Wednesday, 29 April 2026

Blog

విశాఖపట్నం

*విశాఖలో 1 గిగావాట్ సామర్థ్యంతో ఏఐ హబ్‌ — ఆంధ్రప్రదేశ్‌-గూగుల్ ఎంఓయూ సంతకం*

విశాఖ, అక్టోబర్ (పున్నమి ప్రతినిధి) భారత ప్రభుత్వం సహకారం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ మద్దతుతో విశాఖపట్నంలో 1 గిగావాట్ సామర్థ్యం గల నూతన ఏఐ హబ్‌ (Artificial Intelligence Hub) ఏర్పాటు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు గూగుల్ సంస్థల మధ్య అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదిరింది. ఈ ఎంఓయూ సంతకం కార్యక్రమం న్యూఢిల్లీలోని తాజ్ మాన్ సింగ్ హోటల్‌లో మంగళవారం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్వనీ వైష్టవ్, గూగుల్ క్లౌడ్ గ్లోబల్ సీఈవో థామస్ కురియన్, బికాష్ కొలే (వైస్ ప్రెసిడెంట్, గ్లోబల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్), కరణ్ బజ్వా (ప్రెసిడెంట్, ఏషియా పసిఫిక్ గూగుల్ క్లౌడ్) తదితరులు పాల్గొన్నారు. విశాఖలో ప్రతిష్టాత్మకంగా ఏర్పడనున్న ఈ ఏఐ హబ్‌ ద్వారా టెక్నాలజీ, డేటా సెంటర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిశోధనలలో కొత్త అవకాశాలు, ఉపాధి వృద్ధి కలుగనున్నట్లు అధికారులు తెలిపారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

కిడ్నీ బాధితునికి వైసిపి నేత కుంచే రమణారావు ఆర్థిక సాయం

అమలాపురం, అక్టోబరు 14 (పున్నమి ప్రతినిధి) : ఉప్పలగుప్తం మండలం సరిపల్లి కి చెందిన గెడ్డం రాంబాబు కిడ్నీ సమస్యతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ సీనియర్ వైసిపి నేత,గుడ్ సీడ్ ఫౌండేషన్ ఫౌండర్ కుంచే రమణారావు కిడ్నీ బాధితుడు రామ్మోహన్ రావు వైద్యానికి ఆర్థిక సాయం అందించారు.మంగళవారం అమలాపురం లోని గుడ్ సీడ్ ఫౌండేషన్ కార్యాలయం లో గుడ్ సీడ్ ఫౌండేషన్ ఫౌండర్ రమణారావు రూ.20 వేలు చెక్ ను రామ్మోహన్ రావు అతని తల్లి వెంకటలక్ష్మి కి అందజేశారు. ఆర్థిక సాయం అందజేసిన గుడ్ సీడ్ ఫౌండేషన్ ఫౌండర్ రమణారావుకు రాంబాబు అతని కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమంలో గ్రామ పెద్దలు గెడ్డం సుబ్బారావు,పరమట పండు,కాట్రు మధు, వైసిపి నాయకులు పందిరి సుబ్బరాజు, నేరేడుమిల్లి శ్రీను,నేలపూడి సుగంధ కుమార్,గంటా లక్ష్మీ ప్రసాద్,గుడ్ సీడ్ ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.

జనగాం

చీటకోడూర్ మరియు శామీర్ పేట ఐకెపి సెంటర్లను ప్రారంభించిన జనగామ ఏఎంసి చేర్మన్ బంక శివరాజ్ యాదవ్

