Wednesday, 29 April 2026

Blog

అనకాపల్లి

275 కిలోల గంజాయి స్వాధీనం అక్రమ రవాణా లో పాల్గొన్న ముగ్గురిని అరెస్ట్ చేసిన చోడవరం పోలీసులు

₹13.75 లక్షల విలువ గల 275 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, అక్రమ రవాణాలో పాల్గొన్న ముగ్గురిని చోడవరం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఆపరేషన్‌ను జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ మార్గదర్శకత్వంలో, డీఎస్పీ శ్రావణి ఆధ్వర్యంలో సీఐ అప్పలరాజు, ఎస్ఐలు నాగ కార్తీక్, జోగారావు బృందం విజయవంతంగా నిర్వహించింది. ముంచంగిపుట్టు నుంచి రాజస్థాన్‌కు తరలించేందుకు ప్రయత్నించిన 275 కిలోల గంజాయి, టాటా కరువి కార్, రెండు బైక్‌లు, ఐదు మొబైల్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ తుహిన్ సిన్హా మాట్లాడుతూ డ్రగ్స్‌ రవాణా, వాడకం పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారు. ప్రజలు సమాచారాన్ని వెంటనే పోలీసులకు తెలియజేయాలి” అన్నారు.

అనకాపల్లి

ఉపాధి హామీ కూలీలకు ఇ కెవైసీ పూర్తిచేయాలి

నవంబరు నెల నుండి ముఖ అధారిత హాజరు తప్పనిసరి జిల్లా కలెక్టరు విజయ కృష్ణన్ ఉపాధి హామీ కూలీలకు నవంబరు నెల నుండి ముఖ అధారిత హాజరు తప్పనిసరి కావున అందుకు అవసరమైన ఇ-కెవైసీ వెంటనే పూర్తిచేయాలని జిల్లా కలెక్టరు విజయ కృష్ణన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరు కార్యాలయం నుండి మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఉపాధి హామీ పధకంపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టరు నిర్దేశించిన లక్ష్యాలపై, వాటి సాధనపై సమీక్షించారు. సమావేశంలో జిల్లా కలక్టరు మాట్లాడుతూ నవంబరు నెల నుండి ఉపాధి హామీ కూలీలకు హాజరు వేయాలన్నా, వారికి డబ్బులు అందించాలన్నా ముఖ అధారిత హాజరు తప్పనిసరి అని అందువలన ఇ-కెవైసీ వెంటనే పూర్తిచేయాలని ఆదేశించారు. నిర్దేశించిన లక్ష్యాలు ప్రకారం పనులు పూర్తిచేయాలని తెలిపారు. ప్రతి మండలానికి ఒక మేజిక్ డ్రయిన్ పూర్తిచేయాలని, లక్ష్యం మేరకు ఉపాధి హామీ పధకం కూలీలను సమీకరించాలని, వారికి కనీస వేతనం అందేలా పనులు కల్పించాలని తెలిపారు. ఇంటి నిర్మాణాలకు సంబంధించి 90రోజుల పనిదినాలు కల్పించాలని తెలిపారు. పి ఎం ఎ వై 1.0 పధకం డిశంబరు 2025 నాటికి పూర్తికానున్నందున లబ్దిదారులు ప్రతి ఒక్కరు ఈ పధకాన్ని సద్వియోగం చేసుకొనేలా, వారికి లబ్ది చేకూరేలా పనులు పూర్తిచేయాలన్నారు. ఉపాధి హామీ పధకం ద్వారా 2000 ఎకరాలలో పండ్ల మొక్కలు నాటడం లక్ష్యం కాగా లక్ష్యానికి మించి 2050 ఎకరాలలో పనులు చేయడం జరిగిందని వాటిని సంబంధిత యాప్ నందు నమోదుచేయాలని తెలిపారు. మండలాలకు మంజూరు చేసిన నీటికుంటలు, పశువుల షెడ్లు పనులు మొదలు పెట్టి పూర్తిచేయాలని తెలిపారు. సోషల్ ఆడిట్ లో గుర్తించిన రికవరీలు వసూలు చేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3లక్షల ఇళ్లు గృహప్రవేశాల కార్యక్రమానికి జిల్లా స్థాయి కార్యక్రమం పాయకరావుపేట మండలం నామవరం గ్రామం లే అవుట్ లో నిర్వహించడం జరుగుతుందని, కావున లే అవుట్ లో మౌళిక సదుపాయాలు పూర్తిచేయాలని సంబంధిత శాఖల అదికారులను ఆదేశించారు. ప్రతి నియోజకవర్గంలో ఈ కార్యక్రమం నిర్వహించుటకు ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ సమావేశంలో గృహనిర్మాణశాఖ ప్రోజెక్టు డైరెక్టరు శ్రీనివాస్, డుమా పిడి పూర్ణిమాదేవి, డిపిఒ సందీప్ ఇతర అదికారులు, మండల అభివృద్ది అధికారులు పాల్గొన్నారు.

