Wednesday, 29 April 2026

Blog

జనగాం

అండర్ 14మరియు 17 సంవత్సరాల బాలబాలికల కబడ్డీ ఎంపికలు

ఘనంగా (SGF) పాఠశాల క్రీడల ఎంపికలు పూర్తి ——————————————————– జనగామ, అక్టోబర్ 13,పున్నమి న్యూస్: జనగామ జిల్లాస్థాయి పాఠశాలల క్రీడలు (SGF) అండర్ 14 సంవత్సరాల బాలబాలికల కబడ్డీ ఎంపికలు మరియు 17 సంవత్సరాల బాలబాలికల వాలీబాల్ ఎంపికలు ఈరోజు స్థానిక మినీ స్టేడియం ధర్మకంచ జనగామలో ఘనంగా జరిగినాయి ఈ ఎంపికలకు జనగామ జిల్లా నలుమూల నుండి దాదాపు 600 మంది క్రీడాకారులు మరియు 60 మంది వ్యాయామ విద్య ఉపాధ్యాయులు వ్యాయామ దర్శకులు హాజరయ్యారు, ఇందులో ఎంపికైన 14 సంవత్సరాల బాలబాలికలు రేపు జాకారంలో జరిగే ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి ఎంపికలలో పాల్గొంటారు అదేవిధంగా 17 సంవత్సరాల వాలీబాల్ బాల బాలికలో రేపు ఓ సిటీ హనుమకొండలో జరిగే వరంగల్ ఉమ్మడి జిల్లా స్థాయి ఎంపికలలో పాల్గొంటారని జనగామ జిల్లా పాఠశాల క్రీడా కార్యదర్శి జాటోత్ గోర్ సింగ్ ఒక ప్రకటనలో తెలియజేశారు, ఈ ఎంపికలలో వ్యాయామదర్శకులు కిష్టయ్య, గంగిశెట్టి మనోజ్ కుమార్, కైరిక హనుమంతరావు, వీర్యానాయక్, రమాదేవి ఆవుల అశోక్ కిరణ్, జ్యోతి, శ్రీదేవి, మాధవి, సంగీత మాధురి పద్మ, నరేష్, శ్రీనివాస్ మనోహర్, వెంకటేశ్వర్లు అశోక్, సైదులు, కుమార్, శ్రీధర్, ముజీబ్, సాయి, దిలీప్, వాణిశ్రీ, నీల, ప్రణతి, శ్రీహరి ప్రేమ్ సాయి మహేష్ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

నాగర్‌కర్నూల్

చీప్ జస్టిస్ గవాయి పై దాడికి నిరసనగా ఎమ్మార్పీఎస్ ధర్నా

పున్నమి ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా అక్టోబర్ 13 నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆఫీస్ ముందు సోమవారం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవారిపై దాడికి నిరసనగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర నాయకులు జై నాగార్జున మదిలేటి ఆధ్వర్యంలో కలెక్టర్ ఎదుట ధర్నా నిర్వహించారు. అడ్వకేట్ రాకేష్ కుమార్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అనంతరం జిల్లా కలెక్టరేట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ చంద్రశేఖర్ కి వినతి పత్రం ఇచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ మండలాల ఎంఆర్పిఎస్ నాయకులు పాల్గొన్నారు

