Wednesday, 29 April 2026

Blog

E-పేపర్

రాష్ట్రస్థాయి టైక్వాండో పోటీల్లో బంగారు పతకం సాధించిన కోడూరు విద్యార్థి..

ఈ నెల 10,11,12 వ తేదిలలో బాపట్ల జిల్లా పెటూరు లో 69 వ SGF (School Game federation) రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించారు . ఇందులో కడప జిల్లా రైల్వే కోడూరు sk sports Academy కి చెందిన T. sohitha U-14 38 + విభాగంలో బంగారు పథకం సాధించి నంవంబర్ లో జరిగే జాతియ స్థాయి పోటిలకు ఎంపిక అయిందని కోచ్ ఎస్కే మౌల తెలిపారు.

ఆంధ్రప్రదేశ్

ఏపీ ఎంబీసీ లో టెండర్లు పిలవకుండా ఎవరికి మేలు చేస్తున్నట్టు సిఐటియు జిల్లా నాయకులు

ఓబులవారిపల్లె అక్టోబర్ పున్నమి ప్రతినిధి ఏపీఎండీసీ సంస్థ నందు A గ్రేడ్ B గ్రేడ్ మరియు C&D గ్రేడ్ ఖనిజాలకు సుమారు సంవత్సర కాలంగా టెండర్లు పిలవకుండా ఎవరికి మేలు చేస్తున్నారని ఏపీఎండీసీ యాజమాన్యం పై మండిపడినసీఐటీయూ జిల్లా నాయకులు ఈరోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేసి సీఐటీయూ అన్నమయ్య జిల్లా అధ్యక్ష&కార్యదర్శులు సిహెచ్ చంద్రశేఖర్, రామాంజినేయులు మాట్లాడుతూ ఏపీఎండీసీ సంస్థ స్థాపించి సుమారు 50 సంవత్సరములలో ఏపీఎండీసీ సంస్థలో ఇంత అవినీతి అరాచక పాలన ఎప్పుడూ చూడలేదని సీఐటీయూ నాయకులు మండిపడ్డారు,A గ్రేడ్ బి గ్రేడ్ C&D గ్రేడ్ ఖనిజాలకు టెండర్ పిలిచి ఆ టెండర్ ను రద్దు చేసి తిరిగి టెండర్లు సుమారు సంవత్సరకాలం అవుతున్నా పిలవక పోవడంలో అంతర్యం ఏమిటో,ఏపీఎండీసీ యాజమాన్యం చెప్పాలని వారు డిమాండ్ చేశారు,దీనివలన సంస్థకు కోట్లాది రూపాయలు గండి పడుతుంటే కూటమి ప్రభుత్వం చోధ్యం చూస్తున్నారని అన్నారు, గతంలో C&D గ్రేడ్ బల్క్ టెండర్ ను రేట్ తగ్గించి ఒక బయ్యర్ కు కట్టపెట్టిన దానివలన సంస్థకు కోట్లాది రూపాయలు గండి పడింది, దీని వలన కొంత మంది బయ్యర్స్ మాకు కూడా ఖనిజం రేట్ తగ్గించి ఇవ్వాలని కోర్ట్ ను ఆశ్రయించారు, ఇప్పుడు ఏపీఎండీసీ టెండర్లు పిలిస్తే సంస్థ చేసిన తప్పు బయటపడుతుందని టెండర్స్ పిలవకుండా