Wednesday, 29 April 2026

Blog

తెలంగాణ

*బస్సులు నడవొద్దు.. షాపులు తెరవొద్దు.. బంద్‎కు సహకరించాలని బీసీ జేఏసీ పిలుపు*

పున్నమి న్యూస్ అక్టోబర్ 14 బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు ఇచ్చిన స్టేను నిరసిస్తూ ఈ నెల 18న తలపెట్టిన రాష్ట్ర బంద్‎ను విజయవంతం చేయాలని తెలంగాణ బీసీ జేఏసీ పిలుపునిచ్చింది. బస్సులు నడవొద్దు.. విద్యాసంస్థలు తెరవొద్దు.. వ్యాపార సముదాయాలు స్వచ్చందంగా బంద్ చేయాలని కోరింది. గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్ద బంద్‎కు సంబంధించిన వాల్ పోస్టర్‎ను జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణయ్య , వైస్ చైర్మన్ వీజీఆర్ నారగొని, వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ , కో చైర్మెన్ రాజారామ్ యాదవ్ కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ బంద్ తో బీసీల సెగ కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలకు తెలిసేలా బీసీలు కదిలిరావలని పిలుపునిచ్చారు. ఆర్టీసీ యాజమాన్యంతో పాటు, విద్యాసంస్థలు , వ్యాపార సముదాయాలు స్వచ్చందంగా బంద్ కు సహకరించాలని కోరారు. బంద్ కు మద్దతుగా అన్ని రాజకీయ పార్టీ నాయకులను కలుస్తామన్నారు. మద్దతు ఇవ్వని పార్టీలకు బీసీల ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. జేఏసీ నాయకులు గుజ్జ కృష్ణ , గుజ్జ సత్యం, కుందారపు గణేష్ చారి, కుల్కచర్ల శ్రీనివాస్, వేముల రామకృష్ణ , నీల వెంకటేశ్, శ్యామ్ కుర్మ , విజయ్, లింగం గౌడ్, జిల్లపల్లి అంజి తదితరులు పాల్గొన్నారు…. Video: https://punnami.in/%20బస్సులు%20నడపొద్దు

ఆంధ్రప్రదేశ్

కొఠారి గ్రామం చెందిన దియా పాప భరోసా కార్యక్రమంలో 100600 ఇవ్వడం జరిగింది

శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం కొఠారి గ్రామనికి చెందిన పావని ముద్దుల కుమార్తె దీయా అనే చిన్న పాపకి (వయస్సు 1 సం.6 నెలలు) న్యూమోనియా వ్యాధి సోకింది. శ్రీకాకుళంలో ఉన్న రిమ్స్ హాస్పిటల్ లో వెంటిలేటర్పై వైద్యం అందిస్తూ ఉన్నారు. పాప ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆ పాపకు మెరుగైన వైద్యం కోసం ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు.తల్లితండ్రులు పేదవారు కూలీ చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆర్ధిక పరిస్థితి అంత అంత మాత్రమే కావడంతో మెరుగైన వైద్యం కోసం దాతల సహాయం కోసం ఎదురుచూస్తున్నారు.OSG FOUNDATION వైజాగ్ GS FOUNDATION, NARAYAN TAMMU విజయనగరం శ్రావ్యగారు,మను తమ్ము, నేను స్టేటస్ పెట్టిన మిత్రులు, బందువులు, క్లాస్మేట్స్, కొఠారి గ్రామ యువత,చుట్టూ పక్కన ఫ్రెండ్స్, శ్రీకాకుళం ఉన్న మా ఫ్రెండ్స్, చుట్టు ప్రాంతంలో ఉన్న యువత, ఉద్యోగస్తులు,స్వచ్ఛంద సంస్థలు తరుపున తక్షణ సహాయంగా 100600 రూ కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది….

