Wednesday, 29 April 2026

Blog

Blog

మోదీ సభను విజయవంతం చేద్దాం: కత్తి శ్రావణి రెడ్డి

నంద్యాల ఈనెల 16న ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభను విజయవంతం చేయాలని ఆళ్లగడ్డ టిడిపి నాయకురాలు కత్తి శ్రావణి రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం ఒక ప్రకటనలో ఆమె మాట్లాడుతూ మంత్రి ఎన్‌.ఎం‌.డి. ఫరూక్‌, ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పర్యవేక్షణలో సభ ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. ప్రధానమంత్రి మోదీ పర్యటన రాష్ట్రానికి అభివృద్ధి దిశగా కొత్త ఊపును అందిస్తుంది. కేంద్ర ప్రభుత్వ పథకాలు, రాష్ట్రాభివృద్ధి ప్రణాళికల గురించి ప్రత్యక్షంగా వినే అవకాశం ఈ సభ ద్వారా లభిస్తుంది. అందుకే ప్రతి గ్రామం, ప్రతి వాడా నుండి ప్రజలు పెద్ద సంఖ్యలో సభకు హాజరవ్వాలని కోరుతున్నాను” అని కత్తి శ్రావణి రెడ్డి అన్నారు. నంద్యాల, ఆళ్లగడ్డ ప్రజలు ఉత్సాహంగా పాల్గొని సభను విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. మంత్రి ఫరూక్‌, భూమా అఖిలప్రియ మార్గదర్శకత్వంలో కూటమి శ్రేణులు, సభను విజయవంతం చేయాలని కోరారు.

E-పేపర్

దీపావళి టపాసుల లైసెన్స్ మంజూరులో నాణ్యమైన అమ్మకం వారికే అనుమతులివ్వాలి.

కేంద్రం తగ్గించిన జియస్టి ప్రకారం టపాసుల అమ్మకాలలో తగ్గిందో,పెరిగిందో బోర్డులను ఏర్పాటు చేయాలి. దీపావళి టపాసుల అమ్మకాల కోసం ప్రతి యేటా ప్రభుత్వ అనుమతులను ఇవ్వడం జరుగుతుంది.ఈ అమ్మకాలలో ప్రభుత్వ యంత్రాంగం మాత్రం తాత్కాలికంగా ఏర్పాటు చేయబడుతున్న ఏఏ షాపులలో ఎన్ని లక్షల టర్నోవర్ చేయబోతున్నారో,వాటిలో నాణ్యత గలిగిన టపాసుల అమ్మకాలను పరిశీలించే దెవ్వరనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.లైసెన్స్ మంజూరు చేసేటప్పుడు ఆయా షాపుల వారు బిల్లులను వినియోగదారులకు ఇచ్చేలా ఎందుకు చూడలేకపోతున్నారనే వాదనలు ప్రజల నుండి వినిపిస్తున్నాయి.టపాసుల అమ్మకాల కోసం ఇచ్చే లైసెన్స్ కోసం ఈ సంవత్సరం అయిన ప్రతి షాపులో అమ్మబోయ్యే స్టాక్ లను షాపుల ముందు అందరుకి కనబడేలా బోర్డులను ఏర్పాటు చేయాలి.వినియోగదారుల కొనుగోలుకి షాపు వారి నుండి ఒరిజినల్ బిల్లులను ఇప్పించాలి.కేంద్రం తగ్గించిన జియస్టి ప్రకారం టపాసుల అమ్మకాలలో తగ్గిందో,పెరిగిందో బోర్డులను ఏర్పాటు చేయాలి.ఆధునీకరణ ఫైర్ సేఫ్టీని పాటించేలా చూడాలి.ఇప్పటికే పాత స్టాక్ ఏమైన ఉంటే వాటిని అధికారులు తనిఖీలు చేయాలి.నాణ్యత లేని టపాసులను రిటన్ తీసుకునేలా అధికారులు చూడాలని ప్రజలు కోరుతున్నారు.ఈ సంవత్సరం వినియోగదారులకు నాణ్యత గలిగిన అందేలా చూడాలని,ప్రతి కుటుంబంలో ఈ దీపావళి వెలుగులు నిండాలని సామాజిక కార్యకర్త మెటికల శ్రీనివాసరావు వినియోగదారుల తరుపున కోరుకుంటున్నారు.

