Wednesday, 29 April 2026

Blog

E-పేపర్

రాష్ట్రస్థాయి టైక్వాండో పోటీల్లో బంగారు పతకం సాధించిన కోడూరు విద్యార్థి.

రాష్ట్రస్థాయి టైక్వాండో పోటీల్లో బంగారు పతకం సాధించిన కోడూరు విద్యార్థి. రైల్వేకోడూరు న్యూస్ రైల్వే కోడూరు ఎస్కే స్పోర్ట్స్ అకాడమీ తరపున ఈ నెల 10,11,12 వ తేదిలలో బాపట్ల జిల్లా పెటూరు లో 69 ఎస్ జి ఎఫ్ ( స్కూల్ గేమ్ ఫెడరేషన్) స్థాయి పోటీలు నిర్వహించారు. ఇందులో కడప జిల్లా ఎస్కే స్పోర్ట్స్ అకాడమీ s టి సోహిత U-14 38 + విభాగంలో టైక్వాండ పోటీల్లో బంగారు పతకం సాధించింది అంతేకాకుండా నంవంబర్ లో జరిగే జాతియ స్థాయి పోటీలకు ఎంపిక అయిందని కోచ్ ఎస్కే మౌలా తెలిపారు.

ఎన్ టి ఆర్ జిల్లా

ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు పట్టణం.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) మహిళా విభాగం ఆధ్వర్యంలో నకిలీ మద్యంకు వ్యతిరేకంగా పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.

ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు పట్టణం.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) మహిళా విభాగం ఆధ్వర్యంలో నకిలీ మద్యంకు వ్యతిరేకంగా పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి వైసీపీ మహిళా విభాగం నియోజకవర్గ అధ్యక్షురాలు పి.సుధారాణి నాయకత్వం వహించారు. భారీ వర్షంలో కూడా ఈ ర్యాలీ కొనసాగించారు ర్యాలీలో పాల్గొన్నవారు ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్లు చేశారు. నకిలీ మద్యం గుట్టును పూర్తిగా బయటపెట్టడానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైన్ షాపులు, పర్మిట్ రూములు, బార్లు, బెల్ట్ దుకాణాలపై తనిఖీలు చేపట్టాలి. నకిలీ మద్యం అంశంపై సిబిఐ (CBI) దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. వైన్ షాపులను ప్రభుత్వమే నిర్వహించేలా చొరవ చూపాలి. ఎక్సైజ్ కార్యాలయంలో సీఐ నిక్సన్కు ఈ డిమాండ్లతో కూడిన వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో నాలుగు మండలాల నుండి అధిక సంఖ్యలో మహిళా విభాగ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

అక్టోబర్ 14, 15 తేదీల్లో రాజస్థాన్ లోని ఉదయ్‌పూర్‌లో రాష్ట్ర పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ పర్యటన.

