Wednesday, 29 April 2026

Blog

E-పేపర్

కల్తీ మద్యం కాదు నాణ్యత మధ్యమే: సిఐ సురేఖ*

*కల్తీ మద్యం కాదు నాణ్యత మధ్యమే: సిఐ సురేఖ* పున్నమి ప్రతినిధి సురేష్ కృష్ణాజిల్లా: గన్నవరం నియోజకవర్గం… గన్నవరం మండలం కేసరపల్లి గ్రామంలో చిల్లీస్ వైన్స్ లో కల్తీ మద్యం అంటూ అసత్య ప్రచారాలు…. చిల్లీస్ వైన్స్ ను తనిఖీ చేసిన ఎక్సేంజ్ సిఐ. సురేఖ… *వైన్స్ లో విక్రయ దారుడు బైట్స్* మధ్యాహ్నం 3: 30 నిమిషాలకు వచ్చి ఇద్దరు వ్యక్తులు2 బీర్లు తీసుకువెళ్లారు… ఆ ఇద్దరు వ్యక్తులు మళ్లీ 4:40 వచ్చి బీర్లు నురగ రావడం లేదని గొడవకు దిగారు… బీరు గ్యాస్ పోయిన తర్వాత వచ్చి కావాలని కొందరు వ్యక్తులు గొడవకు దిగారు… *ఎక్సేంజ్ సీఐ సురేఖ కామెంట్స్* కేసరపల్లి చిల్లీస్ వైన్స్ లో కల్తీ మద్యం అంటూ సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు వచ్చాయి…. వైన్స్ లో బీర్ తీసుకొన్న 45 నిమిషాల వ్యవధి తర్వాత తీసుకొని వచ్చి గొడవ పెట్టుకున్నారు…. మా సర్కిల్ పరిధిలో కల్తీ మద్యం లేదు… మాకు సంబంధించిన 23 షాపుల్లో వారంలో నాలుగు రోజులు తనిఖీ చేస్తాం…. సోషల్ మీడియాలో ఇటువంటి అసత్య ప్రచారం చేయడం వల్ల ప్రజలు భయపడిపోతున్నారు…. కల్తీ మద్యం అంటూ సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం…. చిల్లీస్ వైన్స్ లో జరిగిన సంఘటన ను సిసి పుటేజ్ ఆధారంగా వ్యక్తులను గుర్తించి తగు చర్యలు తీసుకుంటాం

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

పొగతాగని మహిళలకు కూడా లంగ్‌ క్యాన్సర్‌

గతంలో పొగతాగేవారిలోనే ఎక్కువగా కనిపించే ఊపిరితిత్తుల క్యాన్సర్‌ ఇప్పుడు పొగతాగని యువతుల్లోనూ విస్తరిస్తోంది. మహిళల్లో సహజంగా ఉండే ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌, ధూమపానం చేస్తున్నవారి పక్కన ఉండటం, ఇంట్లోని రాడాన్‌ గ్యాస్‌, వంటగది కాలుష్యం వంటివి దీనికి ప్రధాన కారణాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. లక్షణాలు తక్కువగా బయటపడటం వాటిని ఇతర శ్వాసకోశ సమస్యలుగా పొరబడటం వల్ల రోగనిర్ధారణ ఆలస్యమవుతోంది. జీవనశైలి మార్పులు ఇతర అనారోగ్యాలు కూడా దీనికి కారణం అవొచ్చు

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

WHO హెచ్చరిక: భారతీయ మూడు దగ్గు సిరప్లు ప్రమాదకరం!

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) భారతదేశానికి చెందిన మూడు కంపెనీల దగ్గు సిరప్లపై హెచ్చరిక జారీ చేసింది. ఈ సిరప్లు ఆరోగ్యానికి హానికరమని WHO తెలిపింది. వీటిలో శ్రేసన్ ఫార్మా తయారుచేసిన ‘కోల్డిఫ్’, ఇటీవల 22 మంది పిల్లల మరణాలకు కారణమైంది. అదనంగా, రెడ్నెక్స్ ఫార్మా యొక్క ‘రెస్పిఫ్రెష్ TR’ మరియు షేప్ ఫార్మా యొక్క ‘రీలైఫ్’ సిరప్లు కూడా ప్రమాదకరంగా గుర్తించబడ్డాయి. అయితే, ఈ మందులు ఇతర దేశాలకు ఎగుమతి కాలేదని భారత సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) WHOకు స్పష్టం చేసింది. ప్రజలు ఈ సిరప్లను వాడకూడదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్