తెలంగాణ

ధాన్యం సేకరణలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నా : ప్రిన్సిపల్ సెక్రటరీ

నకిరేకల్ :అక్టోబర్ (పున్నమి ప్రతినిధి ) ఖరీఫ్ 2025 -26 ధాన్యం సేకరణలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని రాష్ట్ర సివిల్ సప్లై ప్రిన్సిపల్ సెక్రెటరీ స్టీఫెన్ రవీంద్ర జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన హైదరాబాదు నుండి ఖరీఫ్ ధాన్యం సేకరణ పై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని కొనుగోలు కేంద్రాలలో మాలిక వసతులు కల్పించాలని గన్నిసంచులు, తార్పాలిన్లు, వేయింగ్ మిషన్లు,మంచినీటి వసతి ఏర్పాట్లు, ట్రాన్స్ పోర్ట్ ఏర్పాట్లు, అంతరాష్ట్ర చెక్ పోస్ట్ లు, పోలీస్ సెక్యూరిటీ, ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, డిఎస్ ఓ వెంకటేశం, మార్కెటింగ్ ఏడీ ఛాయాదేవి,పౌరసరఫరాల డి ఎమ్, డి ఆర్ డి ఓ శేఖర్ రెడ్డి తదితరులు హాజరైనారు.

తెలంగాణ

ఇసుక తవ్వకాలకు సంబంధించి నివేదికలను క్రోడీకరించినట్లు తెలిపిన :జిల్లా కలెక్టర్

నకిరేకల్ : అక్టోబర్ (పున్నమి ప్రతినిధి ) ఇసుక తవ్వకాలకు సంబంధించి వివిధ శాఖలు సమర్పించిన నివేదికలను క్రోడీకరించి నల్గొండ జిల్లాకు సంబంధించి రూపొందించిన జిల్లా సమగ్ర నివేదికను (డి.ఎస్.ఆర్) వెబ్ సైట్ http://nalgonda.telangana.gov.in లో పొందుపరిచినట్టు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ఇసుక తవ్వకాలకు సంబంధించి సాంకేతిక శాఖలైన నీటిపారుదల, గనులు, భూగర్భ జల వనరులు, టీ ఎస్ ఎం ఐ డి సి,అటవీ,రెవెన్యూ వంటి ముఖ్య ప్రణాళిక అధికారి శాఖల నుండి ఇసుక తవ్వకాలపై నివేదికలను కోరడం జరిగిందని, ఈ మేరకు ఆయా శాఖలు సమర్పించిన నివేదికలన్నిటిని పూర్తిస్థాయి జిల్లా సమగ్ర నివేదిక (డి.ఎస్.ఆర్ ) గా మార్చి పైన పేర్కొన్న వెబ్ సైట్ లో ఉంచినట్లు కలెక్టర్ తెలిపారు. వెబ్ సైట్ లో ఉంచిన జిల్లా సమగ్ర నివేదికపై ఏవైనా సందేహాలు, సలహాలు, అభ్యంతరాలు ఉంటే అక్టోబర్ 25 (25/10/ 2025 )లోగా Admgnlg @gmail. Com మెయిల్ కు పరిశీలనకు పంపవలసిందిగా ఆమె కోరారు.

తిరుపతి

శ్రీకాళహస్తి పట్టణంలో మరాఠీ పాలెం వీధి నందు మసిలాగ మారిన రోడ్డు

శ్రీకాళహస్తి పట్టణం నందు గత కొద్ది రోజులు ముందు Dr.భత్తయ్యనాయుడు ఆసుపత్రి పక్కన మరాటి పాలెం కాలువ నందు మురికి మట్టి క్లీన్ చేసి దానిని అలాగే వదిలేశారు.దాని వలన అందులో నుంచి దోమలు,పురుగులు వస్తున్నాయి.అక్కడ అపరిశుభ్ర వాతావరణం పేరుకుపోడంతో దోమలు చుట్టుపక్కల ఉన్న ఇళ్లల్లోకి చేరుతున్నాయి.అటు వైపుగా స్కూల్లు,కాలేజీలు ఉన్నాయి.కాబట్టి చిన్న పిల్లలు స్కూళ్ల కు వెళ్తుంటారు.ఈవిధంగా రోడ్లు ఉంటే చిన్నపాటి వర్షం వస్తే స్కూల్ కి వెళ్లే పిల్లలు,వాహనదారులు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువుగా ఉండటంతో దీని మీద మున్సిపాలిటీ అధికారుల స్పందించి త్వరగా క్లీన్ చేయవలసిందిగా స్థానికులు కోరుచున్నారు.

