Wednesday, 29 April 2026

Blog

విశాఖపట్నం

శ్రీజ దమ్ముకు ఘన స్వాగతం బిగ్ బాస్‌లో శివంగిగా ప్రత్యేక గుర్తింపు తనకు ఓటు వేసిన వారందరికీ శ్రీజ కృతజ్ఞతలు

విశాఖ ఎన్ఏడి , అక్టోబర్ (పున్నమి ప్రతినిధి) నగరానికి చెందిన దమ్ము శ్రీజకు సోమవారం విశాఖ విమానాశ్రయంలో సాదర స్వాగతం లభించింది. ఈ సందర్భంగా శ్రీజ తల్లిదండ్రులు దమ్ము శ్రీనివాసరావు–లావణ్య దంపతులు కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులతో కలిసి ఘనంగా స్వాగతం పలికారు. విమానాశ్రయంలో శ్రీజను పూలదండలతో సత్కరించి, కేకు కత్తిరించి శుభాకాంక్షలు తెలిపారు. అగ్నిపరీక్ష కార్యక్రమం ద్వారా గుర్తింపు తెచ్చుకున్న శ్రీజ, బిగ్ బాస్ హౌస్ లో కామనర్ కంటెస్టెంట్ గా ప్రవేశించి ఐదు వారాలపాటు అనేక టాస్కుల్లో ముందువరుసలో నిలిచి “శివంగి శ్రీజ”గా ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. ప్రజల నుంచి విశేషమైన ఓట్లు పొందిన శ్రీజ, తనకు అభిమానంతో ఓటు వేసి ఆదరించిన వారందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇదే ప్రేమ, మద్దతు కొనసాగించాలని కోరారు. శ్రీజను స్వాగతించిన వారిలో సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, డాక్ యార్డ్ కేటీబీ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొని అభినందనలు తెలిపారు.

తెలంగాణ

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల

పున్నమి: అక్టోబర్ 14: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక(Jubilee Hills By-Election) నోటిఫికేషన్‌ను ఎన్నికల సంఘం(ELection Commission) విడుదల చేసింది. నేటి నుంచి ఈనెల 21 వరకు నామినేషన్లు స్వీకరణ ఉంటుందని ఈసీ పేర్కొంది. ఈనెల 22న నామినేషన్ల పరిశీలన, 24వ తేదీ వరకు ఉపసంహరణకు అవకాశం ఇచ్చారు. షేక్‌పేట్‌ తహశీల్దార్‌ కార్యాలయంలో నామినేషన్‌ పత్రాలు స్వీకరించనున్నారు. కాగా, జూబ్లీహిల్స్నియోజకవర్గంలో మొత్తం 3.98లక్షల మంది ఓటర్లు ఉన్నారు. గెలుపుపై మూడు ప్రధాన పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించగా.. నేడో, రేపు బీజేపీ సైతం క్యాండి‌డేట్‌ను ఖరారు చేయనున్నది. ఈ ఉపఎన్నికను కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకునేందుకు గులాబీ పార్టీ ఆశపడుతుండగా.. ఎలాగైనా విజయం సాధించాలని కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తున్నది. మరోవైపు గెలుపు కోసం బీజేపీ సైతం తహతహలాడుతున్నది. దీపావళి తర్వాత ప్రచారం మరింత ఊపందుకోనున్నట్లు తెలుస్తోంది. మూడు ప్రధాన పార్టీలకు చెందిన రాష్ట్ర స్థాయి ముఖ్య నేతలందరూ ఇక్కడే మోహరించనున్నారు. మాగంటి గోపీనాథ్ మృతితో ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. Video: http://punnami.in/%20జూబ్లీహిల్స్

