Wednesday, 29 April 2026

Blog

ఖమ్మం

సిపిఆర్ పై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి… జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

సిపిఆర్ పై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి… జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి జిల్లా అధికారులకు నిర్వహించిన సిపిఆర్ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ పున్నమి ప్రతినిధి ఖమ్మం జిల్లా అక్టోబర్ 13 సిపిఆర్ పై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. జిల్లా కలెక్టర్, కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లా అధికారులకు సోమవారం నిర్వహించిన సిపిఆర్ అవగాహన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లు డాక్టర్ పి. శ్రీజ, పి. శ్రీనివాస రెడ్డి లతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ* సమాజంలో ఇటీవల కాలంలో హర్ట్ ఎటాక్ వల్ల చాలా మంది మరణిస్తున్నారని, హర్ట్ ఎటాక్ వచ్చిన వెంటనే సిపిఆర్ చేయడం వల్ల మనిషి ప్రాణాలు కాపాడేందుకు ఆస్కారం ఉంటుందని అన్నారు. సిపిఆర్ చేసేందుకు వైద్య రంగంలో ఎటువంటి అనుభవం అవసరం లేదని, సాధారణ మనుషులు కూడా సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడవచ్చని అన్నారు. ప్రతి ఒక్కరూ సిపిఆర్ ప్రక్రియపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. గోల్డెన్ అవర్ లో సిపిఆర్ చేయడం వల్ల ప్రాణాలు కాపాడ గలుగుతామని అన్నారు. మనిషి ఎప్పుడైనా స్పృహ కోల్పోతే వెంటనే సిపిఆర్ చేయాలని కలెక్టర్ సూచించారు. సిపిఆర్ ఒక లైఫ్ స్కిల్ అని, ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తెలుసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో డి.ఆర్.ఓ. ఏ. పద్మశ్రీ, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారిణి డాక్టర్ బి. కళావతి బాయి, డిసిహెచ్ఎస్ డా. రాజశేఖర్, డిప్యూటీ డిఎం. అండ్ హెచ్ఓ చందూ నాయక్, ప్రోగ్రాం అధికారి, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

జోగులాంబ గద్వాల

సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి* *గౌ,, శ్రీ B.R. గవాయ్ గారిపై జరిగిన దాడి ని నిరసిస్తూ MRPS అనుబంధం సంఘాల నిరసన*

*సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి* *గౌ,, శ్రీ B.R. గవాయ్ గారిపై జరిగిన దాడి ని నిరసిస్తూ…* *పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి* *ఆదేశానుసారం జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్,కార్యాలయం* *ముందు నిరసన* *MRPS,VHPS MSP MSF అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన దళితుల ఆత్మగౌరవ నిరసన ర్యాలీ* *∆ముఖ్య అతిథులు:-* *బుర్రి సతీష్ మాదిగ* *MRPS తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జోగులాంబ గద్వాల ఇన్చార్జి* *కొంకల భీమన్న మాదిగ* *MRPS MSP మొదటి తరం* *జాతీయ సీనియర్ నాయకులు* *గంజిపేట శంకరన్న మాదిగ* *ఎమ్మార్పీఎస్ దండోరా సీనియర్ నాయకులు* *కార్యక్రమాన్ని ఉద్దేశించి బుర్రి సతీష్ మాదిగ మాట్లాడుతూ అక్టోబర్ 7, 2025 న భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయి గారు బెంచ్ మీద లాయర్ల వాదనలు వింటున్న సమయంలో రాకేష్ కిషోర్ అనే వ్యక్తి షూస్ విసిరి దాడికి పాలు పడడాన్ని నిరసిస్తూ హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది* *@చీఫ్ జస్టిస్ గారి మీద జరిగిన దాడి అనాగరికమైంది. ఈ దాడి ప్రజాస్వామిక స్ఫూర్తి, రాజ్యాంగం మీద జరిగిన దాడిగానే ఉన్నది. ఈ దాడి సమస్త భారతీయులను దిగ్భ్రాంతికి గురి చేసింది. దళిత, పీడిత వర్గాల ప్రజలను తీవ్ర మనోవేదనకు గురి చేసిందిఅన్ని. అందువల్ల దేశ ప్రజలందరూ ఈ దాడిని ఖండించారు. దళితుడైన బిఆర్ గవాయి గారు సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ కావడం కొన్ని ఆధిపత్య శక్తులు జీర్ణించుకోలేకపోతున్నాయి.అందుకే అహంపూరితంగా ఈ దాడికి తెగపడ్డారు. అన్ని కావున ఈ దాడికి పాల్పడ్డ వ్యక్తి మీద తక్షణమే కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలి.* *@అలాగే దాడికి వెనుక ఉన్న శక్తులను గుర్తించి వారికి శిక్షలు పడేలా ఈ ఘటన మీద సమగ్రమైన దర్యాప్తు జరిపించాలి.* *@అందుకోసం సుప్రీం కోర్టులో అనుభవం కలిగిన ప్రజస్వామిక దృక్పథం కలిగిన రిటైర్డు జడ్జీలను దర్యాప్తు కోసం నియమించాలిఅన్ని అలాగే ఇలాంటి ఘటనలు ఉన్నత న్యాయవ్యవస్థల్లో పునరావృతం కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలి అన్ని* *@ఈ డిమాండ్లను తక్షణమే పరిగణలోని తీసుకొని తగిన చర్యలు తీసుకోవాలని తమరి ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నాం* *@జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టరేట్ ముందు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం అనంతరం జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ BM సంతోష్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది..* ఈ కార్యక్రమంలో గద్వాల జిల్లా MRPS MSP సీనియర్ నాయకులు దండోరా నాయకులు పాల్గొనడం జరిగింది