తిరుపతి

అక్రమంగా టపాకాయలు అమ్మితే చర్యలు శ్రీకాళహస్తి డిఎస్పీ

శ్రీకాళహస్తి పట్టణం నందు నిబంధనలకు విరుద్ధంగా టపాకాయల విక్రయిస్తున్నట్లు సమాచారంతో షాపులపై పోలీసులు దాడులు చేసి 3 దుకాణాలను గుర్తించి 31 వేల విలువ గల టపాకాయలను సీజ్ చేశారు.అనంతరం డిఎస్పీ నరసింహమూర్తి మాట్లాడుతూ లైసెన్స్ లు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా టపాసులు అమ్మడం నేరమని,చట్టాన్ని అతిక్రమించి ప్రవర్తిస్తే చర్యలు తీసుకుంటామని వారు అన్నారు.ప్రజల రక్షణ దృష్ట్యా నిబంధనలు పెట్టడం జరిగిందని,ప్రజలు ఇలాంటి చట్ట విరుద్ధంగా టపాసులు అమ్ముతున్న షాపుల వారిని గుర్తించి తెలియజేయాలన్నారు.

ఆంధ్రప్రదేశ్

కార్మిక వర్గ శ్రేయస్సు కోసం, సంస్థ పరిరక్షణకై కార్మిక, ఉద్యోగుల సమస్యల పరిష్కారం అయ్యేవరకు పోరాడుదాం. రైల్వేకోడూరు అక్టోబర్ పున్నమి ప్రతినిధి కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేసేవరకు , వన్ ఇండస్ట్రీ వన్ సర్వీస్ రెగ్యులేషన్స్ ఇంప్లిమెంట్ చేసి గ్రేడ్.2 కార్మికులకు న్యాయం చేసేవరకు ,పాత పెన్షన్ పద్ధతిని పునరుద్ధరించే వరకు పోరాటాలు కొనసాగించాలని, కారుణ్య నియామకాల్లో జరుగుతున్న అన్యాయాన్ని నివారించాలని, నగదురహిత అపరిమిత మెడికల్ పాలసీని వర్తింపజేయాలని, కాంట్రాక్టు కార్మికులకు కోటి రూపాయలు ఇన్సూరెన్స్ చేయాలని,నేరుగా వేతనాలు చెల్లించడం వల్ల విద్యుత్ సంస్థకు 192 కోట్ల భారం తగ్గుతుందని, తద్వారా వేతనాలలో వ్యత్యాసాన్ని నివారించవచ్చని, అరియర్స్ చెల్లించవచ్చని, పీసిరేట్ వర్కర్లైన, ఎస్ పి ఎం స్టోర్స్ హమాలీలకు, మీటర్ రీడర్ లకు, పిసీఎలకు, ఎటిఎం, లాంటి అనేకమందికి ఉద్యోగ భద్రత కనీస వేతనం చెల్లించవచ్చని , అర్హత కలిగిన ఉద్యోగులకు, జేఈ, జేఏ, కన్వర్షన్ ఇవ్వాలని ఒకవైపు ధరలు పెరుగుతున్న పెండింగ్ 4డిఏ లు విడుదల చేయకపోవడం అన్యాయమని, విద్యుత్ యాజమాన్యం, ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలు శాంతియుత వాతావరణంలో పరిష్కరించాలని లేని ఎడల సమ్మెకు సైతం సిద్ధంగా ఉన్నామని , దానికి పూర్తిగా యాజమాన్యమే బాధ్యత వహించాలని తెలిపారు, కార్మిక వర్గ శ్రేయస్సు, సమస్యల పరిష్కారమయ్యే వరకు, ప్రైవేటీకరణ విధానాలనుండి సంస్థను రక్షించుకోవాలని , విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించే బిల్లుకు వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. మహారాష్ట్రలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్న కార్మిక ఉద్యోగులకు అందరికీ సంఘీభావం తెలిపారు ఈ కార్యక్రమంలో యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ఆర్గనైజేషన్ కార్యదర్శి k కిరణ్ రాష్ట్ర నాయకులు v సుబ్రమ ణ్యం, c నారాయణ, బాలకృష్ణ,రమేష్, సురేష్, శివ, బాషా, నాగరాజా R ఈశ్వర్ రావు, s సుధాకర్, జయకృష్ణ,అంకయ్య, చిన్నయ్య,తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