తిరుపతి

ఈ మూడు దగ్గు సిరప్లు డేంజర్: WHO

ఈ మూడు దగ్గు సిరప్లు డేంజర్: WHO భారత్లోని 3 ఫార్మా కంపెనీలకు చెందిన కాఫ్ సిరప్లను వాడొద్దని WHO హెచ్చరించింది. ఇందులో ఇటీవల 22 మంది పిల్లల మరణానికి కారణమైన శ్రేసన్ ఫార్మా ‘కోల్డిఫ్’ కూడా ఉంది. దాంతో పాటు రెడ్నేక్స్ ఫార్మా ‘రెస్పిఫ్రెష్ TR’, షేప్ ఫార్మా ‘రీలైఫ్’ సిరప్లు ఆరోగ్యానికి హానికరమని పేర్కొంది. కాగా ఈ దగ్గు మందులు ఇతర దేశాలకు ఎగుమతి కాలేదని ఇండియన్ సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ WHOకు తెలిపింది.

తిరుపతి

మోదీ నా మంచి మిత్రుడు.. అద్భుతంగా పనిచేస్తున్నారు: ఈజిప్టు వేదికగా భార‌త ప్ర‌ధానిని పొగిడిన ట్రంప్

మోదీ నా మంచి మిత్రుడు.. అద్భుతంగా పనిచేస్తున్నారు: ఈజిప్టు వేదికగా భార‌త ప్ర‌ధానిని పొగిడిన ట్రంప్ ప్రధాని మోదీపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రశంసలు గాజా శాంతి ఒప్పందం తర్వాత ఈజిప్టులో కీలక వ్యాఖ్యలు ఇటీవలే ఫోన్‌లో మాట్లాడుకున్న ఇద్దరు నేతలు భారత్‌లో అమెరికా కొత్త రాయబారి సెర్గియో గోర్ పర్యటన మోదీకి ట్రంప్ సంతకంతో కూడిన ఫొటో బహుమతి భారత ప్రధాని నరేంద్ర మోదీ తనకెంతో మంచి స్నేహితుడని, ఆయన అద్భుతంగా పనిచేస్తున్నారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసించారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధాన్ని ముగింపు పలుకుతూ కుదిరిన చారిత్రక గాజా శాంతి ఒప్పందంపై సంతకాలు చేసిన అనంతరం, ఈజిప్టులోని షర్మ్ ఎల్-షేక్‌లో సోమవారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. “భారత్ ఒక గొప్ప దేశం, దానికి నా మంచి స్నేహితుడు నాయకత్వం వహిస్తున్నారు. ఆయన చాలా గొప్పగా పనిచేస్తున్నారు” అని ట్రంప్ అన్నారు. ఇటీవల ప్రధాని మోదీ, ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడిన కొద్ది రోజులకే ఈ ప్రశంసలు రావడం గమనార్హం. చారిత్రాత్మక గాజా శాంతి ఒప్పందం విజయవంతమైనందుకు గాను ట్రంప్‌కు మోదీ అభినందనలు తెలిపారు. ఈ విషయాన్ని గత వారం ప్రధాని మోదీ ఎక్స్ (ట్విట్టర్) ద్వారా వెల్లడించారు. తమ మధ్య జరిగిన ఫోన్ సంభాషణలో వాణిజ్య చర్చల్లో సాధించిన పురోగతి గురించి కూడా సమీక్షించినట్టు పేర్కొన్నారు. నెల రోజుల వ్యవధిలో ఇరు నేతలు ఫోన్‌లో మాట్లాడుకోవడం ఇది రెండోసారి. ఇదే సమయంలో భారత్‌కు అమెరికా కొత్త రాయబారిగా నియమితులైన సెర్గియో గోర్ ప్రస్తుతం దేశంలో పర్యటిస్తున్నారు. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా ఆయన ఇప్పటికే ప్రధాని మోదీ, విదేశాంగ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో సమావేశమయ్యారు. శనివారం ప్రధాని మోదీతో భేటీ అయిన సందర్భంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో వైట్‌హౌస్‌లో వారిద్దరూ సమావేశమైనప్పటి ఫొటో ఫ్రేమ్‌ను గోర్ బహుమతిగా అందించారు. ఆ ఫొటోపై “మిస్టర్ ప్రైమ్ మినిస్టర్, మీరు చాలా గొప్పవారు!” అని ట్రంప్ స్వయంగా సంతకం చేసి రాశారు. ట్రంప్, మోదీల బలమైన నాయకత్వంలో ఇరు దేశాల మధ్య రక్షణ, వాణిజ్యం, సాంకేతికత వంటి కీలక రంగాల్లో సంబంధాలు అద్భుతంగా ఉన్నాయని గోర్ ఒక ప్రకటనలో తెలిపారు. ట్రంప్ మోదీని గొప్ప వ్యక్తిగత మిత్రుడిగా భావిస్తారని ఆయన పేర్కొన్నారు. భారత్‌తో తమ సంబంధం రానున్న నెలల్లో మరింత బలపడుతుందని గోర్ ‘ఎక్స్’లో పోస్ట్ చేయగా, ఆయన నియామకం ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని తాను విశ్వసిస్తున్నట్టు మోదీ బదులిచ్చారు.