సంస్థ మనుగడే లేకుండా చేస్తున్నారని అన్నారుఏపీఎండీసీ యాజమాన్యం వారు చేస్తున్న తప్పుకు సంస్థ నిర్వర్యం అవుతుందనివీటిని మేము లెక్కళ్ళతో సహా చెబుతున్నామని ఇది చూసైనా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని అన్నారుఏపీఎండీసీ యాజమాన్యం వారు చేస్తున్న సంస్థ లూటీలో ఒక గ్రేడ్ ఉదాహరణ గాA గ్రేడ్ ఖనిజం ఒక టన్ను విలువ వివరాలు :*గత టెండర్ లో బేసిక్ ప్రైస్:7226*సీనరీజస్ చార్జెస్ :480 రూపాయలు*సీనరీజస్ మీద డియంయఫ్ చార్జెస్ 30%*సీనరీజస్ మీద 2% మెరిట్ చార్జెస్*చెస్ చార్జెస్ 20 రూపాయలు*లోడింగ్ చార్జెస్ 25 రూపాయలు*వీటి అన్నిటికి 5 % GST కలిపి = ఒక టన్ను A గ్రేడ్ ఖనిజం 8309 రూపాయలు గత టెండర్ లో ఉన్నింది అయితే ఏపీఎండీసీ యాజమాన్యం వారు టెండర్లు అయిపోయి సుమారు ఒక సంవత్సరం పైన అవుతున్నా ఇంత వరకు టెండర్ పిలవకుండా గత టెండర్ లో వేసిన అమౌంట్ కు కేవలం 10 % మాత్రమే పెంచి ఈ ఖనిజాన్ని బయ్యర్స్ కు ఇస్తున్నారు ఇందులోనే అసలైన మెలిక ఉంది టెండర్ పిలిస్తే మూడు గ్రేడ్లకు ఖనిజానికి మంచి డిమాండ్ ఉంది కాబట్టి రేట్ రెండు ఇంతలు అవుతుందని వారు గతంలో చేసిన మోసం బయటకు వస్తుందని కొంతమంది బడా పారిశ్రామిక వేత్తలు ఈ గ్రేడ్ ఖనిజంలకు టెండర్ వెయ్యనీయకుండా అధికారులను కొనేసారాని వారు ఆరోపించారు, బయ్యర్స్ వద్ద వసూలు చేసిన చెస్ అమౌంట్ ను యాజమాన్యం ఎవరికి చెల్లెస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు,ఇంత అవినీతి, అక్రమాలు ఏపీఎండీసీ లో జరుగుతుంటే కూటమి ప్రభుత్వం ఏమి చేస్తుందో అర్థం కావటం లేదని అన్నారు,ప్రభుత్వ పెద్దలు కూడా ఇందులో మామూళ్ళ మత్తులో ఉన్నారని అందుకే పట్టించుకోలేదని అన్నారు, ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని జరిగిన నష్టానికి కారణమైన వారి పైన చర్యలు తీసుకుని వెంటనే టెండర్ ను పిలవాలని డిమాండ్ చేశారు, లేని పక్షంలో కలసి వచ్చే వారిని కలుపుకుని బారీ ఎత్తున పోరాటాలకు దిగుతామని వారు ప్రభుత్వాన్ని, యాజమాన్యం ను హెచ్చరించారు