కార్మికుల సమస్యల పరిష్కారం కోసం మేము సైతం సమ్మెకు సిద్ధం.

కార్మిక వర్గ శ్రేయస్సు కోసం, సంస్థ పరిరక్షణకై కార్మిక, ఉద్యోగుల సమస్యల పరిష్కారం అయ్యేవరకు పోరాడుదాం. రైల్వేకోడూరు అక్టోబర్ పున్నమి ప్రతినిధి కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేసేవరకు , వన్ ఇండస్ట్రీ వన్ సర్వీస్ రెగ్యులేషన్స్ ఇంప్లిమెంట్ చేసి గ్రేడ్.2 కార్మికులకు న్యాయం చేసేవరకు ,పాత పెన్షన్ పద్ధతిని పునరుద్ధరించే వరకు పోరాటాలు కొనసాగించాలని, కారుణ్య నియామకాల్లో జరుగుతున్న అన్యాయాన్ని నివారించాలని, నగదురహిత అపరిమిత మెడికల్ పాలసీని వర్తింపజేయాలని, కాంట్రాక్టు కార్మికులకు కోటి రూపాయలు ఇన్సూరెన్స్ చేయాలని,నేరుగా వేతనాలు చెల్లించడం వల్ల విద్యుత్ సంస్థకు 192 కోట్ల భారం తగ్గుతుందని, తద్వారా వేతనాలలో వ్యత్యాసాన్ని నివారించవచ్చని, అరియర్స్ చెల్లించవచ్చని, పీసిరేట్ వర్కర్లైన, ఎస్ పి ఎం స్టోర్స్ హమాలీలకు, మీటర్ రీడర్ లకు, పిసీఎలకు, ఎటిఎం, లాంటి అనేకమందికి ఉద్యోగ భద్రత కనీస వేతనం చెల్లించవచ్చని , అర్హత కలిగిన ఉద్యోగులకు, జేఈ, జేఏ, కన్వర్షన్ ఇవ్వాలని ఒకవైపు ధరలు పెరుగుతున్న పెండింగ్ 4డిఏ లు విడుదల చేయకపోవడం అన్యాయమని, విద్యుత్ యాజమాన్యం, ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలు శాంతియుత వాతావరణంలో పరిష్కరించాలని లేని ఎడల సమ్మెకు సైతం సిద్ధంగా ఉన్నామని , దానికి పూర్తిగా యాజమాన్యమే బాధ్యత వహించాలని తెలిపారు, కార్మిక వర్గ శ్రేయస్సు, సమస్యల పరిష్కారమయ్యే వరకు, ప్రైవేటీకరణ విధానాలనుండి సంస్థను రక్షించుకోవాలని , విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించే బిల్లుకు వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. మహారాష్ట్రలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్న కార్మిక ఉద్యోగులకు అందరికీ సంఘీభావం తెలిపారు ఈ కార్యక్రమంలో యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ఆర్గనైజేషన్ కార్యదర్శి k కిరణ్ రాష్ట్ర నాయకులు v సుబ్రమ ణ్యం, c నారాయణ, బాలకృష్ణ,రమేష్, సురేష్, శివ, బాషా, నాగరాజా R ఈశ్వర్ రావు, s సుధాకర్, జయకృష్ణ,అంకయ్య, చిన్నయ్య,తదితరులు పాల్గొన్నారు.

