Wednesday, 29 April 2026

Blog

నాగర్‌కర్నూల్

నాగర్ కర్నూల్ జిల్లా కు 10 మంది టూరిస్ట్ పోలీస్ లను కేటాయించిన ప్రభుత్వం

పున్నమి ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా అక్టోబర్ 13 తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 80 మంది పోలీస్ లను డిప్యుటేషన్ మీద పర్యాటక శాఖ కు ప్రభుత్వం కేటాయించడం జరిగింది.ఇందులో భాగంగా నాగర్ కర్నూలు జిల్లా కు 10 మంది టూరిస్ట్ పోలీస్ లను ప్రభుత్వం నియమించింది.నేడు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారి క్యాంప్ కార్యాలయంలో ప్రభుత్వం ఆదేశాల మేరకు విధుల్లో చేరుతున్నట్టు నాగర్ కర్నూల్ జిల్లా పర్యాటక శాఖ అధికారి కల్వరాల నరసింహ గారికి 10 మంది పోలీస్ లు రిపోర్ట్ చేయడం జరిగింది. మంత్రి జూపల్లి గారి ఆధ్వర్యంలో పర్యాటక రంగంలో అన్ని విధాలుగా అభివృద్ధి జరుగుతుందని ప్రభుత్వం కేటాయించిన 10 మంది టూరిస్ట్ పోలీస్ ల సేవలు జిల్లా లో టూరిస్ట్ లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ప్రాంతాల్లో వినియోగించుకోవడం జరుగుతుంది.

నాగర్‌కర్నూల్

సీజనల్ వ్యాధులపై హెచ్ఐవి పై అవగాహన

పున్నమి ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా అక్టోబర్ 13 బిజినాపల్లి మండలం నంది వడ్డేమాన్ గ్రామంలో Y. R. G. కేర్ (LWS)ఆధ్వర్యంలో లోకల్ బాడీ మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఈ మీటింగ్ లో సంస్థ సూపెర్వైజర్ రామ కృష్ణ సార్ మాట్లాడుతూ (1)సీజనల్ వ్యాధుల గురించి మరియు hiv టీబీ sti గురించి చెప్పడం మరియు తీసుకోవలసిన జాగ్రతల గురించి చెప్పడం జరిగింది. (2)18సం„ లు నిండిన ప్రతి ఒక్కరు hiv పరీక్ష చేయించుకోవాలని కోరడమైనది (3)hiv పట్ల అవగాహన కలిగిండాలని మాట్లాడటం జరిగింది. (4)HIV కలిగిన వ్యక్తి పట్ల వివక్షత ప్రదర్శించారాదని అది నేరం అని చెప్పడం జరిగింది. (5)HIV సంక్రమిచే మార్గాల గురించి చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంస్థDRP శ్రీకాంత్ రెడ్డి సార్,లింక్ వర్కర్ హేమలత ,పంచాయతీ కార్యదర్శి శివ సార్, egs ఫీల్డ్ అసిస్టెంట్ దాసు , ఆశ వర్కర్స్ కృష్ణవేణి, అనిత, అంగన్వాడీ టీచర్స్, SHG మెంబెర్స్ మరియు గ్రామపెద్దలు, యువకులు తదితరులు పాల్గొనడం జరిగింది.

E-పేపర్

కుక్కల బెడదతో బయపడుతున్న నగర వాసులు

నెల్లూరు (రూరల్ )13: పున్నమి ప్రతినిధి : SPSR నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ మండలం పరిధిలోని Z. P. కాలనీ, డైకస్ రోడ్, గాంధీ నగర్, VMR నగర్ ఏరియాలో కుక్కలు వీర సైర్యం చేస్తున్నాయి. రాత్రి వేళలో వృద్ధులు, పాదచారులు, చిన్న పిల్లలు, సైకిల్, బైక్ లో వెళ్లేవారు భయపడుతున్నారు. వారి వెంట కుక్కలు పరుగెత్తి వెంట పడుతున్నాయి. నెల్లూరు మున్సిపల్ అధికారులు వాటిని పట్టుకొని ఆ ప్రాంత ప్రజలు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.