దేశంలో ప్రపంచవ్యాప్తంగా పోటీపడగల 50 పర్యాటక గమ్యస్థానాల అభివృద్ధి, పనితీరు ఆధారిత ప్రోత్సాహకాల కల్పన కోసం ఉద్దేశించిన జాతీయ మిషన్ పై చర్చించేందుకు ఏపీ ప్రభుత్వం తరపున ప్రతినిధిగా వెళ్లనున్న మంత్రి కందుల దుర్గేష్. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్న కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, అన్ని రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల పర్యాటక మంత్రులు. పర్యాటక రంగం అభివృద్ధికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ 2025-26 ప్రకటనల అమలుపై రాష్ట్ర విజన్‌ను సమర్పించనున్న మంత్రి దుర్గేష్. జాతీయ మిషన్ క్రింద ఆంధ్రప్రదేశ్ తరపున ఉన్న ప్రతిపాదనలను వివరించనున్న మంత్రి దుర్గేష్. ఆయా రాష్ట్రాల్లో ఎంపిక చేసిన ప్రధాన పర్యాటక గమ్యస్థానాలను రాష్ట్రాల భాగస్వామ్యంతో ‘ఛాలెంజ్ మోడ్’ లో అభివృద్ధి చేయనున్న కేంద్రం పర్యాటక సౌకర్యాలు, పరిశుభ్రత, మార్కెటింగ్ ప్రయత్నాలతో సహా సమర్థవంతమైన గమ్యస్థాన నిర్వహణ కోసం రాష్ట్రాలకు పనితీరు ఆధారిత ప్రోత్సాహకాలు అందించనున్న కేంద్రం పర్యాటక ప్రాంతాల మౌలిక సదుపాయాల నిర్మాణానికి అవసరమైన భూమిని అందించనున్న రాష్ట్రాలు జాతీయ మిషన్ లక్ష్యాలను సాధించేందుకు, ప్రైవేట్ పెట్టుబడులు, స్థానిక ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడం లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం తీసుకోనున్న చర్యలను వివరించనున్న మంత్రి దుర్గేష్ రాష్ట్ర పర్యాటక శాఖలో అవలంభిస్తున్న విధానాలు, పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లకు అందిస్తున్న ప్రోత్సాహకాలను వెల్లడించనున్న మంత్రి కందుల దుర్గేష్. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రాష్ట్రంలో పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేయడం, పర్యాటకులకు అద్భుత అనుభవాలను కల్పించే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం పని చేస్తున్న తీరును వెల్లడించనున్న మంత్రి దుర్గేష్. 2030 నాటికి ఆసియాలోనే అత్యంత ఆకర్షణీయమైన పర్యాటక గమ్యస్థానాలలో ఏపీని ఒకటిగా నిలిపేందుకు తీసుకోనున్న చర్యలను తెలుపనున్న మంత్రి దుర్గేష్.

హనుమకొండ

వరంగల్‌లో క్రెడాయి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ప్రారంభించిన ఎమ్మెల్యే నాయిని…

వరంగల్, అక్టోబర్ 12: హనుమకొండ నగరంలోని పబ్లిక్ గార్డెన్స్ నేరెళ్ల వేణుమాధవ్ ఆడిటోరియంలో క్రెడాయి (CREDAI) వరంగల్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారు, వరంగల్ మేయర్ శ్రీమతి గుండు సుధారాణి గారు, KUDA చైర్మన్ శ్రీ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి గారు, GWMC కమిషనర్ శ్రీమతి చాహత్ బాజ్ పాయ్ గారు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సుమారు 500 మందికిపైగా స్వచ్ఛందంగా రక్తదానం చేయడం విశేషం. రక్తదాన శిబిరాన్ని సందర్శించిన ప్రజాప్రతినిధులు క్రెడాయి వ్యవస్థాపకులకు అభినందనలు తెలిపారు. నిర్మాణ రంగంలో విశేష సేవలందిస్తున్న క్రెడాయి సంస్థ సామాజిక బాధ్యతను కూడా అలవరుచుకుంటూ రక్తదాన వంటి కార్యక్రమాలు చేపట్టడాన్ని ఎమ్మెల్యే నాయిని ప్రశంసించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ రక్తదానం ఒక గొప్ప పుణ్యకార్యం. ఇలాంటి కార్యక్రమాలకు యువత పెద్ద ఎత్తున ముందుకు రావడం ఆనందకరం. క్రెడాయి సంస్థ నిర్మాణ రంగంతో పాటు సామాజిక సేవలోనూ ముందుకు రావడం అభినందనీయం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ పాలక మండలి సభ్యులు EV శ్రీనివాస్ రావు,క్రెడాయి వరంగల్ అధ్యక్షులు నాయిని అమరేందర్ రెడ్డి,ప్రధాన కార్యదర్శి శాఖమూరి అమర్ మరియు క్రెడాయి చైర్మన్ – తిరుపతి రెడ్డి,ప్రెసిడెంట్ ఎలెక్ట్ – శ్రీనివాస్ రెడ్డి,ఉపాధ్యక్షులు – M. రవీందర్ రెడ్డి, L. రజనీకాంత్ రెడ్డి, G. రాజేందర్ రెడ్డి; జాయింట్ సెక్రటరీలు – కొండా రెడ్డి, నాగరాజు, వెంకట మల్లా రెడ్డి; కోశాధికారి – వరుణ్ అగర్వాల్; EC సభ్యులు – రిషిన్ రెడ్డి, మనోహర్, సి. సందీప్, మరియు బాబు రావు సభ్యులతో పాటు, నగర ప్రముఖులు, యువత, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