తెలంగాణ

స్వచ్ఛత హీ – సేవ

స్వచ్ఛత హీ – సేవ పున్నమి వార్తలు, మేడ్చల్, తెలంగాణ. స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో భాగంగా శ్రీనిధి ఇంజనీరింగ్ కళాశాల NSS విద్యార్థులు, విద్యార్థినులు సేవలు చేయుచున్నారు. పరిసర శుభ్రతతో పాటు సామాజిక కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహిస్తున్నారు. భాగంగా నాడు సిద్దిపేట జిల్లా, బిబిపేట మండలంలోని ముదుమల గ్రామములో విద్యార్థులు ప్రముఖంగా గ్రామములో పాఠశాల పరిసరాలు, రహదారుల పరిసరాలు శుభ్రపరిచారు. తదుపరి పాఠశాల విద్యార్థులకు ముఖ్యంగా పాఠశాల శుభ్రత యొక్క ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. చెత్తను పాఠశాల పరిసరాలలో వేయకూడదని, పాఠశాలలో స్వచ్ఛతతో పాటు ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని విద్యార్థులకు వివరించారు. అలాగే పరిసర శుభ్రత కార్యక్రమంలో భాగంగా చెట్లకు నీరు పోశారు. పాఠశాల ప్రాంగణంలో ఉన్న చెట్లకు విద్యార్థులు నీరు పోశారు. గ్రామములో ఈ కార్యక్రమం మార్పులకు నాంది పలికింది. గ్రామములో విద్యార్థుల పరిసర శుభ్రత కార్యక్రమము చూసి గ్రామ ప్రజలు స్ఫూర్తి పొంది తమ ఇళ్ల పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని నిర్ణయించుకున్నారు. దీనివల్ల గ్రామ ప్రజలలో శ్రద్ధ, భాద్యత పెరిగాయి. గ్రామస్థులు కలసి ఈ స్వచ్ఛత కార్యక్రమము నిర్వహించారు. అలాగే విద్యార్థులు రక్తదాన స్వచ్ఛత సేవా కార్యక్రమములో పాల్గొన్నారు. సామాజిక సేవా కార్యక్రమాలు చేయుటకు NSS కార్యకర్తలు ముందుకు వచ్చారు. తమ కార్యక్రమములోనూ, గ్రామముల, పాఠశాలల శుభ్రత కార్యక్రమములోనూ విజయం సాధించారు.

విశాఖపట్నం

ఐఐఏఎం బిజినెస్ స్కూల్ లో కోర్ కాంపిటెన్సిస్ పై ట్రైనింగ్ కమ్ వర్క్ షాప్!