యాదాద్రి భువనగిరి

శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కి దామన్న పేరు పెట్టడం హర్షణీయo

*దామన్న మృతి పార్టీకి,ప్రజలకు తీరని లోటు* *శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కి దామన్న పేరు పెట్టడం హర్షణీయo* *దామన్న స్ఫూర్తితో ముందుకెళ్తాం* *సంతాప సభ లో ప్రమోద్ కుమార్* మాజీ మంత్రి వర్యులు , రాంరెడ్డి దామోదర్ రెడ్డి గారి మృతి రాష్ట్ర ప్రజలకు,ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలకు కాంగ్రెస్ పార్టీ కి తీరని లోటు అని కాంగ్రెస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ పరిశీలకుడు పోత్నక్ ప్రమోద్ కుమార్ గారు అన్నారు.ఈరోజు భువనగిరి జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డు లో మాజీ కౌన్సిలర్ రాచమల్ల రమేష్ గారి అధ్యక్షతన జరిగిన సంతాప సభ లో ప్రమోద్ కుమార్ గారు మాట్లాడుతూ రెండు సార్లు మంత్రిగా ,5 సార్లు శాసనసభ్యుడిగా, యువజన కాంగ్రెస్ నాయకునికా PCC ఉపాధ్యక్షులుగా ,AICC సభ్యునిగా అనేక ఎన్నికల్లో పార్టీ ఇంచార్జీ గా పనిచేసిన వ్యక్తి దామన్న అని వారి చిరకాల కోరిక అయిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఫేజ్ 2 కి దామన్న పేరు పెట్టడం హర్షణీయమని ,ఈ సందర్భంగా రాష్ట ప్రభుత్వానికి ,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి,జిల్లా మంత్రులు వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గార్ల కు , కృతజ్ఞతలు తెలుపుతున్నామని, వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని వారి కుటుంబానికి భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుతున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ఎస్సీ విభాగం అధ్యక్షులు దర్గాయి హరిప్రసాద్,సీనియర్ నాయకులు డి.రాములు,భువనగిరి పార్లమెంట్ కో ఆర్డినేటర్ ఎండి అతహర్ ,ధర్మ శాల అధ్యక్షులు మంచికంటి కృష్ణమూర్తి, యువజన నాయకుడు బింగి నరేష్ ,జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షులు నాకోటి రాము, పట్టణ అధ్యక్షులు కాల్య నాగరాజు,యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి ఎండి నేహాల్,మహిళా కాంగ్రెస్ నేత దేవరంగుల కవిత ,తదితరులు పాల్గొన్నారు.

నిర్మల్

డీసీసీ అధ్యక్షుని ఎంపికలో, ఏఐసిసి పరిశీలకులు నిర్మల్ రాక.

నిర్మల్ అక్టోబర్ 13 ( పున్నమి ప్రతినిధి ) నిర్మల్ జిల్లా: నిర్మల్ లో జరిగిన నూతన జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుల ఎంపిక నేపథ్యంలో ఏఐసీసీ ఆదేశాల మేరకు నిర్మల్ జిల్లా పరిశీలకులు అజయ్ సింగ్ గారిని పీసీసీ పరిశీలకులు సోమవారం మంజులాపూర్ రోడ్డులోని మారుతి ఇన్ హోటల్ లో * “సంఘటన, శ్రీజన్, అభియాన్ ” కార్యక్రమంలో సన్మానం చేసిన, నిర్మల్ జిల్లా మైనారిటీ అధ్యక్షులు జునైద్ మెమన్. ఈకార్యక్రమంలో కుచాడి శ్రీహరి రావు, డా.యస్. వేణుగోపాల చారీ, వాజిద్ అహ్మద్, అజర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