విశాఖపట్నం

కల్తీ మద్యం పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరుబాట గాజువాక సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ

గాజువాక, అక్టోబర్ (పున్నమి ప్రతినిధి) పార్టీ అధ్యక్షులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, గాజువాక నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తిప్పల శ్రీనివాస్ దేవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కల్తీ మద్యం వ్యతిరేకంగా విస్తృతమైన ర్యాలీ నిర్వహించారు. నేడు శ్రీనగర్ సుందరయ్య కాలనీ మున్నా ట్యాంక్ దగ్గర గల ఆంజనేయ స్వామి ఆలయం వద్ద నుండి ప్రారంభమైన ర్యాలీ, కొత్త దిబ్బపాలం ఎక్సైజ్ కార్యాలయం వరకు కొనసాగి, అక్కడ ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వారికి వినతిపత్రం అందజేయబడింది. ఈ కార్యక్రమంలో విశాఖ పార్లమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిశీలకులు కదిరి బాబురావు, గాజువాక నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిశీలకులు తైనాల విజయ్‌కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వైసీపీ నాయకులుమాట్లాడుతూ “తెలుగుదేశం ప్రభుత్వం నకిలీ మద్యం తయారిని ఒక కుటీర పరిశ్రమలా రాష్ట్ర వ్యాప్తంగా ప్రోత్సహిస్తూ ప్రజల ప్రాణాలను హరిస్తున్న పరిస్థితుల్లో, ఆ అన్యాయానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా పోరాట బాట పట్టాం” అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో 71వ వార్డు అధ్యక్షుడు భూపతి రాజు శ్రీనివాస్, కార్పొరేటర్లు మహమ్మద్ ఇమ్రాన్, భూపతి రాజు సుజాత, గుడివాడ లతీష్, ఊరుకోటి చందు, ధర్మాల శ్రీనివాసరావు, పళ్ళ చిన్న తల్లి, బోగాది సన్నీ, షౌకత్ అలీ, గొండేసి శ్రీనివాస్ రెడ్డి, మంత్రి శంకర్ నారాయణ, పూర్ణ శర్మ, బొడ్డ గోవింద్, సీనియర్ నాయకులు ఉరుకుటి అప్పారావు, రాజాన వెంకటరావు, మహమ్మద్ గౌస్, జి.వి. రమణ, చిత్రాడ వెంకటరమణ, కొయ్య భారతి, ఎన్నిటి రమణ, ప్రగడ శ్రీను, ప్రగడ సన్యాసిరావు, దుగ్గపు దానప్పులు, దామోదర్, తిప్పల గోపి, కటికల కల్పన, రామలక్ష్మి, కనకమహాలక్ష్మి, హరీష్ వర్మ, వెంకటేష్, సలీం తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

4.5 లక్షల విలువైన 5900 నిషేధిత కోల్డ్/కఫ్ సిరప్స్ స్వాధీనం , బజాజ్ ఫార్ములేషన్స్, పై కేసు నమోదు