ప్రజా ప్రభుత్వం లోనే రైతులకు మేలు జరుగుతుంది ——————————————– జనగామ,అక్టోబర్14,పున్నమి న్యూస్: రైతులను రాజు చేయడమే ప్రజా ప్రభుత్వం లక్ష్యం ఈరోజు జనగామ జిల్లా కేంద్రంలో జనగామ వ్యవసాయ మార్కెట్ యార్డు లో ప్రజా ప్రభుత్వం ఆధ్వర్యంలో 2 వడ్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. జనగామ వ్యవసాయ మార్కెట్ యార్డు లో చీటకోడూర్ మరియు శామీర్ పేట ఐకెపి సెంటర్లు జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు . శివరాజ్ యాదవ్ మాట్లాడుతూ జనగామ వ్యవసాయ మార్కెట్ యార్డు లో రైతులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని ,అదేవిధంగా రైతులు తమ వడ్లను ఆరబెట్టుకొని సెంటర్ కి వచ్చే ముందు తగు నాణ్యతలు పాటించాలని మరియు A గ్రేడ్ వడ్లకు ప్రభుత్వం కల్పిస్తున్న మద్దతు ధర 2389₹, సాధారణ రకం వడ్లకు 2369₹ రూపాయలకే వడ్లు విక్రయించాలని కోరుతున్నాము అని అన్నారు. అదే విధంగా రైతులు దళారులను నమ్మి తక్కువ ధరకు విక్రయించ వద్దని ప్రభుత్వ కొనుగోలు కేంద్రం లోనే వడ్లను విక్రయించాలని కోరుతున్నాము అని అన్నారు.ఈ కార్యక్రమంలో ఏఎంసీ ప్రత్యేక శ్రేణి కార్యదర్శి జీవన్ కుమార్,ADE అపర్ణ,APM శంకరయ్య, ఏఎంసీ డైరెక్టర్లు నామాల శ్రీనివాస్,బొట్ల నర్సింగరావు, తోటకూరి రమేష్ యాదవ్, బండ కుమార్, నాగబండి రవీందర్, పర్ష సిద్దేశ్,జనగామ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లింగాల నర్సిరెడ్డి,రైతు సంఘం నాయకులు చందు నాయక్, బీరయ్య, నాయకులు సాదం జంపన్న,రత్నం, జగదీష్,రైతులు శ్రీనివాస్,రమేష్ ,రాజు, కొమురయ్య , ఏఎంసీ సూపర్వైజర్ శ్రీనివాస్, ఏవో అనిల్,సిసి వెంకటేష్,రైతులు,మహిళలు తదితరులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

తగినంత యూరియా అందుబాటులో కలదు ఏవో హిమబిందు.

అక్టోబర్ చేజర్ల (పున్నమి ప్రతినిధి) చేజర్ల మండలంలోని రైతు సేవా కేంద్రం నందు రబీ పంటలకు, యూరియా పంపిణీ పై రైతులకు, అధికారులకు, రైతు సేవా కేంద్రం సిబ్బందికి మరియు డీలర్లకు, అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సహాయ వ్యవసాయ సంచాలకులు కే. శివ నాయక్ (ఎడిఎ) మాట్లాడుతూ వరి పంటకు రైతులు ప్రభుత్వం సిఫారసు చేసిన మోతాదులోనే యూరియా వాడుకోవాలని అధికంగా వాడటం వలన, కలిగే నష్టాల గురించి వివరించారు. ఎకరాకి మూడు బస్తాలు మాత్రమే వాడాలని తెలిపారు. వ్యవసాయ అధికారి హిమబిందు మాట్లాడుతూ, రైతులకు తగినంత యూరియా అందుబాటులో ఉంటుందని మరియు రైతు సేవా కేంద్రము మరియు ప్రైవేటు డీలర్ల వద్ద చేజర్ల మండలానికి అవసరమైన యూరియా అందుబాటులో ఉంటుందని తెలిపారు. రైతులు ఎవరు కూడా అపోహాలు నమ్మి కంగారు పడకుండా వ్యవసాయ సిబ్బంది నుండి యూరియా కార్డ్స్ తీసుకొని వరి పంట సాగు చేసే విస్తీర్ణానికి ఎకరాకి మూడు బస్తాలు విడతల వారీగా పంపిణీ ఉంటుందని తెలియపరిచారు. ఈ కార్యక్రమం లో వ్యవసాయ సిబ్బంది ఎఈఓ, విఎఎలు, ఎరువుల డీలర్స్ పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

జాతీయ స్థాయికి యస్ వి కె స్పోర్ట్స్ అకాడమీకీ చెందిన ఇద్దరు విద్యార్థులు ఎంపిక.

రైల్వేకోడూరు అక్టోబర్ పున్నమి ప్రతినిధి రైల్వే కోడూరు కు చెందిన ఎస్ వి కే స్పోర్ట్స్ అకాడమీకి చెందిన విద్యార్థులు ఈ నెల 10,11,12 వ తేది బాపట్ల జిల్లా పెట్టురు మండలం లో 69 SGF స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్ 14 రాష్ట్రా స్థాయి పోటీలు నిర్వహించారు. ఇందులో అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు పట్టణంలో ఉన్న ఎస్ వి కే స్పోర్ట్స్ అకాడమీ కి చెందిన కే. నవ్య శ్రీ U_16 kg , సంధ్య నా U_16-18 kg విభాగంలో బంగారు పధకము సాధించింధని అలాగే పి. శ్రీరామ కస్య పధకము సాధించాడు బంగారు పధకము సాధించిన ఇద్దరు నవంబర్ నెలలో పంజాబ్ లో జరగబోయే జాతీయ స్థాయి పోటీలకు ఎంపికెనట్లు కోచ్ శివాజీ తెలీపారు.