పున్నమి ప్రతినిధి అక్టోబర్ 13 ఇంటిగ్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ మేనేజ్‌మెంట్ (ఐ ఐ ఎ ఎం) బిజినెస్ స్కూల్, నావల్ డాక్‌యార్డ్, విశాఖపట్నం సహకారంతో, నావల్ డాక్‌యార్డ్ ఫోర్‌మన్ మరియు చార్జ్‌మన్‌ల కోసం “కోర్ కంపెటెన్సీస్ డెవలప్మెంట్” అనే అంశంపై 10రోజుల ట్రైనింగ్-కమ్ వర్క్‌షాప్‌ను సోమవారం ఎం వీ పీ కోలనీలోగల ఐ ఐ ఎ ఎం ఆడిటోరియంలో విశాఖ చాప్టర్, కార్యదర్శి డా. బి. కృష్ణ కుమారి స్వాగత ప్రసంగంతో ప్రారంభమైనాయి. రీడ్ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ డీన్ & సెక్రటరీ డా. ఎస్. పి. రవీంద్ర వర్క్‌షాప్ యొక్క లక్ష్యాలను వివరిస్తూ “సంస్థలు నిరంతరం మారుతున్న కాలంలో డైనమిక్ వాతావరణంలో నాయకత్వ నైపుణ్యాలను అలవరచుకోవాలని అది అత్యవసరమని అభిప్రాయపడ్డారు. డిఫెన్స్ ప్రోగ్రామ్స్ అకడెమిక్ అడ్వైజర్ డా. ఉజ్జ్వల్ కుమార్ ఘట్టక్ రక్షణ సిబ్బందిలో నిరంతర ప్రొఫెషనల్ లెర్నింగ్ నాయకత్వ సామర్థ్యాల ప్రాధాన్యతను వివరించారు. గౌరవ అతిథి ఇమ్తియాజ్ అర్షద్, సిఇఓ & సెక్రటరీ, హెచ్‌పిసిఎల్–ఎస్డిఐ, నావల్ డాక్‌యార్డ్ టెక్నికల్ లీడర్లకు నైపుణ్యాభివృద్ధి అవకాశాలను కల్పించే ఈ సంయుక్త ప్రయత్నాన్ని అభినందిందిస్తూ “ప్రతి ఉద్యోగి ఒక చిన్నారి వలె ఆసక్తిగా నేర్చుకోవడం ద్వారానే మనం అభివృద్ధి చెందుతామని తద్వారా పనివాతావరణానికి తగిన మార్పును తెచ్చుకోగలమన్నారు. నాయకత్వం,నిర్వహణ మధ్య తేడాను వివరించుతూ, “ప్రతి నాయకుడు మేనేజర్ కావచ్చు కానీ ప్రతి మేనేజర్ నాయకుడు కాలేడు” అని పేర్కొన్నారు. ఆయన చేర్చినదేమిటంటే, “ఇలాంటి శిక్షణా కార్యక్రమాల ద్వారా మాత్రమే మేనేజీరియల్ నైపుణ్యాలను పద్ధతిగా పెంపొందించుకోవచ్చు” అని అన్నారు. విశిష్ట అతిథి కమాండర్ అదేష్ పల్ సింగ్, డైరెక్టర్ (అడ్మిన్), రక్షణ రంగంలో మారుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు అప్‌స్కిల్లింగ్ ప్రోగ్రామ్స్ యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. క్రమశిక్షణతో పనిచేసే కార్మికులు, ఫోర్‌మెన్లు చేసే బ్యాక్‌గ్రౌండ్ పనుల ప్రాముఖ్యతను వివరించారు. నావల్ డాక్‌యార్డ్ కార్యకలాపాల సమర్థతకు వారు కీలక పాత్ర పోషిస్తున్నారని ఆయన అన్నారు. రీడ్ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ డైరెక్టర్ జనరల్ ఆంధ్ర విశ్వవిద్యాలయం మాజీ రిజిస్ట్రార్ ప్రొ. వి. కృష్ణ మోహన్, ఈ పదిరోజుల శిక్షణ కార్యక్రమం గురించి వివరించారు. ఈ కార్యక్రమం మేనేజీరియల్ ఎఫెక్టివ్‌నెస్, కమ్యూనికేషన్, ప్రాబ్లం సాల్వింగ్ నైపుణ్యాలను పెంపొందించడానికి రూపొందించబడిందని చెప్పారు. ప్రతి సెషన్ యొక్క లక్ష్యాలను, అందజేయబోయే శిక్షణా మెటీరియల్‌ను వివరించారు. ముఖ్య అతిథి ప్రొ. ఎం. ముత్యాల నాయుడు, మాజీ వైస్ ఛాన్సలర్, ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం వర్క్‌షాప్‌ను ప్రారంభించి, పాల్గొనేవారిని సక్రియమైన అభ్యాస దృక్పథాన్ని అవలంబించమని ప్రోత్సహించారు. డైనమిక్ ప్రొఫెషనల్ వాతావరణంలో తాము సకాలంలో ఉండటానికి ఇది అవసరమని పేర్కొన్నారు. ఆయన ముఖ్యంగా ఫోర్‌మన్/చార్జ్‌మన్‌ల వంటి ఫస్ట్ లైన్ మేనేజర్‌లకు నాయకత్వ నైపుణ్యాల ప్రాముఖ్యతను వివరించారు. కార్యక్రమంలో,ఐఐఏఎం ఎగ్జామినేషన్స్ కంట్రోలర్ డా. ఉమా సుందరి ద్విభాష్యం ధన్యవాదములు తెలిపి గౌరవ అతిథులను సత్కరించారు. 10 రోజులపాటు కొనసాగే శిక్షణా శిబిరంలో నావల్ డాక్‌యార్డ్ టెక్నికల్, సూపర్వైజరీ సిబ్బందికి నాయకత్వ నైపుణ్యాలను, మేనేజీరియల్ ఎఫెక్టివ్‌నెస్, అనుకూలతా నైపుణ్యాలను అభివృద్ధికి దోహద మోతాయన్నారు.