Blog

20 వ దక్షిణ భారత దేశ చెవి, ముక్కు, గొంతు వైద్య సదస్సులో పరిశోధన పత్రం సమర్పించిన డాక్టర్ మణిదీప్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చెవి, ముక్కు,గొంతు అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడ నోవాటెల్ హోటల్ లో గత మూడు రోజులుగా జరిగిన సంయుక్త 20 వ దక్షిణ భారతదేశ,43 వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చెవి, ముక్కు, గొంతు వైద్యుల సదస్సులో నంద్యాల మధుమణి ఆసుపత్రి చెవి, ముక్కు, గొంతు వైద్య నిపుణులు డాక్టర్ మణిదీప్ “స్పీనాయిడ్ సైనస్ శస్త్ర చికిత్స” లపై యువ వైద్యుల విభాగంలో సమర్పించిన పరిశోధన పత్రానికి ఉత్తమ పరిశోధన పత్రంగా యువ విభాగంలో బంగారు పతకానికి ఎంపిక చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చెవి,ముక్కు, గొంతు వైద్యుల సంఘం నాయకులు డాక్టర్ అప్పారావు, డాక్టర్ మూర్తి, డాక్టర్ రెహమాన్, డాక్టర్ కృష్ణ కిషోర్, డాక్టర్ కుమార్ చౌదరి లు ఈ పురస్కారాన్ని డాక్టర్ మణిదీప్ కు సదస్సు ముగింపు కార్యక్రమంలో అందజేశారు ఈ పురస్కారం అందుకున్న సందర్భంగా డాక్టర్ మణిదీప్ ను ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ జి. రవికృష్ణ, రాష్ట్ర ఐఎంఏ ఉపాధ్యక్షులు విజయభాస్కర రెడ్డి, రాష్ట్ర ఐఎంఏ మహిళా విభాగం కార్యదర్శి డాక్టర్ లక్ష్మీ సౌజన్య,నంద్యాల ఐఎంఏ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ మధుసూదనరావు, డాక్టర్ పనిల్ కుమార్,రాష్ట్ర కమిటీ సభ్యులు డాక్టర్ మధుసూదన రెడ్డి,డాక్టర్ అనిల్ కుమార్, డాక్టర్ హరిత,నంద్యాల గైనకాలజీ సొసైటీ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ నాగమణి,డాక్టర్ వసుధ లు అభినందించారు.

కామారెడ్డి

కాంగ్రెస్ పార్టీలో కష్టపడిన వారికి గుర్తింపు కరువైంది: నా రెడ్డి మోహన్ రెడ్డి ఆవేదన

కామారెడ్డి, 13 అక్టోబర్. పున్నమి ప్రతినిధి : కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన నిజమైన కార్యక ర్తలను, నాయకులను గుర్తించడం లేదని, వారికి న్యాయం జరగడం లేదని జిల్లా పరిషత్ మాజీ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం నాడు డిసిసి అధ్యక్షుని ఎంపిక కోసం డిసిసి అధ్యక్షులు కైలా శ్రీనివాస్ అధ్యక్షతన, ఏఐసీసీ పరిశీలకులు రాజపాల్ కరోల ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా కాంగ్రెస్ సమావే శంలో ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఎమ్మెల్యేలపై తీవ్ర అసంతృప్తి…… ఎమ్మెల్యేలు పార్టీ కోసం శ్రమించిన కార్యకర్తలను గౌరవించడం లేదని, వారిని లెక్కచేయడం లేదని మోహన్ రెడ్డి విమర్శించారు. కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి మాత్రమే గుర్తింపు, పదవులు కేటాయించబడుతున్నాయని, దీనివల్ల కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న పాత నాయకులు, కార్యకర్తలు అన్యాయానికి గురవుతున్నారని అన్నారు. విశ్వా సం కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యకర్తల శ్రమను గుర్తించాలి….. ఒక్క ఎమ్మెల్యేతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదని మోహన్ రెడ్డి గట్టిగా గుర్తుచేశారు. పార్టీ అధికారంలోకి రావడానికి వెనుక కాంగ్రెస్ కార్యక ర్తలు, నాయకుల శ్రమ ఎంతో ఉందని అన్నారు. ఆ శ్రమను గుర్తించాలని డిమాండ్ చేశారు. నిజమైన కాంగ్రెస్ శ్రేణులను కాపాడుకుంటేనే భవిష్యత్తులో పార్టీకి మంచి రోజులు ఉంటాయని, గుర్తింపు వస్తుందని సూచించారు. “విభజించి పాలించే” నాయకులపై చర్యలు తీసుకోవాలి… అంతేకాక, పార్టీలో “విభజించి పాలించే” నాయకు లను గుర్తించి, వారిపై తక్షణమే చర్యలు తీసుకో వాలని మోహన్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ లో ఈ విధమైన అసంతృప్తి పార్టీ బలోపేతంపై ఏ విధమైన ప్రభావం చూపుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ సురేష్ షెట్కర్ తో పాటు జిల్లాలోని పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