నిర్మల్

ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేటుకు ధీటుగా విద్యా బోధన. – జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.

నిర్మల్ జిల్లా అక్టోబర్ 14 ( పున్నమి ప్రతినిధి) నిర్మల్ జిల్లాలో ప్రభుత్వ విద్యాసంస్థల్లో ప్రైవేటు బడులకు ధీటుగా నాణ్యమైన విద్యాబోధన అందుతోందని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. మంగళవారం నర్సాపూర్ (జి) మండల కేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి పాఠశాల పరిస్థితులను పరిశీలించారు. తరగతి గదులను పరిశీలిస్తూ విద్యార్థులతో ముఖాముఖీ మాట్లాడారు. విద్యార్థులు యూనిఫార్ములు, నోటుబుక్లు, పాఠ్యపుస్తకాలు అందుకున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా ఉపాధ్యాయుల దృష్టికి తేవాలని కలెక్టర్ సూచించారు. ఇప్పటివరకు పూర్తయిన సిలబస్‌పై సమీక్ష చేశారు. సామాన్య శాస్త్ర పాఠానికి సంబంధించిన పటాలను బోర్డుపై గీయించి, విద్యార్థుల అవగాహన స్థాయిని అంచనా వేశారు. బోర్డు పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో విద్యార్థులు సమయాన్ని సద్వినియోగం చేసుకుని ప్రణాళికాబద్ధంగా చదువుకోవాలని సూచించారు. పరీక్షలపై భయపడకుండా స్పష్టమైన లక్ష్యంతో ముందుకు సాగాలని ప్రోత్సహించారు. పదవ తరగతి ప్రతి విద్యార్థి జీవితంలో కీలక మలుపని, క్రమశిక్షణతో కష్టపడి చదివితే ఉన్నత స్థానాలను సాధించవచ్చు అని కలెక్టర్ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపారు. విద్యార్థుల హాజరు శాతం, సిలబస్ పురోగతి, బోధన నాణ్యతపై వివరాలు కలెక్టర్ ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి రోజు ఉపాధ్యాయులు, విద్యార్థులు పూర్తి హాజరు నమోదు కావాలని ఆదేశించారు. చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి ప్రత్యేక ప్రణాళికలతో వారిని మెరుగుపరచాలని సూచించారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, విద్యార్థులు సౌకర్యవంతమైన వాతావరణంలో నేర్చుకునేలా చూడాలని అన్నారు. సిలబస్‌ను నిర్ణీత సమయంలో పూర్తి చేయడంతో పాటు, పునరావృత పరీక్షల ద్వారా విద్యార్థుల సామర్థ్యాన్ని అంచనా వేయాలని సూచించారు. అనంతరం పాఠశాలలో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనాన్ని కలెక్టర్ పరిశీలించారు. మెనూ ప్రకారం నాణ్యమైన, రుచికరమైన ఆహారం అందించాలని సూచించారు. ఈ సందర్భంగా కేజీబీవీ విద్యార్థిని ప్లక్ష్య స్వయంగా వేసిన కలెక్టర్ చిత్రపటాన్ని అందించగా, ఆమె ప్రతిభను కలెక్టర్ అభినందించారు. ఈ తనిఖీలో జిల్లా విద్యాశాఖ అధికారి డి. భోజన్న, మండల ప్రత్యేక అధికారి అంజి ప్రసాద్, తహసీల్దార్ శ్రీకాంత్, ఎంపీడీఓ పుష్పలత, ఇతర అధికారులు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఎన్ టి ఆర్ జిల్లా

నరేంద్ర మోడీ, నారా చంద్రబాబు నాయుడు పాలనలో సంతోషంలో ప్రజలు* *జీఎస్టీ అమలులో సంస్కరణల వల్ల ప్రజలకు ఎంతో మేలు* *19వ డివిజన్‌లో పర్యటించి జీఎస్టీ సంస్కరణలపై అవగాహన కల్పించిన ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌*