మా కుటుంబాన్ని ఆదుకోరూ …

మా కుటుంబాన్ని ఆదుకోండి అంటూ .. ఒక తండ్రి ఆవేదన అందరినీ కలచివేసింది. అరసవల్లి స్థానిక ఆదిత్యనగర్ లో నివాసముంటున్న కళ్లేపల్లి. రమేష్ కుమార్, కుమారుడు లీలసాయి కృష్ణ ఊపిరితిత్తుల సంక్రమణ (ఇన్ఫెక్షన్)తో గత ఆరునెలల నుండి బాధపడుతున్నారు. తల్లి టైలరింగ్ వృత్తి కొనసాగిస్తూ కాలం నెట్టుకొస్తున్నారు. తండ్రి రమేష్ కొన్నేళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, నడవలేని స్థితిలో ఇంటికే పరిమితమవ్వగా, కొడుకు పరిస్థితి దీనస్థాయిలోకి రావడం జీర్ణించుకోలేకపోతున్నారు. ఆర్ధికంగా ఎటువంటి వెసులుబాటు లేకపోవటంతో, మంగళవారం పత్రికా ప్రతినిధుల సహాయం కోరారు. ఈ సందర్భంగా కళ్లేపల్లి. రమేష్ కుమార్ ప్రతినిధులతో మాట్లాడుతూ కుమారునకు ఊపిరితిత్తులలో నీరు చేరిందని, నగరానికి చెందిన వైద్యులు చింతాడ భాస్కర్ తెలిపారని, బ్రాన్కో స్కోపీ పరీక్షలను విశాఖపట్టణంలో చేయించి మెరుగైనవైద్యం అందించాలని, ఆరోగ్యశ్రీ కూడా వర్తించదన్నారు. వైద్య పరీక్షలకు, మందులకు సుమారు లక్ష రూపాయల వరకు అవసరముందని, ప్రస్తుతానికి రెండు నెలలకు సరిపడే మందులను వాడాలని, వేక్షిణ్ వేశారని, ఇది సంవత్సరానికి ఒక సారి వాడాలని చెప్పారన్నారు. మెరుగైన చికిత్సకు ఆర్ధిక స్థోమత అడ్డంకిగా ఉందని, మనసున్న దాతలు, ప్రముఖులు, స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ నాయకులు స్పందించి మా కుటుంబాన్ని ఆదుకోవాలని, (పింఛన్) సదరన్ సర్టిఫికెట్ ఇంకా మంజూరు కాలేదని, ఏ ఆధారం లేదని కన్నీటిపరవంతమయ్యారు. దాతలు నేరుగా గాని, లీలకృష్ణ తల్లి కళ్లేపల్లి.సుజాత ఫోన్ పే (9381442744) ద్వారా గాని సహాయమందించాలని కోరారు.