ఖమ్మం

ప్రమాదాలకి మలుపు మహా రాష్ట్ర బ్యాంకు మూల మలుపు

ఖమ్మం పున్నమి ప్రతినిధి ఖమ్మం నగరము లోని గట్టయ్య సెంటర్ మహా రాష్ట్ర బ్యాంకు దగ్గర చిన్నదో పెద్దదో రోడ్డు ప్రమాదం జరుగు తూనే ఉంది. ప్రభుత్వ డిగ్రీ కాలేజి, కవిత పీజీ కాలేజ్ విద్యార్థిని, విద్యార్థులతో పాటు ప్రజలు కూడా నిత్యం ప్రయాణలు కొనసాగిస్తుంటారు. అయితే ఇక్కడ మహా రాష్ట్ర బ్యాంక్ మూల మలుపు లో అటు ఇటు వచ్చే వాహనాలు వేగంగా రావడం తో పాటు గా బ్యాంకు కి వచ్చే వారి యొక్క వావహనాలు రోడ్డ మీదనే నిలపడం కూడా ప్రమాదలకి కారణం అయితున్నాయి. కార్పొరేషన్ అధికారులు తు తు మంత్రం గా చెప్పట్టిన అక్రమణల తొలగింపు ఎం మాత్రము కూడా ఫలితాలు ఇవ్వలేదు. మల్లి యధావిధిగా దుకాణదారులు రోడ్డు మీదకు వచ్చి వారి యొక్క కార్యకలాపాలు కొనసాగి స్తున్నారు. కార్పొరేషన్, పోలీస్ అధికారులు సమనవ్యం తో ప్రణాళిక రూపొందించి ఈ ప్రమాదలకి అడ్డుకట్ట వెయ్యాలని ప్రజలు కోరుతున్నారు.

తిరుపతి

*✍️వీకేఆర్.వై కాలనీలో ఆగని ఆక్రమణలు. కొనసాగుతున్న అక్రమ కట్టడాలు* *రెవెన్యూ హెచ్చరిక పెట్టిన బోర్డును రాత్రికి రాత్రి బోర్డు పెకలించి మట్టి తోలిన భూబకాసురులు*

*✍️వీకేఆర్.వై కాలనీలో ఆగని ఆక్రమణలు. కొనసాగుతున్న అక్రమ కట్టడాలు* *రెవెన్యూ హెచ్చరిక పెట్టిన బోర్డును రాత్రికి రాత్రి బోర్డు పెకలించి మట్టి తోలిన భూబకాసురులు* 👉 *చోద్యం చూస్తున్న రెవెన్యూ అధికారులు* 👉 తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం చిన్న పాండురు పంచాయతీ వి కే ఆర్ వై గిరిజన కాలనీ వద్ద అక్రమ నిర్మాణాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల వి కె ఆర్ వై గిరిజన కాలనీ ప్రాథమిక పాఠశాల సమీపంలో ఓ వ్యక్తి ఇంటి నిర్మాణం కోసం పనులు ప్రారంభించారు.. అయితే తాసిల్దార్ కు అందిన ఫిర్యాదుల మేరకు పనులను నిలుపుదల చేసి రెవిన్యూ అధికారుల ద్వారా బోర్డు పెట్టించారు 👉. తాజాగా వికేఆర్వై కాలనీ కూడలి నుండి హీరో పరిశ్రమకు వెళ్లే మార్గంలో కుడిచేతివైపుగా ఉన్న కొబ్బరి బోండా కొట్టు ను రాత్రి వేళలో అక్రమంగా ఇంటి స్థలాన్ని ఓ కబ్జాదారుడు నిర్మాణాలను దర్జాగా చేపడుతున్నారు. ఈ ఆక్రమణదారులకు కొందరు దళారులుగా ఉంటూ కమిషన్లు తీసుకుని రెవెన్యూ అధికారులకు కాసులు అందిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తం అవుతోంది 👉 ఈ నేపధ్యంలో ఇంత జరుగుతున్నా..నియంత్రింల్సిన రెవెన్యూ అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్టుగా వారు వ్యవహరిస్తుఉండటం ఈ అనుమానాలకు బలం చేకూరుతుంది..అంతేగాక పట్టపగలే నిర్మాణాలు జరుగుతున్నా.. రెవిన్యూ అధికారుల నుండి ఏమాత్రం స్పందన లేదు. 👉అక్రమ నిర్మాణాలను ఆక్రమణలను అడ్డుకునేందుకు రెవెన్యూ అధికారులు ఇద్దరు సిబ్బందిని అక్కడే ఉండి పర్యవేక్షించాలని ఆదేశించిన.. అక్రమ నిర్మాణాలు సాగుతుండటంతో రెవెన్యూ అధికారుల అండదండలు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తం అవుతోంది 👉 ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి గ్రామస్థాయిలో ఇలాంటి భూకబ్జాదారుల్ని నియంత్రించాలని కోరుతున్నాను. సూర్య పున్నమి రిపోర్టర్ సత్యవేడు నియోజకవర్గం