భద్రాద్రి కొత్తగూడెం

జీఎస్టి తగ్గింది కానీ ధరలు మాత్రం తగ్గలేదు

వర్తించని జిఎస్టి – జిఎస్టి తగ్గినా తగ్గని మందుల ధరలు – పాత స్టాక్ పేరిట పాత రేట్లకే అమ్మకాలు – పట్టికలు లేక ప్రజలు అయోమయం ప్రభుత్వం మందులపై జిఎస్టి రేట్లను తగ్గించి పేద, మధ్యతరగతి ప్రజలకు ఊరట కల్పించాలనే ఉద్దేశ్యంతో నిర్ణయం తీసుకున్నా, ఆ ప్రయోజనం అశ్వారావుపేట ప్రజలకు అందడం లేదు. మండల కేంద్రంలోని పలు మెడికల్ షాపులు ఇప్పటికీ పాత ధరలకే మందులు విక్రయిస్తున్నాయి. కొత్త జిఎస్టి రేట్లు అమలులోకి వచ్చాయంటూ వినియోగదారులు అడిగితే, ఇవి పాత స్టాక్ మందులు అని చెప్పి తప్పించుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దేశవ్యాప్తంగా పన్నులు తగ్గినా ఇక్కడ మాత్రం ఒక్క రూపాయి తగ్గలేదు అని వినియోగదారులు చెబుతున్నారు. ప్రభుత్వ నిర్ణయం ఎక్కడా కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పన్ను తగ్గించిన ప్రయోజనం లేదు : కేంద్ర ప్రభుత్వం ఇటీవల సాధారణ యాంటీబయోటిక్స్‌పై జిఎస్టి 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించగా, కొన్ని జీవరక్షక మందులపై పన్ను పూర్తిగా రద్దు చేసింది. దీంతో మందులు తక్కువ ధరలో అందాలని భావించిన ప్రజలు నిరాశ చెందుతున్నారు. స్థానిక వ్యాపారులు మాత్రం పాత ధరలకే విక్రయిస్తుండడంతో, ప్రభుత్వం చేసిన తగ్గింపు ప్రయోజనం వినియోగదారులకు అందడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పట్టికలు లేవు – పారదర్శకత ఎక్కడ? : జిఎస్టి మారిన తర్వాత ప్రతి షాప్ తమ వద్ద పన్ను రేట్ల పట్టికను స్పష్టంగా ప్రదర్శించాల్సి ఉంటుంది. అయితే అశ్వారావుపేట కేంద్రంలోని చాలా మెడికల్ షాపుల్లో అలాంటి బోర్డులు కనిపించడం లేదు. పాత, కొత్త రేట్ల వివరాలు చూపించకపోవడం వినియోగదారులలో అనుమానాలను కలిగిస్తోంది. అధికారుల నిర్లక్ష్యం : ప్రభుత్వం పన్ను తగ్గించింది కానీ షాపులు మాత్రం మన జేబులు ఖాళీ చేస్తున్నాయి. అధికారులు ఏమి చేస్తున్నారు? అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రెవెన్యూ, ఆరోగ్య, వాణిజ్య పన్ను శాఖలు ఈ అంశంపై గమనించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. సామాజిక సంస్థలు ఈ అక్రమాలను వెంటనే అరికట్టి, తగ్గించిన ధరల్లోనే మందులు అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్

ఆత్మస్థైర్యం, క్రీడా స్ఫూర్తితో లక్ష్యం సాధించండి – పోలీస్ కమిషనర్ డా. శంఖబ్రత బాగ్చి

విశాఖపట్నం, అక్టోబర్ 12 (పున్నమి ప్రతినిధి) విశాఖలో శ్రీ మన్మధరావు మెమోరియల్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన బాస్కెట్‌బాల్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ డా. శంఖబ్రత బాగ్చి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. క్రీడా స్ఫూర్తి, ఆత్మస్థైర్యం, పట్టుదలతో ముందుకు సాగితే ఏ లక్ష్యాన్నైనా సాధించవచ్చని సూచించారు. గెలుపు–ఓటములను సమానంగా చూడాలని, తల్లిదండ్రులు, గురువుల నమ్మకాన్ని నిలబెట్టాలని పిలుపునిచ్చారు. ఈ టోర్నమెంట్‌లో ఓర్ప్రిడ్జ్ ఇంటర్నేషనల్ గర్ల్స్ టీమ్ విజేతగా నిలవగా, సెయింట్ అల్లోయిసిస్ స్కూల్ రన్నరప్‌గా నిలిచింది. క్లబ్ అధ్యక్షుడు రామ్మోహన్ రావు, క్రీడా శిక్షకుడు అన్నెపు రామచందర్, ఇతర అతిథులు పాల్గొన్నారు.