అబాకస్ లో శ్రీ చైతన్య విద్యార్థి ప్రతిభ

స్థానికంగా జయరాం రావు వీధిలో గల శ్రీ చైతన్య పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు చెన్నైలో జరిగినటువంటి ఇంటర్నేషనల్ అబాకస్ కాంపిటీషన్ లో పాల్గొని ఘన విజయం సాదించడం జరిగింది.ఈ అబాకస్ పోటీలలో యువనేస్ అనే విద్యార్థి రెండో స్థానం కైవసం చేసుకోవడం జరిగిందని,అంకితభావం పట్టుదల ఉంటే వివిధ రంగాలలో విద్యార్థులు రాణించవచ్చని ఈ సందర్భంగా ప్రిన్సిపల్ లిపారు.అనంతరం ప్రిన్సిపల్ చేతుల మీదుగా విజేతకు జ్ఞాపిక,ప్రశంసా పత్రాన్ని ఇచ్చి సత్కరించారు.కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ సుధాకర్,ప్రైమరీ ఇంచార్జ్ మాధవి లత, మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

భద్రాద్రి కొత్తగూడెం

మైనర్ గిరిజన బాలికలు అదృశ్యం

మైనర్ గిరిజన బాలికలు అదృష్యం. దమ్మపేట మండలం, అంకంపాలెం లో కలకలం. పోలీసులకు ఫిర్యాదు చేసిన కళాశాల యాజమాన్యం. దమ్మపేట మండల పరిదిలోని అంకంపాలెం గిరిజన గురుకుల బాలికల జూనియర్ కళాళాలలో ఇద్దరు మైనర్ బాలికలు అదృష్యమైన ఘటన స్ధానికంగా కలకలం రేపుతుంది. ఆదివారం ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. స్ధానిక పోలీసులకు కళాశాల ఉపాధ్యాయ బృందం ఫిర్యాదు చేశారు. స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ సాయికిషోర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం …. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణ సమీపంలోని రేగళ్ళపాడుకు చెందిన ఇద్దరు గిరిజన మైనర్ బాలికలు, దమ్మపేట మండలం అంకంపాలెం లో ఉన్న గిరిజన బాలికల గురుకుల జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుచున్నారు. పాఠశాల అధ్యాపక బృందానికి సమాచారం ఇవ్వకుండా బయటకు వెళ్ళారు. ఎంతసేపటికి తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చి విద్యార్ధినిల తల్లిదండ్రులకు విషయం తెలియజేశారు. తల్లిదండ్రులు ,బంధువుల తో కలిసి చుట్టుపక్కల పల్లెల్లో ,గ్రామాల్లో ఆచూకీ కోసం యత్నాలు చేశారు. ఎంతకీ ఆచూకీ లభ్యం కాకపోవడంతో ఆదివారం రాత్రి సుమారుగా 11 గం.ల సమయంలో దమ్మపేట పోలీసులకు లెక్చరర్ బాణోత్ హరిత ఫిర్యాదు చేశారు. ఉపాద్యాయ సిబ్బంది ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు స్ధానిక పోలీసులకు తగిన సమాచారం అందించాలని కోరారు. సమాచారం తెలిపిన వారి వివరాలను గోప్యంగా ఉంచబడతాయని ఎస్ ఐ వెల్లడించారు.

అన్నమయ్య

చిట్వేల్‌లో విద్యా విప్లవం ఆరంభం – ఒకేసారి 33 మంది ఉపాధ్యాయుల జాయినింగ్‌

చిట్వేల్ మండలం విద్యా రంగంలో చరిత్ర సృష్టించింది. మెగా డీఎస్సీ 2025 నియామక ప్రక్రియలో భాగంగా మొత్తం 33 మంది ఉపాధ్యాయులు — 25 మంది ఎస్జీటీలు, ఒక ఉర్దూ టీచర్‌, 7 మంది పిఎస్ హెచ్ఎంలు — ఈరోజు తమ తమ పాఠశాలల్లో విధుల్లో చేరారు. మండల విద్యాశాఖ అధికారి ఈశ్వరయ్య గారు జాయినింగ్ రిపోర్టులను స్వీకరించి, ఉపాధ్యాయులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. “ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ మెగా డీఎస్సీ ద్వారా మీరందరూ ఎంపికయ్యారు. ఇప్పుడు మీ కర్తవ్యమే విద్యార్థుల జీవితాలను మార్చడం. క్రమశిక్షణ, విలువలు, సమయపాలనతో బోధించి పాఠశాలలను అభివృద్ధి దిశగా నడిపించండి” అని సూచించారు. సీనియర్ ఉపాధ్యాయులు కామటం వెంకటేశ్వర్లు, కాలేషా, నారాయణ రెడ్డి తదితరులు మాట్లాడుతూ — “ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనది, సేవాభావంతో పనిచేయండి” అని అన్నారు. కార్యక్రమంలో సిఆర్ఎంటి లు చంద్రశేఖర్‌, విజయలక్ష్మి, కంప్యూటర్ ఆపరేటర్‌ గంగాదేవి, ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ఖమ్మం

