Wednesday, 29 April 2026

Blog

E-పేపర్

జాతీయ స్థాయికి యస్ వి కె స్పోర్ట్స్ అకాడమీకీ చెందిన ఇద్దరు విద్యార్థులు ఎంపిక

జాతీయ స్థాయికి యస్ వి కె స్పోర్ట్స్ అకాడమీకీ చెందిన ఇద్దరు విద్యార్థులు ఎంపిక రైల్వేకోడూరు అక్టోబర్ పున్నమి ప్రతినిధి రైల్వేకోడూరు కు చెందిన ఎస్ వి కే స్పోర్ట్స్ అకాడమీకి చెందిన విద్యార్థులు ఈ నెల 10,11,12 వ తేది బాపట్ల జిల్లా పెట్టురు మండలం లో 69 SGF స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్ 14 రాష్ట్రా స్థాయి పోటీలు నిర్వహించారు. ఇందులో అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు పట్టణంలో ఉన్న ఎస్ వి కే స్పోర్ట్స్ అకాడమీ కి చెందిన కే. నవ్య శ్రీ U_16 kg , సంధ్య నా U_16-18 kg విభాగంలో బంగారు పధకము సాధించింధని అలాగే పి. శ్రీరామ కస్య పధకము సాధించాడు బంగారు పధకము సాధించిన ఇద్దరు నవంబర్ నెలలో పంజాబ్ లో జరగబోయే జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనట్లు కోచ్ శివాజీ తెలీపారు.

తెలంగాణ

నాయకులు హద్దు దాటి ప్రవర్తిస్తే చర్యలు తప్పవు :బీజేపీ తెలంగాణ చీఫ్ రామ చంద్ర రావు

పున్నమి ప్రతి నిధి తెలంగాణ బీజెపి అధ్యక్షులు నారప రాజు రామచంద్ర రావు ఈరోజు మంచిర్యాల జిల్లా లో పర్యటన చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ కొంతమంది నాయకులు మధ్య జరిగిన బూతుల యుద్ధం పట్ల రామ చంద్ర రావు స్పందిస్తూ పార్టీ నాయకులు అయినా కార్యకర్తలు ఐన హద్దు దాటి ప్రవర్తిస్తే చర్యలు తప్పవు అని ఈ సం ధర్భముగా అయన హెచ్చరించారు.

ఆంధ్రప్రదేశ్

జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఐఏఎస్ తొలి పర్యటన – రైల్వే కోడూరు అభివృద్ధి పనులపై సమీక్ష

రైల్వేకోడూరు అక్టోబర్ పున్నమి ప్రతినిధి అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఐఏఎస్ రైల్వే కోడూరు నియోజకవర్గాన్ని తొలిసారిగా పర్యటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అరవ శ్రీధర్, టిడిపి నేత ముక్కా సాయి వికాస్ రెడ్డి పాల్గొన్నారు. కలెక్టర్ కస్తూరిబా స్కూల్‌ను తనిఖీ చేసి విద్యార్థుల అవసరాలను తెలుసుకున్నారు. రైతులతో భేటీ అవుతూ వ్యవసాయ సమస్యలపై సమీక్షించారు. రైల్వే కోడూరు ప్రభుత్వ ఆసుపత్రిలో సదుపాయాలను పరిశీలించి మెరుగుదల చర్యలను సూచించారు. కోడూరు–చిట్వేల్ డబుల్ రోడ్డు పనుల పురోగతిని సమీక్షించి వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.

నాగర్‌కర్నూల్

ట్రాన్స్ఫార్మర్ కోసం రూ. 15 వేలు లంచం తీసుకుంటూ.. ఏసీబీకి చిక్కిన లైన్ మెన్ !

నాగర్ కర్నూల్ ప్రతినిధి అక్టోబర్ 14, పున్నమి న్యూస్: నాగర్ కర్నూల్ జిల్లాలోని ఓ అవినీతి అధికారి ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. జిల్లాలోని వంగూరు మండలం మాచినోనిపల్లి టీజీఎస్పీడిసిఎల్ కు చెందిన లైన్ మెన్ తోట నాగేంద్ర మంగళవారం రూ. 15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో చిక్కాడుకి చిక్కాడు. వ్యవసాయానికి సంబంధించిన ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు కోసం రైతులు లైన్ మెన్ ను సంప్రదించగా లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధిత రైతు మహబూబ్నగర్ పరిధిలోని ఏసీబీని ఆశ్రయించగా మంగళవారం అధికారులు పట్టుకున్నారు. అవినీతికి పాల్పడ్డ లైన్ మెన్ పై కేసు నమోదు చేసి నాంపల్లి ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టామని అధికారులు వివరించారు. ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు ఎవరైనా ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా అవినీతికి పాల్పడే వారి సమాచారాన్ని ఏసీబీ టోల్ ఫ్రీ 1064 నెంబర్ కు సమాచారం అందించాలని సూచించారు. వాట్సాప్ నెంబర్ 9440446106 కు తెలంగాణ ఏసీబీ, ఫేస్ బుక్ ట్విట్టర్ ద్వారా గాని ఫిర్యాదు చేయవచ్చని వెల్లడించారు. Video: https://punnami.in/%20ట్రాన్స్ఫారం%20కోసం