ఖమ్మం

*హన్మకొండ కలెక్టరేట్‌లో మహిళా సిబ్బందిపై అత్యాచారయత్నం

*హన్మకొండ కలెక్టరేట్‌లో మహిళా సిబ్బందిపై అత్యాచారయత్నం..😇* కలెక్టరేట్‌లోనే తోటి మహిళా సిబ్బందిపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించిన ఎస్టాబ్లిష్మెంట్ డిపార్ట్మెంట్‌లో సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న *ఇర్ఫాన్ సోహెల్* నిందితుడి దాడి నుండి తప్పించుకొని సుబేదారి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన బాధితురాలు కలెక్టరేట్‌లోనే అత్యాచారయత్నానికి పాల్పడ్డాడంటే అతనికి పై స్థాయి అధికారుల అండదండలు ఉన్నాయని స్థానికుల ఆరోపణలు. *ఇర్ఫాన్ సోహెల్‌ను సస్పెండ్ చేసిన కలెక్టర్..* *లైంగిక వేధింపులు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసిన పోలీసులు*

కామారెడ్డి

కామారెడ్డి లో ఘనంగా ఆర్ ఎస్ ఎస్ మహిళా పథ సంకలనం

🚩రాష్ట్రీయ సేవికాసమితి కామారెడ్డి 🚩 జిల్లా శాఖ ఆధ్వర్యంలో విజయ దశమి ఉత్సవం సందర్భంగా కామారెడ్డి నగరంలో 282 మంది ఘనవేష్ సేవిక లు ఘోష్ తో సహా పద సంచలనంలో పాల్గొన్నారు.. అనంతరం స్థానిక శ్రీ సరస్వతీ విద్యా మందిర్ హై స్కూల్ నందు సార్వజనిక ఉత్సవం జరిగింది. ఇట్టి ఉత్సవానికి ముఖ్య అతిథిగా డాక్టర్ ఉమ జనార్దన్ గారు పాల్గొన్నారు.. ముఖ్యఅతి మాట్లాడుతూ సమాజంలో భారత దేశ పునర్నిర్మాణంలో మహిళా శక్తి అనిర్వచనీయమైనది. స్త్రీ బహుముఖ ప్రజ్ఞశాలి.. Ex.. మన దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మన ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కల్పనా చావ్లా లాంటివారిని ఆదర్శం గా తీసుకోని దేశ నిర్మాణంలో భాగం కావాలని సేవికలకు పిలుపునిచ్చారు.. తర్వాత ముఖ్య వక్త మాన్యనీయ శ్రీపాద రాధ గారు (తెలంగాణ ప్రాంత కార్యవహిక ) మాట్లాడుతూ భారతదేశం ప్రాచీన సంస్కృతిలో స్త్రీకి ఉన్నతమైన స్థానం ఉంది కేవలం విద్యావంతులే కాని కాక అన్ని రంగాలలో రాణించాలని.. సేవిక సమితికి జిజియా మాత రాణి లక్ష్మీ బాయి హోల్కర్ ఆదర్శంగా ఉంచుకొని పనిచేస్తుంది శివాజీ హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించడానికి శివాజీ హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించడానికి జిజ్జా బాయ్ మాత గారి కృషి ఎంతగానో ఉంది ఝాన్సీ లక్ష్మీబాయి స్వాతంత్ర పోరాటంలో అనేకమంది రాజులతో సమానంగా పోరాడి తమ పోరాడి పోరాడిన వీర నారి కత్తులతో పాలనలో ఎటువంటి పరిస్థితులైన ఎదుర్కొని బంధనాలకు వ్యామోహాలకు లోను కాకుండా నిరంతరం తన బాధ్యతను నిర్వర్తించిన కర్తవ్యనిస్టురాలు ఈ ముగ్గురి యొక్క ఆదర్శంతో రాష్ట్రీయ సేవికాసంతి సమాజంలో ఉన్నటువంటి యువతులకి శిక్షణనిస్తూ భారత దేశ నిర్మాణంలో పాలుపంచుకోవడానికి కృషి చేస్తుంది.. పిల్లలకు సెల్ ఫోన్ కు దూరం గా ఉంచాలి అని తెలిపారు.. విజయదశమి కార్యక్రమంలో శ్రీమతి గుజరాతి సరోజ (విభాగ్ కార్యవాహిక), శ్రీమతి వీరమల్లి సరస్వతి (జిల్లా కార్యవాహిక ) యజ్ఞశ్రీ, రాణి ,బొంతపల్లి కల్పన, కపిల , శ్రీలక్ష్మీ, అత మొదలగు వారు పాల్గొన్నారు