* ప్రధాన మంతి నరేంద్రమోడి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పాలనలో ప్రజలంతా ఎంతో సంతోషంగా ఉన్నారని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ అన్నారు. మంగళవారం ఉదయం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 19వ డివిజన్‌ ఫకీరుగూడెంలోని కమ్యూనిటీ హాలు పరిసర ప్రాంతాల్లో తూర్పు నియోకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ పర్యటించారు. స్థానికంగా ఉన్న సమస్యలను ఆయన స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అక్కడి సమస్యలను పరిష్కరించాల్సిందిగా ఆయా విభాగాల అధికారులను ఆయన ఆదేశించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ అమలులో చేసిన సంస్కరణల ద్వారా ప్రజలకు జరిగే ప్రయోజనాల గురించి ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ స్థానికులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జీఎస్టీలో సంస్కరణలు తీసుకురావడం వల్ల దేశంలోని ప్రజలందరికీ ఎంతో మేలు జరుగుతోందన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు తగ్గి ప్రజల సంపాదించిన సొమ్ము ఆదా అవుతోందని చెప్పారు. తద్వారా ప్రజల్లో అటు కొనుగోలు శక్తి, ఇటు పొదుపు పెరుగుతుందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పాలనలో ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని చెప్పారు. జీఎస్టీలో సంస్కరణలు అమలు చేయడం వల్ల కలుగుతున్న లబ్ధిని కూటమి పార్టీ నాయకులు ప్రతి ఇంటికి వెళ్ళి చక్కగా వివరిస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలన అంటేనే ప్రజా సంక్షేమం, అభివృద్థి, వినూత్నమైన కార్యక్రమాలను నిర్వహిస్తూ వాటిల్లో ప్రజలను భాగస్వామ్యం చేయడం అని చెప్పారు. గతంలో జన్మభూమి, శ్రమదానం, పరిసరాల పరిశుభ్రత పేరుతో నిర్వహించిన కార్యక్రమాల్లో ప్రజలు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమాల్లో భాగస్వాములు అయ్యారని, ఆ కార్యక్రమాల ద్వారా ప్రజలకు ఎంతో మేలు జరిగిందన్నారు. ఇప్పుడు పేదలకు అన్ని విధాలుగా అండగా ఉండేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పీ–4 పథకాన్ని ప్రారంభించారని చెప్పారు. ఆర్థికంగా బలంగా ఉన్నవారు పేద కుటుంబాలకు అండగా ఉండటమే పీ–4 పథకం అని చెప్పారు. మన రాష్ట్రంలోని వారితో పాటుగా విదేశాల్లో స్థిరపడిన వారు సైతం ఈ పీ–4 లో స్వచ్ఛందంగా వచ్చి భాగస్వాములు అవుతున్నారని చెప్పారు. ఇప్పుడు ఈ డివిజన్‌లో కాలువ గట్ల వెంట ఉన్న ఖాళీస్థలాల్లో పిచ్చిమొక్కలు పెరిగి క్రీమికీటకాలు, పాములు, కొండ చిలువలు ఇంటి పరిసరాల్లో వస్తున్నాయని స్థానికులు చెబుతున్నారని, ఈ సమస్యను పరిష్కరించడానికి డివిజన్‌లో పనిచేస్తున్న సుమారు వంద మంది పారిశుద్ధ్య కార్మికులతో ఈ ఖాళీస్థలాలను శుభ్రం చేయించే కార్యక్రమాన్ని నిర్వస్తామని తెలిపారు. ఈ డివిజన్‌లో పనులు పూర్తి అయిన తర్వాత మరో డివిజన్‌లో ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అంటేనే ప్రజలకు ఉపయోగపడే వినూత్నమైన కార్యక్రమాలు చేపట్టి వారిని భాగస్వాములను చేయడం అని ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ పేర్కొన్నారు. పార్టీ డివిజన్‌ అధ్యక్షుడు భాగం సాయి ప్రసాద్‌ మాట్లాడుతూ ఫకీరూగూడెం ఏరియాలో ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ స్వయంగా పర్యటించి అక్కడి సమస్యలను పరిశీలించారన్నారు. అండర్‌ పాస్‌ దగ్గర ఉన్న సమస్యతో పాటుగా కాలువగట్లపై ఉన్న చెట్లను తొలగించాల్సిందిగా స్థానికులు కోరారని, ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ తక్షణమే స్పందించి కార్పోరేషన్‌ ప్రజారోగ్య విభాగం అధికారులతో మాట్లాడారని చెప్పారు. రెండు రోజుల వ్యవధిలో కాలువ గట్లపై చెట్లు తొలగించే పనులు మొదలు పెడతామని అధికారులు చెప్పారన్నారు. ఒక కార్మికుడి మాదిరిగా ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ నియోజకవర్గ అభివృద్థికి పనిచేస్తున్నారని చెప్పారు. ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ను ఆదర్శంగా తీసుకుని డివిజన్‌లోని సమస్యలను పరిష్కరించడానికి తన వంతుగా కృషి చేస్తానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌.ఫిరోజ్, మహమ్మద్‌ ఖలీల్, దున్నా ఏసురత్నం, పిడతల కోటి, కంచర్ల శ్రీను, పరిశపోగు విజయ్, ఎస్‌.కె.కలాం, దూపాటి శాంతకుమారి, కోలుకొండ నాని, ఎండీ.హుస్సేన్‌, నామాల జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