తిరుపతి

శ్రీసిటీని సందర్శించిన బెల్జియం కాన్సుల్ జనరల్ – పారిశ్రామిక వసతుల పట్ల ప్రశంస

ఈ ప్రాంతంలో బెల్జియన్ పారిశ్రామిక ప్రయోజనాల చర్చల నిమిత్తం ముంబైలోని బెల్జియం కాన్సుల్ జనరల్ ఫ్రాంక్ గీర్కెన్స్ మంగళవారం శ్రీసిటీని సందర్శించారు. శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి ఆయనకు సాదర స్వాగతం పలికి, శ్రీసిటీ ప్రగతి, ఇక్కడ పెట్టుబడి అవకాశాలు, ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, వ్యాపార అనుకూల వాతావరణం గురించి వివరించారు. పర్యటనలో భాగంగా ఆయన శ్రీసిటీ పరిసరాలను సందర్శించారు. శ్రీసిటీ వసతుల పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన కాన్సుల్ జనరల్, విదేశీ పెట్టుబడిదారులకు ఇది అత్యంత అనువైన ప్రదేశం అని వ్యాఖ్యానించారు. వెర్మీరిన్ సంస్థ అధునాతన వీల్‌చైర్లు తయారు చేయడం ద్వారా బెల్జియం పరిశ్రమలకు శ్రీసిటీలో పునాది వేసిందని ప్రశంసించారు. వెర్మీరిన్ సంస్థకు శ్రీసిటీ మద్దతును అభినందిస్తూ, మరిన్ని బెల్జియన్ కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రపంచ స్థాయి పునరావాస పరికరాల తయారీ సంస్థ వెర్మీరిన్ పరిశ్రమ శ్రీసిటీలో ఏర్పాటు కావడం ఆనందంగా ఉందన్నడాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి, గ్లోబల్ భాగస్వామ్యాలను ప్రోత్సహించాలనే శ్రీసిటీ నిబద్ధతను కాన్సుల్ జనరల్ సందర్శన ప్రతిబింబిస్తుందని తెలిపారు. అనంతరం వెర్మీరెన్ కంపెనీని ఫ్రాంక్ గీర్కెన్స్ సందర్శించి, అక్కడ ఉత్పత్తులు, ఇతర పారిశ్రామిక కార్యకలాపాలను పరిశీలించారు. ఆయనతో పాటు బెల్జియంలోని ఫ్లాండర్స్ రీజియన్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ కమీషనర్ జయంత్ నడిగర్, వెర్మీరెన్ మేనేజింగ్ డైరెక్టర్ (శ్రీసిటీ ప్లాంట్) సయ్యద్ రియాజ్ ఖాద్రీ పాల్గొన్నారు. అంతర్జాతీయ భాగస్వామ్యాలు, కొత్త పెట్టుబడులకు మార్గం సుగమం చేస్తూ భవిష్యత్తు దిశగా శ్రీసిటీ మరింత ముందడుగు వేస్తోందని చెప్పడానికి ఈ పర్యటన అద్దం పడుతోంది.

తిరుపతి

ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు,మంత్రివర్యులు నారా లోకేష్ గారితో ఎమ్మెల్యే బొజ్జల*

*ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు,మంత్రివర్యులు నారా లోకేష్ గారితో ఎమ్మెల్యే బొజ్జల* *హైటెక్ సిటీతో నాడు ప్రపంచ పటంలో హైదరాబాద్ పేరు మార్మోగించిన చంద్రబాబు నాయుడు గారు నేడు విశాఖలో గూగుల్ కంపెనీ రాకతో నవ్యాంధ్ర పేరు మార్మోగే విధంగా చరిత్ర సృష్టించనున్నారు.ఈ రోజు ఢిల్లీలోని తాజ్ మాన్ సింగ్ హోటల్ లో గూగుల్ ప్రతినిధులతొ చర్చలు జరిపిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, మంత్రివర్యులు నారా లోకేష్ గారు* *ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గూగుల్ సంస్థ తొ చేసుకున్న MOU కార్యక్రమం లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, మంత్రివర్యులు నారా లోకేష్ గారు, పార్లమెంట్ సభ్యులతొ కలిసి పాల్గొన్న శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి గారు*