E-పేపర్

జీఎస్టీ తగ్గింపు వల్ల నిరుపేద, మధ్యతరగతి వర్గాల వారికి ఒరిగిందేమీ లేదు… కామ్రేడ్ పండు గోలమణి

జీఎస్టీ తగ్గింపు వల్ల నిరుపేద, మధ్యతరగతి వర్గాల వారికి ఒరిగిందేమీ లేదు… కామ్రేడ్ పండు గోల మణి రైల్వే కోడూరు పట్టణం, భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం బికేఎంయు అన్నమయ్య జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ పండుగోల మణి, భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రైల్వే కోడూరు మండల కార్యదర్శి కామ్రేడ్ దార్ల రాజశేఖర్, ఏఐవైఎఫ్ మండల నాయకులు ఫైజర్ విలేకరుల సమావేశం ఏర్పాటుచేసిన సందర్భంగా కామ్రేడ్ పండు గోల మణి మాట్లాడుతూ, రాష్ట్రంలో బిజెపి, తెలుగుదేశం, జనసేన పార్టీలు కలిసి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన 18 నెలలు అధికారంలోకి వచ్చిన కాలంలో జిఎస్టి తగ్గింపు అమలుపరచడం న్యాయమేనని దీనిని అభినందిస్తున్నా విషయమేనని, కానీ ఈ జీఎస్టీ తగ్గింపు వల్ల బడుగు, బలహీన వర్గాల కు చెందిన పేద, మధ్య తరగతి వాళ్లకు ఒరిగిందేమీ లేదని పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలకు చెందిన టాటా, బిల్లా, అంబానీల కు చెందిన వారి కోసమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో బిజెపి ప్రభుత్వం జీఎస్టీ ని తగ్గించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు, వ్యవసాయ, విద్య, వ్యాపార రంగాలకు చెందినవారికి రాష్ట్రంలో సూపర్ గిఫ్ట్ పేరుతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మోసం చేసిందని ఆయన ధ్వజమెత్తారు, అంతేకాకుండా నిరుపేదలకు చెందిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కూలీలకు ఉపాధి పనులు చూపించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయి అన్నారు, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులను పూర్తిగా ఈ రాష్ట్రంలో నీరు కార్చే పద్ధతుల్లో వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి ఉద్యమాలతో తగిన బుద్ధి చెప్తామన్నారు, నిరుపేదలు అనునిత్యం ప్రతిరోజు వాడుతున్న డీజల్, పెట్రోల్, వంటగ్యాసుతోపాటు, నిత్యవసర సరుకుల ధరలపై జిఎస్టి తగ్గిస్తే నిరుపేదలకు ఉపయోగపడుతుందని ఆయన గుర్తు చేశారు , కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు తగ్గించిన జిఎస్టి కేవలం సాఫ్ట్వేర్ కంపెనీల వారికి ఉపయోగపడుతుంద ని దీనివల్ల నిరుపేదలకు ఒరిగిందేమీ లేదని, జీఎస్టీ తగ్గింపు పై సంకలు తట్టుకుంటున్న ఎన్డీఏ కూటమి మంత్రులు, ఎమ్మెల్యేలకు తగిన బుద్ధి చెప్పే రీతిలో ఉద్యమాలకు శ్రీకారం చుడతామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను వారు హెచ్చరించారు.

భద్రాద్రి కొత్తగూడెం

భద్రాద్రి లో భారీగా గంజాయి పట్టివేత

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, సుజాతనగర్ మండలం ఈరోజు ధన్వంతరి కాలేజ్ పక్కన అన్నపూర్ణ బేకరీ దగ్గర కంటైనర్ లో రెండు, మూడు క్వింటలు భారీ ఎత్తున గంజాయి దొరకడం జరిగింది. భద్రాచలం నుండి ఖమ్మం వైపుగా వెళ్తున్న ఒక కంటైనర్ లో రహస్యంగా గంజాయి ని తరలిస్తున్న విషయాన్ని పసిగట్టిన పోలీస్ సిబ్బంది గంజాయి ముఠాని చాలా చాకచక్యంగా వ్యవహరించి, కంటైనర్ కి అడ్డుపడి పట్టుకున్నారు. గంజాయి ని స్వాదినం చేసుకుని, కంటైనర్ ని స్టేషన్ కి తరలించడం జరిగింది. గంజాయి రెండు, మూడు క్వింటాలు ఉంటుందని సమాచారం.

విశాఖపట్నం

విశాఖ రుషికొండ భవనాలపై ప్రజాభిప్రాయ సేకరణ

విశాఖ అక్టోబర్ (పున్నమి ప్రతినిధి) విశాఖ రుషికొండ భవనాలపై ప్రజాభిప్రాయ సేకరణ rushikonda.partners@aptdc.ap.gov.in మెయిల్‌కు.. ప్రజల అభిప్రాయాలు తెలియజేయాలని కోరిన అధికారులు ఈనెల 17న టూరిజం నిర్వాహకులతో సమావేశం కొండను అనుకుని ఉన్న 9 ఎకరాల వినియోగంపైనా చర్చ

విశాఖపట్నం

విశాఖను ఐటీ హబ్‌గా తీర్చిదిద్దుతున్న మంత్రి లోకేష్‌కు కృతజ్ఞతలు తెలిపిన పట్టాభిరామ్

