Wednesday, 29 April 2026

Blog

ఆంధ్రప్రదేశ్ కామారెడ్డి తెలంగాణ

రామారెడ్డి ఎస్ఐ  రాజశేఖర్ పదవి బాధ్యతలు

కామారెడ్డి, 13 అక్టోబర్, పున్నమి ప్రతినిధి   : కామారెడ్డి జిల్లాలోని రామారెడ్డి మండల పోలీస్ స్టేషన్‌కు నూతన సబ్-ఇన్‌స్పెక్టర్ (ఎస్ఐ )గా రాజ శేఖర్ బదిలీపై వచ్చినట్లు తెలుస్తోంది. గతంలో ఆయన జిల్లాలోని ఇతర పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహించినట్లు సమాచారం.ఈ స్థానంలో ఇంత కు ముందు పనిచేసిన ఎస్ఐ ఆర్. లావణ్య బదిలీ అయ్యారు. ఆమె గ్రూప్-1 పరీక్షల్లో విజయం సాధించినందున, పరిపాలనా విధుల్లో భాగంగా ఆమెను సోషల్ వెల్ఫేర్ శాఖకు బదిలీ చేస్తూ ఉన్న తాధికారులు ఉత్తర్వులు జారీ చేసినట్లు విశ్వస నీయ వర్గాల ద్వారా తెలిసింది.కొత్తగా వచ్చిన ఎస్ఐ రాజశేఖర్ రామారెడ్డి పోలీస్ స్టేషన్‌లో బాధ్యతలు స్వీకరించారు. 

భద్రాద్రి కొత్తగూడెం

మైనర్ గిరిజన బాలికల ఆచూకీ లభ్యం

మైనర్ గిరిజన బాలికల ఆచూకీ లభ్యం. అంకంపాలెం లో కలకలం రేపిన ఘటనకు చెక్. పోలీసులను అభినందించిన కళాశాల యాజమాన్యం. పున్నమి ప్రతినిధి – 13 అక్టోబర్ మండల పరిదిలోని అంకంపాలెం గిరిజన గురుకుల బాలికల జూనియర్ కళాళాలలో ఇద్దరు మైనర్ బాలికలు అదృశ్యమైన ఘటన స్ధానికంగా కలకలం రేపిన సంగతి గ్రామస్ధులు మరువక ముందే పోలీసులు బాలికల ఆచూకీ తెలుసుకున్నారు. ఖమ్మం బస్టాండ్ లో పోలీసులు బృందలుగా ఏర్పడి గాలింపులు చేయగా బస్టాండ్ లో సోమవారం రాత్రి పట్టుబడ్డారు.. దీంతో కళాశాల యాజమాన్యం ,విద్యార్థుల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. అధికారికంగా పూర్తి వివరాలను పోలీసులు వివరించాల్సి ఉంది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణ సమీపంలోని రేగళ్ళపాడుకు చెందిన ఇద్దరు గిరిజన మైనర్ బాలికలు ,దమ్మపేట మండలం అంకంపాలెం లో ఉన్న గిరిజన బాలికల గురుకుల జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుచున్నారు. పాఠశాల అధ్యాపక బృందానికి సమాచారం ఇవ్వకుండా ఆదివారం బయటకు వెళ్ళారు. ఎంతసేపటికి తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చి విద్యార్ధినిల తల్లిదండ్రులకు విషయం తెలియజేశారు. తల్లిదండ్రులు ,బంధువుల తో కలిసి చుట్టుపక్కల పల్లెల్లో ,గ్రామాల్లో ఆచూకీ కోసం యత్నాలు చేశారు. ఎంతకీ ఆచూకీ లభ్యం కాకపోవడంతో ఆదివారం రాత్రి షుమారుగా 11 గం.ల సమయంలో దమ్మపేట పోలీసులకు లెక్చరర్ బాణోత్ హరిత ఫిర్యాదు చేశారు. ఉపాద్యాయ సిబ్బంది ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో బాగంగా ఖమ్మం బస్టాండ్ లో పోలీసులకు బాలికలు పట్టుబడటంతో కళాశాల అద్యాపకులు ,తలిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.