నాగర్‌కర్నూల్

సివిల్ వివాదాల్లో పోలీసులు తల దూర్చవద్దు

*సివిల్ వివాదాల్లో పోలీసులు తల దూర్చవద్దు* *న్యాయస్థానం ముందు నిలబెట్టాల్సిన పోలీసులే అవినీతికి పాల్పడితే ప్రజల్లో నమ్మకం పోతుంది* *గీత దాటితే వేటు తప్పదు: డీజీపీ శివధర్ రెడ్డి* పున్నమి న్యూస్ అక్టోబర్ 14 సివిల్ వివాదాల్లో పోలీసులు తలదూర్చవద్దని, సివిల్ వివాదా లను పరిష్కరించిన పోలీసు స్టేషన్లు, సంబంధిత అధికా రులపై తక్షణమే వేటు పడుతుందని డీజీపీ శివధర్ రెడ్డి హెచ్చరించారు. హోం గార్డు నుంచి ఐపీఎస్ అధికారి వరకూ ఎవరూ సివిల్ వివాదాల్లో తల దూర్చవద్దని కోరుతూ రాష్ట్ర పోలీసులనుద్దేశించి రాసిన అంతర్గత లేఖలో శివధర్ రెడ్డి పేర్కొన్నారు. సివిల్ వివాదాలు సివిల్ కోర్టుల పరిధిలోకి వస్తాయన్న సంగతి ప్రతి పోలీసుకూ తెలుసునని, అయినా వాటిపై దృష్టి సారించే అధికారు లపై కఠిన చర్యలు తప్పవని తేల్చి చెప్పారు. పోలీసు యూనిఫామ్, అవినీతి కలిసి ఉండకూడదన్న డీజీపీ.. అవినీతి, అక్రమాలపై కేసులు నమోదు చేసి న్యాయస్థానం ముందు నిలబెట్టాల్సిన పోలీసులే అవినీతికి పాల్పడితే ప్రజల్లో నమ్మకం పోతుందని చెప్పారు.. Video: https://punnami.in/%20సివిల్

తిరుపతి

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఓట్ చోర్ గద్దె చోడ్ కార్యక్రమం శ్రీకాళహస్తి