విశాఖపట్నం, అక్టోబర్ (పున్నమి ప్రతినిధి) రాష్ట్ర ఆర్థిక రాజధాని విశాఖపట్నంను ఐటీ హబ్‌గా తీర్చిదిద్దడంలో చూపుతున్న ఆసక్తికి ధన్యవాదాలు తెలుపుతున్నామని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, టీటీడీ లోకల్ అడ్వైజరీ కమిటీ ఛైర్మన్ చోడే వెంకట పట్టాభిరామ్ తెలిపారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడానికి నగరానికి విచ్చేసిన ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేష్ను పట్టాభిరామ్ విమానాశ్రయంలో కలసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ > “దేశ ఆర్థిక రాజధాని ముంబై తరహాలో విశాఖను అభివృద్ధి చేయడమే మా కూటమి ప్రభుత్వ లక్ష్యం. ఉత్తరాంధ్రలో ప్రారంభించిన ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత ఇక్కడి యువతకు విస్తృతమైన ఉపాధి అవకాశాలు లభిస్తాయి,” అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

విశాఖపట్నం

ఆత్మస్థైర్యం తో ఉండండి – క్రీడా స్ఫూర్తితో లక్ష్యం సాధించండి

విశాఖపట్నం, అక్టోబర్ 12 (పున్నమి ప్రతినిధి) గెలుపు–ఓటములు ఒకేలా చూడండి, కుటుంబం–గురువుల నమ్మకాన్ని నిలబెట్టండి : పోలీస్ కమిషనర్ డా. శంఖబ్రత బాగ్చి క్రీడా స్ఫూర్తి, ఆత్మస్థైర్యం, పట్టుదలతో ముందుకు సాగితే ఏ లక్ష్యాన్నైనా సాధించవచ్చని పోలీస్ కమిషనర్ డా. శంఖబ్రత బాగ్చి తెలిపారు. చిత్తశుద్ధితో క్రీడాకారులుగా ఎదిగి తల్లిదండ్రులు, గురువులు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టాలని సూచించారు. విశాఖలోని శ్రీ మన్మధరావు మెమోరియల్ క్లబ్ ఆధ్వర్యంలో అక్టోబర్ 10న ప్రారంభమైన బాస్కెట్‌బాల్ టోర్నమెంట్‌ ముగింపు కార్యక్రమంలో కమిషనర్ డా. శంఖబ్రత బాగ్చి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ టోర్నమెంట్‌లో ఓర్ప్రిడ్జ్ ఇంటర్నేషనల్ గర్ల్స్ టీమ్ విజేతగా నిలవగా, సెయింట్ అల్లోయిసిస్ స్కూల్ విద్యార్థులు రన్నరప్ ట్రోఫీ అందుకున్నారు. అదేవిధంగా స్టీల్ ప్లాంట్ స్కూల్ విద్యార్థుల టీమ్, తిమ్మాపురం విజ్ఞాన్ విద్యార్థులు ప్రత్యేక ట్రోఫీలు పొందారు. కార్యక్రమంలో డా. బాగ్చి మాట్లాడుతూ, > “బాస్కెట్‌బాల్ క్రీడ గొప్పది. భారతదేశంలో ఈ క్రీడను టాప్ స్థాయికి తీసుకెళ్లే దిశగా కృషి చేయాలి,” అని క్రీడాకారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఐ టెక్నాలజీతో దేశంలోనే మొదటిసారిగా పాట సృష్టించి సంచలనం సృష్టించిన అడ్డూరి సునీల్ చరణ్, ప్రభుత్వ పి.ఇ.టి లలిత్ కుమార్, డా. రవి, డా. కళ్యాణ్ చక్రవర్తి, క్లబ్ అధ్యక్షుడు రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. గత 19 ఏళ్లుగా ఉచితంగా బాస్కెట్‌బాల్ శిక్షణ అందిస్తున్న అన్నెపు రామచందర్ మాట్లాడుతూ, తాను అందిస్తున్న ఉచిత శిక్షణకు ఆంధ్రా యూనివర్సిటీ క్రీడా విభాగం అందిస్తున్న ప్రోత్సాహాన్ని గుర్తుచేశారు. పి.ఇ.టి డైరెక్టర్ ఆచార్య ఎన్. విజయమోహన్, డా. ఎ. పల్లవి (ఫిజికల్ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ సైన్స్ విభాగాధిపతి) సహకారాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. కార్యక్రమాన్ని బి.ఎస్. చంద్రశేఖర్ మాస్టర్ ఆఫ్ సెర్మనీగా నిర్వహించారు. చెలమరెడ్డి మహేష్, చంద్రశేఖర్, సూరిబాబు పొట్నూరు, శివకుమార్, బోర వెంకటేశ్వరరెడ్డి తదితరులు టోర్నమెంట్ విజయవంతం కోసం కృషి చేశారు.