అన్నమయ్య

రైల్వే కోడూరు నియోజకవర్గం* *షేక్ హఫీజ్ ఉల్లా గారికి రూ.69,497/- ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును అందజేసిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు మరియు ముక్కా సాయి వికాస్ రెడ్డి గారు*

రైల్వే కోడూరు నియోజకవర్గం* *షేక్ హఫీజ్ ఉల్లా గారికి రూ.69,497/- ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును అందజేసిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మరియు ముక్కా సాయి వికాస్ రెడ్డి కోడూరు పట్టణం పగడాల పల్లి కి చెందిన షేక్ హఫీజ్ ఉల్లా గారికి రూ.69,497/- ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును వారి స్వగృహం వద్ద *ప్రభుత్వ విప్ మరియు రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్ గారు మరియు రైల్వే కోడూరు నియోజకవర్గం టీడీపీ పార్టీ ఇంచార్జ్ & కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి గారి తనయుడు ముక్కా సాయి వికాస్ రెడ్డి గారు* అందజేశారు. *ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు మాట్లాడుతూ*, “ప్రజల కష్టసమయంలో ప్రభుత్వం అండగా ఉండటం కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. ముఖ్యమంత్రి గారు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అనేక కుటుంబాలకు చేయూత అందిస్తున్నారు. ప్రతి అర్హుడికి ప్రభుత్వం సహాయం చేరేలా కృషి చేస్తున్నాం” అన్నారు. *ముక్కా సాయి వికాస్ రెడ్డి గారు మాట్లాడుతూ*, “సీఎం రిలీఫ్ ఫండ్ ప్రజల ఆరోగ్య భద్రతకు, ఆర్థిక స్థిరత్వానికి ఎంతో ఉపయోగకరంగా నిలుస్తోంది. ఈ సహాయం బాధిత కుటుంబాలకు మానసిక ధైర్యం, ఆర్థిక బలాన్ని అందిస్తుంది” అని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనార్టీ కార్యదర్శి షేక్ జుబేర్ మరియు NDA కూటమి నేతలు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఉదయగిరి కీ 34 మంది నూతన టీచర్ల భాద్యతలు

మెగా డీఎస్సీ లో ఉద్యోగాలు సాధించిన 34 మంది నూతన టీచర్లను ఉదయగిరి కీ కేటాయించారని ఎం ఈ వో తోట శ్రీనివాసులు తెలిపారు ఇద్దరు SGT లు 32 మంది స్కూలు అసిస్ట్oటు బాధ్యతలు తీసుకున్నారు అనీ చెప్పారు ఉదయగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అన్ని పోస్టులు భర్తీ చేస్తామన్నారు

నిర్మల్

ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులుగా ఆమెడ శ్రీధర్

నిర్మల్ అక్టోబర్ 13 ( పున్నమి ప్రతినిధి ) నిర్మల్ పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులుగా నూతనంగా *ఆమెడ శ్రీధర్* ఎన్నికయ్యారు. సోమవారం *రాష్ట్ర మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి* గారిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు ఈ సందర్భంగా శ్రీధర్ను మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి గారు శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపి అభినందించారు రానున్న రోజుల్లో సంఘ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు తన సహకారం ఎప్పుడూ ఉంటుందని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో పోలిశెట్టి సురేందర్, PV. రమణ రెడ్డి PACS చైర్మన్, మాజీ కౌన్సిలర్ మేడారం ప్రదీప్, రఘు తదితరులున్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఉదయగిరి నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తూ, అభివృద్ధి కార్యక్రమాలకు నూతన దిశ చూపిస్తున్న నాయకుడు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ .

ఉదయగిరి నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యం- ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అడుగులు..!* ఉదయగిరి నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తూ, అభివృద్ధి కార్యక్రమాలకు నూతన దిశ చూపిస్తున్న నాయకుడు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు. పదవిలోకి వచ్చిన కేవలం 16 నెలల వ్యవధిలోనే ఆయన ఆధ్వర్యంలో దాదాపు ₹200 కోట్ల విలువైన అభివృద్ధి పనులు విజయవంతంగా ప్రారంభమయ్యాయి. *రోడ్ల నిర్మాణం మరియు మౌలిక సదుపాయాలు* నియోజకవర్గంలోని అన్ని మండలాలకు అనుసంధానంగా లింక్ రోడ్లు ఏర్పాటు చేయడంలో గణనీయమైన పురోగతి సాధించారు. సుమారు ₹100 కోట్ల రూపాయలతో రహదారి అభివృద్ధి పనులు ప్రారంభమై, గ్రామీణ ప్రాంతాల రవాణా సౌకర్యాలు మెరుగుపడుతున్నాయి. *ఆరోగ్య రంగ అభివృద్ధి* ఉదయగిరిలోని సామాజిక ఆరోగ్య కేంద్రం అభివృద్ధికి ₹5.50 కోట్ల నిధులు రాబట్టడం ద్వారా ఆరోగ్య సేవల విస్తరణకు శ్రీకారం చుట్టారు. అదేవిధంగా వింజమూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయడం వల్ల స్థానిక రోగులకు తక్కువ ఖర్చుతో సౌకర్యవంతమైన వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. *మౌలిక వసతులు మరియు పట్టణ అభివృద్ధి* వింజమూరులో ₹1.75 కోట్లతో డ్రైనేజ్ నిర్మాణాలు చేపట్టారు. అదేవిధంగా అన్నా క్యాంటీన్ త్వరలో ప్రారంభం కానుంది, దీనివల్ల పేద మరియు మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరలో నాణ్యమైన ఆహారం లభిస్తుంది.20 గ్రామాల్లో విద్యుత్ సౌకర్యాల విస్తరణ చేపట్టడం జరిగినది. అలాగే 60 గ్రామాల్లో త్రాగునీటి కోసం ₹5 కోట్ల వ్యయంతో ఆర్‌.ఓ ప్లాంట్లు ఏర్పాటు చేయబడ్డాయి. *విద్యా రంగం పట్ల ప్రాధాన్యం* విద్యాశాఖ మంత్రి లోకేష్ గారిని కలసి, నియోజకవర్గంలోని 20 ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల మెరుగుదలకు ₹3 కోట్ల నిధులు రాబట్టారు. ఈ నిధులతో మరుగుదొడ్లు, త్రాగునీటి సౌకర్యాలు, గదుల నిర్మాణం వంటి పనులు జరుగుతున్నాయి. ఇంకా గండిపాలెం పాఠశాల అభివృద్ధికి ₹1.75 కోట్లు, అలాగే ఉదయగిరి డిగ్రీ కాలేజ్ నిర్మాణానికి ₹5 కోట్లు కేటాయించబడినాయి. సీతారామపురం దుత్తలూరు కలిగిరి కొండాపురం మండలాలలో గల కస్తూరిబా విద్యాలయాలకు నూతన భవనాల నిర్మాణం కొరకు సుమారు 6 కోట్ల రూపాయలను మంజూరు చేయించడం జరిగినది. *పరిశ్రమలు మరియు ఉపాధి అవకాశాలు* కలిగిరి మండలంలో 250 ఎకరాల విస్తీర్ణంలో ఎంఎస్ఎంఈ పార్క్ నిర్మాణం త్వరలో ప్రారంభం కానుంది. ఈ పార్క్ ద్వారా స్థానిక యువతకు వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. *గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాలు* మొత్తం 143 పంచాయతీల్లో ₹55 కోట్ల నిధులతో 845 సిమెంట్ రోడ్ల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. అదనంగా, కావలి–కొమ్మి–కొండాపురం రోడ్ల అభివృద్ధికి ₹3.25 కోట్లు రాబట్టారు. విద్యుత్ శాఖకు చెందిన ఏఈ కార్యాలయ నిర్మాణానికి ₹2 కోట్లు కేటాయించబడ్డాయి. *సామాజిక సేవా కార్యక్రమాలు* ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు కేవలం ప్రభుత్వ నిధులపైనే ఆధారపడకుండా, కాకర్ల ట్రస్ట్ ద్వారా కూడా ఆపదలో ఉన్న వారికి, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు, దాదాపు 900 మంది నిరుపేద ఆడబిడ్డలకు పెళ్ళికానుకగా 10 వేల రూపాయలను కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిరంతర సహాయం అందిస్తున్నారు. *వింజమూరు పట్టణాభివృద్ధి* నుడా (NUDA) నిధులతో వింజమూరు పట్టణంలో సెంటర్ లైటింగ్ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఈ చర్యలతో పట్టణం మరింత ఆకర్షణీయంగా, సురక్షితంగా మారనుంది. మొత్తం మీద, కేవలం 16 నెలల వ్యవధిలోనే ఉదయగిరి నియోజకవర్గ అభివృద్ధి పథంలో దూసుకుపోతుండగా, ఈ విజయాల వెనుక ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారి దూరదృష్టి, పట్టుదల, ప్రజల పట్ల ఉన్న సేవాభావం ప్రధాన శక్తిగా నిలిచింది.

