Wednesday, 29 April 2026

Blog

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

మెడిసిన్స్ మీద జి ఎస్ టి తగ్గినా… అమలాపురం లో యధేశ్చగా దోపిడి…

లంచాల మాయలో డ్రగ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్… జీఎస్టీ సమావేశలకు పరిమితం అవుతున్న ఉన్నతాధికారులు… అమలాపురం, అక్టోబరు 14 (పున్నమి ప్రతినిధి) : కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గించి దాదాపు 3 వారాలయింది. కొన్ని గూడ్స్ పై తగ్గినా ప్రజా అవసరాల వస్తువుల విషయంలో ఎక్కడ అధికానరావడం లేదు. ముఖ్యంగా మందుల విషయం లో 7 శాతం జి ఎస్ టి తగ్గితే ఆసుపత్రి, మెడికల్ షాపు ల్లో ఎం ఆర్ పి ధరలకు విక్రయాలు చేస్తున్నా డ్రగ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ మామూళ్ళ మత్తులో జోగుతున్నారు. ఫిర్యాదులు చేయండి అంటూ టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తున్నా స్పందన కానరావడం లేదు. కలెక్టర్ స్థాయి అధికారుల నుంచి జిఎస్టి పై అవగాహన సదస్సులో పెడుతున్నారే గాని ఆసుపత్రి ల్లోని డిస్పెన్సిరీలు తనిఖీ లేదు. తగ్గించిన 7 శాతం లాగేస్తున్నారు.

తిరుపతి

శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని దర్శించుకున్న ఏపీఎన్జీవో అధ్యక్షులు

ఆంధ్రప్రదేశ్ ఎన్జీవో సంఘం అధ్యక్షులు విద్యాసాగర్ మంగళవారం శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.వారికి స్థానిక ఎన్జీవో నాయకులు స్వాగతం పలికి స్వామి అమ్మవార్ల దర్శనం ఏర్పాట్లు చేశారు.దర్శనం అనంతరం వేద పండితుల ఆశీర్వాదం ఇప్పించి స్వామి అమ్మవార్ల తీర్థప్రసాదాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక ఎన్జీవో అధ్యక్షులు చెంచురత్తు యాదవ్,సంయుక్త కార్యదర్శి బాలచంద్ర యాదవ్,తిరుపతి జిల్లా ప్రెసిడెంట్ రాఘవులు సురేష్ తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

జాతీయ స్థాయికి యస్ వి కె స్పోర్ట్స్ అకాడమీకీ చెందిన ఇద్దరు విద్యార్థులు ఎంపిక రైల్వేకోడూరు అక్టోబర్ పున్నమి ప్రతినిధి రైల్వేకోడూరుకు చెందిన ఎస్ వి కే స్పోర్ట్స్ అకాడమీకి చెందిన విద్యార్థులు ఈ నెల 10,11,12 వ తేది బాపట్ల జిల్లా పెట్టురు మండలం లో 69 SGF స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్ 14 రాష్ట్రా స్థాయి పోటీలు నిర్వహించారు. ఇందులో అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు పట్టణంలో ఉన్న ఎస్ వి కే స్పోర్ట్స్ అకాడమీ కి చెందిన కే. నవ్య శ్రీ U_16 kg , సంధ్య నా U_16-18 kg విభాగంలో బంగారు పధకము సాధించింధని అలాగే పి. శ్రీరామ కస్య పధకము సాధించాడు బంగారు పధకము సాధించిన ఇద్దరు నవంబర్ నెలలో పంజాబ్ లో జరగబోయే జాతీయ స్థాయి పోటీలకు ఎంపికెనట్లు కోచ్ శివాజీ తెలీపారు.

గూడూరు

ఎస్.కే.ఆర్. డిగ్రీ కళాశాలలో “సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్” అంశంపై అవగాహన కార్యక్రమం

అక్టోబర్ 14 @ గూడూరు స్థానిక ఎస్కేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ మరియు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ ఆధ్వర్యంలో జీఎస్టీ పై విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే. శివప్రసాద్ మాట్లాడుతూ ‘ఇంటింటికీ జీఎస్టీ ఫలాలు’ థీమ్‌తో నిత్యవసరాలు, ఔషధాలు, స్టేషనరీ, వస్త్రాలు, క్రీడా వస్తువులు, రవాణా, మహిళలు, చిన్నారులకు సంబంధించిన వస్తులపై పన్నులు తగ్గిన అంశాన్ని విస్తృతంగా ప్రచారం చేయడంలో లో భాగంగా జీఎస్టీ తగ్గింపు సంబరాల్లో విద్యార్థులను కూడా భాగస్వామ్యం చేయాలని కళాశాల కమిషనర్ అదేశానుసారము కళాశాలలో జీఎస్టీ పై వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, పన్ను సంస్కరణలో జీఎస్టీ చాలా ప్రాధాన్యత కలిగి ఉన్నదని విద్యార్థిని విద్యార్థులు పన్ను రేట్లపై పూర్తి అవగాహన కలిగి ఉండి తమ ప్రాంతంలోని నిరక్షరాస్యులయిన ప్రజలకు కూడా అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వై. శ్రీనివాసులు, కార్యక్రమ నిర్వాహకురాలు డాక్టర్ శైలజ, రెడ్ రిబ్బన్ క్లబ్ కోఆర్డినేటర్ డాక్టర్ బి. పీర్ కుమార్, ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ పి. నారాయణ రాజు, అధ్యాపకులు శ్రీధర్ శర్మ, డాక్టర్ ఝాన్సీ వాణి, కృపా కరుణ వాణి, డాక్టర్ కె. కోటేశ్వరరావు, కె. రవి రాజు, గోపాల్, పద్మమ్మ, ఉష, తదితర అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