నాగర్‌కర్నూల్

నాగర్ కర్నూల్ జిల్లా కు 10 మంది టూరిస్ట్ పోలీస్ లను కేటాయించిన ప్రభుత్వం

పున్నమి ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా అక్టోబర్ 13 తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 80 మంది పోలీస్ లను డిప్యుటేషన్ మీద పర్యాటక శాఖ కు ప్రభుత్వం కేటాయించడం జరిగింది.ఇందులో భాగంగా నాగర్ కర్నూలు జిల్లా కు 10 మంది టూరిస్ట్ పోలీస్ లను ప్రభుత్వం నియమించింది.నేడు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారి క్యాంప్ కార్యాలయంలో ప్రభుత్వం ఆదేశాల మేరకు విధుల్లో చేరుతున్నట్టు నాగర్ కర్నూల్ జిల్లా పర్యాటక శాఖ అధికారి కల్వరాల నరసింహ గారికి 10 మంది పోలీస్ లు రిపోర్ట్ చేయడం జరిగింది. మంత్రి జూపల్లి గారి ఆధ్వర్యంలో పర్యాటక రంగంలో అన్ని విధాలుగా అభివృద్ధి జరుగుతుందని ప్రభుత్వం కేటాయించిన 10 మంది టూరిస్ట్ పోలీస్ ల సేవలు జిల్లా లో టూరిస్ట్ లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ప్రాంతాల్లో వినియోగించుకోవడం జరుగుతుంది.

నాగర్‌కర్నూల్

సీజనల్ వ్యాధులపై హెచ్ఐవి పై అవగాహన

పున్నమి ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా అక్టోబర్ 13 బిజినాపల్లి మండలం నంది వడ్డేమాన్ గ్రామంలో Y. R. G. కేర్ (LWS)ఆధ్వర్యంలో లోకల్ బాడీ మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఈ మీటింగ్ లో సంస్థ సూపెర్వైజర్ రామ కృష్ణ సార్ మాట్లాడుతూ (1)సీజనల్ వ్యాధుల గురించి మరియు hiv టీబీ sti గురించి చెప్పడం మరియు తీసుకోవలసిన జాగ్రతల గురించి చెప్పడం జరిగింది. (2)18సం„ లు నిండిన ప్రతి ఒక్కరు hiv పరీక్ష చేయించుకోవాలని కోరడమైనది (3)hiv పట్ల అవగాహన కలిగిండాలని మాట్లాడటం జరిగింది. (4)HIV కలిగిన వ్యక్తి పట్ల వివక్షత ప్రదర్శించారాదని అది నేరం అని చెప్పడం జరిగింది. (5)HIV సంక్రమిచే మార్గాల గురించి చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంస్థDRP శ్రీకాంత్ రెడ్డి సార్,లింక్ వర్కర్ హేమలత ,పంచాయతీ కార్యదర్శి శివ సార్, egs ఫీల్డ్ అసిస్టెంట్ దాసు , ఆశ వర్కర్స్ కృష్ణవేణి, అనిత, అంగన్వాడీ టీచర్స్, SHG మెంబెర్స్ మరియు గ్రామపెద్దలు, యువకులు తదితరులు పాల్గొనడం జరిగింది.

E-పేపర్

కుక్కల బెడదతో బయపడుతున్న నగర వాసులు

నెల్లూరు (రూరల్ )13: పున్నమి ప్రతినిధి : SPSR నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ మండలం పరిధిలోని Z. P. కాలనీ, డైకస్ రోడ్, గాంధీ నగర్, VMR నగర్ ఏరియాలో కుక్కలు వీర సైర్యం చేస్తున్నాయి. రాత్రి వేళలో వృద్ధులు, పాదచారులు, చిన్న పిల్లలు, సైకిల్, బైక్ లో వెళ్లేవారు భయపడుతున్నారు. వారి వెంట కుక్కలు పరుగెత్తి వెంట పడుతున్నాయి. నెల్లూరు మున్సిపల్ అధికారులు వాటిని పట్టుకొని ఆ ప్రాంత ప్రజలు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.