విశాఖపట్నం

*రాష్ట్రం అన్ని రంగాల్లో దూసుకు పోతుంది “

విశాఖపట్నం, అక్టోబర్ (పున్నమి ప్రతినిధి): విశాఖ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో ప్రభుత్వ విప్‌ శ్రీ గణబాబు ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో మాట్లాడుతూ — కూటమి పాలనలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా దూసుకుపోతోందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ విశాఖపట్నంలో డేటా సెంటర్‌కు శంకుస్థాపన చేయడం రాష్ట్ర ఐటీ రంగానికి మరింత బలం చేకూరుస్తుందని అన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌కు మైక్రోసాఫ్ట్‌ను తీసుకువచ్చినట్లే, ఇప్పుడు విశాఖలో గూగుల్‌తో ఒప్పందం కుదుర్చి నగరాన్ని గేమ్ ఛేంజర్‌గా మలుస్తున్నారని గణబాబు పేర్కొన్నారు. అలాగే, గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పెట్టుబడులు వెనక్కి వెళ్ళినప్పటికీ, గత 16 నెలల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అనుభవం, విజన్‌తో రూపొందించిన 26 కొత్త పారిశ్రామిక విధానాలు, సింగిల్ విండో సిస్టమ్ ద్వారా భారీ పెట్టుబడులు ఆకర్షించబడ్డాయని తెలిపారు. అమరావతిలో క్వాంటం వ్యాలీ, విశాఖలో గూగుల్ వంటి సంస్థలతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు — అనంతపురం, ఉత్తరాంధ్ర, అమరావతి ప్రాంతాల్లో — సుమారు ₹11 లక్షల కోట్ల పెట్టుబడులు, 9 లక్షల ఉద్యోగ అవకాశాలు లభించాయని వివరించారు. రాబోయే కాలంలో మరో 5 లక్షల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో నగరాల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఐదు జిల్లాలకు మాస్టర్ ప్లాన్‌లు సిద్ధం చేయాలని కలెక్టర్లకు మంత్రి లోకేష్ ఆదేశించారని తెలిపారు. కూటమి పాలనలో రాష్ట్ర అభివృద్ధి పథంలో ముందుకు సాగుతూ, పలు సంక్షేమ పథకాలు సమర్ధవంతంగా అమలు అవుతున్నాయని గణబాబు మీడియా ద్వారా తెలిపారు. ఈ కార్యక్రమంలో 90వ వార్డ్‌ టీడీపీ కార్పొరేటర్ బొమ్మిడీ రమణ, టీడీపీ నాయకులు నరిపిన్ని సత్తిరాజు, యలమంచిలి ప్రసాద్, నరవ అనూష తదితరులు పాల్గొన్నారు.

Blog

నంద్యాలలో కూటమి పార్టీల సన్నాహక సమావేశం నరేంద్ర మోడీ బహిరంగ సభను చారిత్రక విజయంగా మారుద్దాం :-మంత్రి ఫరూక్ పిలుపు

నంద్యాల తెలుగుదేశం పార్టీ (టీడీపీ), జనసేన పార్టీ (జెఎస్.పి) , భారతీయ జనతా పార్టీ (బీజేపీ)ల కూటమి ఆధ్వర్యంలో నంద్యాల పట్టణంలోని స్థానిక మున్సిపల్ టౌన్ హాల్‌లో భారీ సన్నాహక సమావేశం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరుకానున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయడంపై చర్చించడానికి మరియు కార్యాచరణ రూపొందించడానికి ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ హాజరయ్యారు ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యే ఈ భారీ బహిరంగ సభను మనం ప్రతిష్టాత్మకంగా తీసుకొని, విజయవంతం చేయాలని . ఇది కేవలం ఒక సభ కాదు, రాష్ట్ర భవిష్యత్తుకు మార్గనిర్దేశం చేసే వేదిక అని పిలుపునిచ్చారు. ఈ భారీ బహిరంగ సభ ఈనెల 16వ తేదీన మధ్యాహ్నం రెండు గంటలకు కర్నూల్ సమీపంలోని నన్నూరు దగ్గర ఉన్న రాగ మయూరి వెంచర్‌లో జరుగుతుందని తెలిపారు. నంద్యాల ప్రాంతం రాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలక మలుపునకు సాక్షిగా నిలవనుందని ఆయన అన్నారు. నంద్యాల నియోజకవర్గం నుంచి దాదాపు 30 వేల మంది ప్రజలు ఈ చారిత్రక సభకు హాజరు కావాలని కూటమి పార్టీలు లక్ష్యంగా పెట్టుకున్నాయని తెలియజేశారు. “ప్రతి డివిజన్, ప్రతి గ్రామం నుంచి ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చేలా కూటమి శ్రేణులు కృషి చేయాలన్నారు . ఈ సభ విజయవంతం కావడంలో ప్రతి కార్యకర్త పాత్ర కీలకం” అని ఆయన దిశానిర్దేశం చేశారు. అలాగే ప్రధాని నరేంద్ర మోడీ ఈ సభ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకు, ముఖ్యంగా రానున్న ఐదేళ్ల ప్రగతికి సంబంధించి కీలకమైన మరియు స్పష్టమైన సందేశాన్ని ఇచ్చే అవకాశం ఉందని మంత్రి ఫరూక్ అభిప్రాయపడ్డారు. ప్రధానమంత్రి ప్రసంగం రాష్ట్ర అభివృద్ధి దిశగా మనకు కొత్త స్ఫూర్తిని, దిశను అందిస్తుందని. కావున, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈ చారిత్రక సభకు హాజరై, ప్రధాని ప్రసంగాన్ని శ్రద్ధగా వినాలని విజ్ఞప్తి చేస్తున్నాను” అని ఆయన కోరారు. కర్నూలలో జరగబోయే ఈ సభను కూటమి పక్షాలు ఒక శక్తి ప్రదర్శనగా మార్చడానికి, తద్వారా రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించడానికి సంసిద్ధమవుతున్నాయని ఆయన తెలిపారు . అనంతరం మంత్రి ఫరూక్ ఆధ్వర్యంలో అక్కడ విచ్చేసినటువంటి కూటమి నాయకులకు ప్రజలకు భోజన సదుపాయం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పత్తిపాడు ఎమ్మెల్యే రామాంజనేయులు, శాప్ చైర్మన్ రవి నాయుడు, నంద్యాల నియోజకవర్గ పరిశీలకులు ఆలం నర్సం నాయుడు,నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్, బిజెపి జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు, జనసేన నంద్యాల నియోజకవర్గ సమన్వయకర్త పిడతల సుధాకర్ , టిడిపి రాష్ట్ర కార్యదర్శులు రామచంద్రరావు, ఏవిఆర్ ప్రసాద్, తులసి రెడ్డి, నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటుపల్లి హరిబాబు, శ్రీశైలం దేవస్థానం ట్రస్ బోర్డు మెంబర్ మేడ మురళీధర్, బిజెపి సీనియర్ నాయకులు ఇంటి ఆదినారాయణ, మున్సిపల్ కమిషనర్ శేషన్న మరియు టిడిపి, జనసేన, బిజెపి నాయకులు అధికారులు ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు

E-పేపర్

పబ్బతి చిన్మయి మరిన్ని విజయాలు సాధించాలి మంత్రి ఎన్ఎండి ఫరూక్

నంద్యాల ఫెన్సింగ్ లో ఏషియన్ గేమ్స్ నందు సత్తా చాటిన పబ్బతి చిన్మయి శ్రేయ అంతర్జాతీయంగా మరిన్ని విజయాలు సాధించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ఆకాంక్షించారు పద్మావతి నగర్ లోని ప్రముఖ ఆర్యవైశ్య నాయకులు బిల్డర్ పబ్బతి వేణుగోపాల్ స్వగృహానికి మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్, శప్ చైర్మన్ రవి నాయుడు, నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ , టిడిపి రాష్ట్ర కార్యదర్శి రామచంద్రరావు , నీటి సంఘాల చైర్మన్ చాబోలు ఇలియాస్ తెలుగుదేశం పార్టీ నాయకులు శమీముల్లా తదితరులు విచ్చేశారు ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ ఫెన్సింగ్ క్రీడాకారుని పబ్బతి చిన్మయి శ్రేయతో ఫెన్సింగ్ క్రీడా మరియు ఎక్కడ కోచింగ్ తీసుకున్నారు వివరాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఫెన్సింగ్ క్రీడలో నంద్యాల జిల్లా కీర్తిని అంతర్జాతీయంగా మారు మోగేలా చేశావని ప్రత్యేకంగా అభినందించారు .అనంతరం శాలువా కప్పి సత్కరించారు. పబ్బతి వేణుగోపాల్, అడ్వకేట్ అపర్ణ దంపతులు మంత్రి ఎన్ఎండి ఫరూక్ షాప్ చైర్మన్ రవి నాయుడు టిడిపి నాయకులు ఎన్ఎండి ఫిరోజ్ లను సత్కరించారు

Blog

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సభను విజయవంతం చేయాలని అధికారులతో మంత్రి ఎన్.ఎండి ఫరూక్ సమీక్ష