నాగర్‌కర్నూల్

ఈనెల 22 వరకు సత్యసాయి ఉచిత టైలరింగ్,మగ్గం వర్క్, జ్యూట్ బ్యాగుల తయారీ శిక్షణకు మహిళలు దరఖాస్తు చేసుకోవలెను

పున్నమి ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా అక్టోబర్ 13 భగవాన్ శ్రీ సత్య సాయి బాబా శతజయంతి ఉత్సవాలు 2025 సందర్భంగా నాగర్ కర్నూల్ శ్రీ సాయి ప్రశాంతి చారిటబుల్ సేవా ట్రస్ట్ మరియు సత్యసాయి సేవా సమితి వారి ఆధ్వర్యంలో మహిళలకు 45 రోజుల పాటు ఉచితంగా లేడీస్ టైలరింగ్,జ్యూట్ బ్యాగుల తయారీ మరియు మగ్గం వర్క్స్, జ్యూట్ బ్యాగుల తయారీ లపై వేరువేరుగా ప్రత్యేకంగా నాగర్ కర్నూలు సత్యసాయి మందిరంలో ఈనెల 23 నుండి శిక్షణ ఇవ్వనున్నట్లు సత్యసాయి సేవా సమితి కన్వీనర్ హకీం విశ్వప్రసాద్, శ్రీ సాయి ప్రశాంతి చారిటబుల్ సేవా ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి ఎలిమే ఈశ్వరయ్యలు తెలిపారు. మహిళలు దరఖాస్తు చేసుకునేవారు కనీసం చదవడం, వ్రాయడం వచ్చి ఉండాలని అన్నారు. శిక్షణ మహిళా శిక్షకురాలుచే ప్రత్యేకంగా నాగర్ కర్నూల్ సత్యసాయి మందిరం ఆవరణలో శిక్షణా తరగతులు లేడీస్ వస్త్రాల తయారీ (టైలరింగ్), జ్యూట్ బ్యాగుల తయారీ కుట్టుట నేర్పుట, మరియు మగ్గం వర్క్, జ్యూట్ బ్యాగుల తయారీ కుట్టుట నేర్పుటలలో వేరువేరుగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు.శిక్షణ సమయంలో భోజన, నివాస వసతి సత్యసాయి మందిరంలో కల్పించనున్నట్లు తెలిపారు. శిక్షణ పొందుటకు మహిళలు ఈనెల 22 బుధవారం వరకు ఒక ఫోటో, ఆధార్ కార్డు జిరాక్స్ , వ్యక్తిగత సెల్ నెంబర్ తో పాటు దరఖాస్తులు నాగర్ కర్నూల్ సత్యసాయి మందిరంలో అందజేయాలని సూచించారు.శిక్షణ తరగతులు ఈనెల 23 గురువారం నుండి ప్రారంభమగునని తెలిపారు. మరిన్ని వివరాలకు రంగారావు గారిని సాయి మందిరంలో నేరుగా లేదా సెల్ 6281412245 లేదా 9441303182 లలో సంప్రదించాలన్నారు.