ఖమ్మం

సిపిఆర్ పై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి… జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

సిపిఆర్ పై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి… జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి *జిల్లా అధికారులకు నిర్వహించిన సిపిఆర్ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్* ————————— ఖమ్మం, అక్టోబర్ -13: ————————— సిపిఆర్ పై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. జిల్లా కలెక్టర్, కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లా అధికారులకు సోమవారం నిర్వహించిన సిపిఆర్ అవగాహన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లు డాక్టర్ పి. శ్రీజ, పి. శ్రీనివాస రెడ్డి లతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ* సమాజంలో ఇటీవల కాలంలో హర్ట్ ఎటాక్ వల్ల చాలా మంది మరణిస్తున్నారని, హర్ట్ ఎటాక్ వచ్చిన వెంటనే సిపిఆర్ చేయడం వల్ల మనిషి ప్రాణాలు కాపాడేందుకు ఆస్కారం ఉంటుందని అన్నారు. సిపిఆర్ చేసేందుకు వైద్య రంగంలో ఎటువంటి అనుభవం అవసరం లేదని, సాధారణ మనుషులు కూడా సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడవచ్చని అన్నారు. ప్రతి ఒక్కరూ సిపిఆర్ ప్రక్రియపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. గోల్డెన్ అవర్ లో సిపిఆర్ చేయడం వల్ల ప్రాణాలు కాపాడ గలుగుతామని అన్నారు. మనిషి ఎప్పుడైనా స్పృహ కోల్పోతే వెంటనే సిపిఆర్ చేయాలని కలెక్టర్ సూచించారు. సిపిఆర్ ఒక లైఫ్ స్కిల్ అని, ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తెలుసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో డి.ఆర్.ఓ. ఏ. పద్మశ్రీ, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారిణి డాక్టర్ బి. కళావతి బాయి, డిసిహెచ్ఎస్ డా. రాజశేఖర్, డిప్యూటీ డిఎం. అండ్ హెచ్ఓ చందూ నాయక్, ప్రోగ్రాం అధికారి, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

జోగులాంబ గద్వాల

*భారత్ మాల రోడ్డుకు భూములు కోల్పోయిన రైతులకు వెంటనే డబ్బులు మంజూరు చేయాలి* :భీమ్ ఆర్మీ