నంద్యాల ఈ నెల 16వ తేదీన కర్నూల్ జిల్లా, నన్నూరు టోల్ ప్లాజా దగ్గర గల రాగ మయూరి వెంచర్ల వద్ద జరిగే భారత ప్రధాని నరేంద్ర మోడీ భారీ బహిరంగ సభను విజయవంతం చేయడానికి నంద్యాల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ శాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్.ఎండి ఫరూక్ అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ రివ్యూ మీటింగ్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సభకు సంబంధించిన ఏర్పాట్లు, భద్రతా ప్రమాణాలు, జన సమీకరణ, ట్రాఫిక్ నియంత్రణ వంటి అంశాలపై మంత్రి ఫరూక్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రధాని పర్యటన సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బహిరంగ సభను చరిత్రలో నిలిచిపోయేలా విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు ఈ సమావేశంలో పత్తిపాడు శాసనసభ్యులు రామాంజనేయులు, శాప్ చైర్మన్ రవి నాయుడు, నంద్యాల నియోజకవర్గ పరిశీలకులు ఆలం నర్సం నాయుడుతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

శ్రీజ దమ్ముకు ఘన స్వాగతం బిగ్ బాస్‌లో శివంగిగా ప్రత్యేక గుర్తింపు తనకు ఓటు వేసిన వారందరికీ శ్రీజ కృతజ్ఞతలు

విశాఖ ఎన్ఏడి , అక్టోబర్ (పున్నమి ప్రతినిధి) నగరానికి చెందిన దమ్ము శ్రీజకు సోమవారం విశాఖ విమానాశ్రయంలో సాదర స్వాగతం లభించింది. ఈ సందర్భంగా శ్రీజ తల్లిదండ్రులు దమ్ము శ్రీనివాసరావు–లావణ్య దంపతులు కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులతో కలిసి ఘనంగా స్వాగతం పలికారు. విమానాశ్రయంలో శ్రీజను పూలదండలతో సత్కరించి, కేకు కత్తిరించి శుభాకాంక్షలు తెలిపారు. అగ్నిపరీక్ష కార్యక్రమం ద్వారా గుర్తింపు తెచ్చుకున్న శ్రీజ, బిగ్ బాస్ హౌస్ లో కామనర్ కంటెస్టెంట్ గా ప్రవేశించి ఐదు వారాలపాటు అనేక టాస్కుల్లో ముందువరుసలో నిలిచి “శివంగి శ్రీజ”గా ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. ప్రజల నుంచి విశేషమైన ఓట్లు పొందిన శ్రీజ, తనకు అభిమానంతో ఓటు వేసి ఆదరించిన వారందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇదే ప్రేమ, మద్దతు కొనసాగించాలని కోరారు. శ్రీజను స్వాగతించిన వారిలో సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, డాక్ యార్డ్ కేటీబీ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొని అభినందనలు తెలిపారు.

తెలంగాణ

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల

పున్నమి: అక్టోబర్ 14: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక(Jubilee Hills By-Election) నోటిఫికేషన్‌ను ఎన్నికల సంఘం(ELection Commission) విడుదల చేసింది. నేటి నుంచి ఈనెల 21 వరకు నామినేషన్లు స్వీకరణ ఉంటుందని ఈసీ పేర్కొంది. ఈనెల 22న నామినేషన్ల పరిశీలన, 24వ తేదీ వరకు ఉపసంహరణకు అవకాశం ఇచ్చారు. షేక్‌పేట్‌ తహశీల్దార్‌ కార్యాలయంలో నామినేషన్‌ పత్రాలు స్వీకరించనున్నారు. కాగా, జూబ్లీహిల్స్నియోజకవర్గంలో మొత్తం 3.98లక్షల మంది ఓటర్లు ఉన్నారు. గెలుపుపై మూడు ప్రధాన పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించగా.. నేడో, రేపు బీజేపీ సైతం క్యాండి‌డేట్‌ను ఖరారు చేయనున్నది. ఈ ఉపఎన్నికను కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకునేందుకు గులాబీ పార్టీ ఆశపడుతుండగా.. ఎలాగైనా విజయం సాధించాలని కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తున్నది. మరోవైపు గెలుపు కోసం బీజేపీ సైతం తహతహలాడుతున్నది. దీపావళి తర్వాత ప్రచారం మరింత ఊపందుకోనున్నట్లు తెలుస్తోంది. మూడు ప్రధాన పార్టీలకు చెందిన రాష్ట్ర స్థాయి ముఖ్య నేతలందరూ ఇక్కడే మోహరించనున్నారు. మాగంటి గోపీనాథ్ మృతితో ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. Video: http://punnami.in/%20జూబ్లీహిల్స్

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.