారికంగా నమోదు చేయబడింది మరియు ఈ సంవత్సరం చివర్లో న్యూఢిల్లీలో తన మొదటి భారతదేశ కార్యాలయాన్ని ప్రారంభించాలని యోచిస్తోంది. భారతదేశంలో OpenAI మరియు Anthropic లు Google యొక్క Gemini మరియు AI స్టార్టప్ Perplexity వంటి ప్రత్యర్థుల నుండి బలమైన పోటీని ఎదుర్కొంటున్నాయి, ఈ రెండూ మార్కెట్‌లోని చాలా మంది వినియోగదారులకు వారి అధునాతన ప్రణాళికలను ఉచితంగా అందించే ఆఫర్‌లను ప్రారంభించాయి. గత నెలలో, ఆంత్రోపిక్ యునైటెడ్ స్టేట్స్ వెలుపల దాని క్లాడ్ AI మోడళ్లకు పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి దాని అంతర్జాతీయ శ్రామిక శక్తిని మూడు రెట్లు పెంచే ప్రణాళికలను ప్రకటించింది

భద్రాద్రి కొత్తగూడెం

ఆయిల్ ఫెడ్ చరిత్ర లోనే అప్పారావు పేట రికార్డు

#ఆయిల్ ఫెడ్ చరిత్రలోనే అప్పారావు పేట అయిల్ పామ్ ప్రాసెసింగ్ మిల్ రికార్డ్ సాధించడం అభినందనియం:మంత్రి తుమ్మల,అయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవ రెడ్డి!! భద్రాద్రి కొత్త గూడెం: జిల్లా లోని అప్పారావు పేట ఆయిల్ పామ్ కర్మాగారం ను రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు గారు సందర్శించి కేక్ కట్ చేసారు. ఈ సందర్బంగా మంత్రి గారు మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రము లో ఆయిల్ పామ్ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లికించదగ్గ రోజు అని రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు,తెలంగాణ ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవ రెడ్డి అన్నారు. మూడు లక్షల టన్నుల ఆయిల్ పామ్ గెలలను ఆయిల్ ఇయర్( నవంబర్ నుండి అక్టోబర్ వరకు)పూర్తి కాక మునుపే ప్రాసెస్ చేసి లక్ష్యాన్ని ఛేదించి సరికొత్త రికార్డును సాధించిన రోజుసందర్బంగా ఈ లక్ష్య సాధనలో కృషి చేసిన సిబ్బంది కి మంత్రి అభినందనలుతెలియజేసారు. ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవ రెడ్డి మాట్లాడుతూ గౌరవ వ్యవసాయ శాఖ మాత్యులు శ్రీ తుమ్మల నాగేశ్వర్ రావు గారికే ఈ రికార్డ్ దక్కుతుందని,సరైన నిర్ణయాలతో ఆయిల్ ఫెడ్ ని ప్రగతి పథంలో నడిపిస్తూ రైతు ను రాజును చేసేందుకు అహర్నిశలు కష్టపడుతున్న మన మంత్రి వర్యులు తుమ్మల గారికి చైర్మన్ శ్రీ జంగా రాఘవ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం లో MLA జారే ఆదినారాయణ గారు, కలెక్టర్ గారు,ED శ్రీ ప్రశాంత్ కుమార్,OSD డాక్టర్ అడపా కిరణ్ కుమార్,GM సుధాకర్ రెడ్డి మేనేజర్(ఫ్యాక్టరీస్)శ్రీ N. శ్రీకాంత్ ఇతర ఆయిల్ ఫెడ్ అధికారులు,పెద్ద సంఖ్య లో ఆయిల్ పామ్ రైతులు పాల్గొన్నారు……

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.