ఆంధ్రప్రదేశ్

సాయినామస్మరణతో భజన కార్యక్రమం

చోడవరం, అక్టోబర్ 12:శ్రీ శిరిడిసాయి సేవా సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న 100 రోజుల భజన కార్యక్రమంలో భాగంగా 57వ రోజు భజన కార్యక్రమం ఆదివారం భక్తిశ్రద్ధలతో నిర్వహించబడింది. ఈ కార్యక్రమాన్ని రెడ్డి చందర్రావు, లక్ష్మి దంపతులు తమ నివాసంలో ఏర్పాటు చేశారు. భజన సందర్భంగా భక్తులు సాయినామస్మరణతో గానం చేస్తూ భక్తిరసంలో తేలిపోయారు. కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని సాయిబాబా ఆశీస్సులు పొందారు.

E-పేపర్

డ్రాయింగ్ కాంపిటీషన్లో విజేతలుగా నిలిచిన బిట్స్ విద్యార్థులు.

స్థానిక జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని బాలాజీ ఇంటిగ్రేటెడ్ టీచింగ్ స్కూల్ భూపాలపల్లి లో ఈనాడు పాటవాలు వారి ఆధ్వర్యంలో డ్రాయింగ్ పోటీని “మీకు ఇష్టమైన పండుగ” అను అంశం పైననిర్వహించగా అందులో 134 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అందులో ముగ్గురు ఎస్కే సన, ఎల్. రసజ్ఞ, వి .అద్వైత విజేతలుగా నిలిచారు. విజేతలుగా నిలిచినటువంటి విద్యార్థులకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం శ్రీనివాస చారి బహుమతులు ప్రధానం చేయడం జరిగింది. తదనంతరం మాట్లాడుతూ విద్యార్థులను అన్ని రంగాలల్లో పోటీకి సిద్ధం చేయడం బిట్స్ పాఠశాల ముందుంటుందని విద్యార్థులలో పోటీ తత్వం ఉంటేనే వారు ఉన్నత శిఖరాలకు ఎదుగుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డ్రాయింగ్ ఉపాధ్యాయురాలు అక్షిత, ఇతర ఉపాధ్యాయులు కిరణ్, నదీమ్ సంతోష్ ,కుమార్లు పాల్గొన్నారు

E-పేపర్

తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు

నెల్లూరు రూరల్ : అక్టోబర్ 13: పున్నమి ప్రతినిధి : తెలుగు భాష దినోత్సవ సందర్భం గా నెల్లూరు బ్రాహ్మణ మిత్రులు అందరూ కలిసి తెలుగు భాష దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు. కవుల గురుంచి భాష గురించి చాలామంది వక్తలు మాట్లాడారు. ఈ కార్యక్రమం లో నాగరాజు, నరసింహారావు, ప్రసాద్ మొదలగు వారు పాల్గొన్నారు.