తిరుపతి

ఓట్ చోర్ గద్దిచోడ్ పై ప్రజాభిప్రాయ సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించిన కాంగ్రెస్ శ్రేణులు

పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి మరియు డిసిసి అధ్యక్షులు బాలగురవం బాబు ఆదేశాల మేరకు ఓట్ చోర్ గద్దిచోడ్ కార్యక్రమంపై ప్రజాభిప్రాయ సంతకాల సేకరణ కార్యక్రమం శ్రీకాళహస్తి మండలం వాంపల్లి గ్రామం నందు శ్రీకాళహస్తి నియోజకవర్గ సమన్వయకర్త తలపా దామోదరం రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది.ఈ సందర్భంగా తలపా దామోదరం రెడ్డి మాట్లాడుతూ భారతదేశంలో ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రధాన భూమిక పోషిస్తుందని,కానీ ఇంతటి స్వాతంత్ర్య ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థలే ఓట్ల అవకతవకులకు పాల్పడుతుంటే భారతదేశంలో ప్రజాస్వామ్యం అభాసు పాలవుతుందని రాబోవు రోజుల్లో ఇటువంటి అవకతవకలు జరగకుండా ప్రజల్లో చైతన్యం నింపడం కొరకు కాంగ్రెస్ పార్టీ ఓట్ చోర్ గద్దిచోడ్ కార్యక్రమాని తీవ్ర స్థాయిలో ప్రజల్లోకి తీసుకువెళుతుందని తెలిపారు.

విశాఖపట్నం

*కల్తీ మద్యం ప్రధాన సూత్రధారి వై.ఎస్. జగన్ – పాత్రధారి జోగి రమేష్ పై కఠిన చర్యలు తీసుకోవాలి*

గాజువాక, అక్టోబర్ 14 (పున్నమి ప్రతినిధి) కల్తీ మద్యాన్ని ప్రోత్సహిస్తూ, తద్వారా కూటమి ప్రభుత్వాన్ని ప్రజల్లో అస్థిరపాలు చేయాలని కుట్రలు పన్నిన పులివెందుల ఎమ్మెల్యే జగన్ మోహన్ రెడ్డి మరియు ఆయన చెంచా పాత్రధారి జోగి రమేష్ పై కఠినమైన చర్యలు తీసుకోవాలని గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాసరావు, 67వ వార్డ్ కార్పొరేటర్ పల్లా శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గాజువాక నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో టీడీపీ నాయకులు సమావేశమై, వైసీపీ చేస్తున్న కుట్రలు, నీచమైన రాజకీయాలను ఎండగట్టాలని తీర్మానించారు. రాజకీయాలలో కొనసాగేందుకు నైతిక అర్హత జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ పార్టీ కోల్పోయిందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గాజువాక నియోజకవర్గ బి.సి. సెల్ అధ్యక్షులు తమిరి శివప్రసాదరావు, వార్డ్ అధ్యక్షులు సింగూరు అనంత్, అక్కిన లక్ష్మణరావు, గాజువాక నియోజకవర్గ టీడీపీ ప్రతినిధులు బొడ్డ వెంకటరమణ, దొడ్డి సత్యరావు, బైపిల్లి గాంధీ, సింగంపల్లి దేవుడు, గుర్రం నూకరాజు, మాతా సంతోషి, రాష్ట్ర అగ్నికులక్షత్రియ డైరెక్టర్ అంగ కృష్ణ, టీడీపీ బి.సి. నాయకులు పోతిన వెంకటేశ్వరరావు, అజయ్ చౌదరి, పచ్చికూర్ల అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ

*తెలంగాణ డిజిపి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి గారు…*

*తెలంగాణ డిజిపి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి గారు…* హైదరాబాద్: నగరంలోని డిజిపి కార్యాలయంలో ఇటీవల పదవీ బాధ్యతలు స్వీకరించిన డిజిపి శ్రీ బి. శివధర్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి గారు… Video: http://punnami.com/Tenagana