*లేదంటే భారత్ మాల రోడ్డు పనులు నిలిపివేస్తాం* *భీమ్ ఆర్మీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఇంచార్జి మాచర్ల ప్రకాష్ ఆధ్వర్యంలో రైతులతో* *జిల్లా కలెక్టర్ సంతోష్ గారికి వినతి పత్రం అందజేత* జోగులాంబ గద్వాల జిల్లా, గట్టు భారత్ మాల రోడ్డు క్రింద భూములు కోల్పోయిన రైతులకు రెండో విడత అవార్డు డబ్బులు మంజూరు చేయాలనీ భీమ్ ఆర్మీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఇంచార్జి మాచర్ల ప్రకాష్ అన్నారు ఈ రోజు గట్టు, గంగిమాన్ దొడ్డి, సల్కపురం రైతులతో కలసి జిల్లా కలెక్టర్ సంతోష్ గారికి వినతి పత్రం అందజేశారు 6 నెలలుగా రైతులు కార్యాలయం చుట్టూ తిరుగుతూ ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు వెంటనే మంజూరు చేయాలనీ అన్నరు భారత్ మాల రోడ్డు పనులు పూర్తికావస్తున్న ఇంకా రైతులకు రెండో విడత డబ్బులు మంజూరు చేయకపోవడం చాలా అన్యాయం అని అన్నారు మంజూరు చేయకపోతే భరత్ మాల రోడ్డు పనులు నిలిపివేస్తామని అన్నారు వెంటనే మంజురు చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు ఈ కార్యక్రమం లో గంగిమాన్ దొడ్డి మాజీ సర్పంచ్ సంతోష్,మూడు గ్రామాల రైతులు పాల్గొన్నారు

ఆంధ్రప్రదేశ్

ఈ ఖరఫ్ సీజన్ లో రాష్ట్ర వ్యాప్తంగా 50 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు లక్ష్యం ధాన్యం కొనుగోలు. పై రైతులకు భరోసా కల్పించాలి. రైతులకు నష్టం జరుగరాదు, రైతులకు అండగా కూటమి ప్రభుత్వం. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్