విశాఖపట్నం, అక్టోబర్ (పున్నమి ప్రతినిధి) ఔషధ నియంత్రణ పరిపాలన డైరెక్టర్ జనరల్ గిరీష ఐఏఎస్ గారి ఆదేశాల మేరకు, డ్రగ్స్ కంట్రోల్ విభాగం, విశాఖపట్నం అసిస్టెంట్ డైరెక్టర్ ఎస్. విజయ్‌కుమార్ పర్యవేక్షణలో భారీ సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో నాలుగు సంవత్సరాల లోపు పిల్లలకు వాడకాన్ని భారత ప్రభుత్వం నిషేధించిన సుమారు రూ.4.5 లక్షల విలువైన 5900 “Rivicold” కోల్డ్/కఫ్ సిరప్స్ ను విశాఖపట్నం మర్రిపాలెం ప్రాంతంలోని కిర్బి లైఫ్ సైన్సెస్ మెడికల్ ఏజెన్సీ వద్ద డ్రగ్స్ ఇన్స్పెక్టర్ ఎం. శ్రీనివాస్‌రావు స్వాధీనం చేసుకున్నారు. ఈ సిరప్స్‌లో క్లోర్ఫెనిరమైన్ మాలియేట్ + ఫెనైలెఫ్రిన్ హైడ్రోక్లోరైడ్ మిశ్రమం ఉండగా, ఇవి ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని బజాజ్ ఫార్ములేషన్స్, భగవాన్పూర్, రూర్కీ, హరిద్వార్ వద్ద తయారైనవి. సిరప్ లేబుల్‌పై తప్పనిసరిగా ఉండవలసిన “నాలుగు సంవత్సరాల లోపు పిల్లలకు వాడరాదు” అనే హెచ్చరిక ముద్రించకపోవడంతో చట్ట ఉల్లంఘనగా గుర్తించారు. దీని వలన చిన్నారుల ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పు ఏర్పడే అవకాశముందని, డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం సెక్షన్ 26A ప్రకారం తయారీదారుడిపై కేసు నమోదు చేయబడింది. స్వాధీనం చేసుకున్న సిరప్స్‌ను తదుపరి చర్యల కోసం గౌరవ న్యాయస్థానానికి అప్పగించనున్నట్లు డ్రగ్స్ ఇన్స్పెక్టర్ తెలిపారు. ఇటీవల మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కలుషిత కఫ్ సిరప్స్ వలన చిన్నారుల మరణాలు సంభవించిన నేపథ్యంలో, డ్రగ్స్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్‌రావు “వైద్యుని ప్రిస్క్రిప్షన్ లేకుండా కోల్డ్/కఫ్ సిరప్స్ ఇవ్వరాదు” అని హెచ్చరించారు. నిషేధిత మిశ్రమాలు విక్రయించినట్లయితే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోబడతాయని తెలిపారు. ఈ సోదాలో డ్రగ్స్ ఇన్స్పెక్టర్ సిబ్బంది, పోలీసులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

*మద్యంలో మిథనాల్ పాయిజన్ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు…* పవన్ కళ్యాణ్ కి కనపడదా!