తిరుపతి

యూరియా కొరతను నివారించండి తలపా దామోదరం రెడ్డి

శ్రీకాళహస్తి పట్టణం నందు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులకు యూరియా కొరతను నివారించాలని శ్రీకాళహస్తి డివిజన్ వ్యవసాయ సహాయ సంచాలకులు రమేష్ రెడ్డికి వినతి పత్రం అందజేయడం జరిగినది.ఈ సందర్భంగా శ్రీకాళహస్తి కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తలపా దామోదరం రెడ్డి మాట్లాడుతూ రైతులు యూరియా అంధక పక్క రాష్ట్రమైనటువంటి తమిళనాడు(పల్లిపట్టు) నుండి కొనుగోలు చేస్తున్నారని,దానివల్ల రైతులకు పెట్టుబడులు అధికం అవుతున్నాయని,కావున రాబోవు రబ్బీ సీజన్ దృష్ట్యా రైతులకు యూరియా కొరత లేకుండా చేసి రైతులను ఆర్థిక నష్టాల నుండి కాపాడాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు జనార్దన్ రెడ్డి,శ్రీకాళహస్తి మండల అధ్యక్షులు సురేంద్ర రెడ్డి,పట్టణ యువజన అధ్యక్షులు ఆంటోనీ,నాగరాజు తదితరులు పాల్గొన్నారు

ఆంధ్రప్రదేశ్

సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులుగా గా కె.ఎస్. విశ్వనాథన్ బాధ్యతల స్వీకారం

ఆంధ్ర ప్రదేశ్ సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులుగా కె.ఎస్. విశ్వనాథన్ సోమవారం ఉదయం 8.45 నిమిషాలకు ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ లో గల సమాచార పౌర సంబంధాల శాఖ రాష్ట్ర కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. సమాచార శాఖ సంచాలకులుగా ఉన్న హిమాన్షు శుక్లా శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా నెల్లూరు కలెక్టర్ గా ప్రభుత్వం బదిలీ చేసిన అనంతరం ప్రఖర్ జైన్ కు సమాచార పౌర సంబంధాల శాఖ అదనపు బాధ్యతలు అప్పగించారు. విశాఖ మెట్రోపొలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అధారిటీ కమిషనర్ గా ఉన్న కె.ఎస్. విశ్వనాథన్ ను సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు గా నియమిస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. గతం లో ఆయన అనంతపురం అసిస్టెంట్ కలెక్టర్ గా, నరసాపురం సబ్ కలెక్టర్ గా, ప్రకాశం, విశాఖపట్టణం జిల్లాల జాయింట్ కలెక్టర్ గా బాధ్యతలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో బాధ్యతలు స్వీకరించిన విశ్వనాథన్ కు సమాచార శాఖ ఉన్నతాధికారులు, అధికారులు, సిబ్బంది అభినందనలు తెలిపారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం శాఖ కార్యకలాపాలు, నిర్వర్తిస్తున్న విధులపై అధికారులతో నూతన సంచాలకులు సమీక్షించారు. *జారీ చేసిన వారు: సంచాలకులు సమాచార పౌర సంబంధాల శాఖ, విజయవాడ*

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.