విశాఖపట్నం

హరే కృష్ణ మూవ్మెంట్ ఆధ్వర్యంలో దామోదర దీపోత్సవం వైభవంగా ప్రారంభం

విశాఖపట్నం, అక్టోబర్ (పున్నమి ప్రతినిధి) వైకుంఠం, గంభీరం ఐఐఎం రోడ్‌లో నెలరోజులపాటు వేడుకలు విశాఖపట్నం హరే కృష్ణ మూవ్మెంట్ ఆధ్వర్యంలో దామోదర దీపోత్సవం ఘనంగా ప్రారంభమైంది. అక్టోబర్ 7 నుండి నవంబర్ 5 వరకు నెలరోజులపాటు జరగనున్న ఈ పూజా కార్యక్రమాలు ప్రతి రోజు సాయంత్రం 6 గంటలకు శ్రీ శ్రీ రాధా మధన మోహన్ మందిరం, హరే కృష్ణ వైకుంఠం, ఐఐఎం రోడ్, గంభీరం వద్ద జరుగుతున్నాయి. శనివారం ఐదవ రోజు (11-10-2025) అంగరంగ వైభవంగా వేడుకలు నిర్వహించారు. రాధా దామోదరుల విగ్రహాలకు మహిళలు దీపాలంకరణ చేసి, ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించారు. కార్యక్రమంలో ప్రవచనాలు, భజనలు, దామోదర హారతి వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తులను ఆహ్లాదపరిచాయి. భక్తులు శ్రీ దామోదర అష్టకాన్ని లయబద్ధంగా పాడుతూ స్వయంగా నెయ్యి దీపాలతో కృష్ణునికి హారతి సమర్పించారు. సంగీత వాయిద్యాలతో భజన కార్యక్రమం నిర్వహించబడింది. హరే కృష్ణ మూవ్మెంట్ విశాఖపట్నం అధ్యక్షులు డాక్టర్ నిష్క్రించిన భక్త దాస గారు ఈ సందర్భంగా మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ — “దామోదర వ్రతం అత్యంత పవిత్రమైనది. ఈ కాలంలో ప్రతి భక్తుడు రోజూ శ్రీకృష్ణ ఆలయ దర్శనం చేయాలి, నెయ్యి దీపం అర్పించాలి, తులసి పూజ చేయాలి, దాన ధర్మాలు ఆచరించాలి,” అని వివరించారు. అలాగే ఆయన పద్మ పురాణంలో ఉన్న శ్లోకాన్ని ఉటంకిస్తూ — “కార్తీక మాసంలో శ్రీకృష్ణునికి నెయ్యి దీపం అర్పించుట అన్ని దానాలలో శ్రేష్ఠమైనది. ఎవరు హరి ఆలయంలో దీపారాధన చేస్తారో వారు అనేక కల్పముల పాపఫలాల నుండి విముక్తి పొందుతారు,” అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా శ్రీ అంబరీష దాస, హరే కృష్ణ మూవ్మెంట్ విశాఖపట్నం తరఫున మాట్లాడుతూ — “ప్రతి ఒక్కరూ ఈ పవిత్ర దామోదర మాసంలో భగవంతుని భక్తి పారవశ్యములో ఆనందించాలి” అని ఆకాంక్షించారు.