విశాఖ అక్టోబర్ ( పున్నమి ప్రతినిధి) కల్తీ మద్యం కుంభకోణంపై సీబీఐ విచారణ జరగాలని డిమాండ్ బెల్ట్ షాపులు తక్షణమే అరికట్టాలని వైయస్ఆర్సీపీ నేత వాసుపల్లి గణేష్ కుమార్ హెచ్చరిక విశాఖ దక్షిణ నియోజకవర్గ వైయస్ఆర్సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ “గత ప్రభుత్వ హయాంలో లిక్కర్ స్కాం అంటూ హడావిడి చేసిన కూటమి నేతలు ఇప్పుడు బయటపడిన కల్తీ మద్యం కుంభకోణం పై ఎందుకు నోరు మెదపడం లేదు?” అని ప్రశ్నించారు. జగదాంబ జంక్షన్ వద్ద దక్షిణ వైయస్ఆర్సీపీ ఆధ్వర్యంలో కల్తీ మద్యం, బెల్ట్ షాపుల వ్యతిరేకంగా వినూత్న నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వాసుపల్లి మాట్లాడుతూ — > “కూటమి ఎమ్మెల్యేలు ఒక్క బెల్ట్ షాప్ ఏర్పాటు కోసం రూ.9 లక్షలు వసూలు చేస్తున్నారని వినిపిస్తోంది. మద్యంలో 7% మిథనాల్ కలుస్తోంది. దాంతో తాగిన వారిలో చూపు పోవడం, ఊపిరితిత్తులు దెబ్బతినడం వంటి ప్రమాదాలు జరుగుతున్నాయి” అని ఆవేదన వ్యక్తం చేశారు. వాసుపల్లి మాట్లాడుతూ — “కూటమి ప్రభుత్వానికి దమ్ముంటే ఈ కల్తీ మద్యం కుంభకోణం పై సీబీఐ విచారణకు ఆదేశించాలి. పవన్ కళ్యాణ్ ఏ విషయంలోనైనా వంద రోజులు కావాలని అంటారు — కానీ ప్రజల ప్రాణాలు వెళ్తున్నాయన్నది కనపడట్లేదు” అని విమర్శించారు. > “మద్యంలో ఉన్న మిథనాల్ అనేది విషపదార్థం. ఇది ప్రభుత్వ అనుమతి లేకుండా ఎక్కడా ఉత్పత్తి కావడంలేదు. కల్తీ మద్యం తయారీలో చచ్చిపోయిన తేళ్లు కూడా కలుపుతున్నారు. దాంతో తాగిన వాళ్లు నేరుగా పాయిజన్ తాగినట్లే” అని తెలిపారు. గత వైయస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలో 40 వేల బెల్ట్ షాపులు మూసివేసి, ప్రభుత్వ మద్యం నియంత్రణలో ఉంచిందని గుర్తు చేశారు. కానీ, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత బెల్ట్ షాపులు పుట్టగొడుగుల్లా పెరిగిపోయాయని మండిపడ్డారు. > “మద్యం మత్తులో హత్యలు, అత్యాచారాలు పెరిగిపోయాయి. కల్తీ మద్యం వల్ల చనిపోయిన వారి కుటుంబాలకు దిక్కెవరు?” అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ సెల్ చైర్మన్ జాన్ వెస్లీ, కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు, వైయస్ఆర్సీపీ సీనియర్ నేతలు పాల్గొన్నారు.

విశాఖపట్నం

నేడు ఏపీ ప్రభుత్వంతో గూగుల్ సంస్థ కీలక ఒప్పందo

విశాఖ అక్టోబర్ (పున్నమి ప్రతినిధి) నేడు ఏపీ ప్రభుత్వంతో గూగుల్ సంస్థ కీలక ఒప్పందం.. ఉదయం ఢిల్లీలోని తాజ్ మాన్‌సింగ్ హోటల్‌లో ఈ ఒప్పందం.. కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్.. విశాఖను కృత్రిమ మేధా నగరంగా రూపొందించడంలో తొలి అడుగు.. ఏపీని కృత్రిమ మేధస్సు, ఇన్నోవేషన్ హబ్‌గా మార్చేందుకు చర్యలు.. కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, అశ్వినీ వైష్ణవ్ సమక్షంలో గూగుల్ సంస్థ, ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం..