శ్రీకాకుళం,అక్టోబరు,13: 2025-26 ఖరీఫ్ సీజన్ లో రాష్ట్ర వ్యాప్తంగా 50 లక్షలు మైట్రక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యమని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ స్పష్టం చేశారు. కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో ఖరీఫ్ సీజన్ – 2025-26 ధాన్యం కొనుగోలు పై ఉత్తరాంధ్ర జిల్లాల ప్రాంతీయ సమావేశానికి సంబంధించి జాయింట్ కలెక్టర్లు, పౌర సరఫరాల శాఖ అధికారులతో ఆయన పౌర సరఫరాల శాఖ కమీషనర్ సౌరబ్ గౌర్, పౌర సరఫరాల సంస్థ రాష్ట్ర మేనేజింగ్ డైరెక్టర్ మనజిర్ జిలాని సమూన్, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ లతో కలిసి ఆయన సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు నష్టం జరుగకుండా ధాన్యం కొనుగోలు చేయాలని సూచించారు. కష్ట కాలంలో రైతులకు అండగా ఉండి, రైతులకు భరోసా కల్పించాలన్నారు. టార్ఫాలిన్స్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల నుంచి 48 గంటల్లోనే ప్రభుత్వం రైతుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నట్లు పేర్కొన్నారు. సమస్యలు ఏమైనా ఉంటే జిల్లా యంత్రాంగం కలెక్టర్, జెసిలతో మాట్లాడాలని, రాష్ట్ర కార్యాలయం సమస్యలుపై వెసులుబాటు కల్పిస్తుందన్నారు. జెసిలు దృష్టి సారించి హాట్ స్పాట్ లు గుర్తించాలని ఆదేశించారు. సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని, ఎప్పటికప్పుడు టెలీకాన్ఫరెన్స్ లు ఏర్పాటు చేయాలన్నారు. గోనె సంచులు, రవాణాల పై దృష్టి సారించి జిపియస్ తప్పకుండా ఉండాలని స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలును ఒక ఛాలెంజ్ గా తీసుకోవాలని ఆదేశించారు. భారత దేశంలో లేని విధంగా రైతు వాట్సాప్ ద్వారా ధాన్యం విక్రయాలు చేసుకునేందుకు అవకాశం ఉందన్నారు. ధాన్యం కొనుగోలులో రైతులకు నష్టం కలుగ కుండా చూడాలని, తూకంలో ఏలాంటి తప్పులు జరుగరాదని స్పష్టం చేశారు. మిల్లర్లు తప్పులు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. త్వరలోనే రాష్ట్ర స్థాయి సమావేశం జరుగుతోందన్నారు. రైతు సేవా కేంద్రాలు వద్ద తేమ చూసే మిషన్ లను ముందుగానే ఏర్పాటు చేసుకోవాలన్నారు.. గత యేడాది రైతులకు టార్ఫాలిన్స్ 50 శాతం తో పంపిణీ చేయడమైనదని, ఈ యేడాది శత శాతం సబ్సిడీ తో సరఫరా చేస్తామన్నారు. అకాల వర్షాలు వస్తే రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, రైతులకు నష్టం జరుగరాదని తెలిపారు. రైతులకు భరోసా కల్పించి మద్దతు ధరలు కల్పించాలన్నారు. ఎన్ ఫోర్స్ మెంట్ చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. గోనె సంచులపై జెసీలు దృష్టి సారించాలని ఆదేశించారు. రైతులకు ఏమైనా ఇబ్బందులు ఉంటే తక్షణమే మా దృష్టికి తీసుకురావాలని చెప్పారు. పౌర సరఫరాల శాఖ కమిషనర్ సౌరబ్ గౌర్ మాట్లాడుతూ రైతులు పండించే పంటలు రైతు సేవా కేంద్రాల్లో కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు. రైతు సేవా కేంద్రాల్లో తప్ప చేస్తే వేరే ప్రాంతాల్లో ధాన్యం కొనుగోలు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ధాన్యం తరలించేందుకు ఒక్కో జిల్లాకు 5 వేల వాహనాలు ఏర్పాటు చేసుకోవాలని, రైతు సేవా కేంద్రాలు వారీగా టార్ఫలీన్లు సరఫరా చేయనున్నట్లు చెప్పారు. గోనె సంచులు అవసరాన్ని అంచనా వేసుకొని గోనెసంచులు సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. డేటా ఎంట్రీ ఆపరేటర్లు పై అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. గోనె సంచులు, రవాణాలపై దృష్టి సారించాలన్నారు. మనజీర్ జిలానీ సమూన్ మాట్లాడుతూ గత యేడాది చేసిన ధాన్యం సేకరణలో ఉన్న సమస్యలు పునరావృత్తం కారాదన్నారు. జిపియస్ వాహనాలు ద్వారా మాత్రమే తరలించాలన్నారు. రవాణా, గోనె సంచులు, సమస్యలు ఏమైనా ఉంటే ఉన్నతాధికారులను సంప్రదించాలన్నారు. సమస్యలు పునరావృత్తం రాకుండా చూడాలని చెప్పారు. గోనె సంచులు పై దృష్టి సారించాలని చెప్పారు. వాహనాల సమస్య లేకుండా చూడాలని జెసిలు ఆదేశించారు. ఈ సందర్భంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ధాన్యం సేకరణ పై వివరించారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ గత యేడాది జిల్లాలో అకాల తుఫానులు సంభవించినట్లు చెప్పారు. ఆ సమయంలో కొంత మేర రైతులు పంట నష్టపోయినట్లు చెప్పారు. టార్ఫాలిన్స్ పంపిణీ చేసినట్లు చెప్పారు. ప్రస్తుత ఏర్పాట్లను వివరించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్లు గత సీజన్ లో ఉన్న అనుభవాలు, ఈ ఖరీఫ్ సీజన్ ధాన్యం సేకరణకు చేసిన ఏర్పాట్లు, ధాన్యం సేకరణ పై సిబ్బందికి శిక్షణ, అకాలంగా వచ్చే వర్షాల ఏర్పాట్లు పై మంత్రికి వివరించారు. జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ మాట్లాడుతూ డేటా ఎంట్రీ ఆపరేటర్లు, టెక్నికల్, తదితర సిబ్బందికి జీతభత్యాలు కోసం మంత్రి దృష్టికి తీసుకురాగా మంత్రి సానుకూలంగా స్పందించారు. ఈ సమావేశంలో పాలకొండ శాసన సభ్యులు నిమ్మక జయకృష్ణ, రాష్ట్ర పౌర సరఫరాలు, ఆహార, వినియోగదారుల వ్యవహారాల శాఖ సంచాలకులు ఆర్. గోవిందరావు, శ్రీకాకుళం జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ఎఎస్ఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ పూజిత, అనకాపల్లి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. జాహ్నవి, విశాఖపట్నం కె. మయూర్ అశోక్, విజయనగరం ఎస్. సేధు మాధవన్, పార్వతీపురం మన్యం జిల్లా జాయింట్ కలెక్టర్ సి. యశ్వంత్ కుమార్ రెడ్డి, వ్యవసాయ, రవాణా, కోపరేటివ్, లీగల్ మెట్రాలజి, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