విశాఖపట్నం

ఐసిసి, బిసిసిఐ ప్రతినిధులను ఏసీఏ తరఫున సత్కరించిన మంత్రి నారా లోకేష్, ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్ (చిన్ని)

విశాఖపట్నం, అక్టోబర్ (పున్నమి ప్రతినిధి) మహిళా వరల్డ్‌కప్ క్రికెట్ మ్యాచ్‌లలో భాగంగా విశాఖ ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో జరిగిన ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ సందర్భంగా ఐసిసి, బిసిసిఐ ప్రతినిధులను ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) తరఫున ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్, ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్ (చిన్ని), సెక్రటరీ సానా సతీష్ బాబు పాల్గొన్నారు. మ్యాచ్‌కు ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఐసిసి చైర్మన్ జైషాకు మంత్రి నారా లోకేష్ ఏసీఏ తరఫున జ్ఞాపిక బహుకరించి శాలువా కప్పి సత్కరించారు. అనంతరం ఐసిసి సీఈఓ సంజోగ్ గుప్తాకు కూడా జ్ఞాపికను అందజేశారు. అలాగే బిసిసిఐ ప్రెసిడెంట్ మిథున్ మన్హాస్, సెక్రటరీ దేవజిత్ సైకియా, జాయింట్ సెక్రటరీ ప్రభ్ తేజ్ భాటియా, క్రికెట్ ఆస్ట్రేలియా చైర్మన్ మైక్ బైర్డ్, సీఈఓ తొటాడ్ గ్రీన్బర్గ్లను ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్, సెక్రటరీ సానా సతీష్ బాబు జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా ఐసిసి చైర్మన్ జైషా, బిసిసిఐ ప్రెసిడెంట్ మిథున్ మన్హాస్ మాట్లాడుతూ — విశాఖ స్టేడియంలోని వేదిక, ఏర్పాట్లు, ప్రేక్షకుల ఉత్సాహం అత్యంత ప్రోత్సాహకరంగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. మహిళా క్రికెట్‌ను ప్రోత్సహించే కార్యక్రమంలో పాల్గొన్న ఐసిసి, బిసిసిఐ ప్రతినిధులకు ఏసీఏ తరఫున మంత్రి నారా లోకేష్, అధ్యక్షుడు కేశినేని శివనాథ్, సెక్రటరీ సానా సతీష్ బాబు కృతజ్ఞతలు తెలిపారు.

కామారెడ్డి

మద్యం నిరోధక శాఖ: అక్రమాలకు కేరాఫ్ అడ్రస్!