లంచాలకు కేరాఫ్ అడ్రస్ రఘునాథపాలెం ఎమ్మార్వో కార్యాలయం

లంచాలకు కేరాఫ్ అడ్రస్ రఘునాథపాలెం ఎమ్మార్వో కార్యాలయం ఖమ్మం జిల్లా పున్నమి ప్రతినిధి అక్టోబర్ 13 కార్యాలయం గుమ్మానికి అడ్డంగా ఎమ్మార్వో కారు పార్కింగ్ చేస్తున్నారు మండల ప్రజలు వారి సమస్యల కోసం రావాలనా లేదా రాకూడదా అనేది ఎమ్మార్వో సమాధానం చెప్పాలి పైసా లేనిదే పని జరగధు ఎమ్మార్వో మేడమ్ కి ఒక ప్రత్యేకత ఉంది వారి ముందు కుర్చీలో కూర్చోవాలంటే అగ్ర కులస్తుడై ఉండాలి ధనవంతుడు అయి ఉండాలి ఖద్దరు బట్టలు ఉన్నవారు మాత్రమే కుర్చీలో కూర్చోవాలి ఖద్దరు చొక్కా లేనిదే కుర్చీలో కూర్చోకుడదు పేదవాడు ఎమ్మార్వో కి సమస్యలు చెప్పుకోవాలంటే అది కలగానే మిగిలిపోతుంది అధికారి రాక కోసం ఆరుబయటా పడిగాపులు సమయపాలన పాటించని ఎమ్మార్వో మరియు ఆర్ ఐ కార్యాలయ సిబ్బంది పని రకాన్ని బట్టి మూల్యం చెల్లించాల్సిందే పని జరగాలంటే లంచాలు వారు డైరెక్టుగా తీసుకోకుండా మధ్యవర్తుల ద్వారా ఆఫీస్ కి సంబంధంలేని ఒక మధ్యవర్తి ద్వారా ఈ రాయబారం నడుపుతున్నారు రేషన్ కార్డులలో భారీ దందా నడిపిన ఆర్ఐ లంచాలు ఇవ్వనిదే పని జరగడం లేదు మరి ఇలాంటి అధికారుల మీద జిల్లా ఉన్నతాధికారుల చర్యలు ఉండవా అక్రమార్కుల పని సాఫీగా సాగాలంటే అటెండర్ నుండి మొదలు పెట్టుకుని ఎమ్మార్వో దాకా నెల నెల లంచాలు మూట ముట్టాల్సిందే ఖమ్మం జిల్లా రఘునాధపాలెం మండలం ఎమ్మార్వో కార్యాలయంలో నిత్యం జరుగుతున్న లావాదేవీలు రేషన్ కార్డు దందాలో ఒక నిరుపేద కుటుంబం రేషన్ కార్డు పొందాలంటే 2000 నుండి 5,000 వరకు లంచం ఇవ్వాల్సిందే పేద ప్రజల అవసరాన్ని ఆసరాగా చేసుకుని ఆ శాఖ అధికారులు అవసరాన్ని అదులుగా చేసుకొని చేయి తడిపితే కానీ ఏ పని కానీ పరిస్థితులు నెలకొన్నాయి ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆఫీస్ లో డిసిఓ కార్యాలయానికి సంబంధించిన ఒక వ్యక్తి చేతివాటం చూపిస్తున్నాడు ఒక రైతు తన ల్యాండ్ ని కానీ వేరే వారి యొక్క ల్యాండ్ కానీ కొనుగోలు అమ్మకాలు జరిగే క్రమంలో వారి భూమిని పట్టా చేయించుకోవాలన్నా కానీ ఎమ్మార్వో కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి కంప్యూటర్ ఆపరేటర్ ఆర్ఐ లాంటి వ్యక్తులు కొంతమంది ప్రైవేట్ వ్యక్తులను పెట్టుకొని ఈ దందా కొనసాగిస్తున్నారు ప్రభుత్వ అధికారులు అయి ఉండి కూడా ప్రభుత్వం ద్వారా నెల నెల జీతాలు వస్తున్న గాని అవి సరిపోవటం లేదు అంటూ లంచాలకు దిగజారి మరి చెయ్యి