నకిలీ మద్యాన్ని అరికట్టి ప్రజల ప్రాణాలు కాపాడాలి* వైస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కొత్తపేట నియోజకవర్గ పరిశీలకులు పాటి శివకుమార్

అమలాపురం, అక్టోబరు 13 (పున్నమి ప్రతినిధి) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మరియు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి గారి ఆదేశాల మేరకు తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా నకిలీ మద్యాన్ని ఒక కుటీర పరిశ్రమ లాగా తయారుచేసి ప్రజల ప్రాణాలను హరిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వ విధివిధానాలను వ్యతిరేకిస్తూ సోమవారం మాజీ అమూడా చైర్మన్ & అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు గొల్లపల్లి డేవిడ్ రాజు ఆధ్వర్యంలో కొత్తపేటలో ఉన్న ఎక్సైజ్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర కార్యదర్శి, కొత్తపేట నియోజకవర్గ పరిశీలకులు పాటి శివకుమార్ పాల్గొన్నారు. గొల్లపల్లి డేవిడ్ రాజు ఇంటి వద్ద నుండి ర్యాలీగా బయలుదేరి ఎక్సైజ్ కార్యాలయం వద్దకు వెళ్లి ఎక్సైజ్ సిఐ కు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఎక్సైజ్ సిఐ కు రాష్ట్రంలో విచ్చలవిడిగా జరుగుతున్న నకిలీ మద్యం విక్రయాల గురించి అలాగే బెల్ట్ షాపుల గురించి ముఖ్య నాయకులు క్లుప్తంగా వివరించి వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

నకిలీ మద్యాన్ని అరికట్టి ప్రజల ప్రాణాలు కాపాడాలి* వైస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కొత్తపేట నియోజకవర్గ పరిశీలకులు పాటి శివకుమార్

అమలాపురం, అక్టోబరు 13 (పున్నమి ప్రతినిధి) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మరియు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి గారి ఆదేశాల మేరకు తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా నకిలీ మద్యాన్ని ఒక కుటీర పరిశ్రమ లాగా తయారుచేసి ప్రజల ప్రాణాలను హరిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వ విధివిధానాలను వ్యతిరేకిస్తూ సోమవారం మాజీ అమూడా చైర్మన్ & అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు గొల్లపల్లి డేవిడ్ రాజు ఆధ్వర్యంలో కొత్తపేటలో ఉన్న ఎక్సైజ్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర కార్యదర్శి, కొత్తపేట నియోజకవర్గ పరిశీలకులు పాటి శివకుమార్ పాల్గొన్నారు. గొల్లపల్లి డేవిడ్ రాజు ఇంటి వద్ద నుండి ర్యాలీగా బయలుదేరి ఎక్సైజ్ కార్యాలయం వద్దకు వెళ్లి ఎక్సైజ్ సిఐ కు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఎక్సైజ్ సిఐ కు రాష్ట్రంలో విచ్చలవిడిగా జరుగుతున్న నకిలీ మద్యం విక్రయాల గురించి అలాగే బెల్ట్ షాపుల గురించి ముఖ్య నాయకులు క్లుప్తంగా వివరించి వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

తిరుపతి

శ్రీశైలం ధర్మకర్తల మండలి చైర్మన్ మరియు సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కోలా ఆనంద్