యాదాద్రి భువనగిరి

శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కి దామన్న పేరు పెట్టడం హర్షణీయo

*దామన్న మృతి పార్టీకి,ప్రజలకు తీరని లోటు* *శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కి దామన్న పేరు పెట్టడం హర్షణీయo* *దామన్న స్ఫూర్తితో ముందుకెళ్తాం* *సంతాప సభ లో ప్రమోద్ కుమార్* మాజీ మంత్రి వర్యులు , రాంరెడ్డి దామోదర్ రెడ్డి గారి మృతి రాష్ట్ర ప్రజలకు,ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలకు కాంగ్రెస్ పార్టీ కి తీరని లోటు అని కాంగ్రెస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ పరిశీలకుడు పోత్నక్ ప్రమోద్ కుమార్ గారు అన్నారు.ఈరోజు భువనగిరి జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డు లో మాజీ కౌన్సిలర్ రాచమల్ల రమేష్ గారి అధ్యక్షతన జరిగిన సంతాప సభ లో ప్రమోద్ కుమార్ గారు మాట్లాడుతూ రెండు సార్లు మంత్రిగా ,5 సార్లు శాసనసభ్యుడిగా, యువజన కాంగ్రెస్ నాయకునికా PCC ఉపాధ్యక్షులుగా ,AICC సభ్యునిగా అనేక ఎన్నికల్లో పార్టీ ఇంచార్జీ గా పనిచేసిన వ్యక్తి దామన్న అని వారి చిరకాల కోరిక అయిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఫేజ్ 2 కి దామన్న పేరు పెట్టడం హర్షణీయమని ,ఈ సందర్భంగా రాష్ట ప్రభుత్వానికి ,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి,జిల్లా మంత్రులు వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గార్ల కు , కృతజ్ఞతలు తెలుపుతున్నామని, వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని వారి కుటుంబానికి భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుతున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ఎస్సీ విభాగం అధ్యక్షులు దర్గాయి హరిప్రసాద్,సీనియర్ నాయకులు డి.రాములు,భువనగిరి పార్లమెంట్ కో ఆర్డినేటర్ ఎండి అతహర్ ,ధర్మ శాల అధ్యక్షులు మంచికంటి కృష్ణమూర్తి, యువజన నాయకుడు బింగి నరేష్ ,జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షులు నాకోటి రాము, పట్టణ అధ్యక్షులు కాల్య నాగరాజు,యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి ఎండి నేహాల్,మహిళా కాంగ్రెస్ నేత దేవరంగుల కవిత ,తదితరులు పాల్గొన్నారు.

నిర్మల్

డీసీసీ అధ్యక్షుని ఎంపికలో, ఏఐసిసి పరిశీలకులు నిర్మల్ రాక.

నిర్మల్ అక్టోబర్ 13 ( పున్నమి ప్రతినిధి ) నిర్మల్ జిల్లా: నిర్మల్ లో జరిగిన నూతన జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుల ఎంపిక నేపథ్యంలో ఏఐసీసీ ఆదేశాల మేరకు నిర్మల్ జిల్లా పరిశీలకులు అజయ్ సింగ్ గారిని పీసీసీ పరిశీలకులు సోమవారం మంజులాపూర్ రోడ్డులోని మారుతి ఇన్ హోటల్ లో * “సంఘటన, శ్రీజన్, అభియాన్ ” కార్యక్రమంలో సన్మానం చేసిన, నిర్మల్ జిల్లా మైనారిటీ అధ్యక్షులు జునైద్ మెమన్. ఈకార్యక్రమంలో కుచాడి శ్రీహరి రావు, డా.యస్. వేణుగోపాల చారీ, వాజిద్ అహ్మద్, అజర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

అబాకస్ లో శ్రీ చైతన్య విద్యార్థి ప్రతిభ

స్థానికంగా జయరాం రావు వీధిలో గల శ్రీ చైతన్య పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు చెన్నైలో జరిగినటువంటి ఇంటర్నేషనల్ అబాకస్ కాంపిటీషన్ లో పాల్గొని ఘన విజయం సాదించడం జరిగింది.ఈ అబాకస్ పోటీలలో యువనేస్ అనే విద్యార్థి రెండో స్థానం కైవసం చేసుకోవడం జరిగిందని,అంకితభావం పట్టుదల ఉంటే వివిధ రంగాలలో విద్యార్థులు రాణించవచ్చని ఈ సందర్భంగా ప్రిన్సిపల్ లిపారు.అనంతరం ప్రిన్సిపల్ చేతుల మీదుగా విజేతకు జ్ఞాపిక,ప్రశంసా పత్రాన్ని ఇచ్చి సత్కరించారు.కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ సుధాకర్,ప్రైమరీ ఇంచార్జ్ మాధవి లత, మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.