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఓట్ చోర్ గద్దె చోడ్ కార్యక్రమం శ్రీకాళహస్తి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు, ఏ.పీ.సీ.సీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల రెడ్డి ఆదేశాల మేరకు సోనియా గాంధీ విచార్ మంచ్ ఆంధ్ర ప్రదేశ్ అధ్యక్షులు అర్జున గురుమూర్తి, అధ్యక్షతన ఓట్ చోర్ గద్దె ఛోడ్ నిరసన కార్యక్రమం మంగళం వారం నాయుడుపేటలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఓబిసి కార్యదర్శి భాస్కర్ రావు, తిరుపతి జిల్లా మైనార్టీ సెల్ జనరల్ సెక్రెటరీ షేక్ కరీముల్లా, నాయుడుపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నాగూర్, మాజీ జనరల్ సెక్రెటరీ నిత్యానందం పాల్గొన్నారు. ఈ సందర్భముగా ఆయన మాట్లాడుతూ,భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మన బాబాసాహెబ్ అంబేద్కర్ ,ఇచ్చి నటువంటి రాజ్యాంగ విరుద్ధంగా దొంగ ఓట్ల గెలుపుతో పరిపాలన చేస్తున్నారని రాజ్యాంగాన్ని భారతదేశ ప్రజల ఓటు హక్కులను హరించి వేస్తున్నారని ఎన్నికల కమిషనర్ కి రాహుల్ గాంధీ మీడియా ముందర అనేక రాష్ట్రాలలో కొన్ని లక్షల దొంగ ఓట్లను సాక్షాధారాలతో మీడియా ముందు బయటపెట్టిన ఇంతవరకు సమాధానం చెప్పలేదని చెప్పారు.దొంగ ఓట్లతో గద్దె ఎక్కిన నరేంద్ర మోడీ గద్దె దిగే వరకు మన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమాలు మొదలవుతాయని హెచ్చరించారు. నరేంద్ర మోడీ ,ఓటు దొంగ గద్దె దిగు ఓట్ చోర్ గద్దె ఛోడ్ అను నివాదంతో నిరసన కార్యక్రమం చేపట్టి సంతకాల సేకరణ కార్యక్రమం చేశారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఏపీ పత్తి రైతులకు శుభవార్త! అక్టోబర్ 21 నుంచి సీసీఐ పత్తి కొనుగోళ్లు ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ పత్తి రైతులకు శుభవార్త. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) ఈ నెల అక్టోబర్ 21 నుంచి పత్తి కొనుగోళ్లు ప్రారంభించనున్నది. రాష్ట్రవ్యాప్తంగా 30 కేంద్రాలలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయబడగా, గతంలాగే జిన్నింగ్ మిల్లుల ద్వారా పత్తి సేకరణ జరగనుంది. ఈ ఏడాది పత్తికి క్వింటాలుకు రూ. 8,110 మద్దతు ధర (MSP) ప్రకటించగా, జిన్నింగ్ మిల్లులకు దూది బేల్‌కు రూ. 1,440 చెల్లించనుంది. రైతులు తమ పత్తి అమ్మకం కోసం స్లాట్ బుకింగ్ తప్పనిసరి. ఇందుకోసం ‘కపాస్ కిసాన్ యాప్’ ద్వారా స్లాట్ బుక్ చేసుకోవాలి, అలాగే అమ్మకం ప్రక్రియను ‘సీఎం యాప్’ ద్వారా పూర్తి చేయవచ్చు. రైతులు తమ పంట వివరాలను గ్రామంలోని రైతు సేవా కేంద్రాల్లో ముందుగానే నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు. CCI కొనుగోళ్లలో తేమ శాతం 8 నుంచి 12 మధ్యలో ఉండాలని నిబంధన విధించబడింది. తక్కువ ధరకు లేదా తక్కువ తూకంతో కొనుగోలు చేసే దళారులు, అక్రమ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. రైతులు ప్రభుత్వ ధరలకు మాత్రమే పత్తి అమ్మాలని సూచించారు. ఈ చర్యలతో రైతులకు సముచితమైన ధర లభిస్తుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