శ్రీశైలం భ్రమరాంభికా మల్లికార్జునస్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులుగా పోతుగుంట రమేష్ నాయుడు మరియు ధర్మకర్తల మండలి సభ్యులుగా కోడె కాంతివర్ధిని నియమితులైయిన శుభ సందర్భంగా సోమవారం శ్రీశైల పుణ్యక్షేత్రము నందు అత్యంత వైభవంగా జరిగిన వారి ప్రమాణస్వీకార మహోత్సవము నందు బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ పాల్గొనడం జరిగింది.అనంతరం వీరు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు గా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ మరియు రాష్ట్ర బిజెపి సంస్థగత ప్రధాన కార్యదర్శి యన్.మధుకర్ జీ మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నారెడ్డి దయాకర్ రెడ్డి తో కలిసి శుభాకాంక్షలు తెలిపి అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకోవడం జరిగింది.

తిరుపతి

అక్రమ టపాసుల గోడౌన్‌పై సి ఐ మురళీకృష్ణ ఉక్కుపాదం

సూళ్లూరుపేట అక్టోబర్ పున్నమి ప్రతినిధి తిరుపతి జిల్లా సూళ్లూరుపేట కోటపోలూరు రోడ్డు లో అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా నిల్వ ఉంచిన భారీ టపాసుల గోడౌన్‌పై CI మురళీకృష్ణ ఆధ్వర్యంలోని పోలీసులు ఆకస్మిక దాడి చేశారు. ఈ దాడుల్లో పెద్ద మొత్తంలో 85 బాక్స్ లు వీటి విలువ సుమారు గా 2,5000/- ప్రమాదకర టపాసులను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సూళ్లూరుపేట పట్టణం సమీపంలో కోటపోలూరు రోడ్డు వద్ద జనసాంద్రత గల ప్రాంతంలో ఒక గోడౌన్‌లో ఎలాంటి అనుమతులు లేకుండా, భద్రతా ప్రమాణాలకు తిలోదకాలిచ్చి టపాసులను నిల్వ చేస్తున్నారనే విశ్వసనీయ సమాచారం అందింది. దీనిపై తక్షణమే స్పందించిన CI మురళీకృష్ణ, తన బృందంతో కలిసి గోడౌన్‌పై మెరుపు దాడి చేశారు. దాడి సమయంలో, గోడౌన్‌లో టపాసులు భారీ పరిమాణంలో నిల్వ ఉన్నట్లు గుర్తించారు. ఇవి నిల్వ చేసిన విధానం అత్యంత ప్రమాదకరంగా ఉందని, చిన్నపాటి నిప్పు రవ్వ తగిలినా పెను ప్రమాదం సంభవించే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. ఈ గోడౌన్ సమీపంలో నివాస గృహాలు ఉండటంతో, స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించి గోడౌన్ లో టపాసులు అక్రమ నిల్వ ఉంచిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనిపై పేలుడు పదార్థాల చట్టం కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. స్వాధీనం చేసుకున్న టపాసుల విలువ సుమారు రెండు లక్షల యాభై వేలు రూపాయలు ఉంటుందని అంచనా.CI మురళీకృష్ణ మాట్లాడుతూ, “ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తాము. అక్రమంగా టపాసులు నిల్వ ఉంచేవారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఇలాంటివి ఎక్కడైనా జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని” ప్రజలను కోరారు. ఈ దాడులతో సూళ్లూరుపేట ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. పండుగల సీజన్‌లో ఇలాంటి అక్రమ గోడౌన్‌లు వెలుగులోకి రావడం స్థానికంగా కలకలం రేపింది.అక్రమ టపాసులు నిల్వ సమాచారం రాగానే ఎంతో చాకచక్యంగా వారిని పట్టుకున్నందుకు పట్టణ ప్రజలు పోలీస్ వారిని మెచ్చుకుంటున్నారు.