హైదరాబాద్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల

పున్నమి: అక్టోబర్ 13: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక(Jubilee Hills By-Election) నోటిఫికేషన్‌ను ఎన్నికల సంఘం(ELection Commission) విడుదల చేసింది. నేటి నుంచి ఈనెల 21 వరకు నామినేషన్లు స్వీకరణ ఉంటుందని ఈసీ పేర్కొంది. ఈనెల 22న నామినేషన్ల పరిశీలన, 24వ తేదీ వరకు ఉపసంహరణకు అవకాశం ఇచ్చారు. షేక్‌పేట్‌ తహశీల్దార్‌ కార్యాలయంలో నామినేషన్‌ పత్రాలు స్వీకరించనున్నారు. కాగా, జూబ్లీహిల్స్నియోజకవర్గంలో మొత్తం 3.98లక్షల మంది ఓటర్లు ఉన్నారు. గెలుపుపై మూడు ప్రధాన పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించగా.. నేడో, రేపు బీజేపీ సైతం క్యాండి‌డేట్‌ను ఖరారు చేయనున్నది. ఈ ఉపఎన్నికను కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకునేందుకు గులాబీ పార్టీ ఆశపడుతుండగా.. ఎలాగైనా విజయం సాధించాలని కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తున్నది. మరోవైపు గెలుపు కోసం బీజేపీ సైతం తహతహలాడుతున్నది. దీపావళి తర్వాత ప్రచారం మరింత ఊపందుకోనున్నట్లు తెలుస్తోంది. మూడు ప్రధాన పార్టీలకు చెందిన రాష్ట్ర స్థాయి ముఖ్య నేతలందరూ ఇక్కడే మోహరించనున్నారు. మాగంటి గోపీనాథ్ మృతితో ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే.

నాగర్‌కర్నూల్

భజన సామాగ్రి అందజేసిన.. గోలి శ్రీనివాస్ రెడ్డి

వెల్దండ, అక్టోబర్ 13, పున్నమి దినపత్రిక: నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండల పరిధిలోని రాఘాయిపల్లి గ్రామంలో భజన కారులకు తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి భజన సామాగ్రిని బి.ఆర్.ఎస్.పార్టీ యువ నాయకులు భర్కం.గణేష్ ద్వారా అందజేశారు. కార్తీక మాసం సందర్భంగా గ్రామంలో జరిగే భజన కార్యక్రమాలకు కావలసిన భజన సామాగ్రిని అందించిన గోలి శ్రీనివాస్ రెడ్డి కి గ్రామస్తులు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగుల. శ్రీనివాస్, రామచంద్రారెడ్డి, గిరి, బాలయ్య, మెండే. ఈదన్న, యాదయ్య తదితరులు పాల్గొన్నారు. Video: https://punnami.in/%20భజన

తెలంగాణ

సీఎం రేవంత్ రెడ్డికి నిశ్చితార్థ ఆహ్వాన పత్రిక అందించిన.. ఆచారి..!

నాగర్ కర్నూల్ ప్రతినిధి/ అక్టోబర్ 13 (పున్నమి): తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని వారి సొంత నివాసంలో కలిసి తన కుమారుని నిశ్చితార్థానికి రావాలని ఆహ్వానించిన మాజీ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి. సోమవారం ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన ఆచారి తన కుమారుడైన తల్లోజు భరత్ నిశ్చితార్థం ఈనెల 31న జరుగుతున్నందున సీఎం ని రావాలని కోరారు. అనంతరం.. ఆమనగల్లు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలని, నాలుగు మండలాలకు కూడలి అయినటువంటి ఆమనగల్ లో సబ్ రిజిస్టర్, ఎస్. టి .ఓ, మరియు ఆర్.టీ.ఏ కార్యాలయాలను ఏర్పాటు చేయాలని వినతి పత్రంలో కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందిచి వెంటనే ఏర్పాటు చేస్తామని తెలిపారన్నారు.ఈ కార్యక్రమంలో బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి, రేవంత్ మిత్రమండలి వ్యవస్థాపక అధ్యక్షులు ఆసిఫ్ ఆలీ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు లింగంపల్లి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. Video: https://punaami.in/%20సీఎం%20రేవంత్%20రెడ్డి

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.