పీఎం కిసాన్ పథకంలో భారీ అక్రమాలు – భార్యాభర్తలిద్దరూ లబ్ధిదారులు, రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం–కిసాన్) పథకంలో భారీ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. దేశవ్యాప్తంగా అర్హత లేని లక్షల మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నట్లు కేంద్ర వ్యవసాయ–రైతు సంక్షేమ శాఖ తనిఖీల్లో తేలింది. ముఖ్యంగా ఒకే కుటుంబంలో భార్యాభర్తలిద్దరూ పెట్టుబడి సాయం పొందుతున్న 31.01 లక్షల అనుమానాస్పద కేసులు గుర్తించబడ్డాయి. ఇందులో ఇప్పటివరకు పరిశీలించిన 19.02 లక్షల కేసుల్లో 17.87 లక్షల మంది (93.98%) భార్యాభర్తలు ఇద్దరూ ప్రయోజనం పొందుతున్నట్లు నిర్ధారణ అయింది. దీనిపై తీవ్రంగా స్పందించిన కేంద్రం, రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలకు అనర్హుల ఏరివేతకు ఆదేశాలు జారీ చేసింది. అక్టోబర్ 15 నాటికి ఈ తనిఖీల ప్రక్రియ పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని గడువు విధించింది. పీఎం-కిసాన్ మార్గదర్శకాల ప్రకారం, ఒక రైతు కుటుంబంలో భార్య లేదా భర్తలో ఎవరో ఒకరే పెట్టుబడి సాయం పొందడానికి అర్హులు. కానీ ఈ నిబంధనను ఉల్లంఘించి అనేక కుటుంబాలు లబ్ధి పొందుతున్నట్లు బయటపడింది. అదనంగా, మైనర్ పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులు, భూమి అమ్మిన తర్వాత పాత–కొత్త యజమానులు ఇద్దరూ లబ్ధి పొందడం వంటి అక్రమాలు కూడా నమోదయ్యాయి. ఇలాంటి అవకతవకలను అరికట్టేందుకు కేంద్రం కఠిన చర్యలు ప్రారంభించింది. భవిష్యత్తులో దరఖాస్తు చేసుకునే ప్రతి రైతుకు **రైతు గుర్తింపు కార్డు తప్పనిసరి

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

“పోలీస్ శాఖను మూసేయడం బెటర్” – ఏపీ హైకోర్టు తీవ్ర అసంతృప్తి

ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ పనితీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. డీజీపీతో పాటు మొత్తం పోలీస్ వ్యవస్థనే నిద్రావస్థలో ఉందని వ్యాఖ్యానిస్తూ, “ఇలా ఉంటే పోలీస్ శాఖను మూసేయడం మంచిదేమో” అని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. టిటిడి పరకామణి కేసులో లోక్ అదాలత రాజీ రికార్డులను సీజ్ చేయాలని సెప్టెంబర్ 19న హైకోర్టు ఆదేశించినా, CIDలో IG స్థాయి అధికారి పోస్టు ఖాళీగా ఉందని కారణం చెబుతూ పోలీస్ శాఖ ఆ ఆదేశాలను అమలు చేయలేదని తెలిపింది. సదుద్దేశం ఉంటే మరో IG ద్వారా ఆ చర్య చేపట్టేవారని కోర్టు వ్యాఖ్యానించింది.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

వెంకటాచలం టోల్ ప్లాజా వద్ద పట్టుబడిన గంజాయి*

🙋‍♂️🙋‍♂️🙋‍♂️🙋‍♂️🙋‍♂️🙋‍♂️🙋‍♂️🙋‍♂️ *వెంకటాచలం టోల్ ప్లాజా వద్ద పట్టుబడిన గంజాయి* *వాహనాలు తనిఖీ చేసిన ఎన్ఫోర్స్మెంట్ అధికారులు* *నెల్లూరు నుండి చెన్నై వైపు వెళ్లే ఆర్టీసీ బస్సు చెక్ చేయగా మూడు బ్యాగులో గంజాయి తరలిస్తూ పట్టుబడ్డ ముగ్గురు వ్యక్తులు…..* వారి వద్ద ఉన్న బ్యాగులను స్వాధీనం చేసుకుని కోర్టుకు ప్రవేశపెట్టనున్న పోలీసులు….. 🙋‍♂️🙋‍♂️🙋‍♂️🙋‍♂️🙋‍♂️

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.