జనగాం

జాతీయ అథ్లెటిక్స్ సాంకేతిక నిపుణిగా ఎంపికైన సురేష్

జాతీయస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు సాంకేతిక నిపుణులుగా పిఈటి మునిగే సురేశ్ ———————————————————– జనగామ, అక్టోబర్13,పున్నమి న్యూస్: ఈనెల 15 నుండి 19 వరకు జవహర్లాల్ నెహ్రూ స్టేడియం హనుమకొండలో జరిగే 23 సంవత్సరాల జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు మునిగే సురేష్ సాంకేతిక నిపుణులుగా ఎంపికయ్యారు, గతంలో కూడా సురేష్ ఎన్నో రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు సాంకేతికలుగా పనిచేయడం జరిగింది, వీరు ప్రస్తుతము జనగామలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో వ్యాయామదర్శకులుగా పనిచేస్తున్నారు, వీరి ఎంపిక పట్ల జనగామ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు పెద్ది నారాయణ గౌడ్, కార్యదర్శి గంగిశెట్టి మనోజ్ కుమార్, కోశాధికారి, ఆవుల అశోక్, జనగామ బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి కైరిక హనుమంతరావు, తెలంగాణ వ్యాయామ విద్య ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు గౌర్సింగ్, కోశాధికారి కొండ రవి అసోసియేషన్ సభ్యులు రంజిత్, సుధారాణి, ప్రవీణ్, కిరణ్, ముజీబ్, దిలీప్, తదితరులు అభినందించారు.