విశాఖపట్నం

సరికొత్త డిజిటల్ మహాద్వారం ‘విశాఖ’

సరికొత్త డిజిటల్ మహాద్వారం ‘విశాఖ’ – ఇక ప్రపంచ నిపుణులకు ఆతిథ్యం! పున్నమి స్టాప్ రిపోర్టర్ : యామల రామమూర్తి విశాఖపట్నం: విదేశాలకే వెళ్ళిన వారు… ఇప్పుడు విదేశీయులను ఆహ్వానించే నగరం! ఒకప్పుడు మెరుగైన ఉపాధి కోసం, ఉన్నత విద్య కోసం మన యువత విదేశాలకు క్యూ కట్టేవారు. కానీ, ఆ పరిస్థితి త్వరలోనే తలకిందులు కాబోతోంది. తీర ప్రాంతంలో కొలువైన విశాఖపట్నం ఇప్పుడు ప్రపంచ టెక్ మ్యాప్‌లో అత్యంత కీలకమైన కేంద్రంగా రూపుదిద్దుకుంటోంది. ‘గూగుల్’, ‘మెటా’, ‘మైక్రోసాఫ్ట్’, ‘అమెజాన్’, ‘రిలయన్స్’ వంటి ప్రపంచ స్థాయి దిగ్గజ సంస్థలు ఇక్కడ డేటా సెంటర్లను నెలకొల్పడానికి ఉత్సాహం చూపుతున్నాయి. 5 లక్షల ఉద్యోగాల సృష్టి – డిజిటల్ ఆర్థిక విప్లవంకు శ్రీకారం! ఈ భారీ ప్రాజెక్టుల కారణంగా మొదటి దశలోనే సుమారు 5 లక్షల వరకు ప్రత్యక్ష ఉద్యోగాలు సృష్టించబడతాయని అంచనా. ఇది కేవలం ఉద్యోగాల సంఖ్య కాదు, మన రాష్ట్రం, దేశ భవిష్యత్ డిజిటల్ ఆర్థిక విప్లవంకు పటిష్టమైన పునాది. ఈ పెట్టుబడులు లక్షల మంది యువతకు ఉపాధి కల్పించడంతో పాటు, విశాఖపట్నంను ‘డిజిటల్ క్యాపిటల్ ఆఫ్ సౌత్ ఏషియా’గా మార్చబోతున్నాయి. విదేశీ నిపుణులు విశాఖకు! ఈ డేటా సెంటర్ల క్లస్టర్ పూర్తిగా కార్యకలాపాలు ప్రారంభించినప్పుడు, పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. సింగపూర్, మలేసియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, జపాన్, దుబాయ్ వంటి దక్షిణాసియా దేశాల నుండి మరియు ఇతర ప్రాంతాల నుండి సైతం నిపుణులు విశాఖపట్నంకు వచ్చి పనిచేసే వాతావరణం ఏర్పడుతుంది. ఇప్పటివరకు మన యువత విదేశాలకు వెళ్లడం చూశాం. కానీ రాబోయే సంవత్సరాల్లో, “విదేశీయులు భారతదేశానికి, ముఖ్యంగా విశాఖపట్నంకి వచ్చి ఉద్యోగాలు చేయడం” అనే సరికొత్త అధ్యాయాన్ని మనం చూడబోతున్నాం. ప్రపంచ టెక్ మ్యాప్‌లో వైజాగ్ స్థానం: ఈ డేటా సెంటర్లు కేవలం సర్వర్లను మాత్రమే నడపవు. అవి క్లౌడ్ సర్వీసులు, సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఐటీ మెయింటెనెన్స్ మరియు గ్రీన్ ఎనర్జీ సపోర్ట్ వంటి అనేక అనుబంధ రంగాల అభివృద్ధికి దారితీస్తాయి. ఈ మొత్తం పర్యావరణ వ్యవస్థ విశాఖను ప్రపంచ టెక్ మ్యాప్‌లో సుస్థిరంగా నిలబెట్టే అవకాశం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. విశాఖపట్నం కేవలం ఒక పర్యాటక కేంద్రంగానే కాకుండా, భారతదేశం యొక్క డిజిటల్ అభివృద్ధికి ఒక ప్రధాన గేట్‌వేగా, “జ్ఞానం మరియు సాంకేతికతకు కేంద్రంగా” (Global Digital Gateway) ఎదగడానికి సిద్ధంగా ఉంది. ఈ పరివర్తన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు, యువత భవిష్యత్తుకు కొత్త ఉత్తేజాన్ని ఇస్తుందనడంలో సందేహం లేదు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.