కామారెడ్డి జిల్లాలో అధికారుల అండతో బెల్ట్ షాపులు – జిల్లాలో విస్తరిస్తున్న మద్యం చీకటి – విలేజ్ కమిటీల మౌనం – ఎక్సైజ్ అధికారుల అండతో మద్యం వ్యాపారం విస్తరణ – దసరా ‘కానుక’గా మద్యం ‘దోపిడీ’ కామారెడ్డి, అక్టోబర్ 12, పున్నమి ప్రతినిధి : కామారెడ్డి జిల్లా: జిల్లాలో మద్యం నిరోధక శాఖ (ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం) అధికారులే అక్రమాల కు, నిబంధనల ఉల్లంఘనలకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారనే సంచలన ఆరోపణలు వెల్లువెత్తు తున్నాయి. చట్టాలను అమలు చేయాల్సిన అధికా రులే చట్ట వ్యతిరేక కార్యకలాపాలను ప్రోత్సహిస్తూ, ఏకంగా మద్యం వ్యాపారంలో ‘భాగస్వామ్యం’ పంచుకుంటున్నారనే విమర్శలు జిల్లా ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. బెల్ట్ షాపులకు అధికారిక ప్రోత్సాహం, కామారెడ్డి జిల్లాలో బెల్ట్ షాపుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోవడానికి ప్రధాన కారణం స్థానిక మద్యం నిరోధక శాఖ అధి కారుల నిర్వాహకమేనని ఆరోపణలు ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా, లైసెన్స్ లేని ప్రాంతాల్లో బెల్ట్ షాపుల నిర్వహణకు అధికారులు పరోక్షంగా అనుమతులు ఇస్తున్నారని, తద్వారా నిబంధన లను ఉల్లంఘిస్తున్నారని తెలుస్తోంది. అక్రమ వ్యాపారాల ద్వారా వచ్చే మామూళ్లకు అలవాటు పడిన అధికారులు, వాటిని అడ్డుకోకుండా ప్రోత్స హిస్తున్నారనేది బహిరంగ రహస్యం, దసరాకు వైన్స్‌ల నుంచి ‘మద్యం దోపిడీ’ తాజాగా, జిల్లాలోని పలు వైన్స్ షాపుల యజమానుల నుంచి దసరా పండుగ సందర్భంగా మద్యం నిరోధక శాఖ అధికా రులు భారీగా మద్యాన్ని ‘తాగిసి’ (బలవంతంగా లేదా అక్రమంగా సేకరించడం) తీసుకున్నారని తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమకు మద్యం కావాలంటూ ఏకంగా మద్యం దుకాణాలనే అధికా రులు ఆశ్రయించడం, వైన్స్ యజమానులు భయం తో వారికి మద్యం ఇవ్వాల్సి రావడం అధికారుల ‘దోపిడీ’ స్వభావాన్ని తెలియజేస్తుంది. ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతూ, తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ అధికారులు పాల్పడుతున్న ఈ చర్యలు జిల్లాలో తీవ్ర విమర్శలకు దారి తీస్తు న్నాయి. మత్తు పదార్థాల కేసుల్లోనూ ‘మధ్యవర్తి త్వం’ మద్యం అక్రమాలే కాకుండా, గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాల కేసుల్లోనూ ఈ అధికారుల పాత్రపై గతంలోనూ ఆరోపణలు వచ్చాయి. మత్తు పదార్థాల విక్రయాల కు సంబంధించి అధికారులు స్వయంగా మధ్యవ ర్తిత్వం వహించడం జిల్లా ప్రజలకు తెలియని విష యం కాదు. అక్రమంగా దొరికిన గంజాయి, ఇతర మత్తు పదార్థాల కేసులను సైతం తుంగలో తొక్కి, నిందితులకు అండగా నిలిచి, వారి నుంచి భారీగా ముడుపులు తీసుకుని వదిలిపెట్టారనే ఆరోపణలు గతంలో చాలాసార్లు వినిపించాయి. చట్టాన్ని పరిర క్షించాల్సిన వారే, నేరాలకు పరోక్షంగా సహకరించ డం విచారకరం.నిరోధక శాఖ అధికారులే అక్రమా లకు అండగా నిలవడం, బెల్ట్ షాపులను ప్రోత్స హించడం, దసరా పేరుతో మద్యం ‘దోపిడీకి’ పాల్ప డడం వంటి చర్యలు జిల్లాలో అరాచక పాలనకు అద్దం పడుతున్నాయి. మత్తు పదార్థాల కేసుల్లో నూ నిర్లక్ష్యం వహిస్తున్న ఈ అధికారుల నిర్వాహ కంపై ఉన్నతాధికారులు తక్షణమే దృష్టి సారించి, సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో జిల్లాలో అక్రమ మద్యం, మత్తు పదార్థాల విక్రయాలు మరింత పెరిగే ప్రమాదం ఉంది. గుడి–బడి పక్కనే బెల్టు షాపులు…! ప్రజల్లో ఆగ్రహం మండల పరిధిలో పలు గ్రామాల్లో బెల్టు షాపులు విచ్చలవిడిగా నడుస్తుండటంపై గ్రామ ప్రజలు మం డిపడుతున్నారు. గుడులు, పాఠశాలలు, గ్రామపం చాయతీ కార్యాలయాల చుట్టుపక్కల ఏర్పాటైన ఈ మద్యం విక్రయ కేంద్రాలు గ్రామ వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గ్రామ పెద్దలు, మహిళా సంఘాలు బహిరంగంగా నిరసన తెలుపుతూ,పిల్లల భవిష్య త్తు పాడవుతుందనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పవిత్ర ప్రదేశాల దగ్గరమద్యం విక్రయం (అసహ్యం ) అని గ్రామస్థులు చేసిన విమర్శలు వెల్లువెత్తు తున్నాయి.ఇక అధికారులు, కమిటీలు బెల్టు షాపులను కళ్లెం వేయకపోతే పెద్ద ఎత్తున ఆందో ళనలకు దిగుతామని యువజన సంఘాలు హెచ్చ రిస్తున్నాయి.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.