చాపుతున్నారు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్న పట్టించుకునే నాధుడే కరువయ్యాడు సర్వత్రం విమర్శలు మండల స్థాయిలో తారాస్థాయిలో వినిపిస్తున్న గాని మాకేం సంబంధం అన్నట్టుగా జిల్లా స్థాయి అధికారుల పనితీరు ఈ తతంగం ఈ రకంగా కొనసాగుతున్న వీటిపై నోరు మెదిపే అధికారులు లేకపోవడం విడ్డూరంగా అనిపిస్తుంది జిల్లాస్థాయి అధికారుల ప్రమేయం ఏమైనా ఉందా అని మండల ప్రజలు గుసగుసలాడుతున్నారు రఘునాథపాలెం ఎమ్మార్వో కార్యాలయానికి ఒక ప్రత్యేకత కూడా ఉంది వేలాది అప్లికేషన్ పెండింగ్లో ఉన్నప్పటికీ కొత్త రేషన్ కార్డులు తక్షణమే జారీ చేసినట్లు మండల ప్రజలు అనుకుంటున్నారు ఆర్ ఐ తోపాటు కార్యాలయ సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారు ఎమ్మార్వో కార్యాలయంలో ఏ పని జరగాలన్నా కానీ ముందు అధికారుల దగ్గరికి వెళ్లే కంటే మధ్యవర్తుల దగ్గరికి వారి యొక్క అప్లికేషన్ తీసుకొని వెళ్లి చూపిస్తే అంటే అప్లికేషన్ పని రకాన్ని బట్టి డబ్బులు ముట్టిన తర్వాత అట్టి అప్లికేషన్ స్వయంగా మధ్యవర్తినే ఆర్ ఐ వద్దకు తీసుకెళ్లి అట్టి పనిని సులువుగా చేపించడం జరుగుతుందని మండల స్థాయిలో విమర్శలు వినబడుతున్నాయి ఈ విధంగా లంచాలకి పాల్పడుతున్న అధికారులు జిల్లా కేంద్రం కు కూత వేటు దూరంలోనే రఘునాధపాలెం ఎమ్మార్వో కార్యాలయం ఉంది మరి జిల్లా స్థాయి అధికారులకు ఈ పేద ప్రజల గోడు వినిపించడం లేదా లేదా గ్రామ స్థాయి నుండి మండల స్థాయి జిల్లా స్థాయి వరకు అధికారులు అంతా ఒకే బడి పాఠాలు నేర్చుకున్నారా అనేది అర్థం కావడం లేదు అని పేద ప్రజలు వారి ఇబ్బందులను ఈ విధంగా తెలియపరుస్తున్నారు

ఖమ్మం

ఖమ్మం జిల్లా నుంచి ప్రముఖ డాక్టర్ బిజెపిలో చేరిక

🚩భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు శ్రీ నెల్లూరు కోటేశ్వరావు ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా సహస్ర హాస్పిటల్ అధినేత ప్రముఖ డాక్టర్ కేశగాని మారుతి బాబురావు ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం లో 50 మంది నాయకులతో కలిసి బిజెపిలో రాష్ట్ర అధ్యక్షులు నారపరాజు రామచంద్ర రావు గారి సమక్షంలో జాయిన్ అవ్వడం జరిగింది.👍🙏💐🚩🚩 ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి శ్రీ దేవకి వాసుదేవరావు , ఉదయ ప్రతాప్ , నంబూరి రామలింగేశ్వర ఖమ్మం జిల్లా IT CELL అధ్యక్షులు బోయిన్పల్లి సురేష్ చింతకాని మండల అధ్యక్షులు కొండ గోపి రుద్ర గాని మాధవ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.