కుమురం భీమ్ ఆసిఫాబాద్

బెల్లంపల్లి తొలి ఎంఎల్ఏ గుండా మల్లేష్ ఐదవ వర్ధంతి కార్యక్రమం

బెల్లంపల్లి తొలి ఎమ్మెల్యే గుండా మల్లేష్ ఐదో వర్ధంతిని ఘనంగా నిర్వహించి నివాళులు అర్పించడం జరిగింది… సిపిఐ గోలేటి పట్టణ కార్యదర్శి మారం శ్రీనివాస్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథులు ఏఐటీయూసీ గోలేటి బ్రాంచ్,కార్యదర్శి సోమవారం తిరుపతి గారు, సిపిఐ మండల కార్యదర్శి రాయల నరసయ్య గారి ఆధ్వర్యంలో గోలేటి లోని కేల్ మహేంద్ర భవన్ భవన్ లొ కామ్రేడ్ గుండా మల్లేష్ గారి 5వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. ఎస్ తిరుపతి గారు మాట్లాడుతూ నల్ల నేలపై విప్లవాల రాగాలు పలికించిన గుండా మల్లేష్. బెల్లంపల్లి నియోజకవర్గ తొలి ఎమ్మెల్యేగా. మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం రేచిని గ్రామంలో జులై 14/1947/లో గుండా మల్లేష్ జన్మించారు. తల్లి బాయమ్మ-తండ్రి పోషమల్లు. గుండా మల్లేష్ హెచ్ ఎస్ సీ వరకు చదువుకున్నారు. లారీ క్లీనర్ నుంచి ఎమ్మెల్యే వరకు . ఆయన రాజకీయ అరం గేట్రం పోరాటంతోనే ప్రారంభమైంది. 1967-1968 లో బెల్లంపల్లిలో ప్రకాష్ లారీ ట్రాన్స్ పోర్టులో క్లీనర్కమ్ డ్రైవర్ గా పని చేసేవారు. వేతనాల విషయంలో జరిగిన ఉద్యమానికి నాయకత్వం వహించారు. అనంతరం కొద్ది రోజులు సింగరేణిలో కార్మికుడిగా పనిచేశారు. ఆ సమయంలోనే భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ లో చేరి పూర్తిస్థాయిలో పనిచేయడం ప్రారంబించారు. పేదల పక్షాన భూ పోరాటాలు చేశారు 1972లో పార్టీలో చేరిన గుండా మల్లేష్ వేను దిరిగి చూడలేదు. ఉద్యమాలే ఊపిరిగా పనిచేశారు. ఫలితంగా తొలిసారి 1978లో ఆసిఫాబాద్ నియోజక వర్గం నుంచి పోటీ చేసే అవకాశం వచ్చింది ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. అనంతరం 1983-1985-1994 ఎన్నికల్లో విజయం సాధించారు. తిరిగి కొత్తగా ఏర్పడిన బెల్లంపల్లి నియోజకవర్గ నుంచి 2009లో పోటీ చేసి గెలుపొందారు. 2004 మరియు 2018లో ఓడిపోయారు. మొత్తం ఎనిమిది సార్లు పోటీ చేసి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర. తెలంగాణ రాష్ట్ర సాధనలోను ఆయన చెరగని ముద్ర వేశారు. శాసనసభ పక్ష నేతగా తెలంగాణ వాణి ని ఢిల్లీలో బలంగా వినిపించారు. కేంద్ర ప్రభుత్వంలో జరిగిన చర్చల్లోనూ సిపిఐ శాసనసభ పక్ష నేత హోదాలో టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ తో కలిసి పలుమార్లు హాజరయ్యారు. శ్రీకృష్ణ కమిటీ ముందు తెలంగాణ వాదనను బలంగా వినిపించగలరు. పోరాటాల్లో ఆయనది ప్రత్యేక స్థానం. భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్). అఖిలాభారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్). లో చురుకుగా పనిచేసిన గుండా మల్లేష్ అంచలంచలుగా జాతీయ స్థాయిలో రాణించారు. 4. సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన గుండా మల్లేష్ బి కే ఎం యు జాతీయ ఉపాధ్యక్షుడిగా రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేశారు. 1983లో టిడిపి సంక్షోభ సమయంలో కీలకంగా నిలిచారు. బెల్లంపల్లిలో జరిగిన అనేక ఉద్యమాల్లో కూడా ఆయన తిరుగులేని నాయకునిగా కొనసాగారు. 1981 లో బెల్లంపల్లిలో యువతిని ఒక అధికారి కుమారుడు అత్యాచారం చేసిన కేసులో జరిగిన పోరాటంలో గుండా మల్లేష్ పాత్ర మరువలేనిది అసంఘటిత. సంఘటిత రంగా పోరాటాలు తనదైన పాత్రను పోషించారు. రైతాంగ సమస్యల సాధనలోనూ ఆయన రాష్ట్రంలో అనేక జిల్లాల్లో జరిగిన పోరాటాల్లో పాల్గొన్నారు. పార్టీల కతీతంగా స్పందించే నైజాం. గుండా మల్లేష్ పార్టీలకతీతంగా వ్యవహరించేవారు. ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరి కష్టాలు తెలుసుకొని అక్కడికక్కడే పరిష్కరించే వారు. ఎన్నికలు అయ్యాక పార్టీల గురించి ఆలోచించే వద్దని ప్రజల సంక్షేమమే ద్వేయం కావాలని చెబుతుండేవారు. అందుకే ఏ పార్టీ వారైనా గుండా మల్లేష్ అంటే అభిమానిస్తారు. నిరాడంబర జీవనం:4 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన గుండా మల్లేష్ ఏనాడు అంగు ఆర్భాటాల జోలికి పోలేదు అవినీతికి ఆమడ దూరంలో ఉన్నారు. ఆయన సాదాసీదా జీవనం గడిపారు. కార్మిక. కర్షక. గిరిజన. మహిళల సమస్యలపై అలుపెరుగని పోరాట యోధుడు గుండా మల్లేష్ గారు అని ఆయన అన్నా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సిపిఐ మండల సహాయ కార్యదర్శి బి జగ్గయ్య, గోలేటి బ్రాంచ్ ఆర్గనైజింగ్ కార్యదర్శిలు, శేషశైనా రావు, కే కిరణ్ బాబు, గోలేటి బ్రాంచ్ కాంటాక్ట్ కార్మిక కార్యదర్శి, సల్లూరి అశోక్, సహాయ కార్యదర్శి, సాగర్ గౌడ్ , ఏఐటీయూసీ యూనియన్ డెలికేట్స్, అన్వేష్,కందుల మల్లేష్, పుట్ట అంజయ్య, ఎండి షకిల్,నాదం రవి, ఎంఏ షమీ, రమేష్, తిరుమల్, రారాజు, అంజయ్య, రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.