E-పేపర్

కల్తీ మద్యాన్ని అరికట్టాలని కదం తొక్కిన మహిళలు నంద్యాల జిల్లా ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ కార్యాలయంలో అధికారులకు వినతి పత్రం అందజేత

రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో కల్తీ మద్యం వల్ల అమాయక ప్రజలు ప్రాణాలు గాల్లో కలిసి పోతున్నాయని, కూటమి ప్రభుత్వం కల్తీ మద్యాన్ని అరికట్టాలని ప్రజల ప్రాణాలను కాపాడాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ కార్యాలయంలో సంబంధిత అధికారులకు వైఎస్ఆర్సిపి మహిళ నేతలు, వైఎస్ఆర్సిపి నాయకులు, ప్రజా సంఘాల మహిళలు ప్రజాప్రతినిధులు, పట్టణంలోని మహిళలు స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున తరలివచ్చి వినతిపత్రం అందజేశారు. నకిలీ మద్యాన్ని అరికట్టాలని మహిళల పుస్తెలతో ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు ఆడుకుంటున్నాడని, మహిళల చిన్నారుల వృద్ధుల మానప్రాణాలను కాపాడాలని, రక్షణ కల్పించాలని నంద్యాల మహిళలు వైసిపి నాయకులు కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వైసిపి మహిళలు నాయకులు మాట్లాడుతూ… కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో నకిలీ మద్యాన్ని విచ్చలవిడిగా విక్రయిస్తూ మద్యాన్ని ఏరులై పారిస్తున్నారని ఆరోపించారు. ఎక్కడైనా మంచినీరైన దొరకకపోవచ్చు కానీ ఈ కూటమి ప్రభుత్వంలో మద్యం మాత్రం అడుగడుగునా ఎక్కడ పడితే అక్కడ బహిరంగంగానే లభ్యమవుతుందని విమర్శించారు. రాష్ట్రంలో కల్తీ మద్యం తాగి అనేకమంది అమాయక ప్రజలు ప్రాణాలను కోల్పోయారని, కుటుంబాలు రోడ్డున పడ్డాయని, వీటన్నిటిని చూస్తూ ఎక్సైజ్ శాఖ మంత్రి చోద్యం చూస్తూ ఉండటం సరికాదని, కల్తీ మద్యం నియంత్రించలేని మంత్రి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బడి లేదు గుడి లేదు ఎక్కడైనా మద్యం దొరుకుతుందని, అడుగడుగునా బెల్టు షాపులను ఏర్పాటు చేసి మద్యం విక్రయిస్తున్నారని పేర్కొన్నారు. మద్యం సేవించిన వారు మహిళలను వేధింపులకు గురి చేస్తూ హత్యలు, అత్యాచారాలు, దాడులు చేస్తూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఇటువంటి నకిలీ మద్యాన్ని నియంత్రించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. మద్యం తాగిన వ్యక్తులు విచక్షణ కోల్పోయి తల్లి , చెల్లి కానరాక అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని వాపోయారు. ముఖ్యంగా చిన్నారులపై అత్యాచారాలకు ఒడిగడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కల్తీ మద్యం రాష్ట్రంలో ఏరులై పారుతున్నదని, కూటమి ప్రభుత్వం మద్యాన్ని నియంత్రించలేని పరిస్థితికి వచ్చిందని, పూర్తిగా విఫలం అయిందని విమర్శించారు. కల్తీ మద్యాన్ని నియంత్రించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో నంద్యాల జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్, మున్సిపల్ చైర్ పర్సన్ మాభున్నిసా, మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్, స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నెంబర్ రామలింగారెడ్డి, స్టేట్ జనరల్ సెక్రెటరీ వైఎస్ఆర్సిపి మహిళా విభాగం జనరల్ సెక్రెటరీ శశికళ రెడ్డి, మాజీ దృశ్యకలాల డైరెక్టర్ సునీత అమృతరాజ్, జిల్లా మేధావుల సంఘం అధ్యక్షుడు రసూల్ ఆజాద్, జిల్లా అధికార ప్రతినిధి అనిల్ అమృత రాజ్, జిల్లా జనరల్ సెక్రెటరీ దేవనగర్ భాష,నంద్యాల జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు టివి రమణ, జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు రామసుబ్బయ్య, అసెంబ్లీ లీగల్ గ్రీవెన్స్ అధ్యక్షుడు వివేకానంద రెడ్డి, ,ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు రామచంద్రుడు, క్రిస్టియన్ మైనారిటీ జిల్లా అధ్యక్షుడు కారు రవికుమార్, క్రిస్టియన్ మైనారిటీ అసెంబ్లీ అధ్యక్షుడు మనోజ్ , వైసిపి అసెంబ్లీ యూత్ అధ్యక్షుడు శ్రీనివాసులు, అసెంబ్లీ మహిళ అధ్యక్షురాలు హుస్సేనమ్మ, మాజీ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ హైమావతి, నంద్యాల మండలం ఎంపీపీ శెట్టి ప్రభాకర్, నంద్యాల మండలం వైసీపీ అధ్యక్షుడు బసవేశ్వర రెడ్డి, కౌన్సిలర్స్ కృష్ణమోహన్ మేష చంద్రశేఖర్, చంద్రశేఖర్ రెడ్డి ,సుబ్బలక్ష్మి, శాదిక్ భాష, కోఆప్షన్ సభ్యులు శోభారాణి, సర్పంచులు కోటిరెడ్డి, రామసుబ్బయ్య రఘురామిరెడ్డి, ఐజయ్య, సుబ్బయ్య, మాజీ కౌన్సిలర్స్ మునయ్య కన్నమ్మ జాకీర్ హుస్సేన్, లక్ష్మీనారాయణ, పూన్న శేషయ్య, వైసీపీ నాయకులు, గన్ని కరీం, కిరణ్ కుమార్ సాయిరాం రెడ్డి ,రహంతుల్లా పార్ధుడు, ఎద్దు రవి, జలీల్, కాల్వ నాగరాజు, చాణిక్య రాజు, మూలసగరం భాస్కర్ రెడ్డి, మధు గౌడ్, శంకర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శంకర్ నాయక్, తదితరులు పాల్గొన్నారు

తిరుపతి

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్ మీద దాడిని ఖండిస్తూ దద్దరిల్లిన తిరుపతి జిల్లా కలెక్టర్ ఆఫీస్…

దద్దరిల్లిన తిరుపతి జిల్లా కలెక్టర్ ఆఫీస్… 13-10-2025 సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్ మీద దాడిని ఖండిస్తూ…. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అన్న గారి ఆదేశాల మేరకు… ఈ రోజు తిరుపతి జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు నిరసన ధర్నా చేయడం జరిగినది… ముఖ్య అతిథి:- తిరుపతి జిల్లా ఇంచార్జ్ వర్ల దేవదాస్ మాదిగ అన్న గారు…. జయహో పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అన్నగారు… మేత్తాళ్ల చంద్ర మాదిగ MRPS సోషల్ మీడియా AP రాష్ట్ర కోఆర్డినేటర్