భద్రాద్రి కొత్తగూడెం

మీటర్లకు కేపాసిటర్లు తప్పనిసరి

రైతులు విద్యుత్ మీటర్లకు కెపాసిటర్లను అమర్చుకోవాలి. —- విద్యుత్ శాఖ ఏ.డి. పున్నమి ప్రతినిధి అక్టోబర్ 14 దమ్మపేట వ్యవసాయ క్షేత్రాలలో విద్యుత్ ఉపయోగించే రైతు సోదరులు తమ విద్యుత్ మీటర్లకు కెపాసిటర్లను అమర్చుకోవాలని అశ్వారావుపేట విద్యుత్ శాఖ ఏ.డి. నందయ్య పేర్కొన్నారు. మండలంలోని పార్కలగండిలో మంగళవారం విద్యుత్ శాఖ ఆద్వర్యంలో నిర్వహించిన రైతు పొలంబాట కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని రైతులను ఉద్దేశించి మాట్లాడారు. వర్షాకాలం దృష్ట్యా రైతులు విద్యుత్ ప్రమాదాలకు గురి కాకుండా తగిన ముందస్తు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఆటో స్టాటర్ల వినియోగం తగ్గించాలని ,విద్యుత్ ను అవసరం మేరకే వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఏ.డి.ఈ వెంకటరత్నం ,ఏఇ సాయికిరణ్ , సబ్ ఏఇ వెంకటేశ్వరరావు ,మాజీ జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు ,సీనియర్ కాంగ్రెస్ నాయకులు కొయ్యల అచ్యుతరావు తదితరులు పాల్గొన్నారు.

నిర్మల్

బెస్ట్ అవైలబుల్ స్కూల్ విద్యార్థులకు ఆటంకం కలగొద్దు – రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క.

నిర్మల్ జిల్లా అక్టోబర్ 14 (పున్నమి ప్రతినిధి) బెస్ట్ అవైలబుల్ స్కూల్ విద్యార్థుల విద్యా బోధనలో ఎటువంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లుబట్టి విక్రమార్క ఆదేశించారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పరిస్థితులపై మంగళవారం హైదరాబాదులో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో ఉప ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో బెస్ట్ అవైలబుల్ స్కూల్స్‌లో ఉన్న సమస్యలను గుర్తించి తక్షణ పరిష్కారం చేయాలని ఆదేశించారు. విద్యార్థుల విద్యా బోధనలో ఏ విధమైన ఆటంకాలు లేకుండా చూడాలని, తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యాలతో సమన్వయం కలిగి విద్యార్థుల ప్రయోజనాలను కాపాడాలని సూచించారు. ప్రభుత్వం విద్యా రంగానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, బడుగు బలహీన వర్గాల పిల్లలకు ఉత్తమ మౌలిక వసతులతో విద్య అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ, జిల్లాలో బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకం కింద చదువుతున్న విద్యార్థులకు మెరుగైన విద్యా బోధన అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇందుకోసం ప్రత్యేక అధికారులను నియమించనున్నామన్నారు. సంబంధిత శాఖల అధికారులు ఈ పథకం అమలుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఫైజాన్ అహ్మద్, డీఈవో భోజన్న, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ శాఖల అధికారులు దయానంద్, అంబాజీ, మోహన్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

అభయాంజనేయ స్వామికి ఘనంగా పూజలు చేసిన భక్తులు రైల్వే కోడూరు అక్టోబర్ పున్నమి ప్రతినిధి రైల్వేకోడూరు మండలం స్థానిక రెడ్డివారి పల్లి బ్రిడ్జి దగ్గర ఉన్న అభయాంజనేయ స్వామికి మంగళవారం రోజున స్వామికి విశేషమైన పూజలు ఉదయం స్వామివారికి అర్చన అభిషే0 అనంతరం స్వామివారికి తమలపాకులతో భక్తులు మాలగా చేసి స్వామివారికి సమర్పిస్తారు అంతేకాకుండా స్వామివారికి వడమాల అదేవిధంగా పప్పుల పిండి మొదలగునవి స్వామివారికి సమర్పిస్తారు. కోరిన కోరికలు తీర్చే అభయాంజనేయ స్వామిని భక్తులు దర్శించుకోవడం జరిగినది. స్వామివారికి మంగళవారం రోజున ఆదివారం రోజున విశేష పూజలు చేస్తారు.

తెలంగాణ

దొరపల్లిలో ఐకెపి ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన : జిల్లా కలెక్టర్

నకిరేకల్ :అక్టోబర్ (పున్నమి ప్రతినిధి ) మంగళవారం కనగల్ మండలం దొరపల్లిలో ఐకెపి ద్వారా ఏర్పాటు చేసిన దాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఇలాత్రిపాఠి ప్రారంభించారు రైతులు నాణ్యతా ప్రమాణాలతో కూడిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి సహకరించాలని కలెక్టర్ కోరారు. రైతులు అకాల వర్షాల పట్ల జాగ్రత్తగా ఉండాలని, వర్షం సూచన ఉన్నందున ప్రతిరోజు ధాన్యంపై టార్పాలిన్ లు ఉంచాలని తెలిపారు. తగినంత తేమ శాతం వచ్చిన తర్వాతనే ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరుగుతుందని తెలిపారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.