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

డ్రెడ్జింగ్ పనులను పరిశీలించిన గోదావరి సెంట్రల్ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ గుబ్బల శ్రీనివాస్

అమలాపురం, అక్టోబర్ 14 (తూర్పు ఉదయం విలేఖరి): ఉప్పలగుప్తం డి.సి, అల్లవరం డి.సి పరిధిలోని పాత సమనస మైనర్ డ్రైన్, కొత్త సమనస మైనర్ డ్రైన్, రంగరాజుకోడు మీడియం డ్రైన్, గొరగనముడి మైనర్ డ్రైన్, పాయకరావుకోడు, చిర్రయానంవద్ద కూనవరం మేజర్ డ్రైన్, అక్కడ జరుగుతున్న డ్రెజ్జింగ్ పనులను, డ్రైన్ లు తోపాటు ముంపుకు గురైన పంట భూములను పరిశీలించినట్లు గోదావరి సెంట్రల్ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ గుబ్బల శ్రీనివాస్ తెలిపారు. కూనవరం మేజర్ డ్రైన్, డ్రైజ్జయింగ్ ను సముద్రము వైపు కాకుండా చిర్రయానం పర్రవైపుకు మళ్లించిన ఎడల శాశ్వత పరిష్కారం లభిస్తుందని రైతులు వారి యొక్క అభిప్రాయాన్ని తెలియజేసారని, ప్రస్తుతం ముంపునీరు చిర్ర యానం పర్రమీదకే దిగటం పరిశీలించి, చైర్మన్ శ్రీనివాస్ మాట్లాడుతూ మన జిల్లా కలెక్టర్, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, అమలాపురం నియోజకవర్గం శాసనసభ్యులు అయితాబత్తుల ఆనందరావు, మమ్మిడి వరం శాసనసభ్యులు దాట్ల బుచ్చి బాబుతో మాట్లాడి ముంపు సమస్యకు పరిష్కారం చూపిస్తానన్నారు. గోదావరి డెల్టా ప్రాజెక్ట్ చైర్మన్ శ్రీనివాస్ తో పాటు డ్రైన్ ఇ ఇ కిషోర్, ఎ ఇబి సునీత, రాష్ట్ర అగ్రికల్చర్ డెవలప్మెంట్ అథారిటీ డైరెక్టర్ అయితా బత్తుల ఉమామహేశ్వరరావు, ఉప్పలగుప్తం డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ దంగేటి చిట్టిబాబు, అల్లవరం డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ గోపి రాజు, అల్లవరం డిసి వైస్ చైర్మన్ బండారి వెంకన్న బాబు, ఉప్పలగుప్తం డిస్ట్రిబ్యూటరీ వైస్ చైర్మన్ గుత్తుల శ్రీనివాసరావు, గొల్లవిల్లి నీటి సంఘం చైర్మన్ నల్లా సత్యనారాయణ, ఉప్పలగుప్తం నీటి సంఘం చైర్మన్ మోటూరి రవి, చినగడవిల్లి నీటి సంఘం చైర్మన్ బండారు ఏసుబాబు, గోపవరం నీటి సంఘం చైర్మన్ ఆకుల వెంకటరమణ, ఎస్. యానం నీటి సంఘం చైర్మన్ పోలిశెట్టి ఉమామహేశ్వర రావు, అరిగెల నానాజీ, సత్తి వెంకటరత్నం, రవణం మధు, పేయ్యల దుర్గారావు, చిక్కమ్ భీముడు, ఆకుల సూర్యనారాయణమూర్తి, చిక్కంసూర్య మోహన్, అడబాల సత్యనారాయణ, సత్య శ్రీను, చిక్కం పెద్దబ్బులు, మం చంబాలకృష్ణ, పెమ్మిరెడ్డి సత్యనారాయణ, పేయ్యల చిట్టిబాబు, మం చెంశ్రీనివాసరావు, సలాది శ్రీనివాసరావు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

వింజమూరు ఈవో కు ఘనంగా సన్మానం

నెల్లూరు జిల్లా స్థాయిలో ఉత్తమ పంచాయతీగా వింజమూరు నిలిచింది. కలెక్టర్ హిమాన్షు శుక్లా చేతుల మీదుగా పంచాయతీ ఈవో కె.రామారావు అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా టీచర్లు తదితరులు ఈవోను సోమవారం సన్మానించి అభినందనలు తెలిపారు. వింజమూరులో రోజూ పారిశుద్ధ్య పనులు చాలా బాగా చేస్తున్నారని కొనియాడారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.