*పెదగంట్యాడలో అంగరంగ వైభవంగా శ్రీ విజయ దుర్గా దేవి ఆలయం 12వ వార్షికోత్సవ వేడుకలు*

పెదగంట్యాడ, అక్టోబర్ (పున్నమి ప్రతినిధి) జీవీఎంసీ 75వ వార్డులోని కండిపిల్లి వారి వీధిలో కొలువుతీరిన శ్రీ శ్రీ శ్రీ విజయ దుర్గా దేవి ఆలయం 12వ వార్షికోత్సవ వేడుకలు మంగళవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అమ్మవారికి పంచామృత, సుగంధ ద్రవ్యాలతో జలాభిషేకాలు నిర్వహించి, సుందర వందనంగా అలంకరించి భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డి, అరుణ థియేటర్ ప్రొప్రైటర్ తిప్పల నితీష్ రెడ్డి పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డి మాట్లాడుతూ — > “కండిపిల్లి వారి వీధి అభివృద్ధి చెందిందంటే అమ్మవారి కటాక్షమే కారణం. 12వ వార్షికోత్సవం సందర్భంగా కమిటీ సభ్యులు చేస్తున్న భక్తి పరమైన సేవ ప్రశంసనీయమైనది” అని పేర్కొన్నారు. ఆయన చేతులమీదుగా అన్న సమారాధన కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు రమేష్ శర్మ, ఈశ్వర్ శర్మ పూజా, అర్థమూ, చండీ హోమం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త దుర్యోధన లక్ష్మి, లావణ్య, వాసంశెట్టి వెంకటేశ్వరరావు, పాటోజీ త్రినాధరావు, సిహెచ్ తమ్మాయిరెడ్డి, కడవల రమణ, కండిపిల్లి వెంకటరమణ, సప్పరాంబాబు, కండిపిల్లి సత్యనారాయణ, కండిపిల్లి జోగారావు, బసరమాని శంకర్రావు, మాలకొండయ్య చౌదరి, కండిపిల్లి అప్పారావు, కరిట్ల శివ, కండిపిల్లి రమణ, నాగల అప్పారావు, కండిపిల్లి సురేష్, కండిపిల్లి గురుమూర్తి, కండిపిల్లి సత్యారావు, మణికంఠ తదితర గ్రామ మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

జాతీయ స్థాయికి యస్ వి కె స్పోర్ట్స్ అకాడమీకీ చెందిన ఇద్దరు విద్యార్థులు ఎంపిక రైల్వేకోడూరు మేజర్ న్యూస్ రైల్వేకోడూరు కు చెందిన ఎస్ వి కే స్పోర్ట్స్ అకాడమీకి చెందిన విద్యార్థులు ఈ నెల 10,11,12 వ తేది బాపట్ల జిల్లా పెట్టురు మండలం లో 69 SGF స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్ 14 రాష్ట్రా స్థాయి పోటీలు నిర్వహించారు. ఇందులో అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు పట్టణంలో ఉన్న ఎస్ వి  కే స్పోర్ట్స్ అకాడమీ కి చెందిన కే. నవ్య శ్రీ U_16 kg , సంధ్య నా U_16-18 kg విభాగంలో బంగారు పధకము సాధించింధని అలాగే పి. శ్రీరామ కస్య పధకము సాధించాడు బంగారు పధకము సాధించిన ఇద్దరు నవంబర్ నెలలో పంజాబ్ లో జరగబోయే జాతీయ స్థాయి పోటీలకు ఎంపికెనట్లు కోచ్ శివాజీ తెలీపారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.