Blog

ప్రదాని వాల్మీకుల ST పునరుద్దరణపై 16వ తేదీన స్పష్టమైన ప్రకటన చెయ్యాలని ఎంవిఆర్పీఎస్ డిమాండ్

మనదేశ ప్రదాని నరేంద్రమోడీ వాల్మీకుల చిరకాల కోరిక ST పునరుద్ధరణ కార్యాచరణ పై స్పష్టమైన ప్రకటన చెయ్యాలని మహర్షి వాల్మీకి రిజర్వేషన్ ప్రజాసమితి రాష్ట్ర అధ్యక్షులు బోయ పులికొండన్న ఉపాధ్యక్షులు నాగేశ్వరరావు,రాష్ట్రన్యాయ సలహాదారులు లాయర్ బోయ సుబ్బారాయుడు లు డిమాండ్ చేశారు సోమవారం నంద్యాలలో ముఖ్యనేతలతో కలిసి మీడియాతో మాట్లాడుతూ ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం 2017 లో అసెంబ్లీలో వాల్మీకులను ST లుగా పునరుద్ధరించేందుకు అన్ని విధాలుగా అర్హులు అని తీర్మానం చేసి కేంద్రానికి పంపితే 2018 లోనే రెండు పర్యాయాలు కేంద్రప్రభుత్వ అనుబంధ సంస్థలైన RGI, SC, ST కమీషన్లు సవరణల పేరుతో వెనక్కు పంపటం జరిగింది,2019 తరువాత ప్రభుత్వం మారటం,మళ్ళీ 2023లో అసెంబ్లీలో తీర్మానం చేసినా ఎక్కడి గొంగళి అక్కడే ఉండిపోయింది,అయితే 2019 లో కర్నూల్ వచ్చిన ప్రధాని వాల్మీకుల గురించి మాట్లాడుతూ ఎప్పటినుండో మీరు ఇబ్బంది పడుతున్నారు,మీ సమస్య ,మీ బాధలు మాకుతెలుసు నన్ను నమ్మండి మీకు న్యాయం చేస్తా అని చెప్పి అధికారంలోకి వచ్చినా స్పందన లేదని,ఈ నెల 16న ఉమ్మడి కర్నూల్ జిల్లా పర్యటనకు వస్తున్న ప్రధాని వాల్మీకుల ST పునరుద్దరణపై కార్యాచరణ చేపట్టి పార్లమెంట్ లో ఆమోదం పొందేలా చేస్తానని స్పష్టమైన ప్రకటన చెయ్యాలని డిమాండ్ చేశారుగౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా అసెంబ్లీలో తీర్మానం విషయం,రాష్ట్రంలో 6 దశబ్దాలుగా వాల్మీకులు చేస్తున్న ఉద్యమాలు వారు నష్టపోయిన మేము ఆర్థిక,సామాజిక,రాజకీయంగా నష్టపోయిన విధానం,రాష్ట్రంలో ప్రాంతీయ విభేదం,పక్కరాష్ట్రం కర్ణాటకలో వాల్మీకులు ST లుగా ఉన్నవిషయాలు కూలంకుసంగా వివరించి వారిని మెప్పించి పార్లమెంట్ లో ఆమోదం పొందేలా చూడాలని విజ్ఞప్తి చేసారు ఈ సమావేశంలో ఎంవిఆర్పీఎస్ జిల్లా యూత్ ఉపాధ్యక్షులు పరమేష్,సహాయ కార్యదర్శి మల్లికార్జున మండల నాయకులు బాలహుసేన్ ,బొగ్గులై ఎంవిఆర్పీఎస్ నేతలు టైలర్ శేఖర్,కేశవ, పట్టణ నాయకులు RMP మధు,యూత్ నాయకులు నిఖిల్,NGOS కాలనీ ఎంవిఆర్పీఎస్ నాయకులు రాంపుల్లయ్య,రమణ,మనోజ్ మహేష్ తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.