తెలంగాణ

*బస్సులు నడవొద్దు.. షాపులు తెరవొద్దు.. బంద్‎కు సహకరించాలని బీసీ జేఏసీ పిలుపు*

పున్నమి న్యూస్ అక్టోబర్ 14 బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు ఇచ్చిన స్టేను నిరసిస్తూ ఈ నెల 18న తలపెట్టిన రాష్ట్ర బంద్‎ను విజయవంతం చేయాలని తెలంగాణ బీసీ జేఏసీ పిలుపునిచ్చింది. బస్సులు నడవొద్దు.. విద్యాసంస్థలు తెరవొద్దు.. వ్యాపార సముదాయాలు స్వచ్చందంగా బంద్ చేయాలని కోరింది. గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్ద బంద్‎కు సంబంధించిన వాల్ పోస్టర్‎ను జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణయ్య , వైస్ చైర్మన్ వీజీఆర్ నారగొని, వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ , కో చైర్మెన్ రాజారామ్ యాదవ్ కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ బంద్ తో బీసీల సెగ కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలకు తెలిసేలా బీసీలు కదిలిరావలని పిలుపునిచ్చారు. ఆర్టీసీ యాజమాన్యంతో పాటు, విద్యాసంస్థలు , వ్యాపార సముదాయాలు స్వచ్చందంగా బంద్ కు సహకరించాలని కోరారు. బంద్ కు మద్దతుగా అన్ని రాజకీయ పార్టీ నాయకులను కలుస్తామన్నారు. మద్దతు ఇవ్వని పార్టీలకు బీసీల ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. జేఏసీ నాయకులు గుజ్జ కృష్ణ , గుజ్జ సత్యం, కుందారపు గణేష్ చారి, కుల్కచర్ల శ్రీనివాస్, వేముల రామకృష్ణ , నీల వెంకటేశ్, శ్యామ్ కుర్మ , విజయ్, లింగం గౌడ్, జిల్లపల్లి అంజి తదితరులు పాల్గొన్నారు…. Video: https://punnami.in/%20బస్సులు%20నడపొద్దు

ఆంధ్రప్రదేశ్

కొఠారి గ్రామం చెందిన దియా పాప భరోసా కార్యక్రమంలో 100600 ఇవ్వడం జరిగింది

శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం కొఠారి గ్రామనికి చెందిన పావని ముద్దుల కుమార్తె దీయా అనే చిన్న పాపకి (వయస్సు 1 సం.6 నెలలు) న్యూమోనియా వ్యాధి సోకింది. శ్రీకాకుళంలో ఉన్న రిమ్స్ హాస్పిటల్ లో వెంటిలేటర్పై వైద్యం అందిస్తూ ఉన్నారు. పాప ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆ పాపకు మెరుగైన వైద్యం కోసం ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు.తల్లితండ్రులు పేదవారు కూలీ చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆర్ధిక పరిస్థితి అంత అంత మాత్రమే కావడంతో మెరుగైన వైద్యం కోసం దాతల సహాయం కోసం ఎదురుచూస్తున్నారు.OSG FOUNDATION వైజాగ్ GS FOUNDATION, NARAYAN TAMMU విజయనగరం శ్రావ్యగారు,మను తమ్ము, నేను స్టేటస్ పెట్టిన మిత్రులు, బందువులు, క్లాస్మేట్స్, కొఠారి గ్రామ యువత,చుట్టూ పక్కన ఫ్రెండ్స్, శ్రీకాకుళం ఉన్న మా ఫ్రెండ్స్, చుట్టు ప్రాంతంలో ఉన్న యువత, ఉద్యోగస్తులు,స్వచ్ఛంద సంస్థలు తరుపున తక్షణ సహాయంగా 100600 రూ కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది….

ఖమ్మం

ప్రమాదాలకి మలుపు మహా రాష్ట్ర బ్యాంకు మూల మలుపు

ఖమ్మం పున్నమి ప్రతినిధి ఖమ్మం నగరము లోని గట్టయ్య సెంటర్ మహా రాష్ట్ర బ్యాంకు దగ్గర చిన్నదో పెద్దదో రోడ్డు ప్రమాదం జరుగు తూనే ఉంది. ప్రభుత్వ డిగ్రీ కాలేజి, కవిత పీజీ కాలేజ్ విద్యార్థిని, విద్యార్థులతో పాటు ప్రజలు కూడా నిత్యం ప్రయాణలు కొనసాగిస్తుంటారు. అయితే ఇక్కడ మహా రాష్ట్ర బ్యాంక్ మూల మలుపు లో అటు ఇటు వచ్చే వాహనాలు వేగంగా రావడం తో పాటు గా బ్యాంకు కి వచ్చే వారి యొక్క వావహనాలు రోడ్డ మీదనే నిలపడం కూడా ప్రమాదలకి కారణం అయితున్నాయి. కార్పొరేషన్ అధికారులు తు తు మంత్రం గా చెప్పట్టిన అక్రమణల తొలగింపు ఎం మాత్రము కూడా ఫలితాలు ఇవ్వలేదు. మల్లి యధావిధిగా దుకాణదారులు రోడ్డు మీదకు వచ్చి వారి యొక్క కార్యకలాపాలు కొనసాగి స్తున్నారు. కార్పొరేషన్, పోలీస్ అధికారులు సమనవ్యం తో ప్రణాళిక రూపొందించి ఈ ప్రమాదలకి అడ్డుకట్ట వెయ్యాలని ప్రజలు కోరుతున్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.